Song no: 168
- సాత్వీకుడా దీనులను కరుణించే నా యేసయ్య } 2
- ఈర్షా ద్వేషాలతో పాడైన పుడమిపై
నిలువనీడకరువై శిలువపై ఒంటరయ్యావు } 2
అల్పకాల శ్రమలకే అలసిన నా హృదయములో
సహనము కలిగించి నడుపుము నను తుదివరకు } 2 || సాత్వీకుడా ||
- కలతల కెరటాలలో నా తోడుగా నిలిచావు
ఉప్పొంగిన సంద్రమే నిమ్మలమై మౌనమూనింది } 2
గుండెలో నిండిన స్తుతినొందే పూజ్యుడా
మమకారపు గుడిలో నిన్నే కొలిచెదనయ్యా } 2 || సాత్వీకుడా ||
సమ్మతి కలిగిన మనస్సుతో నిమ్మళముగా నేను బ్రతుకుటకు } 2
సమృద్ది అయిన కృపతో నింపుము
నిత్యము నీ సన్నిధిలో నన్ను నిలుపుము } 2 || సాత్వీకుడా ||
إرسال تعليق