بلا عنوان

` - XMLsong Andhra Kraistava Keertanalu October 26 2017 1 అన్ని కాలం 10/19/2017 20:16 1 2 గానముఁ జేయ 10/19/2017 20:16 3 యేసు నాయకు 10/19/2017 20:16 యేసు నాయకుఁడ యెల్ల వేళలను నీ దాసుల నేలుమయ్యా మోసములన్నిటి మునగఁద్రోతునని బాసలు జేసిన ప్రభుఁడవు నీవెగా ||యేసు||

  • రేయింబవలు మా న్యాయము చెరిపెడి మాయ పిశచిని త్రోయుమి దూరము బాయక భక్తుల చేయి విడువని బహుశ్రేష్టుఁడ నీవెగా ||యేసు||

  • హృదయము లోకము మది పాపము మమ్ము సతతము శ్రమ పెట్టును సదయుఁడ మమ్మును వదలక నిత్యము మది తలపులలో మహిమగనేలుమీ ||యేసు|

  • కాపాడుమి మమ్ము మాపు రేపు నీ శ్రీ పాదము లొద్దను ఏ పాపములును ఏలకుండగ నీ ప్రాపునఁబెంచుము మాపాలకుఁడవో ||యేసు||

  • మా కొరకై నీ మేనును మ్రానున మేకులతోఁగొట్టగ మానము మహిమలు మనుజుల కియ్యను భానుఁడ రాజుగ బ్రతికిలేచితివి ||యేసు||

  • చెఱను చెఱనుగా మరి పట్టుక నీవు పరమున కరిగితివే వరముల నిడితివి ధరలో నరులకు పరముఁడ నీ దయ మరువశక్యమా ||యేసు||
  • 4 దేవా దివ్య 10/19/2017 20:16 4 5 నీతిగల యెహ 10/19/2017 20:16 5 6 భీకరుండౌ మ 10/19/2017 20:16 || 6 భీకరుండౌ మా యెహోవా పీఠ మెదుటం గూడరే యేకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని గొనియాడరే ||భీకరుండౌ||

  • మట్టితోనే మమ్ము నెల్ల మానవులుగ సృజించెను ఇట్టి శక్తుండౌ ప్రభు న్మే మెచ్చుగా మది నెంతుము ||భీకరుండౌ||

  • ఏరితోడు లేక మము సర్వేశ్వరుఁడు సృష్టించెను ధారుణిం దా నొక్కఁడే మా దైవమని పూజింతుము ||భీకరుండౌ||

  • పుట్టగిట్టంజేయఁదానై నట్టి దేవుని శక్తిని బట్టుగా లోకస్థులారా ప్రస్తుతింపరె భక్తిని ||భీకరుండౌ||

  • మేటి సంగీతంబులుపై మింట నారవ మొందను జాటరే వేవేల నోళ్ళన్ సన్నుతుల్ ప్రభు వందను ||భీకరుండౌ||

  • మిక్కిలి కష్టంబులతో మిత్తికిని బాల్పొందను దిక్కులేని గొఱ్ఱె లట్లుఁ దిరుగఁజేర్పన్ మందను ||భీకరుండౌ||
  • -- 7 సన్నుతింతు 10/19/2017 20:16 7 8 సర్వ శక్తు 10/19/2017 20:16 8 9 ప్రబలముగనే 10/19/2017 20:16 9 ||నా||

  • తల్లిగర్భంబున దసర సృజించితివి ధరణి నన్ను నీవు తల్లికన్నను మిగుల దయచేతఁ జూచితివి తండ్రి నన్ను ||నా||

  • పాప కూపమునందుఁ బడియుండఁగా నన్నుఁ బారఁజూచి చేయి చాపి యేసునిద్వార చక్కఁగాఁదెచ్చితివి చాలు దేవా ||నా||

  • సుఖఃదుఖ కాలములు శోధింపఁ బంపుదువు శోభాయుక్త నాకు సుఖముఁ గల్గజేయు సొంపుగ వానిచే స్థూల శక్తి ||నా||

  • సకల కాలంబులఁ జక్కఁగ లోఁబడి నన్నుతింతు నన్ను ఆకలంకునిగాఁ జేయు మనుచు వేఁడుచునుందు నధికాసక్తి ||నా||
  • 14 నాకేమి కొద 10/19/2017 20:16 14 నాకేమి కొదువ నాధుఁడుండ నిఁక శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ట పాలకుఁడు నా యేక రక్షకుఁడు గనుక ||నాకేమి||

  • తనివి దీర మేళ్లనుభవింప నేను నను సదా మేళ్లనెడి పచ్చిక నదిమి మృదువుగఁ బండు కొనఁజేయును గనుక ||నాకేమి||

  • ఎంత శోధన యెండ యున్న నాకు నెంతకు నోరిగర దెపుదు శాంత జలములు నా చెంతనే యుండు గనుక ||నాకేమి||

  • తప్పిపోయిన నన్ దారిం బెట్టి నన్ను తెప్పరిల్లఁజేసి నాకుఁ దీరు నలసటను నా తప్పు మన్నించున్ కనుక ||నాకేమి||

  • నీతి మార్గమునన్ నిల్పున్ నన్ను ప్రభువు నీతి లేని నాకుఁ దనను నీతి దయ చేయున్ స్వ నీతిని ద్రుంచున్ గనుక ||నాకేమి||

  • చావు చీఁకట్ల శక్తియుండు ఆహా లోయలోఁబడి పోవలసినను నే వెరవకుందు నా దేవుండే తోడు గనుక ||నాకేమి||

  • మీఁదఁబడునట్టి శోధనలన్ ధరను నా దరికి రానీక దండము నన్ను బ్రోచుచును నా కాదరణ యౌను గనుక ||నాకేమి||

  • పగవారల్ సిగ్గు పడునట్లుగ నా జగము యెరుఁగని సౌఖ్యభో జన మగపరుచును హా తగినదే పెట్టున్ గనుక ||నాకేమి||

  • తన యాత్మానంద తైలంబుతో ప్రభువు ననుదినము తలయంటి విసుగ కొనక తుడుచును నా కన్నీళ్లన్ని గనుక ||నాకేమి||

  • పలువిధములైన భాగ్యములతో తండ్రి వెలుపలికి దిగవెడలునట్టి వెల గల గిన్నె నా కలిమిగాఁ జేయున్ గనుక ||నాకేమి||

  • బ్రదుకంతటన్ గృ పాక్షేమములు నా వదలకుండగ వచ్చు నాతో సుదినములు గల్గ నా పదలు సంపదలౌ గనుక ||నాకేమి||

  • దురితంబు లుండు ధరణి నాకు నిజము నిరవు కాఁదిక నెప్పటికి నా పరమ దేవుని మందిరమె నా యిల్లు గనుక ||నాకేమి||
  • 15 యెహోవా నా 10/19/2017 20:16 15 యెహోవా నా కాపరి లే మేమి గలుగదు తన మహా కృపతోఁ బ్రోచి నన్ను మనుపు నాతఁడే||

  • పచ్చికగల చోట్ల నను పరుండజేయుచుఁ గడు హెచ్చగు సౌఖ్యములు సదా యిచ్చు నాతఁడే||

  • శాంతికర జలములకు నను సాగజేయుచు విశ్రాంతి ప్రాణమున కొసంగు విభుఁడు అతఁడే||

  • గాఢాంధకారమైన లోయల గుండ బోయిన నే కీడుకు భయపడ నిఁక నా తోడు ఆయనే||

  • దుడ్డుకఱ్ఱతో శత్రువులఁ దరుమఁగొట్టుచుఁ దన దొడ్డ దండముతో నీతి దారిలో నడుపు||

  • అందరిలో నన్ను నెంచి యధిక ప్రేమతోఁ గడు విందు లొసఁగి తృప్తిపరుచు విభుఁడు ఆయనే||

  • ముఖము కళగా నుండునట్లు మంచితైలమున్ నా సఖుఁడు నాకుఁ బూయుచుండు సకల వేళలన్||

  • బ్రదుకు దినము లన్నిట నాకు బంటులవలెనే నను వెదకి కృపా క్షేమములు నా వెంటవచ్చును||
  • 16 యెహోవా నా 10/19/2017 20:16 16 యెహోవా నా మొఱ లాలించెను దన మహా దయను నను గణించెను అహర్నిశల దీనహీనుఁడగు నాదు హాయనెడు ధ్వని గ్రహించి మనిపెను ||యెహోవా||

  • పిశాచి గడిమిఁబడఁగొట్టెను దన వశాన నను నిలువఁ బెట్టెను ప్రశాంత మధుర సు విశేష వాక్ఫల నిశాంతమునఁజేర్చి సేదఁదీర్చెను ||యెహోవా||

  • మదావళముఁ బోలు నామదిన్ దన ప్రదీప్త వాక్యాం కూశా హతిన్ యధేచ్చలన్నిటి గుదించి పాపపు మొదల్ తుదల్ నరికి దరికిఁ జేర్చెను ||యెహోవా||

  • అనీతి వస్త్ర మెడలించెను యేసునాధు రక్తమున ముంచెను వినూత్న యత్నమె ద నూని యెన్నఁడు గనన్ వినన్ బ్రేమ నాకుఁ జూపెను ||యెహోవా||

  • విలాపములకుఁ జెవి నిచ్చెను శ్రమ కలాపములకు సెలవిచ్చెను శిలానగము పైకిలాగి నను సుఖ కళావళుల్ మనసులోన నిలిపెను ||యెహోవా||

  • అగణ్య పాపియని త్రోయక నన్ను గూర్చి తన సుతుని దాఁ చక తెగించి మృతి కొప్పగించి పాపపు నెగుల్ దిగుల్ సొగసుగా నణంచెను ||యెహోవా||
  • 17 యెహోవా భజన 10/19/2017 20:16 17 యెహోవా భజన చేయండి పాప నరులారా యీ రీతి మరచి పోకండి ||యెహోవా||

  • యేసు పేరిట ప్రార్ధనంబు మన దోసములను బోగొట్టను వెరవు భాసుర పరలోక సుఖము కోటి బాధలు మనకున్న సంతోషకరము ||యెహోవా||

  • యేసు క్రీస్తును గొలువండి యేసు దాసులతో వాదము లాడకండి మోసపు దారి విడువండి దోష రాసుల నుర్విలోఁ జేసికొనకండి ||యెహోవా||

  • జీవ రక్షకుని నమ్మండి నిత్య సేవలో మెలఁగక చెడిపోకండి భావించి యాత్మన్ వేఁడండి దేవ దేవుని నెడఁబాసి తెరవు విడకండి ||యెహోవా||

  • మాయ లోకపు భ్రాంతుల్విడిచి మనుష్యాయువు భువిలోన జెల్లుటఁ దలఁచి మాయ మార్గము లెల్ల మరచి మోక్ష మార్గము మన మున మరవక తలఁచి ||యెహోవా||

  • కాయము నొసఁగిన ప్రభుని యయిదు గాయంబు లాత్మలోఁ గానంగ రాదా ఆయు వస్థిర మని తెలిసి మీరు కాయ మాత్మయు నిపుడు కర్తకు నిచ్చి ||యెహోవా||
  • 18 కూడికొని య 10/19/2017 20:16 18 కూడికొని యున్నాము సంఘ ప్రభో కూడికొని యున్నాము తోడ నుండెద ననుచు నమ్ముచు దొడ్డ దగు నీ పాద సన్నిధి ||కూడికొని||

  • ఎచట నా ప్రియ భక్తులెలమిఁ గూడియున్న నచటికి నేతెంతునని పల్కితి విచట నుండు మమ్ము వీక్షించి కృపచేత నిపుడు దీవించు మీ యేసు క్రీస్తునాధా ||కూడికొని||

  • గత కాలమందున గాని చేఁతలచే దుర్గతి నొంది యుండఁగాఁ గనుఁగొంటివి శత సంఖ్య గల పాపచయ మీవు క్షమియించి యతి శాంతి నిడితివి యాత్మస్వరూపా ||కూడికొని||

  • నిరతము నీ ప్రేమ నెనరున ధ్యానించి పరమ ధర్మములందుఁ బరతఁ గల్గి యరులకు శుభములు నిరతంబుఁ జేయఁగఁ దిరత మా కొసఁగుము దేవుని ప్రియ తనయా ||కూడికొని||

  • అన్ని శోధనముల నన్ని విపత్తుల నన్ని కాలములందు నాదరించి నిన్ను నమ్మిన జనుల నీ సందిటను జేర్చి పన్నుగఁ గాపాడు ప్రభు యేసు క్రీస్తు ||కూడికొని||

  • అమలుఁడ నగు నన్ననుకరించుండనుచు నాన తిచ్చినాఁడ వాత్మజులకు నమల మార్గము నందు నరుగంగ మాకీవు విమలాత్మ దయసేయు వేగంబు మా తండ్రీ ||కూడికొని||
  • 19 చూడ గోరెద 10/19/2017 20:16 19 చూడ గోరెద దేవ మందిరావరణములను చూడ గోరెద చూడ నాకు నాశ గలదు సుందరావరణములవి చూడ నాదు ప్రాణమెంతో సొమ్మసిల్లుచున్నదహా ||చూడ||

  • నీదు నివాసములు జూడ నెంతో రమ్యమై తనర నాదు హృదయమునకు నానంద మిచ్చు నిపుడు నెపుడు ||చూడ||

  • జీవము గల ప్రభుని జూడ జీవి నాలో కేక వేసె కోవెలలకు దొఱికె గూటి తావు నీ మందిరమున ||చూడ||

  • పిచ్చుకలకు దొఱికె స్థలము ముచ్చట బలిపీఠ మెదుట పెట్టు కుతూహలముతోను పిల్లల నవి మందిరమున ||చూడ||

  • నీదు మందిరంబులోన నిత్యవాసులైనవారు నిక్కముగను ధన్యులగుచు నిన్ను నన్నుతింతు రహా ||చూడ||

  • ప్రభుని వలన బలము నొందు ప్రజలు ధన్యులగుదు రిల ప్రాణ ప్రియము యాత్ర సేయు ప్రజల మార్గ మమర ధరను ||చూడ||

  • నీదు యావరణములలో నేను నొక్క దినము గడుప నెంతో విలువ గల నాకు వేయినాళ్ల బ్రతుకు కన్న ||చూడ||

  • కానరండు మనము నిపుడె మనము లలర ప్రభుని జూడ మందిరమున కేగి నిండు మనశ్శాంతి బొంది బ్రతుక ||చూడ||
  • 20 పరిశుద్ధ ప 10/19/2017 20:16 20 పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూత లైన నిన్ వర్ణింపఁ గలరా ||పరిశుద్ధ||

  • పరిశుద్ధ జనకుఁడ పరమాత్మరూపుఁడ నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావా ||పరిశుద్ధ||

  • పరిశుద్ధ తనయుఁడ నరరూపధారుఁడ నరులను రక్షించు కరుణా సముద్రా ||పరిశుద్ధ||

  • పరిశుద్ధ మగు నాత్మ వరము లిడు నాత్మ పరమానందప్రేమ భక్తుల కిడుమా ||పరిశుద్ధ||

  • జనక కుమారాత్మలను నేక దేవా ఘనమహిమ చెల్లును దనర నిత్యముగాఁ ||పరిశుద్ధ||
  • 21 త్రిత్వమై 10/19/2017 20:16 21 త్రిత్వమై నిత్యత్వమున నేకత్వమగు దేవా నీ సత్యసామర్థ్యత్వముల నిజ తత్వము గణించి నిను నిత్యము స్తుతించెదను ||త్రిత్వమై||

  • ఎల్లలోకంబుల సృజించిన చల్లని తండ్రి నా యుల్లమున నీ గొప్ప వింత లెల్ల సంతసిల్ల శోభిల్లఁ దలంచెదను ||త్రిత్వమై||

  • వాసి కెక్కిన పరమరాజ్యని వాసమును విడిన శ్రీ యేసునాధుండను కుమారా దోషుల దోసంబులెల్లఁ గాచి రక్షించినావు ||త్రిత్వమై||

  • ఆదరణకారుండ వగు శుద్ధాత్ముడా దేవా యామోద నామము నంపఁబడి యేసు నాధుని సుబోధ లెల్ల బోధపరచి పాదుకొల్పు ||త్రిత్వమై||

  • ఓపితా సుతా శుద్ధాత్మ ఒక్క దేవుఁడవు ఎల్ల పాపులను రక్షింప మిగుల నోపికతో నాపదలు బాపి కృపఁ జూపినావు ||త్రిత్వమై||
  • 22 వ్యోమ సింహ 10/19/2017 20:16 22 వ్యోమ సింహాసనస్థుఁడ యుర్వి పాదపీఠస్థుఁడ మామకీన దయా మయుఁడ మమ్ముఁగావుమో దేవుఁడ ||వ్యోమ||

  • అంతరిక్ష లోకదీప యద్భుతాదృశ్య స్వరూపా యింత నీ మహిమనోప నెంతది నా నాల్క చూప ||వ్యోమ||

  • గాలి ఱెక్కల పైనెక్కి గాఢాంధకారమునందు నేలికవై సంచరించు నట్టి నిన్ను మ్రొక్కుచుందు ||వ్యోమ||

  • నీతి న్యాయ దీర్ఘశాంతా నిర్మల దయా నితాంతా ప్రీతినుంచవే శ్రీమంతా పెద్దఁగా నా కాలమంతా ||వ్యోమ||

  • సర్వ భూలోక పూజితా సత్య సద్గుణ రాజితా గర్వ దుస్స్వభా వాహితా కావునాన్ని నాట పితా ||వ్యోమ||

  • నమ్మిన యీనన్నఁ తూల నాడవు దీనాత్మపాలా క్రమ్మి నీ ప్రేమతోఁ జాల బ్రోతువు దయాలా వాలా ||వ్యోమ||
  • 23 ఎటుల నీకు 10/19/2017 20:16 23 ఎటుల నీకు స్తుతు లొనర్తుము యెహోవ తనయ యెటుల నీకుఁ నుతు లొనర్తుము పటుతర పాపంబులనెడి పంకమందుఁజిక్కి మదిని దిటముఁ జెడిన మమ్ముఁ బ్రోచి దిక్కుఁజూపినట్టి యేసూ ||యెటుల||

  • పాపకూపమందు నుండగాఁ బాపావిమోచ దాపుఁజేర్చి కాపుఁ జూపితి శాపగ్రస్తులైన మా శాపము విముక్తిఁజేయ నీ పవిత్ర రక్తమే నా ప్రాపుగా నొసంగితివి ||యెటుల||

  • భార భరితమైన యాత్మల భారమున దీసి భూరి సౌఖ్యములతో నింపను భారకుండ ఘోరమైన శ్రమలనొంది మరణమొంది తిరిగిలేచి నీవు ధాత్రి మహిమ నొందినట్టి దేవా ||యెటుల||

  • నీతిహీనులమై యుండఁగా నో కర్త మాదు బీతులన్నిఁబాపి నీ కృపన్ నీతి రక్షణవస్త్రములను భాతిగ ధరింపజేసి భూతలంబునందు నిన్ను ఖ్యాతిగ సేవింపఁజేసితి ||యెటుల||

  • నిన్నుఁజేరి నిర్చలుండనై యీ భూమియందు నిన్నుఁ బోలి నడుచుకొనుటకై తిన్నని మార్గమును జూపి అన్ని కీడులను జయింపఁ బన్నుఁగ విమలాత్మశక్తి నున్నతముఁగ నిడిన యేసూ ||యెటుల||

  • పరమ రాజ్యమందు నిరతము నీతోడనుండఁ కరుణతోడ నెంచుకొంటివి తిరిగి వచ్చి మమ్మును మీ చిరప్రకాశ పురమునందుఁ త్వరగఁ జేర్చియందు సుఖము దిరముగా నొసంగుదేవ ||యెటుల||
  • 24 భూమండలము ద 10/19/2017 20:16 24 భూమండలము దాని సంపూర్ణత యును లోకమును భూమండల వాసులను బొల్పార యెహోవావే ||భూ||

  • యెహోవ సంద్రము మీఁద భుమి పునాది వేసె మహాజలమూల మీఁద మనదేవుఁడది స్థిరపర్చె ||భూ||

  • యెహోవ పర్వతమునకు నెక్కంగఁ బాత్రుడెవఁడు మహాలయంబునందు మరి నిల్వ యోగ్యుం డెవఁడు ||భూ||

  • అపవిత్ర మనసులేక కపట ప్రమాణము లేక సుపవిత్రమౌ చేతులను శుద్ధాత్మ గల్గినవాఁడే ||భూ||

  • ఆలాటి వాఁడు ప్రభుని యాశీర్వచనము నొందు భులోకమున రక్షణ దేవుని నీతి మత్వముపొందు ||భూ||

  • ప్రభునాశ్ర యించు నట్టి వారు యాకోబు దేవ ప్రభుసన్నిధానము వెదకు ప్రజలెల్ల రట్టివారే ||భూ||

  • ద్వారంబు లార యింక మీ తల లెల్లబైకెత్త వలెన్ రారాజు కొరకుఁతలుపులాలా మిమ్మెత్తుకొనుఁడి ||భూ||

  • ఇలలో మహా మహిమంబు గలిగిన యీ రాజెవఁడు బలశౌర్యముల యెహోవ బహుశూరుడౌ యెహోవ ||భూ||
  • 25 పరలోకమున న 10/19/2017 20:16 25 పరలోకమున నుండు దేవ నీ పదముల కొనరింతు సేవ దురితంబులకు నేను వెఱచి యున్నానని కరుణించి నీ సుతుని ధర కంపితివి గాదా అరయఁగా నీ ప్రేమ యింతనఁ దరము గాదో పరమ జనక మరణ పర్యంతంబు నిను నే మరువఁ జాలను వరకృపా నిధి ||పరలోక||

  • యేసుక్రీస్తుని దయసేయ కున్న మోస మొందెద నెందుకన్న దోసంబులకు నేను దాసుండనై ప్రతి వాసరంబును నీదు భాసు రాజ్ఞలు విడిచి వేసటలు గల నరకమునఁ బడ ద్రోసిన నది న్యాయమౌ గద నా సునాధా పేర్మిచేతను నీ సుతుని నంపించినావు ||పరలోక||

  • ఎన్నరాని మహిమ నుండి యేసు నన్నుఁ బాలింప నేతెంచి యెన్న శక్యము గాక యున్న పాపములన్ని ఛిన్నాభిన్నము జేసి నన్ను సమ్మతిపరప నన్న యగు నా రక్షకుండు తన్ను తానర్పించి వెండియు నున్నతుండై లేచి యిప్పుడు సన్నిధానం బొసఁగె నాకుఁ ||బరలోక||
  • 26 రండి యుత్స 10/19/2017 20:16 26 రండి యుత్సహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే||

  • రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధి కేగుదము సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోష గానము చేయుదము ||రండి||

  • మన ప్రభువే మహాదేవుండు ఘన మాహాత్మ్యముగల రాజు భూమ్య గాధపులోయలును భూధర శిఖరము లాయనవే ||రండి||

  • సముద్రము సృష్టించె నాయనదే సత్యుని హస్తమే భువిఁజేసెన్ ఆయన దైవము పాలితుల మాయన మేపెడి గొఱ్ఱెలము ||రండి||

  • ఆ ప్రభు సన్నిధి మోఁకరించి ఆయన ముందర మ్రొక్కుదము ఆయన మాటలు గైకొనిన నయ్యవి మనకెంతో మేలగును ||రండి||

  • తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుఁగాక ఆదిని నిప్పుడు నెల్లప్పుడు నయినట్లు యుగముల నౌను ఆమేన్ ||రండి||
  • 27 కలుగునుగాక 10/19/2017 20:16 27 కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక కలుగు నున్నతమైన ఘన స్థలములందున నిలకు సమాధానం నరుల కాయన దయ ||కలుగును||

  • ప్రభువైన దేవా పరమరాజా సర్వపరిపాలా పరిపూర్ణ శక్తిగల పరమ జనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము ||కలుగును||

  • మహిమపర్చుచు ఆరాధించు చున్నాము నిన్ను మహిమాతిశయమును మదిఁ దలంచియు నీకు మహిని మా స్తుతి కృతజ్ఞత నిచ్చుచున్నాము ||కలుగును||

  • ఏక కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గొఱ్ఱె పిల్ల మమ్మును కనికరించుము చల్లఁగ ||కలుగును||

  • లోకపాపములు మోయుచుఁ బోవు యేసు రక్షకా వాసిగ జనకుని కుడివైపునఁ గూర్చుండి యేసూ మా ప్రార్థన నాలించి కనికరించు ||కలుగును||

  • పరిశుద్ధుఁడవు ప్రభుఁడవు నీవో ప్రభువైన క్రీస్తూ పరిశుద్ధాత్మతోఁ తండ్రి యైన దేవునియందుఁబరిపూర్ణ మహిమతోఁ బ్రబలుచున్నామవామేన్ ||కలుగును||
  • 28 మహిమ సర్వో 10/19/2017 20:16 28 మహిమ సర్వోన్నతమైన దైవమునకి మ్మహి సమాధానానుగ్రహము గల్గున్ర్పభో ||మహిమ||

  • నిన్ను స్తోత్రించుచు నిన్ను బూజించుచు నిన్ను మహిమపర్చుచున్నాము లోక ప్రభో ||మహిమ||

  • ప్రభువైన దేవుండా పరమండలపు రాజా ప్రబలంబు గల తండ్రి పరిశుద్ధంబగు ప్రభో ||మహిమ||

  • వినయంబుతో నీదు ఘన మహిమార్థంబై వందనములర్పించి వినుతింతుము సత్ర్వభో ||మహిమ||

  • జనితైక పుత్రుడగు ఘన క్రీస్తేసు ప్రభు దేవుని గొర్రెపిల్ల జనకుని కుమారుడ ప్రభో ||మహిమ||

  • ధర పాపములమోయు వరపుణ్య శీలుండా కరుణించి మా బీద మొరలాలించుము ప్రభో ||మహిమ||

  • తండ్రియైన దేవుని దక్షిణ్ భాగమున గూర్చుండి యున్నావు కృపజూపుమి సత్ర్పభో ||మహిమ||

  • పరిశుద్ధుడవు నీవే పరమ ప్రభుడవు నీవే దురితాత్ములను గాన మరణంబైతివి ప్రభో ||మహిమ||

  • పరమ జనకుని మహిమన్ పరిశుద్దాత్మైక్యంబై సరణి మాకై యున్న సర్వోన్నత ప్రభో ||మహిమ||
  • 29 పాహిలోక ప్ 10/19/2017 20:16 29 పాహిలోక ప్రభో పాహి లోక ప్రభో పాహి యని వేఁడు మాం పాహిలోక ప్రభో||

  • నిన్ను స్తుతియించుచు నీవు ప్రభుఁడ వని చెన్నుమీరఁగ నమ్మియున్నాము సత్ర్పభో||

  • నిత్య మా తండ్రి భూలోకం బంతయు నిన్ను భక్తితో నారాధించుచున్నది మా ప్రభో||

  • దేవ లోకాధిపతులు దూతల సమూహము దేవాయని కొల్చుచున్నారు నిన్నుఁ బ్రభో||

  • పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా పరలోక సేనాధిపతివైన మా ప్రభో||

  • ఇహలోకం బంతయుఁ బరలోకం బంతయు నీ మహి మహాత్మ్యముతో నున్నవని ప్రభో||

  • కెరూబులను దూతలు సెరూపులను దూతలు తిరముగా నిన్ గొనియాడుచున్నారు మా ప్రభో||

  • నీ దపొస్తలుల మహిమగల సంఘము ప్రోదిగా నిన్నుతించుచున్నది మా ప్రభో||

  • నిత్యము ప్రవక్తల యుత్తమ సంఘము సత్యముగ నిన్నుతించుచున్నది మా ప్రభో||

  • ధీర హత సాక్షుల వీర సైన్య మంతయు సారెకు నిన్నుతించుచున్నది మా ప్రభో||

  • నిత్య మహాత్మ్యముగల తండ్రి వైన నిన్నును నీదు పూజ్యుఁడగు నిజ అద్వితీయ సుతినిన్||

  • ఆదరణ కర్తయైనట్టి శుద్ధాత్ముని నంతట నుండు సభ యొప్పుకొనునునిన్ బ్రభో||
  • 30 మా యేసు క్ 10/19/2017 20:16 30 మా యేసు క్రీస్తు నీవే మహిమగల రాజవు నీవు నీవే తండ్రికి నిత్యకుమారుడవు ఓ క్రీస్తూ||

  • భూనరులన్ రక్షింపఁ బూనుకొనినప్పుడు దీన కన్యాగర్భమున్ దిరస్కరింపలేదుగా ఓ క్రీస్తూ||

  • విజయము మరణపు వేదనపై నొందఁగా విశ్వాసులందరికిన్ విప్పితివి మోక్షమున్ ఓ క్రీస్తూ||

  • నీవు తండ్రిదైనట్టి నిత్య మహిమయందు దేవుని కుడివైపుఁ దిరముగాఁ గూర్చున్నావు ఓ క్రీస్తూ||

  • నీవు న్యాయాధిపతివై నిశ్చయముగా వఛ్ఛెదవు కావున నీ సాయంబుకానిమ్ము నీ దాసులకు ఓ క్రీస్తూ||

  • దివ్యమౌ రక్తంబు చిందించి నీవు రక్షించిన సేవకులకై మేముచేయు మనవి నాలించు ఓ క్రీస్తూ||

  • నీ వారి నెల్లప్పుడును నిత్య మహిమయందు నీ పరిశుద్ధులతోను నీ వెంచుకొను మయ్య ఓ క్రీస్తూ||

  • నీదు జనమున్ రక్షించి నీ దాయము దీవించుము నాధా వారలను నేలి లేవనెత్తు మెప్పుడును ఓ క్రీస్తూ|

  • దిన దినమును నిన్ను మహిమ పర్చుచున్నాము ఘనముగా నీ నామమున్ గొప్పచేయుచున్నాము ఓ క్రీస్తూ||

  • నేఁడు పాపము చేయకుండ నెనరుతో మముఁ గావుమయ్యా పాడెడి నీ దాసులకుఁ బరమ దయ నిమ్మయ్య ఓ క్రీస్తూ||

  • ప్రభువా కరుణించుము ప్రభువా కరుణించుము ప్రార్థించు నీ దాసులపై వ్రాలనిమ్ము దీవెనలన్ ఓ క్రీస్తూ||

  • నిన్ను నమ్మి యున్నాము నీ కృప మాపైఁ జూపుము మేము మోసపోకుండ నీవే కాపాడుమయ్యా ఓ క్రీస్తూ||
  • 31 ఓ ప్రభుండా 10/19/2017 20:16 31 ఓ ప్రభుండా నిన్ నుతీంచుచున్నాము వినయముతోడ మా ప్రభుండ వంచు నిన్ను మానక మేమొప్పుకొందు ||మో||

  • నిత్యుఁడవౌ తండ్రి లోకము నిన్నారాధించుచు నుండు సత్యదూతల్ మోక్షమందు సర్వ ప్రధానుల్ సుభక్తిన్ నిత్య మేక కంఠముతోడ నిన్ గొనియాడుచున్నారు ||ఓ||

  • పరిశుద్ధ, పరిశుద్ధ పరిశుద్ధ,సేనల దేవా ధరపరలోకంబులు నీ వర మహిమతో నోప్పునటంచు ||నో||

  • కెరూబుల్ సెరూపుల్ నిన్నుఁ గీర్తించుచున్నారహహా సారెకున్ నిన్నపొస్తలుల సంఘము స్తోత్రించుచుండు కూరిమిన్ బ్రవక్తల సంఘము కొనియాడుచు నిన్ నుతియించు ||నో||

  • మా మహా జనకా నిను మాన్యుఁడౌ పుత్రున్ బహు ప్రేమగల మా పరిశుద్ధాత్మను బ్రీతితో సంఘము భువి నొప్పుకొనున్ ||ఓ||

  • నీవే క్రీస్తు రాజవు నిత్య కుమారుడవు నీ విలలో మానవులను గావఁగఁ బూనినయపుడు పావన కన్యా గర్భంబున బుట్టుట బహుదీనంబనక చావు శ్రమ నోడించి సజ్జనులకు దివిఁ దెరచితివే ||ఓ||

  • నీవు దేవుని కుడి పార్శ్వంబున నిత్యము మహిమాసీనుఁడవు నీవు మా న్యాయాధిపతివై రావలయునని నమ్ముచుందుము పావనంబౌ నీ రక్తంబున సేవకులకుఁ దోడ్పడు మిపుడే ||ఓ||

  • నిత్య మహిమములో నిఁక నీదు భక్తులతోన గత్యముగ లెక్కించుము వారలఁ గని రక్షించుమి నీ సుజనంబున్ ||ఓ|

  • నీవు దీవించి నీ నిత్య స్వాస్థ్యంబు సుజీవమిడి వారలఁ బాలించి లేవఁగ నెత్తుము సతతము ప్రీతిన్ ||ఓ||

  • ఓ ప్రభువా పాపములో నుండ కుండఁగఁ దోడ్పడుము మా ప్రభువా కరుణించు మముఁ గరుణించుము దయతోడన్ ||ఓ||

  • ఓ ప్రభుండా నిన్ను నమ్మి యున్న మాకుఁ బ్రేమఁ జూపు శ్రీ ప్రభుండా నిన్నే నమ్మితి సిగ్గునొంద నీయకుము ||ఓ||
  • 32 దహన బలి నీ 10/19/2017 20:16 32 దహన బలి నీకు ననిష్టము మరియు దైవ బలులు విరిగిన యాత్మయే యెహోవ దేవ విరిగి నలిగిన యట్టి హృదయం బలక్ష్యంబు సేయవు ||దహన||

  • నీ కటాక్షముతో సీయోనున కిపుడే నెనరుతోడను మేలు చేయుమి ప్రాకటంబుగను యోరూషలే మునకుఁ బ్రాకారములను గట్టించుమి ||దహన|

  • అంతట నీతియుక్తంబు లౌ బలుల యాగముల సర్వాంగ హోమముల్ ఎంతో యిష్టంబౌ బలిపీఠము మీఁద నెన్నో కోడెల జనులర్పించుతురు ||దహన||
  • 33 యెహోవ గద్ద 10/19/2017 20:16 33 యెహోవ గద్దె ముందట జనంబులార మ్రొక్కుఁడి యెహోవ దేవుఁడే సుమీ సృజింపఁ జంపఁ గర్తయే

  • స్వశక్తిచేత నాయనే మమున్ సృజించె మట్టిచే భ్రమించు గొఱ్ఱె రీతిగాఁ దప్పంగ మళ్లీ చేర్చెను

  • సుకీర్తి పాడి గుంపులై ప్రసిద్ధిచేతు మాయనన్ జగత్తు వేయి నోళ్లతో స్తుతించు దివ్యమౌ ధ్వనిన్

  • ప్రభుత్వ ముండు నంతకున్ అగున్ నీ ప్రేమ నిత్యము చిరంబు నీదు సత్యము వసించు నెల్లకాలము
  • 34 సర్వేశా! ర 10/19/2017 20:16 34 సర్వేశా! రమ్ము నీ సన్నిధి కాంతి నొసంగు మాకు సత్య సనాతన సర్వాధికారుఁడా సదా మమ్మేలుము సర్వోన్నతా!

  • నిత్యంపు వాక్యమా! నీదగు ఖడ్గము నిమ్ము మాకు నీ నిజ భక్తులన్ నీ వాక్య ప్రియులన్ నింపు నీ యాత్మతో నింపు మీర

  • రమ్ము మహాత్మ! మా కిమ్ము నీ యాత్మను రమ్ము వేగ రక్తితో నిప్పుడు రమ్ము మా మధ్యకు రక్షించు మమ్మును రంజిల్లఁగన్

  • స్తోత్రం పవిత్రుఁడా! స్తోత్రంబు త్ర్యేకుండా! స్తోత్రం సదా ధాత్రి నీమహిమ నేత్రంబులు గను మీ, "త్రాహిమాం" యని వేఁడు వారి
  • 35 ఇన్నాళ్లు 10/19/2017 20:16 35 ఇన్నాళ్లు మాకు సాయమై యీ ముందుకును మా యున్నత గృహ మండవై యొప్పెడు దైవమా!

  • ఏలాటి యీతిబాధయు నీవచ్చు యేఁటిలో కలుగకుండఁ బ్రోవవే ఘనంపు ప్రేమతో

  • నీ సింహాసన నీడలో నిలుచు భక్తులు భయంబు చింతబాధలన్ జయించి మందురు

  • చరాచరంబు లెల్లను జనించుకంటె ముందార తరాలనుండియున్ నీరాజ్య మండెడున్

  • ఇన్నాళ్లు మాకు సాయమై యేలుచుఁ గాచిన ఉన్నత ప్రభు ప్రేమతో మన్నించు మింకనున్
  • 36 సర్వాద్భుత 10/19/2017 20:16 36 సర్వాద్భుతంబులన్ సర్వత్రఁ జేయుకర్తన్ సర్వాత్మ లింతటన్ శ్లాఘింపఁ జేరరండి! మా రాకపోకలన్ మం వీడకుండను మా రక్షకుండిట్లే మమ్మాదరించును

  • మహా దయాళుఁడే మా జీవకాలమంత సహాయమూరటన్ సంతోషమిచ్చుగాక! మహత్తు ప్రేమను మాయందు నుంచును ఇహంబునన్ మమ్మున్ ఎన్నండుఁ బ్రోచును.

  • ప్రపంచపాలకా! ప్రసిద్ధుఁదైన తండ్రీ! సుపుత్ర దేవుడా! సుజీవమిచ్చు నాత్మ! సంపూర్ణ త్ర్యేకుండా! ప్రఖ్యాతికల్గగా అపారసన్నుతి నర్పింతు సర్వదా
  • 37 మాకర్త గట్ 10/19/2017 20:16 37 మాకర్త గట్టి దుర్గము నే నమ్ము ఆయుధంబు సంప్రాప్తమైన కష్టములన్నిటి నణంచు ఆ పాత శత్రువెంతో క్రూరుఁడు తదాయుధములుపాయ శక్తులు అతం డసమానుండు.

  • మేమో నశించిపోదుము మా శక్తి నిష్ఫలంబు మాకై ప్రభుని శూరుఁడు యుద్దంబు చేసిపెట్టు అతం డెవ్వఁడు? యేసు క్రీస్తను మా రక్షకుండు మరొక్కఁ డెవ్వడు? అతండె గెల్పుపొందు

  • ప్రపంచ మంతటన్ గ్రమ్ము పిశాచు లేమి చేయు? మమ్మెల్ల మ్రింగనున్నను మాకేల భేతివేయు? ఈ లోకాధిపుఁడుగ్రుఁడైనను దానేమి చేయుఁ? దీర్పొందె నతఁడు నశించు మాటతోనే.

  • వాక్యంబు నిత్యమే గదా విరోధి వంచ లేఁడు. దైవాత్మ తోడగుం గదా తా నిన్న నేఁడు రేపు. మా కుటుంబము మా కీర్తి, యాస్తి, ప్రాణంబు పోయినన్ నష్టంబు వానిదె రాజ్యంబు మాది యౌను.
  • 38 కృపగల దేవు 10/19/2017 20:16 38 కృపగల దేవుని సర్వదా నుతించుఁడి దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండును.

  • సర్వశక్తుఁడాయనే సర్వదా చాటించుఁడి దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండును

  • పగటి నేలునట్లు సూర్యునిన్ సృజించెను దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండును.

  • సర్వజీవకోటిని బ్రోచు దేవుఁ డెన్నఁడు దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండును.

  • కర్త మనయందును కనికర ముంచెను దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండును.

  • దైవ ఘన మహిమన్ జాటుచుండుఁడి యిలన్ దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండును.
  • 39 నృపా! విమో 10/19/2017 20:16 39 నృపా! విమోచకా! ప్రభూ వేలాది నోళ్ల నీ కృపా జయప్రభావముల్ నుతింతు నెంతయున్.

  • కృపాధికార! దేవ! నీ సాయంబు జేయుమా భవత్ర్పభావ కీర్తులన్ జాటంగ నెల్లెడన్.

  • భయంబు చింతఁ బాపును హర్షంబు పాపికి సౌఖ్యంబు జీవశాంతులు నీ నామ మిచ్చును.

  • విముక్తి జేయు ఖైదిని పాపంబు బాపును పాపాత్ము శుద్ధుజేఁయును శ్రీయేసు రక్తము.

  • జనాళి! పాపు లెల్లరు! శ్రీయేసున్ నమ్ముఁడి కృపావిముక్తులందుఁడి సంపూర్ణ భక్తితో.

  • అర్పించె యేసు ప్రాణమున్ నరాళిఁగావను; యజ్ఙంపు దేవు గొఱ్ఱెపై నఘంబు వేయుఁడి.

  • సత్కీర్తి స్తోత్ర ప్తేమల నభాన భూమిని సర్వత్ర దేవుఁడొందుగా సద్భక్త పాళిచే.
  • 40 శుద్ధి, శు 10/19/2017 20:16 40 శుద్ధి, శుద్ధి, శుద్ధి! సర్వశక్త ప్రభు ప్రాతఃకాలస్తుతి నీకీ చెల్లింతుము శుద్ధి, శుద్ధి, శుద్ధి! కృపగల దేవా! ముగ్గురైయుండు దైవత్ర్యేకుఁడా!

  • శుద్ధి, శుద్ధి, శుద్ధి! అని పరమందుఁ బరవాసు లెల్ల నిన్నేశ్లాఘింతురు శెరపుల్ ఖెరూబుల్ సాష్టంగపడి నిత్యుఁడవైన నిన్ నుతింతురు.

  • శుద్ధి, శుద్ధి, శుద్ధి! తేజరిల్లు దేవ పాపి కన్ను చూడలేని మేఘ వాసివి అద్వితీయప్రభు, నీవు మాత్రమేను కరుణ, శక్తి, ప్రేమరూపివి.

  • శుద్ధి, శుద్ధి, శుద్ధి! సర్వశక్త ప్రభు సృష్టిజాలమంత నీ కీర్తిఁబాడును శుద్ధి, శుద్ధి, శుద్ధి! కృపగల దేవ ముగ్గురైయుండు దైవత్ర్యేకుఁడా!
  • 41 మేలుకొనరే 10/19/2017 20:16 41 మేలుకొనరే మీ మనంబుల మేలిమిగ మీ మేరఁ దప్పక పాలు మాలక లేచి దేవుని పాదములు పూజింప గ్రక్కున ||మేలుకొనరే||

  • దిక్కు లెల్లను దేజరిల్లెను దినకరుండుదయింపనయ్యెను మ్రొక్కులకు ప్రతిఫలము నిచ్చెడు మూల కర్తకుఁ గొలువసేయఁగ ||మేలుకొనరే||

  • పక్షులెల్లను గిలకిలంచును బ్రభుని మహిమలు బల్కఁ దొడఁగెను రక్షకుని సకలోపకృతులను రమ్యముగ నుతియించి పాడఁగ ||మేలుకొనరే||

  • నిదుర బోయిన వేళ మిమ్మొక నిమిషమైనను బాసియుండక పదిలముగ రక్షించు దేవునిఁ బ్రస్తుతింప మహాముదంబున ||మేలుకొనరే||

  • మేటియౌ హృదయాబ్జములలో మీ కృతాజ్ఞతా భూషణంబులు నేటుగా ధరియించుకొని యిటు నిర్మలాత్మునిఁ బూజసేయఁగ ||మేలుకొనరే||

  • తెల్లవారఁగఁ దెలియరే యిది తెలివిగల మానవ సమాజము యల్లసిల్లుచు నీతి భాస్కరుఁడుదయ మయ్యెను హృదయముల పై ||మేలుకొనరే||
  • 42 తెల్లవారిన 10/19/2017 20:16 42 తెల్లవారిన వేళఁ దెలి వొంది మన క్రీస్తు దివ్య నామముఁ బాడెరె యో ప్రియులార దివస రక్షణ వేఁడరే తల్లి రొమ్మున దాఁచు పిల్ల రీతిని మనలఁ జల్లదనముగ రాతి రెల్లఁ గాచిన విభునిఁ ||దెల్లవారిన వేళ||

  • నిద్రపోయిన వేళ నిఖిలాపదులఁబాపి నిశలన్ని గడుపు విభునిన్ భద్రముగ వినతించి భయభక్తితో మనము ముద్రి తాక్షులఁ గేలు మోడ్చి మ్రొక్కుచును ||దెల్లవారిన వేళ||

  • భానుఁడుదయం బయ్యెఁ బద్మములు వికసిల్లె గానమలు జేసెఁ బక్షుల్ మానసాబ్జము లలర మనము కల్వరి మెట్టపై నెక్కు నినుఁ డనెడి ప్రభుఁ జూచి వేడ్కన్ ||దెల్లవారిన వేళ||

  • దిట్టముగ మానసేంద్రియ కాయ శోధనలు పట్టుకొని, యుండు దినమున్ దట్టముగ మన నాల్గు తట్ల యేసుని కరుణఁ జుట్టుకొని రక్షించు శుభమడుగుకొనుచున్ ||దెల్లవారిన వేళ||

  • పాప భారము మనము ప్రభుని పై నిడి గురుని పాదములు చెంత నొరగి కాపు కర్త విశాల కరము మాటున డాఁగి యాపదలఁ దొలఁగించు మని వేఁడుకొనుచున్ ||దెల్లవారిన వేళ||
  • 43 శ్రీ యేసు 10/19/2017 20:16 43 శ్రీ యేసు కర్తను సేవఁ జేయుటకు మేల్కొను శ్రీయేసు కర్తను శ్రేయముల నెఱింగి నీకు రేయిపవ లొసంగి యెడఁ బాయని యంతరంగి యపాయంబుఁ ద్రోయ సహాయంబుఁజేయ ||శ్రీ యేసు||

  • నిదురయందు నేఁడు క్షేమ మొదవఁ గాచినాఁడు సూర్యుఁడుదయ మాయెఁజూడు నీ హృదయమున సదమల పదవులుదయింప ||శ్రీ యేసు||

  • అంధకార మణఁగెన్ హృదయాంధకార మణఁగెన్ ప్రభు నందుఁ దెలివి గలుగన్ నిబంధనలు డేందమున కందముగఁ గూర్చి ||శ్రీ యేసు||

  • కంటిపాప వలెను నిను గాయువాని దయను గనుఁ గొంటివి స్తోత్రమును జేయు మింటి కినిమంటికన్నింటికిని కర్తయని ||శ్రీ యేసు||

  • కలకల ధ్వనిఁజేయు పక్కిగములు లయను గూయు సర్వములు ప్రభు స్తుతిఁజేయు నీ వలయక సొలయక వెలయఁగఁ బాడు ||శ్రీ యేసు||

  • సేవయందు నీకు మంచి యీవు లిడుపరాకు గల భావముఁబడఁ బోకు నేడుఁ కానవే కావవే కావవే యంచు ||శ్రీ యేసు||

  • పగటివార మంచు నిష్ఫ్లపు గ్రియలు ద్రుంచు యుగ యుగములు జీవించు పురికెగయ నీ దిగులు విడు తగు నమ్మకమున ||శ్రీ యేసు||

  • మింటి నంటఁ బాడు నీ యొంటి బలిమి నేఁడు ప్రభు నంటి యుండ వాఁడు నిన్నొంటి నెన్నంటి కెన్నింటికిన్వీడఁడు ||శ్రీ యేసు||
  • 44 సకల జగజ్జా 10/19/2017 20:16 44 సకల జగజ్జాల కర్తా భక్త సంఘ హృదయ తాప హర్తా యకలంక గుణమణి నికర పేటీ కృత ప్రకట లోకచయ పరమ దయాలయ ||సకల||

  • నాదు నెమ్మది తొలఁగించుచుఁ బ్రతి వాదు లీమెయి నెంతో పాదుకొన్నారు బాధలందైనను సాధులఁభ్రోవ ననాది యైనట్టి నీవాధారమైయుండ ||సకల||

  • దినకృత్యములఁ గష్టమంత చీఁకటినినే నీ కడ భక్తి మనవిజేయ వినుచు నా కష్టము వెస నష్టముగఁ జేయ ఘనముగ నాయందుఁ గరుణఁ జేసితివి ||సకల||

  • తమ కాపు నన్నుఁ కాపాడఁగ నేనుత్తమ నిద్రఁ బొందితిఁ దనివిఁదీరఁ కొమ రొప్ప మేల్కొన్నఁ గూలిన మృత్యు భయముబొంద నా డెంద మందు నెల్లప్పుడు ||సకల||

  • రాతిరి సుఖనిద్ర జెందఁ జేసి రక్షింప నను నీకె చెల్లు ప్రాతస్తుతుల్ జేయఁ బగలు జూచు తెల్వి ఖ్యాతముగా నాకుఁ గలుగఁజేసితివి ||సకల||
  • 45 వేఁడెద నాద 10/19/2017 20:16 45 వేఁడెద నాదగు వినతిని గైకొనవే జగదీశ ప్రభో నేఁడు ప్రతిక్షణ మెడబాయక నా తోడ నుండవె ప్రభో ||వేఁడెద||

  • ప్రాతస్తవము భవత్సన్నిధి సర్వంబున నగు నాదౌ చేతస్సున ధర్మాత్మను సంస్థితిజేయవె సత్కృపను ||వేఁడెద||

  • నేఁ బాతకి నజ్ఞానుఁడఁ ప్రభువా నీవు కరుణజేయు పాపాచరణము నందున జిత్తము బాపుము నాకెపుడు ||వేఁడెద||

  • పాపముఁ గని భీతుఁడనై శంకా పరత సతము నుండన్ నా పైనుంచుము నీదగు సత్కరుణా దృష్టిని బ్రేమన్ ||వేఁడెద||

  • నాదగు పాప భరం బంతయు నీ మీఁదనె యిడుచుందున్ నీదు మహాకృప నుండి యొసంగుము నిర్మల గతి నాకున్ ||వేఁడెద||

  • అవిరత మతి నిటు లతులిత గతి నీ స్తుతి నుతు లొనరింతున్ భవదంఘ్రలపై నాదగు భక్తిని బ్రబలింపవే యేసు ||వేఁడెద||
  • 46 ప్రభువా ని 10/19/2017 20:16 46 ప్రభువా నిన్నారాధింపను జేరితిమి యుదయ శుభకాంతి ప్రభవింపఁగా దేవా నేఁడు శుభకాంతి విరజిమ్మఁగా విభవముగను ప్రభాకరముగను విరియు నీ తేజంబెలర్పఁగ నభి దనంబులఁగూడి భక్తిని యాత్మతో సత్యంబుతోడను ||ప్రభువా||

  • ఇరులుం గమ్మిననుండి యరుణోదయము దనుక నరిగాపు నీవే కాదా దేవా రాత్రి యరిగాపు నీవేకాదా విరివిగా మా హృదయసీమల నెరసి యుండిన చీఁకటులుఁబో దరిమి శాంతంబైన మనసుల దయఁబ్రసాదింపను భజింతుము ||ప్రభువా||

  • అనఘా నీ సాన్నిధ్యమున నుండఁగా మా దుర్శనసుల నరి కట్టుమో దేవా మా దుర్శనసుల శుచి జేయుము వినయ భయ భక్తులుఁద లిర్పగ వినుచు నీ వాక్యోపదేశము లనిశమును ధ్యానింపనాత్మను బనిచి తుదకుఁ బ్రసన్నమగుము ||ప్రభువా||

  • పనిపాటలలో మేమీ దినము నీ కే మహిమ నొనఁగూర్ప నడిపించుమో దేవా నిన్నే ఘన పరచన్నడిపించుము తనువు శ్రమచేబడలినను మా దారి దుర్గమమైన కనంబడ వనటఁజెందక నేది జేసినఁ బ్రభువు కొఱకని చేయ నడుపుము ||ప్రభువా||
  • 47 లేచి స్తుత 10/19/2017 20:16 47 లేచి స్తుతింపఁ బూనుఁడి లోకేశ్వరుని లేచి స్తుతింపఁ బూనుఁడి లేచి స్తుతించెదము చూచుచు మనలను బ్రోచి ప్రేమతోఁ గరము జాచి కాపాడు విభుని ||లేచి||

  • రాత్రి జాముల యందున రంజిలఁదన నేత్రము తెరచినందున మైత్రితో దేవ దయకు పాత్రులమైతిమి శ్రోత్రముల కింపుసఁబ విత్ర గీతము పాడుచు ||లేచి||

  • నిదురఁభోయిన వేళను నిర్మలమైన హృదయము మనకు నియ్యను ముదముతో నిదురఁబొంది యుదయాన లేచితిమి సదయుఁడైన క్రీస్తు పదముల దరిఁజేర ||లేచి||

  • నిగమ వేద్యుఁడు మనలనుఁ దనలోన నీ పగలు కాపాడఁబూనెను దిగులు బొందక పనులు తెగువతోఁ జరుపుకొనుచు వగపుతో లేచి మ్రొక్కి మిగుల శుద్ధాత్మనడిగి ||లేచి||

  • నేటి పాఠములయందు నిర్భయముగ దాటివెలసి యుందు సూటిగ నీదు ఱెక్కల చాటుగను నిలుపు మనుచు నీటుగా నెల్లవార నిత్యము ప్రేమనేల ||లేచి||
  • 48 స్తోత్రము 10/19/2017 20:16 48 స్తోత్రము స్తోత్రము ఓ దేవా ఈ వేకువనే స్తోత్రము జేతుము మా దేవా రాత్రియందున మమ్ము రక్షించి గాపాడి ధాత్రి మరియొక దినమున్ దయతో నిచ్చెన దేవా||

  • పాపశోధనలనుండి ప్రభువా మమ్ము కాపాడి బ్రోవుమయ్య ఏ పాపము మమ్మున్ ఏల నియ్యకుండ మాపు రేపులుమమ్ము మనిపి బ్రోవుమయ్య||

  • కన్న తండ్రికంటెను కనికరమున కాపాడెడి మా దేవా అన్న దమ్ములవలె మే మందరిని ప్రేమించి మన్ననతో నీదినము మన నియ్యుమో దేవా||

  • పితా సుతా శుద్ధాత్మలనెడి దేవా ప్రీతితో గావుమయ్యా నీతిమార్గములందు నిరతము మముగాచి ఖ్యాతిగా నీకొరకు బ్రతుకనిమ్మో దేవా||
  • 49 వినవే నా వ 10/19/2017 20:16 49 వినవే నా వినతి నివేదన దయ వెలయఁగ నో ప్రభువా నిను శర ణొందితి ననుఁ గుశలంబున నునుపవె యో ప్రభువా ||వినవే||

  • నిర్మల గతి సంధ్యా కాలంబున నీ స్తవమగు ప్రభువా ధర్మదీప్తి నా కొసఁగి చేయు దీప్తవంతునిగ నన్ను ||వినవే||

  • నీ మహదాశ్రయ మొసఁగి దుర్గతిని నేఁబడకుండఁగను నా మది తన్వాది సమస్తముతో ననుఁ గావవె ప్రభువా ||వినవే||

  • ఎన్ని దినంబులు జగతి నున్న నీ కన్న వేరే గలవా పన్నుగ మది నీ పద సంగతమై యున్నది రేవగలు ||వినవే||

  • పాప కరుండను నే సుకృతా పాది కర్మ మెఱుఁగ నీ పాద సరోజము నా కొసఁగుము నాపై నీ కృపఁ జెలఁగ ||వినవే||

  • నీ కొరకై నా మనము దృఢంబౌఁ గాక యేసు ప్రభువా నాకుఁ బిశాచముచే భ్రమ జన్మము గాకుండఁగ నేలు ||వినవే||
  • 50 దేవ నీకు స 10/19/2017 20:16 50 దేవ నీకు స్తోత్రము ఈ రాత్రిలో నీ వెలుఁగు దీవెనకై కావుము నన్నిప్పుడు రాజుల రాజా ప్రోవు రెక్కల నీడలో ||దేవ||

  • పూని యేసుని పేరిటన్ మన్నించుము కాని పనులను జేసినన్ నేను నిదురపోవక ముందే సమాధాన మిమ్ము నాకు ||దేవ||

  • చావు నొందుట కెన్నడు భీతి లేక జీవింప నేర్పించుము జీవ పునరుత్థానము లో మహిమతో లేవ మడియ నడ్పుము ||దేవ||

  • నేను జీఁకటి నిద్రను రోయుచుఁ దుద లేని దినంబునందు మానకుండగ దూతలన్ గూడి చేయ గాన మెప్పుడు గల్గునో ||దేవ||
  • 51 దినము గతియ 10/19/2017 20:16 51 దినము గతియించెను దిననాధుఁడ పరాద్రి వెనుకడాఁగె నిఁ కమా మునిమాపు సంస్తవముఁ గొనుము సంప్రీతిమై ఘనుఁడ దేవా ||దినము||

  • సరవినంబరవీధి సంజ కెంజాయలు మురువుఁజూపె ప్రభువా దొరము నీ ముఖకాంతి కిరణ జాలము మాపై నెఱపరమ్ము ||దినము||

  • కటికి చీఁకటులు దిక్తటములఁ గలిపియు త్కటములైన నీ చెం గట నున్న నెట్టి సంకటమేని మమ్ముఁ దాఁకుటకు జంకు ||దినము||

  • తలఁపువలనను నోటి పలుకువలనను జెనఁటి పనులవల్ల మేము వలచి చేసిన పాపముల నెల్ల క్షమియింపుమ లఘక్షాంతి ||దినము||

  • ముమ్మరమ్మగు శోధ నమ్ములపై విజయమ్మునొంద నీ దినమ్ము మాకు సామర్ధ్యమొసఁగితివి వంద నమ్ము దేవ ||దినము||

  • ఈ దినము మాకు సమ్మోదంబుతో నిచ్చి యాదుకొన్న వరమౌ నీ దివ్యదానముల కై దేవ! మా కృతజ్ఞతను గొమ్ము ||దినము||

  • అలసిన మా దేహములకు వలసిన నిదురఁ గలుగఁజేసి నీదూ తల హస్తములలో మమ్ములను దాఁచుము భద్రముగను దేవ ||దినము||

  • అరుణోదయముననిన్నర్చించు కొఱకు నీ కరము సాఁచి మమ్ము త్వరగా మేల్కొల్పుము స్వాస్థ్య ప్రదాతవై పరమదేవ ||దినము||

  • దాత వీవె లోక త్రాత వీవె మాకు నేత వీవె యేసు నీతి సూర్యుండవి ఖ్యాతి మహిమలు నీకె కలుగుఁగాక ||దినము||
  • 52 ఆకాశంబు భూ 10/19/2017 20:16 52 ఆకాశంబు భూమియు అంతట చీకటి యాయెను ప్రాకెడు చీకటి సమయమున ప్రార్థన చేతుము మా దేవా||

  • చక్కని చుక్కలు మింటను చక్కగా మమ్మునుజూడగ ప్రక్కకు రావె వేగముగా ప్రభువా గావుము గావుము నీ నీడన్||

  • చిన్న చిన్న పక్షులు చిన్న చిన్న పూవులు ఎన్నో ఎన్నో జీవులు నిన్నే గొలిచి నిద్రించున్||

  • చిన్న చిన్న పాపలు చిన్న చిన్న పడకలలో చిన్న కన్నులు మూయంగా చెన్నుగ యేసూగావుమా||

  • నేలను బోయెడి బండ్లలో నీటను బోయెడి ఓడలలో గాలి విమానంబులలోన కావుము దేవప్రయాణికులన్||

  • రాత్రిలో నీదు దూతలు రమ్యంబైన రెక్కలతో చిత్రంబుగ మమ్మును గ్రమ్మన్ నిద్రించెదము మాదేవా||

  • తెల్లవారుజామున తెలివొంది మే మందరము మెల్లగలేచి నుతియింపన్ మేల్కొల్పుము నా ప్రియతండ్రి||

  • జనక తనయా శుద్ధాత్మా జయము మహిమ స్తోత్రములు అనిశము నీకే చెల్లునుగా అనిశము చెల్లును నీ కామెన్||
  • 53 ఈ సాయంకాలమ 10/19/2017 20:16 53 ఈ సాయంకాలమున యేసు ప్రభో వేఁడెదము నీ సుదయారస మొల్క నిత్యంబు మముఁగావు ||మీ||

  • చెడ్డ కలల్ రాకుండ నడ్డగించుమి ప్రభో బిడ్డలము రాత్రిలో భీతి బాపుము తండ్రీ ||యీ||

  • దుష్టుండౌ శోధకునిఁ ద్రొక్కుటకు బలమిమ్ము భ్రష్టత్వమున మేము పడకుండఁ గాపాడు ||మీ||

  • నీ యేక పుత్రుండౌ శ్రీ యేసు నామమున సాయం ప్రార్థన లెల్ల సరగ నాలించుమా ||యీ||

  • జనక సుత శుద్థాత్మ ఘనదేవా స్తుతియింతుం అనిశము జీవించిరా జ్యంబుఁ జేయు మామేన్ ||ఈ||
  • 54 నా యేసూ, ఆ 10/19/2017 20:16 54 నా యేసూ, ఆత్మ సూర్యుఁడా నీవున్న రాత్రి కమ్మదు నా యాత్మలో నీ విప్పుడు వసించి పాయకుండుమీ.

