ఇశ్రాయేలీయుల దేవుండే యెంతో



Song no: 123
తా – ఆది

ఇశ్రాయేలీయుల దేవుండే – యెంతో స్తుతి నొందును గాక = యాశ్రితువౌ తన జనులకు దర్శన – మాత్మ విమోచన కలిగించె ॥నిశ్రా॥
  1. తన దాసుఁడు దావీదు గృహంబున – ఘన రక్షణ శృంగము నిచ్చె = మన శత్రువు లగు ద్వేషులనుండియు – మనలన్ బాపి రక్షణ నిచ్చె ॥నిశ్రా॥
  2. దీనిని గూర్చి ప్రవక్తల నోట – దేవుఁడు పలికించెను దొల్లి = మానవ మన పితరులఁ గరుణింపఁగ – మహిలోన నిబంధనఁ జేసె ॥నిశ్రా॥
  3. జనకుం దగు నబ్రాహాముతోఁ – జేసిన యా ప్రమాణముఁ దలఁచి = మనము విరోధులనుండి విమోచన – గని నిర్భయులమై మెలఁగ ॥నిశ్రా॥
  4. ఆయన సన్నిధానమునందు – నతి శుద్ధిగ నీతిగ నుండఁ = పాయక తన సేవను నిత్యంబును – జేయఁగ నీ రక్షణ నిచ్చె ॥నిశ్రా॥
  5. ధర నో శిశువా దేవుని దీర్ఘ – దర్శి వనెడు పేరొందెదవు = పరమేశ్వరుని వాత్సల్యతతోఁ = పాపవిముక్తిఁ బ్రజ లొంద ॥నిశ్రా॥
  6. మానుగ రక్షణ జ్ఞాన మొసంగఁగ – మార్గము సిద్ధపరచుటకై – దీన మనస్సుతోఁ బ్రభునకు ముందు – గా నడిచెదవు భయభక్తి ॥నిశ్రా॥
  7. మరియును సమాధాన సరణిలో – మన మిఁక నడువఁ జీఁకటిలో = మరణచ్ఛాయలో నుండిన వారికి – నరుణోదయ దర్శన మిచ్చె ॥నిశ్రా॥
  8. జనక పుత్రాత్మ దేవుని కిలలో – ఘనత మహిమ కల్గును గాక = మును పిపు డెప్పుడు తనరి నట్లు యుగ – ములకును దనరారునుగా కామేన్  ॥నిశ్రా॥
أحدث أقدم