పిల్ల నైన నన్ను జూడుమీ

538

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    పిల్ల నైన నన్ను జూడుమీ ప్రియ మైన యేసు పిల్ల నైన నన్ను జూడుమీ చల్లని రక్షకుడ వనుచు సత్య వార్త దెలుపుచుండ నుల్ల మందు నిన్ను నమ్మి కల్ల లేక వేడుకొందు ||బిల్ల నైన||

  1. నిన్ను నమ్మి యున్నవాడను ఘన దేవ తనయ నన్ను దాచు నీ నీడను తిన్నని హృదయంబు నాకు జెన్నుగా నొసంగి యిపుడు సన్నుతింప నిమ్ము నన్ను సాధు వైన నిన్ను దలచి ||పిల్ల నైన||

  2. ప్రేమచేత నొప్పుచుంటివి ప్రేమా స్వరూప ప్రేమలోన నడచు చుంటివి ప్రేమ లేని నన్ను బ్రోవ బ్రేమచేత బ్రాణ మిచ్చి ప్రేమ జూపు మనుచు నన్ను బ్రీతి చేత బోధింప ||బిల్ల నైన||

  3. పరమ జనకు చిత్త మెప్పుడు పరమేశ పుత్ర బిరబిరగను జేయగా నిమ్ము కరుణ మీర నాత్మచేత వరవరంబు లొసగి నాకు నరిలలోన నిన్ను గొలువ ధరణిమీద నన్ను నిలుప ||బిల్లనైన||

  4. బలము మీర నన్ను నిలుపుము తుల లేనివాడ బలము గల్గు నీదు చేతుల నిలను నీకు ఫలము లిచ్చి యెలమి నిన్ను గొప్ప జేయ సలలిత ముగ నడువ నిమ్ము చక్కని నీ మార్గమందు ||బిల్లనైన||

Post a Comment

أحدث أقدم