573
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- శక్తికొలది కాన్కలర్పింతమ మన భుక్తినుండి కొంత దీయుదమ ||దాతృ||
- సంతోషముగ నియ్య సాగుదమ మన స్సంతటితో జేయ నేగు దమ ||దాతృ||
- గర్వఘనములు వీడి యర్పింతమ యుర్వి సర్వ మాయనందు నేర్పింతమ ||దాతృ||
- సంఘ సేవకు సొమ్ము సమకూర్తమ క్రీస్తు సంఘ యక్కఱ లన్ని తీర్చుదమ ||దాతృ||
- ప్రతియాదివార మిది మది నుంతమ దీని ప్రతి సంఘస్థుడు చేయ బోధింతమ ||దాతృ||
- విధి దలచి దుర్బలుల రక్షింతమ సంఘ విధవాళి దానముతో దర్శింతము ||దాతృ||
- దిక్కులేని జనుల దీవింతమ వారి యక్కఱలలో మేలు గావింతమ ||దాతృ||
- పుచ్చుకొనుటకంటె నిచ్చుదమ మఱల నిచ్చు తండ్రికి స్తుతుల నిచ్చెదమ ||దాతృ||
- వెదజల్లి యభివృద్ది పొందుదమ మోక్ష పదవు లను భవింప బరుగిడుదమ ||దాతృ||
- వర్ధిల్లిన కొలది చెల్లింతము లోక వ్యర్థ ఖర్చులనెల్ల మళ్లింతమ ||దాతృ||
إرسال تعليق