దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా
Dm F C G G7 C
అనుక్షణంబు యేసునే నా - మదిలో కోరుతా(2)
Am F G C
ఎల్లప్పుడు యేసువైపు కన్నులెత్తి పాడుతా(2)
Am F G G7 C
పరమ తండ్రి నీదు మాట - బలముతోడ సాగుతా(2)
Am F G C
మారిపోయే లోకమందు మనుజులెంతో మారినా(2)
Am F C G G7 C
మారునా ప్రభు యేసు ప్రేమ ఆశతోడ జేరనా(2)
|| దినదినంబు ||
ఎన్నడు ఎడబాయడు - నన్ను విడువడు ఏ మాత్రము(2)
ప్రభువే నాకు అభయము - భయ - పడను నేనేమాత్రము(2)
|| దినదినంబు ||
దైవ వాక్యం - జీవవాక్యం - అనుదినంబు చదువుతా(2)
ప్రభువు మాట - నాదుబాట - విభునితో - మాట్లాడుతా(2)
||దినదినంబు||
పరిశుద్ధముగ అనుకూలముగా - జీవయాగమై నిలిచెదా(2)
సిలువ మోసి - సేవ చేయ - యేసుతోనే - కదులుతా(2)
|| దినదినంబు ||
إرسال تعليق