الصفحة الرئيسية 170 byOnline Lyrics List —نوفمبر 07, 2024 0 1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట యేసుక్రీస్తు ప్రభువా మేము నీ మోక్షముఁ బొందుటకు దోసపు లోకము లోనికి వచ్చితి దోషులఁ బ్రోచుటకు ||యేసు||పరిశుద్ధుఁడ వీవు ఇలలో పాపుల నందరిని పరిపరివిధ కృప వాక్కులతోడను పిలిచితి వెల్లప్పుడు ||యేసు||సత్యపు నడతలతో జగతిని సర్వాద్భుతములను నిత్యముఁ జేయుచు నీ కృప చాల యిలలోఁ దెల్పితివే ||యేసు||అతి పుణ్యాత్ముఁడవే క్షితిలో వెతలను బొందితివే మృతిని బొందియు మూఁడవ దినమున బ్రతికియు లేచితివే ||యేసు||పాపుల మని తెలిసి నీదగు దాపున జేరఁగనే పాపముఁ బాపుచు ప్రాపుగ నుండెడి ప్రభుఁడవు నీవెగదా ||యేసు||దురిత వితతి దూరా నమ్మిన దురితుల స్నేహితుఁడా నిరతము మమ్మును నీ కృప లోపల నిలకడగాఁ బెంచు ||యేసు||నోరు నిండ నెదలో నీ కృప ప్రేరేపణఁగలిగి సారెకు వేఁడెద ముర్వికి రక్షణ కారకుఁడా నిన్ను ||యేసు|| ✍ గొల్లపల్లి నతానియేలు Yesu Kriisthu Prabhuvaa – Memu Nii – Moakshamu Pondhutaku = Dhoasapu Loakamu – Loaniki Vachchithi – Dhoashula Brochutaku || Yesu || parisudhdhuda Viivu – Eilaloa – Paapula Nadharini = Pari Pari Vidha – Krupa – Vaakkula Thoadanu – Pilichithi Vellappudu || Yesu || Sathyapu Nadathalathoa – Jagathini – Sarvaadhbhutha Mulanu = Nithyamu Cheyuchu – Nii Krupa Chaala– Eilaloa Thelipithive || Yesu || Athi Punyaathmudave – Kshithi Loa Vethalanu Pondhi Thive = Mruthini Pondhiyu – Muudava Dhina Muna – Brathikiyu Lechithive || Yesu || Paapulamani Thelisi – Nii Dhagu Dhaapuna Cheragane = Paapamu Baapuchu Praapuga Nundedi – Prabhu Davu Naive Gadhaa || Yesu || Dhuritha Vithathi Dhuuraa – Nammina – Dhurithula Snehithudaa = Nirathamu Mammunu – Nii Krupa Loapala – Nilakadagaa Penchu || Yesu || Noaru Ninda Nedhaloa – Nii Krupa – Prerepana Kaligi = Saareku Vededhamu – Urviki Rakshana – Kaarakudaa Ninnu || Yesu || ✍ Gollapalli Nathaniyelu akk 1
إرسال تعليق