582
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- సూర్యుని కాంతి సొంపగు పంటలు సుకాలక్షేమముల్ శోభిలు గేహమున్ ఆర్య సాంగత్యము నైశ్వర్యముల నిల ననుభవింపవె నీవా యాఢ్యుని పేర్మిని ||నుతి||
- దురితము లందె దుర్గతి నున్న నీ కురుతర ప్రేమను బరమార్థ మీయను వరపుత్రు నొసగడె వందనీయుడు ప్రభు మరిమరి మ్రొక్కు మా పరమోపకారిని ||నుతి||
- జీవము జ్ఞానము జీవము నొసంగెడు పావనాత్మను నీకై పంపిన దేవుడు కేవల దోష స్వ భావము మార్చడె సేవ జేయుమ నీవా పావనమూర్తికి ||నుతి||
- కరములు పదముల్ కనకాదు లన్నియు స్వరమును చిత్తము స్థిరమగు ప్రేమయు మరి నీదు హృదయము పరమాత్ము సేవకై పరిపూర్ణముగ నిచ్చి ప్రణుతించు మాయనన్ ||నుతి||
إرسال تعليق