  • నేను నిద్రించు వేళలో నాకు నభయ మియ్యుము నే లేచి పనిచేయఁగా నా యొద్ద నుండు రక్షకా.

  • నాతోడ రాత్రింబగళ్లు నీ వుండి నడిపించుము నీవు నాతో లేకుండినన్ జీవింపఁ జావఁజాలను.

  • నేఁడు నీ దివ్య వాక్యము వినిన పాపు లెల్లరిన్ క్షమించి గుణపఱచి నీ మందలోకిఁ జేర్చుము.

  • రోగిని స్వస్థపఱచి బీదలను పోషించుమీ దుఃఖించువారి దుఃఖముఁ బాపి యానంద మియ్యుము.
  • 55 ప్రొద్దు గ 10/19/2017 20:16 55 ప్రొద్దు గ్రుంకుచున్నది సద్దణంగుచున్నది యాకసంబు దివ్వెలు లోకమున్ వెల్గింపఁగా స్తుతించుఁడి. || శుద్ధ, శుద్ధ, శుద్ద సర్వేశుఁడా యిద్దరాకాశంబులు సన్నుతించుచున్నవి సర్వోన్నతా ||

  • జీవితాంతమందున నీ విచిత్ర జ్యోతులన్ జూచుచుండఁగాను మా కీవోసంగు నీ కృపన్ నిత్యోదయం.

  • నిన్ను గోరువారము నన్ను తేశ నీ దరిన్ మమ్ముఁ జేర్చుకొమ్ము నీ విమ్ము నిత్య సౌఖ్యమున్ స్తోత్రం నీకు.
  • 56 రాత్రియయ్య 10/19/2017 20:16 56 రాత్రియయ్యెన న్నెడఁబాయకు ధాత్రిపైఁ జీఁకతులుఁ గ్రమ్మెను సహాయ మేమి లేనివారికి సహాయుఁడా, నన్ బాసిపోకుమీ.

  • ఏకాలంబైన నీ సహాయము లేక పిశాచిన్ గెల్వఁజాలను నీకంటె నాకు లేదుగా లోక ప్రకాశుఁడా, నన్ బాయకు.

  • నా చెంత నీవు చేరియుండఁగ ఏ చింతయైన నన్ను సోకునా ఏ శత్రువైన నన్ను గెల్చునా? నా శైలమా, నన్ బాసిపోకుమా.

  • సమృద్ధుఁడు సహాయుఁ డాయెను ఓ మృత్యువా నీ ముల్లు గెల్చునా? సమాధి నీకు జయమబ్బునా? మా మధ్యమున్ సర్వేశ పాయకు.

  • రేవు నేఁ జేరఁబోవు వేళలోన్ కావుమయ్యా నీ దీప్తిఁ జూపుచున్ చావు జీవంబులందు నైనను నీవు తోడై నన్ బాసిపోకుము.
  • 57 ఓ రక్షకా, 10/19/2017 20:16 57 ఓ రక్షకా, నీ దివ్య నామము ఐక్యంబుతోను స్తుతియింతుము ఆరాధనాంత మెందు వేళయం దను గ్రహించు నీదు దీవెనన్.

  • గృహంబుఁ జేర నాత్మ శాంతిని ఒసంగి మాతో నుండుము సదా ఇచ్చట సేవఁ జేయు మమ్మును పాపంబుఁ జేయకుండఁగాయుము.

  • మా చుట్టు నుండు మబ్బునఁ ప్రభో నీ దివ్యకాంతిన్ మాకు నియ్యుమా పాపాంధకా బాధ నుండి నీ బిడ్డల మైన మమ్ముఁ బ్రోవుమా.
  • 58 ఇది యెహోవా 10/19/2017 20:16 58 ఇది యెహోవా కలిగించిన దినము సుదివసంబునను జొప్పడు గడియలు కొదువలేని దయ గుల్కెడు వానివి ||యిది||

  • మోక్షము భూమియు సమ్మోద మంది నుతులక్షరు గద్దె చుట్టు నాక్రమింతురు గాక ||నిది||

  • అతఁడీ దినమంచంత మొందు నర వితతి నుండి వే వేగ వచ్చెను ||ఇది||

  • ఆ పిశాచ రా రాజ్యంబు కూలినది ఆ పరేశు విజయము లీ దినమున ||నిది||

  • సేవక వరులు విలసింపఁగఁ జేసి యా పావనాద్భుతములఁ బ్రచురముఁ జేయుదు ||యిది||

  • దావీదుని వర తనయుఁడై యభిషేకావృతుఁడౌ రాజా గ్రణికి హోసన్నా ||యిది||
  • 59 సుక్షేమ శు 10/19/2017 20:16 59 సుక్షేమ శుభకాల విశ్రాంతి దినమా విచారమెల్ల తీర్చు దైవాదివారమా ఈనాడు మేము కూడి దేవాలయంబున మా త్ర్యేక దేవ స్తుతిఁగావింతు మెంతయు.

  • నీయందు సృష్టికర్త విశ్రామ మొందెను నీయందు యేసుక్రీస్తు మృత్యు బంధమును త్రెంచుచు తాను లేచి చావున్ జయించెను నీ యందు పావనాత్మ మాకియ్యఁ బడెను.

  • భూవాసు లీ దినంబు సంతోషపడుచు సువార్త విని, పాడి మా యేసు స్తోత్రము ప్రితృపుత్ర శుద్ధాత్మ త్రిత్వంబౌ దేవుని ఉత్సాహ ధ్వనితోడ నెంతో స్తుతింతురు.
  • 60 గొప్ప దేవ 10/19/2017 20:16 60 గొప్ప దేవ నాకు తండ్రివి యాకాశమందు గొప్ప దేవ నాకుఁ దండ్రివి తప్పకుండ వత్తు నీదరికి యేసు నామమందు గొప్ప కరుణ చేత నన్నిప్పుడు తగఁ జేర్చుకొనుము ||గొప్ప||

  • నీవు మిగుల గొప్ప వాఁడవు నా సృష్టి కర్త యీవు లెపుడు నిచ్చు వాఁడవు భావమందు నినుఁ దలంచి పావనాత్మ నాకు నిచ్చి జీవమార్గమందు నిలిపి కావు మనుచు వేఁడుకొందు ||గొప్ప||

  • చిన్నవాని నంగి ప్రార్థన నీ లోకమందు మున్ను దయను నిన్న వాఁడవు సన్నుతుఁడగు యేసు నీదు సన్నిధి సున్నాఁడు గాన నన్నుఁ గనికరించు మనుచు నిన్ను నమ్మి వత్తు నిపుడు ||గొప్ప||

  • విలువ గల్గు నీదు నాజ్ఞలు నా హృదయమందు బలు విధములఁ దలఁచు చుందును బలుకులందుఁబనులయందు బలముఁ జూపి నిన్నుఁ గొలిచి యిలను నిన్నుఁ బ్రీతిపరుతు నలయక నీ కరుణ మెయిని ||గొప్ప||

  • మీఁది రాజ్యమందుఁ జేర్చుము కరుణాసముద్ర బీద నైన నన్నుఁ గరుణచే సోదరులను గూడికొనుచు మోద మొప్పఁగ నీదు సేవఁ బాదుకొనుచు నుందును నీ పాదపద్మములనుబట్టి ||గొప్ప||
  • 61 ఘనుఁడైన యె 10/19/2017 20:16 61 ఘనుఁడైన యెహోవా గద్దె ముందట మీరు వినతు లిప్పుడు చేయుడి యోజనులార వినయంబుగా నిర్మలానంద రసలహరి మన మనం బొప్పుచుండనో జనులార ||ఘనుఁడైన||

  • ఒక్కఁడే మన కర్తయుండు దేవుడని యున్ జక్కగాను సృజియించు సంహరించు ననియున్ నిక్కముగఁ దెలిసికొండీ మన సహాయమే మక్కరలేకుండ మనల మిక్కుటపు పరిపాలనపు బలముచేఁ జేసె మృత్తుచే మానవులఁగ దిక్కు గానక తిరుగు గొర్రెల వలె మనము చెదరఁ దిరుగఁదన దొడ్డిఁబెట్టెనో జనులారా ||ఘనుఁడైన||

  • మే మందరము వందనపు పాటతో మూగి మించు నీ గుమ్మములలో మామా స్వరము లెత్తుదుము నభము పొడవుగా మధురలయ సహితముగను భూమియున్ దనదు పదివేల జిహ్వల వలఁ బొందైన నీ నగరి కా ధామంబులను గాన సన్నుతి వితతిపూరి తమ్ములుగఁ జేయు దేవా యో జనులారా ||ఘనుఁడైన||

  • ధరయంత విస్తారమైయున్నది నీ యాజ్ఞ తగ విరహితాద్యంతమై స్థిరమైన కాలంబువలెనె యున్న దయదయ పొరలిపోవుచు నున్నవత్సరముల్ నిలిచిపోయి నప్పటికిని నీదు సత్యంబు నిలిచియుండున్ వర శిలా ఖండ పర్వతము తోడను సాటి వన్నె కెక్కుచు నెంతయున్ ఓ జనులారా ||ఘనుఁడైన||
  • 62 గతకాలములయం 10/19/2017 20:16 62 గతకాలములయందు ఘనసహాయుడ దేవా హితనిరీక్షణ నీవే యెన్నేండ్లకైన అతిగా వీచినగాడ్పు లందు దుర్గంబీవై నిత్మాంత గృహమీవె నిత్యఁడౌ ప్రభువా ||గత||

  • నీ సింహాసన ఛాయ లో సురక్షితముగ వాసము సేయుదము భవ్యగుణతేజా నీ సుబాహువేచాలు నిశ్చయ సురక్షా వాసముఁగా నొప్పు ప్రభువా ఘన దేవా ||గత||

  • నగముల్ వరుసనిలిచి నగధరనిర్మాణ మగుటకు మున్నేయ నంత ప్రభు నీవు అగణితవత్సరము నీవే మా భగవంతుడవు నిన్ను ప్రణుతింతు మేము ||గత||

  • వేయి యుగములు నీకు దెసగతించిన యొక్క సాయంత్ర సద్రుశము సవిత్రుడురు శో భాయుతముగ లే వక ముందు రాత్రిలో ప్రహరము సుమియవ్వి ||గత||

  • గతకాలములయందు ఘన సహాయుడ దేవా హితనిరీక్షణ నీవే యేన్నేండ్లకైన క్షితిజీవితాంతము గతిగానుండుము దేవా నితాంత గృహ మీవె నిత్యుడౌ ప్రభువా ||గత||
  • 63 పరిమపురి క 10/19/2017 20:16 63 పరిమపురి కల్పభూజ నిరత భూనరుల పూజ యురుతరచిత మహిమతేజ వరస్తుతి సల్పెదము రాజ

  • జనక సుత శుద్ధాత్మ యను పేరిట యేకాత్మ ఘనతర సంరక్ష ప్రేమ ననిపి మము కనికరించు||పరమ||

  • నీవే మా ప్రాపువంచు నెరనమ్మి యందు మంచు భావంబున దలఁచు వారిఁ బావనులఁ జేయు సదా ||పరమ||

  • కలుషంబులను హరింప నిల సైతానును జయింప బలుమారు నిను దలంచు బలము గల ప్రభుఁడ వీవే ||పరమ||

  • ఈ లోక పాపనరులు చాల నిను నమ్మి మరల దూలిచే దారుణ సై తానును బడఁద్రొక్కివేయు ||పరమ||

  • అల్పా ఓ మేగయును నాద్యంతంబులును కల్పాంత స్థాయువైన కర్తా కరుణించు మమును ||పరమ||
  • 64 ఎంత ప్రేమి 10/19/2017 20:16 64 ఎంత ప్రేమించెనో దేవుఁడు మనపై నెంతదయఁజూపెనో వింతగల యీ దైవప్రేమను సాంతమున ధ్యానింపరే ||ఎంత||

  • పనికిమాలిన పాపాత్ములమైన మనము ఆ ఘనదేవునికి పిల్లలమనబడుటకై తన కుమారుని మరణ బలిరక్తమున మన లను స్వీకరించుకొనెను దీనిని జూడరే ||ఎంత||

  • పెంటకుప్పమీఁద పడియున్న యీ నీచ మంటి పురుగులను లేవనేత్తి మింటిపై ఘనులతోఁ గూర్చుండఁజేయ నీ మంటి కేతెంచె మన వంటి దేహము దాల్చి ||ఎంత||

  • ద్రాక్షారసపు మధురమును మించి యీ ప్రేమ సాక్షాత్తుగా మనపయినుండగా ఈ క్షితినా ప్రేమ ద్రాక్షారసముకంటె దీక్షగవేడి యపేక్షింపతగునాహా ||ఎంత||

  • మనలను ప్రేమించి తన ప్రాణమిచ్చిన ఘనుఁడా కాశమునుండి మరలి వచ్చి మన దైన్యదేహమును తనరూపమును మార్చి కొనిపోయి తన రాజ్యమును మనకీయును ||ఎంత||

  • గట్టిగ మనమునం దిట్టి నిరీక్షణ పెట్టియున్న సత్ క్రైస్తవులూ ప్రభు డెట్టివాఁడొ మనమునట్టి వారుగ ప్రభుని కట్టడలను మదిని బెట్టియుందము వేడ్క ||ఎంత||
  • 65 దేవుని గొప 10/19/2017 20:16 65 దేవుని గొప్ప ప్రేమను కలంబు తెల్పజాలదు అత్యున్నత నక్షత్రమున్ అధోగతిన్ అవరించున్ నశించు జాతిన్ రక్షింపన్ సుతుని బంపెను పాపంబు నుండి పాపికి విశ్రాంతి జూపెను ||దేవుని ప్రేమ సంపద అపారమైనది నిరంతరంబు నిల్చును ప్రేమ సంగీతము||

  • యుగాంతకాల మందున భూరాజ్యముల్ నశించగా యేసున్ నిరాకరించువారు చావును కోరు వేళను దేవుని ప్రేమ గెల్చును అనంత జీవము నశించు వారి కాశ్రయంబు ప్రేమ సందేశము.

  • సముద్రమును సిరాతో నిండి ఆకాశమె కాగితమై కొమ్మల్లె కలంబులె ప్రతి నరుండు కరణమై దేవుని ప్రేమన్ చిత్రింపన్ సంద్రంబు యింకును ఆకాశ వ్యాప్తి యంతయు చాలక పోవును.
  • 66 దైవ ప్రేమ 10/19/2017 20:16 66 దైవ ప్రేమ పృథ్విలోని యన్నిటిని మించును యేసు మాలో నివసించు యది మా విముక్తియే నీ కమూల్య ప్రేమ యుండు నీవు దాసుల మైన మమ్ముఁ గృపతో రక్షించుము.

  • మమ్ము సంరక్షించు శక్తి నీకుండు, మా ప్రభువా ఎన్నఁ డెనఁ డేని నీదు సన్నిధిని బాయుము నిన్ స్తుతించుచుండి మేము సర్వదా సేవింతుము. నిన్ బ్రార్థించి పూర్ణప్రేమ మే మతిశయింతుము

  • క్రొత్తగా మమ్ము సృజించి పాప మెల్లఁ బాపుము మాకు స్వస్థత నొసంగి గొప్ప రక్షఁ జూపుము భక్తి యభివృద్ది పొంది స్వర్గమందుఁ జేరగా వింత నొంది ప్రేమ స్తుతి నీకర్పింతు మెప్పుడు.
  • 67 శాశ్వతుడా! 10/19/2017 20:16 67 శాశ్వతుడా! విస్మయమొంది నేను నీ స్వంతహస్త సృష్టిజూడగా నీ స్వరం విందున్ ఉరుములయందు యేసు ప్రభూ నిన్నారాధింతును ||ఓ రక్షకా! నీ స్తుతి పాడెదన్ నూరంతలన్ మహాదేవా నా రక్షకా! నమస్కరింతునిన్ మారని యో మహాదేవా||

  • వృక్షంబులందున్, అడవులలోనే పక్షుల పాటలాలకింతును తక్షణ మగ్రపర్వతంబు నుండి అక్షులతో నీ మహిమ గందున్.

  • మహాదేవా! నీయేక పుత్రుండిలన్ నా హేయపాపముల్ భరించి, నా సహాయుడై తా మరణించె నంచు ఓహో! యాశ్చర్యపడి స్మరింతున్.

  • క్రీస్తు విజయార్భాటముతో వచ్చి నీ స్థలమందు నన్ను జేర్చగా నే స్థిరతుష్టితో సాష్టాంగపడి నీ స్తుతి జేతునో మహాదేవా.
  • 68 ఘన భవ దుపక 10/19/2017 20:16 68 ఘన భవ దుపకృతు లను మాటికి నే వినుతింతును దే నిజసుత యొనరఁగ నాపై ననుక్రోశముఁదగ నునుపవే క్రైస్తవ జన విహిత||ఘన||


  • ధోరణిగా నా దోసము లెంచకు సారెకు నాశ్రిత జనవరదా పారముఁదప్పిన పాతకు నగు నే నారడివడ నీ కది బిరుదా||ఘన||

  • జలబుద్బుదముతో సమ మని నాస్థితి తెలియద నీకది దేహధరా ఖలమయ మగు నీ కర్మినిఁబ్రోవను సిలువను బొందిన శ్రేయఃకరా||ఘన||

  • మందమతిని నా యందు నలక్ష్యము నొందకు దేవ సు నంద నా యందముగా నా డెందము కడుఁదెలి వొందఁగ నీ దయ నందు మా ||ఘన||
  • 69 సర్వదేశముల 10/19/2017 20:16 69 సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు ఉర్వి నుత్సాహముతో గురుస్తోత్రము జేయను రండి||సర్వ||

  • ఆ ప్రభువే దేవుండు అధికస్తోత్రార్హుండు భూప్రజలు నందరిని బుట్టించిన భగవంతుండు||సర్వ||

  • మనము దేవుని వార మును మరి యాయన ప్రజల మనయము నా ఘనప్రభువు నెనరుతో మేపెడి గొఱ్ఱెలము||సర్వ||

  • కృతజ్ఞతార్పణలు కొల్లగను జెల్లింప నాతని యావరణములో నతి వినయముతోఁజేరండి||సర్వ||

  • ఆయన దయామయుఁడు ఆయన కృపామయుఁడు ఆయన ప్రేమ సత్యం బనవరతం బుండును నిజమే||సర్వ||

  • శుభనామం మదినుంచి ప్రభునామం స్తుతియించి ఘననామం బతిభక్తిన్ అనయము గొలువుడి జనులారా||సర్వ||
  • 70 దేవ కుమారా 10/19/2017 20:16 70 దేవ కుమారా దీనోపకారా నా వంక దయఁజూప నా యన్న రారా||దేవ||

  • వృక్షముఁ బాసిన పక్షి నేనయ్యా అక్షీణ కరుణచే రక్షింపవయ్యా||దేవ||

  • పాపుల పాలిటి పరమదయాళూ దీవించు నీ దయ దీనునికిపుడు||దేవ||

  • వినుతింతు సద్గుణ వ్మల వ్చాఅ ననుఁబ్రోవవే యేసు నామావతారా||దేవ||

  • భజనఁజేసెద నిన్ను నిజ రక్షకుండ విజయముఁజేయవే నజరేతు వాఁడా||దేవ||

  • కనికర మత్యంత కరుణయుఁగలదు నిను నమ్ము వాని చే తిని వీడ వలదు||దేవ||

  • మహనీయ గుణమణి మండిత దేవా ఇహబాధ బాపవే ఇమ్మానుయేలా||దేవ||
  • 71 నీవు నా దే 10/19/2017 20:16 71 నీవు నా దేవుండవై యు న్నావు యేసు నాధ నీవిలఁ బ్రోవవే నన్నుఁ గావవే ||నీవు||

  • పాప మానవ శాప భారము నోపి సిల్వను బడిన క్షేమా ధిపతి సర్వ భూపతి ||నీవు||

  • శ్రేయమౌ కా యంబు భక్తుల కీయ సిద్ధముఁ జేయు యేసు నాయకా మోక్ష దాయకా ||నీవు||

  • జీవ మారెడి త్రోవ నేఁబడి చావనై యున్నాను పతిత పావనా యాత్మ జీవనా ||నీవు||

  • జాగుసేయక బాగుసేయను రాఁగదె నే ఘోర పాప రోగిని దఃఖ భాగిని ||నీవు||

  • పాపమున నా రూపు మాపితి ప్రాపు నీవని నమ్మితిని నను లేపనా కృపను జూపవా ||నీవు||
  • 72 మంగళముఁబాడ 10/19/2017 20:16 72 మంగళముఁబాడరె క్రీస్తునకు జయ మంగళముఁబాడరె యో ప్రియులారా మంగళముఁ బాడరెర్ మంగళముఁ బాడి దు స్సంగతిని వీడి ప్రభు సంగులను గూడి మదిఁ బొంగుచుఁ జెలంగుచును ||మంగళము||

  • రాజులకు రాజని దూతలచేత పూజఁగొనువాఁడని తేజమున సూర్యునికి దీప్తి నిడు సద్గుణ వి రాజితుని సాధుజన రక్షకుని పక్షముగ ||మంగళము||

  • కరుణ గల వాఁడని పాపులఁబ్రోచు బిరుదుగొనినాఁడని మరణమును దానిఁ బరి మార్చు ఘన శక్తిగల పరమ గురుఁడితఁదె మన పాలి వాఁడని శుభ||మంగళము||

  • సంగీతము పాడుచు సువార్త ప్ర సంగములఁ గూడుచు నింగికిని భూమికిని నిత్యముగ నేలఁ దగు శృంగారపు రాజునకు క్షేమ మగు ఆమేనిని||మంగళము||
  • 73 మంగళమే యేస 10/19/2017 20:16 73 455 | 74 వందనమే యేస 10/19/2017 20:16 74 వందనమే యేసునకు వరుసుగుణోదారునకు సౌందర్య ప్రభువునకు సర్వేశ్వర నీకు ||వందనమే||

  • యెహోవా తనయునకు ఇమ్మానుయేలునకు బహు కరుణాభరణునకుఁ ప్రభువుల ప్రభువునకు||వందనమే||

  • ఆశ్రిత జనపాలునకు నకలుష వర దేహునకు ఇశ్రాయేల్ రాజునకు యెహోవా నీకు||వందనమే||

  • మరియాతనూజునకు మహిమ గంభీరునకుఁ పరిశుద్ధాచరణునకుఁ బరమేశ్వర నీకు||వందనమే||

  • రాజులపై రాజునకు రవికోటి తేజునకుఁ పూజార్హపదాబ్జునకు భువనావన నీకు||వందనమే||

  • ప్రేమ దయా సింధునకు క్షేమామృత పూర్ణునకు ఆమే నని సాష్టాంగము లర్పింతుము నీకు||వందనమే||
  • 75 మంగళంబని ప 10/19/2017 20:16 75 మంగళంబని పాడరే క్రీస్తుకు జయ మంగళంబని పాడరే యేసుకు జయ మంగళంబని పాడరే మంగళంబని పాడి సజ్జ నాంగ పూజితుఁడై కృపాత రంగిలోక సమూహ పాపవి భంగుడని యుప్పొంగి జయజయ ||మంగళ||

  • ఘన యూద దేశంబులో బెత్లెహే మున యూదా గోత్రంబులో వినుఁ డు యేసేపునకు సతియై తనరుచుండెడి మరియ కడుపున జననమై యీ మర్త్య వరులకు సద్గతిని గల్గించు వానికి||మంగళ||

  • సోదరాళి భంగిని భక్తుల నల్లఁ జూచి ప్రోచెడు వానిని యూద దేసపు వారలధిక బాధఁబెట్టుచు హింసఁజేసిన సాదరంబున త్రిదినములకు ముదముతో గనుపడిన ప్రభునకు||మంగళ||

  • ధరణి న్గొల్చెడి దాసజ నములనుఁబ్రోచు దైవ తనయుఁడని నిజ మరయ నిలను స్మరించువారికి గురుతరంబగు కలుష జలనిధి దరికి( జేర్చు పరమ పదమే యిరు వొనర్చెద ననిన ప్రభునకు||మంగళ||
  • 76 క్రీస్తుయే 10/19/2017 20:16 76 క్రీస్తుయేసుకు మంగళం మా కీర్తి రాజుకు మంగళం క్రీస్తుయేసే దైవమంచును కూడి పాడుదు మంగళం||

  • ప్రవచనంబులు బల్కినట్టి ప్రాణనాధుడవీవె నీదు స్తవము జేయుచు మెలగు మనుజుల సత్ప్రభువుకిదె మంగళం||క్రీస్తు||

  • జగమునేలెడు జీవనాధుడ జపములందెడు గృపకటాక్ష అగణీ తంబగు ప్రేమజూపిన అమరతేజుడ మంగళం||క్రీస్తు||

  • ఖలుల బ్రోచెడు కనికరాత్మ కేంద్ర స్థానము నీ పదాబ్జము కలుషమును కడమార్చినట్టి సిలువ నాధుడ మంగళం||క్రీస్తు||

  • మనము గోరెడు మా హృదీశుడ మార్గదర్శుడ వీవెగావ అనయము నినుగొల్చు జనముల ఆది దేవుడ మంగళం||క్రీస్తు||

  • జనకసుత శుద్ధాత్మ దేవుడ గనని వినని ప్రేమ పూర్ణుడ తనివితీరగ పాడుదము యీ ధాత్రి నీకగు మంగళం||క్రీస్తు||
  • 77 విజయగీతముల 10/19/2017 20:16 77 విజయగీతముల్ పాడరే క్రీస్తునకు జయ విజయగీతముల్ పాడరే వృజిన మంతటి మీఁద విజయ మిచ్చెడు దేవ నిజకుమారుని నామమున్ హృదయములతో భజన జేయుచు నిత్యమున్ ||విజయ||

  • మంగళముగ యేసుఁడే మనకు అక్షణ శృంగమై మరి నిల్చెను నింగిన్ విడిచి వచ్చెను శత్రుని యుద్ధ రంగమందున గెల్చెను రంగు మీరఁగఁదన రక్తబలము వలనఁ పొంగు నణఁగఁజేసెను సాతానుని బల్ క్రుంగ నలిపి చీల్చెను||విజయ||

  • పాపముల్ దొలఁగింపను మనలను దన స్వ రూపంబునకు మార్పను శాపం బంతయు నోర్చెను దేవుని న్యాయ కోపమున్ భరియించెను పాప మెరుఁగని యేసు పాపమై మనకొరకు పాపయాగము దీర్చెను దేవుని నీతిన్ ధీరుఁడై నెరవేర్చెను||విజయ||

  • సిలువ మరణము నొందియు మనలను దనకై గెలువన్ లేచిన వానికి చెలువుగన్ విమలాత్ముని ప్రేమను మనలో నిలువన్ జేసిన వానికిఁ కొలువుఁజేతుమెగాని ఇలను మరువక వాని సిలువ మోయుచు నీ కృపా రక్షణ చాల విలువ గలదని చాటుచు||విజయ||
  • 78 యేసు భజనయే 10/19/2017 20:16 78 యేసు భజనయే మనలను ఆ సుగతికిఁ దీయు జనులారా దాసజనులు జేయు పలు దోసములు మోయు ||యేసు||

  • మేల కులశీల వ్రత జా లాధిక మేల చాల మన మీలాగునఁ గాలావధి ఁగూల||యేసు||

  • అక్షయ కరుణేక్ష భువన రక్షణ ఖల శిక్షా ధ్యక్ష బుధ పక్ష కృత మోక్ష యను దీక్షన్||యేసు||

  • మాటికి మిన్నేటికిఁ బో నేటికిఁ గాల్ నొవ్వ సూటిగ నరకోటి దురిత వాటములను మీటు||యేసు||

  • శ్రోత్రమ యపవిత్ర నర చ రిత్రలు వినఁబోక మైత్రిని బరమాత్ముని కథ మాత్రము విను మనుచున్||యేసు||

  • మన జీవనమునకు మారుగఁ తన ప్రాణము నిచ్చెన్ తన రక్తముచేఁ బావన మొనరించెను మనలన్||యేసు||
  • 79 శ్రీ యేసున 10/19/2017 20:16 79 శ్రీ యేసునే భజించు నా మనసా శ్రీ యేసునే భజించు శ్రీ యేసు ప్రభునే భజించు నా మనసా శ్రీ యేసునే భజించు ||శ్రీ యేసు||

  • యేసు త్రిత్వమం దీశ కుమారుఁడు భాసురుఁ డాతఁడు భూషిత రక్షకుఁడు ||శ్రీ యేసు||

  • నరుల దురితస్థితిఁ గరుణించి వారికిఁ పరమ సుఖము లిడ పరికించి వచ్చిన ||శ్రీ యేసు||

  • స్వామికి మహిమయు భూమికి నెమ్మది క్షేమము నియ్యను లేమిడిఁ బుట్టిన ||శ్రీ యేసు||

  • నరులను తండ్రితో నైక్యము జేయగ నిరతము వేఁడెడి నిజప్రాపకుఁ డగు ||శ్రీ యేసు||

  • మూఁడవ దినమున మృత్యువు నోడించి తడయక పునరు త్థానము నొందిన ||శ్రీ యేసు||
  • 80 యేసుని భజి 10/19/2017 20:16 80 యేసుని భజియింపవే మనసా నీ దోసములు చనఁ జేసి కృపతోఁ బ్రోచునే మనసా వాసి కెక్కిన క్రీస్తు మోక్షని వాసిగా కిఁక వేరేలేరని దోసిలొగ్గి నుతించితే నిను త్రోసివేయఁడు దోసకారని ||యేసు||

  • ఏటికే నీ కీదురాశలు నీ కెప్పుదును చెవి నాటవుగ ప్రభు యేసు వాక్యములు వాటముగ నా తుది దినమున నీటుమీఱఁగ నిత్యజీవ కి రీటమును నీకిత్తు నని తన నోటఁ బల్కిన మాటఁ దప్పఁడు||యేసు||

  • ఖండనగ నిను చెండియాడఁడు యెల్లప్పుడుందన మిత్రుడని రక్షించు నతఁడితఁడు అండఁబాయక నిన్ను ప్రతి దిన గండములను హరించునని నీ వుండ గోరిన నిండు నెమ్మది దండిఁగ నీకుండఁ జెప్పును||యేసు||

  • లోక సైతాను దుర్భోధలు నీ వాలింపక యా లోకరక్షకుని సుబోధలు ఏక మనసుతో రాత్రిఁబగలు ప రాకులేకను గాచు నా ప్రభు రాకడను నీవెఱింగినను పర లోకశుభ సుఖసౌఖ్య మొసఁగును||యేసు||

  • వంచనలు మది నుంచకే మనసా నీ దుర్గుణము తలఁ ద్రుంచి ప్రభుని సేవింపనే మనసా అంచితముగా క్రీస్తుఁ డీప్ర పంచ జనుల భవాబ్ధినావగ నెంచి నీ భవభార మతనిపై నుంచి సతము ప్రార్థించు మనసా||యేసు||

  • నిన్ను పాప బంధముల నుండి రక్షించుటకు స ర్వోన్నతుని కుమారుఁ డై వెలసి ఎన్నఁగ నీవొందు దుఃఖము లన్నిటిని తా ననుభవించెను విన్న తక్షణ మేసుక్రీస్తుని విశ్వసించి సుఖించు మనసా||యేసు||
  • 81 భజనచేయుచు 10/19/2017 20:16 81 భజనచేయుచు భక్తపాలక ప్రస్తుతింతు నీ నామమును వృజినములపై జయము నిచ్చిన విజయుఁడా నిను వేఁడుకొందు||

  • దివ్యపదవిని విడిచి నీవు దీనుఁడవై పుట్టినావు భవ్యమైన బోధలెన్నో బాగుగా ధర నేర్పినావు ||భజన||

  • నరులఁ గావను పరమునుండి ధరకు నీవు వచ్చినావు పరుఁడ నైన నా కొరకు నీ ప్రాణము నర్పించినావు ||భజన||

  • చెడినవాఁడ నైన నన్నుఁ జేరఁదీసి ప్రోచినావు పడిన నాదు గోతి నుండి పైకి లేవనెత్తి నావు ||భజన||

  • ఎంత ప్రేమ యెంత దయ యెంత కృప యేసయ్య నీకు ఇంతయని వర్ణింప నిలలో నెవనికిని సాధ్యంబుకాదు ||భజన||
  • 82 యేసుభజనసేయ 10/19/2017 20:16 82 యేసుభజనసేయవే దోసపుమనసా! వాసిగ నేనే, వరరక్షకుఁడు వేసారి వసుధ నెవ్వారినిఁ గానము ||యేసు||

  • ధారుణపాప భరణా! హరణా! కారుణ్యకరయని కోరిభజింపవె ||యేసు||

  • శాంతిసునీతి సదములభక్తిన్ వింతగనిడు మన శ్శాంతిసుధాకరుఁ ||డేసు||

  • అనఘా! నీవే అవనితలంబున ననుఁగనుఁగొంటివి నా ధనమంటివి ||యేసు||

  • మనసా! నీదు మలినంబును తా మనుగడ, సిల్వపై మాపెమహాత్ముఁ డు ||యేసు||
  • 83 రారే మన యే 10/19/2017 20:16 83 రారే మన యేసు స్వామిని జూతము కోర్కె లూర ప్రియు లారా పేర్మిని గూరిమి భక్తులఁ విందుట భూరిద యామృత సారము లోలికెడు చారు కటాక్ష వి శాలేక్షణుఁడఁట నారకులగు నర నారీజనులకు దారక మొసఁగను దానె పిలుచునఁట దారుణ పాప మ హారణ్యమునకుఁ గారుచిచ్చు గతి గంపడువాఁడట ఘోరదరిద్రతఁ గూల్చెడివాఁడట సారం బగు తన సభకు మకుటమఁ ట ||రారే||

  • పతిత పావనమౌ వేల్పఁట అనాది దేవ సుతుడై యిలఁ జేరి నాఁడఁట సతతము కడు దురి తతమోయుతమగు ప్రతి దేశమునకు హితభాస్కరుఁడఁట అతిలిత మోక్షో న్నత గుణగణుఁడఁట కుతలంబున స ద్గతి రహితంబగు పతితులఁ గావను మృతుడైనాఁ డఁట అతిపుణ్య తను క్షత శోణితమును వ్రతముగ సిలువను నతడొసంగెనఁట మృతిని జయించుచు బ్రతికి లేచెనఁట మతి నమ్మిన మన గతి యితఁడేనఁట ||రారే||

  • తుదిలేని మహిమవాఁడఁట తనుఁగొల్చు సాధు హృదయుల సొమ్ము మూటఁట చెదరిన గొఱ్ఱెల వెదకవచ్చెనఁట చిదురుపలగు జన హృదయము లన్నిటఁ బదిలముగా నె మ్మది నిడువాఁడఁట నదితట మఠ జన వదనముల స మ్మద శుభవార్తనుఁ బలికినవాఁడఁట సదయత నంధుల కక్షుల నిడెనఁట వెదకి బధిరులకు వీను లొసఁగె నఁట సదమల మోక్ష ప్రదుఁడగు విభుఁడఁట యిదిగో మనకిత డేలినవాఁడఁట ||రారే||
  • 84 ఇదిగో నీతి 10/19/2017 20:16 84 ఇదిగో నీతిభాస్కరుండు ఉదయమాయె నతని నీతి హృదయ కమలమునను నిలిచి మది తమోగుణంబులణపె సదమల జ్ఞానంబు నొసఁగె ||ఇదిగో||

  • ఎవని జ్ఞానమహిమ విభవ మెవనినీతి బలప్రకాశ మెవని మనుజ రూపమాయె నవనీత సత్యవర్తి రవినిమించు తేజమూర్తి ||ఇదిగో||

  • నరజనముల నీతియెవడో ధరణిపతుల దీప్తియెవడో దురితఋణము దీర్చునెవఁడో పరమపురుష డేసుఁడతఁడె నిరతజీవ మొసగునిపుడె ||ఇదిగో||

  • కలుష మెల్ల బాపదలఁచి కలువరి గిరివరకు నడచి యలవికాని ముక్తి గూర్చన్ సిలువమీద బలియై మరణ బలముణఁచి తిరిగిలేచె ||ఇదిగో||

  • మదితమం బదెచటికరిగె యెదను కఠినతము కరిగె హృదయరసము లతిశయించి సాధుగుణముగలిగి యేసు పాదములను గొలుతు నిపుడె ||ఇదిగో||

  • జనగణముల జీవమతఁడె ధనఘనముల దాతయతఁడె యనుభవమున నెఱుఁగుమతని యనుపమ ప్రేమా మృతంబు ననవరతా నందకరము ||ఇదిగో||
  • 85 చేరికొల్వు 10/19/2017 20:16 85 చేరికొల్వుఁడి క్రీస్తుని పాదములఁ జేరి కొల్వుఁడి చేరి కొల్వుఁడి స్థిరమతితో మీ నోరు నిండ మది కోరికఁ దీరఁ ||జేరి||

  • ధీరకలితుఁ డుప కారకుఁ డితఁ డని యారూఢిగ మదిఁ గోరి ప్రియమునఁ ||జేరి||

  • జనకుని యుగ్రం బును దా నోరిచి జనులకు మేలు నో సంగి ఘనునిఁ ||జేరి||

  • సార చరిత్రో దారుఁడు పాతక ధీరుఁడు శుద్ధా చారుండితఁడని ||జేరి||

  • దేవుని కొమరుఁడు ధీవిస్తారుఁడు సేవ కావనుఁడు క్షేమకరుండని ||జేరి||

  • యేసుని వారల నీశుఁడు మన్నన జేసి తప్పు క్షమ చేయునుగానఁ ||జేరి||

  • మరణము నొందిన నరులను గృపఁ గ్ర మ్మరఁ బ్రతికించిన మహిమోజ్వలునిఁ ||జేరి||

  • పలు దయ్యంబులఁ బారఁదరిమి రో గుల రక్షించిన మలినాపహునిఁ ||జేరి||

  • జను లచ్చెరు వొం దను మూఁగకు నో రును గన్నులు చీఁ కునకిడినాఁ డని ||చేరి||
  • 86 ఏమి నేను స 10/19/2017 20:16 86 ఏమి నేను సమర్పింతు యేసూ యెట్లు నిన్ను స్తుతియింతు ఏమి సమర్పింతు హీనుఁడ నగు నేను గామితార్థము లెల్ల గలుగఁజేయు నీకు ||నేమి||

  • నేను మార్గముఁ దప్పియుండఁగ నన్ను నీవు కంటివి కరుణ నిండఁగ దీనపాపులను దృఢముగఁ బ్రోవను దాన మిచ్చితివి తనర నీ ప్రాణము ||నేమి||

  • అందరి కొఱ కీవు తెచ్చిన మిగుల అందమైన నిత్య రక్షణ అంది నిన్ను వినతి పొందుగఁ జేసెద నొందు మా నా నుతి నుత్తమ ప్రభు క్రీస్తు ||ఏమి||

  • నీ యందే యానంద మొదఁగ యేసు నీదైన యాత్మ నాకందఁగ జేయు మంచు నీకుఁ జేసెదఁ బ్రార్థన నాయందు దయచేసి నా మనవి నాలించు ||మేమి||

  • నేను జేసిన యఘము లెల్లను గర్త నీ యెదుటఁ దలంచు కొందును నేను సిగ్గు నొంది నిజముగఁ గుందుచు నేను వేఁడుకొందు నీ క్షమాపణ కొరకు ||నేమి||

  • నన్ను నీవు స్థిరపరచుము కర్త యన్నిట నను బలపరుచుము తిన్నని మార్గమున దృఢముగ నేగుచు నిన్ను నే స్తుతియింతు నిండుగ నెల్లప్పు ||డేమి||
  • 87 సర్వ లోక స 10/19/2017 20:16 87 సర్వ లోక సం పూజ్యా నమోనమో సర్వ జ్ఞాన సంపూర్ణా నమోనమో సర్వ సత్య సారాంశా నమోనమో దేవా గావో ||

  • దీన భక్త మందారా నమోనమో దోష శక్తి సంహారా నమోనమో దేవా యేసావతార నమోనమో దేవా గావో ||

  • దేవలోక ప్రదీపా నమోనమో భావలోక ప్రతాపా నమోనమో పావనాత్మ స్వరూపా నమోనమో దేవా గావో ||

  • వేదవాక్యాదర్శ మీవె నమోనమో వేద జీవమార్గం బీవె నమోనమో వేదవాక్కును నీవే నమోనమో దేవా గావో ||

  • శాపగ్రహివైతివి నాకై నమోనమో ప్రాణత్యాగివైతివి. నాకై నమోనమో ప్రాయశ్చిత్తమైతివి నాకై నమోనమో దేవా గావో ||
  • 88 నమో యేసునా 10/19/2017 20:16 88 నమో యేసునాధా నాధా నమో జీవనాధా సమాన విరహిత సనాతనాత్మా సమున్నతోజ్వల ప్రశాంత ధామా ||నమో||

  • స్థావర జంగమ జగమందున నీ శక్తి స్వరూపము ప్రతిఫలింపగ భూ వలయాకాశంబుల మించుచు భువన పాలనముజేసెటి ప్రభువా ||నమో||

  • ధరణీ మానవ విమోచనార్థము కరుణను జీవము లొసగిన ప్రభువా పరమ కృపాభరితా మృతసారా వరసజ్జన హృదయాబ్జ విహారా ||నమో||

  • సుందర మలయజ గంధ ధూపముల చందముననుమా వినుతులు గొను మా వందే దేవ దయాసందీప వందే శుభదానంద స్వరూపా ||నమో||
  • 89 వందనమయ్యా 10/19/2017 20:16 89 వందనమయ్యా యేసు నీకు వందనమయ్యా మా కోరిక లందియ్య వయ్యా వందనమయ్య నీ సుందర పాదార విందములకు భక్తి వినతులు గావింతు సందియంబులులేని పరమానందమున నీయందు డెందము పొందుపడఁ జేయవె యెహోవా నందనా పాపేంధనాగ్ని ||వందనమయ్యా||

  • నర దైవత్వములు రెండుగూడి పరిపూర్ణమైన దేహాత్మలు ధరియించి యందు లేశంబయిన దురితంబులేని యవతారము నెరవుగా దాల్చి ధరణికి నేతెంచి నిరయార్హూలగు సర్వ నరుల రక్షింప నీ కరుణా ప్రవాహము విరివిగా పరుగెత్తఁ జేయుచు విమలమగు నీ ప్రాణరక్తము లరుదుగా సమర్పణము ,చేసియు తిరిగి లేచితివో మహా ప్రభూ ||వందనమయ్యా||

  • నీ పుణ్యమందు నమ్ముకొనెడి యే పాపియైన తక్షణమున శాపంబుఁ బాసి త్రాణగలిగి నీ సజ్జనుండు కృపవానిని కాపాడుచుండు దీపించు భవ దీయ దివ్య వాగ్దత్తంబు లాపత్పరంపరల కడ్డుపడుచు నుండి నీ వయిందన భారమెల్లను మోపి యోపికనుండ నేర్చిన పాపిపుణ్యండగుచు నాత్మను భవ్య సుఖ మఖిలంబుఁబడయును ||వందనమయ్యా||

  • శమదమ ప్రేమ కృపా వినయ సద్గుణములనెడి భూషణముల నిమిడియున్నట్టి తనువు దాల్చి క్రమముగానందు దైవత్వము కనుపఱచినావు విమలోపదేశముల్ వివిధంబుగా శిష్య సముదయమునకు నుత్తముగా బోధించి యమిత పాపహరంబునకు భువినవతరించిన మేను సిలువను శ్రమను మృతికల్పించి మృత్యువుఁజంపి జీవించిన మహాత్మా ||వందనమయ్యా||
  • 90 క్రీస్తునా 10/19/2017 20:16 90 క్రీస్తునాయక నీ దయాళిని కీర్తనలుగా బాడుదున్ నేస్తుతులతోఁ దండ్రి దేవుని నిత్యమును గొండాడుదున్ ||క్రీస్తు||

  • సిలువ మోసిన నీ ప్రయాసను జెప్పుటకు నోరాడదు అలుకునొందక స్వామి నీ ది వ్యాంఘ్రి చెంతను గూడుదు ||క్రీస్తు||

  • నిమిషమైన ంబాయకెదలో నిన్ను నే స్మరియింతును అమితమౌ దేవా ను క్రోశము హర్షముగ వర్ణింతును ||క్రీస్తు||

  • యేసుప్రభు నా కాలమంతయు నేమఱక నీ నామము దాసునిగ భజియంతు నిఁక నేఁ దప్పకుండను నీమము ||క్రీస్తు||

  • చచ్చి నే నరుదెంచి మోక్షము స్వామి నీ యుపకారముల్ హెచ్చు ప్రేమను బాడుచుందును యెప్పుడును గైవారముల్ ||క్రీస్తు||

  • మలినమౌ నా నత్తి నాల్క స మాధిలోఁ గృశియింపను బలిమితోనేఁ బాడుచుందును భక్తి యుజ్వలింపను ||క్రీస్తు||

  • కన్ను మూతలుగాను నీ సము ఖంబు కేను బిరాలను తెన్ను తప్పకవత్తు శ్రీకర దేవ నను నీవేలను ||క్రీస్తు||

  • ముగ్గురొకఁడై వెల్గుచుండెడి మోక్షరాజ్య గరిష్ఠుఁడా యొగ్గుచేయక నన్నుఁ బ్రోవవే యేసునాధ మహేశుఁడా ||క్రీస్తు||

  • భూతలములో నీ సమానముఁ బోల్చ నేదియుఁ గానము దాతవై మము సలుపవే నీ తండ్రికిని సంధానము ||క్రీస్తు||
  • 91 నా రక్షకా 10/19/2017 20:16 91 నా రక్షకా యేసునాధ ఇమ్మానుయేలు ఘోర పాపుల పాప భార విమోచక ||నా రక్షకా||

  • నిత్యకాలమునందు నిజమైన దేవుని సత్యవాక్యమై యున్న స్వామి నిన్నుతియింతు ||నా రక్షకా||

  • సర్వ లోకంబులను సత్యవాక్యమై యుండి నిర్వహించిన దేవుని నిజబాహువా స్తుతింతు ||నా రక్షకా||

  • దేవజనులకు సువార్త దెలుప నభిషేకంబు పూని నొందిన దేవపుత్రుడ నుతియింతు ||నా రక్షకా||

  • దేవ మహిమ ప్రకాశ దీనరక్షక మాను ష్యావతారము దాల్చి యావదాజ్ఞల దీర్చిన ||నా రక్షకా||

  • పావనాద్భుతుడవై పరమ జ్ఞానము దెల్పిన దేవస్వభావ ముద్ర దేదీప్యుడా స్తుతింతు ||నా రక్షకా||

  • పాపాత్ములను గావ శాపభారము క్రింద నోపికతో నిల్చి ప్రాపు జూపిన ప్రభువా ||నా రక్షకా||

  • ఈ వసుధను ప్రేమ నెసగునట్లుగ జూపి చావు గెల్చిన సర్వ సామర్థ్యుడా స్తుతింతు ||నా రక్షకా||

  • ఘన దేవుని కుడి పార్శ్వమున గూర్చుండి విజ్ఞప్తి నొనరించు నా యేసు వినయ స్తోత్రంబిదిగో ||నా రక్షకా||
  • 92 యేసు పదాంబ 10/19/2017 20:16 92 యేసు పదాంబుజ శరణం నర దోష మహాంబుధి హరణం యేసే మార్గము యేసే సత్యము యేసే జీవము యేసుకు శరణం||

  • దేవకుమారశరణం నర జీవప్రదాత శరణం దేవదేవ జగదావతారమము బ్రోవరావె ప్రభు నీవే శరణం ||

  • పాపవినాశక శరణం నర శాపవిమోచక శరణం పావనాత్మ భవదీయ ప్రాణమిడి ప్రాపువైతివో ప్రభువా శరణం

  • పరమపురుషుడా శరణం ఓ నిరుపమప్రేమడ శరణం మరణ మొంది మరి మృత్యుంజయుడై పరమున జరిగిన ప్రభువా శరణం||

  • నీతిపూర్ణమా శరణం జగ జ్యోతి రత్నమా శరణం జాతిభేదరాహిత్యుడ హితుడా నీతిప్రబోధక నీవే శరణం

  • తేజోమూర్తికి శరణం విభ్రాజిత కీర్తికి శరణం రాజరాజ యో భారత రాజ్య ప్రజాత్మ రక్షక ప్రభువా శరణం
  • 93 దేవాత్మ జయ 10/19/2017 20:16 93 దేవాత్మ జయో దీనదయాళూ పావనాత్మ మము బ్రోచితహో నీవే గదా మా నిజరక్షణకై జీవమీయ ధర జేరితహో||

  • సుగుణాత్ములలో సుగుణము నీవే నిగమము లెరుగని నీతివహో సుజనాత్ముల కిల సుజ్ఞానాత్మవు సవినయ భక్తికి సారమహో||

  • పేదలలో నిరు పేదవు నీవే సాధులలో ఘన సాధువహో మోదమలర మా ముక్తిని గూర్చిన సాధు పేదజన సోదరహో||

  • దీనాత్ములలో దీనుడవై భవదీయ దయారస ధారలహో దినదిన మొసగిన దేవాత్మజ యిమ్మాను యేలు వం దనములహో||

  • పరమ పూజ్యుడా పరిమిత ప్రేమాభరితుడ సంస్థవ పాత్రుడహో నిరతము నిన్నేమరక నుతిం చెద నరజన గణముల నేస్తడహో||
  • 94 సమానులెవరు 10/19/2017 20:16 94 సమానులెవరు ప్రభో నీ సమానులెవరు ప్రభో సమస్త మానవ శ్రమాను భవమున్ సహించి వహించి ప్రేమించగల నీ ||సమాను||

  • సమాన తత్వము సహోదరత్వము సమంజసము గాను మాకు దెలుప నీ ||సమాను||

  • పరార్ధమై భవ శరీర మొసగిన పరోపకారా నరావ తారా||సమాను||

  • దయా హృదయ యీ దురాత్ము లెల్లరిన్ నయాన భయాన దయాన బ్రోవ నీ ||సమాను||

  • ఓ పావనాత్ముడ ఓ పుణ్య శీలుడ పాపాత్ములను బ్రోవ పరమాత్మ సుతనీ ||సమాను||
  • 95 యేసు క్రీస 10/19/2017 20:16 95 యేసు క్రీస్తుఁడు నిత్య దేవుఁడు ఎఱిగి నమ్ముఁడి మనుజులారా మోస మొందక మోక్షపతికిఁక దాసులై బ్రతుకండి రండి ||యేసు||

  • ఆరు దినములలోపలనే యాకసము భూలోకములను ప్రాకటముగఁ జేసి నాఁడు ప్రకాశుఁడాయన ప్రజ్ఞవంతుఁడు ||యేసు||

  • ఆది పురుషుని యాదిస్త్రీనిఁక హస్తములతో నంటి చేసెను మేదినిన్ ఫలవనములో న సాధులై నివసింప నిచ్చెను ||యేసు||

  • వార లిద్దపు దేవునాజ్ఞను కోరికలతో మీరినప్పుడు గారడీ పిశాచ తంత్రము వారి పరమై పాపులైరి ||యేసు||

  • వీరలందఱు వారి సంతతి వేరెలేరీ ధరణిలో దు ష్యార్యులై దేవుని యాజ్ఞలు మీరి రందఱు నరక పాత్రులు ||యేసు||

  • ఇంత పాపభరితులై కా సంతసత్యము లేని నరుల నెంతగాఁ బ్రేమించెనో తన సొంత ప్రాణముఁ బలిగఁబెట్టెను ||యేసు||

  • పాపమించుకలేని కరుణా పావనుడు నరుఁడాయెను శాపగ్రస్తులమైన మన శాపములు తాఁజేతఁ బూనెను ||యేసు||

  • ఎన్నరాని బాధలొందుచు పుణ్యరక్తము జిందెనిలను ఎన్నఁడు నీలాటి ప్రేమ వన్నెలేదో యన్నలారా ||యేసు||

  • మనలఁ బాపమునుండి బాపను మనుజుఁడై మరణంబునొంది మన ప్రభువె మూఁడవ దినంబున మహినిలేచి పరము వెళ్లెను ||యేసు||
  • 96 దేవుని నీత 10/19/2017 20:16 96 దేవుని నీతి ప్రతాపం భువి యేసుని సిల్వ ప్రభావం దేవుల దేవుని అపురూపం భువి యేసుని నామ స్వరూపం దేవ యెహోవ సువాక్యం -సౌభాగ్యం దైవ జనుల హృదయానందం. ||యేసుక్రీస్తు దైవ సుతుండు యేసుక్రీస్తు మనుజసుతుండు యేసుక్రీస్తు దేవుండు యేసే ప్రభువు -స్తుతిపాత్రుడు||

  • ఆద్యంత రహిత కీర్తి అవతార శ్రమార్జన మూర్తి ఆకస రాసుల ఆదిపతి అవనీ సృజనాత్మ ప్రతీతి అఖిల ప్రపంచ ప్రదాత - అధినేత అనుదిన కృపాలిడు సుఖదాత.

