577
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- నిరుపమాన దేవ నిన్ను నిరత ప్రేమతో హరువుగా నుతింతు మేము హర్స రవముతో ||పరమ||
- అవని సంభ్రమములలోన నవఘళించము అవసరముగ నీదు పలుకు నవధరింతుము ||పరమ||
- వేయి నాళ్లు లోకమునను వెలయుకంటెను శ్రేయ మొక్కనాడు నిన్ను సేవ జేయుట ||పరమ||
- ఉచితమైన నీ గృహమున నచల భక్తితో రుచిరమైన నీదు ప్రేమ రుచినిజూతుము ||పరమ||
- మనసునందు సత్యబోధ మనస్కరించుచు మనెడు తరిని విడము నీదు ఉనికిపట్టును ||పరమ||
- గొరియ పిల్ల యొక్క ప్రేమ గూర్చి భక్తితో గొరత లేక చేతు మెపుడు గొనబు గానము ||పరమ||
- శాంతజలము నొద్ద మమ్ము శాంతి పరచుము సంతతమును నీవు మమ్ము సంతరించుము ||పరమ||
- దినము లన్ని మేము నిన్ను దీన మనసుతో వనరు మాని సంతసమున వినతి చేతుము ||పరమ||
إرسال تعليق