Song no: 173
- దయగల హృదయుడవు
- సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవమార్గము
సారము వెదజల్లు నీ జాడలె నాకు జీవన గమనము 2
శ్రేష్టమైన ఉపదేశముతో జీవముగలిగిన సంఘములో
నింపుచున్నావు దీవెనలతో నను నడుపుచున్నావు సమృద్దితో 2
- పరిశుద్దుడా నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము
పరిశుద్దుల సహవాసమై నాకు క్షేమధారాము 2
విశ్వాసమందు నిలకడగా నీ రాకడ వరకు మెలకువగా
విసుగక నిత్యము ప్రార్ధింతును నిను నిశ్చలమైన నిరీక్షణతో 2
- పరిపూర్ణుడా నీ దివ్య చిత్తమే నాకు జీవాహారము
పరవాసిగా జీవించుటే నాకు నిత్య సంతోషము 2
ఆశ్రయమైనది నీ నామమే సజీవమైనది నీ త్యాగమే
ఆరాధింతును నా యేసయ్యా నిను నిత్యము కీర్తించి ఘనపరతును
నీ స్వస్త్యమును ఎన్నడు ఎడబాయవు
ఎడారిలో ఊటలను
జలరాసులలో త్రోవను ఏర్పరచువాడవు
సర్వలోకము నీకు నమస్కరించి
నిన్ను కొనియాడును "దయగల"
إرسال تعليق