  • పాపము భయపడు నామం పాపాత్ముడు కృపగను హోమం పతితుల వెదకిన ప్రేమస్వరం పరలోక సుఖాల విహారం పాప క్షమాపణ గానం - బహు అనవరతము నిజబలిదానం. [మానం

  • జనముల జీవాధిపతి జగమంతటి నేలెడిజ్యోతి జీవుల అంతిమ న్యాయపతి జీవాత్ములు క్రోలెడి నీతి జనన మరణ జయశీల - నరపాల జగతిని మార్చెడి శుభజ్వాల.
  • 97 శ్రీ రక్షక 10/19/2017 20:16 97 శ్రీ రక్షకుని నామము కీర్తించి కొల్వుఁడీ కిరీట ముంచి చాటుఁడి -శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!

  • పరేశుహత సైన్యమా మీ రాజు ఈయనే కిరీట ముంచి చాటుఁడి -శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!

  • నరులారా! మీ కోసము చావును నొందెను కిరీట ముంచి చాటుఁడి -శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!

  • సర్వ జనాంగములారా! శరణ్యుఁ డీయనే కిరీట ముంచి చాటుఁడి -శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!

  • పరంబునందు యేసుకుఁ కిరీట ముంచుచు హర్షంబుతోఁ గీర్తింతుము -శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!
  • 98 సుందర రక్ష 10/19/2017 20:16 98 సుందర రక్షకా! సృష్టియొక్క నాధా దేవమానవ పుత్రుఁడా నిన్నుఁ బ్రేమింతున్ సదా సేవింతున్ మదాత్మతోఁ గిరీటమా.

  • మైదాన మంతయుఁ పచ్చిక బయళ్లు నొప్పగఁ బూచుచున్నవి ఐనను యేసుతో నాయన కాంతిలో దుఃఖములేనివారము.

  • సూర్యుని కాంతియుఁ చంద్రుని శాంతియు ఎంతో శ్రేష్ఠమైయున్నవి. అట్లవి యున్న అన్నిటి కన్న యేసుని కాంతి గొప్పది.

  • ఆనంద రక్షకా! ప్రజల నాధుఁడా దేవమానవ పుత్రుఁడా మహిమ, ఘనత స్తుతి, యారాధన నిరంతరంబు నీకగున్.
  • 99 స్తుతి స్త 10/19/2017 20:16 99 స్తుతి స్తుతి సదయుఁడైన యేసు నూటి న్నీకుసృష్టి చెల్లించును నీతిమంతా నిఖిల దూతలు చేరి నీకే కీర్తి భక్తిఁజెల్లింతురు. చేతనుంచి పిల్లల నెల్లను యేసు మితిలేని ప్రేమను గాచును. ||స్తుతి స్తుతి సదయుఁడైన యేసు ఖ్యాతితో నీకెన్నఁడొనర్తుము||

  • స్తుతి స్తుతి సదయుఁడైన యేసు స్తోత్రముల్ మా స్వామికి చెల్లును ప్రీతిన్ మాకై మరణమొందుచు (యేసు ప్రేమఁ జూపి ప్రజలఁబ్రోచితే రాతి కోట వైతివి మాకు నీవు రక్షకుండ కరుణసాగరా.

  • ఆకాశంపు గవునులారా మీరు ఆనంద పాటలను పాడుఁడీ ప్రాకటంబౌ ప్రవక్త గురువు రాజు లోకాంతంబుల్ వెలుఁగ నేలును వీఁక తోడవేగ వచ్చును యేసు వాకంబెల్ల నదురునట్లుగాన్.
  • 100 పాపల్ హోసన 10/19/2017 20:16 100 పాపల్ హోసన్నా పాటల్ పాడిన రీతిగన్ నృపాలస్తుతి కీర్తుల్ నీకుఁ జెల్లింతుము దావీదు పుత్రకుండా యిశ్రాయేల్ పాలకా దేవుని పేర వచ్చు ధీరుండా ధన్యాత్మ.

  • దూత లాకాశమందు దొడ్డగఁ గొల్తురు భూతలమందు సృష్టి పూజించును నిన్ను హెబ్రీయుల్ ఖర్జూరంపు శాఖల్ చేఁబూనుచు హెచ్చించి మొక్కినట్లు నిను స్తోత్రింతుము.

  • నీ శ్రమలకు ముందు, నిన్ గౌరవించిరి నీ జయమొందువెన్న మా కీర్తన స్తుతి అవ్వారి స్తుతుల్ నీవు అంగీకరించితి మా కీర్తంబుగూడ మన్నన జేయుమీ.
  • 101 నా యాత్మ న 10/19/2017 20:16 101 నా యాత్మ నీలో మేల్కొని దయాళుని కీర్తింపుము ప్రియంబుతో నీరక్షకున్ ప్రపూర్ణ ప్రేమబాడుము.

  • నే పాపమందుఁ గూలగన్ కాపాడి నన్ను లేపెనే నా పాలి పుణ్యరక్షకున్ ప్రపూర్ణ ప్రేమఁ బాడుము.

  • ఏ పాటి శత్రువైనను ఏపాట్లు పెట్టలే రిఁకన్ నాపుణ్య మార్గదర్శకున్ ప్రపూర్ణ ప్రేమఁబాడుము.
  • 102 మమున్ సృజి 10/19/2017 20:16 102 మమున్ సృజించిన దేవుండు ప్రాణము నొసంగి యెప్పుడు కాపాడు మమ్మును సంతోష స్వర మెత్తుచు స్తుతించుచుండుఁడాయనన్.

  • పలువిధాలుగ బాధించు రోగముల్ పోఁగొట్టి మీఁదకు రాకుండఁ జేసెను సంతోష స్వర మెత్తుచు స్తుతించుచుండుఁ డాయనన్.

  • దేవుండు మాత్రమే రక్షణ మార్గము ఆయత్తపఱచి చూపించె మాకును సంతోష స్వర మెత్తుచు స్తుతించుచుండుఁ డాయనన్.

  • మా నిత్యబాధలు వారించుకొరకుఁ దా సొంత పుత్రుని పంపెన్ సుప్రేమతో సంతోష స్వర మెత్తుచు స్తుతించుచుండుఁ డాయనన్.

  • ఆనంద మొందుఁడి శ్రీ యేసు మోక్షము స్వసేవకాళికి అనుగ్రహించును సంతోష స్వర మెత్తుచు స్తుతించుచుండుఁ డాయనన్.
  • 103 నమస్కరింప 10/19/2017 20:16 103 నమస్కరింప రండి దావీదు పుత్రుని శ్రీ యేసు రక్షకుండు ఏతెంచె భూమికి న్యాయంబు లోకమందు స్థాపించి నిత్యము అన్యాయ మంతఁ దాను పోఁగొట్టవచ్చెను.

  • వర్షంబు పడునట్లు శుష్కించు నేలను దుఃఖించు వారి కెల్ల హర్షంబు నిచ్చును శ్రీ యేసు రాజ్యమందు సద్భక్తులందఱు ఖర్జూర వృక్ష రీతిన్ వర్ధిల్లుచుందురు.

  • దిగంతవాసు లైన భూరాజు లందఱు శ్రీ యేసు చరణంబుల్ నమస్కరింతురు భూలోకవాసులైన జనంబు లందఱు క్రీస్తు స్వాధీనమందు జీవింతు రెప్పుడు.

  • విరోధులైన వారిన్ జయింప నెన్నఁడున్ సింహాసనంబుమీఁద ఆసీనుఁడగును అత్యంత ప్రేమమూర్తి శ్రీ యేసు ప్రభువు ఆ దివ్య నామకీర్తి వ్యాపించు నీ భువిన్.
  • 104 వినరే యో న 10/19/2017 20:16 104 వినరే యో నరులారా వీనుల కింపు మీర మనల అక్షింప క్రీస్తు మనుజావతారుఁ డయ్యొ వినరే అనుదినమును దే వుని తనయుని పద వనజంబులు మన మున నిడికొనుచును ||వినరే||

  • నరరూపుఁ బూని ఘోర నరకుల రారమ్మని దురితముఁ బాపు దొడ్డ దొరయో మరియా వరపుత్రుఁడు కర మరు దగు క ల్వరి గిరి దరి కరి గి రయంబున ప్రభు కరుణను గనరే ||వినరే||

  • ఆనందమైన మోక్ష మందరి కియ్య దీక్ష బూని తనమేని సిలువ మ్రాను నణఁచి మృతిఁ బొందెను దీన దయా పరుఁ డైన మహాత్ముఁడు జానుగ యాగము సలిపిన తెరంగిది ||వినరే||

  • పొందుఁగోరిన వారి విందా పరమోపకారి యెంద రెందరిఁ బరమా నందపద మొందఁగఁ జేసెను అందమునన్ దన బొంది సురక్తము జిందెను భక్తుల డెందము గుందఁగ ||వినరే||

  • ఇల మాయావాదుల మాని యితఁడే సద్గురు డని తలపోసి చూచి మతి ని శ్చల భక్తిని గొలిచిన వారికి నిల జనులకు గలు ములనలరెడు ధని కుల కందని సుఖ ములు మరి యొసఁగును ||వినరే||

  • దురితము లణఁప వచ్చి మరణమై తిరిగి లేచి నిరత మోక్షానంద సుం దర మందిరమున కరుదుగఁ జనె బిరబిర మన మం దర మా కరుణా శరనిధి చరణ మె శరణని పోదము ||వినరే||
  • 105 రారె గొల్ల 10/19/2017 20:16 105 రారె గొల్లవారలారా నేటి రాత్రి బేత్లెహేము నూర జేరి మోక్షదూత కోరి దెల్పెను క్రీస్తు వారి జాడకన్ను లారా జూతము వేగ ||రారె||

  • పుట్టు చావులు లేనివాడఁట పసుల తొట్టిలోపలఁ బుట్టెనేడఁట ఎట్టి వారలను జే పట్టి పాపము లూడఁ గొట్టి మోక్షపుత్రోవఁ బెట్టు వాడట వేగ ||రారె||

  • బహుకాలమాయెను వింటిమి నేడు మహికివచ్చుట కనుగొంటిమి విహితముతోడ సేవించి వత్తము మోక్ష మహితుని గని దుఃఖ రహితులమవుదము. ||రారె||
  • 106 వచ్చిగాబ్ర 10/19/2017 20:16 106 వచ్చిగాబ్రియేలు పల్కెను మరియ మచ్చకంటిడెంద ముల్కెను హెచ్చైన శుభముల నెనలేని కృప దేవుఁ డిచ్చి యింతులలోని న్నెచ్చు జేయునటంచు ||వచ్చి||

  • భయ మాత్మలో వీడు కన్యకా నీవు దయబొంది యున్నవు ధన్యగా రయముగ నిదిగోగ ర్భముఁ దాల్చెదవు పుత్రో దయమౌ యేసను పేర తని కిడు మంచును ||వచ్చి||

  • అతఁడెన్నఁబడును మహాత్ముడై సర్వో న్నతుఁడైన దైవకుమారుఁడై హిత మొప్పు దేవుండు న్నతిఁ జేసి దావీదు వితత సింహాసన మతని కిచ్చునంచు ||వచ్చి||

  • ఘనతరుఁడగు వాని రాజ్యము అంత మొనగూడ దది నిత్యపూజ్యము వనితమగు యాకోబు వంశ మెల్లపు డేలు కొను నాతఁ డనుంచుఁ దె ల్పెను దూత మరియతో ||వచ్చి||
  • 107 ఉదయించినాఁ 10/19/2017 20:16 107 ఉదయించినాఁడు క్రీస్తుఁడు నేఁడు ఉదయించినాఁడు విదితయౌ మరియ నందనుఁడై యిమ్మానుయేల్ సదయుఁడై చెడియున్న పృథివికి నొదవ సమ్మద మల పిశాచికి మద మణంగను సాధు జనముల హృదయముల ముద మెదుగునట్లుగ ||నుదయించి||

  • ఏ విభునివలన నీ జగ మయ్యె నా విభుఁ డీయిలను దైవత్వమగు మను ష్యావతారముఁ దాల్చె జీవులకు జీవనముపై తగ దేవుఁడును దా నొక్కఁడు చిర జీవియగు ప్రభు పాపి జీవులఁ గావఁ దనుఁ జావునకు నొడఁబడి ||యుదయించి||

  • యూదుల నడుమన్ బెక్కగు భేదా భేదముల్ బొడమన్ వాదించి ప్రభు రాకఁ గాదంచు మది నెంచి మీదుఁ జూడని వారి కారుండ వారుండై స్వీయ జనులకు మెదమగు రొత్తంగ మద్ఘనుఁ డౌ దయాళుఁడు ప్రాణ మీడుటకు ||నుదయించి||
  • 108 కొనియాడఁ ద 10/19/2017 20:16 108 కొనియాడఁ దరమె నిన్ను కోమల హృదయ కొనియాడఁ దరమె నిన్ను తనరారు దినకరుఁ బెనుతారలను మించు ఘనతేజమున నొప్పు కాంతిమంతుఁడ వీవు ||కొనియాడ||

  • ఖెరుబులు సెరుపులు మరి దూతగణములు నురుతరంబుగఁ గొలువ నొప్పు శ్రేష్ఠుఁడ వీవు ||కొనియాడ||

  • సర్వలోకంబులఁ బర్వు దేవుఁడ వయ్యు నుర్వి స్త్రీ గర్భాన నుద్భవించితి వీవు ||కొనియాడ||

  • విశ్వమంతయు నేలు వీరాసనుఁడ వయ్యుఁ పశ్వాళితోఁ దొట్టిఁ పండియుంటివి నీవు ||కొనియాడ||

  • దోసంబులను మడియు దాసాళిఁ గరుణించి యేసు పేరున జగతి కేగుదెంచితి నీవు ||కొనియాడ||

  • నరులయందునఁ గరుణ ధర సమాధానంబు చీకాలమును మహిమ పరఁగఁ జేయుదు వీవు ||కొనియాడ||

  • ఓ యేసు పాన్పుగ నా యాత్మఁ జేకొని శ్రేయముగ బవళించు శ్రీకర వరసుత ||కొనియాడ||
  • 109 చింత లేదిఁ 10/19/2017 20:16 109 చింత లేదిఁక యేసు పుట్టెను వింతగను బేత్లెహేమందునఁ చెంత జేరను రండి సర్వజనాంగమా సంతస మొందుమా ||చింత||

  • దూత తెల్పెను గొల్లలకు శుభ వార్త నా దివసంబు వింతగా ఖ్యాతి మీరఁగ వారు యేసును గాంచిరి స్తుతు లొనరించిరి ||చింత||

  • చుక్కఁ గనుగొని జ్ఞాను లెంతో మక్కువతో నా ప్రభుని గను గొన చక్కఁగా బెత్లెముపురమున జొచ్చిరి కానుక లిచ్చిరి ||చింత||

  • కన్యగర్భమునందుఁ బుట్టెను కరుణగల రక్షకుఁడు క్రీస్తుఁడు ధన్యులగుటకు రండి వేగమె దీనులై సర్వమాన్యులై ||చింత||

  • పాప మెల్లను పరిహరింపను పరమ రక్షకుఁ డవతరించెను దాపుఁ జేరిన వారి కిడుఁ గడు భాగ్యము మోక్షభాగ్యము ||చింత||
  • 110 పుట్టె యేస 10/19/2017 20:16 110 పుట్టె యేసుఁడు నేఁడు మనకు పుణ్యమార్గము జూపను పట్టి యయ్యెఁ బరమ గురుఁడు ప్రాయశ్చిత్తుఁడు యేసుడు ||పుట్టె||

  • ధరఁ బిశాచిని వేఁడిన దు ర్నరులఁ బ్రొచుటకై యా పరమవాసి పాపహరుఁడు వరభక్త జన పోషుఁడు ||పుట్టె||

  • యూద దేశములోను బేత్లె హేమను గ్రామమున నాదరింప నుద్భవించె నధములమైన మనలఁ ||బుట్టె||

  • తూర్పు జ్ఞానులు కొందఱు పూర్వ దిక్కు చుక్కను గాంచి సర్వోన్నతుని మరియు కొమరుని కర్పణము లిచ్చిరి ||పుట్టె||
  • 111 ఱేఁడు మెస్ 10/19/2017 20:16 111 ఱేఁడు మెస్సీయ జన్మించెను శ్రీదా వీదు పురమున నుద్భువించెను వేడుకతోడను బాడుఁడి పాటలు రూఢిగ సాతాను కాడిని దొలఁగింప ||ఱేఁడు||

  • మనకొఱకై శిశువు పుట్టెను అతఁడు మన దోషములను బోగొట్టెను అనయంబు నతనిమీఁ దను రాజ్యపు భార ము నుంచఁబడె విమో చనకర్త యితఁ డౌను ||ఱేఁడు||

  • పరలోక సైన్యంబు గూడెను మన వర శిశువును గూర్చి పాడెను నరులయందున గరుణ ధర సమాధానంబు చిర దేవునికి బహు మహిమ యటంచును ||ఱేఁడు||

  • కొమ్మ యెష్షయినుండి పుట్టెను చిగురు క్రమ్మర మొద్దున బుట్టెను కమ్మొను దేవుని యా త్మమ్మును తెలివి జ్ఞా న మ్మలోచన మహ త్వ మ్మొక్కుమ్మడినాతని ||ఱేఁడు||

  • సర్వశక్తి గల దేవుఁడు మరియు నుర్వియందు దయాస్వభావుఁడు సర్వమహిమము గల్గు స్వర్గ లోకము వదలి గర్వముతో నిండిన సర్వంసహా స్థలిపై ||ఱేఁడు||

  • వింతైన వాఁడుగ నుండెను కోరినంత సుందరత లేకుండెను చింతతోడను మాయా సంగతులగు వారి యంతములేనట్టి యాపదను వీక్షించి ||ఱే ఁడు||

  • చెదరిన గొఱ్ఱెల వెదకును వాని ముదమున మందలోఁ జేర్చును సదయత యేసుండు జనితైక సుతుఁడు భా స్వదధిక విభుఁడాలో చన కర్త జన్మించె ||ఱేఁడు||

  • అక్షయుండగు యేసు వచ్చెను మన రక్షణమ్మును సిద్ధపర్చెను మోక్షము సరుణా క టాక్షమ్ముతో నియ్య నీక్షితియందున హెబ్రీ వంశమునందు ||ఱేఁడు||
  • 112 రక్షకుండుద 10/19/2017 20:16 112 రక్షకుండుదయించ్నాఁడఁట మనకొరకుఁబరమ రక్షకుం డుదయించి నాఁడఁట రక్షకుం డుదయించినాఁడు రారె గొల్లబోయలార తక్షణమునఁ బోయి మన ని రీక్షణ ఫల మొందుదము ||రక్షకుండు||

  • దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాఁడు దేవుఁడగు యెహోవా మన దిక్కుఁ దేరి చూచినాఁడు ||రక్షకుండు||

  • గగనమునుండి డిగ్గి ఘనుఁడు గబ్రియేలు దూత తగినట్టు చెప్పె వారికి మిగుల సంతోషవార్త ||రక్షకుండు||

  • వర్తమానము జెప్పి దూత వైభవమున పోవుచున్నాఁడు కర్తను జూచిన వెనుక కాంతుము విశ్రమం బప్పుడు ||రక్షకుండు||

  • పశువుల తొట్టిలోన భాసిల్లు వస్త్రములజుట్టి శిశువును గనుగొందురని శీఘ్రముగను దూత తెల్పె ||రక్షకుండు||

  • అనుచు గొల్ల లొకరి కొక రానవాలు జెప్పుకొనుచు అనుమతించి కడకుఁ క్రీస్తు నందరికినీ దెల్పినారు ||రక్షకుండు||
  • 113 సంతోషించుఁ 10/19/2017 20:16 113 సంతోషించుఁడి యందరు నాతో సంతోషించుఁడి యొక వింతయగు కీర్తనఁ బాడ వచ్చితిని సంతోషించుఁడి నాతో ||సంతో||

  • అంధకార మయమైన భూమి నా ద్యంతము వెలిఁగింప దాని యా వేశముఁ దొలఁగింప వందితుండు క్రీస్తేసు నాధుఁడు వచ్చెఁ బ్రకాశుండై భూమికి నిచ్చె ప్రకాశంబు ||సంతో||

  • కాన నంధకారంబు దొలఁగఁ ప్ర కాశించెను లెండు మీరు ప్ర కాశింపను రండు మానవులను సంతోషపర్చనై మహిని నవతరించె భక్తుల మనము సంతసించె ||సంతో||

  • మిన్ను నుండి సంతోషోదయము మిగుల ప్రకాశించె హృదయములఁ దగులఁ ప్రకాశించె మున్ను జేయఁబడిన వాగ్ధత్తము తిన్నగ నెరవేరె భక్తుల కన్ను లాస దీరె ||సంతో||

  • ప్రీతియైన నీ పండుగ గూర్చి నూతన కీర్తనను గలసికొని నాతోఁ పాడుచును నీ తరి దూరస్థుల కీ వార్తను నే తీరును నైనఁ దెలుపఁగ నాతురపడవలెను ||సంతో||

  • పాపులపై దేవునికిఁ గలిగిన ప్రబలమైన దయను లోకమునఁ జూపింపఁ గవలెను జూపకపోయిన లోపము మనపై మోపఁబడును నిజము వేగము జూపుద మా పథము ||సంతో||
  • 114 జ్ఞాను లార 10/19/2017 20:16 114 జ్ఞాను లారాధించిరి యేసు ప్రభునిఁ బూని పాపులఁ బ్రోవ మెనిఁ దాల్చిన తరి ||జ్ఞాను||

  • చాల కాలము నుండి మేలు వార్త నాసక్తి నాలకించి నక్షత్ర కాల చిహ్నముఁ గూడి మేలు మేలని మ మ్మేలు వాఁడని మంచి బోళము సాంబ్రాణి వేసి ||జ్ఞాను||

  • దూర మనక యాత్ర భార మనక బయలు దేరి సంతోషముతోఁ జేరి మేలిమి బం గార మిచ్చిరి మన సార మెచ్చిరి జో హారు జోహారటంచు ||జ్ఞాను||

  • ఈ దివసంబున బేత్లెహేమను నూర యూదుల రాజుగాఁ బాదుకొన్నయేసు నాధ స్వామిని స మ్మోద మిమ్మని య య్యూదజనుల మధ్య ||జ్ఞాను||

  • ఈ సమయము మన మా సమయంబుగఁ జేసి స్తుతింపను జేరితి మిచ్చోట భాసురంబగు శ్రీ యేసు నాధుని హృద యాసనంబునఁ జేర్చి ||జ్ఞాను||
  • 115 గీతములు పా 10/19/2017 20:16 115 గీతములు పాడుఁడీ యేసునికి సం గీతములు పాడుఁడీ పాతకుల మగు మనల దారుణ పాతకము తన విమలరక్త స్నాతులనుగాఁ జేసి పాపను భాతకులలో నవతరించెను ||గీతములు||

  • రాజులకు రాజుగా నేలుచు మోక్ష రాజ్యమున కర్తగా బూజలందుచు దూత పరిగణ పూజితుండౌ ఘనుఁడు తన దగు తేజ మెల్లను విడిచి యీయిలఁ దేజహీనులలోనఁ బుట్టెను ||గీతములు||

  • దాసులగు వారలన్ దమ పటు దోష త్రాస విముక్తులన్ జేసి వారల నెల్ల మోక్ష ని వాసులుగఁ జేయంగ రక్తముఁ బోసి కృపచేఁగావ వచ్చెను యేసు నాధుఁడు దీన వృత్తిని ||గీతములు||

  • మానవుల కెల్లను దేవుని ప్రేమ మానుగాఁ జూపను మ్రానిపై దన రక్త మొసఁగఁగ మానవుండై పుట్టె యూదుల లోన యేసను పేరుచేఁదా దీనుఁడై యిమ్మానుయేలు ||గీతములు||

  • ఆదిఁ దన వాక్యము నందున యేసు మోదమున్ నిట్లనెన మేదినిందా మనుజుఁడై యిఁక సాదరమ్మునఁ బ్రోవ మనుజుల నా దయాళుఁడు తనదు దేహము సాధుగా నర్పింతు ననుచును ||గీతములు||
  • 116 రారె చూతుమ 10/19/2017 20:16 116 రారె చూతుము రాజసుతుడీ రేయి జనన మాయెను రాజులకు రా రాజు మెస్సియ రాజితంబగు తేజమదిగో ||రారె||

  • దూత గణములన్ దేరి చూడరే దైవ వాక్కులన్ దెల్పగా దేవుడే మన దీనరూపున ధరణి కరిగెనీ దినమున ||రారె||

  • కల్లగాదిది కలయు గాదిది గొల్ల బోయల దర్శనం తెల్లగానదె తేజరిల్లెడి తారగాంచరె త్వరగ రారే ||రారె||

  • బాలు డడుగో వేల సూర్యుల బోలు సద్గుణ శీలుడు బాల బాలికా బాలవృద్ధుల నేల గల్గిన నాధుడు ||రారె||

  • యూద వంశము ను ద్ధరింప దా వీదుపురమున నుద్భవించె సదమలంబగు మదిని గొల్చిన సర్వ జనులకు సార్వభౌముడు ||రారె||
  • 117 యేసునాధుని 10/19/2017 20:16 117 యేసునాధుని యోధులందరు వాసిగ నిటరండు వేగమె వాసిగ నిటరండు భాసురముగ ప్రభు జన్మము బాడుచు నాసతోడ రండు వేగమె యాసతోడ రండు ||జే జయం||

  • దూతలమాదిరి గాత్రము లెత్తుచు గీతము బాడుండి వేగము గీతము బాడుండి దాతయౌ మన క్రీస్తుని నీతిని ఖ్యాతిగ బలుకుండి వేగమె ఖ్యాతిగ బలుకుండి ||జే జయం||

  • గొల్లల ప్రభు కడకేగిన రీతిని నెల్లరు నడువుండి వేగమె యెల్లరు నడువుండి ఉల్లములందున సంతసించి ప్రభు నెల్లెడ దెలుపుండి వేగమె యెల్లడ దెలుపుండి ||జే జయం||

  • జ్ఞానుల భంగిని మానవులందరు కానుక లియ్యుండి వేగమె కానుక లియ్యుండి మానవకోటికి రక్షణ భాగ్యము దానము బొందుండి వేగమె దానము బొందుండి ||జే జయం||

  • మరియ రీతిగను మనసు లోపలను మురియుచు నుండుండి వేగమె కానుక లియ్యుండి మానవకోటికి రక్షణ భాగ్యము దానము బొందుండి వేగమె దానము బొందుండి ||జే జయం||

  • జయజయ శబ్దము జేయుచు ప్రభునకు జయమని పాడుండి వేగమె జయమని పాడుండి జయజయ మంచును జయ శబ్ధముతో జయముల నొందుండి వేగమె జయముల నొందుండి ||జే జయం||
  • 118 మేము వెళ్ల 10/19/2017 20:16 118 మేము వెళ్లిచూచినాము స్వామి యేసుక్రీస్తును ప్రేమ మ్రొక్కి వచ్చినాము మా మనంబులలరగ ||మేము||

  • బేదలేము పురములోన బీద కన్యమరియకుఁ బేదగా సురూపుఁ దాల్చి వెలసెఁ బశులపాకలో ||మేము||

  • జ్ఞానులమని గర్వపడక దీనులమై నిత్యము వాని ప్రేమ సకల ప్రజకు మానక ప్రకటింతుము ||మేము||

  • తద్దరిశనమందు మాకుఁ బెద్ద మేలు గలిగెగా హద్దులేని పాపమంత రద్దుపరచబడెనుగా ||మేము||

  • మరణమెపుడొ రేపొమాపో మరియెపుడో మన మెరుగము త్వరగా పోయి పరమగురుని దరిశనంబుఁ జేతము ||మేము||

  • హరిశుద్ధాత్మ జన్మ మాకు వరముగా నొసంగెను పరమపురము మాకు హక్కు పంచెదాను నిరతము ||మేము||

  • మాకు సర్వగర్వమణిగి మంచి మార్గమబ్బెను మాకు నీ సువార్తఁ జెప్ప మక్కువెంతోఁ గలిగెను ||మేము||
  • 119 లోకమంతట వె 10/19/2017 20:16 119 లోకమంతట వెలుగు ప్రకాశించెను యేసు జన్మించినపుడు ఆకాశమునందు గొప్ప నక్షత్రంబు బుట్టెనపుడు లోకజ్ఞానులు గొల్లలు వెళ్లి లోక రక్షకుడేసుకు మ్రొక్కిరి ||లో||

  • నేను వెలుగై చీకటిలో వెలుగుచున్నాను చీకటి దాని గ్రహింప లేదు నేను లోకమునకు వెలుగై యున్నాను నను వెంబడించు వాడు చీకటిలో నడువక జీవపువెలుగై యుండుడనె యేసు ||లో||

  • ఆ పట్టణములో వెలుగుటకు సూర్యుడైనను చంద్రుడైన నక్కరలేదు ఆ పట్టణములో దేవుని మహిమయే ప్రకాశించుచున్నది యెపుడు ఆ పట్టణమునకు దేవుని గొఱ్ఱెపిల్లయే దీపమై వెలుగుచుండు ||లో||

  • మీరు లోకమునకు వెలుగై యున్నారు గనుక మీరు వెలుగు సంబంధులు మీరు కొండపైన కట్టబడిన పట్టణంబువలెనే మరుగై యుండక నరులందరికి వెలుగై యుందురనె యేసుండు ||లో||

  • చీకటిలో నడుచుజనులు గొప్ప వెలుగును చూచిరి ధన్యులై లోక మందు మరణచ్ఛాయగల దేశనివాసుల మీద ప్రకాశించెను గొప్ప వెలుగును ప్రభువు యేసుకు జేయని పాడరే ||లో||
  • 120 చూడరే మాఱే 10/19/2017 20:16 120 చూడరే మాఱేఁడు పుట్టి నాఁడు బెత్లెహేములో నేఁడీ భూమి వాసులకు నిండు రక్షణబ్బెను ||చూడరే||

  • ఎన్నరాని దేవ దీప్తి మున్ను మిన్ను గ్రమ్మెను పన్నుగా రేయెండ కాంతి కన్ననది మించెను ||చూడరే||

  • దూత తెల్పె వ్రేల కొక ప్రీతియగు ముచ్చటన్ ఖ్యాతిగ దావీదు పురిని కర్తయేసు పుట్టుటన్ ||చూడరే||

  • తూరుపున జ్ఞానులొక్క తార దివిని గాంచిరి వారు వీరు వచ్చి సేవ వరుసగాను జేసిరి ||చూడరే||

  • మక్కువతో మనమెల్ల మ్రొక్కి సేవఁ జేతుము మిక్కుటముగ మనకు శాంతిఁ గ్రక్కున నొసంగును ||చూడరే||
  • 121 శ్రీ యేసుం 10/19/2017 20:16 121 శ్రీ యేసుండు జన్మించె రేయిలో నేఁడు పాయక బెత్లెహేమ యూరిలో ||శ్రీ యేసుండు||

  • కన్నియ మరియమ్మ గర్భమందున ని మ్మాను యేలనెడి నామమందున ||శ్రీ యేసుండు||

  • సత్ర మందునఁ బశువుల సాలయందున దేవ పుత్రుండు మనుజుం డాయెనందున ||శ్రీ యేసుండు||

  • పట్టి పొత్తిగుడ్డలతోఁ జుట్టఁబడి పసుల తొట్టిలోఁ బరుండబెట్టఁబడి ||శ్రీ యేసుండు||

  • గొల్లలెల్లరు మిగుల భీతిల్లఁగ దెల్పె గొప్ప వార్త దూత చల్లఁగ ||శ్రీ యేసుండు||

  • మన కొఱకొక్క శిశువు పుట్టెను ధరను మన దోషములఁ బోఁగొట్టను ||శ్రీ యేసుండు||

  • పరలోకపు సైన్యంబుఁ గూడెను మింట వర రక్షకుని గూర్చి పాడెను ||శ్రీ యేసుండు||

  • అక్షయుండగు యేసు వచ్చెను మనకు రక్షణంబు సిద్ధపర్చెను ||శ్రీ యేసుండు||
  • 122 లాలిలాలి ల 10/19/2017 20:16 122 లాలిలాలి లాలి లాలమ్మ లాలీ లాలియని పాడరే బాలయేసునకు ||లాలి||

  • పరలోక దేవుని తనయుఁడో యమ్మా పుడమిపై బాలుఁడుఁగఁ బుట్టెనో యమ్మా ||లాలి||

  • ఇహ పరాదుల కర్త యీతఁడో యమ్మ మహి పాలనముఁ జేయు మహితుఁడో యమ్మా ||లాలి||

  • ఆద్యంతములు లేని దేవుఁడో యమ్మా ఆదాము దోషమున కడ్డు పడె నమ్మా ||లాలి||

  • యూదులకు రాజుగాఁబుట్టెనో యమ్మా యూదు లాతని తోడ వాదించి రమ్మా ||లాలి||

  • నరగొఱ్ఱెల మంద కాపరో యమ్మా గొరియల ప్రాణంబు క్రీస్తు తానమ్మా ||లాలి||
  • 123 ఇశ్రాయేలీయ 10/19/2017 20:16 123 ఇశ్రాయేలీయుల దేవుండే యెంతో స్తుతి నొందును గాక యాశ్రితువౌ తన జనులకు దర్శన మాత్మ విమోచన కలిగించె ||నిశ్రా||

  • తన దాసుఁడు దావీదు గృహంబున ఘన రక్షణ శృంగము నిచ్చె మన శత్రువు లగు ద్వేషులనుండియు మనలన్ బాపి రక్షణ నిచ్చె ||నిశ్రా||

  • దీనిని గూర్చి ప్రవక్తల నోట దేవుఁడు పలికించెను దొల్లి మానవ మన పితరులఁ గరుణింపఁగ మహిలోన నిబంధనఁ జేసె ||నిశ్రా||

  • జనకుం దగు నబ్రాహాముతోఁ జేసిన యా ప్రమాణముఁ దలఁచి మనము విరోధులనుండి విమోచన గని నిర్భయులమై మెలఁగ ||నిశ్రా||

  • ఆయన సన్నిధానమునందు నతి శుద్ధిగ నీతిగ నుండఁ పాయక తన సేవను నిత్యంబును జేయఁగ నీ రక్షణ నిచ్చె ||నిశ్రా||

  • ధర నో శిశువా దేవుని దీర్ఘ దర్శి వనెడు పేరొందెదవు పరమేశ్వరుని వాత్సల్యతతోఁ పాపవిముక్తిఁ బ్రజ లొంద ||నిశ్రా||

  • మానుగ రక్షణ జ్ఞాన మొసంగఁగ మార్గము సిద్ధపరచుటకై దీన మనస్సుతోఁ బ్రభునకు ముందు గా నడిచెదవు భయభక్తి ||నిశ్రా||

  • మరియును సమాధాన సరణిలో మన మీఁక నడువఁ జీఁకటిలో మరణచ్ఛాయలో నుండిన వారికి నరుణోదయ దర్శన మిచ్చె ||నిశ్రా||

  • జనక పుత్రాత్మ దేవుని కిలలో ఘనత మహిమ కల్గును గాక మును పిపు డెప్పుడు తనరి నట్లు యుగ ములకును దనరారునుగా కామేన్ ||నిశ్రా||
  • 124 నాదు ప్రాణ 10/19/2017 20:16 124 నాదు ప్రాణము ప్రభుని మిగుల ఘ నంబు చేయుచున్నది నాదు నాత్మ దేవునం దా నం మొందెను నిరతము ||నాదు||

  • దేవుఁడు తన భృత్యురాలి దీనస్థితి లక్షించెను ఈ వసుంధరఁ దరము లన్నిఁక నెన్ను నను శుభవతి యని ||నాదు||

  • సర్వ శక్తుఁడు మహాకృత్యము సంభవింపఁ జేసెను ఉర్విలో నా ప్రభుని నామం బోప్పు బరిశుద్ధంబుగా ||నాదు||

  • భయము భక్తియుఁ గల్గి దేవుని భజనఁ జేసెడి వారికి నయముగాఁ దన కృప నొసంగు న నయమును దరతరములు ||నాదు||

  • విదిత బాహువు చేత శౌర్యము విభుఁడు కనపర్చెను హృదయపుఁ దలఁపులను గర్వులఁ జెదరఁ గొట్టెను నిజముగ ||నాదు||

  • ఆసనాసీనులై యున్న యతిశయాత్ములన్ బడఁ ద్రోసి దేవుఁడు దీనులను సిం హాసనంబుల నునిచెను ||నాదు||

  • క్షుధితులను దన మధురములచేఁ గోరి తృప్తి పర్చెను అధిక ధనవంతులను రిక్త హస్తములతో ననిపెను ||నాదు||

  • ఆది పితరులైన యబ్రా హాము కతని సంతున కద్వితీయుఁ డాదిలోక నాన తిచ్చినట్లుగా ||నాదు||

  • నిరతమును దన కరుణఁ జూప నిజముగా మది నెంచెను వరదుఁ డిశ్రాయేలునకుఁ దన వర సహాయ మొనర్చెను ||నాదు||

  • పరమ తండ్రికి దైవ సుతునకు పావనాత్మకు నిఁక నిహ పరమ లందును యుగయుగంబులఁ బరఁగు మహిమ మామేన్ ||నాదు||
  • 125 నీ సమాధానమ 10/19/2017 20:16 125 నీ సమాధానము దాసుని కిప్పుడు నాధా దేవా యిచ్చి నీ మాటచొప్పున పోనిచ్చుచున్నావు నాధా దేవా ||నీ సమాధానము||

  • అన్యులకు నిన్ను బయలు పరచెడి వెలుగుఁగాను నీకు నణఁగు ప్రజలైన యిశ్రాయేల్ వారికి మహిమ గాను ||నీ సమాధానము||

  • నరులకై నీవు ఏ ర్పరచిన రక్షణన్ నాధా దేవా యిదిగో నాకనులు చూచి యా నందించుచున్నవి నాధా దేవా ||నీ సమాధానము||

  • తండ్రికి సుతునికిఁ బరిశుద్ధాత్మకును గలుగుగాక మహిమ తరుగక సదాకాలము యుగయుగములకును గలుగు నామేన్ ||నీ సమాధానము||
  • 126 ఓ సద్భక్తు 10/19/2017 20:16 126 ఓ సద్భక్తులారా ! లోకరక్షకుండు బెత్లెహేమందు నేఁడు జన్మించెన్ రాజాధిరాజు ప్రభువైన యేసు నమస్కరింప రండి నమస్కరింప రండి. నమస్కరింప రండి యుత్సాహముతో.

  • సర్వేశ్వరుండు నరరూప మెత్తి కన్యకుఁ బుట్టి నేఁడు వేంచేసెన్ మానవ జన్మ మెత్తిన శ్రీ యేసూ నీకు నమస్కరించి నీకు నమస్కరించి నీకు నమస్కరించి పూజింతుము.

  • ఓ దూతలారా! ఉత్సహించి పాడి రక్షకుండైన యేసున్ నుతించుఁడి పరాత్పరుండా నీకు స్తోత్ర మంచు నమస్కరింప రండి నమస్కరింప రండి నమస్కరింప రండి యుత్సాహముతో

  • యేసూ! ధ్యానించి నీ పవిత్ర జన్మ మీ వేళ స్తోత్రము నర్పింతుము అనాది వాక్య మాయె నరరూపు నమస్కరింప రండి నమస్కరింప రండి నమస్కరింప రండి యుత్సాహముతో
  • 127 దూత పాట పా 10/19/2017 20:16 127 దూత పాట పాడుఁడీ రక్షకున్ స్తుతించుఁడీ ఆ ప్రభుండు పుట్టెను బెత్లెహేము నందునన్ భూజనంబు కెల్లను సౌఖ్యసంభ్ర మాయెను ఆకసంబునందున మ్రోగు పాట చాటుఁడీ దూత పాట పపాడుఁడీ రక్షకున్ స్తుతించుఁడీ.

  • ఊర్ధ్వలోకమందునఁ గొల్వఁగాను శుద్ధులు అంత్యకాలమందున కన్యగర్భమందున బుట్టినట్టి రక్షకా ఓ యిమ్మానుయేల్ ప్రభో ఓ నరావతారుఁడా నిన్ను నెన్న శక్యమా? దూత పాట పాడుఁడీ రక్షకున్ స్తుతించుఁడీ

  • దావె నీతి సూర్యుఁడా రావె దేవపుత్రుఁడా నీదు రాకవల్లను లోక సౌఖ్య మాయెను భూనివాసు లందఱు మృత్యుభీతి గెల్తురు నిన్ను నమ్మువారికి ఆత్మశుద్ధి కల్గును దూత పాట పాడుఁడీ రక్షకున్ స్తుతించుఁడీ
  • 128 శుద్ధరాత్ర 10/19/2017 20:16 128 శుద్ధరాత్రి! సద్ధణంగ నందఱు నిద్రపోవ శుద్ధ దంపతుల్ మేల్కొనఁగాఁ బరిశుద్ధుఁడౌ బాలకుఁడా! దివ్య నిద్ర పొమ్మా దివ్య నిద్ర పొమ్మా.

  • శుద్ధరాత్రి! సద్దణంగ దూతల హల్లెలూయ గొల్లవాండ్రకుఁ దెలిపెను ఎందు కిట్టులు పాడెదరు? క్రీస్తు జన్మించెను. క్రీస్తు జన్మించెను.

  • శుద్ధరాత్రి! సద్దణంగ దేవుని కొమరుఁడ! నీ ముఖంబున బ్రేమ లొల్కు నేఁడు రక్షణ మాకు వచ్చె నీవు పుట్టుటచే నీవు పుట్టుటచే.
  • 129 శ్రీ రక్షక 10/19/2017 20:16 129 శ్రీ రక్షకుండు పుట్టఁగా నాకాశ సైన్యము ఇహంబున కేతెంచుచు ఈ పాట పాడెను. 'పరంబునందు స్వామికి మహా ప్రభావము ఇహంబునందు శాంతిని వ్యాపింపనీయుఁడు'.

  • ఆ రమ్యమైన గానము ఈ వేళ మ్రోగును సంతుష్టులైన భక్తులు ఆ ధ్వని విందురు ప్రయాసపడు ప్రజల దుఃఖంబు తీరఁగా ఆ శ్రావ్యమైన గానము ఈ వేళ విందురు.

  • పూర్వంబు దూతగానము భువిన్ వినంబడి రెండువేల వర్షములు గతించిపోయెను భూప్రజలు విరోధులై యుద్ధంబు లాడి యా మనోజ్ఞమైన గానము నలక్ష్యపెట్టిరి.

  • పాపాత్ములారా, వినుఁడి శ్రీ యేసు ప్రభువు మీ పాపభార మంతయు వహింప వచ్చెను తాపత్రయంబు నంతయుఁ దానే వహించును సంపూర్ణ శాంతి సంపద లను గ్రహించును.

  • సద్భక్తులు స్తుతించిన ఈ సత్యయుగము ఈ వేళ నే నిజంబుగా సమీప మాయెను ఆ కాలమందు క్షేమము వ్యాపించుచుండెను ఆ దివ్య గాన మందఱు పాడుచు నెప్పుడు.
  • 130 క్రైస్తవుల 10/19/2017 20:16 130 క్రైస్తవులారా! లెండి యీనాడు క్రీస్తు పుట్టెనంచు పాడుఁడి; ప్రసన్నుఁడైన తండ్రి ప్రేమను ఆసక్తిపరులై కీర్తించుఁడి క్రీస్తేను మానవాళితోడను నశింపవచ్చెనంచు పాడుఁడి.

  • దేవుని దూత గొల్లవారికి ఈ రీతిగాను ప్రకతించెనుః 'ఈ వేళ మహా సంతోషంబగు సువార్త నేను ఎరిగింతును. దావీదు పట్నమం దీదినము దైవరక్షకుఁడు జన్మించెను.'

  • త్వరగానే ఆకాశ సైన్యము హర్షించుచు నీలాగు పాడెను 'సర్వోన్న తాకాశంబునందుండు సర్వేశ్వరునికి ప్రభావము నరులయందు సమాధానము ధరణిలో వ్యాపింపనియ్యుఁడు'.

  • పరమతండ్రి దయారసము నరులకెంతో నాశ్చర్యము నరావతారుఁడగు దేవుఁడు నిరపరాధిగాను జీవించి నిర్దోషమైన త్రోవ చూపించి విరోధులన్ ప్రేమించుచుండెను.

  • శ్రీ మాత సైన్యముతో మేమును వాద్యములు వాయించుచుందుము; ఈ దినమందు నుద్భవించిన యా దివ్యకర్తను వీక్షింతుము; సదయుఁడైన యేసు ప్రేమను సదా స్తుతించి పాడుచుందుము.
  • 131 హాయి, లోకమ 10/19/2017 20:16 131 హాయి, లోకమా! ప్రభువచ్చెన్ అంగీకరించుమీ పాపాత్ములెల్ల రేసునున్ కీర్తించి పాడుఁడీ.

  • హాయి రక్షకుండు ఏలును సాతాను రాజ్యమున్ నశింపఁజేసి మా యేసే జయంబు నొందును.

  • పాప దుఃఖంబులెల్లను నివృత్తిఁ జేయును రక్షణ్య సుఖక్షేమముల్ సదా వ్యాపించును.

  • సునీతి సత్యకృపలన్ రాజ్యంబు నేలును భూజనులార మ్రొక్కు(డీ స్తోత్రార్హుఁడాయెనే.
  • 132 రండి పాడ ద 10/19/2017 20:16 132 రండి పాడ దూతలారా నిండు సంతోషంబుతో యేసుని జన్మంబు గూర్చి ఈ భూలోకమంతట రండి నేడు పుట్టినట్టి రాజు నారాధించుడి.

  • మందగాయు గొల్లలార! మనుష్యులతో నేడు వాసంబు జేయుచున్నాఁడు వాసిగాను దేవుండు రండి నేడు పుట్టినట్టి రాజు నారాధించుడి.

  • జ్ఞానులారా! మానుడింక యోచనలం జేయుట మానుగాను వెదకుడేసున్ చూచుచు నక్షత్రమున్ రండి నేడు పుట్టినట్టి రాజు నారాధించుడి.

  • పరిశుద్ధులారా! మీరు నిరీక్షించుచుండిన యేసు ప్రభువాలయంబు యేతెంచెను చూడుడి రండి నేడు పుట్టినట్టి రాజు నారాధించుడి.

  • పశ్చాత్తాప మొందియున్న పాపులార! మీకు వి ముక్తి గల్గె; శక్తి నొంది రక్తి నేసుంజేరుడి రండి నేడు పుట్టినట్టి రాజు నారాధించుడి.
  • 133 ఓ బెత్లెహే 10/19/2017 20:16 133 ఓ బెత్లెహేము గ్రామమా! సద్దేమిలేకయు నీవొంద గాఢనిద్రపై వెలుంగు తారలు కానేమి, నిత్యజ్యోతి జ్వలించు నీతమిన్ పెక్కేండ్ల భీతివాంఛలీ రాత్రి తీరె నీలోన్.

  • మరియకేసుపుట్టెను నిద్రింప మర్త్యులు పై గూడి దూతల్వింతయౌ ప్రేమన్వీక్షింతురు చాటుడో వేగుచుక్కల్ ఎ శుద్ధజన్మము దైవానకు నున్నతుల్ భువిన్ శాంతంచు పాడుడీ.

  • సద్దేమి లేక వెచ్చగా! ఈ వింత దానము ఆరీతి దేవుడిచ్చుపై వరాల్ నరాళికి నరుండెరుంగకున్నన్ ఎ పాపధాత్రిలో దీనులంగీకరించిన యేసుందుజొచ్చును.

  • ఓ బెత్లెహేము పావన వత్సా! మా పై దిగు పోగొట్టి పాపముల్ మాలో నీ వేళ పుట్టుము సువార్త క్రిస్మస్ దూతల్ చెప్పంగ విందుము మా యొద్ద నుండరమ్ము మా ప్రభూ! ఇమ్మానుయేల్, ఆమేన్.
  • 134 వేకువచుక్క 10/19/2017 20:16 134 వేకువచుక్కల శ్రేష్ఠమౌ దానా! మా యిరుల్ బాపి నీ సాయమిమ్ము ప్రాగ్దిశ తార దిజ్మండల భూషా మా బాలరక్షకు జూపింపుమా.

  • చల్లమంచాయన తొట్టిపై నొప్పు పశులతో భువిబరుండెను కున్నెడు నాయన దూతల మ్రొక్కు నందర స్రష్ట, రాజు, రక్షణ.

  • ఆయనకు మంచికాన్కలిత్తమా! ఏదోం సువాసనల ద్రివసుల్ వార్ది ముత్యాల్ కానబోళంబుఖని స్వర్ణము నిత్తమా యాయనకు.

  • నిష్ఫలమే యన్ని శ్రేష్ఠార్పణలు కాన్కల నాయన ప్రేమరాదు అన్నిట డెందము బీదల మొరల్ దేవుని కిష్టము లౌకాన్కలు.

