సంతోషముతో నిచ్చెడు వారిని

575

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    సంతోషముతో నిచ్చెడు వారిని నెంతో దేవుడు ప్రేమించున్ వింతగ వలసిన దంతయు నొసంగును వినయ మనసుగల విశ్వాసులకును ||సంతోషముతో||

  1. అత్యాసక్తితో నధికప్రేమతో నంధకార జను లందఱకు సత్య సువార్తను జాటించుటకై సతతము దిరిగెడు సద్భుక్తులకు ||సంతోషముతో||

  2. వేదవాక్యమును వేరు వేరు గ్రా మాదుల నుండెడు బాలురకు సాధులు ప్రభుని సు బోధలు నేర్పెడి సజ్జన క్రైస్తవోపాధ్యాయులకు ||సంతోషముతో||

  3. దిక్కెవ్వరు లేకుండెడి దీనుల తక్కువ లన్నిటి దీర్చుటకై నిక్కపు రక్షణ నిద్ధరలో నలు ప్రక్కలలో బ్రక టించుట కొఱకై ||సంతోషముతో||

  4. ఇయ్యండీ మీ కీయం బడు నని యియ్యంగల ప్రభు యే సనెను ఇయ్యది మరువక మదిని నుంచుకొని యియ్యవలెను మన యీవుల నికను ||సంతోషముతో||

  5. భక్తిగలిగి ప్రభు పని కిచ్చుట బహు యుక్త మటంచు ను దారతతో శక్తికొలది మన భుక్తి నుండి యా సక్తితో నిరతము నియ్య వలెను ||సంతోషముతో||

Post a Comment

أحدث أقدم