అందమైన క్రీస్తు కథ

రాగం - కాంభోజి తాళం - ఆది

    అందమైన క్రీస్తు కథ మీ రాలింపరయ్య ||అందమైన||

  1. పొందుగ శిష్యులతో యేసు పోవుచుండు మార్గమందు ముందుగ వీక్షించి రొక్క పు ట్టంధకుని అందుఁ గొందఱు శిష్యు లాత్మలో భావించి రెందు కీతఁడు చీక య్యెను దీని విధమేమో డెందములనుఁ గల్గు సందియములు వీడ విందమనుచు లోక వంద్యుని సంతతా నందుని మనుజ నందనుని నడిగిరప్పు ||డందమైన||

  2. చీకువాఁడై జన్మించుటకుఁ జేసెనా దుష్కృతము నితఁడు లేక వీని జననీ జనకు లేమి చేసిరో యీ కారణముఁ దెల్పు మోకర్త యిపుడీవు మాకంచు తను వేఁడ లోకేశ్వరుండు ని రాకారుఁ డితనియం దీకార్యములుఁ జూపఁ బ్రాకటముగఁ జేసెఁ గాక వేరొకవిధము లేకున్నదని తెల్పి చీకుఁ బ్రోవఁ దలంచె ||నందమైన||

  3. బురద వాని కన్నులందుఁ గరములతోఁ జమిరియొక్క చెఱవులో బ్రాక్షాళించుటకు సెలవిచ్చెఁ బ్రభువు బిరబిర నయ్యంధుఁ డరిగి యేసుని పల్కుఁ దిరముగ మదినమ్మి సరసిలో మునిఁగి సుం దరమైన నేత్రముల్ ధరియించి యానంద భరితుడై చనుదెంచు తఱివాని పొరుగింటి నరులబ్బురముగఁ జూ చిరి మార్మోమగువాని ||నందమైన||

  4. చూపులేని గ్రుడ్డివానిఁ జూడఁ గలుగఁజేయువాఁడే పాపాంధకార మగ్నుల నా ప్రభువే రక్షించు పైపైని మనకన్ను చూపు చూపది గాదు లోపలి కనుగుడ్డి యైపోయి యున్నది యాప త్పరంపర లోఁ బొరలుచున్నాము కాపాడుమని యేసు శ్రీ పాదములుఁ బట్టి చూపు లోపలి చూపుఁ జూచి యానందింత ||మందమైన||

    ✍ పురుషోత్తము చౌధరి


    Andhamaina Kreesthu Katha Mee – Raalimparayya || Andhamaina ||

  1. Pondhuga Sishyulathoa Yesu – Poavu Chundu Maarga Mandhu – Mundhuga Veekshinchi Rokka Puttandhakuni = Andhu Kondharu Sishyu–Laathmaloa Bhaavinchiri – Eandhu Keethadu Cheekayyenu Dheeni Vidhamemoa – Dendha Mulanu Kalugu Sandhiyamulu Veeda – Vindha Manuchu Loaka – Loaka Vyandhuni Santhathaa = Nandhuni Manuja – Nandhamani Nadigi Rappudu || Andhamaina ||

  2. Cheeku Vadai Janminchutaku Chesenaa Dhushkruthamu Nithadu – Leka Veeni Jananee Janaku – Lemi Chesiroa = Yee Kaaranamu Thelpu - Moa Kartha Yipu Deevu – Maakanchu Thanu Veda – Loakesvarundu Ni – Raakaaru Dithani Yam – Dhee Kaaryamulu Chuupa – Praakatamu Ga Chese – Gaaka Veroka Vidhamu = Lekunnadhani Thelpi – Cheeku Broava Dhalache || Andhamaina ||

  3. Buradha Vaani Kannulandhu–Garamulathoa Jamiri Yokka – Ceruvuloa Prakshaalinchutaku – Selavichche Prabhuvu = Bira Bira Nayyandhu - Darigi Yesuni Palku – Dhiramuga Madhi Nammi – Sarasiloa Munigi Sun-Dharamaina Nethramul – Dhariyinchi Aanandha – Bharithudai Chanu Dhenchu – Thari Vaani Poruginti = Naru Lubbaramuga Chuuchiri Maarmoamagu Vaani || Andhamaina ||

  4. Chuupu Leni Gruddivaani – Chuuda Kaluga Cheyu Vaade – Paapaandha Kaara Magnula Naa – Prabhuve Rakshinchu = Paipaini Mana Kannu – Chuupu Chuupadhi Kaadhu – Loapali Kanu Guddi – Yaipoayi Yunnadhi – Aapath Parampara – Loa Poralu Chunnaamu – Kaapaadu Mani Yesu – Sree Paadhamulu Patti = Chuupu Loapali Chuupu – Chuuchi Aandhintha || Andhamaina ||

    ✍ Purushotthamu Choudhary

Post a Comment

أحدث أقدم