  • వేకువ చుక్కల శ్రేష్ఠమౌదానా మాయిరుల్ బాపి నీ సాయమిమ్ము ప్రాగ్దిశతార! దిజ్మండల భూషా మా బాలరక్షకు జూపింపుమా.
  • 135 రండి సువార 10/19/2017 20:16 135 136 యేసు నామామ 10/19/2017 20:16 136 యేసు నామామృతము కన్నను వేరే మాకిఁక లేదుగా దోసముల నెడబాపి పరమని వాస పదవికిఁ జేర్చుఁగా ||యేసు||

  • నిత్య రక్షణ నిత్య జీవము నిజముగా మాకిచ్చును సత్యసువిశేషార్థసారము సతము గ్రోలుట కొసఁగెను ||యేసు||

  • దురిత భవ మను నంధకారము దూరముగఁ బోఁదోలెఁగా అరయఁ దన విమలాత్మ వరమున మరల మము వెలిఁగించెఁగా ||యేసు||

  • గొప్ప కుల గర్వముల మెప్పను తప్పుల న్విడఁగొట్టెను చెప్ప శక్యముగాని రక్షణ సృష్టిలో మము నిల్పెను ||యేసు||

  • అడ్డు పరచు పిశాచి మార్గపు జిడ్డులను ఛేదించెను దొడ్డ కాపరి యేసు తన దగు దొడ్డిలో మముఁ జేర్చెను. ||యేసు||
  • 137 యేసు నామ మ 10/19/2017 20:16 137 యేసు నామ మెంతో మధురం యేసు నామ మెంతో మధురం దోసములు మోసములు నాధ మొనరించు ప్రభు ||యేసు||

  • స్వాంతమునకు శాంతి నిడును చింతలను భ్రాంతులను వింతలుగఁ ద్రుంచు ప్రభు ||యేసు||

  • నెమ్మి జేయు కమ్మివేయు నమ్మికలు సొమ్ములుగ ముమ్మరము జేయు ప్రభు ||యేసు||

  • ప్రేమ లెదుగ క్షేమ మొదపు కామ గుణ పామరతి లేమి చొరనీదు ప్రభు ||యేసు||

  • మోక్ష దశకు సాక్ష్య మొసఁగు నక్షయ సురక్షణకు దక్షత వహించ ప్రభు ||యేసు||

  • శీల మతుల పాలి వెతలఁ తూలఁ జనఁదోలి తన జాలి కనపరచు ప్రభు ||యేసు||
  • 138 యేసు నామమే 10/19/2017 20:16 138 యేసు నామమే పావనము మాకు యేసు గద నిత్య జీవనము దాస జన హృద్వికాసమైయెల్ల దోసములకు వి నాశకరమైన ||యేసు||

  • సాధు మానసోల్లాసములు యేసు నాధు గుణ చిద్విలాసములు బోధఁ గొను వారి బాధ వెడలించి మాధుర్యమగు ముక్తి సాధనములిచ్చు. ||యేసు||

  • భక్త జన లోక పూజ్యములు రక్త సిక్త పాదపయోజములు ముక్త రాజ్యాభి షిక్తుఁడౌ సర్వ శక్తి యుతుఁడైన సామియగు క్రీస్తు ||యేసు||

  • దీన జన నిత్య తోషణము సిల్వ మ్రాని ప్రభు మృత్యు ఘోషణము పానకము జుంటి తేనియల స్వాదు వీనులను గ్రోలు మానవుల కెల్ల ||యేసు||

  • పాపులకు మంచి పక్షములు ముక్తిఁ జూపు క్రీస్తు కటాక్షములు పాప సందోహ కూపమునఁ గూలు కాపురుషు నన్నుఁగాచుకొనిప్రోచు ||యేసు||
  • 139 యేసే, భగవన 10/19/2017 20:16 139 యేసే, భగవన్నామం భజింపను యేసే, భగవన్నామం భజింప నిరంతర ||మేసే||

  • యేసే సుగుణం యేసే శాంతం యేసే మనశ్శాంతం యేసే మనశ్శాంతి భజింపను ||యేసే||

  • యేసే ప్రేమం యేసే క్షేమం యేసే పరంధామం యేసే పరంధామ భజింపను ||యేసే||

  • యేసే తెరవు యేసే పరువు యేసే సద్గురువు యేసే సద్గురువు భజింపను ||యేసే||

  • యేసే నిత్యం యేసే సత్యం యేసే సుఖదాయం యేసే సుఖదాయ భజింపను ||యేసే||

  • యేసే జీవం యేసే జ్ఞానం యేసే జగదీశం యేసే జగదీశం భజింపను ||యేసే||
  • 140 యేసు నీ నా 10/19/2017 20:16 140 యేసు నీ నామామృతము మా కెంతో రుచి యయ్యా దేవ మా దోసములను హరించి మోక్షని వాసులుగఁ జేయుటకు భాసుర ప్రకాశమైన ||యేసు||

  • వేడు కలరఁగఁ గూడి నినుఁ గొని యాడు వారికి దేవ యెంతో కీడు జేసిన పాడు వైరిని గోడుగో డనంగ వాని తాడనము జేసితివి ||యేసు||

  • పాపములు హరింప నీవే ప్రాపు మాకయ్యా దేవ నీ దాపుఁ జేరిన వారి కందరి కాపదలు బాపి నిత్య | కాపుగతిఁ జూపినావు ||యేసు||

  • అక్షయ కరుణేక్ష భువన రక్షకా నీవే దేవ మమ్ముఁ పక్షముగ రక్షించి మోక్షసు రక్షణకు దీక్షఁ గొని వీక్షితులమైన మాకు ||యేసు||

  • అందమగు నీ మందిరమున బొందుగా మేము దేవ నీ సుందర కరుణామృతము మా డెందముల యందు గ్రోలు టందుకు సుందరమైన ||యేసు||
  • 141 వరనామమే శర 10/19/2017 20:16 141 వరనామమే శరణము శరణము క్రీస్తు వరనామమే శరణము శరణం ||వర||

  • పరమభక్త వ్రాత దురిత సంఘాత దు స్తర వన జాత భీ కరకీలి యౌ క్రీస్తు ||వర||

  • సారహీన సం సార పారావార తారణ కారణ తరణి యైన క్రీస్తు ||వర||

  • యూద దేశమునందు నుండు బేత్లేహేమున యూదు లను జనులలో పాదుకొన్న క్రీస్తు ||వర||

  • ఇలలో పాపపు మాన వుల నెల్ల మోక్ష సం కలితులఁ జేయుఁగ సిలువ నొందిన క్రీస్తు ||వర||

  • ఏచియున్నట్టి పి శాచభారపు కాడి మోసి దుఃఖించెడు నీచులకును క్రీస్తు ||వర||

  • కొల్లగాను బాప మెల్లఁ జేసి దాని కుల్లములోఁదల్ల డిల్లువారికిఁ క్రీస్తు ||వర||
  • 142 శ్రీ యేసు 10/19/2017 20:16 142 శ్రీ యేసు దివ్య నామస్మరణ చేయవే మనసా పాయక స్మరియించి పరము పొందువే మనసా ||శ్రీ||

  • నరుల పాప హరణమునకై నరుడయ్యె మనసా పరమ పుర ద్వారంబు మనకు తెరచెనే మనసా ||శ్రీ||

  • నరుల పాప శాప ఫలము నరకమే మనసా ఆ మరణమును తొలంచప్రభువే నుడిసె నేమనసా ||శ్రీ||

  • పాపమునకు ప్రాయశ్చిత్తం భవ్యమే గదా ప్రభువే ప్రాయశ్చిత్త బలియై పరగెనే మనసా ||శ్రీ||

  • సిలువవేసి ప్రభుని ప్రజలు చంపిరే మనసా ఆ బలుడు తిరిగి లేచి మృతిని గెలిచేనే మనసా ||శ్రీ||

  • గెలిచి యేసు హితులమధ్య నిలిచెనే మనసా నిలిచి సమాధాన మంచు పలికెనే మనసా ||శ్రీ||

  • పునరుత్థాన మేసు దేవ పుత్రుడని మహా ఘనముగా ప్రకటించుచుండ కాననే మనసా ||శ్రీ||

  • తానె మార్గం తానెసత్యం తానెజీవము ఈ ఘన సత్యంబు నమ్మునరులు ధన్యులే మనసా ||శ్రీ||

  • నిన్ను నీ వెరింగి ప్రభుని నెరుగ వే మనసా సన్నుతు డందుల కొసంగె సత్యవేదము ||శ్రీ||

  • పాపములకు పరితపించి ప్రభుని జేరవే దాపునకు రమ్మంచు కరము చాపేనే మనసా ||శ్రీ||

  • ఎంత ఘోరపాపమైన నెంచడే మనసా ఎంత మొత్తమైనను క్షమి యించునే మనసా ||శ్రీ||

  • బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించు మనసా ఈ బతుక్నందె ప్రభుని పదము పట్టుకో మనసా ||శ్రీ||

  • జనక కుమారాత్మ దేవున్ జపియించు మనసా అనయమును స్మరించు స్వర్గ మద్దియే మనసా ||శ్రీ||
  • 143 రారాజగు యే 10/19/2017 20:16 143 రారాజగు యేసునినామం రమ్యంబగు దేవుని నామం ఈశుండగు యేసునినామం ఈధర నిదె పావననామం యేసునినామం దేవునినామం రమ్యంబగు దేవుని నామం ||రారాజు||

  • గగనమువీడిన గురునామం కలుషాత్మలబ్రోచెడు నామం ||రారాజు||

  • స్లీవాంకముగల యినామం సుజనుల జేసెడు స్థిరనామం ||రారాజు||

  • విజయం బొపగెడు నిజనామం విమలాత్ముల కిదివరనామం ||రారాజు||

  • మనమున కిది యజ్జ్వలనామం జనములకిదియే ఋజునామం ||రారాజు||

  • ఈధరస్తుతులను గొనునామం ఈయేసుని యమృతనామం ||రారాజు||
  • 144 క్రీస్తే స 10/19/2017 20:16 144 క్రీస్తే సర్వాధికారి క్రీస్తే మోక్షాధికారి క్రీస్తే మహోపకారి క్రీస్తే ఆ సిల్వధారి ||

  • ముక్తి విధాతనేత శక్తి నొసంగుదాత భక్తి విలాపశ్రోత పరమంబు వీడె గాన ||క్రీ||

  • దివ్యపథంబురోసి దైవంబు తోడుబాసి దాసుని రూపుదాల్చి ధరణి కేతెంచెగాన ||క్రీ||

  • శాశ్వత లోకవాసి సత్యామృతంపురాశి శాప భారంబు మోసి శ్రమల సహించెగాన ||క్రీ||

  • సైతాను జనము గూల్పన్ పాతాళమునకు బంపన్ నీతి పథంబు బెంప రుధిరంబు గార్చెగాన ||క్రీ||

  • మృత్యువు ముల్లు తృంపన్ నిత్యజీవంబు బెంపన్ మర్త్యాళిభయము దీర్పన్ మరణంబు గెలిచెగాన ||క్రీ||

  • పరమందు దివిజులైన ధరయందు మనుజులైన ప్రతి నాలుక మోకాలు ప్రభునే భజించుగాన ||క్రీ||

  • ఈ నామమునకు మించు నామంబు లేదటంచు యెహోవా తండ్రి యేసున్ హెచ్చించినాడు గాన ||క్రీ||
  • 145 నీవేయని నమ 10/19/2017 20:16 145 నీవేయని నమ్మక యేసునాకు నీవేయని నమ్మిక నీవే మార్గంబు నీవే సత్యంబు నీవే జీవంబు నీవే సర్వంబు ||నీవే||

  • పెడదారిని బోవగ నామీదికి ఇడుమలెన్నియొరాగ అడవిలోబడి నేను ఆడలుచు నుండగ తడవకుండ దొరుకు ధన్యుమౌ మార్గంబు ||నీవే||

  • కారుమేఘముపట్టగ నా మనస్సులో కటిక చీకటిపుట్టగ ఘోరాపదలుచేరి దారియని భ్రమపడగ తేరిచూడగల్గు తేజోమయ మార్గంబు ||నీవే||

  • లేనిపోని మార్గంబు లెన్నోయుండ జ్ఞానోపదేశంబు మానుగజేయుచు వానినిఖండించి నేనే మార్గంబన్న నిజమైన మార్గంబు ||నీవే||

  • నరలోకమునుండి పరలోకంబు వరకు నిచ్చెనగా నుండి నరులకు ముందుగా నడుచుచు ముక్తికి సరిగా కొనిపోవు సు స్థిరమైన మార్గంబు ||నీవే||
  • 146 క్రీస్తేసు 10/19/2017 20:16 146 క్రీస్తేసు శక్తినామమెల్లరు కీర్తించి కొల్వుడిలన్ యెపుడు కీర్తి కిరీటము ధరియింప జేయుడి క్రీస్తే రారాజనుడి ||క్రీస్తే||

  • సాష్టాంగపడి దూతల్ పరమున నిష్ఠతో గొలుచుచును యేసుని కీర్తి కిరీటము ధరియింప జేయుడి క్రీస్తే రారాజనుడి ||క్రీస్తే||

  • హతసాక్ష్యపు జనమా యేసుడె హితమతితో బిలుచున్ మిమ్ముల కీర్తి కిరీటము ధరియింప జేయుడి క్రీస్తే రారాజనుడి ||క్రీస్తే||

  • ఇశ్రాయేల్ ప్రజలారా యిచ్చెను ఆశ్రయ రక్షణను యేసుడే కీర్తి కిరీటము ధరియింప జేయుడి క్రీస్తే రారాజనుడి ||క్రీస్తే||

  • పాపుల రక్షించెన్ సిలువపై శాపము దొలగించెన్ యేసుడే కీర్తి కిరీటము ధరియింప జేయుడి క్రీస్తే రారాజనుడి ||క్రీస్తే||

  • సర్వజనంబులారా క్రీస్తుని సర్వజగంబులలో ఠీవిగ కీర్తి కిరీటము ధరియింప జేయుడి క్రీస్తే రారాజనుడి ||క్రీస్తే||

  • పరమందున్నట్టి ప్రభుదగు పరిశుద్ధ సంఘముతో మనము కీర్తి కిరీటము ధరియింప జేయుడి క్రీస్తు నారాధింతము ||క్రీస్తే||
  • 147 నాయేసు నామ 10/19/2017 20:16 147 నాయేసు నామ శబ్దము ఎంతో యింపైనది భయాదులెల్ల దీరిచి విశ్రాంతి నిచ్చును.

  • ఆకలిగొన్న యాత్మకు అదే మన్నాయగు ప్రయాసపడ్డవారికి ఫలము నిచ్చును.

  • ఈ ప్రియమైన నామము నిరీక్షణిచ్చును నాదుర్గమైన స్థానము కృపానిలయము.

  • నా యేసు దివ్యనామము సుక్షేమ నిధియౌ నా దిక్కులేని యాత్మకు సమృద్ధినిచ్చును.

  • యేసూ నీవే నాకాపరి నా రక్షకా, రాజా, నా ప్రభువా, నా జీవమా! నా స్తుతి పొందుము.

  • నీ ప్రేమ ప్రకటింతును నా చావు వరకు నీ నామ సంకీర్తనము నన్నాదరించును.
  • 148 యేసు నామము 10/19/2017 20:16 148 యేసు నామము స్మరించు బాధ నీకుఁ గల్గఁగా నద్ది క్షేమ సౌఖ్య మిచ్చు దాని స్మరియించుము. ||శ్రేష్ఠమౌ నామము ఆదరించు నిలను శ్రేష్ఠమౌ నామము మోక్షసౌఖ్య మద్దియే||

  • యేసు నామము స్మరించు శోధనంబు లుండఁగా డాలుగాను దాని నెంచి వేఁడుమా సునామమున్

  • మమ్ముఁ జేరఁదీయు యేసు నామము స్తుతింపఁగా మాధుర్యంపు నామ మౌను ఆత్మ కద్ది తుష్టియే

  • మ్రొక్కుచుందు మేసు నాధ నీదు పాద పద్మముల్ మోక్షమందుఁజేరఁగాను హెచ్చుగా నుతింతుము
  • 149 దేవుని ప్ర 10/19/2017 20:16 149 దేవుని ప్రేమ యిదిగో జనులార భావంబునం దెలియరే కేవలము నమ్ముకొనినఁ పరలోక జీవంబు మన కబ్బును ||దేవుని||

  • సర్వలోకము మనలను తన వాక్య సత్యంబుతోఁ జేసెను సర్వోపకారుడుండే మన మీద జాలిపరుఁడై యుండెను ||దేవుని||

  • మానవుల రక్షింపను దేవుండు తన కుమారునిఁ బంపెను మన శరీరముఁ దాల్చెను ఆ ప్రభువు మన పాపమునకు దూరుఁడే ||దేవుని||

  • యేసుక్రీస్తను పేరున రక్షకుఁడు వెలసి నాఁడిలలోపల దోసకారి జనులతో నెంతోను భాషలను బల్కినాఁడు ||దేవుని||

  • పాపభారంబు తోడ నే ప్రొద్దు ప్రయాసములఁ బొందెడి పాపులందఱు నమ్మిన విశ్రాంతి పరిపూర్ణమిత్తు ననెను ||దేవుని||

  • సతులైన పురుషులైనన్ యా కర్త సర్వ జనుల యెడలను సత్ప్రేమగ నడిచెను పరలోక సద్బోధలిక జేసెను ||దేవుని||

  • చావు నొందిన కొందఱిన్ యేసుండు చక్కఁగా బ్రతికించెను సకల వ్యాధుల రోగులు ప్రభు నంటి స్వస్థంబు తా మొందిరి ||దేవుని||

  • గాలి సంద్రపు పొంగులన్ సద్దణపి నీళ్లపై నడచినాఁడే మేలు గల యద్భుతములు ఈలాగు వేలకొలఁదిగ జేసెను ||దేవుని||

  • చేతుల కాళ్లను రా రాజు చేర మేకులు బొందెను పాతకులు గొట్టినారే పరిశుద్ధ నీతి తా మోర్వలేకన్ ||దేవుని||

  • ఒడలు రక్తము గారఁగ దెబ్బలు చెడుగు లందఱుఁ గొట్టిరి వడిముళ్లు తలమీఁదను బెట్టిరి ఓర్చెనో రక్షకుండు ||దేవుని||

  • ఇన్ని బాధలు బెట్టుచుఁ దనుఁ జంపు చున్న పాప నరులను మన్నించు మని తండ్రిని యేసుండు సన్నుతితో వేఁడెను ||దేవుని||

  • రక్షకుడు శ్రమఁ బొందఁగా దేశంబు తక్షణము చీఁక టయ్యెన్ రక్షకుఁడు మృతి నొందఁగఁ తెర చినిఁగి రాతి కొండలు పగిలెను ||దేవుని||

  • రాతి సమాధిలోను రక్షకుని నీతిగల దేహంబును పాఁతి పెట్టిరి భక్తులు నమ్మిన నాతు లందఱుఁ జూడఁగా ||దేవుని||

  • మూఁడవ దినమందున యేసుండు మృతి గెల్చి లేచినాఁడు నాఁడు నమ్మిన మనుజులు చూచిరి నలువది దినములందున్ ||దేవుని||

  • పదునొకండు మారులు వారలకుఁ బ్రత్యక్షుఁ డాయె నేను పర లోకమున కేగెను తన వార్తఁ బ్రకటించు మని పల్కెను ||దేవుని||

  • నమ్మి బాప్తిస్మమొందు నరులకు రక్షణ మరి కల్గును నమ్మ నొల్లక పోయెడు నరులకు నరకంబు సిద్ధమనెను ||దేవుని||
  • 150 వినరె మనుజ 10/19/2017 20:16 150 వినరె మనుజులార క్రీస్తుఁ డిలనుఁ జేయు ఘనములైన పనులలోనఁ జిత్రమొక్క పని వచించెద ||వినరె||

  • మన మనంబు లలరుచుండ దినదినంబు ప్రభుని నిండు ఘన మహాద్భుతములు వినినఁ దనివిఁ దీరదు ||వినరె||

  • ఇలను బేతనియపురంబు గలదు మరియ మార్తలక్క సెలియలందు వాసముండి రెలమితోడను ||వినరె||

  • పరిమళంపు తైలమేసు చరణములకుఁ బూసిన యీ మరియ సోదరుండు రోగ భరితుఁడయ్యెను ||వినరె||

  • వ్యాధిచేత లాజరుండు బాధనొందుచుండఁ గ్రీస్తు నాధుఁ బిలువనంపి రపుడు నాతు లిరువురు ||వినరె||

  • తమ్ము డక్క సెలియలును బ్రి యమ్ము తనకుఁ గలిగియుండ నమ్మహాత్ముఁ డైన క్రీస్తుఁ డరిగె నచటికి ||వినరె||

  • యేసువచ్చు టెఱిగి మార్త యెదురు గానుఁ బోయి తనదు దోసిలొగ్గి మ్రొక్కి ప్రభువు తోడ బల్కెను ||వినరె||

  • కర్త నీకు దేవుఁడిచ్చు ఘనబలమెఱుగుదును సత్య వర్తి విచట లేని కతన వ్రాలె లాజరు ||వినరె||

  • పిదప మరియవచ్చి క్రీస్తు పదయుగమున కొరిగి యేడ్చి మొదట మార్త పలికినట్లు సుదతి పలికెను ||వినరె||

  • అపుడు కర్త వారిపలుకు లాలకించి మదిని మూల్గి కృపకుఁ బాత్రు రాలితోడ నపుడు నడిచెను ||వినరె||

  • నడిచి లాజరుని సమాధి కడకుఁ జేరి గుహను మూయఁ బడిన రాయి తీయుఁడనుచుఁ ప్రభువు చెప్పెను ||వినరె||

  • యేసుతోడ మార్తపలికె నీ సమాధినునిచి నాల్గు వాసరంబులయ్యెఁ గంపు పట్టి యుండదా ||వినరె||

  • దాని నమ్మి చూడుమని మ హానుభావుఁ డాత్మబలము నూని తండ్రికిపుడు స్తోత్ర మొనరఁజేసెను ||వినరె||

  • లాజరు సమాధినెడలి రమ్ము లెమ్మటంచు లోక పూజితుఁడు మహా రవంబుఁ బూని పల్కెను ||వినరె||

  • మరణమైనవాఁడు ప్రాణ భరితుఁడగుచు లేచి వచ్చెఁ తరుణులధిక హర్షలైరి పెదజనంబుతో ||వినరె||

  • కన వినంగ రాని యిట్టి ఘన మహాద్భుతంబుఁ జూచి జనులు క్రీస్తు యేసునాధు ననుసరించిరి ||వినరె||

  • కనుక మనము వానిఁ జేరు కొని సుఖంబుఁ బడయవచ్చు మనసు నిలిపి యతనియందు మనుట మేలగున్ ||వినరె||
  • 151 అందమైన క్ర 10/19/2017 20:16 151 అందమైన క్రీస్తు కథ మీ రాలింపరయ్య ||అందమైన||

  • పొందుగ శిష్యులతో యేసు పోవుచుండు మార్గమందు ముందుగ వీక్షించి రొక్క పు ట్టంధకుని అందుఁ గొందఱు శిష్యు లాత్మలో భావించి రెందు కీతఁడు చీక య్యెను దీని విధమేమో డెందములనుఁ గల్గు సందియములు వీడ విందమనుచు లోక వంద్యుని సంతతా నందుని మనుజ నందనుని నడిగిరప్పు ||డందమైన||

  • చీకువాఁడై జన్మించుటకుఁ జేసెనా దుష్కృతము నితఁడు లేక వీని జననీ జనకు లేమి చేసిరో యీ కారణముఁ దెల్పు మోకర్త యిపుడీవు మాకంచు తను వేఁడ లోకేశ్వరుండు ని రాకారుఁ డితనియం దీకార్యములుఁ జూపఁ బ్రాకటముగఁ జేసెఁ గాక వేరొకవిధము లేకున్నదని తెల్పి చీకుఁ బ్రోవఁ దలంచె ||నందమైన||

  • బురద వాని కన్నులందుఁ గరములతోఁ జమిరియొక్క చెఱవులో బ్రాక్షాళించుటకు సెలవిచ్చెఁ బ్రభువు బిరబిర నయ్యంధుఁ డరిగి యేసుని పల్కుఁ దిరముగ మదినమ్మి సరసిలో మునిఁగి సుం దరమైన నేత్రముల్ ధరియించి యానంద భరితుడై చనుదెంచు తఱివాని పొరుగింటి నరులబ్బురముగఁ జూ చిరి మార్మోమగువాని ||నందమైన||

  • చూపులేని గ్రుడ్డివానిఁ జూడఁ గలుగఁజేయువాఁడే పాపాంధకార మగ్నుల నా ప్రభువే రక్షించు పైపైని మనకన్ను చూపు చూపది గాదు లోపలి కనుగుడ్డి యైపోయి యున్నది యాప త్పరంపర లోఁ బొరలుచున్నాము కాపాడుమని యేసు శ్రీ పాదములుఁ బట్టి చూపు లోపలి చూపుఁ జూచి యానందింత ||మందమైన||
  • 152 కనరె యేసున 10/19/2017 20:16 152 కనరె యేసుని ప్రత్యక్షంబు అన్య జనులకు గల్గిన, విధమెట్లొ తరచి ||కనరె||

  • నక్షత్రమార్గాన జ్ఞానుల్ బోయి రక్షకుని జూచిరి రక్తిమీరంగ కాంక్షతో ప్రభునికి మ్రొక్కి కాంకల్ కాంతిమీరగ నిచ్చి తరలిరి పరగన్ ||కనరె||

  • పదియు రెండేడ్ల, ప్రాయమున ప్రభువు పస్కాపండుగునకు పరగబోయెనుగ ముదమొప్ప దేవాలయములో జేరి ముద్దుగ బోధించె బోధకులకును ||కనరె||

  • కానాయూరి పెండ్లికరిగి ప్రభువు ఘనముగ నీళ్లు ద్రాక్షా రసముగజేసెన్ తనరమహిమను బయలుపరచి శిష్యుల మనములబలపర్చె ఘన విశ్వాసమున ||కనరె||

  • కుష్థరోగి యొకడువచ్చి తనదు కుష్ఠరోగము బాప ప్రభునివేడంగ ఇష్టబుద్ధితో ప్రభువువాని ముట్టి కుష్ఠురోగము బాపె కోర్కెలూరంగ ||కనరె||

  • శతాధిపతి విశ్వాసమును ప్రభువు తరచి చూచి మెచ్చి దయజూపె గనరె హితవుగవాని దాసుని పక్ష వాతంబు స్వస్థత మరిగావించెనుగ ||కనరె||

  • గాలివానల విప్లవంబు ప్రభువు గద్దించి సద్దణిపి ఘనమహిమజూపె గాలిసంద్రముపైన హక్కు ప్రభునికి గలదంచు శిష్యులు ఘనపరచిరిగ ||కనరె||

  • ఇట్టిశక్తిగల ప్రభుని మనము గట్టిగనమ్మిన గలుగు రక్షణము పట్టువీడక ప్రభునినెపుడు గుల్పి పరమశాంతిని బొంది మరివెలుగగలము ||కనరె||
  • 153 నేర్చుకొనర 10/19/2017 20:16 153 నేర్చుకొనరే యేసువాడుక లనుదినము మీ బ్రతుకునందున నేర్చుకొనిన మీరలాయన జనముగ నొప్పుదురు ఇలలో ||నేర్చుకొనరే||

  • ఆలయ ఆరాధనలకు బోయెడియలవాటుగలిగియు చాలమారులు ఆలయమునకు అరగిన యా ప్రభుని వాడుక ||నేర్చుకొనరే||

  • దేవవాక్య పఠనమందున దీక్షగలిగియు మరియ సుతుడు దివ్యముగ నా గ్రంథ పఠనము జేసినవిధంబు మీరలు ||నేర్చుకొనరే||

  • పరమ తండ్రికి ప్రార్థనలు ప్రతివేళ జేయుట పరమవిధియని మరువకను ప్రార్ధించి మనలను నిరతమును ప్రార్ధింపమనెను ||నేర్చుకొనరే||

  • బీద పాపులు బాధితులు బంధింపబడిన వారి కెల్లను ఆదరము జూపించి మేలును జేసిన విధంబు మీరలు ||నేర్చుకొనరే||

  • సువార్త ప్రకటనజేయుట సుభాగ్యముగ దానెంచి యీ భువి సేవలో సువార్త జాటుచు సంచరించిన యేసు వాడుక ||నేర్చుకో||

  • అక్కరలలో దన్నుజేరి మక్కువతో బ్రార్ధించి వేడిన పెక్కు జనముల యక్కరలను జక్కగ దీర్చిన విధంబును ||నేర్చుకొనరే||

  • దైవచిత్తము దీర్చుటయే తన ధర్మ విధిగ నెరిగి యాయన ధరణిలో నా ధర్మమునకై మరణమొందిన విభుని మాదిరి ||నేర్చుకొనరే||
  • 154 ఎవరు భాగ్య 10/19/2017 20:16 154 ఎవరు భాగ్యవంతు లౌదు రవని లోపల మోక్ష వివరమైన క్రీస్తు బోధ చెవులొగ్గి వినువారికన్న ||నెవరు||

  • కవులు లాభ మరసి చేయు కపట మంత్రముల్ విధులు దవులఁ బోవఁ దరిమి యేసు తత్వముఁగొనువారికన్న ||నెవరు||

  • దీనమానసుల కట్టి యుప దేశ మిచ్చెను దివ్య మైన మోక్ష రాజ్యము వారి దౌనటంచు ప్రభువు తెల్పె ||నెవరు||

  • వృజినములకై దుఃఖించెడి సుజను లెవ్వరో వారు నిజముగ నోదార్పుఁ బొంది నిత్య సంతోషింతు లని తెల్పె ||నెవరు||

  • శాంతి నీతికరుణల యందా సక్తిగల వారు భూస్వతంత్రులై పరి తృప్తినొంది దయఁ బడసెద రని ప్రభువు తెల్పె ||నెవరు||

  • పరిశుద్ధ హృదయులు పరా త్పరునఁ జూతురు సర్వ నరుల సమాధానపరచు నరులె పరమ జనకుని సుతులు ||నెవరు||

  • నీతికొర కాపద నొందెడి నిశ్చ లాత్ములు వారు ఖ్యాతిగఁ బర లోక రాజ్య ఘన సౌఖ్యము లెల్లను బడయుదురు ||ఎవరు||
  • 155 వినరయ్య నర 10/19/2017 20:16 155 వినరయ్య నరులారా విశ్వాసమున క్రీస్తు విమల బోధ పాప మనుజుల కెల్ల పా వన జీవనము సేయు వసుధ మీఁద ||వినరయ్య||

  • పాపాత్ములను పశ్చా త్తాపము పడుఁడంచు బ్రభువు దెల్పెన్ దన దాపు గోరినవారిఁ గాపాడుటకుఁ దానే దక్షుడయ్యెన్ ||వినరయ్య||

  • భారాక్రాంతులైన పాపులఁ దనుఁ జేరఁ బ్రభువు పిల్చెన్ శ్రమలు దూరంబుఁ జేసిత ద్దురితముల్ బాపి సం తోష మియ్యన్ ||వినరయ్య||

  • అనుమానింపక నెవ్వ రైన వచ్చినఁ ద్రోయ ననుచుఁ బల్కెన్ పెక్కు మనుజుల కొఱకు జీ వన మియ్యనే వచ్చి తనుచుఁ దెల్పెన్ ||వినరయ్య||

  • మనసారదేవునిన్ మానక ప్రేమింపు మనుచునేర్పెన్ ఇంకఁ దన పోల్కె నొరులకు దాను బ్రేమింపగ దనర దెల్పెన్ ||వినరయ్య||

  • తన శిష్యులకు నైక్య మును బ్రేమించుట కాజ్ఞ లొనర నిచ్చె నెంతో ఘన సత్ప్రభువు కాళ్లు గడిగి భక్తులచోట వినతుఁ డయ్యెన్ ||వినరయ్య||
  • 156 ఏలాటివాఁడో 10/19/2017 20:16 156 ఏలాటివాఁడో కాని యీ యేసుని నేమని వివరింతుము గాలివాన యేసుని గద్దింపునకుఁ చాల భయపడి నిలిచెను ||ఏలాటి||

  • ముద్దు శిష్యులతోడను సముద్రపు టద్దరికి వెళ్లెను కొద్ది పడవనెక్కెను ఇంతలోనె పెద్దగాలి రేగెను ||ఏలాటి||

  • అల్లకల్లోలముగా సముద్రము అల్లలాడు నప్పుడు చల్లఁగ దోనె వెనుక తలగడపైని మెల్లన నిదువోయెన్ ||ఏలాటి||

  • చింత లేదా యేమయ్యా బోధకుఁడా న శించిపోవుచున్నాము ఎంతో వేదన పడితిమి కాపాడుమ టంచు శిష్యులు లేపిరి ||ఏలాటి||

  • దిగ్గునఁ బ్రభువు లేచి యా గాలిని గద్దించిన వెంటనే తగ్గి నిమ్మళించెను సమస్తము సద్దు ఉడిగిపోయెను ||ఏలాటి||

  • ఏల భీతు లైతిరి యింతలోనే యెంత నమ్మిక లేదని యీలాగు నోదార్చెను యేసు తన సొంత శిష్యుల నప్పుడు ||ఏలాటి||
  • 157 యేసు వస్త్ 10/19/2017 20:16 157 యేసు వస్త్రపు చెంగును మాత్రమే యాసించి ముట్టినట్టి దోసకారుల రోగముల్ వెంటనే తొలఁగి పోయెను నిజముగ ||యేసు||

  • గుంపుకూడిన జనులతోఁ బ్రభు యేసు సొంపుతోఁ బోవునపుడు తెంపుతో రమణి యొకతె ప్రభు చెంగు తెలియకుండను ముట్టెను ||యేసు||

  • అంతటను రక్తధార యామె కొ కింతైన లేకపోయె ఇంతలోఁ ప్రభువు యెఱిఁగి తనయొక్క వింతఁ జూపెను జనులకు ||యేసు||

  • ప్రజలార మీలో నొకరిన్ నాదు ప్ర భావంబు స్వస్థపరచె నిజమంచుఁ ప్రభువు చెప్పె వణుఁకుతో గజయాన వచ్చి నిల్చె ||యేసు||

  • ఒదుగుచుండిన వనితతో శ్రీయేసు అదురు మానుమి యింకను ఇదిగో నీ విశ్వాసము రక్షించె ముదిత నెమ్మదిని వెళ్లు ||యేసు||

  • ఏపుమీరగ యేసును మీ యొక్క ప్రాపుగా నమ్ముకొనుఁడి ఆపదలు దొలఁగించును నిజముగఁ పాపముక్తులఁ జేయును ||యేసు||
  • 158 సీయోనుకన్య 10/19/2017 20:16 158 సీయోనుకన్యా సంభ్రమపడుచు వేయుము కేకల్ పాయక నీ రాజు భారవాహక మెక్కి బాలస్తోత్రములతో బైలుదేరి వచ్చె ||సీయోను||

  • హెబ్రాయిలోను నీ రాజు పేరు యూదులరాజు హెబ్రీయ జనులను అబ్రాము కొడుకులను విభవదేశము జేర్చు శుభరాజు యీతండే ||సీయోను||

  • హెల్లేనీలోను నీ రాజు పేరు యూదులరాజే యెల్లపాపులఁ బ్రోచు తాల్మిరక్షకుఁడితఁడు చల్లని ప్రభువని గొల్గొత మ్రోగెను ||సీయోను||

  • ఉర్వి రోమాలో నీ రాజు పేరు యూదులరాజే సర్వరాష్ట్రికులకు బూర్వపితరులతోను వరసింహాసన మిచ్చు వరదేశాధిపుఁ డితఁడు ||సీయోను||

  • వాసిగ హెబ్రీ హెల్లేనీలో రోమాయిలోను హోసన్నా ప్రభుని పేరట వచ్చు మెస్సీయ్యదావీదు కొడుకా శ్రీశుభములు ||సీయోను||
  • 159 ద్రాక్షావల 10/19/2017 20:16 159 ద్రాక్షావల్లిని నేను ద్రాక్షాతీగెలు మీరు అక్షయు డేసిటు బలికె అతిముదమునను వినరండి ||ద్రాక్షా||

  • నాయందుండని తీగె నాశనమొందును నిజము నాశనమొందక మీరు నాయందుండుడి ఫలియింపన్ ||ద్రాక్షా||

  • ఫలముల నివ్వని తీగె పనికిరాదని నరికి పారవేయంబడును నిరతము తధ్యము నిప్పులలో ||ద్రాక్షా||

  • ఫలించు ప్రతి తీగె ఫలముల పెక్కుగ నివ్వన్ పరిశుద్ధి చేయబడున్ యెఱుగరే మీరది అనవరతం ||ద్రాక్షా||

  • నాయందుండినగాని నయమగు కాపుండదిలన్ నాయందుండిన వాడు నాణ్యపు ఫలములనిచ్చు నాహా ||ద్రాక్షా||

  • మీరు యేదియు చేయ లేరు నాకు వేరై వేరుగ మీరుండినచో వెంటనే యెండిపోయెదరు ||ద్రాక్షా||

  • కాన యేసుని యందు మానకనుందుము స్వేచ్ఛన్ మాన్యుడేసుని పలుకుల్ మదిదలచెద మిల మరువకను ||ద్రాక్షా||
  • 160 ఇదిగో శుభద 10/19/2017 20:16 160 ఇదిగో శుభద రక్షణము దేవుఁడు పంపె నిదిగో శుభద రక్షణము సదమలంబగు పూర్వ సత్యవాక్యమునందు మృదువుగా దీర్ఘ ద ర్శుల చేతఁ బలుకఁబడె ||ఇదిగో||

  • అలపిశాచముతోడను దేవుఁడు తొల్లిఁ బలుకు వాక్యము జాడను పొలతి సంతతి నిన్ను తలఁగొట్ట బుట్టునని తెలియఁజేసెను మోషె దీర్ఘ దర్శన వాక్య ||ఇదిగో||

  • ఘన దివ్య బలిచేయను పాపములెల్లఁ దునిమి పుణ్యము లియ్యను ఒనరఁగ నీ కాల మునఁ గ్రీస్తు వచ్చునని మును దానియేలు బ ల్కెను దీర్ఘ దర్శనము ||ఇదిగో||

  • యూద రాజ్యములోపట బెత్లేమనెడి యూరఁ గ్రీస్తుడు బుట్టుట ఆదిలోన మీకా యను దీర్ఘ దర్శిచే మోదమునఁ దెల్పబడె ముందు వేదమునందు ||ఇదిగో||

  • మన దోషముల కొఱకునై యేసుని కాయ మది గాయముల హ్రస్వమై మన రక్షకుని పాట్లు గనినట్టుల యెషయ్య మును దెల్పె దీర్ఘద ర్శన వాక్యముల నిచ్చి ||ఇదిగో||
  • 161 వింతగల మా 10/19/2017 20:16 161 వింతగల మా యేసు ప్రేమను సంతసమున స్తుతింతును పంతముగఁ దన ప్రాణమును పా పులకు నియ్యను వచ్చి సిలువను జచ్చి నను రక్షించె నహహా ||వింత||

  • ప్రీతిగల మా ప్రభుని కృప బహు ప్రియముతోఁ జాటింతును సాధుగా నాకొఱకు సిలువను చాల శ్రమల భరించి చావు జ యించి నను రక్షించె నహహా ||వింత||

  • పాడుఁడీ మా యేసు ప్రేమను వేఁడుఁడీ మదిఁ గూడుఁడీ పాడుఁడీ తన దివ్యరక్తము పాప క్రయముగ నిచ్చి శాపముఁ బాపి నను రక్షించె నహహా ||వింత||

  • నిత్య జీవము నిండు నెమ్మది నిరతముగ నాకియ్యను రక్తస్వేదము గార్చె నహహా నరక శాపముఁ ద్రుంచి యాపద నుంచి నను రక్షించె నహహా ||వింత||
  • 162 అన్నా మన య 10/19/2017 20:16 162 అన్నా మన యేసు ప్రభుని కన్న రక్షకుఁడు లేఁడు ఎన్న రాని మన యఘము లన్ని సడలించి ప్రోచు ||నన్న||

  • మన దోషములకు బదులుగ మరణావస్థల నొందెను తన దివ్యావయముల ర క్తము చిందించెను భువిపై ||నన్న||

  • నిజ రక్షకుఁడితఁడే మన వృజినాదులఁ బరిమార్పను విజయం బగు నతని పాద రజయుగ్మును స్మరించు ||మన్న||

  • దిక్కు మాలిన వారికి దిక్కై మార్గముఁజూపెను చక్కనీ గుణముల సొం పెక్కి వర్తించె నహహ ||యన్న||

  • ఈలాటి దయాసముద్రు నిల నెందైనను గానము నీలోఁ గల దుర్గుణాది జాలంబులఁ గడఁ ద్రోయును ||అన్న||

  • మృతి గెల్చిన వాఁడే దు రిత జీవులఁ బ్రోవఁ దగును మృతి నొంది నశించు లోక మూఢాత్ముల కేలఁ గల్గు ||నన్న||
  • 163 ఇడుగో గొఱ్ 10/19/2017 20:16 163 ఇడుగో గొఱ్ఱెలకాపరి సోదరులారా యిడుగో గొఱ్ఱెలకాపరి కడగానరాని కారడవిలో నలసట పడెడు గొఱ్ఱెలను పేరిడిబిల్చి రక్షించు ||నిడుగో||

  • చెదిరిపోయిన గొఱ్ఱెనై దొడ్డికిఁబోవ ముదములేనివాడనై మృదుమధురంపు నీ నాదమా లించక కర్త కొదిఁగి యుండక మూఢ హృదయుఁడనైతి ||నిడుగో||

  • దూరంబునకుఁబోతిని జనకుని కృపా సారంబుఁ గొననైతిని కారు మూర్ఖపుపిల్ల గా సంచరించినా కూరిమి యిలుఁబాసి దారి దొలగిపోతి ||నిడుగో||

  • తనదు గొఱ్ఱెను జూచెను బోయఁడు తండ్రి తనశిశువును గాంచెను కనికరమెదలో నిం డినవారలై నన్ను వన గిరికటకాదు లను వెంబడించిరి ||ఇడుగో||

  • ప్రాణావసర మప్పుడు యేకాకినై క్షీణించియున్నప్పుడు త్రాణార్థమగు నెనరు త్రాళ్లతో ననుగట్టి నాణెంబుగా(దెచ్చి నన్ను రక్షించెను ||ఇడుగో||

  • చెడుగు మెకములవల్లను బాధలనొంది కడుమలినమై యుండను కడిగి గాయములన్ని గట్టి శుభ్రముచేసి తడయక నాయింట నిడి నెమ్మది యొసంగె ||నిడుగో||

  • ప్రభుయేసు నా బోయఁడు యీతఁడె భూమి నభము లేలెడి రాయఁ డు శుభమైన తనదివ్య శోణిత మొసఁగియ వ్విభుఁడు ప్రేమించి దీ వించి స్వస్థముఁజేసె ||నిడుగో||

  • నన్ను దొడ్డిని బెట్టెను పోయినగొఱ్ఱె తెన్ను వెదకిపట్టెను సన్నంపు పచ్చిక యున్ను జీవనపూట లున్నుఁ గల్గెడిచోట్ల నన్నుంచి రక్షించె ||నిడుగో||

  • నేను మూర్ఖపుగొఱ్ఱెనై లోబడకుంటి మానసమున వెర్రినై పూని యిప్పుడు కాచే వాని శబ్దము ప్రేమ తో నాలింపుచు దొడ్డి నానందముననుందు ||నిడుగో||

  • చెడ్డబిడ్డనై యుంటిని యిటునటుబోవ నెడ్డెతనముఁ గొంటిని మెడ్డులేకిపుడు ప్రే మింతు నా ప్రియజనకు దొడ్డ శబ్దము వాంఛిం తును ముక్తి నిలయంబు ||ఇడుగో||
  • 164 ఈయనా యేసు 10/19/2017 20:16 164 ఈయనా యేసు రక్షకుడు తన దాయమని రక్షింపఁ దలఁచెనా నన్ను నీయనా యేసు రక్షకుఁడు ఆయాసమగు నొక్క మోపు నే మోయలేకుండ నా మూపుపై నుండ శ్రేయఃకరపు సిలువఁజూపి నాకు హాయి నిచ్చెను భార మంత వెడలించి ||యీయనా||

  • దురితాత్ముఁడని త్రోయకుండ నన్నుఁ బరిశుద్ధుఁడా యేసు ప్రభుఁడు కరుణింప ధరణిలో నిది మహాద్భుతము నే మరుతునా యీ ప్రేమ మరణమౌ దాఁక ||ఈయనా||

  • ఓపఁగూడని దుష్కృతంబుల్ నేను తేపతేపకుఁ జేసి ద్వేషినై యుండఁ గోప మింతైన రానీక నన్నుఁ గాపురుషుఁ డని తాను ఖండింపఁ డాయె ||నీయనా||

  • మనస్తమో గుణము లెడబాపెన్ నా దినకరోదయ మట్లు దీప్తిమది మించెన్ తన పాదములఁ జాడ లబ్బెన్ సదా వినుతి కెక్కిన వాని విమలాత్మ వెలుఁగు ||నీయనా||

  • హతుఁ డయ్యె నాయేసు నాకై దు ర్గతి తొలఁగి నాకు మో క్షమే గల్గు కొఱకు అతి దయాదీర్ఘశాంతుండే దైవ సుతుఁ డని యెఱిగితి శోధింపఁగాను ||ఈయనా||

  • దీవింపఁదగు నతని సిలువ నా జీవాంతమగు దనుక చెలఁగి మోయుచును ఈ వసుంధర జనుల కెల్ల మీరు సేవించుఁ డేసునని చెప్పి చాటుదును ||ఈయనా||
  • 165 ఈలాటిదా యే 10/19/2017 20:16 165 ఈలాటిదా యేసు ప్రేమ నన్ను తూలనాడక తనదు జాలి జూపినదా ||ఈలాటిదా||

  • ఎనలేని పాపకూపమున నేను తనికి మినుకుచును నే దరిఁ గానకు డన్ కనికరముఁ బెంచి నా యందు వేగఁ గొని పోవ నా మేలు కొర కిందు వచ్చె ||ఈలాటి||

  • పెనుగొన్న దుఃఖాబ్ధిలోన నేను మునిఁగి కుములుచు నేడు పునగుందు నపుడు నను నీచుఁడని త్రోయలేక తనదు నెనరు నా కగుపరచి నీతిఁజూపించె ||ఈలాటి||

  • నెమ్మి రవ్వంతైన లేక చింత క్రమ్మిపొగలుచు నుండ గా నన్ను ఁ జూచి సమ్మతిని ననుఁ బ్రోవఁ దలఁచి కరముఁ జాఁచి నా చేయిబట్టి చక్కఁగా బిలిచె ||ఈలాటి||

  • పనికిమాలిన వాఁడనైన నేను కనపరచు నాదోష కపటవర్తనము మనసు నుంచక తాపపడక యింత ఘనమైన రక్షణ మును నాకుఁ జూపె ||ఈలాటి||

  • నా కోర్కె లెల్ల సమయములన్ క్రింది లోక వాంఛల భ్రమసి లొంగెడు వేళన్ చేకూర్చి దృఢము చిత్తమునన్ శుభము నా కొసంగె జీవింప నా రక్షకుండు ||ఈలాటి||

  • శోధనలు ననుఁ జుట్టినపుడు నీతి బోధ నా మనసులోఁ బుట్టించి పెంచి బాధ లెల్లను బాపి మాపి యిట్టి యాదరణఁ జూపెనా యహహ యేమందు ||ఈలాటి||
  • 166 యేసురాజు న 10/19/2017 20:16 166 యేసురాజు నీదు ప్రేమ నెంచ తరముగాదయా దోషియైన నన్ను బ్రోవ నీసుప్రాణమిడితివా ||యేసురాజా||

  • మంచివాని కొరకు నొకఁడు మరణ మొందుటరుదుగా అంచితమగు ప్రేమ చేత మించి గాయము లొందినా ||వేసు||

  • చెయ్యరాని దుష్కర్మములుఁ చేసి నే చెడియుండగా అయ్యో మ్రానుమీఁ దికీవు ఇయ్యకొని మోసితివా ||యేసు||

  • గెత్సేమనె వనములోకిఁ జొచ్చి తండ్రికి చిత్తమై యిచ్చిన నా శ్రమలపాత్రన్ బుచ్చుకొని భరించినా ||వేసు||

  • హస్తము,పాదము,ప్రక్కలు మస్తకపు గాయములలో విస్తరించి చిందె నీ ప్ర శస్త రక్తమంతయున్ ||యేసు||

  • కొండమీద నిన్నుఁజూడ గుండెలదిరిపోవునే నిండు ప్రేమ చేత నావగు మెండుబాధల నోర్చినా ||వేసురాజా||

  • మరువలేను నీదు ప్రేమ మరణపరియంతంబు నా నరక బాధలన్ని నీవా కొరతపై వహించినా ||వేసురాజా||

  • నిన్నుదలఁచ నా నిరీక్షణ యున్నతము గానుండును యెన్నడు నీ మహిమను నా కన్నులారఁజూతునో ||యేసురాజా||
  • 167 ఓ వింత! నా 10/19/2017 20:16 167 ఓ వింత! నా రక్షకుఁడా నాకై నీ విలువ రక్తము కార్చితివా జీవాధిపతి మృతిఁ జెందె నహహా పురుగు వంటి నాకై నీ జీవ మర్పించి నావా ||ఓ వింత||

  • నేను జేసిన పా పములకు నాయన మ్రానిమీఁదను మూల్గినావా నేను గ్రహింపలేని నీ జాలి కరుణ మితి లేని ప్రేమ దీని వలనను గనుపడుచు నున్నది ||ఓ వింత||

  • పరమ శరీరుఁడు తా మరణ రక్తంబుచేతఁ గరుణతో నన్నుఁ బ్రోచినాఁ డా మరుతునా యీ ప్రేమ నా మరణంబు నందు సహా కర్తృ కటాక్షములు కలకాల ముండు నాతో ||ఓ వింత||

  • నా యేసు నాధ నీకు నేనచ్చియున్న దెల్ల నా లేమితోఁ బ్రేమ గదా నియమంబు గల ప్రభువా నీకెట్లు చెల్లించెదను నన్ను నేనే నీకు నర్పించుకొనుట గాక ||ఓ వింత||
  • 168 పరమ రక్షక 10/19/2017 20:16 168 పరమ రక్షక యేసు ప్రభువా నే నీ పాలఁ పడితి పాలన సేయవే ధరజనంబులుసేయు బహువిధ దురితములు క్షమియించి సద్గతి తెరవు జూపి తరింపఁజేసెడి దొరవటంచును మరుగుజోచ్చితి ||పరమరక్షక||

  • క్షితి నబ్ధి తీర పై కతయైన నెన్ననా యితియౌను లెక్కింపఁగా కుతల జన్మంబెత్తియేనిట బ్రతుకు దినముల జేయునఘములు మతి దలపనిమితా యుతంబులు పతితు డనునాగతి యెరుంగను ||పరమరక్షక||

  • పసలేని మాయా దు ర్వ్యసనంబులను జెంది దెసదప్పి యున్నాఁడను వసుధలో దుష్టునికి లోఁబడి మసలజాలని బలహీనత గసటు కన్నులగప్పి కడు మా నసము దూలి విలాపినైతిని ||పరమరక్షక||

  • మదితప్పి గొఱ్ఱెల మంద బాసినగొఱ్ఱె చెదరి చలించినట్లు వదలకెపుడు దురాత్మలైరి స ముదయమునఁ బడితిరిగి వడిచెడి మదికి విశ్రమమేమి లేమిని హృదయ సంతాపముల సుడిఁబడి ||పరమరక్షక||

  • మదపున్నాగము భంగి మత్తిల్లి దుర్భావ హృదయుఁడనై చెడితిని గొదగొనుచు గాయములతో నా యెద దృఢంబించుకయు లేమినిఁ గదల శక్యము గాక మూల్గుచు గొదువలకు లోనైతి ద్రోహిని ||పరమరక్షక||

  • అమిత దురాత్ముఁడ నని కడఁ ద్రోయక క్షమియింపు మీ కరుణచే తమిని మిక్కిలి దుర్విషయగుణ సముదంబులు జుట్టి పాపపు తమము గప్పియు గలుషకానన సమితిలోఁబడి శ్రమలు నొందుచు ||పరమరక్షక||
  • 169 పాపి కాశ్ర 10/19/2017 20:16 169 పాపి కాశ్రయుఁడవు నీవే యేసు నీవే

  • ఉన్నత లోకము విడిచిన నీవే కన్నియ గర్భమునఁ బుట్టిన నీవే యేసు నీవే ||పాపి||

  • అజ్ఞాన నాశన బ్రధ్నుఁడవు నీవే విజ్ఞాన దాయక పరగురువు నీవే యేసు నీవే ||పాపి||

  • చెదరిన పాపుల వెదకెడు నీవే చెదరిన గొఱ్ఱెల కాపరివి నీవే యేసు నీవే ||పాపి||

  • రోగిష్ఠులకు స్వస్థ ప్రదుఁడవు నీవే మ్రోగు నార్తుల యొక్క మొఱవిను నీవే యేసు నీవే ||పాపి||

  • నర పుత్రులకు నీతిఁ గరపించు నీవే కరము చాఁపి కష్టములు ద్రోయు నీవే యేసు నీవే ||పాపి||

  • శాత్రవాంతరమున మృతుఁడవు నీవే మైత్రిఁ జూపఁగ మృత్యుద్ధతుఁడవు నీవే యేసు నీవే ||పాపి||

  • భవ దీయ పదకంజ దాసుండ నేనే భవ మగ్ను నను ముక్తుఁ జేయుము నీవే యేసు నీవే ||పాపి||
  • 170 యేసుక్రీస్ 10/19/2017 20:16 170 యేసుక్రీస్తు ప్రభువా మేము నీ మోక్షముఁ బొందుటకు దోసపు లోకము లోనికి వచ్చితి దోషులఁ బ్రోచుటకు ||యేసు||

  • పరిశుద్ధుఁడ వీవు ఇలలో పాపుల నందరిని పరిపరివిధ కృప వాక్కులతోడను పిలిచితి వెల్లప్పుడు ||యేసు||

  • సత్యపు నడతలతో జగతిని సర్వాద్భుతములను నిత్యముఁ జేయుచు నీ కృప చాల యిలలోఁ దెల్పితివే ||యేసు||

  • అతి పుణ్యాత్ముఁడవే క్షితిలో వెతలను బొందితివే మృతిని బొందియు మూఁడవ దినమున బ్రతికియు లేచితివే ||యేసు||

  • పాపుల మని తెలిసి నీదగు దాపున జేరఁగనే పాపముఁ బాపుచు ప్రాపుగ నుండెడి ప్రభుఁడవు నీవెగదా ||యేసు||

  • దురిత వితతి దూరా నమ్మిన దురితుల స్నేహితుఁడా నిరతము మమ్మును నీ కృప లోపల నిలకడగాఁ బెంచు ||యేసు||

  • నోరు నిండ నెదలో నీ కృప ప్రేరేపణఁగలిగి సారెకు వేఁడెద ముర్వికి రక్షణ కారకుఁడా నిన్ను ||యేసు||
  • 171 యేసూ నన్ను 10/19/2017 20:16 171 యేసూ నన్ను ప్రేమించినావు పాపినైన నన్ను ప్రేమించినావు||

  • నన్ను ప్రేమింపమా నవరూప మెత్తి దా నముగా జీవము సిల్వపై నిచ్చి కన్న తలిదండ్రుల యన్నదమ్ముల ప్రేమ కన్న మించిన ప్రేమతో ||యేసూ||

  • తల్లి గర్భమున నే ధరియింపఁబడి నపుడే దురితుండనై యుంటిని నా వల్లజేఁయఁబడెడు నెల్ల కార్యము లెప్పు డేహ్యంబులై యుండఁగ ||యేసూ||

  • మంచి నాలోఁ పుట్ట దంచు నీ వెరిఁగి నన్ మించఁ బ్రేమించి నావు ఆహా యెంచ శక్యముగాని మంచి నాలోఁ బెంచ నెంచి ప్రేమించినావు ||యేసూ||

  • నన్నుఁ బ్రేమింప నీ కున్న కష్టము లన్ని మున్నై తెలిసియుంటివి తెలిసి నన్నుఁ బ్రేమింప నీ కున్న కారణమేమో యన్నా తెలియదు చిత్రము ||యేసూ||

  • నా వంటి నరుఁ డొకఁడు నన్నుఁ ప్రేమించిన నావలన ఫలముఁ గోరు ఆహా నీవంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలంబేమి లేక ||యేసూ||
  • 172 యేసుక్రీస్ 10/19/2017 20:16 172 యేసుక్రీస్తు దొరికె నేని యేమికొదువింకేమి భయము దోసకారి జనుల కెంతోఁ గ్రాసమవునా యేసు పేరు ||యేసు||

  • తల్లిదండ్రులకన్న చాలాఁ దన ప్రేమ మనమీద నెల్లకాలమందు నుంచు యేసుఁడే మా తండ్రియౌను ||యేసు||

  • వల్లగాని వశములేని యెల్ల మేళ్లన్నిటి నెల్లపుడు కొల్లగా మన కిచ్చెడి దేవ కొమరుఁడే వేరెవరు లేరు ||యేసు||

  • దండియైన గండములు మెండుగాను మముఁజుట్టిన తండ్రివలె మా దరికి వచ్చి గండములను గదిమిఁ బ్రోచున్ ||యేసు||

  • సత్యము మార్గముతానె నిత్యజీవమింకా తానే భ్రుత్యుల మనకీయ మోక్షము భువిని రక్తమంత గార్చె ||యేసు||

  • ఎన్నరాని పాపాత్ముల కన్నులారా కనికరించి పున్నెమైన తన ప్రాణము భువిని బలిపెట్టినాఁడు ||యేసు||

  • ఒడలు నిండా గాయములతో నడరు చుండమరల లేచి వెడలి పరమందునుండి వేడుకలు మాకంపినాఁడు ||యేసు||

  • ఆశతోడఁ తన్ను నమ్ము యాత్మలకు దర్శనమిచ్చెడి యేసుతో నింకెవరు సాటి లేశమైనా లేరుసుండీ ||యేసు||
  • 173 యేసుని ప్ర 10/19/2017 20:16 173 యేసుని ప్రేమను నేమారకను నెప్పుడు దలఁచవే యో మనసా వాసిగ నాతని వరనామంబును వదలక పొగడవె యో మనసా||

  • పాపులకొరకై ప్రాణముఁ బెట్టిన ప్రభు నిలఁ దలఁచవె యో మనసా శాపము నంతయుఁ జక్కఁగ నోర్చిన శాంతుని పొగడవె యో మనసా ||యేసుని||

  • కష్టములలో మన కండగ నుండిన కర్తను దలఁచవె యో మనసా నష్టములన్నియు నణఁచిన యాగురు శ్రేష్ఠుని ప్పొగడవె యో మనసా ||యేసుని||

  • మరణతఱిని మన శరణుగ నుండెడు మాన్యునిఁ దలఁచవె యో మనసా కరుణను మన క న్నీటి దుడిచిన కర్తను పొగడవె యో మనసా ||యేసుని||

  • ప్రార్థనలు విని ఫలముల నొసఁగిన ప్రభు నిఁక దలఁచవె యో మనసా వర్థనఁ గోరుచు శ్రద్ధతో దిద్దిన వంద్యుని పొగడవె యో మనసా ||యేసుని||

  • వంచనలేక వరముల నొసఁగిన వరదునిఁ దలఁచవె యో మనసా కొంచెము కాని కూర్మితో దేవుని కొమరుని పొగడవె యో మనసా ||యేసుని||
  • 174 యేసువంటి ప 10/19/2017 20:16 174 యేసువంటి ప్రియ బంధుఁడు నాకిఁక నిహ పరములలో లేఁడన్న భాసురముగ నిజ భక్తుల కది యను భవ గోచర మెపు డగు నన్న ||యేసు||

  • ఊరు పేరు పరువులు మురువులు మరి యూడఁగొట్టబడినను గాని కూరిమితో క్రీస్తుడు మాకుండినఁ కొదువరాదు గొప్పయు పోదు ||యేసు||

  • ఆడికలు తిరస్కారంబులు మా కవమానము లున్నన్ గాని తోడు క్రీస్తుఁడు మాకుండినను త్రోవఁ దప్పము ఓడిపోము ||యేసు||

  • తగ్గుపాటులును సిగ్గుపాటులును దలమీఁదను వ్రాలినగాని దగ్గర మా పాలిటఁ ప్రభువుండగ సిగ్గును బొందుము తగ్గునఁ గుందము ||యేసు||

  • ఎన్నెన్నో శోధన బాధలు చెల రేగి మనలఁ జుట్టిన యపుడు కన్న తండ్రివలె నోదార్చుచుఁ దన ఘన వాగ్బలమున దునుమును వానిని ||యేసు||

  • మనసు క్రుంగి పలు చింతలచేత మట్టఁబడిన వేళను మాకుఁ తన వాగ్దత్తములను జేతుల లే వనెత్తి యెంతో సంతస మొసఁగును ||యేసు||

  • తల్లిదండ్రులు విడిచిన గాని తాను వదలఁ డెప్పుడు మమ్ము ఉల్లమునెత్తి పిలిచిన వేళ నోహో యనుచు దరికి వచ్చు ||యేసు||

  • అతఁ డుండని పరమండలము ఇక వెదకినగాని యగపడదు క్షతినాతఁ డు మా మతిని వసించిన అతులిత సౌఖ్యం బదియే మోక్షము ||యేసు||
  • 175 ఏమి లేదు స 10/19/2017 20:16 175 ఏమి లేదు సుమీ జగములో యేసుని ప్రేమ సారము కన్నను పామరం బేటికి వృధా కను దామరలు మూయగనె చీకటి యౌ మనంబున నెల్ల సత్యము గామి గని సర్వంబు విడువుఁ ||డేమి||

  • దార పుత్రాది బంధు శ్రేణిపై మమ కార భావము జెందుచుఁ దద్విషయమై కోరి దుఃఖము లొందుచు భ్రమఁ గుందుచు భూరి మాయా జాల బంధా కర మిది యని తెలియ కీ సం సార మంతయు నాది నాదని యూరకే చెడిపోవ నేటికి ||నేమి||

  • ఈ దేహమునకుఁ బ్రాణమునకు సంబంధ మించు కైనఁ గలదా దేహాత్మలకు భేదము గన వలదా బుద్ధి గొన వలదా యాది నే దేహము నాత్మ స మాదరంబున నుండు నా తను వీ ధరిత్రిని విడచి చను నపుడే దయామృతవార్ధి దిక్కగు ||నేమి||

  • జాయా పుత్రోద్యాన గృహ విత్తా ట్టాలక సకల వస్తు జాలము ప్రతిష్ఠాను భూతి విధేయులు నఖిల సంపదలు నీ యవని లోపల సమర్పణఁ జేయఁగా బడుఁ గాని యించుక తోయమును గొని పోవశక్యము లేద హా భ్రమ నొంద నేటికి ||నేమి||
  • 176 శ్రేష్ఠుఁడ 10/19/2017 20:16 176 శ్రేష్ఠుఁడెల్లవారిలోను మా యేసువే తల్లికంటె ప్రియుడౌను మా యేసువే లోకస్నే హమస్థిరంబు నేఁడు ప్రేమరేపు కక్ష స్థిరుడైన మిత్రుడౌను మా యేసువే.

