الصفحة الرئيسيةఆనంద కీర్తనలు 📖 నా గీతారాధనలో యేసయ్యా byOnline Lyrics List —سبتمبر 26, 2024 0 H125 ఆనంద కీర్తనలు న నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే నా ఆవేదనలలో జనించెనే నీ కృపాదారణ – (2) || నా గీతా || నీ కృప నాలో వ్యర్ధము కాలేదు – నీ కృపా వాక్యమే చేదైన వేరు ఏదైన నాలో – మొలవనివ్వలేదులే (2) నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటు కట్టెనే (2) || నా గీతా || చేనిలోని పైరు చేతికి రాకున్నా – ఫలములన్ని రాలిపోయినా సిరి సంపదలన్ని దూరమై పోయినా – నేను చలించనులే (2) నిశ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్నే ఆరాధింతునే (2) || నా గీతా || ఆత్మాభిషేకం నీ ప్రేమ నాలో – నిండుగా కుమ్మరించెనే ఆత్మ ఫలములెన్నో మెండుగ నాలో – ఫలింపజేసెనే (2) ఆత్మతో సత్యముతో ఆరాధించుచు నే వేచియుందునే నీ రాకడకై (2) || నా గీతా || Naa Geethaaraadhanalo Yesayyaa Nee Krupa Aadhaarame Naa Aavedanalalo Janinchene Nee Krupaadarana – (2) || Naa Geethaa || Nee Krupa Naalo Vyardhamu Kaaledu – Nee Krupaa Vaakyame Chedaina Veru Edaina Naalo – Molavanivvaledule (2) Nee Krupa Naalo Athyunnathamai Neetho Nannu Antu Kattene (2) || Naa Geethaa || Cheniloni Pairu Chethiki Raakunnaa – Phalamulanni Raalipoyinaa Siri Sampadalanni Dooramai Poyinaa – Nenu Chalinchanule (2) Nischalamaina Raajyamu Korake Ellavelalaa Ninne Aaraadhinthune (2) || Naa Geethaa || Aathmaabhishekam Nee Prema Naalo – Nindugaa Kummarinchene Aathma Phlamulenno Menduga Naalo – Phalimpajesene (2) Aathmatho Sathyamutho Aaraadhinchuchu Ne Vechiyundune Nee Raakadakai (2) || Naa Geethaa ||
إرسال تعليق