Song no: 489
మనసానందముఁ బొందుట కన్నను మరి యే భాగ్యము గల దన్న అనుమానము లిఁక సఖిల సుఖంబులు దిన మొక గడికొక తీరై యుండును ||మన||
దిటముగఁ ప్రార్థన యను ఖడ్గముఁ గని తిరుగు పిశాచము వెఱ చన్న పటుదీప్తులు గల ప్రభు శాస్త్రోక్తులు బహు సంశయ పం కము నింకించును ||మన||
సాధు జనోత్తమ క్రైస్తవ సంగతి సమకూడిన మేలౌ నన్న శోధన లన్నిటి స్థిరముగ నోర్చెడి శుభమతి కన్నను సుఖమే మున్నది ||మన||
తనువున దానను వానికి దురితము దగిలెడు విధిఁ గనవలె నన్న యొనర గ క్రీస్తుని వధ్యాస్తంభముఁ గని విశ్వాసముఁ గట్టిగఁ బెంచిన ||మన||
క్షమయును స్నేహము ప్రభుకడ నేర్చిన శత్రువు లిఁక భువి లేరన్న సమదృష్టి జగ జ్జనుల గనుంగొను సత్క్రైస్తవులకు సాధన మనఁ దగు ||మన||
పరమదయానిధి క్రీస్తుని బలమునఁ బాప భరంబులు విడు నన్న పరిశుద్ధాత్ముని బంధుత్వంబున అరమర చీఁకటు లన్నియుఁ దొలఁ గును ||మన||