  • నాకు నిత్యజీవమౌను మా యేసువే సర్వమందు సర్వమౌను మా యేసువే నన్ను మేలుకొల్పి ప్రోచి శుద్ధిచేసి ప్రేమతోడ నన్ను తన మందఁజేర్చె మా యేసువే.

  • ప్రేమమూర్తి సత్యవర్తి మా యేసువే ఇహపరభాగ్యమిచ్చు మా యేసువే క్రీస్తుకిమ్ము నీదుయాత్మ నీకు శాంతినిచ్చి కాచి తుదిఁజేర్చు మోక్షమందు మా యేసువే.

  • బాధనొందు మేము చేర మా యేసువా! మాకు హర్ష మిచ్చినావు మా యేసువా! ఇహమందు నడిపించు అవసానకాలమందు మోక్షసౌఖ్య మొందనిమ్ము మా యేసువా!
  • 203 ఎందుఁబోయెద 10/19/2017 20:16 203 204 సిలువలో వ్ 10/19/2017 20:16 204 205 ఏమి నేరంబు 10/19/2017 20:16 205 206 కరుణసాగర వ 10/19/2017 20:16 206 207 ఎంత గొప్ప 10/19/2017 20:16 207 ఎంత గొప్ప బొబ్బ పుట్టెను దానితో రక్షణ మంతయును సమాప్త మాయెను ఎంత గొప్ప బొబ్బ పుట్టెను యేసునకుఁ కల్వరి మెట్టను సంతసముతో సిల్వఁ గొట్టఁగ నూర్యుఁ డంధకారమాయెను ||ఎంత||

  • గలిబిలి గలిగె నొకప్పుడు శిన్యారు బాబెలు కట్టడము కట్టునప్పుడు పలుకు భాషయు నొక్క టైనను పలువిధములగు భాషలాయెను నలుదెసలకును జనులు పోయిరి కలువరి పై కలిసికొనిరి ||ఎంత||

  • పావనుండగు ప్రభువు మనకొరకై యా సిలువమీఁద చావునొందెడు సమయమందున దేవుఁడా నా దేవుఁడా నన్నేల చెయివిడిచితివి యనియా రావముగ మొఱబెట్టెను యె హోవయను దన తండ్రితోను ||ఎంత||

  • అందు దిమిరము క్రమ్ము గడియయ్యొ నా నీతి సూర్యుని నంత చుట్టెను బంధకంబులు నిందవాయువు లెన్నో వీచెను కందు యేసుని యావరించెను పందెముగ నొక కాటువేసెను పాత సర్పము ప్రభువు యేసును ||ఎంత||

  • శాంతమాయె నటంచుఁ బలుకుచును ఆ రక్షకుఁడు తన స్వంత విలువగు బ్రాణమును వీడెన్ ఇంతలో నొక భటుఁడు తనదగు నీటెతోఁ ప్రభు ప్రక్కఁ బొడువఁగ చెంతఁజేరెడి పాపులను ర క్షించు రక్తపు ధారఁ గారెను ||ఎంత||
  • 208 హర్షమే యెం 10/19/2017 20:16 208 209 నా కొఱకుఁ 10/19/2017 20:16 209 210 గాయంబుతో న 10/19/2017 20:16 210 > 211 సిల్వయొద్ద 10/19/2017 20:16 211 212 మహాత్ముఁడై 10/19/2017 20:16 212 213 మరణమున్ జయ 10/19/2017 20:16 213 మరణమున్ జయించి లేచెను మన ప్రభువు నేఁడు మహిమ దేహ మొనరఁ దాల్చెను ధర సమాధి బంధములను ధన్యముగను త్రెంచి లేచి కొఱత లన్ని తీర్చి జీవ వరము లియ్య వసుధపైని ||మరణమున్||

  • మరియయును సలోమి మొదలగు మగువలు సబాతు మరు దినోదయమునఁ బ్రియ మగు గురుని దేహమునకుఁ బూయఁ బరిమళంపుఁ దైలములను సరగఁ దీసికొని సమాధి కరుగుదెంచి కనులఁజూడ ||మరణమున్||

  • నేఁడు ప్రభుసమాధి ముఖముపై నున్న రాయి నెవఁడు దీయు కరుణను మనకై చేడియ లిట్లనుచు వేగఁ జేరి యా సమాధి మూఁత వీడి యుంటఁ జూచి మిగుల విస్మయమ్ము నంది రపుడు ||మరణమున్||

  • వారు తెల్ల నిలువుటంగిఁతో గూర్చున్న పడుచు వానిఁ జూచి మిగుల భయముతోఁ జేరరాక నిలిచియున్న వారి నతడుగాంచి యమ్మ లార భయపడకు డటంచు నూరడించె నుచితముగను ||మరణమున్||

  • కొరత పైని మరణ మొందిన నజరేయుఁ డేసు కొరకు మిగుల వెదకు చుండిన తరుణులార మీ ప్రభుండు తిరిగి బ్రతికె నిక్క మిద్ది సరగపేతు రాది శిష్య సమితితోడఁ జెప్పుడనియె ||మరణమున్||

  • మానితముగ మీకిట ముందు ప్రభు వనిన యట్లు కానఁబడును గలిలైయ మందుఁ గాన వెళ్లుడంచు భాసి తానరుండు పల్క వినుచు దీన జనులు జడిసి మిగుల దిగులు నొంది వణకి రపుడు ||మరణమున్||

  • మొదట మగ్దలేనే మరియకుఁ గనఁబడె నటంచు సుదతి దెల్పె శిష్య వరులకు కొదువలేని సంతసమునఁ గోర్కె దీరఁ బ్రభునిఁ జూడఁ బదిలమైన యత్నములకుఁ బరఁగఁ జేసి చూచి రపుడు ||మరణమున్||

  • అంతఃశత్రు వైన మరణమును ప్రభువు గెల్చె సంతసించి సన్నుతింతము వంత లేల భక్తులార వాస్తవముగ మనల నిటుల నంత్య దినము నందు లేపు నమల దేహముల నొసంగు ||మరణమున్||
  • 214 రండు విశ్వ 10/19/2017 20:16 214 రండు విశ్వాసులారా రండు విజయము సూచించు చుండెడు సంతోషంబును గల్గి మెండుగ నెత్తుడి రాగముల్ నిండౌ హర్షము మనకు నియమించె దేవుఁడు విజయం, విజయం, విజయం, విజయం ||విజయం||

  • నేటి సమయ మన్ని యాత్మలకును నీ టగు వసంత ఋతువగును వాటముగఁ జెరసాలను గెలిచె వరుసగ మూన్నాళ్ నిద్రించి సూటిగ లేచెన్ యేసు సూర్యుని వలెన్ ||విజయం||

  • కన్ను కన్నుకానని చీఁకటి కాలము క్రీస్తుని కాంతిచే నిన్నాళ్లకు శీఘ్రముగఁ బోవు చున్నది శ్రీ యేసుని కెన్నాళ్ల కాగని మన సన్నుతుల్ భువిన్ ||విజయం||

  • బలమగు మరణ ద్వారబంధ ములు నిన్ బట్టకపోయెను వెలుతురు లేని సమాధి గుమ్మ ములు నిన్నాపక పోయెను గెలువ వాయెను కా వలియు ముద్రయు ||విజయం||

  • పన్నిద్దరిలోపల నీ వేళ సన్నుతముగ నీవు నిలిచి యున్నావు మానవుల తెలివి కెన్నఁడైన నందని యౌన్నత్య శాంతిని న నుగ్రహింతువు ||విజయం||
  • 215 సుదతులార మ 10/19/2017 20:16 215 సుదతులార మీ రిచ్చోట నెవ్వరి వెదుకుచునున్నారు మృదువుగాను జీ వించు వాని పెద్ద నిదుర బోయినటు లెదలందు భావించి ||సుదతులార||

  • ఇచట లేఁడు లేచి యున్నాఁడు ప్రభు క్రీస్తు యేసు స్వతంత్రుఁడై ప్రచురంబుగఁ దన పాట్లు లేచుటయును వచియించె గలిలయ్య వర దేశమున మీతో ||సుదతులార||

  • మనుజ కుమారుఁ డె క్కుడు పాపిష్ఠులచేత మరణ మొందుట సిల్వ పైఁ దనకుఁ దానె మూఁడవ దినమందు లేచుట యును దెల్పెఁ గద మీరు వినుచుండఁగఁ దొల్లి ||సుదతులార||

  • ఎదలలోన జ్ఞాప కము చేసికొనుఁడింక యేసు తెల్పిన మాటలు ముదముతో జీవముఁ గని లేచె నను వార్త సుదతు లాలకించి రది నిక్కముగఁ దోఁచఁ ||సుదతులార||
  • 216 విజయంబు వి 10/19/2017 20:16 216 విజయంబు విజయంబు విజయంబు మా యేసు నిజమె మృత్యువు గెల్చి నేఁడు వేంచేసె యజమానుఁ డెల్ల ప్ర యాసము లెడఁబాప స్వజనుల రక్షింప సమసె సిలువమీఁద ||విజయంబు||

  • విజయంబు విజయంబు విజయంబు మానవుల వృజిన నివృత్తిని విభుఁ డొనరింపన్ గుజనులచే నతఁడు క్రూర మరణము నొంది విజిత మృత్యువు నుండి విజయుండై వేంచేసె ||విజయంబు||

  • విజయంబు విజయంబు విజయంబు మా యేసు భుజము మీఁదను మోయుఁ బరిపాలనంబు కుజము మీఁదను బ్రాణ త్యజనము జేసెను ధ్వజము మోయుచు సిల్వ పాప మోడింతము ||విజయంబు||

  • విజయంబు విజయంబు విజయం బిఁకను మా క పజయము కాకుండఁ బ్రభు యేసు క్రీస్తు సుజనత్వమున వైరి వ్రజము గెల్వఁగఁజేసి నిజముగఁ బరలోక నిలయంబులో నిల్పు ||విజయంబు||

  • విజయంబు విజయంబు విజయం బనెడి పాట నిజభక్తితో మనము నేర్చిన వాని భజియించుదము భూన భములు తాఁ బాలించు అజిత జీవ ప్రదుఁ డమరత్వ మిడు మనకు ||విజయంబు||
  • 217 హలెలూయ యని 10/19/2017 20:16 217 హలెలూయ యని పాడుఁడీ సమాధిపై వెలుఁ గేమొ పరికించుఁడీ కలఁడు యేసు సజీవుఁడయి, లే ఖనముల లవి నెరవేరెను కలిమి మోదము గులగ, దివి నుతి సలువ మహిమను వచ్చును ||హలెలూయ||

  • హలెలూయ యని పాఁడుడీ యీ జగతికిఁ కలిగె రక్షణ చూడుఁడీ శిలఁ దొలంగెను, ముద్ర విడె, కా వలి సమాజము దేవుని బలిమి కాగక పారిపోయెను గలిబి లాయెను నరకము ||హలెలూయ||

  • హలెలూయ యని పాడుఁడీ చీఁకటిపైని వెలుఁగే జయ మొందుసుండీ యిలను మృత్యువు గూలె, బ్రతికెఁగా యల విశ్వాసము మరలను బలనిరీక్షణ మనకుఁ గలిగెను బ్రతిహృదయము బలపడెన్ ||హలెలూయ||

  • హలెలూయ యని పాడుఁడీ దుఃఖించు నో చెలియలారా వినుఁడీ సొలయకుండఁగ మీర లటునిటు చూచుచుండుట యెవరిని ఫలము లేదిఁక బ్రతుకు యేసు ప్రభుని వెదకుట మృతులలో ||హలెలూయ||

  • హలెలూయ యని పాడుఁడీ యేసు ప్రభుని వలననే గలిగెఁగనుఁడీ యిలయుఁ బరమును సఖ్యపడియెను గలిగె హర్షము చావుచే సిలువ చింతలు మాని, పొందుఁడి కలకలంబగు మోదము ||హలెలూయ||

  • హలెలూయ యని పాడుఁడీ మీ భూరి చిం తలుతీరె మది నమ్ముఁడీ బలహీనపు చిన్న మందా! ప్రభుని చెంతకు మరలుము కలుగు జీవము మిమ్ము నాయన కరుణతో నడుపును సదా ||హలెలూయ||

  • హలెలూయ యని పాడుఁడీ సంఘము సదా నిలిచి యుండును సుమండీ పలు తెరంగుల రిపుల వలనను బాధ లెన్నియుఁ గలిగినన్ దొలఁగ కేమియు నన్ని యడ్డుల గెలిచి వర్ధిల్లుచుండును ||హలెలూయ||

  • హలెలూయ యని పాడుఁడీ దేవుని బోధ కులు సర్వరాష్ట్రంబుల నెలమి మహిమకుఁ బ్రథమ ఫలమగు యేసు రక్షణ వార్తను వెలుఁ గువలెఁ బ్రసరింపఁ జేయుదు రిలను ధృతితో నేర్పుతో ||హలెలూయ||

  • హలెలూయ యని పాడుఁడీ భక్తులారా విలపింపవలదు సుండీ కలుగకుండుఁడి సందియంబులు గడుచు కాలము శీఘ్రమే కలుగు మీకు సమాధి మిమ్మును గౌఁగిలింప నెమ్మది ||హలెలూయ||

  • హలెలూయ యని పాడుఁడీ గోధుమ గింజ వలె బ్రతుకుదురు మీరల ఇల ప్రభువు తన పంటఁ గూర్పను నేగుదెంచును జివరను తొలఁగఁ జేయును గురుగులను గో ధుమలనుండి నిజంబుగా ||హలెలూయ||
  • 218 యేసు లేచెన 10/19/2017 20:16 218 యేసు లేచెను ఆదివారమున యేసు లేచెను వేకువజామున యేసు లేచెను||

  • వేకువజామున చీఁక టుండఁగానే యాకాశదూతలు వీకతో రాఁ గానే ||యేసు||

  • సమాధిపై రాతిన్ స్వామి దూత లిద్దరు సమముగఁ దీయను స్వామి లేచె నహహ ||యేసు||

  • మృతులలో సజీవున్ వెతకు టేల నని దూతలు వారితో దాత లేఁడని తెల్పి ||యేసు||

  • స్త్రీలు వేగ వెళ్లి శిష్యులకుఁ దెల్ప జింత మారిపోయి సందేహము తొల్గ ||యేసు||

  • పేతురు యోహానుల్ పరుగెత్తుకొని వచ్చి ప్రవేశించి గుహలో పరమానంద మొంద ||యేసు||

  • యేసు చచ్చి లేచె యేసు శిష్యులట్లే దోసంబులకుఁ జచ్చి వాసిగ లేతురండి ||యేసు||
  • 219 క్రీస్తు ల 10/19/2017 20:16 219 క్రీస్తు లేచెను హల్లెలూయ క్రీస్తు నన్నులేపును ఇద్దియె సునాద సత్యము ఇలను చాటుడి నిత్యము||

  • మృతుల పునరుత్థాన పంటకు ప్రథమ ఫలమగు క్రీస్తులో మృతులు లేతురు నేను లేతును నాదువరుసలో నిజమిది||

  • పాపమరణ నరకబలములు ప్రభుని శక్తికి ఓడెను పాపినగు నను బ్రోవ క్రీస్తుని ప్రాణదాన ప్రభావము||

  • మరణమా! నీముల్లు యెక్కడ? మరణమా! జయమెక్కడ? మరణమా! నీముల్లు విరిగెను మహిమ క్రీస్తులో నిప్పుడు ||

  • శిలయు ముద్రయు బలిమికావలి గలిబిలాయెను రాత్రిలో ఇలయు పరమును కలుసుకొనియెను గెలుపునొందిన క్రీస్తులో ||

  • మృతులు నీదగువారలందరు బ్రతికి లేతురు సత్యము ప్రేతలను జీవింపచేయును పృథివి క్రీస్తుని విజయము ||

  • స్తుతియు మహిమయు ఘనత నీకె స్తుతికి పాత్రుడ రక్షకా స్వంత రక్తము చిందితివి నా స్వామి యిదెనా యంజలి ||
  • 220 యేసు పునరు 10/19/2017 20:16 220 యేసు పునరుత్థానమాయెను చావునొంది క్రీ స్తేను పునరుత్థానమాయెను యేసు పునరుత్థానమాయె దాసులెల్ల నుతింప వింతగ భాసురంబుగ భక్తలంబర వాసులుగఁ దాఁజేయు నిప్పుడు ||యేసు||

  • బేధపడి యా సిల్వమీఁదను దుష్టాత్మ లాయన నాదరంబుగఁ బట్టి మోదను పాదుకొని ప్రేమన్మతిన్పరి పంధి జనుల గావుమంచును సాదరంబుగ వేఁడె తండ్రిని శత్రులను రక్షింప నిప్పుడు ||యేసు||

  • దుష్టజను లేతెంచుచున్నారు నన్నుఁబట్టి చాలఁగ గష్టపెట్టఁ దలంచు కొన్నారు విష్టపంబున సిల్వమీఁదను వేదన క్రూరముగ బెట్టుచు భ్రష్టులైనను బాసిమీరఁక పారిపోయెదరంచు నిప్పుడు ||యేసు||

  • ఆమహిన్పరి శుద్ధవంతుఁడై జన్మించె దేవుని నీయందున నీతిమంతుఁ డై యీ మహిని బోధింప దోష వి హీనుఁడైన నిరపరాధిని స్వామి ద్రోహిగ నెంచి యూదులు చంపి పూడిచిపెట్ట నిప్పుడు ||యేసు||
  • 221 యేసు సమాధి 10/19/2017 20:16 221 యేసు సమాధిలో పరుండియుండి వాసిగ మూఁడవ నాఁడు లేచెన్. || లేచెన్ సమాధినుండి మృత్యువుపై విజయమొంది శత్రువు నోడించి జయశాలియై నాత్యముం జీవించ మధ్యవర్తియై; లేచెను! లేచెను హల్లెలూయ! లేచెను ||

  • వ్యర్థమే కావలి సమాధియొద్ద వ్యర్థంబు ముద్రయు యేసూప్రభూ!

  • మృత్యుబంధంబులన్ నిత్యుండు త్రెంచెన్ స్తుత్యుండు జయించెన్ జయం! జయం!
  • 222 క్రీస్తు న 10/19/2017 20:16 222 క్రీస్తు నేడు లేచెను ఆ ఆ ఆ హల్లెలూయ మర్త్యదూత సంఘమా ఆ ఆ ఆ హల్లెలూయ భూమి నాకసంబులో ఆ ఆ ఆ హల్లెలూయ బాడుమిందు చేతను ఆ ఆ ఆ హల్లెలూయ.

  • మోక్ష మియ్య నాథుడు ఆ ఆ ఆ హల్లెలూయ యుద్ధమాడి గెల్చెను ఆ ఆ ఆ హల్లెలూయ సూర్యుఁడుద్భవింపగ ఆ ఆ ఆ హల్లెలూయ చీకటుల్ గతించెను ఆ ఆ ఆ హల్లెలూయ.

  • బండ, ముద్ర, కావలి ఆ ఆ ఆ హల్లెలూయ అన్ని వ్యర్థమైనవి ఆ ఆ ఆ హల్లెలూయ యేసు నరకంబును ఆ ఆ ఆ హల్లెలూయ గెల్చి ముక్తిఁ దెచ్చెను ఆ ఆ ఆ హల్లెలూయ.

  • క్రీస్తు లేచినప్పుడు ఆ ఆ ఆ హల్లెలూయ చావుముల్లు త్రుంచెను ఆ ఆ ఆ హల్లెలూయ ఎల్లవారిఁ బ్రోచును ఆ ఆ ఆ హల్లెలూయ మృత్యువింక గెల్వదు ఆ ఆ ఆ హల్లెలూయ.

  • యేసు మృతి గెల్చెను ఆ ఆ ఆ హల్లెలూయ మేము కూడ గెల్తుము ఆ ఆ ఆ హల్లెలూయ యేసుఁడుండు చోటుకు ఆ ఆ ఆ హల్లెలూయ మేము కూడఁ బోదుము ఆ ఆ ఆ హల్లెలూయ.

  • భూమి నాకసంబులో ఆ ఆ ఆ హల్లెలూయ యేసు, నీకు స్తోత్రము ఆ ఆ ఆ హల్లెలూయ మృత్యు సంహారకుండ ఆ ఆ ఆ హల్లెలూయ నీదె నిత్యజయము ఆ ఆ ఆ హల్లెలూయ.
  • 223 క్రీస్తు ప 10/19/2017 20:16 223 క్రీస్తు ప్రభుని ప్రత్యక్షతలను వివ రించెద వినరే ప్రియులార వాస్తవముగ మరణించి బ్రతికెనని వసుధలోఁ బ్రకటింపరె యూరూరఁ ||గ్రీస్తు||

  • మరియ మగ్దలేనెకుఁ బ్రథమంబున మన గురువర్యుం డగపడియెఁ తరుణీమణులకు రెండవ మాఱొక దర్శనము దయతో నిడియెఁ ||గ్రీస్తు||

  • సీమో నను పేతురును గూడ ద ర్శించె నతఁడు మూఁడవ మాఱు ప్రేమతోడ నిమ్మాయి శిష్యులకుఁ బ్రియ మొనరించె మఱొక తీఱు ||క్రీస్తు||

  • తోమాలేని తరుణమునఁ బదుగురి తో వచించె గృహమునఁ జేరి తోమాకు కనపడి యతని సంశయముఁ దొలఁగించెను బ్రభుఁ డొకసారి ||క్రీస్తు||

  • సందరంపు దరి నేడుగురికి మ త్స్యంబులు వింతగ సమకూర్చె సందర్శించియు యాకోబునకును సంతోషము నెంతయుఁ గూర్చెఁ ||క్రీస్తు||

  • ప్రభుఁ డొక మాఱే నూరుగురిఁ దాఁ బ్రత్యక్షుం డయ్యెను పేర్మి నషయ మొసంగి యపొస్తలులకుఁ క్రీ స్తారోహణుఁ డయ్యెను గూర్మిఁ ||క్రీస్తు||

  • హత్యఁ జేయు నేగెడు తార్సీయున కగపడి రక్షించెను సుమ్ము మృత్యుంజయు డిప్పుడు మన కాత్మలో దృశ్యుం డగు నిది సత్యమ్ము ||క్రీస్తు||
  • 224 ఇదిగో నా శ 10/19/2017 20:16 224 ఇదిగో నా శిష్యులారా యెఱుక లుంచుఁడి మోక్ష సదనమున కేను బోదు సంతోషించు(డి ||ఇదిగో||

  • యెరూషలేమందుండి మీ రెదురు చూడుఁడి మీపైఁ బరిశుద్ధాత్మయు దిగివచ్చి పనులు దెల్పును ||ఇదిగో||

  • దిక్కులేనట్లు మిమ్ము దిగనాడి పోను మీతో మక్కువైయుండఁ బరిశు ద్ధాత్మను బంపెదను ||ఇదిగో||

  • నిర్యాణమున మీకొరకై నెలవులు గల్పింతు నాతో సర్వకాలము నిత్య సామ్రాజ్యము నేల ||నిదిగో||

  • ఒకరితో నొకరు ప్రియము లొప్పి యుండుఁడి నాదు సకలాజ్ఞలందు నిదియె సార మనుకొనుఁడి ||యిదిగో||

  • ఏదైననా పేరిటమీ రించుక వేఁడినను మీకు మోదముతోడదాని ముందే చేయుదును ||ఇదిగో||

  • ఉల్లము లందుఁ గలఁత లెల్ల విడువుఁడి నేను మళ్లి వచ్చెడి విధము మరువకుండుఁడి ||యిదిగో||
  • 225 పరమ ప్రభో 10/19/2017 20:16 225 పరమ ప్రభో యేసురక్షకా ధననరుల బ్రోచి పరమ కారోహణంబైతివా మరియయందు జననమొంది వరము లిడుచు దిరిగిధరను మరణమొంది తిరిగిలేచి పరము కేగితివా ప్రభో ||పరమ||

  • ఘోర పాపభారముతోడ దరిగానలేకఁ దిరుగుచుండినట్టి మమ్మును కూరిమితోఁ దరికిఁబిలిచి భారమును నీవేమోసి ఊరకమము క్షమియించి నేరములను బాపిన ప్రభో ||పరమ||

  • సిలువమరణమొందినఁ ప్రభువా ఇలనరుల ఘోర కలుషములను బాపిన ప్రభువా విలువలేని నీదు బ్రతుకు బలముగల నీ ప్రేమ సేవ సలితముగ ననుకరించి ఇలను మేము బ్రతుకునట్లు ||పరమ||

  • చెఱను చెఱగఁబట్టిన ప్రభువా ధనరులకెల్ల వరములను విరివి నిడితివా పరముకేగి పరమతండ్రి పరమున కుడిపార్శ్వమందుఁ దిరముగాఁ గూర్చుండి యుండి తిరిగి ధరకు వచ్చెదవా ||పరమ||

  • నీదు రాక కెదురుజూచెడి నీ దాసులను సదయతతో జూడుమో ప్రభో మాదినపు ప్రార్థనలను మాదు స్తోత్రములను మిగులఁ బ్రోదిగా గైకొనుచు నేడు బ్రోవుమయ్య మమ్ములను ||పరమ||

  • పంపుమయ్య నీదు ఆత్మను పదిలముగ దయతో సొంపుగ నీ శుద్ధాత్మను నింపుమయ్య నీదు కృపతో ఇంపగు నీవరములతో సొంపు గాను నీదు సేవ జేయనిలను నెల్లపుడు ||పరమ||
  • 226 మేఘంబుపై న 10/19/2017 20:16 226 మేఘంబుపై నెక్కి మేలుగ ప్రభు క్రీస్తు యాకసంబున కేగెను ప్రాకటముగను ఆత్మనంది ప్రజ్ఞ మీరగ సాక్ష్యమిచ్చి యేక దీక్షను యేసు రాకకు నెదురు జూడుడటంచు ప్రభువు ||మేఘంబు||

  • యూదయ్య సమరయ్య ప్రాంతంబులంతట నాదు వార్తను జాటరే భూదిగంతము వరకు మీరు భూరి సాక్షులగుచు నాకు సాదరంబుగ సత్య విశ్వా సంబులన్ మనుడంచు ప్రభువు ||మేఘంబు||

  • గలిలయ్యులార మీ రాశతో నెందుకు తిలకించు చున్నారట్లు వెలయపరమున కెట్లు నేగెనొ యిలకు నా ప్రభువట్లెమరల యలర వచ్చుట మీరు గాంచెద రంచు దూతలు బల్కిరపుడె ||మేఘంబు||

  • శ్రీ సంఘ మిదివిను మా యేసు ప్రభు క్రీస్తే భాసిల్ల మఱి వచ్చును యేసు ప్రభుని యడుగు జాడల యేపు మీరగ నడచు కొనుచు నీసు రక్షణ నిలకుజాటుచు నెదురు జూడుము యేసు కొఱకే ||మేఘంబు||
  • 227 కోలాహలముగఁ 10/19/2017 20:16 227 కోలాహలముగఁ గూరిమితోఁ గూడి కోలాటమాడను రా రా మా పాలిటి యేసుని పేరఁ మాపాలిటి యేసుని పేర మ మ్మేలెడి దేవుని పేరఁ ||గోలాహలముగ||

  • మా సామి యా మోక్ష వాసుండు నైనట్టి యేసయ్య పోకను జూడు మా యేసయ్యరాకను బాడు యేసయ్య రాకను బాడు నీ హోసన్న యని మదివేడు ||కోలాహలముగ||

  • పాపంబులన్ మోసి ప్రాణంబు బలి యిచ్చి తాఁ బరమున కేగలేదా నీ జ్ఞాపకములోనికి రాదా జ్ఞాపకములోనికి రాదా నీ ప్రాపకుఁడై యుండలేదా ||కోలాహలముగ||

  • ఏలినవాడైన యేసుని రాకను నాలించి చూడవదేర నిను పాలించు వాడనుకోర పాలించువాడనుకోర పరి శీలించువాడనుకోర ||కోలాహలముగ||

  • అంతములో భువి కా యేసునాధుండు చెంతను దూతలతోడ బల్ వింతగ వచ్చును జూడ వింతగ వచ్చును జూడ న త్యంత బలముతోడ రాఁడ ||కోలాహలముగ||

  • ఆకాశ భూమ్యాదు లార్భటిలు దూతల మూకలతోఁ గూడినాఁడు ఈ లోకాని కేతెంచుఁవాడు లోకాని కేతెంచువాఁడు ఇఁక వీకతోఁ బ్రభుని బాడు ||కోలాహలముగ||

  • భీకర సింహపు టాకారముతోను ఢీకొని మేఘములతోడ బల్ బాకారవంబులు బాడ బాకారంబులు బాడ నిటు ఢీకొని వచ్చెను జూడ ||కోలాహలముగ||

  • భాసురమైనట్టి యేసయ్య రాకను ఈ సూర్యుఁడు జూడలేఁడు తన వి కాసము జీఁకటౌను వి కాసము జీఁకటౌను నీ కా సుగతిఁ జూపువాఁడు ||కోలాహలముగ||
  • 228 నా(డు వచ్చ 10/19/2017 20:16 228 నా(డు వచ్చినట్లు గాదు నేఁడు వచ్చుట తేరి చూడరాదు క్రీస్తు నింకఁ జొత్తు మెచ్చుట ||నాఁడు||

  • మొదట గొఱ్ఱెపిల్ల రీతి నొదిగి వచ్చెఁగా యిపుడు కొదమ సింహమయ్యె మనకు గుండె దిగులుగా ||నాఁడు||

  • దాసునివలె దొల్లిఁ జూచినాముగా యిపుడు దోసము లెంచి దండింప దొరయైనాఁడుగా ||నాఁడు||

  • ఏ తట్టు బోయిన మనకు నెదురు వచ్చెఁగా పిడుగు రీతి వాని యుగ్రమైన దృష్టి హెచ్చఁగా ||నాఁడు||

  • కొండ వండ లందు డాగి యుండలేముగా వాని యండనుండి మండు నగ్ని యదిగో వచ్చెఁగా ||నాఁడు||

  • దిక్కుగా నున్నట్లు నితర దేవతలను నమ్మి వట్టి పుక్కిటి పురాణములకుఁ బోయి చెడితిమి ||నాఁడు||

  • వీధుల బోధించు వారి వినక పోతిమి యిపుడు బాధఁ బొంది నరకాగ్నిలోఁ బడఁబాలైతిమి ||నాఁడు||
  • 229 మహిమతో మన 10/19/2017 20:16 229 మహిమతో మన యేసు ఇహమునకు వేంచేయున్ సహోదరులారా మన మా మహిమలో వెలుఁగుదుము ||మహిమతో||

  • మోములు వంచి యేసు నామము నుతియించు పామరులమైన మనలఁ బ్రేమతోఁ గప్పినాఁడే ||మహిమతో||

  • పాత్రులమా మనము శత్రులమే కాదా మిత్రులన్ జేసిన వి చిత్రము తెలియలేము ||మహిమతో||

  • శిరముల పైని జీవ కిరీటములతోను బరమ దేవుని వరములు మురి యుచు మరువలేము ||వచుహిమతో||

  • వీణెలతో మనము నాణెమైన పాట ఋణము చెల్లింపలేమని యణఁ గి మణఁగి పాడుదుము ||మహిమతో||
  • 230 అయ్యో యిది 10/19/2017 20:16 230 అయ్యో యిది దుఃఖము ప్రభు తీర్పువేళ నయ్యో యిది యెంత దుఃఖము చయ్యన యెహోవా సింహా సనము చుట్టు వహ్ని మండు నయ్యెడ విశ్వాసులకు దు రాత్మల కగు నిత్య ఖేద ||మయ్యో||

  • తల్లి పిల్లలు గూడుదు రచటఁ దండ్రి తాత లచటఁ గలియుదు రెల్ల కాల మటుల నుండ కెడబడి మరి యెపుడు చూడ ||రయ్యో||

  • అన్నదమ్ములచటఁ గూడుదురు రక్క సెలియలందుఁ గలియుదు రెన్నఁ డు మరి చూడ రాని యెడఁగల స్థలములకుఁ బోదు ||రయ్యో||

  • భార్యాభర్తలు గూడుదురు రచట బంధు మిత్రులు కలియుదురు రందుఁ కార్య భేదమువలన సర్వ కాలము మరి కూడఁజాల ||రయ్యో||

  • క్రీస్తు మత ప్రబోధకులు స మస్త శిష్యులు కూడుదు రచట వాస్తవ స్థితు లెరుఁగఁబడిన వలనను విడఁబడుదు రంద ||రయ్యో||

  • శిష్టులు దుష్టులు కూడుదు రచట స్నేహవంతు లందుఁ గలియుదు రిష్టము గాని భిన్నులగుచు నిఁక మరి యెన్నటికిఁ గూడ ||రయ్యో||

  • అల పిశాచి పాపు లందరు నడుపు కర్తకు భిన్ను లగుచు పలుగొరుకుల నిత్య నరక బాధల పాల్బడక పోరు ||అయ్యో||

  • సాధు సజ్జనంబు లెల్ల సకల దూతలతోడఁ గూడి మోదముతో ప్రభుని వెంట ముక్తి కేగి నిత్యులగుదు రాహా యిది యెంత విజయము ప్రభు తీర్పు వేళ నాహా యిది యెంత విజయము ||అయ్యో||
  • 231 ఓహోహో మా య 10/19/2017 20:16 231 ఓహోహో మా యన్నలారా యుద్యోగింపండి యిపుడే త్రాహి త్రాహి యనుచుఁ క్రీస్తుని దయను గోరండి ||ఓహో||

  • అంత్యదినము నాటి బాధ లాలకించండి నరక ప్రాంతమునకుఁ బోకమునుపే ప్రభువును వేడండి ||ఓహో||

  • మింట ప్రభువు తేజోమయమౌ మేఘారూఢుండై యగ్ని మంట వీను సింహాసనము నంటి కూర్చుండు ||ఓహో||

  • అంధకారమగును సూర్యుఁడా దినమందు కుముద బాంధవుడు మిగుల రక్త వర్ణము నొందును ||ఓహో||

  • కడు భీతిగ సర్వసృష్టి కంపించుచు నుండున్ భూమి కడలి యభ్రము తాపమున కరిగి పోవుచుండున్ ||ఓహో||

  • నరక ప్రచండాగ్ని గుండ మరదై గన్పడును దానిఁ జొరక మరి యే తెరువు పాపా త్ములకు గలుగును ||ఓహో||

  • ప్రేమతో నడిగెదను నా ప్రియబంధువులార మీర లామహా దినమందున దిరమై యట నిలువంగలర ||ఓహో||

  • కామక్రోధ లోభమోహ గర్వగుణములను మీరు ప్రేమించి చేసితిరి గద పెక్కు విధములను ||ఓహో||

  • కల్లలాడుచుడి ప్రొద్దుఁ గడుపుచుంటిరే యింక చిల్లర వేల్పుల పూజ చేయుచుంటిరే ||ఓహో||

  • ప్రకటంబుగ నైన మరి గు ప్తస్థల మందైన చేయు సకల క్రియలు ప్రభువున కెఱుక సంపూర్ణముగాను ||ఓహో||

  • జాతి గోత్రమడుగఁ బోడు సర్వేశ్వరుండు క్రియల రీతి మనసు మాత్రమె విచా రించు ప్రభువతఁడు ||ఓహో||
  • 232 కోప దినము 10/19/2017 20:16 232 కోప దినము వచ్చును పాపుల గుండె పగులు కాలము వచ్చును శ్రీ పాల యేసుని దాపునఁ జేరక మాపు రేపులు మహ పాపులకును గొప్ప ||కోప||

  • భువిలో రాల కర్రల పూజలఁజేయు చవి దేవుండ్లని చెప్పెడి అవిగాక తమవంటి నరులదేవుండ్లని యవివేకముగ నమ్ము నరులందరికి నెంతో ||కోప||

  • నరహంతకులు దొంగలు వ్యభిచారులు మరి యబద్ధికు లందఱు ఇరుగు పొరుగు వారి నిఁక మోసములు చేయు నరులందఱు చెడ్డ నరకములోఁ బడునట్టి ||కోప||

  • ఆట పాటలవల్లను పాపము చాల వేటాడుకొను వారలు బూట కముల వారలు భువిలో యక్షిణిగాండ్రు మాటలాడక యగ్ని మడుగులో బడి కాలే ||కోప||

  • కులభేదములు గల్పించి కుటిలమందు బలముగ బ్రతుకుచుండు ఇల మాయవాదుల కిఁక నేమి గతిలేక పలుగొరుకులు నుండె బాధల పాలయ్యెడు ||కోప||

  • మీఁది దేవునివలనను యియ్యంబడెడు వేద మొక్కటి సత్యము ఆధారమైయుండు నాత్మరక్షణ కది సాధులైనమ్మని భేదకులకు నెంతో ||కోప||
  • 233 వచ్చును క్ 10/19/2017 20:16 233 వచ్చును క్రీస్తు వచ్చును భూలోకమునకు వచ్చును క్రీస్తు వచ్చును చెచ్చెరను మేఘములపె రవ మిచ్చు బూర సునాదములతో హెచ్చుగను దూతస మూహము లచ్చుగను సేవింపగ్రక్కున ||వచ్చును||

  • అంతటను సకల భూజనులు వింతగను బూర ధ్వనియు విని నంతలోనె సజీవులై ప్రభు చెంత నిల్తు రపార మహిమను ||వచ్చును||

  • ఒనరగనుఁదన మేఘ సింహా సనముపైఁ గూర్చుండి పావన జనుల బారుల నిరుపార్శ్వము లను విభజనముఁ జేయు నిక్కము ||వచ్చును||

  • అదను నిది యని హృదయములు ప్రభు పదయుగళ సున్నతియెఱుంగక మద దు రేచ్ఛల గెదరు పాపుల హృదయములు చెదరి భీతిల్లఁగ ||వచ్చును||

  • అమిత పాపాత్ముల నరకలో కమునఁ బడవైచి సుజన సమూ హముల దనవెను వెంటఁ గొని చను విమల నిత్య కిరీటము లొసఁగఁ ||వచ్చును||

  • తల్లి పిల్లల నెడబాసియు నల్లకల్లోలముగ భువిపై తల్లడిల్లుచు నొకరి నొక్కరు నెల్లకాలము జూడని గడియ ||వచ్చును||
  • 234 యేసు వచ్చె 10/19/2017 20:16 234 యేసు వచ్చెడి వేళాయె సోదరులారా కాశమేఘములతోను భాసురమగుతన నివాసంబునకుమనల దీసుకపోయిప్రకాశితులను జేయ ||యేసు||

  • నిద్రమేల్కొను వేళాయె సమయము దెలిసి ఓరిమితో నుండరే భద్రముగా శత్రుయుపద్రవమును దాటి సిద్ధపడుఁడి ప్రభునియొద్ద నివసించుటకు ||యేసు||

  • తనువును బలిపెట్టిన మన రక్షకుఁడు ఘన మహిమలోకి వెళ్లి తన యింట స్థలములు మనకు సిద్ధముఁజేసి చనుదెంచు వేళాయె కనిపెట్టి యుందాము. ||యేసు||

  • చాలారాత్రి గతించెను సోదరులారా వెలుగు సమీపించెను వేల దూతలతోడ యేసయ్యవచ్చును కాలగురుతులగని మేలుకొనరెవేగ ||యేసు||

  • శోధన కాలమీదే యీధరణిలో బాధలురావచ్చును నాధుఁడైన యేసుపాదముల కడనుండ యేది కీడుచేయలేదు మనపై నెపుడు ||యేసు||

  • మనలను బ్రేమించుచూ మన పాపముల దనరక్తమున గడుగుచు ఘన దేవునికి నర్చకులనుజేసిన ప్రభుని కొనియాడి బలమహిమలను జెల్లింతుము నిరత ||యేసు||
  • 235 ప్రభు పునర 10/19/2017 20:16 235 ప్రభు పునరాగమరీతి విను మో ప్రభాతగీతి చయ్యన రానయె జ్యోతి సమయంబులేదు ధాత్రి ||ప్రభు||

  • పవలు పదియురెండు ఘంటలు పాపతమోహేళి భువనంబులు తెల్వి దేల్చి ప్ర బోధ సుప్రభాళి కువలయు త్రాణముకై కడపట కుధర ముపై వ్రాలి చన దవిలిన శోకమున ద్విజాతివి తతి గుండెవిరాళి ||ప్రభు||

  • గతియించెను సంధ్యచీకటి కారుకొనెంధాటి మతి స్వాస్థ్యము నెడగా క్రీస్తు స మాజప్రజాకోటి క్షితితలాన రాజుప్రభవెలి గెన్నొ కింతపాటి అట మృతిభయంకరంబై వడినడి రేయిపోయెదాటి ||ప్రభు||

  • తొలి జాముస్తవముజేసె విహంగమ సంఘములలవోక కడు దీమసమున మింట చటుక్కున దేవేగురుజుక్క జగతీమహోదయంపు చలనము దెచ్చెవేగ బోక కనుభ్రామిక విడవేర భళీతెలవారె తూర్పురేఖ ||ప్రభు||
  • 236 రాజాధి రాజ 10/19/2017 20:16 236 రాజాధి రాజా రారా రాజులకు రాజువై రారా రాజయేసు రాజ్యమేల రారా రవికోటితేజ యేసురారా|| ఓ...మేఘ వాహనంబుమీద వేగమే ఓ.. మించు వైభవంబుతోడ వేగమే ||రాజాధి||

  • ఓ...భూజనంబులెల్ల తేరిచూడగా ఓ...నీ జనంబు స్వాగతంబునీయగా నీ రాజ్యస్థాపనంబుసేయ భూరాజులెల్ల గూలిపోవ భూమియాకసంబు మారిపోవ నీ మహా ప్రభావమునవేగ ||రాజాధి||

  • ఆ...ఆకసమున దూత లార్భటింపగా ఆ ఆదిభక్త సంఘసమేతంబుగా ఆకసంబు మధ్యవీధిలోన ఏకమై మహాసభజేయ యేసునాధ! నీదు మహిమలోన మాకదే మహానందమౌగ ||రాజాధి||

  • ఓ...పరమ యెరుషలేము పుణ్యసంఘమా ఓ...గొఱియపిల్ల క్రీస్తు పుణ్యసంఘమా పరమదూతలార! భక్తులారా! పౌలపోస్తులారా! పెద్దలారా! గొఱియపిల్ల యేసురాజుపేర క్రొత్త గీతమెత్తి పాడరారా ||రాజాధి||
  • 237 పరిశుద్ధాత 10/19/2017 20:16 237 పరిశుద్ధాత్మ నిత్యాత్మ పరమ పావురమా దురతేచ్ఛలను దూర పరచు సత్యాత్మా ||పరిశుద్ధాత్మ||

  • నిత్యంపు వెల్గుచే నింపు జ్ఞానాత్మ సత్యంపు శుభ వార్త సంధించు నాత్మ ||పరిశుద్ధాత్మ||

  • జీవమార్గంబున జీవింప నేర్పి త్రోవఁ దప్పిన వారి భావంబు మార్చు ||పరిశుద్ధాత్మ||

  • పాపాంధకారంబుఁ బాపు నీ వెలుఁగుఁ జూపి మింటికి నడిపి కాపాడి మెలఁగు ||పరిశుద్ధాత్మ||

  • భక్తుఁడు శోధింపఁ బడుచుండునేని యుక్తిఁ దెల్పెడి సర్వ శక్తి నీదౌను ||పరిశుద్ధాత్మ||

  • తిన్ననైన తెలివి తేట నాకిమ్ము నిన్ను సేవించెద నిజము స్తోత్రమ్ము ||పరిశుద్ధాత్మ||
  • 238 దైవాత్మా ద 10/19/2017 20:16 238 దైవాత్మా దిగుము దాసుల పైని నీ దయా దృష్టిఁ పారజేయుము ప్రేమన్ నింపు దేవా యాత్ముండ దిగుము మమ్ముల శుద్ధీకరించుము దయారసముచే ||దైవాత్మా||

  • దైవాత్మా దిగుము ప్రవక్తలు పూర్వంబు నీదు ప్రేరణవలనఁ బ్రవచించిరి పావురమా దిగి మాలో వసించుము పాపుము చీఁకటి వెలుఁగుచు మాలో ||దైవాత్మా||

  • రమ్ము ఓ యున్నతంపు ఆత్మా నాలుగు దెసల నుండి మమ్ముల నావ రించు రమ్ము రమ్ము దిగి యెండిన యెముకలు గానగు లోకుల మీదికి ముదమున ||దైవాత్మా||

  • మే మజ్ఞానాంధకారమునను మునిఁగితిమి గాన చెదరఁగఁజేయు మంధకారము పామర జనులకుఁ బేర్మితో నొసఁగు ను జ్ఞాన ప్రకా శము నిల్పుము మాలో ||దైవాత్మా||
  • 239 ఆత్మా నడుప 10/19/2017 20:16 239 240 శ్రీ యేసు 10/19/2017 20:16 240 శ్రీ యేసు స్వామి తిరిగి మోక్షంబుఁ జేరగా ఒక్కాదరణకర్తను ఒసంగెను.

  • ఆ దేవునాత్మ ప్రీతిగా మదిన్ వసించుచు విధేయులైన మనల పాలించును.

  • సద్గుణ మున్న మనకు ఆ యాత్మ దానము శోధించు దుష్టుని సహా జయించును.

  • ఓ దేవునాత్మ, మమ్మును విశుద్ధిపర్చుము మా హృదయంబులో సదా వసించుము.
  • 241 దివ్య పావన 10/19/2017 20:16 241 దివ్య పావనాత్మ, నీ యీవు లన్ని మంచివి నీదు ముఖ్యదానమీ -దివ్య ప్రేమయే-

  • ప్రేమ దయచూపును ప్రేమ దీర్ఘశాంతము మృతికన్న బలము -దివ్య ప్రేమయే-

  • కాలజ్ఞాన మంతయు కొట్టి వేయబడును ప్రేమ నిత్య ముండును -దివ్య ప్రేమయే-

  • దృష్టిగా విశ్వాసము మాఱఁగా నిరీక్షణ యనుభవమౌఁ గాని -దివ్య ప్రేమయే-

  • విశ్వాస నిరీక్షణ ప్రేమ లీ మూడుండును కాని శ్రేష్ఠమయినది -దివ్య ప్రేమయే-

  • పావనాత్మ! స్తోత్రము నీకుఁ జేయు వారము మాకు దయచేయుము -దివ్య ప్రేమయే-
  • 242 దైవాత్మ పర 10/19/2017 20:16 242 దైవాత్మ పరిశుద్ధుడా ధారాళ ప్రేమను దండిగ నిచ్చి మమ్మును దయన్ దీవించుము.

  • మా యజ్ఞానాంధకారము వ్రయము జేయుము నీ యెక్కువైన తేజము మా యందు పోయుము.

  • మా దర్గుణంబు లెల్లను చెదరఁ గొట్టుము మా పాప మణుపుటకై నీ శక్తిఁ జూపుము.

  • సన్మార్గమందు నిత్యము మమ్ము నడుపుము నీ మోక్షమందు పిమ్మట మమ్మాదరింపుము.
  • 243 పరిశుద్ధాత 10/19/2017 20:16 243 పరిశుద్ధాత్మను గోరుము జీవము యేసు ప్రభుని పేరట వేడుము నరు లందరి మీఁద నా యాత్మ నుంతు నని పరలోకపు తండ్రి పలికె వేదమునందు ||పరిశుద్ధాత్మను||

  • పరిశుద్ధాత్మ లేనిది వేదాగమ పఠన పఠనము గాదది నెర చీఁక టింట సర కులు వెదకు రీతి ప ల్మరు వెదకినను నిర ర్థకమై పోవును వేగఁ ||పరిశుద్ధాత్మను||

  • పరిశుద్ధాత్మ లేనిది వర్షము లేని పైరు చందంబే యది పరబోధక ముల వ ర్తిమైన పనులు జీ వ రహితములై యను భవము గానివై యుండుఁ ||పరిశుద్ధాత్మను||

  • పరిశుద్ధాత్మ లేనిది యేసు ప్రభుని నెఱుఁగు టెఱఁగుట గాదది నర రూపుఁ దాల్చి దు ర్నరుల రక్షణకొరకు మరణ మొందిన ప్రభుని కరుణాధికము వడయఁ ||పరిశుద్ధాత్మను||

  • పరిశుద్ధాత్మ లేనిది జీవము లేని బ్రతుకే బ్రతుకుగాదది దురితేచ్ఛ లను గొప్ప యురులం దగిలి భక్తి తరిగి పోవుట కద్ది దొరకనందున మమ్ము ||పరిశుద్ధాత్మను||

  • పరిశుద్ధాత్మను బొందుట అన్నిటి కన్నఁ ప్రబలంబైన మేలిట నెర నమ్మి మొఱబెట్టు పరమ పావనఁ డద్ది కరుణించి నీ కొసఁగు మరణాంత మగు దనుక ||పరిశుద్ధాత్మను||
  • 244 పరిశుద్ధాత 10/19/2017 20:16 244 పరిశుద్ధాత్ముఁడ దేవ! ప్రభువా నీ కరుణ మా పైన వర్షించు మయ్య వరుఁడా నీ భక్తుల మనముల నాత్మల బలపర్చి రక్షించి మరి స్వస్తి నిడు మయ్య ||పరి||

  • బలమౌ నీ వెలుఁగుచే బలు దేవ భాషల ప్రజల కందర కైక్యముఁ గలిగించి విశ్వాస మున వారి నొనఁగూర్చి వెలయుచుండెడు నీకే విన తుల్ సల్పుదు మయ్య ||పరి||

  • బలమౌ దుర్గమా మిగుల పావనంబగు వెలుఁగా! ప్రభువా దేవుని జ్ఞానము కలిగించి మదితోడఁ బిలువఁ దండ్రీ యంచు వెలుగు సత్య మునౌ నీ బల వాక్య మిడు మాకుఁ ||పరి||

  • విపరీత బోధలను వేరౌ బోధకులను విడువ మా కిడు సాయము కృప నొప్పు యేసే మా గురు వంచు మది నమ్మి యపనమ్మికను మాని యవనిం బ్రతుక నిమ్ము ||పరి||

  • పరిశుద్ధతకు నూటా నెర నెమ్మదికి కర్తా జరిగింప నీ యాజ్ఞలన్ త్వర నొందు చరణములు స్థిర డెందమును నిమ్ము పరిశోధనలు గలుగ భయమొంద నీయకుము ||పరి||

  • మరణ జీవంబు ల స్థిర యోధులను బోలి పరుగెత్త నీ దారినే తిరతఁ దప్పిన వేళ దేహంబునకు శక్తి గరిమతో నిడి సిద్ధ పరచుము మము ప్రభువా ||పరి||
  • 245 రమ్ము రమ్మ 10/19/2017 20:16 245 రమ్ము రమ్ము పరిశుద్ధాత్మా రమ్ము రమ్ము రమ్ము దీవింపఁగ నిమ్ము నీదు కృపను నింపు మా డెందముల్ నెమ్మదిఁ బొందంగ ||రమ్ము||

  • జీవంపు టూటవు ప్రేమ జ్వాల వీవె దేవ దాన మీవె యాద రించువాఁడ ||రమ్ము||

  • దేవహస్త మీవె వరము లన్ని నీవె నీవె తండ్రి వాగ్ధ త్తమ్మయి వెలుగుచుండు ||రమ్ము||

  • మాటలాడు శక్తి నిచ్చి నాయాత్మను మేటిల్ల నను నభి షేకించుమీ దేవ ||రమ్ము||

  • ఇమ్ము నీదు వెలుఁగు నింపు నీ ప్రేమతో కమ్ము నాకుఁ తోడు నన్ను బలపర్చుమా ||రమ్ము||

  • పారదోలు దవ్వు నాత్మ శత్రువుల నిం పార నీదు నెమ్మ దిచ్చి ప్రోవు నన్ను ||రమ్ము||

  • ముందు నీవు నడువ నన్ను డాయ దేది యిందు నన్ను ఁ జెరచు వారు లేరు భువిని ||రమ్ము||

  • జనకుఁ జూపు నాకు నట్లె చూపు సుతుని ననయ మెఱిఁగి దేవ నిను నమ్మి జీవింప ||రమ్ము||

  • జనక సుతాత్మయౌ ఘనత్రిత్వమౌ దేవా నిను సన్నుతింపను నీదు దయ నంపుమా ||రమ్ము||
  • 246 పరిశుద్ధాత 10/19/2017 20:16 246 పరిశుద్ధాత్ముఁడ ప్రభువ! వరదా! మా హృదయమం దిరముల వసి యింపుమా అరుదైన నీదివ్య తరశక్తులను దాల్చి త్వరగా మాపై దిగుమా కరుణాబ్ధివై యిపుడు ||పరిశుద్ధాత్ముఁడ||

  • పరమండలాగ్నివై యరుదెంచి మా హృదయాం తర దురితతూలం బును దరికొల్పి పరిశుద్ధ పఱచి మా యాత్మల మా వరరక్షకునకు న ర్పణ ముగా నిడుమయ్య ||పరిశుద్ధాత్ముఁడ||

  • కాంతులీనెడు దీప కలికవైవచ్చి మా స్వాంతంబులఁగప్పిన యంతు లేని యవిద్యా ధ్వాంతంబుఁ జోపి సు స్వాంతులేగెడు సత్య సరణిఁ జూపింపుమా ||పరిశుద్ధాత్ముఁడ||

  • చలువఁ గూర్చెడు మంచు జల్లురూపమున మ మ్ముల నెల్ల దీవింపుమా ఫలశూన్యంబైన యా ఆత్మలకు నీ బల మొసఁగి ఫలవంతములుగ గే వలుఁడా యొనరింపుమా ||పరిశుద్ధాత్ముఁడ||

  • పరమ పారావతమా! పక్షములు విప్పి మా శిరములపైని చాఁచి పరమందు నీ సంఘ పరిశుద్ధులకువలెనె ధరనున్న మాకు నీ వరముల నిడుమయ్య ||పరిశుద్ధాత్ముఁడ||

  • దివినుండి భువికి నా రవముతో వీతెంచు పవమానాకారుండవై నవ జన్మసంప్రాక్తికవరోధమొనరించు భవదుఃఖాంబుద పటలిఁ బాఱఁ దోలుము కృపచేఁ ||పరిశుద్ధాత్ముఁడ||

  • అందమౌ నీమోము నందుఁ జిందెడు తేజ మందఱు వీక్షింపగా విందవై వచ్చి మా డెందంబులకు నిత్యా నందంబుఁగూర్చి మా వందనంబులు గొనుమా ||పరిశుద్ధాత్ముండ||
  • 247 పరిశుద్ధాత 10/19/2017 20:16 247 పరిశుద్ధాత్మ ప్రభుని వరదివ్యశక్తిబం ధురము ధరణికిజీవ సంజీవము పరమౌన్నత్యంబైన పరలోక సువిశేష పరమార్థములు దెలుపు నెఱిమార్గము ||పరి||

  • ఆపత్కాలమునందు ప్రాపయి మానవజాతి కాపయి సంరక్షించి ఏపారును పాపాంధకారమున బడి మ్రగ్గి శోకించు పాపజాతికి దీప రాశియై రహియించు కృపయు కనికరములు గుంఫించి మధురాతి ప్రభగా భాసిల్లెడు పరమార్థము అపభ్రంశకార్యముల కెపుడు తావీయక సుపురోగతిని జూపి శోధించును ||పరి||

  • బండలనుపమించు గుండియల కదలించు నిండుశక్తి ఘటించు నీతి బెంచు ఎండిన యెదలను నిండించు రక్షణో ద్దండ విలసిత భాగ్య దానమ్ములు దండిగానసమాన ధైర్యోత్సాహములిచ్చి మెండుగా నాదరము మేళవించి మండుచున్న పాప మరణాగ్ని జ్వాలల నుండి పాపిని గాచు నండయౌచు ||పరి||

  • శాంతి సమాధాన సౌజన్యభావమ్ము కాంతిమంతము గల్గు కారుణ్యము అంతములేనట్టి ఆనంద శుద్ధాత్మ శాంతిదాంతియొసంగి సంరక్షించు ఎంతో సంతోషముతో అంతుబొంతులేని వి క్రాంతి బలత్యాగముల గావింప జేయు చింతా ధ్వాంతములోన చెదరికొట్టుకపోవు శాంతిలేని జనతకు సౌఖ్యాస్పదము ||పరి||
  • 248 పరిశుద్ధాత 10/19/2017 20:16 248 పరిశుద్ధాత్మా పావురమా నీ దాసులపై కరుణతో నరుదెంచుమా పరిశుద్ధుడగు యేసు పరమున కరిగి యా దరణకర్తగ నిన్ను దయచేసె గద మాకు ||పరి||

  • తండ్రి కుమారాత్మల యేకాత్మవై యుండిన పావనుడా నిండార నీ యాత్మ నండగ మాకొసగి దండిగ వరముల దయచేయు మోదేవ ||పరి||

  • విధిగ వేదము జదివిన వేమారుసద్బోధల నాలించినా సదయుడ నీ శక్తి హృదయాల లేకున్న కదలింపబడలేని కలుషాత్ములము తండ్రి ||పరి||

  • సత్యస్వరూపా రమ్ము మమ్ముల సర్వ సత్యములో నడుపుము సత్యాత్మా నీ శక్తి సంపత్తితో దైవ కృత్యము లొనరింప గ్రుమ్మరింపుమా శక్తి ||పరి||

  • వాక్యమందలి భావముల్ లోతుగ దరచి వచియింప దరమె మాకు వాక్యోప దేశివిగా వచ్చి మాలో నిలచి వాక్యమందలి జీవ భావాలు దెలుపుమా ||పరి||

  • సాధక బాధకముల నిలయంబైన సంసార సాంద్రములో ఆదరణ కర్తవుగా నరుదెంచి మా సర్వ బాధల దొలగించి మోదంబు గూర్చుమా ||పరి||
  • 249 రమ్ము పరిశ 10/19/2017 20:16 249 రమ్ము పరిశుద్ధాత్మ దేవుఁడా మమ్మును గృపాస నమ్ముకడకు నెమ్మి నడుపుమా మమ్ము నడుపు దీక్షతోఁబ రమ్ము విడిచి యాత్మస్వరూ పమ్మున నరుదెంచిన దై వమ్ము నీవెకద యెహోవ ||రమ్ము||

  • లోకయాత్ర చేయునప్పుడు చీ కాకుపడిన మాకు నీవె మార్గ దర్శివై వీఁక నొసఁగి మాకరంబుఁ జేకొని పరిశ్రమముఁబాపి సిలువఁ బడినవానికడకు త్సేకమూని మమ్ముఁజేర్ప ||రమ్ము||

  • భక్తవన వసంతదైవమా నీయందుఁ బ్రేమా సక్తివృద్ధిచేసి మనుపుమా ముక్తిదాత యేసువిభుని రక్తమహిమఁ దెల్పియఘ వి ముక్తులనుగఁజేసి మమ్ము యుక్తమార్గమందు నిలుప ||రమ్ము||

  • జీవితపుబాధ లెన్నియో పెనుఁబ్రోవులగుచు నావరించి మమ్ముఁ దా కిన మాకు నీవె హితుఁడవగుచు భావమిచ్చి భయముఁదీర్చి జీవ మైన యేసుపాద సేవకు మముసిద్ధపఱుప ||రమ్ము||

  • పలువిధంబులైన చింతలు చెలరేఁగి మమ్ము కలఁతపెట్టు నవసరం బున వలనుచెడిన మామనముల మలయు వ్యాకులతను మాన్పి వలయు నాదరణము నిచ్చు పలుకుదోడు వీవెయగుచు ||రమ్ము||

  • తొలిప్రవక్త లెంద రెందఱో నీ ప్రేరణమునఁ బలికినట్టి వేదమందునఁ గల నిగూఢ భావములను దెలుపు నొజ్జవీవెయగుటఁ దెలిపి వాని మమ్ము జ్ఞాన కలితమతులఁ జేయుకొఱకు ||రమ్ము||

  • సడలివాడిపోవుచున్న మా విశ్వాసలతను బలసమృద్ధి నుద్ధరించి మా యెడఁదశోధనములకతనఁ బొడము సంశయాంకురంబు లడఁచి ప్రేమఁ జ్యోతిమాలోఁ గడుస్థిరముగ వెలుఁగజేయ ||రమ్ము||

  • స్తుతులు నుతులు నీకెచెల్లుఁగా వుత యుగయుగంబు లతులభక్తిని న్నె కొలుతుము క్షితినివీడ మమ్ము మోక్ష గతికి నడిపి చేర్పుమయ్య మృతికి మృత్యువైనవాని వితతసింహపీఠిపైని ||రమ్ము||
  • 250 పరిశుద్ధాత 10/19/2017 20:16 250 పరిశుద్ధాత్మునిఁ బొందుము ప్రభువిచ్చెడు వరసహాయునిఁ బొం దుము పరిశుద్ధవర్తనకు పరమసాహాయ్యంబుఁ పరముఁజేరువఱకు పరి పూర్తిగా దొరకు ||పరి||

  • పరిశుద్ధాత్మునిఁ గల్గిన మన రక్షణ పరిపూర్ణమై యుండును పరమ రక్షకుఁడిచ్చు పరిపూర్ణ రక్షణను పరమానందముతోడఁ పరగఁగైకొను మిపుడే ||పరి||

  • పరిశుద్ధాత్మునిఁ గల్గిన బైబిలువాక్య పరమసారము తేటగుఁన్ పర మండలపుఁ తండ్రి పరిశుద్ధచిత్తంబు పొరపాటులేకుండ విరివిరిగాఁ దెలియును ||పరి||

  • పరిశుద్ధాత్మునిఁ గల్గినఁ బ్రార్థనలందుఁ పరమ పాటవ మబ్బును సరిగాఁ బ్రార్థించెడు సరణియుఁ దెలియును వరములను బొందుటకు తెరువులభియించును ||పరి||

  • పరిశుద్ధాత్మునిఁ గల్గిన శోధనములఁ పరమ విజయము గల్గును దురితంపు శోధనలఁ దొలగింప నా ప్రభువు పరమశక్తినొసంగి కరుణతో జయమిచ్చు ||పరి||

  • పరిశుద్ధాత్మునిఁ గల్గిన జీవితమెల్లఁ పరిశుద్ధముగ నుండును పరిశుద్ధ జీవితము కరము సాధ్యంబగును పరిశుద్ధాత్ముని శక్తిన్ వర్తింపఁగలమట్లు ||పరి||
  • 251 వినరే యపోస 10/19/2017 20:16 251 వినరే యపోస్తలుల కార్యముల్ క్రైస్తవు లను వారి కవి యెంతో ధైర్యముల్ మనసు లొక్కటిఁ జేసి కొని యట్లు ప్రార్థింప ఘన ముగ విమలాత్మ చనుదెంచె వారిపై ||వినరే||

  • పరమండలమునుండి వచ్చెను పెద్ద కరువలివలె శబ్ద మిచ్చెను తిర ముగ వార లం దరుఁ గూడి యున్న మం దిర మెల్ల నిండె బం ధురమై తన్నాదము ||వినరే||

  • అనలార్చులను దీప్తి మించుచు బీఁట లగు జిహ్వల్వలె గనుపించుచు ఘనముగ నొక్కొక్క జనునిపై నవి నిల్వఁ గను బరిశుద్ధాత్మచే తను నింపఁబడి రంత ||వినరే||

  • వారన్య భాషలతోడను నాత్మ ప్రేరణమును జేయు జాడను ధారా ళముగ భాషాం తరము లాడిరి విన్న వారి కబ్బురమై వి చారము ల్బొడమంగ ||వినరే||

  • ముందట వారిటుల గుంపుగ మోద మందుచు దేవునిఁ గొల్చి తా మందరు చూడఁగ వింత వింత పనుల నందందు జేసిరి దేవుని దయచేత ||వినరే||

  • మనము నా రీతిగ గుంపుగాఁ గూడి మన దేవుఁ గొల్వఁగ భూమిలో మనుజుల కాశ్చర్య మగు కార్యములఁ జేయ నొనగూడు మనసు కా నందమును గల్గు ||వినరే||
  • 252 దేవుఁ డిచ్ 10/19/2017 20:16 252 దేవుఁ డిచ్చిన దివ్యవాక్య మి దేను మన కో యన్నలారా భావ శుద్ధిని జేయు ఘన శుభ వర్తమానము దీని పేరు ||దేవుఁ డిచ్చిన||

  • భయముతో భక్తితోఁ జదివినఁ ప్రాపు క్రీస్తుఁ డటంచుఁ దెల్పును దయా మయుఁడగు దేవుఁడే మన తండ్రి యని బోధించు నెల్లెడ ||దేవుఁ డిచ్చిన||

  • సత్యశాంతము లంకురించును సత్క్రియా ఫలములును బొడమును నిత్యజీవము గలుగు దానన్ నిస్సందేహముగ నుండును ||దేవుఁ డిచ్చిన||

  • ఈ సుమంగళ దివ్యవాక్యము నిప్పుడే మీ రనుసరించుఁడు దోసములు నెడబాసి మోక్షపుఁ ద్రోవఁ గోరిన వారలెల్లరు ||దేవుఁ డిచ్చిన||

  • పాపములలో నుండి విడుదలఁ పరమ సుఖ మని దలఁతు రేనియుఁ తాప మార్పును లేచి రండి త్వరగఁ క్రీస్తుని శరణు బొందను ||దేవుఁ డిచ్చిన||

  • దురిత ఋణములు దీర్చు మధ్య స్థుండు గావలె నన్న వారలు త్వరగ రండీ త్వరగ రండీ వరదుడౌ క్రీస్తు కడ కిపుడె ||దేవుఁ డిచ్చిన||

  • మరణమునకై భయము నొందెడి మానసము గల వార లెల్లరు పరమ శాంతి యొసంగు క్రీస్తుని పజ్జ డాయఁగ రండి వేగము ||దేవుఁ డిచ్చిన||

  • నిర్మలాంతఃకరణ సౌఖ్యము నిజముగా నిలవెదకువారు ధర్మచిత్తుండైన క్రీస్తుని దరికి రండి రండి వేగము ||దేవుఁ డిచ్చిన||

  • మోక్ష రాజ్యముఁ జేరఁ గోరెడు బుద్ధి గలిగిన వార లెల్లరు రక్ష కుండగు యేసు నొద్దకు రండి రండి విశ్వసించుచు ||దేవుఁ డిచ్చిన||
  • 253 దేవుని గ్ర 10/19/2017 20:16 253 దేవుని గ్రంధము దినదినము చదువుము పావనమార్గము జీవము సత్యము ||దేవుని||

  • ఎంచి తలంచుము మించిన గ్రంథము అంచితముగను రెం డంచుల ఖడ్గము ||దేవుని||

  • తేనియమధురము తినుము ప్రతిదినము ధ్యానముసేయుము దానన బ్రదుకుము ||దేవుని||

  • నాధుని వాక్యము అరయుము భాగ్యము పాదపు దీపము భక్తుల కవచము ||దేవుని||

  • ఆత్మల శాంతము అభయము శ్రేయము ఆత్మలకు బలము అనయము సౌఖ్యము ||దేవుని||

  • పాపము శాపము పలువిధతాపము పాపును వేగము దాపున జేరుము ||దేవుని||

  • మదినిది నిరతము పదిలము చేయుము సదమల జ్ఞానము సవిధము మోక్షము ||దేవుని||
  • 254 ప్రభువా పం 10/19/2017 20:16 254 ప్రభువా పంపుమా నీ శుభవర్షము నిమ్మా ప్రబలంబుగ నీ వాక్యం బనెడి విభవామృతము కురియఁజేసి ||ప్రభువా||

  • వాడియున్నట్టి యీ మోడు వృక్షములే వడిగాఁ జిగురు పెట్టి వూచి గాఢంబుగను ఫలము లియ్యఁ ||ప్రభువా||

  • నీ వాక్యానల శ్రీ దేవా పంపుము భావాఘముల మాడ్చి మనముల్ పావనంబు బొందునటులఁ ||ప్రభువా||

  • ధరఁ జీకటి కిదియే వే గురుఁ చుక్క ప్రభువా సరళంబుగా యాత్రికులు నడచి పరమపదంబును బొందఁగఁ జేయుచుఁ ||ప్రభువా||
  • 255 సుఖ మిచ్చె 10/19/2017 20:16 255 సుఖ మిచ్చెగద మాకు ప్రభుయేసువా నీ సురుచిరమగు వాక్కు నిఖిలకల్మష వనమునకు దవ శిఖి శిఖిలవలె గాల్చు నీదగు ముఖవికాసిత వాక్యములు బహు సుఖము లొసఁగు తవాశ్రితాళికి ||సుఖ మిచ్చె||

  • జగతిలోపల మెండుగ నుండిన వివిధ మగు శాస్త్రములు జూడఁగ మిగుల గందరగోళమై మరి యొకటి కొకటి విరుద్ధముగ మ ర్త్యగణ కల్పిత మగుచు నున్నవి తగని వని ద్రోచితిమి వాటిని ||సుఖ మిచ్చె||

  • నీ వాక్యముల భావము నమ్మిన పాపి జీవుల కది జీవము కేవలం బగు ధర్మశాస్త్రము దేవుఁ డిచ్చిన దొకటి బైబిలు ఈ వసుధఁగల సర్వ పాపులఁ బ్రోవ వచ్చిన నిన్నుఁ జూపెను ||సుఖ మిచ్చె||
  • 256 మమ్ముఁ ప్ర 10/19/2017 20:16 256 మమ్ముఁ ప్రేమఁ జూచి దేవుఁడు మకు బోధపరపఁగ ఇమ్ముగాను లేఖనముల నిచ్చె మాకు భూమిపై ||మమ్ము||

  • మా మొగంబు నద్దమందు మేము చూచునట్లు మేము గాన వచ్చు మాస్థితి మిగులఁ దేటగ నందులో ||మమ్ము||

  • పాప మనెడు బురద గోతిని బడిన మమ్ము నెత్తఁగా పాప రహితుండైన యేసు ప్రాణ మిచ్చెను బ్రేమచే ||మమ్ము||

  • పాప మంతయు వీడి మేము భక్తి సరణిని నడువఁగఁ ప్రాపుగాఁ దన యాత్మ నిచ్చెఁ ప్రాణసఖుఁడగు యేసుండు ||మమ్ము||

  • సకల జనులు లేఖనముల సత్యములను దెలియుచు అకలుషముగ వానినమ్మఁగ నంపు మాత్మను రక్షకా ||మమ్ము||
  • 257 శ్రీ వినోద 10/19/2017 20:16 257 శ్రీ వినోద దాయకంబు దేవుని వాక్యంబు జీవమునకు నాస్పదంబు చిరమగు ధనంబు భావంబుల మార్చు నంబు బహుళ సాధనంబు ||శ్రీ||

  • పాప తతికి నాయుధంబు పాపి కాశ్రయంబు భూపతులకు దుస్తరంబు పుణ్య సాధనంబు శాప మడంచెడు శరంబు జగతికి విభవంబు ||శ్రీ||

  • స్వాతంత్ర్య మిడు దనంబు సర్వశ్రేయంబు ఘాతకులకు ఖడ్గంబు నీతికినిలయంబు ప్రీతిని గరపెడు విధంబు ఖ్యాతికిఁ బథంబు ||శ్రీ||

  • సత్య విరాజితంబు నిత్య శోభితంబు భృత్య వరుల సంచకరము భీతున కభయంబు చేతో విభవంబు సుగుణ శిష్యుల హారంబు ||శ్రీ||

  • కర్తఁ జూపు నద్దంబు ఘనమహాద్భుతంబు దురితతతికి నస్త్రంబు దు ఖశోషణంబు పరమోపదేశంబు బహుళమానితంబు ||శ్రీ||

  • సర్వజనులకును హితంబు సౌఖ్యసాధనంబు శాంతికి నిజమార్గంబు జగడముల హరంబు జగము నంతకును వరంబు సత్యవిజయంబు ||శ్రీ||

  • కోలాహల కారణంబు చాల ప్రాచీనంబు మూలమౌ ధనంబు జగము నేలెడి తంత్రంబు జాలియె దన సూత్రంబు మేలు భూషణంబు ||శ్రీ||

  • జ్ఞానికి దుర్ గ్రాహ్యంబు దాని బోధనంబు దీనజనుల కర్థంబు దివ్య శోభితంబు మానితభక్తిని దినంబు మానని పఠనంబు ||శ్రీ||
  • 258 యెహోవ పురి 10/19/2017 20:16 258 యెహోవ పురి పునాది యిల మహా స్థిరంబైనది

  • మహా సీయోను గుమ్మములు అవి యెహోవాకు నతిప్రియములు ఇఁక నిహ జను లెల్లరు గొనియాడి నిను బహు కీర్తంతురు పట్టణమా ||యెహోవా||

  • భూమిలో సర్వజనాంగముల్ తమ నామము లచ్చట వ్రాయన్ ఆ స్వామి యెహోవా వారిన్ అట జన్మించిరి యని వ్రాయన్ ||యెహోవా||

  • పాటలు పాడి జనాంగమా తమ యూటలు నీ కడ గలవే యని స్తుతియింతురు నిను స్తుతిపాత్రా యిఁక భజియింతురు నిను నిజభక్తిన్ ||యెహోవా||

  • ఇది క్రైస్తవ సంఘంబే కడు శుభముల నిచ్చు స్థలంబే ధర బుధు లేసుని నిటఁ గనుచు నతి ముదమును బొందుట నిజమే ||యెహోవా||

  • జనః కుమా రాత్మకును నిఁక ఘనమహిమలు గల్గునుగాక ఆ దిని నుండిన రీతిని నిపుడు నిఁక ననవరతముండును ఆమేన్ ||యెహోవా||
  • 259 యేసు దేహము 10/19/2017 20:16 259 యేసు దేహము సంఘము ప్రభు క్రీస్తుపై వి శ్వాస మమరి క్రా లెడు జనము యేసు ప్రాయశ్చిత్త రక్తము దోసములను బాపు నంచు నాసతోడ నమ్మి తమ ప్ర యాసములను దీర్చుకొన్న ||యేసు||

  • స్థాపకుఁడు యెహోవా దేవుఁడు పాపులను గావ నోపి సుతునిఁ బంపె కరుణుఁడు ఈ పవిత్ర సంఘమునకు దీపము పరిశుద్ధ వేద మేపుమీఱు శిరసు క్రీస్తు కాపుకర్త పావనాత్మ ||యేసు||

  • వరుఁడు క్రీస్తు యేసునాధుని మురువంపు వధువై పరఁగు నహ విశేషఖ్యాతిని సరిగెపట్టు నారచీర లరయ నీతి న్యాయము లవి యురుతరా భరణముల సుం దరము భక్తి వర్తనంబు ||యేసు||

  • తన యమూల్య రక్తముఁ దెచ్చి యనురక్తుఁ డీమె కనిశ శుల్క దా నమునిచ్చి ఘనుఁ డగు నా పావనాత్మ తనకుఁ దోడుజేసి మంచి పని తనమున నీమె కొక్క భవనముఁ గట్టంగఁ బోయె ||యేసు||

  • మరణ విజయుఁ డైన వీరుఁడు మహాబ్రములపై నరుగుదెంచు మహిమ శూరుఁడు నిరతప్రేమ కాముఁ డీమె కరముబట్టి పెండ్లి యాడఁ ద్వరగ వచ్చుఁ గాన భక్తి పెరుగు బ్రతుకు టుత్తమంబు ||యేసు||
  • 260 ఎల్ల సోదరు 10/19/2017 20:16 260 ఎల్ల సోదరు లైక్యత వసియించుట యెంత మేలు మనోహరము ||ఎల్ల||

  • ధరణిలో నహరోను తలనుండి దిగ జారు పరిమళ తైలంబు వలె నద్ది తనరారు ||ఎల్ల||

  • వెలయు సీయోను కొం డల పైకి దిగి వచ్చు నల హెర్మోను మంచు వలె నద్ది చెల్వారు ||ఎల్ల||

  • తరంతరం బాశీర్వా దము నిత్య జీవంబు స్థిరముగా నందుండ సెల విడెను దేవుండు ||ఎల్ల||

  • జనక తన యాత్మకును ఘన మహిమ మగుఁగాక మును పిప్పుడున్ యుగ ముల కగును గా కామేన్ ||ఎల్ల||
  • 261 సమకూర్చుము 10/19/2017 20:16 261 సమకూర్చుము తండ్రి క్రైస్తవ సభలో నైక్యతను ద్వరలోఁ దమ ప్రియ కొమరుఁడు శ్రమలకుఁ బూర్వం బమితాసక్తితో నడిగిన విధ మున ||సమ||

  • దేశము రక్షణకై తండ్రి దేవుని మహిమార్థం నిజముగ వాసిగఁ గూర్పను భాసుర ఐక్యం బాశతో నిన్నిటు నడుగుచునుండఁగ ||సమ||

  • యేసుని నామమున్ మమ్ముల నేకముజేయు మిఁకఁ దండ్రి నీ సిలువను జూ చుచు మే మిలలో వాసిగఁ బ్రేమతో వర్థిల్లుటకై ||సమ||
  • 262 ప్రభుక్రీస 10/19/2017 20:16 262 ప్రభుక్రీస్తు యేసు ప్రేమించె సంఘమును పరిమళ వాసనగానుండ ప్రభువు చిత్తమును పరిగణించుటయె సంఘము నీ బాధ్యతగాదా! ||ప్రభు||

  • దేవుడిచ్చు బహుమానమె బిడ్డలు గర్భఫలమె మన కిడు స్వాస్థ్యం ఇంపుగ ప్రతిష్టింపను వారిని సంఘమ నీ బాధ్యతగాదా? ||ప్రభు||

  • యువకులు రేపటి సంఘము నందున నాయుకు లౌదురు నయముగను పావనులుగ నిలఁ జేయను వారిని సంఘము నీ బాధ్యత గాదా? ||ప్రభు||

  • బాప్తిస్మమును కృపా ప్రసాదములు ప్రభు వెంచెను పరిశుద్ధముగ ఘనముగ వాటిని గైకొన నిరతము సంఘము నీ బాధ్యతగాదా! ||ప్రభు||

  • దేవుడు జతపర్చిన దాంపత్యము భావములర బంధుత్వములున్ సవ్యంబుగసరి జేయఁగ వాటిని సంఘ మ నీ బాధ్యతగాదా? ||ప్రభు||

  • పామర జనములు ప్రభు నెఱుంగక పెడ మార్గంబుల దిరుగగను మానుగ రక్షణ మార్గము జూపుట సంఘ మ నీ బాధ్యతగాదా? ||ప్రభు||

  • క్రైస్తవ దాతృత్వము నందెదుగుట కర్తను కీర్తించుట యౌను దశమ భాగములు దాత కొసంగను సంఘ మ నీ బాధ్యత గాదా? ||ప్రభు||
  • 263 సంఘ శిరసై 10/19/2017 20:16 263 సంఘ శిరసై వెలయు ప్రభువా సత్యకృప సంపూర్ణ ప్రభావా సర్వ క్రైస్తవ సంఘ మహి మా స్త్రోత్రగీతల్ స్వీకరింపుమా ||సంఘ||

  • సంఘ యస్థిభారము వీవే సంఘ జీవాధారము నీవే సర్వ జనరక్షణము నీవే సర్వలోక నిరీక్షణ నీవే ||సంఘ||

  • తరణి చుట్టు తారాగ్రహములు పరివృత్తంబై తిరుగు రీతిని తల యె క్రీస్తయ తనువే భక్తులై తగిన సఖ్యత నైక్యత నుందురు ||సంఘ||

  • నూతనాత్మ నూతన జన్మ నీతి సేవా నిరతియు గలిగి నిత్య మాతనియందు నిలచి నెగడు వారే నిజక్రైస్తవులు ||సంఘ||

  • ఆత్మశుద్ధి అనుపమబుద్ధి అమలవర్తన మనిశము గలిగి ఆత్మఫలములు జాపన నేర్చిన యను భవంబే క్రైస్తవంబు ||సంఘ||

  • విశ్వసింతుము నిన్నే మేము విమల జీవ ప్రదాయకుండ వరుడనీవై వరదుడ వీవై విశ్వ భారతి నుద్ధరింపుమా ||సంఘ||
  • 264 ఈ సంఘం పున 10/19/2017 20:16 264 ఈ సంఘం పునాది క్రీస్తే సాధీశుఁడే దక్కించె యేసు దీని వాక్కాపుల్ రెట్టించే పై నుండి వచ్చి యేసు పెండ్లాడె నీమెనే కోరుచు రక్త మిచ్చి కొనె నీ కన్యనే

  • ఒక్కఁడే దేవుఁడిందు ఒక్క విశ్వాసము ఒక్కటే జన్మ మిందు ఒక్క కుటుంబము ఒక్క ప్రసాద విందు ఒకే సునామము నిరీక్షణొక్క టిందు నిరంత ప్రాప్తికే

  • అసత్య మార్గమంచు అనేకుల్ నవ్వినన్ విభాగ మై శ్రమంబుల్ విశేష మొందినన్ సుభక్తుల్ వేడుచుంద్రు అభయ కాంతికై యీ నింద లెల్లఁ బోయె ఆనంద నాటికై

  • కఠిన దుఃఖ బాధల్ కల్గిన నోర్చుచు విభ వానంద ప్రాప్తి లభింపఁ గోరుచు ఆ స్వర్గ పంక్తిఁజేరి యానంద మొందుచున్ యీ సంఘ మేసుఁ గూడి విశ్రాంతి బొందును
  • 265 దేవుని సీయ 10/19/2017 20:16 265 దేవుని సీయోన్ పురమా! శ్రేష్టమౌ పట్టణమా! స్థావరంబైన పురమా! దేవుని నివాసమా! యుగముల శిలయైన దేవుడే నీ పునాదీ! శత్రువు జయించలేని రక్షణ నీ దుర్గము.

  • కాంచుమా సజీవధారల్ శాశ్వత ప్రేమధారల్ నీదు పుత్రికా పుత్రులన్ తృప్తిపర్చు ధారలన్ అలసి సొలయకుండ దాహమున్ దీర్చుధార దాతయౌ దేవుని కృప సర్వకాలంబు పారున్

  • కాంచుమా నీ యిండ్లమీద అగ్ని మేఘంబుల్దిగె ప్రభుని రాక సమయం బని మహిమ దెల్ప! ప్రార్థన ఫలంబులిచ్చి మన్నా నిచ్చిన ప్రభు సింహాసనాసీనుడై సు నాదుస్తోత్రంబుల్ వినెన్
  • 266 ఘన యెహోవా 10/19/2017 20:16 266 ఘన యెహోవా నీ గుడారం బున నతిథియౌ వాడెవండు తనర నీ పరిశుద్ధ పర్వత మున వసించెడు వాఁడెవండు ||ఘన||

  • వెలఁయగను యథార్థ వర్తన గలిగి నీతి ననుసరించుచు నెలమితో మనసార నిజము పలుకు చుండువాఁడై సుమ్మ ||ఘన||

  • తనదు నాల్కతోఁగొండె మాడఁడు తన సఖునకును గీడు చేయఁడు తనదు పొరుగు వానిపై నిం దలను మోపఁడించు కేనియు ||ఘన||

  • వానికిని నీచుం డసహ్యుడు వాఁడు భక్తుల గౌరవించును హాని కలిగిన నాతఁడును బ్ర మాణ మాడియు మాట తప్పఁడు ||ఘన||

  • మరియు ద్రవ్యము వడ్డి కీయఁడు నిరపరాధినిఁ జెఱప లంచము అరయఁ డిట్టులఁ జేయువాఁడే ధర నెపుడు గదల్పఁబడఁడు ||ఘన||

  • జనక తనయ పావనాత్మకు ఘన మహిమయు కల్గుఁగాక మును పిపుడు నెల్లప్పుడున్ యుగ ములకుఁ గల్గునుగాక యామేన్ ||జనక||
  • 267 ఎంతో సుందర 10/19/2017 20:16 267 ఎంతో సుందరమైనవి ధర గిరులపై నెంతో యందమైనవి సంత తంబుఁ బరమ ప్రేమను దెల్ప సంతస మందుచు సరిగ బ్రకటన జేయ అంతటను బనిఁ బూని ప్రభు న త్యంతముగఁ బ్రక టించి వసుధ న నంత మగు శుభవార్తఁ జాటెడు వింత యగు బోధకుల పాదము ||లెంతో||

  • మందమతులగు వారలు మూర్ఖత్వంబు నొందు నెల్ల జనంబులు వందుచుఁ గుందుచు వన గిరి కందరము లందు నున్న సకల మౌ మోటుజన మెరుఁగఁ పొందుగాఁ ప్రభు యే సొసంగెడు సుందరం బగు సత్య వాక్యం బందుకొని చాటించుచుండెడు అంద మగు బోధ కుల పాదము ||లెంతో||

  • మదిలోఁ ప్రభుని నమ్మిన పాపుల నెల్లఁ తుదిని మోక్ష పదమ్మున విదితమ్ముగాఁ జేర్చి ప్రీతిఁ జూపున టంచు ఇదిగో రమ్మని క్రీస్తు పద సన్నిధిని జేర్ప సదయులై శుభవార్తమానము ముదమునను మదిలోన నిడి కొని పదిలముగఁ ప్రకటించుచుండెడి విదితు లగు బోధకుల పాదము ||లెంతో||

  • యేసు క్రీస్తు రారాజై యున్నాఁడనుచు భాసురంబుగఁ దెల్పుచు వాసిగాఁ ప్రభు యేసు వసుధ రక్షకుఁడనుచు యీ సువార్తను జాటి యిచట నెమ్మదినొంద దోసకారి జనంబు లందరి కీ సుమంగళ వార్తఁ దెలుపుచు దోస మంతయుఁ బాపు మన ప్రభు యేసుఁ జూపెడు వారి పాదము ||లెంతో||
  • 268 పరిశుద్ధాత 10/19/2017 20:16 268 పరిశుద్ధాత్ముఁడ, లెమ్ము నీ సంఘముపై నీ వర దీవెనల నుంచుమీ చిరుత కాలపు సభ కా పరు లొంది నీ యగ్ని యరుల నెదిరించి చా టిరి నీదు సత్యంబు ||పరి||

  • బలుఁడా యీ కాలంబునన్ దివారాత్ర ములు నీదు సేవకులున్ నలు దిక్కులను దిరిగి విలసిల్లు నీ వార్త పలు జనాంగములకుఁ బ్రకటించు చుందురు ||పరి||

  • ప్రతిదేశము దిప్పుడు ఉజ్జీవముఁ బడసిరి నీ బిడ్డలు అతులుండు నీ పుత్రుఁ డాజ్ఞాపించిన యట్లే యతి తీవ్రతను వేఁడ అధిపా మాకొసఁ గుము ||పరి||

  • పరిశుద్ధాత్మ బలంబును వాక్యపు ధృతినిఁ బడసిన బోధకులను ఇరుల శక్తిని ద్రోసి నరులను నీ తట్టు మరలఁ జేసెడువారిఁ ద్వరలోఁ బంపుము దేవ ||పరి||

  • నీ యాత్మ కాంతితోడఁ బూర్వము వలెనే డాయంగ మముఁ జేయుమా యే యడ్డున్నను బాపి యెలమి నింగిని జీల్చి దాయుము మము స్వేచ్ఛ దయచేసి నీ యొద్దఁ ||పరి||

  • జను లెల్ల నీ వాక్యపు శక్తి నెఱింగి ఘనపరపఁ ద్వరచేయుము పెను సంఘములు లోక మున నాటి యిశ్రాయేల్ జనపు నిద్రను బాపు జయ మొందు నీ వాక్కు ||పరి||

  • ఇల సంఘమున నెడారుల్ కప్పుము దేవ తొలఁగించు మాటంకము అల నీ వాక్యమునకు నడ్డంబు లేమియు గలుఁగకుండఁగ నిమ్ము ఘన సంఘాధ్యక్షుండ ||పరి||

  • నీ సంఘమును నబద్ధ బోధలనుండి నిర్మలంబుగఁగావుమా గాసిఁజేసెడు జీత గాండ్లను బాపి నీ భాసిల్లు నుద్యాన వనముగ నుంచుమా ||పరి||
  • 269 అడుగుచున్న 10/19/2017 20:16 269 270 దీవెనల నిడ 10/19/2017 20:16 270 దీవెనల నిడు దేవా నీదు సేవకై వెడలెడు దీనులపైఁ పావనాత్మ నంపుము పనులలో నడిపింపుము కేవలంబుగ మా తనువులు నీ సేవకై యర్పింప గజేయుము ||దీవెనల||

  • మాటిమాటికి బాపయుతంబౌ మార్గమునఁ జను మనసులఁ ద్రుంచి మేటి క్రీస్తుని నామా మృతముఁ గ్రోలుచు మేమా పాటున నాత్మల రక్షణకై పనులు సల్ప(గ బంపుము కృపచే ||దీవెనల||

  • దివ్య బోధ లెదను గల్గి దీనతను రక్షణ మార్గమును భవ్యముగ బోధింపఁ బరమార్థ మెఱిగింప సేవ్య నేర్పవె దిన దినమును నీ సేవకాళికి నీ మర్మముల ||దీవెనల||

  • దురిత రోగాదులచే మిగులఁ తూలి చను మనుజాళికి నీవే పరమ విశ్రాంతి నిడు వరదుఁడ వంచుఁగడు వెరవునను బోధింపంగను నీ వర ములతో నింపుము దాసులను ||దీవెనల||

  • గ్రామ సంఘంబులను బడుల క్షేమముగఁ గాపాడి పెంప ఓ మహాత్మ నీ కృప తో మమ్ముఁ గాచి సదా స్వామి మాలో నీవును నీలో మేము మనగను బ్రోవు మామేన్ ||దీవెనల||
  • 271 వినరే నరుల 10/19/2017 20:16 271 వినరే నరులారా మనముల వేడుకలను మీర మన, రక్షకుఁడగు మరియా తనయుని మహిమలు చెవులార ||వినరే||

  • తన కన్నను ముందు యోహా నను నతఁ డింపొందు ఘనతర మగును ప్రవచనముఁబ ల్కెను భూజను లందు ||వినరే||

  • అతఁడు యోర్దాను నదిలో ఖ్యాతిగ ననుదినమున్ పాతకులకు బా ప్తిస్మ మిచ్చు నెడం ప్రభు వచ్చటి కరిగెన్ ||వినరే||

  • న్యాయము నిలుపుటకై ప్రభుని వి ధేయతఁ గనుపఱచి శ్రేయ పతి బొం దెను యోహానుని చేత బాప్తిస్మంబు ||వినరే||

  • పరమండల మపుడు తెరవం బడి పావురము గతిన్ పరిశుద్ధాత్మ శు భప్రభ లీనుచుఁ ప్రభువు మీఁద వ్రాలెన్ ||వినరే||

  • ఆకాశమునుండి కలిగెను ప్రాకటమగు రవము నా కితఁడు ప్రియం బౌ కుమారుఁడా నంద మొంది రనుచు ||వినరే||

  • అంతట మన కర్త పరిశుద్ధాత్మ బలము కలిమిన్ సంతసమున మో క్ష కుశలవార్తను జాటంగను దొడఁగెన్ ||వినరే||

  • ఆ నిత్య సువార్త మన మెద లో నిడి నమ్మినచో నానందమయం బమృత మేసు ద యా నిధి మన కొసంగున్ ||వినరే||
  • 272 దేవా శిశువ 10/19/2017 20:16 272 దేవా శిశువుల( దెచ్చితిమి నీవు దీవించువీరల దివ్య కృపమీర||దేవ||


  • వీరు పొందిన బాప్తిస్మంబు గురుతు వీరు నీవా రన విశదపరపంగా వీరిపైఁ గురిపించు దయను వేగ వీరికిఁ గలుగంగ విజ్ఞాన ధనము||దేవ||

  • నీ వొసఁగు శిశువుల మాకు దేవ నీవ చేర్చికొనుము నీవ కాపాడు జీవ మార్గము నందు నిలుపు నిత్య జీవంబు దయచేసి శ్రీ యేసు కఠినన్ ||దేవ||

  • విమలాత్మ బాప్తిస్మ మొసఁగి వీరి విమలులఁ జేయుము ప్రీతిని దేవా క్షమ భక్తిప్రేమ శాంతుల నొసంగు శ్రమముల వెలుఁగంగ సత్య సాక్షులుగా ||దేవ||

  • వీరలకుఁ దోడై యుండుము తండ్రి వీరలఁ జూడుము వివిధ మార్గ ముల వీరు లోకము విడుచు నపుడు దయను వీరలఁ జేర్చుము విమ లానందమున ||దేవ||
  • 273 యే సొసంగె 10/19/2017 20:16 273 యే సొసంగె గొప్ప యాజ్ఞను తన శిష్యులకును యేసొసంగె గొప్ప యాజ్ఞను దాసులునుగఁ జేయ బోయి ధరణిమీఁది రాష్ట్రములకు ఆ సను బాప్తిస్మ మిచ్చి నా సుబోధ నేర్పుఁడనుచు ||యేసొసంగె||

  • జనక కుమారాత్మల పేర బాప్తిస్మ మియ్యఁ చనుడు మీరు సకల దిశలను తనయు లైనఁ తల్లులైనఁ తండ్రులైనఁ బొందవచ్చుఁ దగిన రీతి దాని నిపుడు తండ్రియైన దైవ కృపను ||యేసొసంగె||

  • బాలు రెల్ల బొందవచ్చును బాప్తిస్మ మిపుడు జాలిఁ జూపు క్రీస్తు సెలవున బాలు రందుఁ బ్రేమ నుంచి ప్రభువు పిలుచు వారి నెల్లఁ జాల మేలు సేయ గోరి సకల కాలముల యందు ||యేసొసంగె||

  • పొందవలయు బాప్తిస్మము శుద్ధాత్మ చేత విందుఁ గలుగు మనుజు లందరు మంద బుద్ధి విడిచి పెట్టి మహిమ గల్గు దేవు గొల్వ నందము గను లేచి రండి హర్ష పూర్ణు లగుచు మీరు ||యేసొసంగె||
  • 274 ఆచరించుచున 10/19/2017 20:16 274 275 రండి రండి 10/19/2017 20:16 275 రండి రండి సువార్తబోధ విన రారోజనులారా నిండు మనంబుల కోర్కెలూరగను నిజరక్షకుఁడగు యేసునిఁ జేర ||రండి||

  • పాపము లెడ బాపను యిలకరిగిన ప్రభువు మహిమ వినుఁడి మీ మీ పాపములను దలపోసి హృదయముల పశ్చాత్తాపపడి యా పరమగురుని నామముద్వారా ననుసరించి ముంచడముఁ బొందు ||రండి||

  • తన మహిమను బలమును దైవత్వము తగ్గించుకొని వడి యప్పుడు తన సేవకుఁడని మదిఁదలపోయని తగు నీతిని గనుఁడీ క్రీస్తుండును బాప్తి స్తు డు యోహానునిచే మునుకొని యోర్దాన్నదిలో ముంచుటగని ||రండి||

  • మురియుచు క్రీస్తువు యోర్దాన్నదిలో ముంచబడినరీతి నిప్పుడు గరిమెతో క్రీస్తుని నమ్మిన జనములు గైకొనుటది నీతి మరువక స్థిరముగ మీ మనముల నెల్ల ప్పుడు నరమరవిడి క్రీస్తుని తగఁజేర ||రండి||

  • తల్లులు తమ బిడ్డల కాశీర్వాదము లిమ్మని తేగా నప్పుడు చల్లగ బాలుర కాశీర్వాద మెసఁగె ప్రభు విదిగాక క్రీస్తుఁడు తొల్లి జనములకు ముంచడ మిచ్చిన టెల్ల విధులలేదు వేదమున ||రండి||

  • అందుచేత వేదమున బాప్తిస్తుండనఁబడె యోహాను ఇప్పుడు పొందుగ ముంచువారు బాప్తిస్తులు పొసగగ సరిగాను మీరలు నందఱు విన సత్య వేదవాక్యము సందియములు విడి సాగి వేగమున ||రండి||
  • 276 మనస! యాత్మ 10/19/2017 20:16 276 మనస! యాత్మ! తేజరిల్లుమా యలంకరించు కొనుము పాప మంత వీడుమా వినుము నేఁడు యేసు నీకు ఘనముగాను విందుఁ జేసి నినుఁ దలచి చేరవచ్చె ఘనుని వెల్గులోని కేగుము ||మనస||

  • హృదయ మనెడు తలుపుఁ దట్టుచుఁ ప్రభు యేసు నిలచి సదయుఁ డిదిగో నిన్నుఁ బిలుచుచు ఎదురు జూచుచుండు విభుని పదయుగమున కెరగి మ్రొక్కి ముదముతోడఁ జేర్చుకొనుము సదముల మగు ప్రేమఁ జూపి ||మనస||

  • ధరను సర్వ శ్రేష్ఠ భాగ్యముల్ వరములును ధనము నరులు బొందు చుందు రుచితము పరమ రక్షకుం డొసంగు వరశరీర రక్తములకు ధరణి రత్న రాసులైనఁ జాలువా మరేవి యైన ||మనస||

  • ఎందుఁ గానరాని ప్రేమను జూపించి నీకై పొందుగాఁ దన ప్రాణ మిచ్చెను చిందిన రక్తమును యాగ మంది నట్టి శరీరంబు నందముగను రాత్రి భోజ నంబు నందు సిద్ధపరచె ||మనస||

  • యేసు తనదు బల్లమీఁను సుజీవ మిచ్చు నెల్ల నష్టములు నశించును భాసురముగ మోక్షమునని వాసివై శ్రీ యేసుతోడ యీ సుభో జనంబు దినుట కాశీర్వాదములు నొసంగు ||మనస||
  • 277 ఓ దయానిలయా 10/19/2017 20:16 277 ఓ దయానిలయా! ప్రభువా! మా కున్న స్వనీతి బలముగాక నీ దయాహృదయంబె నమ్ముచు నీదగు బల్లను జేరఁదెగించితి ||మో దయా||

  • లేదు యోగ్యత బల్లకు దిగువ లేకిని నేరుకొనఁగనయినన్ మాదుగతిఁ గరుణించియు నెపుడు మార్పునులేని ప్రభుండవైతివి ||ఓ దయా||

  • ఓ ప్రభుండా! కావున మా పా పోద్భూతంబగు శారీరాత్మల నీ ప్రియంబగు క్రీస్తుతనువున నెత్తుటఁ బరిశుద్ధంబగునటుల ||ఓ దయా||

  • ఆయన మాలోఁబరగను మే మాయనలో జీవింపగను నీ యుగాం తముదాఁ క నేకత నీతో జీవించులాగుననో ||ఓ దయా||

  • యుక్తముగా నాయన మాంసమును నోరెముగా భుజియింపను దన దగు రక్తము మేమందఱమును ద్రావను రాగంబడరఁగ దయ చేయుము ప్రభు ||ఓ దయా||
  • 278 జీవాహారము 10/19/2017 20:16 278 జీవాహారము రమ్ము చిరజీవాన్నము నిచ్చి జీవిత క్షుద దీర్చుము జీవనపథములో చీకటి పడువేళ జీర్ణించు కొనిపోవు జీవితాశలఁ బెంచ ||జీవా||

  • విందుగృహమునకేగి వీక్షింతు భ్రమతో నీ వివిధసుభోజ్యంబులన్ విచ్ఛిన్నమైన నీ విమల దేహపు విందు వికలంబౌ మనసుతో వినుతించి, తినుచుందు ||జీవా||

  • రుధిర ధారలలోన ఋజువౌ నీ ప్రేమలు రూపుమాయును పాపము ఋతద్రాక్ష వల్లీ నీ రుధిరపానముచేత ఋణభారములు దీరి రుచి యించు నా బ్రతుకు ||జీవా||

  • భవదీయ స్మరణార్థం పతితుల శరణార్థం ఫలియించు యీహోమము ప్రభువా నాయాత్మలో ప్రతిబింబమై వెలసి పానార్పణంబౌను ప్రతిరక్త బిందువు ||జీవా||

  • ఆత్మాంతఃపురములో ఆంతర్య గదిలోన ఆరాధించు నీ నామము అలనాటి నీ రక్త నవనిబంధన నేడు అపురూపమై నాలో నవతరించును దేవా ||జీవా||
  • 279 దేవా దీవిం 10/19/2017 20:16 279 దేవా దీవించు మిప్పుడు దీన జనాళిన్ గావ రా రమ్మెల్లప్పుడు నీ వరగద్దెచుట్టు నిజ దాసు లిటులఁ గూడి పావన సంస్కారమును బంచి పాలొందుచుండ ||దేవా||

  • మముఁ గావ నైదు గాయముల్ బొందిన దేవ సముఁడా నీ రక్త కాయముల్ విమలింపు భక్తి ద్వారా వీక్షించి మనసులందు అమిత దుః ఖ మొందుటచే నలిగిన భక్త జనులన్ ||దేవా||

  • నీ రాజ్యమునకు మముఁ జేర్ప నిజము మా పాప ఘోర శాపమ్ములన్ దీర్ప నోరిమిచే మా కొరకు దారుణముగ నొందిన క్రూర మరణమును దలఁచి కుములుచున్న హృదయులను ||దేవా||

  • కోరి నినుఁ గొలుచు భక్తుల కోరిక లభివృద్ది గా రాజిలఁజేయు శక్తుల ధారాళముగ నొసంగు ధనాత్ముండ నీ దివ్యా కార మందుండి యీ సం స్కార సమయమున మమ్ము ||దేవా||

  • మా దారిద్ర్యములు బాపనే పాపభారంపు మ్రాను నీ దివ్య మూపుననే గాదిలిచే భరియించి గడి దొంగ లిరువురిలో బాధ లొందితి వనుచు బహుగా దుఃఖించు మమ్ము ||దేవా||

  • నీ వీ విధంపు మరణముచే నిజముగా మమ్ము జీవింపఁజేసి నిల్పుటచే పావనదేవ మే మీ ప్రభు సంస్కారమ్ము మా మా జీవాత్మ లాదరణకై జే మనముగఁ గైకొనను ||దేవా||
  • 280 చేరి భుజియ 10/19/2017 20:16 280 చేరి భుజియింపుడీవిందు యేసు సిద్ధపరచిన కృపావిందు తోరణంబగు మేడ గదిలో జేరి శిష్యుల తోడ సిలువ భారమున్ మదినెంచి నెరపిన భావ గర్భితమైన విందు ||చేరి||

  • జీవాహారము దైవసుతుడే పరమ జీవజలముల దాత యితడే జీవనాధుని రక్త మేనులు జీవానాహారములు కాగా చావును దొల గించి మృతులస జీవులనుగా మార్చువిందు ||చేరి||

  • కారుణ్యనిధి యేసు రాజు నరుల గావగ బలియైన రోజు భారమైన సిలువ కెరయై పాప భారము పరిహరింప ధారవోసిన పుణ్యరక్తపు ధారలన్ దలపోయు విందు ||చేరి||

  • దాసగణముల బ్రోవనెంచి రుధిర ధారలను గార్చిభరించి భాసు రంబగు నవ నిబంధన జేసి సంఘ పునాది వేసి వాసి మీరగ నిత్య జీవము బోసినట్టి యేసు విందు ||చేరి||

  • పాప పరిహారార్థముకై క్రీస్తు పడిన ఘోరబాధ కొరకై యేపు దనరగ స్తుతులుబాడుచు యేసునాధుని రాకవరకు ఆపకుండగ సత్ప్రసాదము నందుకొని బలమొంద రండి ||చేరి||

  • విందుతో మొదలిడిన సేవ యేసు విందుతో ముగియించె బ్రోవ విందులోగల మర్మమేదియొ విపులముగ బోధించు క్రీస్తున్ డెందమున ధ్యానించి యాయన యందె నమ్మిక గలిగియుందము ||చేరి||
  • 281 మానవుఁడవై 10/19/2017 20:16 281 మానవుఁడవై సకల నరుల మానక నా దోషములఁ బాపుటకు బలి యైతివే యేసూ బహు ప్రేమతోడ ||మానవుఁడవై||

  • నీదు బలిని నిత్యముగను నిజముగా ధ్యానించి ప్రేమను నీదు దివ్య ప్రేమ నొందుటకు నియమంబు నిచ్చి ||మానవుఁడవై||

  • నీవె జీవపు రొట్టె వంటివి నీవె జీవ జలంబు వంటివి నిన్ను ననుభ వించుఁడంటివిగా నిజదేవా యేసూ ||మానవుఁడవై||

  • నీ శరీరము రొట్టెవలెనే నిజముగా విరువంగఁబడెనే నిన్నుఁ దిను భాగ్యంబు నిచ్చితివే నా యన్న యేసూ ||మానవుఁడవై||

  • మంచి యూట మించి దండి పంచగాయములలో నుండి నిత్యజీవపు టూటలు జేసితి నీ ప్రేమ నుండి ||మానవుఁడవై||

  • నిన్ను జ్ఞాపక ముంచుకొనుటకు నీదు ప్రేమ బలిలో మనుటకు నిత్య మాచరించుఁడంటివి నీ నిజభక్తితోడ ||మానవుఁడవై||

  • ఎంతో ప్రేమతో బలిగా నైతివి యెంతో ప్రేమాచారమైతివి చింతలును నా పాపములు బాప శ్రీ యేసు దేవా ||మానవుఁడవై||

  • నిత్యబలి యగు నిన్నే నమ్మి నిన్ను ననుభవించి నెమ్మి నిన్ను నిముడించుకొని నాలో నీ నిజరూప మొంద ||మానవుఁడవై||

  • నేను నీ బలిలోనఁ గలిసి నేను నీతోఁ గలిసి మెలిసి నేను నీవలె నుండఁ జేసితివే నా దివ్య యేసూ ||మానవుఁడవై||

  • నీదు శ్రమలను బలిని నిపుడు నాదు కనులు చూడ నెపుడు నాదు పాపభారములు దిగునే నా దివ్య యేసూ ||మానవుఁడవై||

  • నీవు బలియై తిరిగి లేచి నిత్య తేజోరూపు దాల్చి నిత్యమును నా బంతి నున్నావే నిజ దేవా యేసూ ||మానవుఁడవై||

  • నీవే నీ చేతులతో నిత్తువు ఈ నీ బలివిందునకు వత్తువు నిన్ను నిట జూచితిని నా యేసూ! యెన్నఁడును మరవను ||మానవుఁడవై||
  • 282 మన యేసు మర 10/19/2017 20:16 282 మన యేసు మరణస్మా రణవిందులోఁబాలు గొనరండు ప్రియులార వినయమానసులై మన దోష చయమెల్లఁ దనమేన ధరియించు కొనిమనల గావ నా యన పడిన శ్రమలెంచి ||మన యేసు||

  • మరల మన మధ్యకా పరమాత్ముఁడరుదెంచ వఱకాయనను మనము మఱవకుండుటకై స్థిర భక్తి నద్దాని జరిగింపవలెనంచు గురుతరంబగు నాజ్ఞ నెఱపితాఁ జనెఁగాన ||మన యేసు||

  • తినుఁడిది యె నా దివ్య తనువంచు నొక రొట్టి యను వ్రచ్చి ప్రభుఁ డిచ్చె ననుబంధుతతికి ఘన శ్రద్ధదానిఁగై కొని మనము భుజియింప నొన గూడు జిరజీవ మనుమాన మిఁకనేల ||మన యేసు||

  • ఆ రీతి నిజరక్త ధారయై వెలయు ద్రా క్షారసము నిచ్చె నిం పార గొను డనుచుఁ గోరి యా మధుధారఁ గ్రోలిన మనకుక్షి దోరమౌ జీవంపుధార లుద్భవ మొందు ||మన యేసు||

  • ప్రభు భక్తి నెవఁడు దై వభయంబు లేక య నుభవించు వానిక శుభమౌ నా మీఁద విభవంబు దొలఁగురో గభయంబు చేకూరు శుభ మవ్వానికి నెపుడు లభియింపదని తెలిసి ||మన యేసు||

  • మిము మీరె తగురీతి గమనించి పరిశోధ నము చేసికొని మీ పాపము లోప్పుకొనుచు నమితార్తిఁబశాత్తా పముఁబొంది యీ విందు క్రమము బాటింప క్షే మము మీకు సిద్ధించు ||మన యేసు||

  • దురితాంధకార భా స్కరుఁడు సద్గురుఁడేసు పరమవిందున కిది యను ప్రాసంబని యెఱిఁగి ఉరణశాబకరక్త సరి దంతఃపరిపూతాం బరులైసత్కార్యత త్పరులై బంధురమతులై ||మన యేసు||
  • 283 స్తోత్రార్ 10/19/2017 20:16 283 స్తోత్రార్పణ నర్పింతము జప ధూపము వేసి కీర్తింతము పాత్రుం డైన శ్రీ యేసుఁడు పరమ భోజనాంశమైనందున ||స్తోత్రార్పణ||

  • కృతజ్ఞతా స్తోత్రంబులన్ దేవ కృపార్థంబై చేయుదము క్షీతి నాతండు బలి నియ్యఁగాఁ పుట్టె నూతనంపు నిబంధన ||స్తోత్రార్పణ||

  • పాపము లన్ని హరించెను మా ప్రభు వగు యేసు సురక్తము ఏపుగ దీనిఁ దలంచుచు నిఁక నెన్నఁడు యేసుని భజింతము ||స్తోత్రా||

  • చావు నుండి రక్షించెను స జీవులలో లెక్కించెను దేవుని కిఁక నర్పింతము స జీవార్పణ బలిగను ||స్తోత్రా||

  • పుణ్యరక్త శరీరముల లోఁ పాలొందు మన మందరము అన్యులము కానేరము దై వాన్యోన్యంబు నొందినాము ||స్తోత్రా||

  • మరణ శ్రమల స్మరింతము ప్రభు తిరిగి వచ్చు పర్యంతము ధర నా యేసు మరణంబును యింకఁ చిరకాలంబుఁ జాటింతము ||స్తోత్రా||
  • 284 యేసూ, నిన్ 10/19/2017 20:16 284 యేసూ, నిన్ జూతు నిందుఁ దేటగా అగోచరార్థముల్ నే ముట్టదున్ కృపన్ నేఁ బట్టకొందు గట్టిగా నీ మీఁద వేయుదున్ నా భారము.

  • నే దైవాహార మిందె తిందును ఆత్మీయ ద్రాక్షపాత్ర త్రాగుదున్ భూభారముల్ నేఁ బారవేయు దున్ క్షమా సౌఖ్యంబు గల్గుఁ క్రొత్తగా.

  • సంగీత భోజనాల కాలము ప్రభుండు నాకై బల్ల వేసెను విందారగించుచున్ నీ తోడి నా మాధుర్య స్వల్ప మైత్ర్రిన్ బెంచుదున్.

  • సాయం బీవే, వేరే నా కెందుకు వేరే చేమీఁద నానుకొనను ప్రభూ, నిజంబుగా నీదే చాలును నీ శక్తిలోనె బలం బుండున్

  • పాపంబు నాది, నీతి నీదెగా నేరంబు నాది శుద్ధి నీదెగా నీ రక్త నీతియే నా వస్త్రముల్ నా కాశ్రయంబు శాంతస్థితులు
  • 285 శ్రీ రాజిల 10/19/2017 20:16 285 శ్రీ రాజిల్లుచు యేసు క్రీస్తు వేంచేసెను భారతిని జయించి ప్రజాళిన్ బ్రోచును! ఆరాజు శాశ్వితుండు భూరిదయాళుఁడు వీరాగ్రేసరుండాజిన్ విజయ ధ్వజంబదె!

  • ఆ హిమాచలమందు నాటెక్కె మెత్తెను కాహళ ధ్వనియందుఁ గ్రందుకొనెనటన్! సౌహార్థ భావమూని జనాళిన్ బ్రోచుఁగ ఆహా యీ యేసుప్రేమ యాశ్చర్యమైనది!

  • ఆంధ్ర కాశ్మీర వంగ ఆ సేతువాసులు ఆంధ్రప్రాయులైయున్న యరణ్యవాసులున్ బంధ విముక్తలౌచుఁ ప్రభువైన యేసుని బంధుర సేవచేయు వారలయ్యెదరు

  • వీరెల్లఁ క్రీస్తునందు విశ్వాసముంచిన ఆ రాజు వీరిన్ శాశ్వ తానంద సామ్రాజ్య ధౌరేయులన్ గావించు ఔర! యీ వార్తను స్ఫారానందంబుతోడఁ జాటుదు రెవ్వరు!

  • భేరీ తూరారవాది గా రక్షావార్తను దోరంపుఁ గోర్కెఁ జాటు మో దేశ సంఘమా! సౌరభ్యమౌ నీ ప్రేమ సారంబు జూపుము ధీరతన్ యుద్ధమందుఁ బోరాడి గెల్వుము
  • 286 గ్రీన్లాండ 10/19/2017 20:16 286 గ్రీన్లాండ్ దేశస్థులును ఇండియా జనులున్ ఆఫ్రికా ఖండమందు నివాసులెల్లరు సముద్ర ద్వీపస్థులు సువార్త వెలుగు మాకు నిప్పించుడని మమ్మును పిల్తురు.

  • మా దేవుడిచ్చు సుఖ సుక్షేమ యీవులు ఒక్కొక్క దేశమందు విస్తారమైనను అజ్ఞానులైనవార లా సత్య దేవుని గొల్వక వేరువాటిన్ పూజించుచుందును.

  • సువార్తకాంతి మాకు ప్రకాశమైనదా అజ్ఞానులందరికి దాని మేమియ్యమా రక్షణ దివ్యవార్త లోకస్తులెల్లరు విని మా యేసుమీద విశ్వాసులౌదురు.

  • సుక్షేమకరమైన సువార్త సంగతి గాలి తరంగములు వ్యాపింపజేయుడీ మా సృష్టికర్త రాజు నిర్దోషి యాయనే మా యేసు దిగి వచ్చి యీ లోకమేలును.
  • 287 శ్రీయేసు ర 10/19/2017 20:16 287 శ్రీయేసు రాజ్య ముండును సూర్యుండు వెల్గు చోటెల్ల కల్పాంతకాల మౌదాక ఆ రాజ్యము వ్యాపించును.

  • నిరంతరంబు ప్రార్థనల్ నిత్య స్తుతుల్ శ్రీయేసుకు తన్నామము ప్రత్యహము సుగంధ మట్లు లేచును.

  • సమస్త దేశ వాసులు గణింతు రేసు ప్రేమను శ్రీ యేసు పేరు బాలకుల్ బాల్యంబున నుతింతురు.

  • యేసుని యీవు లొల్కును ఖైదికి సంకెళ్లూడును డాయంగ శాంతి కల్గును సుభాగ్య మబ్బుఁ పేదకున్

  • శ్రీ యేసు శక్తి చేతను స్వస్థంబు గల్గు నెల్లెడన్ దచ్ఛక్తి యున్న మేరలన్ నశించు మృత్యు శాపముల్.

  • మా రాజు కెల్ల సృష్టియున్ విశేష స్తుతుల్ సల్పుతన్ దూతాళి మళ్లి పాడఁగా ఘోషించు భూమియు ఆమేన్
  • 288 శుభవార్త వ 10/19/2017 20:16 288 శుభవార్త వింటిమి యేసు రక్షించును ఎల్లవారు విననీ యేసు రక్షించును ప్రభు మాట వింటిరా పర్వతంబుల్ దాటుచు వార్త ప్రకటింపుడి యేసు రక్షించును.

  • స్వరమెత్తి పాడుడీ యేసు రక్షించును దైవభ్రష్టు లెల్లరిన్ యేసు రక్షించును ద్వీపవాసు లందఱు వినునట్లు చాటుఁడి దివ్యవర్తమానము యేసు రక్షించును

  • ఇహ బాధనుండియు యేసు రక్షించును పరభాగ్యమిచ్చును యేసు రక్షించును దీనుజను లెల్లరు భూనివాసులందఱు ఈ సువార్త వినుఁడీ యేసు రక్షించును.
  • 289 ఇఁక నేమి గ 10/19/2017 20:16 289 ఇఁక నేమి గతి యున్నది మానవులారా యిఁక నేమి గతి యున్నది పాపులకోస మిఁక నేమి గతి యున్నది యొకఁ డైనఁ ఋణ్యాత్ముఁ డుర్వి లేఁడని ముందె ప్రకటించి దావీదు పల్కె వేదము నందు ||ఇఁక||

  • ఇల రక్షకుఁడు లేమిని గొఱ్ఱెల మంద లిలఁ జెల్ల చెదు రాయెను పులులఁ బోలిన దైవ ములు గురువులు పెక్కు గల రేల వారు పద్దతి జూప జాలరు ||ఇఁక||

  • దురితము లణఁగింపఁగఁ బాపుల నెల్ల దరిఁ జేర్చి బ్రతికింపగ పర మేశ్వరుఁడు తన వరపుత్రుఁ డగు క్రీస్తున్ ధర కంపె నయ్యేసు శరణుఁ జొరకయున్న ||ఇఁక||
  • 290 ఎందుకు మఱచ 10/19/2017 20:16 290 ఎందుకు మఱచితివి యేసుని ప్రేమ ఎందుకు మఱచితివి ఎందుకు మఱచితివి పొందితివి నిందలు సుందర మగునట్టి సుఖమైన ప్రభు ప్రేమ ||నెందుకు||

  • దేవగ్రంథము నీవు చదువలేదా భావమున దానిఁ గైకొనలేదా సేవక వృత్తులు సేయక పోతివి చావరాని చావు సంపాదించితి వయ్యో ||ఎందుకు||

  • చిందెను రక్తము సిలువపైనిఁ పొందెను గష్టము మేకుల పోట్ల నెంద ఱెందఱు కల్వ రీమెట్టపై నతని నిందించి చంపిరి నిర్దయులై యకటా ||ఎందుకు||

  • పాపేచ్ఛలోనుండి మరలి వాని శ్రీ పాదములు బట్టుము ప్రార్థించుము కాపాడుటకు దయతోఁ గనిపెట్టి యున్నాఁడు పాపి నీ విభుఁడైన ప్రభు మార్గమునఁ బొమ్ము ||ఎందుకు||
  • 291 ధరణిలోని ధ 10/19/2017 20:16 291 ధరణిలోని ధనము లెల్ల ధరణిపాలై పోవును గరిమతోడ నీవు గైకొను నిరత ముండెడి ధనమును ||ధరణి||

  • యేసు నందు నిత్యజీవం బిపుడు దేవుఁ డిచ్చును తీసికొనుము దాని వేగము దివ్య వరముగ నమ్మికన్ ||ధరణి||

  • విడుపు నీదు పాపములను తడవుఁజేయుఁ బోకుమీ విడువ కున్న నీకుఁ గల్గు వేద నాధికంబుపో ||ధరణి||

  • పరుల మాటలఁ బట్టి నీవు పడకు మోస మందున నరుల కొఱకు జీవ మిచ్చిన పరమధాముని నమ్ముమీ ||ధరణి||

  • తలఁచుకొనుమీ ధరణిలోన నిలుచు కాల మంతట విలువలేని యేసు ప్రేమ విధము చక్కఁగ నెఱుఁగుచు ||ధరణి||

  • దేవ కృపను బోలునట్టి దివ్య భాగ్య మొకటియున్ నీవు చూడ బోవు మిత్ర నేట నెచట వెదకినన్ ||ధరణి||
  • 292 నిజముగాఁ ప 10/19/2017 20:16 292 నిజముగాఁ పరిశుద్ధు డొకఁ డీ నేలపై లేఁడు వృజినములచేఁ జెడిన మదిని బ విత్రమూలం బెటుల బొడమును ||నిజము||

  • దురిత లతలకు మూలకందము దుస్స్వభావము దానిఁ గూడిన నరులలోఁ బరిశుద్ధ విధు లె న్నటికిఁ గనరావు నెరవుగా సద్ధర్మములనే తెఱఁగుననుఁ గావింప నేర్తురు ధరణి లోపల ముసిఁడి చెట్టున చెఱకు రస ముండునె తలంపగ ||నిజము||

  • మనసు క్రియ లన్నిటికి మూలం బనుచు శాస్త్రము పల్కు మఱి యా మనసు శుచిగాకున్న నగునే తనకు క్రియాశుద్ధి అనిశ మా హృదయము దురిచ్ఛల నలరి మిధ్యాసక్తి నుండఁగ ఘనతగల సత్యార్య ముల నిల మనుజుఁడె ట్లొ నరింపఁజాలును ||నిజము||

  • నిరతమును పాపాగ్నిచేతను గరగుచున్న మనంబులోపల పరమ ధర్మము భక్తి ఎటువలెఁ బాదుకొని యుండున్ నిరపరాధి యొకండు లేఁ డని నిక్కముగఁ గనపచ్చుచున్నది పరమ దేవుఁడు క్రీస్తు కృతమునఁ పాపులను రక్షింపవలయును ||నిజము||
  • 293 పాపులకు సఖ 10/19/2017 20:16 293 పాపులకు సఖుండు మన ప్రాపు యేసె సుమండి భువి పాపులకు సఖుండు ||పాపులకు||

  • రండి రండి మిత్రులార నిండు ధైర్య పడండి వేగమె దండైన యండ మన కుండు యేసుండని ||పాపులకు||

  • దాహ మణంచు దేవ వాక్యము దేహధారులార రండి దేహీ యన విహీనుల సాహాయ్యము నోహో యని ||పాపులకు||

  • ద్రవ్య మించుక లేని విక్రయ మయ్య యీ యేసయ్య రక్తము చేయలే మయ్య మన మయ్య దుర్నయ్యముల్ ||పాపులకు||

  • నిండు మనసు గలిగియే సండఁజేర రండి వేగమె నిండు ప్రియుండు న ఖండ పురుషుండని ||పాపులకు||

  • నింద లన్ని పొంది ప్రభుని మందలో వెలుఁగొందరే తఱిఁ పొం దుగ నిందలో నుందు రానందమున ||బాపులకు||
  • 294 యేసునే సేవ 10/19/2017 20:16 294 295 మన మొదటి త 10/19/2017 20:16 295 మన మొదటి తల్లిదండ్రులల్ మాయకు లోనైరి అన్నలారా వారి కనుగొనలకు సిగ్గు గదుర మోములు వంచి రన్నలారా ||మన||

  • తమ నగ్నతను జూడఁ దా మొప్ప లేరైరి అన్నలారా కొన్ని యమరిన మఱ్ఱాకు లంగంబులను గట్టి రన్నలారా ||మన||

  • పరమాత్ముఁ డిడు నాజ్ఞఁ పాలింప లేరైరి అన్నలారా పూర్వ పరి శుద్ధత నెడబాసి పాపాత్ములై పోయి రన్నలారా ||మన||

  • నరవంశజుల కెల్లఁ తరలెఁ దద్దురవస్థ అన్నలారా క్రీస్తు మర ణంబు మన పాప హరణంబుఁ గావించు నన్నలారా ||మన||
  • 296 నమ్మరె నరు 10/19/2017 20:16 296 నమ్మరె నరులార యేసుని సమ్మతిగాఁ జేరి నమ్మిన వారల నిమ్ముగ బ్రోచును సొమ్ముగ తను జేర్చి ||నమ్మరె||

  • యేసు క్రీస్తుకంటెఁ పోషకు లెవ్వరు లేరుసుమీ దోషుల తన దాసులుగాఁ దీసియు దోసముఁ బాపు సుమీ ||నమ్మరె||

  • నరకము నొందక మీ రయ్యో నరకము బాధ సుమీ న్యాయము కాదుసుమి నరులార నష్టము మీకు సుమీ ||నమ్మరె||

  • తండ్రి కొమరుఁడు విమ లాత్ముఁడు త్ర్యేకదేవుండు తండ్రి వలెను మనలను పాలించును తండ్రిగ నమ్ముదము ||నమ్మరె||

  • ధరణిలో నొకఁడైన చూడరె ధన్యుడు లేఁడనుచు దీర్ఘదర్శి దావీదు తెల్పె నిటు దీనుల కందఱికి ||నమ్మరె||

  • ప్రభు మన పాపముకై ప్రాణము బలిగా నిచ్చునుగా పాపము మోసెను మృతియై లేచెను పాపులఁ బ్రోచుటకై ||నమ్మరె||

  • దేవసుతుని రక్తం అబ్బిన ద్రోహుల కతిప్రొయము పావన మొనరించును పాపికి నిఁక జీవనమై యుండున్ ||నమ్మరె||
  • 297 యేసు క్రీస 10/19/2017 20:16 297 యేసు క్రీస్తుని గొల్వ రన్న యీ జగతిలోన నెవ్వరు లేరు వాని కన్న యేసుని వాక్యము ఎవ్వరి కబ్బునో దోసము విడి పర వాసము దొరకును ||యేసు||

  • సత్యుఁడు నిత్యుఁడాయ నన్న యీ సర్వ సృష్టిఁ జక్కఁగ సలిపి నిలిపె నన్న వ్యత్యాసము లే మియు లేకుండఁగ సత్యుండు చేసెను సర్వజగం బును||యేసు||

  • నిరాకారుఁడు నిశ్చయుఁడన్న నరుల రక్షింప నరావతారుఁడై నాఁడన్న నరుల పాపములుఁ పరిహరించుట కొరకై మరియ కొడుకై పుట్టెను ||యేసు||

  • పరిశుద్ధవంతుఁ డాయ నన్న ప్రభు యేసు నందఁ పాపమే గానఁ బడుట సున్న పరులను గావను ధరలోఁ దిరిగెను నరుల నడుమ బహు నిరపరాధముతో ||యేసు||

  • భేదాభేదములు గాని బోధ నాధుఁడొనరించె సాధు లెల్లను సంతోషింప బాధలుఁబడు స ద్రిక్తులతోడను సాదర వాక్కులు జక్కగ పలికెను ||యేసు||

  • మహిలోన మనుజు లెవ్వ రైనఁ జేయ లేనట్టి మహిమాద్బుతములఁ జేసె నన్న మహా రోగులను మఱి మృతులను మహా మహుండు స్వస్థుల మఱి గావించెను ||యేసు||

  • వర్ణింప వలనుకాని వాఁడు మన కోసర మతడు మరణమై మరల బ్రతికినాడు పరలోకమునకు మరి వేంచేసిన పరుఁ డగు క్రీస్తుని పాదముఁ బట్టుము ||యేసు||

  • పరిశుద్ధ దూతల నాదముతో ప్రభు యేసు క్రీస్తు ప్రకాశ వస్త్ర మహిమలతోఁ పరమునుండి బహు త్వరగా వచ్చును ధరలో నమ్మిన నరులను బ్రోచును ||యేసు||

  • న్యాయంబు దీర్చు దినము గలదు నమ్మని వారెల్ల సాయంబు వెదకినను గనపడదు సువార్త న్యాయముఁ దీర్చును నడవడి చొప్పున నమ్మని పాపుల నరకము జేర్చును ||యేసు||

  • నమ్మండీ నష్టము నొందక యేసుని నమ్మిన పొమ్మని చెప్పఁడు సుమ్మండి ఇమ్ముగఁ గృపతో నిలలోఁ గాచును పిమ్మట మోక్ష పురమునఁ జేర్చును ||యేసు||
  • 298 రండి యేసున 10/19/2017 20:16 298 రండి యేసుని యొద్దకుఁ ప్రియులారా మీరు రండి యేసుని యొద్దకు రండి రండి రయమున బిలుచుచు నుండెడి రక్షకుఁ డొసఁగెను బ్రాణము ||రండి||

  • మీరు పాపంబులఁ ద్యజించి యేసుని కడకు రారే వేగము విశ్వసించి మీరు వచ్చినను మిమ్మును ద్రోయఁడు చేరెడు వారిని జేర్చును దన దరి ||రండి||

  • మీకు బ్రతుకేమి శాశ్వతము ప్రియ జనులారా పోకుఁడి యాశించి లోకమును లోకాశలకును లొంగుట చేతను మీకు ఘటిల్లును మెండగు దుఃఖము ||రండి||

  • మీరేల జాలము చేసెదరు ప్రియులారా వేగ రారే కడు భాగ్య మొందెదరు చేర వచ్చి చిర జీవము నొందుఁ డ పార ముదంబును బడయఁగ దేవుఁడు ||రండి||
  • 299 యేసు నాథ క 10/19/2017 20:16 299 యేసు నాథ కథా సుధా రస మిదిగో పానముఁ జేయరే దోసకారి జనంబులారా దురిత భవముల బాయరే ||యేసు||

  • ఇహపరంబు లెవనిచే సృజి యింపఁబడియెనొ చూడరే అసహహ యా విభుఁ డవతరించెను అతని గుణములఁ బాడరే ||యేసు||

  • దురిత భరితుల దుష్ట చరితుల నరయ వచ్చెను జూడరే స్థిరముగామది నమ్మి యా ప్రభు కరుణ మదిఁ గొనియాడరే ||యేసు||

  • పనికిమాలిన వేలుపుల దెస పరుగు లెత్తుట మానరే తనువు మీ కొఱ కిచ్చు క్రీస్తుని దయకుఁ బాత్రతఁ బూనరే ||యేసు||

  • మరణ బలి రక్తమున మన యం దఱిని బ్రోవను వచ్చెను కరుణతోఁ బాపులఁ బిలుచు గురు దరికిఁబోవుద మిచ్ఛను ||యేసు||

  • పరమతత్వ విధాన బోధలు బాగుగఁ బ్రకటించెను చిరసుఖాస్పద పదముఁ గోరిన జీవులకు వినిపించెను ||యేసు||

  • మరణ మొందిన కొందఱికిఁ దా మరలఁ బ్రాణము లిచ్చెను వర మహాద్భుత కార్యముల ని ద్ధర ననేక మొనర్చెను ||యేసు||

  • కుటిల బుద్ధుల ద్రోచి సజ్జన గోష్టి నుండుట గోరరే దిటముగను నెమ్మదిని మీరొం దుటకుఁ క్రీస్తునిఁ జేరరే ||యేసు||
  • 300 రారె యేసున 10/19/2017 20:16 300 రారె యేసుని జూతము కోరిక దీర రారె యేసుని జూతము రారె యేసుని జూడ రారాజై మన జీవా ధార కరుణామృత సారమై యున్నాఁ డు ||రారె||

  • సారహీన మగు సం సారాబ్ధిలోఁ జిక్కి భారమనుచు నీత నేరని వారికి తారకమైన దేవకు మారుఁడు యేసుఁడూ రార్చు చుండు టకు భూరిసహాయ కారియై చేయూతకుఁ గోరి యిచ్చుచు క్షేమ తీరం బునకుఁ జేర్చ దారిఁ జూపుచు మీవి చారముల్ దొలఁగించు ||రారె||

  • ఘోరమైన పాప భారంబు మోయుచు దారిఁ గానక తారు మారు లైన నరులఁ గూరిమితో ఁ బిల్చును నారక బాధ లూరక దొలఁ గించుచు నీరసు లంచు భారంబు తా మోయుచు నోరి మధి కముఁ జూపి నేరంబు బాపి శృం గారమైన మోక్ష ద్వారమై యున్నాఁడు ||రారె||

  • కారుణ్యుఁడును నిర్వి కారుఁడు దురితోప కారుండు శుద్ధాలం కారుండౌ యేసుని నే రీతిగా వింటిమో యా రీతి మో క్షారామ మున జూతుము సార వాక్య ధోరణిన్ బడి పోదము దారుణం బగు శ్రమలు బారుబారుగా నున్న పోరి దాఁటి ప్రభునిఁ జేరి సుఖింతము ||రారె||

  • ఆ రమ్యపురిన బ్రే మారగించుచు నిత్య మారోగ్యముకు బొంది సారెసారెకుఁ ప్రభుని నారావముగ స్తోత్రము చారుతర దే వా రాధనముఁ జేతము నోరార నా పేరు నే పూజింతుము దూరస్థులై యున్న వారలం దన రక్త ధారోదకముచేఁ జే కూరునట్లుగఁ జేయు
  • 301 రారో జనులా 10/19/2017 20:16 301 రారో జనులారా వేగముఁ గూడి రారో ప్రియులారా శాశ్వతమైన ఘన రక్షణఁ జేర సారాసారముల్ సమ్మతిగాఁ జూచి ధీరత్వమునఁ క్రీస్తు జేరు దారిఁ గోరి ||రారో||

  • అనుమానము లన్ని మీరలు మాని ఆద్యంతము లేని కనికరము చేత మనల రక్షింపను దన జీవము నిచ్చు ఘనునిఁ క్రీస్తుని గొల్వ ||రారో||

  • మన పాపము లన్ని మోయను దే వుని చేఁ బనిఁ బూని మనుజావ తారుఁడై వినుట కద్భుతమైన పను లెన్నో చేసి సి ల్వను బడిన ఘనుఁ జేర ||రారో||

  • పాపాత్ము లగు వారి భారముఁ ద్రుంచు బలుడైన యుపకారి ఓపికతో ఁ దన దాపుఁ జేరిన వారి శాపము తా మోసి కాపాడు ఘనువే(డ ||రారో||

  • తన యాత్మకుఁ గీడు గల్గించెడు ఘనత లెల్లను పాడు తనువు నిత్యము గా దని యభిమాన మును వీడి మన క్రీ స్తుని జడ గతిఁజూడ ||రారో||

  • సకలాంతర్యామి నిరాకారు డొకడే యంతట సామి ప్రకట ముగా మర్త్యు లకునెల్ల మధ్యస్థు డొకడే క్రీస్తుడు సం రక్షకుడై యిలుకు వచ్చె ||రారో||
  • 302 యేసుని సుచ 10/19/2017 20:16 302 యేసుని సుచరిత మెంత పొనరినది యెవ్వరు విని యెద రీ జగతిన్ భాసుర నయ మను బంధము గలిగిన భక్తుల కిది సౌ భాగ్యముగా ||యేసు||

  • దాసుల మొఱలను దప్పక వినుచును ధైర్యము నొసఁగెడి దాత సుమీ దోసముల గమిఁ ద్రోయ బలముగల దొడ్డ దొరకు నుతి దూతలచేన్ ||యేసు||

  • పాప నరులఁ గని పావనం బొనర్చను భార మనని ఘన బంధు వుఁడు ఆ పరమ జనకు నాజ్ఞఁ బడసి నెరి యాఢ్యుఁడిడుమ లొందె నుయిలన్ ||యేసు||

  • సిలువపై నిలచి చేటు వడుచు మరి చివరకు జనకుని చిత్తమునన్ చెలువగ మనవిని జేసెను నరులకు శిక్ష తొలఁగుటకు శ్రీకరుఁడౌ ||యేసు||

  • పాప రహిత య పార మహిమమున పాత్రమ మరి కుడి పార్శ్వ మునన్ పాపులవిషయము ప్రార్థన మొనర్చెడి భావము గల హిత భాస్కరుఁడౌ నా ||యేసు||

  • దుషులు ననుఁ గని దూషణ నుడువులు దగ్ధము లనక దూరిన నా ఇష్టుఁడు వడసిన యిడుమలు దలఁచి యించుక పగ మది నెంచను నా ||యేసు||
  • 303 పోయెఁగ పోయ 10/19/2017 20:16 303 పోయెఁగ పోయెఁగ కాలము వెళ్లి పోయెఁగ పోయెఁగ మాయ సంసార సం పదఁ గూర్ప మరిగి యాయు వంతయు వ్యర్థ మైపోయెఁ దరిగి ||పోయెఁగ||

  • ఇలలో నెందరు నీతో నీడైనవారు కలఁ గాంచి మేల్కొన్న గతి మడసినారు ||పోయెఁగ||

  • జల బుద్భుదము కంటె చులకని బ్రదుకు దలపోసి దీని యా శలు గొయ్యి వెదకు ||పోయెఁగ||

  • ఎన్నాళ్ళు సుఖ పెట్టె నెరవౌ నీ మేను కన్ను మూసిననాఁడె కాటి పాలౌను ||పోయెఁగ||

  • మద మత్సరముల వెం బడి గూడి నీవు హృదయాభిమానము వదలు కొన్నావు ||పోయెఁగ||

  • చెడు దుర్గుణముల పో షించుట విడువ గడబాట్లు నీ కనులు గానంగలేవ ||పోయెఁగ||

  • జవ్వన బలముచే క్రొవ్వుచు నీవు నవ్వులాటల ప్రొద్దు నడిపి యున్నావు ||పోయెఁగ||
  • 304 వినరే యేసు 10/19/2017 20:16 304 వినరే యేసుక్రీస్తు బోధ మదిని గొనరే యాతని సత్య బోధ వినిన యేసుని బోధ విశ్వాసమున మీరు గొనయెదరు నిజముగ గొప్ప భాగ్యంబులు ||వినరే||

  • దారి దొలఁగియున్న వారినెల్లను బ్రోవఁ గోరివచ్చితి నంచు కూర్మి యేసువు తెల్పె ||వినరే||

  • మన పాపముల నెల్ల మన కొరకు వహియించి మన యందు దయచేతఁ దన ప్రాణమర్పించి ||వినరే||

  • మారు మనసు నొంది మరల రమ్మంచువే మారు బిలుచు యేసు మైత్రిని దలఁచుచు ||వినరే||

  • తన యాజ్ఞ గైకొని తన సేవజేసెడి మనుజుల కొసఁగును మనసున నెమ్మది ||వినరే||

  • తాను నడచిన త్రోవ తన జనులు ద్రొక్కును తానెపుడు చేయును తగిన సహాయ్యంబు ||వినరే||
  • 305 రండి మానవు 10/19/2017 20:16 305 రండి మానవులారా రక్షకునిన మ్మండి వేగము ప్రియులారా రండి పాపుల బ్రోచుటకు పర మండలంబును విడిచి యీ భువి మండలంబున కరుగుదెంచిన మహాత్మున్ గనుగొని సుఖింపను ||రండి||

  • ఇలలో మానవులందరు పలువిధ పాపా శలలో మునిగి యుండిరి తులువయగు సాతాను చెడ్డ వలను జిక్కినవారలన్ దన బలముతో విడి పింప బ్రాణము బలిగబెట్టిన ప్రభుని యొద్దకు ||రండి||

  • పరముండు నరులందరికై మరణంబయ్యొ కరుణతోడను కొరతపై మరలి మూడవదినమునందున మహిమతో నా ప్రభువులేచి తెరవజేసెను మోక్షమార్గము శరణు జొచ్చినవారలకును ||రండి||

  • పాపభారంబు నుండి విడుదలనొంద ప్రాపుగోరినవారలు ప్రాప కుండగు క్రీస్తునాధుని దాపుజేరి తపంబు జేసిన పాపభారము దీసి శాంతిని గూర్చు యా ప్రభు నొద్దకిపుడే ||రండి||

  • భావమందున దెలియుడి మీరలు నిత్య జీవమార్గము గనుడీ పావ నుండగు క్రీస్తు మిమ్మును పావనులుగా జేసి నూతన జీవము నొసంగి పర మున జేర్చు మిమ్మును నిశ్చయముగా ||రండి||
  • 306 పాపినినేనన 10/19/2017 20:16 306 పాపినినేనని ప్రభుపదములకడ ప్రార్థన సేయుము ఓ మనసా పాపుల మిత్రుడు ప్రభు యేసునికడ పాపక్షమాపణ కలదో మనసా ||పాపిని||

  • నరుని స్వనీతిచే దొరుకదు మోక్షము నరులను జూడకు యో మనసా ధరనొక పుణ్యుడు దరచినలేడని పరమవేదములో గలదో మనసా ||పాపిని||

  • జపతపములు మరి యుపవాసములును ఉపయోగింపవు ఓ మనసా నెపముల జెప్పెడు అపవాదిని విడి కృపవాదినిగని బ్రతుకో మనసా ||పాపిని||

  • మానని ప్రేమచే మనుజుల బ్రోవగ మానవుడయ్యెను ఓ మనసా మానుగ గల్వరి మ్రానిపై యేసుడు ప్రాణము నొసగెను ఓ మనసా ||పాపిని||

  • మరణము నొందియు మరల సజీవుడై మనుజుల కగుపడెనో మనసా మరణ బంధముల బరిమార్పిన ప్రభు సరిరక్షకు లిక లేరిల మనసా ||పాపిని||

  • మార్పును బొందక మలిన తరుణము మరల లభింపదు ఓ మనసా తీర్పుకాలమున తీర్పరి క్రీస్తని తిరముగ నమ్ముము యేసుని మనసా ||పాపిని||
  • 307 హే ప్రభుయే 10/19/2017 20:16 307 హే ప్రభుయేసు హే ప్రభు యేసు హే ప్రభు దేవసుతా సిల్వధరా పాపహరా, శాంతికరా ||హే ప్రభు||

  • శాంతి సమాధానాధిపతీ స్వాంతములో ప్రశాంతనిధీ శాంతి స్వరూపా, జీవనదీపా శాంతి సువార్తనిధీ ||సిల్వధరా||

  • తపములు తరచిన నిన్నెగదా జపములు గొలిచిన నిన్నెగదా విఫలులు జేసిన విజ్ఞాపనలకు సఫలత నీవెగదా ||సిల్వధరా||

  • మతములు వెదకిన నిన్నెగదా వ్రతములు గోరిన నిన్నెగదా పతి తులు దేవుని సుతులని నేర్పిన హితమతి వీవెగదా ||సిల్వధరా||

  • పలుకులలో నీ శాంతి కధ తొలకరి వానగ గురిసెగదా మలమల మాడిన మానవహృదయము కలకలాడెకదా ||సిల్వధరా||

  • కాననతుల్య సమాజములో హీనత జెందెను మానవత మానవ మైత్రిని సిల్వపతాకము దానము జేసెగదా ||సిల్వధరా||

  • దేవుని బాసిన లోకములో చావుయె కాపురముండెగదా దేవునితో సఖ్యంబును జగతికి యీవి నిడితివి గదా ||సిల్వధరా||

  • పాపము చేసిన స్త్రీని గని పాపుల కోపము మండెగదా దాపున జేరి పాపిని బ్రోచిన కాపరి వీవెగదా ||సిల్వధరా||

  • ఖాళీ సమాధిలో మరణమును ఖైదిగ జేసిన నీవెగదా ఖలమయుడగు సాతానుని గర్వము ఖండనమాయెగదా ||సిల్వధరా||

  • కలువరిలో నీ శాంతి సుధా సెలయేఱుగ బ్రవహించెగదా కలుష ఎడారిలో కలువలు పూయుట సిలువ విజయము గదా ||సిల్వధరా||
  • 308 పాపకూపమునం 10/19/2017 20:16 308 పాపకూపమునందు పడి మునిగియున్నావు పాటింపవది యెందుకు పాప జన్మము పాపకర్మము పాపపూరితమైన హృదయము ఓపరాని భయంకరోగ్రత శాపములు సమకట్టియుండగ ||పాప||

  • పరమాత్మ మీదనే గురి నిల్పు మని దెల్పు వరబోధమది నెంచవు నిరత మును రాత్రియును బవలును నిరవు ధనమును ఘనము సౌఖ్యము లరయు చుందువు క్షణము నీవా పరమ ధర్మము సరకుజేయవు ||పాప||

  • కనివినంగ నుదగని పనికిమాలిన క్రియల దనిసి భ్రమయుచు నుందువు ఘనుల పెద్దల జననీజనకుల ననిశమును నిరసించి మెలగెడు వినయరహితంబైన జీవిత మునకు నేమి ఘటిల్లునోకను ||పాప||

  • పెరవారలను బ్రియసో దరులుగ బ్రేమింప పరమాత్మపురికొల్పదే పరులపై ద్వేషంబు పగగొని పలుతెరంగుల బాధపఱచుచు ప్రాణహత్య లొనర్చు నీకు పరమ పదము లభింపసాధ్యమె ||పాప||

  • పాప పరిహారార్థ ప్రాయశ్చిత్తము జేసి ప్రాణమర్పించె నెవరో ఆ పరాత్పరు నాశ్రయించుము శాపభారము బాపిబ్రోచును మాపు రేపునులేని స్వర్గ ప్రాప్తికల్గును నిత్యశుభమగు ||పాప||

  • పాపభారము క్రింద పడికుందు మీకునే పరగనిత్తును శాంతిని దాపు నకు రండంచు పతితుల దయను బిలచెడు యేసుక్రీస్తును పాపి కాశ్రయుడంచు నమ్మి భక్తితో ప్రార్థించి వేడవే ||పాప||

  • శరణీయ వరమోక్ష పురమందు ఘనసౌఖ్య పరమానందము లొందుచు వరుల దూతల భక్తగణముల సరసదేవు స్మరించు భాగ్యము గురుడు నీకిడఁగోరి పిలుచుచు కరము జాపెను కౌగిలింపవె ||పాప||
  • 309 దారుణ మగు 10/19/2017 20:16 309 దారుణ మగు మరణ వారిధి దాఁట నె వ్వారి శక్యము సోదర ఘోర మగు కెరటములవలె వి స్తారముగ నేరములు పైఁగొని పారు చుండునప్పు డద్దరిఁ జేరు టెట్లు దారిఁ గనరే ||దారుణ||

  • ఒక్క పెట్టున నెగసి చక్క వెల్ళుద మన నీ రెక్క లక్కఱకు రావు ఎక్కడైనను నోడ గనుఁగొని యెక్కిపోద మని తలంచినఁ జెక్క నిర్మతమైన యోడ లక్కఱకు రావేమి సేతుము ||దారుణ||

  • మంగళ ధ్వనులతో శృంగారపురము వె లుంగుచున్నది ముందట పొంగి పారుచు మరణ నది త రంగములఁ జెలంగుచున్నది భంగపడకుఁడి మనకు క్రీస్తు సువార్తయను పెను నావ యిదిగో ||దారుణ||

  • వాద రహితుండైన యాది దేవుఁడు దాని నాధుం డనం బరఁగును బాధ లొందిన నరుల నందరిఁ జేరఁదీసిన క్రీస్తు యేసు నాధుఁడే నావి కుఁ డు క్రైస్తవ వేదమే చుక్కాని దీవికి ||దారుణ||

  • మానవు లందరు మరణాంబుధిని దాఁట మహనీయ మగు నావ యిదె దీనిలో నెక్కుటకు ముందే మానుగ వాక్యమును విని సు జ్ఞాన మొందినవారు క్రైస్తవ స్నాన మను పత్రికను బొందరె ||దారుణ||

  • విదితంబుగా నిందు విజ్ఞాన బోదకుల్ వినిపించుదురు వాక్యముఁ గొదగొనిన యాత్మములు తృప్తిఁ గొనును బ్రభు భోజనములోనే హృదయములలో దేవునాత్మ యెపుడు దీపంబై వెలుంగును ||దారుణ||

  • పలువిధ సంగీత ములతో సాగుచు మనము నలయ కుండఁగఁ బోదు ము బలముగల యీ యలలు దాఁటి పరమ పురద్వారముల వెలుపల గలిసికొని పరిశుద్ధ జనమును గడకు మోక్షము చేరుకొందుము ||దారుణ||

  • కరుణామయుని సభలోఁ జొరకపోయిన నిత్య నరక మంత మందున మరియు నంత్య దినపు బాధలు విరివిగ వినఁ గోరువారలు మరణ మొందక మును ప్రత్యక్షీ కరుణ మను గ్రంథమను వినరే ||దారుణ||
  • 310 హృదయమనెడు 10/19/2017 20:16 310 హృదయమనెడు తలుపు నొద్ద యేసు నాధుండు నిలచి సదయుఁ డగుచుఁ దట్టుచుండు సకల విధములను ||హృదయ||

  • పరుని బోలి నిలుచున్నాఁడు పరికించి చూడ నతఁడు పరుఁడు గాఁ డు రక్షకుండు ప్రాణ స్నేహితుఁడు ||హృదయ||

  • కరుణాశీలుం డతఁడు గానఁ గాచి యున్నాఁడు యేసు కరుణ నెఱి గి గారవింపఁ గరము న్యాయంబు ||హృదయ||

  • ఎంత సేపు నిలువఁ బెట్టి యేడ్పింతు రతని నాతఁ డెంతో దయచే బిలుచుచున్నాఁ డిప్పుడు మిమ్ములను ||హృదయ||

  • అతఁడు మిత్రుఁడతఁడు మిత్రుం డఖిల పాపులకు మిర లతని పిలుపు వింటి రేని యతఁడు ప్రియుఁడగును ||హృదయ||

  • జాలిచేతఁ దన హస్తములఁ జాఁపి యున్నాఁడు మిమ్ము నాలిం గనము సేయఁ గోరి యనిశము కనిపెట్టు ||హృదయ||

  • సాటిలేని దయగల వాఁడు సర్వేశు సుతుఁడు తన మాట వినెడు వారల నెల్ల సూటిగ రక్షించు ||హృదయ||

  • చేర్చుకొనుఁడి మీ హృదయమున శ్రీ యేసునాధు నతఁడు చేర్చు కొనుచు మీ కిచ్చును చిర జీవముఁ గృపను ||హృదయ||

  • అతఁడు తప్పక కలుగఁజేయు నఖిల భాగ్యములు మీర లతని హత్తుకొందు రప్పు డానందముతోడ ||హృదయ||

  • బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడఁ గాన బ్రతికి యుండు కాలముననే ప్రభుని గొలువండి ||హృదయ||
  • 311 జను లందఱు 10/19/2017 20:16 311 జను లందఱు వినండి దివ్య సంగతి తండ్రియైన దేవుఁ డెంత ప్రేమ చూపెను. ||యేసు క్రీస్తు నాకుఁగాను బ్రాణ మిచ్చెను తన్ను ఁ జేర నన్ను ఁ బిల్చెన్ క్రీస్తు వత్తును ||

  • నరకోటి పాపమందు మున్గి యుండఁగాఁ దండ్రి వారలన్ రక్షింపఁ ద్రోవ చేసెను.

  • మాకుఁ గాను ప్రాణమిచ్చి మృత్యు వొందను తన యేక పుత్రు నిచ్చి పంపె నిలకున్.

  • ఆయనను నమ్మువారు నాశ మొందక నిత్యజీవ మొందిసదా సంతసింతురు.

  • పాపభారము భరించు పాపులెల్లరు యేసు మాట వినఁగాను బాధ తీఱును.

  • చేర రండి, సువిశ్రాంతి నిత్యసంతుష్టి మీకు నిత్తు నంచు యేసు మిమ్ముఁ బిల్చును
  • 312 మహా వైద్యు 10/19/2017 20:16 312 మహా వైద్యుండు వచ్చెను ప్రజాళిఁ బ్రోచు యేసు సహాయ మియ్య వచ్చెను సంధింపరండి యేసున్ || మాధుర్యంపు నామము మోద మిచ్చు గానము వేద వాక్యసారము యేసు దివ్య యేసు ||

  • మీ పాప మెల్లఁ బోయెను మేలొందుఁ డేసు పేరన్ గృపా సంపూర్ణ మొందుఁడి యపార శాంతుఁ డేసు.

  • వినుండి గొఱ్ఱె పిల్లను విశ్వాస ముంచి యేసున్ ఘనంబుగన్ స్తుతించుఁడి మనం బుప్పొంగ యేసున్

  • ఆ రమ్యమైన నామము అణంచు నెల్ల భీతిన్ శరణ్యు లైన వారి నా దరించు నెంతో ప్రీతిన్

  • ఓ యన్నలారా పాడుఁడీ యౌదార్యతన్ సర్వేశున్ ఓ యమ్మలారా మ్రొక్కుఁడీ ప్రియాతి ప్రియుఁడేసు

  • ఓ పిల్లలారా కొల్వుఁడీ యౌన్నత్య రాజు నేనున్ తపించువారి దాతయౌ దయామయున్ శ్రీ యేసున్

  • శ్రీ యేసుకై యర్పించుఁడీ మీ యావజ్జీవనమును ప్రియంపు దాసులౌచును రయంబు గొల్వుఁడేసున్
  • 313 త్రాహి మాం 10/19/2017 20:16 313 త్రాహి మాం క్రీస్తు నాధ దయఁ జూడ రావే నేను దేహి యనుచు నీ పాదములే దిక్కుగాఁ జేరితి నిపుడు ||త్రాహి||

  • గవ్వ చేయురాని చెడ్డ కర్మేంద్రియాధీనుఁడనై రవ్వ పాలై నే నెంతో నెవ్వఁ బొందితిఁ త్రవ్వుచున్న కొలఁదిఁ పెరుఁగుఁ దరగదు నా పాప రాశి యివ్విధమునఁ జెడిపోతినినే నేమి సేతు నోహోహోహో ||త్రాహి||

  • నీ యందు భయభక్తులు లేని నిర్లజ్జాచిత్తముఁ బూని చేయరాని దుష్కర్మములు చేసినాఁడను దయ్యాలరాజు చేతిలోఁ జేయి వేసి వాని పనులఁ జేయ సాగి నే నిబ్భంగిఁ జెడిపోయితి నే నయ్యయ్యయ్యొ ||త్రాహి||

  • నిబ్బర మొక్కించుకై నిజము రవ్వంతైన లేక దబ్బర లాడుటకు ము త్తా నైతిని అబ్బురమైన ఘోర పా పాంధకార కూపమందు దబ్బున బడిపోతి నయ్యో దారి చెడి నేనబ్బబ్బబ్బా ||త్రాహి||

  • నిన్నుఁ జేరి సాటిలేని నిత్యానంద మందఁబోవు చున్నప్పుడు నిందలు నా కెన్ని చేరినా విన్నదనము లేకుండ నీ వే నా మదికి ధైర్యమిచ్చి యన్నిట రక్షించి తివి నా యన్న నీకు స్తోత్ర మహాహా ||త్రాహి||
  • 314 దేవ! దీనపా 10/19/2017 20:16 314 దేవ! దీనపాపిని ఓ పావన గావు కృపా బహుళ్యము చేత ||దేవా||

  • ఖలుడనో దేవా! నా నిలువెల్ల పాపంబె మలినత్వమును బాపి మాన్యు జేయవె తండ్రీ! ||దేవ||

  • నీకు కేవలంబు నీకే విరోధముగ ప్రాకొని నే ఘోర పాపం బొనర్చితిని ||దేవ||

  • నాయతిక్రమ మెప్డు నా యెదుట నున్నది నా యెదను భారంబై నను ద్రుంచుచున్నది ||దేవ||

  • పాపంబులోనే యు ద్భవించినాడను పాపంబులోనే గ ర్భము దాల్చినది తల్లి ||దేవ||

  • ఎదయందు సత్యంబే యెడఁగోరు చుందువు హృదయమందున జ్ఞాన మొదవ జేతువు నాకు ||దేవ||

  • కలిగించు నాలో ని ర్మల శుద్ధ హృదయంబు నిలుకడైన మనసు నిలుపు మాంతర్యమున ||దేవ||

  • త్రోసివేయకు నన్ను నీ సన్నిధి నుండి తీసివేయక నుంచు మీ శుద్ధాత్మను నాలో ||దేవ||

  • నీ రక్షణానంద మో రక్షకా మరల చేరదీసి యిచ్చి స్థిరపరచు నా మనసు ||దేవ||

  • కావవే కర్తార క్తాపరాధమునుండి కావు నే నుత్సాహ గానంబుఁ జేసెద ||దేవ||

  • ప్రభువ! నా నోరునిన్ ప్రస్తుతించుచు సదా విభవముగఁ గొనియాడ విప్పు నా పెదవులను ||దేవ||

  • కోరువాఁడవు కావీ వారయ నర్పణలు కోరిన నర్పింతు కోటి బలులు నీకు ||దేవ||

  • విఱిగిన మనసే నీ విలసిత యర్పణము అరయ నలిగిన హృదయ మతి ప్రియంబౌ నీకు ||దేవ||
  • 315 ఉన్నపాటున 10/19/2017 20:16 315 ఉన్నపాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షకా యెన్న శక్యముగాని పాపము లన్ని మోపుగ వీపుపైఁబడి యున్న విదె నడలేక తొట్రిలు చున్నవాఁడను నన్ను దయఁగను ||ఉన్న||

  • కారుణ్యనిధి యేసు నా రక్షకా నీ శ రీర రక్తము చిందుట భూరి దయతో నన్ను నీదరిఁ జేర రమ్మని పిలుచుటయు ని ష్కారణపు నీ ప్రేమ యిది మరి వేరే హేతువు లేదు నా యెడ ||ఉన్న||

  • మసి బొగ్గువలె నా మా నస మెల్లఁ గప్పె దో ష సమూహములు మచ్చలై అసిత మగు ప్రతి డాగు తుడువను గసుటుఁ గడిగి పవిత్ర్ర పరపను నసువు లిడు నీ రక్తమే యని మసల కిప్పుడు సిలువ నిదె గని ||ఉన్న||

  • వెలపట బహు యుద్ధ ములు లోపటను భయము కలిగె నెమ్మది దొల గెను పలు విధములగు సందియంబుల వలనఁ బోరాటములచే నే నలసి యిటునటుఁ గొట్టఁబడి దు ర్భలుఁడనై గాయములతో నిదె ||ఉన్న||

  • కడు బీదవాఁడ నం ధుఁడను దౌర్భాగ్యుఁడను జెడిపోయి పడి యున్నాను సుడివడిన నా మదికి స్వస్థతఁ జెడిన కనులకు దృష్టి భాగ్యముఁ బడయవలసిన వన్ని నీ చేఁ బడయుటకు నా యెడ యఁడా యిదె ||ఉన్న||

  • నీ వాగ్దత్తము నమ్మి నీపై భారము పెట్టి జీవ మార్గముఁ గంటిని కేవలంబగు ప్రేమ చేతను నీవు నన్ను క్షమించి చేకొని భావశుద్ధి నొనర్చి సంతోషావసరముల నిడుదువని యిదె ||ఉన్న||

  • దరిలేని యానంద కరమైన నీ ప్రేమ తరమే వర్ణన చేయను తెరవు కడ్డం బైన యన్నిటి విఱుగఁగొట్టెను గాన నే నిపు డరుదుగా నీ వాఁడ నవుటకు మఱి నీవాఁడ నవుటకే ||ఉన్న||
  • 316 దిక్కులేని 10/19/2017 20:16 316 దిక్కులేని వాఁడనో ప్రభో నీ యండజేరి మ్రొక్కి సేవఁజేతు నో ప్రభో మ్రొక్కి విన్నవించు వారి యక్కరలను దీర్చు సత్యము గ్రక్కున నిడి యాదరించు మక్కువైన దేవ తనయ ||దిక్కులేని||

  • ఘోర పాప భరము నెల్లను మోయుచు నలయు వారలార రండటంచును భూరి దయను బిలిచి యున్న సార వాక్కు లెఱుఁగ కధిక భార మొంది తుదిని నీ దరిఁ జేరితి నన్నాదరించుము ||దిక్కులేని||

  • బలము లేని వాఁడనో ప్రభో కేవలము పాప ములను జేసి యలసితిని ప్రభో ఇలను నే నొనర్చునట్టి కలుష జాలములను నీవు తొలఁగ జేసి యాత్మ కధిక బలము నొసగి మునుపు మయ్య ||దిక్కులేని||

  • పామరుండ నౌట వల్లను నే నెఱుఁగనైతి క్షేమ మిచ్చు పదవులెల్లను కామ క్రోధ లోభములను దీమసమున విడిచి యేసు నామ మందు విశ్వసించి ప్రేమను వర్తింపజేయు ||దిక్కులేని||

  • వందనం బొనర్తునో ప్రభో నా డెందమందలి సందియము లణంచు మో ప్రభో సందియ మెడబాపి శాస్త్ర మందు నుండు సార వాక్యానంద పదవు లనుభవింప డెందము వెలిఁగింప వయ్య ||దిక్కులేని||
  • 317 పాపము దలఁచ 10/19/2017 20:16 317 పాపము దలఁచు సుమీ పశ్చా త్తాపముఁ బొందు సుమీ దాపని యేసుని పాదంబులబడి పాపము వీడు సుమీ ||పాపము||

  • పాపము చేయకు మీ యేసుని గాయము రేపకుమీ పాయక పాపము చేసిన మనసా కాయఁడు యేసు సుమీ ||పాపము||

  • గంతులు వేయకుమీ యేసుని చెంతకుఁ జేరు సుమీ వింతఁగఁ గ్రీస్తుని రక్షణ్యామృత బిందువుఁ గోరు సుమీ ||పాపము||

  • ఈ ధరన్నమ్మకుమీ ఆత్మకు శోధన లుండు సుమీ శోధన మాన్పెడు క్రీస్తును నమ్మి శ్రద్ధగ నుఁడు సుమీ ||పాపము||

  • తెగువఁ బోరాడు సుమీ రిపునకు బెగ్గిలవద్దు సుమీ తెగువగు ప్రార్థన ఖడ్గమునుఁ బట్టి పగతునిఁ గెల్వు సుమీ ||పాపము||

  • అంతము వచ్చు సుమీ రక్షణ అంతలో వెదకు సుమీ అంత రంగుఁ డగు క్రీస్తు రక్షకుని చెంతను జేరు సుమీ ||పాపము||
  • 318 పాపినయ్యా 10/19/2017 20:16 318 పాపినయ్యా నేఁ బాపి నయ్యా కాపాడ వయ్యా పాపభారము నుండి పాపు మయ్యా నన్నుఁ పాపభారమునుండి పాపు మయ్యా ||పాపి||

  • కాపుమయ్యా ననుఁ గావు మయ్య నా పావ నయ్యా జీవమైన యేసు నీ వే నయ్యా నా జీవమైన యేసు నీవే నయ్యా ||పాపి||

  • ప్రాపు నీవు నా ప్రాపు నీవు న న్నోపినావు నా పాలిదైవమా నన్ను ఁ గావు మో నా పాలి దైవమా నన్ను ఁ గావు ||పాపి||

  • ఏల వయ్యా న న్నేల వయ్యా మేలియ్య వయ్యా చాల నమ్మితిఁ గరుణా శాలి వయ్యా నేఁ జాల నమ్మతిఁ గరుణా శాలి వయ్యా ||పాపి||

  • మంటివాఁడ నే మంటివాఁడ న న్నొంటి వీడ కె న్నంటి కైన ని న్నంటువాఁడ నే నె న్నంటికైన ని న్నంటువాఁడ ||పాపి||

  • శాంతివాఁడ నను శాంతిపరచు నీ శాంత మిడుచు నా సొంత మగు దనుక చెంత నునుచు నే నా సాంత మగు దనుక చెంత నునుచు ||పాపి||
  • 319 ఎఱింగి యెఱ 10/19/2017 20:16 319 ఎఱింగి యెఱిఁగి చెడిపోతివి మనసా యిఁక నీ దిక్కెవ్వరు చెపుమా దురితం బిది స చ్ఛరితం బిది యని యెరుక సరకు గొన కేమియు నీ ||యెఱిఁగి||

  • ఇది దేవుని దయ యిది క్రీస్తుని ప్రియ మిది విమలాత్ముని గుణ మనుచు ఎదలో ననుభవ మెఱింగి మరల దు ర్మదమున దుష్కృత పదమున బడితివి ||యెఱిఁగి||

  • సకలముఁ జూచెడు దేవుని కంటికిఁ జాటుగ జరిగెడి పని యేది ఇఁక జెవి గుసగుస లెల్లను దిక్కులఁ బ్రకటముఁ జేసెడు ప్రభు వున్నాఁడని ||యెఱిఁగి||

  • ఎన్నిమార్లు సిలువను వేయుచుఁ ప్రభు యేసుని వెతబడఁ జేసెదవు తిన్నని మార్గము తెలిసియుండి నీ కన్నుల గంతలు గట్టితి వయ్యో ||యెఱిఁగి||

  • గద్దించెడు మనస్సాక్షికి గడ లాడక పోతివి నీవు హద్దుమీరి దై వాజ్ఞలు ద్రోయుచు నెద్దు లాగు పరు గెత్తితి వయ్యో ||యెఱిఁగి||

  • పలువిధ శోధన బాధలలో ఘన ప్రభు క్రీస్తుడై నీ దిక్కునుకో తాళుచు బశ్చాత్తాపముపడి యిక జాలించుము కలు షపు యత్నంబు ||యెఱిఁగి||

  • అపరిమిత దయా శాంతులు గల ప్రభు వనిశము కోపింపఁడు నీపై కృపా వాగ్దద్తము లెపుడు దలఁచి నీ యపవిత్రతఁ గని హా యని యేడ్వుము ||యెఱిఁగి||
  • 320 యేసు విభున 10/19/2017 20:16 320 యేసు విభునిఁ దలఁచి మదిలో ద్వేషము లణఁగింపరే మోస విశ్వ భ్రాంతు లెల్ల రోసి పరిహర్షింపరే ||యేసు||

  • కామ క్రోధ లోభ మోహ క్షామ గుణములు మానరే హేమ రీతిని దేవ కృపలో క్షేమ మున్నది కానరే ||యేసు||

  • సత్యవేద సార మెల్ల నిత్యము రుచిచూడరే సత్త లేని దురిత జాలి బొత్తిగా విడ దీయరే ||యేసు||

  • కర్త కర్తయనుచు వేఁడి వ్యర్ధులై చెడి పోకరే స్వార్ధ చర్య లెల్ల మాని కర్త యేసుని బోలరే ||యేసు||

  • బంధు మిత్రు శత్రు నెనరు నిందుఁ జూపఁ బూనరే యందమైన మోక్ష విభవము లందుఁ గని హర్పింపరే ||యేసు||

  • మోక్ష వైభవ మెదలోఁ దలఁచి మోసమున బడిపోదురే కక్షి సాతాన్ ముచ్చు వలలను హెచ్చుగాఁ దెగఁగొట్టరే ||యేసు||

  • సద్దులేకను దేవ సేవ ముద్దుతో ఁ గొని యాడరే హద్దు మీరు విమత సాతాన్ సుద్దులను ద్యజియింపరే ||యేసు||

  • బాధ చేసెడి గురుల వీడుచు బొధకుల దరిఁ జేరరే నాధు క్రీస్తును నమ్మి మీరలు సాధులై వర్తింపరే ||యేసు||
  • 321 ఆదరింపుము 10/19/2017 20:16 321 322 శరణు నా యే 10/19/2017 20:16 322 శరణు నా యేసు ప్రభువా నీవెగా పరలోకమునకుఁ ద్రోవ కరుణతో నన్నుఁ గావ నీ కన్న గర్త యెవ్వఁడు యేసువా ||శరణు||

  • పర సుఖము విడిచినావు కన్యక మరియగర్భమున నీవు ధరణి నుదయించినావు నీ కన్న దాత యెవ్వఁడు యేసువా ||శరణు||

  • పాపభారము క్రిందను బడి యున్న పాపాత్ములను నెల్లను జేఁపట్టి రక్షింపఁగా నీ కన్న శ్రేష్ఠుఁ డెవ్వఁడు యేసువా ||శరణు||

  • మరణమై లేచినావు జీవింప మార్గంబుఁ జూపినావు పరమహిమ జూపినావు నీ కన్నఁ ప్రభుఁ డెవ్వఁడు యేసువా ||శరణు||
  • 323 రావయ్య యేస 10/19/2017 20:16 323 రావయ్య యేసునాధా మా రక్షణమార్గము నీ సేవఁ జేయ మమ్ముఁ జేపట్టుటకు ||రావయ్య||

  • హద్దు లేక మేము ఇల మొద్దులమై యుంటిమి మా కొద్ది బుద్ధులన్ని దిద్ది రక్షింపను ||రావయ్య||

  • నిండు వేడుకతోను మమ్ము బెండువడక చేసి మా గండంబు లన్నియు ఖండించుటకు ||రావయ్య||

  • మేర లేని పాపము మాకు భారమైన మోపు నీవు దూరంబుగాఁ జేసి దారిఁ జూపుటకు ||రావయ్య||

  • పాపుల మయ్య మేము పరమ తండ్రిని గానకను మా పాపంబు లన్నియుఁ పారఁ దోలుటకు ||రావయ్య||

  • అందమైన నీదు పరమానంద పురమందు మే మందరముజేరి ఆనందించుటకు ||రావయ్య||
  • 324 ఏ ముఖాంబుత 10/19/2017 20:16 324 ఏ ముఖాంబుతోడ వత్తు యేసు నాధనీదు మ్రోల కావరించి నిన్నుమఱచి యేక మైతి బామరులతో నేది దారి నిన్నుఁ జేర నేమో తెలియదాయెను ||ఏ ముఖంబు||

  • నీచ పాప వర్తనంబు పేచ మెల్లఁ బాపి ముందు కాచి పెంచి నియము నిష్ఠ లాచరణము నిలుపుకొరకు దోషభార మెల్ల బాపఁ బూచినీ దె నిజముగా ||ఏ ముఖంబు||

  • తుట్టతుదకు నిన్ను ఁ జేరఁ గట్టినాఁడం గంకణమును వట్టిమాటకాదు నిజము పట్టి నడుపు పరమ పురికిఁ బట్టికొనుమునాదు చేయి మట్టి పాలు కాకమునుపే ||ఏ ముఖంబు||
  • 325 నన్ను దిద్ 10/19/2017 20:16 325 నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా నీవు కన్న తండ్రి వనుచు నేను నిన్ను ఁ జేరితి నాయనా ||నన్ను||

  • దూరమునకుఁ బోయి నీ దరిఁ జేర నైతిని నాయనా నేను కారు మూర్ఖపు పిల్లనై కా రడవిఁ దిరిగితి నాయనా ||నన్ను||

  • మంచి మార్గము లేదు నాలో మరణ పాత్రుండ నాయనా నేను వంచితుండ నైతిని ప్ర పంచమందున నాయనా ||నన్ను||

  • చాల మారులు తప్పిపోతిని మేలు గానక నాయనా నా చాల మొఱల నాలకించుము జాలిగల నా నాయనా ||నన్ను||

  • జ్ఞాన మంతయుఁ బాడుచేసి కాన నైతిని నాయనా నీవు జ్ఞానము గల తండ్రి వంచు జ్ఞప్తి వచ్చెను నాయనా ||నన్ను||

  • కొద్ది నరుఁడను దిద్ది నను నీ యొద్దఁ జేర్చుము నాయనా నీ యొద్దఁ జేర్చి బుద్ధి చెప్పుము మొద్దు నైతిని నాయనా ||నన్ను||

  • ఎక్కడను నీవంటి మార్గము నెఱుఁగ నైతిని నాయనా నీ ఱెక్క చాటున నన్ను ఁ జేర్చి చక్కపరచుము నాయనా ||నన్ను||

  • శత్రువగు సాతాను నన్ను మిత్రు ఁ జేయను నాయనా యెన్నో సూత్రములు గల్పించెను నా నేత్రముల కో నాయనా ||నన్ను||

  • వాసిగా నేఁ బాపలోకపు వాసుఁడ నో నాయనా నీ దాసులలో నొకనిగా ననుఁ జేసి కావుము నాయనా ||నన్ను||
  • 326 నమ్మితి నయ 10/19/2017 20:16 326 నమ్మితి నయ్యా యేసయ్యా నీ పాదములే నమ్మితి నయ్యా యేసయ్యా నమ్మితి నయ్య నా నెమ్మదిలో నిన్ను నిమ్ముగఁ గృప నాపైఁ గుమ్మరిం చుము వేగ ||నమ్మితి||

  • పాప భార మనెడు మోపు మోయఁగ లేక కాపు నీవె యని నీ దాపు జేరిన నేను ||నమ్మితి||

  • ఆపత్కాలమునందుఁ బ్రాపు నీవని వేఁడఁ గాపాడి రక్షించు కరుణాసముద్రుఁడ ||నమ్మితి||

  • ఎన్ని తప్పులు నాలో నున్న నీ దయ చేత మన్నించి రక్షించు మహిత దేవ కుమార ||నమ్మితి||

  • దాసుని మొఱ నీవు వేసారక విని వాసిగా రక్షించు పరమ జనక నన్ను ||నమ్మితి||
  • 327 దేవ నీవు న 10/19/2017 20:16 327 దేవ నీవు నన్ను ఁ బరిశో ధించి బాగుగఁ దెలిసికొంటివి నీ వెఱుఁగు దువు నేను కూర్చుండుటయును నే లేచుటయును ||దేవ||

  • నాకుఁ దలఁపులు పుట్టినపుడే నా మనస్సు గ్రహించి నాఁడవు ప్రాకటంబుగ నా నడక నా పడకను బరిశీలించితి ||దేవ||

  • నీకు నా సమస్త చర్యల నిజము తెలియును, మాట నాల్కకు రాకపూర్వము దేవ సర్వముఁ బూర్తిగా నీకే తెలియును ||దేవ||

  • నా వెనుకను ముందు నుండి నన్ను నావరిఁచి నీ చెయ్యి నీవు నాపయి నుంచితివి నా మది కది కేవల మందదు ||దేవ||

  • అరుగుదెంచెద నెచ్చటికి నీ యాత్మ యొద్ద నుండి యింక నీ పరమ సన్నిధి నుండి నే నెచ్చోటికిఁ బారిపోవుదు ||దేవ||

  • ఏను వేకువ టెక్కలను ధరి యించి కడలిలో నున్న నీ చెయి మానక నడిపించు నీ కుడి చేయియు మరి నను గైకొను ||దేవ||

  • నను సృజించిన తెఱఁగెఱుంగఁగ నాకు భయ మాశ్చర్య మొదవును గనుక నీకును నేఁ గృతజ్ఞతాస్తుతులను జెల్లింతును ||దేవ||

  • నేను పిండం బైనయప్పుడు నీవు నను వీ క్షించినాఁడవు నేను బ్రతుకుట ముందె లిఖితంబాయెను నీ గ్రంథంబులో ||దేవ||

  • నిక్కముగ దేవా నీ తలఁపు లెక్కువ ప్రియ మగును నాకును లెక్కకు నెక్కువౌ ||దేవ||
  • 328 పాప పశ్చాత 10/19/2017 20:16 328 పాప పశ్చాత్తాప మొందని వారికి పరమ భాగ్య మేడ నబ్బునే మనసా పాపాత్ములకు యేసు పరమండలము నుండి భూమధ్యమునకుఁ దా వచ్చెను పాపిష్ఠుల రమ్మని పిలిచెను నా ప్రాపుఁ గోరుమని చెప్పెను మనసా ||పాప||

  • ధైర్యమొంది నన్ను దలఁచిన వారికి పూర్వజ్ఞాన మొనఁగూర్తును దు ర్భావ మెల్లను విడఁ దీతును యేసు వారి యాజ్ఞ యని యనియెను మనసా ||పాప||

  • బలపడి నాదు నామము గొన్నవారికి యిల బాంధవుల వైరమందును సర్వ కుల జనంబుల క్రోధమందును స్నేహి తుల యెడ బాటులు గల్గును మనసా ||పాప||

  • అడిగిన వారికి నొసఁగుదు ననుచును కడుమోదమున నాజ్ఞాపించెను తట్టు తట్టుఁడని బోధించెను విప్పి విడబడునని ప్రేమించెను మనసా ||పాప||

  • దోషములన్నియు యేసు నాధుడు తా మోసికొని సమ్మతించెను సిలువ వేసిన వారిని దీవించెను మోక్ష వాస సాధన మని తెల్పెను మనసా ||పాప||
  • 329 పాపిని కృప 10/19/2017 20:16 329 పాపిని కృప జూపవయ్యా దాపు జేరితిని యేసయ్యా పాప భారము క్రింద శ్రమపడి కృంగియున్నాను యేసయ్యా ||పాపి||

  • వేష భాషలతోడ నిండి మోసపోయితిని యేసయ్యా దోసిలొగ్గి నిన్ను చేరితి దాసునిగ బ్రోవు యేసయ్యా ||పాపి||

  • నీతి లేని నాదు జీవిత మేల నికనయ్యా యేసయ్యా నీతి గరపి బ్రోవు మయ్యా నీతి నిడవయ్యా యేసయ్యా ||పాపి||

  • నీదు సిలువలోని ప్రేమ నెంచదర మౌన? యేసయ్యా నాదు కలుష మంత బాపి కనికరింపు మా యేసయ్యా ||పాపి||

  • నీదు రక్తధారలేయిల పాపికాశ్రయము యేసయ్యా నీతిమంతుల జేయుమయ్యా నీతిసూర్యుండా యేసయ్యా ||పాపి||

  • దాపుగోరినవారలకు నీ ప్రాపుజూపితివి యేసయ్యా పాపశాపము బాపి నిత్య జీవమిడవయ్యా యేసయ్యా ||పాపి||

  • శాంతి గోరువార లెల్లనీ చెంతకరగినచో యేసయ్యా చింతలెల్ల దీర్చగలవు శాంతి నొసగెదవు యేసయ్యా ||పాపి||

  • పరమరక్షక నీదు ప్రేమ నెరుగ తరమౌన యేసయ్యా పరుల మైన మమ్ము బ్రోవ వేచియున్నావా యేసయ్యా ||పాపి||

  • నాదు హృదయము నీదెసుమ్మా నీవె గైకొనుమా యేసయ్యా శుద్ధ హృదయము జేసి నను నీ సుతునిగా జేయు యేసయ్యా ||పాపి||
  • 330 ఖండింపవలెన 10/19/2017 20:16 330 ఖండింపవలెను దుర్గుణములు ఖండింపవలెను ఖండింపవలెఁ బాప ముండఁజూచి యేసు నండఁజేరి మన గుండె పదిలముఁ జేసి ||ఖండింప||

  • అంధత్వమునను రక్షణమార్గ మందుఁ జేరకయు ఎందెందుఁ జూ చిన సందులేక పాప మందు మునిఁగి నరలా నందమోందక చెడిరి ||ఖండింప||

  • ఎందు కీ భ్రమలు నీ యందుండు సందేహము వీడు పొందుగ యేసు సం బంధు డవై యున్న నందమైన మోక్ష మందుఁ జేరుట కొఱకు ||ఖండింప||

  • బెదరక నీవు సాతానుని నెదిరింపవలెను కుదురుగ నీ యేసు చదరునఁ జేరిన వదరుబోతు లెల్ల నెదురాడ లేరిఁక ||ఖండింప||

  • ఆసింపబోకు లోకభోగములు మోసమై యుండు వాసిగ యేసుని దాసుఁడవైయున్న గాసిఁ జెందక మోక్ష దాసుఁడ వౌదువు ||ఖండింప||

  • నమ్మి జీవించు యేసుని యందు నెమ్మదిఁ బొందు రమ్ము యేసుని యొద్ద సొమ్ము నీకున్నది సమ్మతించి మదిని నెమ్మదిగాఁ జూచి ||ఖండింప||
  • 331 మనసా వినవే 10/19/2017 20:16 331 మనసా వినవేమే క్రీస్తునిఁ గని సేవింపవేమే అనుదినమున నీ కాయువు క్షీణం బగుచున్నది గదవే ||మనసా||

  • చింతలేల నీకు వర శ్రీ మంతుడుండు వరకు చెంతను జేరక యెంతసేపు నీ యంతట నుండెదవే ||మనసా||

  • లోకాశలకును నీవు లోకువై యుండకుము ఆకాశము నేలెడు మన ప్రభువును ప్రాకటముగ నమ్ము ||మనసా||

  • మాయ సంతలోన జిక్కి మాయలఁ బోయెదవు కాయము స్థిరమని నమ్మకు మీ నీ ప్రాయము దక్కదుగా ||మనసా||

  • రక్షకయని వేఁడు నీవు రక్షణకై వేఁడు రక్షణఁ బొందుట కిదియే సమయము తక్షణమున వేఁడు ||మనసా||

  • అందరమును గూడి యేసుని మందిరమునఁ జేరి పొందుగ క్రీస్తుని పొగడుచుఁ బాడుచు నందునఁ జేరుదము ||మనసా||
  • 332 అపరాధిని య 10/19/2017 20:16 332 333 పశ్చాత్తాప 10/19/2017 20:16 333 పశ్చాత్తాపము బొందుము జీవమ నీవు ప్రభుని సన్నిధి కేగుము పశ్చాత్తాపములేని ప్రజలెవ్వరికి గాని నిశ్చయముగ గల్గు నిత్యమౌ నరకంబు ||పశ్చాత్తా||

  • ఎంత పాపవైనను జీవము క్రీస్తు చెంత పార్థనఁ జేయుము సంతోషమును మన శ్శాంతిని నొసఁగున నంతుఁడైన విమ లాత్ముఁ డాదరించు ||పశ్చాత్తా||

  • జారచోరకార్యము లేవైనను బారఁదోలును వేగము నారాజ్యమును వెదకు నరు లందఱకు జీవ ధార లెచ్చెదనని కోరి కర్త వచించె ||పశ్చాత్తా||

  • వినుము ప్రభువు వాక్యము జీవము నీవు గనుము రక్షణ భాగ్యము తనువు నిత్యముగాదు నిను నీవె నమ్మకు వినయ బుద్ధిని గ్రీస్తు ఘనము వెదుకుము వేగ ||పశ్చాత్తా||

  • దిక్కుమాలిన దానవే జీవము ప్రభుని మ్రొక్కి పరమును జేరవే నిక్కమిది నీ పాప మెక్కువగా నున్న మక్కువతో నిన్ను గ్రక్కున విడిపించు ||పశ్చాత్తా||

  • బలములేని దానవే జీవమ యాత్మ బలము బొందుము వేగమే యిలను విద్యాధన బలముల నమ్మక కలుష జాలము వీడి కర కడకేగుము ||పశ్చాత్తా||

  • మందపోషకుఁడు క్రీస్తు జీవమ యేసా నందపూర్ణుఁడు థీరుఁడు వందిత సత్సంఘ మందుఁ జేరిన సత్యా నందంబు నిత్యంబు నొందుచు నుందువు ||పశ్చాత్తా||
  • 334 ఉన్నట్టు న 10/19/2017 20:16 334 ఉన్నట్టు నేను వచ్చెదన్ పాపిష్ఠు న్నీవు పిల్వఁగన్ నీ నెత్రుచేతఁ గడ్గుమా యో గొఱ్ఱె పిల్ల దేవుఁడా!

  • ఉన్నట్టు నేను వచ్చెదన్ నే నొప్పుకొందుఁ దప్పులన్ నీ మాటతో హరించుమా యో గొఱ్ఱె పిల్ల దేవుఁడా!

  • ఉన్నట్టు నేను వచ్చెదన్ దుఃఖంబు బాధపర్చఁగన్ బాపంబుఁ జేయనీకుమా యో గొఱ్ఱె పిల్ల దేవుఁడా!

  • ఉన్నట్టు నేను వచ్చెదన్ యేసూ, కబోది నుండగన్ ఆత్మీయదృష్టి నీయుమా యో గొఱ్ఱె పిల్ల దేవుఁడా!

  • ఉన్నట్టు నేను వచ్చెదన్ నీ మాట నమ్మునట్టి నన్ మన్నించి చేర్చుకొమ్మయా యో గొఱ్ఱె పిల్ల దేవుఁడా!

  • ఉన్నట్టు నేను వచ్చెదన్ నీ ప్రేమ నన్నుఁ బిల్వగన్ నీ వాఁడ నౌదు సర్వదా యో గొఱ్ఱె పిల్ల దేవుఁడా!
  • 335 ఓ యేసు, రక 10/19/2017 20:16 335 ఓ యేసు, రక్షకా నీ పిల్పు విందును కల్వరి పై నా పాపము నివృత్తి చేసితి. ||యేసు, వచ్చెదన్ నన్ను ఁ జేర్చుము నన్ నీ రక్తమందున పవిత్ర పర్చుము ||

  • నేనైతే పాపిని నీవే నా ప్రాపపు నా దోష మెల్ల కడిగి పవిత్రపర్చుము

  • అశక్తుఁ డనౌ నన్ నీవే స్థాపించుము విశ్వాస ధైర్య బలముల్ నాలో ఁ బుట్టించుము
  • 336 యేసు, నీదు 10/19/2017 20:16 336 యేసు, నీదు జాలివల్ల లెక్క లేనివారలు రక్షణంది సంతసిల్ల నిమ్ము వారి డెందముల్ నీదు సిల్వ వంతవార్తఁ జాటఁజేసి రాష్ట్రముల్ చూడ నిమ్ము త్రాణకర్త! నీ కృపా ప్రకాశముల్

  • ఏమియున్ గ్రహింపకున్న మర్త్యు డెంద మాశతో నిన్ను ఁ గూర్చి తృష్ణ గొన్న యాత్మ యేడ్చు మెండుగా కోయఁబడ్డ గడ్డి మంచుఁ గోరునట్లు పాపులు నీవె రక్షకుండ వంచు నిన్ సదా యాశింతురు.

  • ద్వీపవాసు లెత్తి కేలు కోరుచుందు రిప్పుడు నీదు సేవకాళి నంపి యాత్మ క్రొంత్త జన్మమున్ ప్రేమదీప్తి జ్ఞానకాంతిఁ గల్గం జేయు వాక్యము నిచ్చి గొఱ్ఱె పిల్ల కీర్తిన్ వారి నోట నుంచుము
  • 337 తన యక్రమము 10/19/2017 20:16 337 తన యక్రమములకు క్షమా పణ నొందినవాఁడు తన పాప ములకు బ్రాయశ్చిత్తము బును బొందినవాఁడును ధణ్యుండౌ ||తన||

  • దేవుని చేత ని ర్తోషిగఁ దీర్చఁ బడిన వాఁడు భావంబున లేశం బయినను గ పటము లేనివాఁడును ధన్యుండౌ ||తన||

  • మునునేని మౌని నై దిన దినమున నేనొనం చిన నా యార్త ధ్వనిచే క్షీణిం చెను నా యెముకలు సకలం బకటా ||తన||

  • రేయి పగలు నా మీఁ దను నీ చేయి భారమయ్యెఁ గాయము నందలి సారము వేసవి కాలంబున నెండిన విధ మాయెను ||తన||

  • కప్పుకొనకయే నీ యెదుటఁ గలుష మెప్పుకొంటి నొప్పుకొందు ననుకొంటి నక్రమ మోర్పుతోడఁ బాపము మన్నించితి ||తన||

  • కావున నీ సంద ర్శనపుఁ గాలమందు భక్తుల్ భావము రంజిల నినుఁ బ్రార్థింత్రు ప్ర వాహంబులు వారలపైఁ బొరలవు ||తన||

  • దాగు చోటు నీవే శ్రమలను దప్పించెద వీవే వేగ విమోచన గానంబులతో విడువక నీవే యావరించెదవు ||తన||

  • నీ కుపదేశింతు మార్గము నీకును బోధింతు నీ కాలోచన నేఁ జెప్పె దను నీ మీఁదను దృష్టించి సతంబు,ను ||దన||

  • జ్ఞానము లేనట్టి గుఱ్ఱమ ట్లైనను ఖరమువలె నైనను మీరుండకుఁ డని కళ్లెము తో నెంతో బిగియింపఁబడవలెఁ ||దన||

  • కలుగు ననేకములౌ వేద నలు కడు భక్తి విహీ నులకు నమిత కృప దేవుని విశ్వా సులఁ జుట్టుకొని యుండు నిజంబుగ ||దన||

  • సంతోషించుఁడి నీతి మంతులార సత్య స్వాంతులారా మీరంద ఱత్యంత సంతోషంబున గానముఁ జేయుడి ||తన||

  • జనక తనయ పరిశు ద్ధాత్మ కును మహిమము గల్గు మును పిప్పుడు నెల్లప్పుడు యుగముగ ములకును దనరారును గాకామేన్ ||జనకతనయ||
  • 338 యేసుఁడు రా 10/19/2017 20:16 338 యేసుఁడు రాఁగన్ జేసిన దోషము నాశన మాయెన్ ||యేసుఁడు||

  • చింతలు పోయెన్ వింతగ నాకున్ జెంతకుఁ జేర్పఁగ సంతస మాయెన్ ||యేసుఁడు||

  • సిలువను మోసెన్ గలువరి మెట్టన్ చెలువుగఁ బాపపు బలువును దించెన్ ||యేసుఁడు||

  • శిరమున ముండ్లున్ గరమున మేకులున్ స్థిరముగ నాటఁగ బరమును జూపెన్ ||యేసుఁడు||

  • పదముల మేకులున్ జెదరఁగ రక్తము ఎద నిఁకఁ బ్రేమతో ముదము నొసంగెన్ ||యేసుఁడు||

  • రక్షణ జూపెన్ దక్షుఁడు నాకున్ పక్షముతో నిఁక మోక్షము జూపెన్ ||యేసుఁడు||

  • రక్తిగ వేఁడన్ శక్తి నొసంగెన్ రక్తము జల్లియు ముక్తిని జూపెన్ ||యేసుండు||

  • గురువును నమ్ముదున్ భారము వెడలెన్ ధీరునిఁ జేయుచు దారిని జూపెన్ ||యేసుఁడు||
  • 339 ఎంత పాపి న 10/19/2017 20:16 339 ఎంత పాపి నైనను యేసు చేర్చుకొనును అంచు నీ సువార్తను అంతటఁ జాటించుఁడి ||హల్లెలూయ హల్లెలూయ యెంత పాపి నైనను యేసు చేర్చుకొనున టంచుఁ బ్రకటించుఁడి||

  • మెండుగా క్షమాపణన్ పూర్ణ సమాధానము నెంత పాపి కైనఁ దా నిచ్చి చేర్చుకొనును.

  • తన దివ్య సిల్వచేఁ దీసి పాప శాపమున్ నన్ బవిత్రపర్చెను నాకు హాయి నిచ్చెను

  • ఘోర పాపి నైనను నన్ను ఁ జేర్చుకొనును పూర్ణశుద్ధి నిచ్చును స్వర్గమందుఁ జేర్చును
  • 340 సిల్వ చెంత 10/19/2017 20:16 340 సిల్వ చెంత నేసువా చేర్చి నన్ను నుంచు కల్వరిన్ స్రవించెడు కల్వలో నన్నుంచు. ||సిల్వకే సిల్వకే చెల్లునా విముక్తి చెల్వ మొప్ప నద్దరిన్ జేర నాకు ముక్తి ||

  • కంపితాత్ము నంధునై కానలేక యుండ సొంపు మీరఁ బ్రోచితి సూర్యతేజ స్కుండ

  • దేవ గొఱ్ఱె పిల్ల ఈన దీప్తి నాకుఁ జూపు నీ వధా ప్రభావముల్ పావనుండ నేర్పు.

  • నే నిరీక్షణంబుతో నెప్డు వేచి యుందున్ భూ నితాంత వారధిన్ బూని యీది మందున్
  • 341 డాగు నేది 10/19/2017 20:16 341 డాగు నేది మాపును వేగ యేసు రక్త ధారే రోగి కేయౌషథము బాగుగా నా రక్త ధారె || హా దివ్య రక్తము ఆ బుగ్గ వినహా యేదియు లేదుగా యేసు యొక్క రక్త ధారె ||

  • పాప పరిహారము ప్రాపు యేసు రక్త ధారె శాపపు సంహారము స్వామి యేసు రక్త ధారె

  • ఇదే నా సుతీర్థము యేసు యొక్క రక్తధారె నాదు క్షమాపణము సాధు వేసు రక్త ధారె

  • నాకు సమాధానము నాధుఁ డేసు రక్త ధారె సాకు నేను గానను జయ యేసు రక్త ధారె
  • 342 నాకై చీల్చ 10/19/2017 20:16 342 నాకై చీల్చఁబడ్డ యో నా యనంత నగమా నిన్ను డాగి యందునఁ చెను మీరఁ బారెడు రక్త జలధారలా సక్తిఁ గ్రోలఁగా నిమ్ము.

  • నేను నాదు శక్తిచే నిన్నుఁ గొల్లఁజాలను కాల మెల్ల నేడ్చినన్ వేల క్రతుల్ చేసినన్ నేను చేయు పాపము నేనె బాపఁజాలను.

  • వట్టి చేయి చాఁచుచున్ ముట్టి సిల్వఁ జేరెదన్ దిక్కు లేని పాపిని ప్రక్కఁ జేర్చి ప్రోవుము నా కళంక మెల్లను యేసునాధ, పాపము.

  • ఈ ధరిత్రియందున నేఱు దాఁటునప్పుడు నాదరించి నీ కడన్ నాకై చీల్చఁబడ్డయో నా యనంత శైలమా నన్ను ఁ జేరఁ దీయుమా
  • 343 ఇమ్మానుయేల 10/19/2017 20:16 343 ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటగు ఓ పాపి! యందు మున్గుము పాపంబు పోవును ||యేసుండు నాకు మారుగా ఆ సిల్వఁ జాపఁగా శ్రీ యేసు రక్త మెప్పుడు స్రవించు, నాకుఁగా ||

  • ఆ యూట మున్గి దొంగయు హా! శుద్ధుఁ డాయెను నేనట్టి పాపి నిప్పుడు నేనందు మున్గుదు.

  • నీ యొక్క పాప మట్టిదే నిర్మూల మౌటకు రక్షించు గొఱ్ఱె పిల్ల? నీ రక్తంబె చాలును.

  • నా నాధు రక్తమందున నే నమ్మి యుండినన్ నా దేవుని నిండు ప్రేమ నే నిందుఁ జూచెదన్.

  • నా యా యుష్కాల మంతట నా సంతసం బదే నా క్రీస్తు యొక్క రొమ్మునన్ నా గాన మిద్దియే.
  • 344 పరమ రాజ్యమ 10/19/2017 20:16 344 పరమ రాజ్యమునకు నరులు తిరిగి పుట్టవలయు ననుచుఁ బరమ గురువు యేసు క్రీస్తు స్థిరము చేసెను ||పరమ||

  • వేదశాస్త్ర మెఱిఁగినట్టి యూదుల యధికారియౌ ని కోదే మనెడు పరిసయుండు మదిని దలఁచుచున్ ||పరమ||

  • అతఁడు రాత్రివేళఁ ప్రభుని వెతకి పోయి యెదుట స మ్మతిని నిలిచి పిలిచి పల్కె హితవుతోడను ||పరమ||

  • బోధకుండ నీవు మోక్ష నాధుఁడౌ యెహోవ యొక్క వేద వార్తఁ జెప్పెదవు నీ బోధ నెఱుఁగుదున్ ||పరమ||

  • మఱియు నీవు చేయుచున్న గురుతు లెవ్వరైన దైవ వరము లేని యట్టి పాప నరులు చేయరు ||పరమ||

  • అనుచుఁ బరిసయుండు పల్క వినుచు యేసు కనికరమునఁ దనకు నిట్లు దెలిపెఁ జాలి మనసుతోడను ||పరమ||

  • క్రొత్త జన్మ మెవ్వఁడైన నెత్త కున్న మోక్షమమునకు నెత్తఁబడఁ డటంచు నిజము క్రీస్తు పల్కెను ||పరమ||

  • వినుచుఁ బరిసయుండు ముసలి జనుఁడు మఱల తల్లి గర్భ మునను తిరుగనెట్లు బుట్టు ననుచుఁ బల్కెను ||పరమ||

  • అందు కేసు తెల్పె జలము నందుఁ నాత్మయందు జన్మ మొంద కున్న మోక్ష రాజ్య మొంద రనుచును ||పరమ||
  • 345 హా! యానంద 10/19/2017 20:16 345 హా! యానంద సుదినము నా యేసున్ నమ్ము దినము ప్రయాస మెల్ల బోయిన దయా రక్షణ దినము. ||భాగ్యమౌ దినము ప్రభున్ గైకొన్న దినము భక్తి ప్రార్థన లేసుఁడు ప్రఖ్యాతి నాకు నేర్పిన భాగ్యమౌ దినము ప్రభున్ గైకొన్న దినము ||

  • ప్రభునితో నిరంతమౌ నిబంధనఁ జేసికొంటి నేఁబుట్టితి నింపొందఁగ విభుని పాదపద్మము.

  • నా యాత్మ, శాంత మొందుము నీ యేసె నీ యాధారము భయంబు లేక రక్షణన్ పాలిభాగంబు పొందుము.

  • నే నేసువాఁడ నేసుఁడు నిత్యంబు నా వాఁ డాయెను ఇదెంత గొప్ప భాగ్యము నేనేసు యొక్క మిత్రుఁడన్

  • నేఁ జేసెడి యొప్పందము ఎల్లడ నెఱవేర్తును నేఁ జచ్చు వేళయందును నీ దయ మెచ్చి పాడుదు.
  • 346 యేసు నావాడ 10/19/2017 20:16 346 యేసు నావాడని నమ్ముదున్ భాసిల్లు దివ్య సౌభాగ్యము దాసుఁడ నౌచు పాల్పొందెదన్ నాశంబు లేని సౌఖ్యంబును. ||ఇదే నా పాట నాసుకధ యేసుని సదా స్తుతించుట ఇదే నా పాట నాసుకధ యేసుని నిత్యం ధ్యానించుట ||

  • సంపూర్ణ భక్తితో నుండెదన్ పెంపార యేసున్ ధ్యానించెదన్ సొంపైన దూతల్ పాడుచుండన్ ఇంపైన పాటల్ నే విందును.

  • నిండైన భక్తియే నెమ్మది గెల్చున దేమి యేసుండఁగ మెండైన దీప్తిన్ బ్రార్థించుచు దండిగ బ్రేమన్ సుఖింతును.
  • 347 ఆనంద మగు మ 10/19/2017 20:16 347 348 నా కింత ప్ 10/19/2017 20:16 348 నా కింత ప్రోత్సాహా నందంబుల్ గల్గుట కే కర్త ఘనమైన హేతువై యుండు నాకు గల యున్నత కతమ్మే నాధుఁ డగును నేను మురియు శ్రీకరంబగు నామ మేది సిల్వఁబడ్డ యేసు క్రీస్తే ||నా కింత||

  • ఎవరు నా భక్తికి హితమైనట్టి పునాది యెవరు నా కంఠంబు నెత్తెన్ పాటలతో ఎవరు నా పాపముల భారము నెత్తుకొని దేవునికి నాకును చివరకున్ స్నేహంబు కలిపిరి సిల్వఁబడ్డ యేసు క్రీస్తే ||నా కింత||

  • నేను నా విధు లెల్ల నిశ్చయంబుగ నెఱుఁగ జ్ఞాన మిచ్చుచునుండు జ్ఞాని యెవ్వారు వాని యెడల నను యధార్థ పరునిగాఁ గావించి యవినా చే నెరవేర్పించు నెవరు సిల్వఁబడ్డ యేసు క్రీస్తే ||నా కింత||

  • ఎవరు నా శత్రువు నెదిరించి గెల్చిరి యెవరు నా శోకంబు నెగురఁ గొట్టిరి ఎవరు నా హృదయంపు మూర్ఛను నీడ్చి సేదను దీర్చి మనసు చివుకు మను గాయంబు మాన్పిరి సిల్వఁబడ్డ యేసు క్రీస్తే ||నా కింత||

  • మరణంలో నాకుఁ జిర జీవ మెవ్వారు మరణంబునకె గొప్ప మరణ మెవ్వారు విరివిలేని మహిమ సేలు దరిని నుండఁగ నన్నుఁ జెంతను స్థిరముగ స్థాపించు నెవరు సిల్వఁబడ్డ యేసు క్రీస్తే ||నా కింత||

  • నన్ను రక్షింప మరణం బొందియు సమాధి నెన్నటికిని గెల్చి యున్న ప్రభునందు నున్న విశ్వాంసబె నాకు నుత్సవంబును గలుగ జేయును చెన్నగు నా ప్రభు విఁ కెవ్వరు సిల్వఁ బడ్డ యేసు క్రీస్తే ||నా కింత||
  • 349 సంతోషింపరె 10/19/2017 20:16 349 సంతోషింపరె ప్రియులారా యేసుని చెంత సంతసింపరె మనసార ఎంతో ప్రేమించి య నంతు డొసగెను సుతుని వింతగ బ్రతుకువ సంత శోభను దాల్చె అంతరంగములో వసించిన చింత లెల్లను వాడ బారెను గంతు లిడుచును నూత్నజీవ ల తాంతములు పూయంగ దొడగెను ||సంతో||

  • సిలువలో వలరారిన యేసునిప్రేమ ఫలియించె హృది వనమున కలుష మెల్లను బాపు కలువరిలో భక్తి పలవులు చిగిరించి చెలుని పాద పద్మములు అలుముకొని యా రాధనంబున మలయ మారుత వీచికలపై మలపు గొనుచు సమర్పణంబును సులలితముగా జేయ దొడగెను ||సంతో||

  • పాపతాపము తొలగెను జీవితపు తుఫానులన్నియు నణగెను ప్రాచీన సర్పము పగబట్టి పడగెత్తి పంతమున ననుడాసి పటువున కఱవంగా పాప మరణపు విఱుగుడగునా ప్రభుని యమృత రక్తసారము ప్రాణ భిక్షను బెట్టెను మరి పగతుని యోడించె న హాహా ||సంతో||

  • యాత్ర పథమున యేసుడు ప్రకాశింప రాత్రియె పగలాయెను నేత్రములు వికసింప ధాత్రి నా బసలోప విత్ర వాక్యములో వి చిత్ర కృపలను గాంచి గాత్ర వీణను మీటి దేవుని స్తోత్ర గీతము పాడి పుణ్య క్షేత్ర పథమున బోవ యేసుడు మిత్రుడై నడిపింప దొడగెను ||సంతో||

  • సిరిసంపదలు యున్నను లేకున్నను కఱుణావరములు తరుగవు పైరు పంటలు గాని పరువు ప్రతిష్టలు కఱువైనగానినే మురియుదు మదిలోన గిరులపైనను పరుగు లిడుటకు హరిణ పాదము లొసగె యేసుడు వెఱతునా చింతింతునా క ల్వరిని ప్రేమలు కురియుచుండగ ||సంతో||
  • 350 నా యేసు! న 10/19/2017 20:16 350 నా యేసు! నా యాత్మ బలమా! నీదు గాయంబులే నిలువబలమైన స్థలము సకల సృష్టి పునాదియపుడే నాదు సకల పాపములకై బలియైతి వేసు! సకల భూమ్యాకాశములను సమము గా గతించినఁగాని నీ ప్రేమ నిలుచు ||నా||

  • నా తండ్రి! నీ నిత్య కృపను నెంచ నా తరమ? నీ ప్రేమ హస్తముల జూచి పాతకుల రండంచు బిలిచి వేగ నీదు కృప రుచి జీవంబు నిచ్చు ||నా||

  • దరిలేని లోతైన ప్రేమా! నీలో దురిత యెల్లను మునిఁగి పోవు దరిలేని యుచిత కృపఁ జాటు నీదు రక్తంబు నా పాపడాగులను గడిగె ||నా||

  • ఈ ప్రేమ సాగరంబున నే దుమికి నా ప్రభుని యెదదూరి విశ్రాంతి నొంది యే ప్రొద్దు సంతసించెదను నన్ను నా ప్రాణమును డాయదిఁక నరక మొందు ||నా||

  • నా శిరముపై నలలురేగి యిలను నా సత్తువయు స్నేహితులు నన్ను వీడి నా సుఖము నా సంతసము బోయి నను నీదు కృప నన్ను విడిపోదు తండ్రీ ||నా||

  • నా హృదయమే నిలిచిపోనీ నాదు శరీరమే కుళ్ళి నీరైన గానీ ధర పునాదులే కరిగిపోనీ యేసు నిరతంబు నీ ప్రేమ నిలుచు నను బ్రోచు ||నా||
  • 351 నీ కన్న ని 10/19/2017 20:16 351 నీ కన్న నిఁక వేరే వేల్పులు లేరయ్యా నిజముగా నా యేసువా నీ కరుణ యను నెనరుచేతను నీదు సత్య సువార్త ద్వార ప్రాకటంబుగ నన్నుఁ బిలిచిన లోక రక్షక నీకు మ్రొక్కెద ||నీ కన్న||

  • నిన్నుఁ దెలియక మున్ను నన్య దైవంబుల ననుసరించిన పాపము లన్ని పెనగొని నాదు హృదయపుఁ గన్ను ఁ గ్రమ్మి ప్రకాశ మియ్యక యున్న నీ విమలాత్మ వరమున నన్ను వెలిగిఁచిన దయానిధి ||నీ కన్న||

  • వదలక నేఁ జేయు తుద లేని పాపము వదలించి ననుఁ బ్రోచితి తుదిదినంబునఁ గలుగు బాధలుఁ దొలఁగ జేయుట నీవ యని నా హృదయమందున నా నిరీక్షణ పదిలపరచిన భక్త పాలక ||నీ కన్న||

  • నీ వాక్యార్థము నాలో నివసింపఁ జేసి నీ సేవకునిగఁ బ్రోవవే నీవె సత్యము నీవె జీవము నీవె మార్గము నీవె ద్వారము నీవు గాకిం కెవరు లేరు కావవే నను యేసునాయక ||నీ కన్న||
  • 352 వెలుగును ర 10/19/2017 20:16 352 వెలుగును రక్షణ కర్తయునగునా బలమగు దేవుని స్తోత్రింతును వెరువను నేనిక నెవ్వరికిన్ వెలుగైన యేసే నా దుర్గము

  • అగాధ చీకటి జలముల నుండి అఖండమైన వెలుగు సృజించిన యుగయుగంబుల నేలెడి ప్రభువు యఘముల బాపి నను వెలిగించును ||వెలు||

  • నా దీపమును వెలిగించు ప్రభువే నా దరి చీకటిన్ వెలుగుగ మార్చును నా దోషము లెల్లను దన కాంతిలో నాదరముగ కడిగి రక్షించును ||వెలు||

  • పలువిధ శోధనల్ నను జుట్టినను విలువగు సంపద లంతరించినను వెలుగుదూత నాపై యురులొడ్డిన నలయక నిత్యము నడచెద వెల్గులో ||వెలు||

  • తల్లిదండ్రులు విడచినగాని యుల్లము భీతిని భయమందినను ఎల్ల ప్రజలు నను ద్వేషించినను ఎడబాయడునా ప్రియుడగు యేసు ||వెలు||

  • క్రీస్తు యేసుడే లోకపు వెలుగని వాస్తముగ గనుడి ప్రియులార శాశ్వతంబగు రాజ్యము చేర సత్వరమాయన వెలుగును బొందరె ||వెలు||
  • 353 నేను క్రీస 10/19/2017 20:16 353 నేను క్రీస్తు ప్రభుని జేరి నేను క్రీస్తువాడ నౌదు నేను క్రీస్తు సొత్తు గాన నేను నా సమస్తమును నాధు డేసు కిపుడు యిత్తు ||నే||

  • నేను క్రీస్తు ననుభవించి నేను క్రీస్తు బోలియుందు నేను నా స్వరూపమందు నా ప్రభుండు గానుపింప నేను నేసులో వసింతు ||నే||

  • నేను క్రీస్తునందునుండి నేను క్రీస్తులో బెరుగుదు నేను క్రీస్తు దారినడచి నేను క్రీస్తు మనసు నెపుడు గానుపఱతు నెల్లెడను ||నే||

  • నేను క్రీస్తు సేవజేసి నేను క్రీస్తు సాక్షినౌదు నేను క్రీస్తు సాధ నంబె నేను యనుభవించు రక్ష ణానందంబు జాటెదెపుడు ||నే||

  • నేను ప్రాణమైన నిచ్చి నేను క్రీస్తుకై బ్రతుకుదు నేను, క్రీస్తు కలిసియున్న నాశన తనయుని శక్తి నేలగూలు నద్భుతముగ ||నే||
  • 354 దాపుఁజేరుచ 10/19/2017 20:16 354 దాపుఁజేరుచుఁ బాడుము జీవపు మాటలన్ మాధుర్యంబగు గానము మరలఁ బాడుము జీవమైన పాటన్ త్రోవఁజూపు మాటన్ || సుందర మానందముగన్ సొంపుగఁ బాడుము ||

  • నిత్యజీవము నిచ్చెడు నిపుణుఁ డేసుఁడు సత్యప్రేమ నొసంగెడు సదయుఁ డేసుఁడు మితిలేని ప్రేమ మింటికాకర్షించున్.

  • ప్రచురపర్చుఁ డెల్లడన్ ప్రభుని రక్షణన్ దాచఁగూడని సత్యమున్ పూర్ణ క్షమాపణన్ రక్షకుని చెంత ఆశతోడ రండు
  • 355 యేసుని జేర 10/19/2017 20:16 355 యేసుని జేరఁ వేగము రా మార్గముఁ జూపి వేదములో దాపున నుండి క్రీస్తు దయన్ రమ్మని పిల్చును. || సంతసంబు సంతసంబు బల్ పాపశుద్ధి మేము పొందఁగా యేసుని యెద్దనుండ సదా మోక్ష పథంబున ||

  • బాలురమైన మమ్మును దా నెంతటి ప్రేమతోఁ బిలుచున్ యేసుని స్వీకరించుటకై వత్తుము వేగమే.

  • నా ముద్దు బిడ్డ రమ్మనఁగా నాతని ప్రేమ కన్పడఁగా నాయన నేఁడు నిన్చిలువన్ రానని యందువా? ||
  • 356 సాక్ష్య మి 10/19/2017 20:16 356 సాక్ష్య మిచ్చెద స్వామి యేసు దేవుఁ డంచు సాక్ష్య మనఁగఁ గనిన వినిన సంగతులను దెల్పుటయే సాక్ష్య మిచ్చు కొఱుకు నన్ను స్వామి రక్షించె నంచు ||సాక్ష్య||

  • దిక్కు దెసయు లేని నన్ను దేవుఁ డెంతో కనికరించి మక్కువతో నాకు నెట్లు మశ్శాంతి నిచ్చినాఁడో ||సాక్ష్య||

  • పల్లెటూళ్ల జనుల రక్షణ భారము నాపైని గలదు పిల్లలకును బెద్దల కును బ్రేమతో నా స్వానుభవము ||సాక్ష్య||

  • బోధ చేయలేను వాద ములకుఁ బోను నాక దేల నాధుఁ డేసు ప్రభుని గూర్చి నాకుఁ దెలిసినంత వరకు ||సాక్ష్య||

  • పాపులకును మిత్రుఁ డంచుఁ బ్రాణ మొసఁగి లేచె నంచుఁ బావముల క్షమించు నంచుఁ బ్రభుని విశ్వసించుఁ డంచు ||సాక్ష్య||

  • చోరు లైన జారు లనా చారు లైన నెవ్వరైన ఘోరపాపు లైనఁ క్రీస్తు కూర్మితో రక్షించు నంచు ||సాక్ష్య||

  • పరమత దూషణము లేల పరిహసించి పలుకు టేల ఇరుగు పొరుగు వారి కెల్ల యేసు క్రీస్తు దేవఁ డంచు ||సాక్ష్య||

  • ఎల్లకాల మూరకుండ నేల యాత్మ శాంతి లేక తల్లడిల్లు వారలకును తండ్రి కుమా రాత్మ పేర ||సాక్ష్య||
  • 357 ఇతరుల సాక్ 10/19/2017 20:16 357 ఇతరుల సాక్ష్యము లెంతో గలిగియున్న మరి సాక్ష్యమే మంచిది మృతిబొందిలేచియు న్నతమోక్ష రాజ్యాధి పతియై యున్న యేసు ప్రభువే మా విభుఁడైన ||నితరుల||

  • గురి సిలువ దెస మాకు స్థిరమై నిలిచియున్న దురితము తలయెత్తునే మరి యేసు ప్రక్కలో చొరఁబారి యందున్న కరుణారసము గ్రోలు టెఱిఁగి యుండిన చాలు ||నితరుల||

  • తలవాల్చుటకు తనకు స్థలము లే దనునట్టి పలుకే మా కైశ్వర్యము బలమిచ్చి యెదిగించు ప్రభు వాగ్దత్తములే మా కిలలో పంచభక్ష్య ములుగా నుండిన చాలు ||నితరుల||

  • బెదిరించి సైతాను కదిలింపలేనట్టి కుదురైన విశ్వాసము బొదలుచు మాలో నిం పొదవుచుండిన చాలు మదిలో నెమ్మది యిచ్చు మా యేసు కృప గల్గ ||నితరుల||
  • 358 సిలువ సైని 10/19/2017 20:16 358 సిలువ సైనికులారా నిలువండి వడి లేచి బలుఁడు యేసుక్రీస్తు ప్రభు దయ జయ మౌను ||సిలువ||

  • రారాజు పంపున రణము సేయగఁ బూని ధీరులై నిలువుఁడి దినము శత్రుల గెల్వ ||సిలువ||

  • అతఁడు నిజ ధ్వజ మత్యున్నతి నొంద బ్రతి వీరుని గెల్చు వరకుసేనల నడుపు ||సిలువ||

  • మీ స్వీయ బలమున మీ రానుకొనకయే మీ స్వామి బలమును మీరు నమ్మి గెలువ ||సిలువ||

  • శత సహస్రము లైన శత్రుల నెదిరించి సతతము ప్రభు సేవ సల్పి ధైర్యము నొంది ||సిలువ||

  • దేవుఁ డొసఁగినట్టి దివ్య కవచముఁ దాల్చి భావ ప్రార్థనాసి బట్టి యుద్ధము సేయ ||సిలువ||

  • జయశీలు రగు వారు చారు కిరీట మంది జయశాలి క్రీస్తు దయ జనెదరు సద్గతికి ||సిలువ||
  • 359 వీరుల మయ్య 10/19/2017 20:16 359 వీరుల మయ్యా జయ వీరుల మయ్యా మా వైరిఁ జంప యుద్ధమాడు శూరుల మయ్యా ||వీరుల||

  • మాంస లోక పిశాచి హింసపరచిన మము ధ్వంసముఁజేయ పై బడిన ధ్వజము విడమాయా ||వీరుల||

  • పరమ గురు వగు యేసు ప్రభువు నాజ్ఞను బహు త్వరగఁ బ్రజకుఁ బయలుపర్చు భటుల మే మయా ||వీరుల||

  • అతి దుష్ట ద్రోహులు మము వెతలఁ బెట్టిన నీ క్షితి సువార్త కొఱ కొకింత సిగ్గు పడ మయా ||వీరుల||

  • భూలోక నాధులు చాల పోరు సల్పిన మా వేలుపునకుఁ బ్రాణ మైనఁ బెట్టువారము ||వీరుల||
  • 360 యేసు క్రీస 10/19/2017 20:16 360 యేసు క్రీస్తు మతస్థుఁ డనఁగా నెఱిఁగి మనుఁడీ జగము లోపల వాసిగాఁ ప్రభు యేసు దాసులె పరమునందు ని వాసులగుదురు ||యేసు||

  • యేసు క్రీస్తును నమ్మి యాయన దాసుఁడై వర్తించు నాతఁడె భాసు రంబుగఁ గ్రైస్తవుం డని ప్రాకటంబుగఁ బరగుచుండును ||యేసు||

  • ఎల్ల సమయములందు ధాత్రిని యేసు నడతలఁ జూచి నడఁచుచు నుల్లమున రక్షకునిఁ దాల్చిన యోర్పరియె క్రైస్తవుఁడు సుమ్ము ||యేసు||

  • క్రీస్తు నన్ను గొనెను గావున క్రీస్తువాఁడను నేన టంచును క్రైస్తవుండు గొల్చు నాతని వాస్తవమ్ముగ నాత్మ తనువుల ||యేసు||

  • రాజులు యాజకులు శుద్ధులు రాజనందను లనెడు పేళ్ళను రాజ రాజగు దేవుఁ డొసఁగెను రాజితంబుఁ క్రైస్తవులకును ||యేసు||

  • క్షయము లేనిది శుద్ధమైనది వ్యయము లేనిది నిత్యమైనది దయను యేసుఁ డొసంగు భాగ్యముఁ దప్పకుండఁ క్రైస్తవులకును ||యేసు||
  • 361 యేసుప్రభుక 10/19/2017 20:16 361 యేసుప్రభుకై సాక్షులెవరెవరో ఎవ్వరెవ్వరో యని యాశతో ప్రభు వడుగుచున్నాడు యేసు కొరకై నిల్చి క్రైస్తవ యువకులెల్లరు సాక్ష్యమిచ్చుచు భాసురంబుగ క్రీస్తు నెంతో భారతీయులు ప్రస్తుతించరో ||యేసు||

  • దేవదర్శన మొంది లేలెండి ధనజనులకెల్లను దైవ ప్రేమను గూర్చి దెలుపండీ పావనుండగు ప్రభుని బోధలు పాడి రక్షణ మార్గమెల్లను సావధానముతోడ దెల్పరే సౌలు మారి పౌలెటాయెనో ||యేసు||

  • రాయబారుల మంచు నమ్మండి రారాజు వార్తలు రేయిబవలును దెలుప లేలెండీ పాయకుండగ యేసు తన విమ లాత్మ నెప్పుడు తోడ నుంచును పాపులెల్లరు యేసు ప్రభుని పాదములు సేవించి బ్రతుకగ ||యేసు||

  • థీరులై శుభవార్త జాటండీ దినదినము వాక్య ప్రచారమెల్లను చేయ లేలెండీ చేయవలసిన దెల్ల ప్రభువే చేయు మీతో నాత్మరూపున జయము మీదను జయమునిచ్చి జగతిని దగ వెలుగ జేయగ ||యేసు||

  • పౌలు మాదిరి బోలి లేలెండీ పరలోక రాజ్య ప్రచారమెల్లను జేయలేలెండీ పలువిధంబుల శ్రమలకోర్చి ప్రభువు శత్రుల నెల్ల మాడ్చి సిలువ ధ్వజమును చేతబట్టి సుస్థిరంబగు సేవ జేయగ ||యేసు||
  • 362 క్రీస్తు య 10/19/2017 20:16 362 క్రీస్తు యోధులారా యుద్ధ మాడుఁడీ క్రీస్తు సిల్వ మీరు పట్టి గెల్వుఁడీ మన రాజు క్రీస్తు దండు నడ్పును చూడు మాకు ముందు క్రీస్తు ధ్వజము. || క్రీస్తు వీరులారా యుద్ధ మాడుఁడీ క్రీస్తు ధ్వజ మెత్తి జయ మొందుఁడీ ||

  • లోక రాజ్య కీర్తి వాడిపోవును క్రీస్తు రాజ్యమైన నిత్య ముండును సాతా నాధిపత్య మాఁగిపోవును క్రీస్తు దివ్య సభ జయ మొందును.

  • ఓ జనంబులారా వచ్చి చేరుఁడీ జయ కీర్తనంబు లెత్తి పాడుఁడీ కీర్తి, స్తుతి, ఘవ మెన్నఁ డుండును మన క్రీస్తు రాజు నిత్య మేలును.
  • 363 ఓ యేసు భక్ 10/19/2017 20:16 363 ఓ యేసు భక్తులారా, మీ రాజు ధ్వజము గ్రహించి సాహసించి పోరాడి గెల్వుఁడీ విశ్వాసులార, రండి మీ రక్షణార్థమై ప్రయాసపడ్డ యేసు విజయ మిచ్చును.

  • మీయం దసూయఁ బట్టి మీ యాత్మ నాశము నెన్నండుఁ గోరునట్టి యనేకు లుందురు మీ రెల్ల రేసు పేరు వచించి యాయనే సర్వాధికారి యంచు సేవింపవలెను.

  • ప్రచండ మైన దండు పోరాడ లేచినన్ విరోధి శక్తి కొద్ది మరీ తెగించుఁడీ స్వకీయ శక్తిఁగాక శ్రీ యేసు నామమున్ స్మరించి వానియందు విశ్వాస ముంచుండీ.
  • 364 నా యాత్మ! 10/19/2017 20:16 364 నా యాత్మ! లెమ్ము! సిద్ధము కమ్ము నా రాజిఁ బూని పాయక పోర వలెను నిజమ్ము వేయి శరంబుల నేయుచు శత్రు వ మేయత నిను పడఁ ద్రోయఁ దెగించెను ||నా యాత్మ||

  • వేచి ప్రార్థించి యుద్ధము సలుపు వీరాకృతి బోరుము వే జయము కలుగు నని యెంచకుము ఏంచుచుఁ బ్రతిదిన మేసట బోరుచు యా చించి గురు స హాయము బొందుము ||నా యాత్మ||

  • జయము నొందితి నని తలఁపకుము సౌఖ్యమునకై స మయ మపే క్షించి కూర్చుండకుము నియమిత మకుటము నీ వొందువరకు నిర్భర యుద్ధము నిలువదు నమ్ముము ||నా యాత్మ||

  • పోరు పోరాడు నిను మరణము దేవుని యొద్దఁ జేరు దనుక వీడకు రణము శ్రీ రమ్యుని ది వ్యారామంబునఁ జేరి సుఖింపఁగఁ జేకొని నిను విను ||నా యాత్మ||
  • 365 లేలెమ్ము క 10/19/2017 20:16 365 లేలెమ్ము క్రైస్తవుఁడా నీలో మేల్కొని లేలెమ్ము క్రైస్తవుఁడా నీలో మేల్కొని ||లేలెమ్ము||

  • విడువకు యుద్ధము నుడువకబద్ధము యొడయుఁడు నీకడ నుండును బాయఁడు ||లేలెమ్ము||

  • విడువకు ధైర్యము వదలకు కవచము సదయుఁడు క్రీస్తుఁడు సత్ఫల మిచ్చును ||లేలెమ్ము||

  • బెదరకు మేరికి వదలకు దారిని నది యిది కానిది యాత్మను బెట్టక ||లేలెమ్ము||

  • ప్రార్థన సారము వర్ధిలఁ గోరుము సార్థక కాలము వ్యర్థము చేయక ||లేలెమ్ము||

  • భావములోనన్ దేవుని ప్రేమన్ నీవది వేఁడుచు నెమ్మదిఁ గూడుచు ||లేలెమ్ము||

  • యేసుని సిలువ నెదుట బెట్టుకో మోసము నొందవు యేసుని కాపున ||లేలెమ్ము||
  • 366 ఏల చింత యే 10/19/2017 20:16 366 ఏల చింత యేల వంత యిచట నీకు క్రైస్తవ పాలకుండు యేసు నీదు వంత లెల్ల నెరుఁగుఁగా ||యేల||

  • తొల్లి నీ వొనర్చినట్టి దోష మెంతో జూడుమా కల్లగాదు యేసు క్రీస్తు చెల్ల చెదరఁ జేసెఁగా ||యేల||

  • నీకు కాలు జారినపుడు నిన్ను లేవనెత్తెఁగా నీ కలుషముఁ గడిగి వైచి నిన్ను విమలుఁ జేసెఁగా ||యేల||

  • నీకుఁ గల్గు వ్యాధు లన్నా నెవరు మీరఁ దీర్చెఁగా ప్రాకటముగ నీకు సకల పదవు లిచ్చి ప్రోచెఁగా ||యేల||

  • యేసు నిన్ను బాగు జేయ నిచట శ్రమలు బెట్టుగా వాసిగాను శ్రమలయందు యేసు పజ్జఁజేరుమా ||యేల||

  • నిన్ను తల్లడిల్లఁజేయు నీ విరోధు లందరిన్ మున్ను తండ్రి పగిదిఁ దరిమి పన్నుగాను బ్రోచెఁగా ||యేల||

  • సందియంబు లేల నీకు స్వర్గ నాధుఁ డుండఁగా అందమైన యీవులిచ్చి యతఁడు నిన్ను ఁ బ్రోవగా ||యేల||
  • 367 దేవా! వెంబ 10/19/2017 20:16 367 దేవా! వెంబడించితి నీ నామమున్ జీవితేశ్వర నా జీవితాశ నీవే రావె నా భాగ్యమా యేసువా ||దేవా||

  • యేసూ! నీదు ప్రేమను నే వింటిని భాసురంబగు నీ సిలువ నే గంటిని యేసువాడను నే నంటిని ||దేవా||

  • ప్రభో! ప్రారంభించితి ప్రయాణమున్ పరలోక యెరూషలేము పురికిన్ పావనా జూపుము మార్గము ||దేవా||

  • నాధా! ఈదలేను ఈ ప్రవాహమున్ నీదరిన్ గాన నీ కెరటాలధాటిచే నావికా రమ్ము నన్ బ్రోవుము ||దేవా||

  • స్వామి! నీదు ప్రేమకు నే సాక్షిని సంఘమందున నా పొరుగువారికి నీ సత్య సువార్త నే జాటుదున్ ||దేవా||

  • రాజా! నీదు రాజ్యములో జేరితి రమ్యమౌ రాజ్యమందున నన్ వాడుము రక్షణానందము గూర్చుము ||దేవా||
  • 368 భయమేల క్రై 10/19/2017 20:16 368 భయమేల క్రైస్తవుండా నీవిక నపజయమున బ్రతుకనేల జయ శూరుడగు ప్రభువు యిలనీకు జయము నిచ్చుచు నుండగ ||భయమేల||

  • భూతపీడితుల నెల్ల విడిపించుదాత మన రక్షకుండు సాతాను వల నుండియు విడిపించిప నీతితో మనుపలేడా ||భయమేల||

  • మరణ పాశములనుండి లాజరును కరుణతో లేపలేదా ధరణిమిమ్ముల నూతన బలముతో గుఱికి నడిపించలేడా ||భయమేల||

  • ద్రాక్షరసముగ నీళ్లను మార్చిన మహిమగల రక్షకుండు అక్షయ సంతసంబు నిలమీకు దీక్షతో నివ్వలేడా ||భయమేల||

  • ఐదు చిన్న రొట్టెలు మరి రెండు చిన్న చేపలతోడును ఐదువేల మందిని బలపర్చినట్టి రక్షకుడుండగ ||భయమేల||

  • విజయకరముగ బ్రతుకు ప్రభువుండు నిజవాగ్దత్తము లివ్వ నీ వృజినము గెలువంగను ముదముతో నిజముగ నెరవేర్చడా ||భయమేల||
  • 369 శోధనకు మీర 10/19/2017 20:16 369 శోధనకు మీరు చోటియకుఁడి ధైర్యము వహించి పోరాటమును సాధించెడు వారు జయించెదరు సాతానుకు లొంగఁ బాపం బగును. ||యేసు శక్తిని గోరి యెల్లకాలము వేఁడుఁ డేసుఁ డాశతో మిమ్ము డాసి నడుపును ||

  • దుర్భుద్ధి కుభాష మానుండు సదా పాపాత్ముల పొందు తప్పించుకొని శ్రీ దేవుని పేరున్ దూషింపకయు శ్లాఘించుచు మీరు వర్ధిల్లుఁ డిలన్

  • జయించెడువారు సౌందర్య ప్రభన్ చారు మకుటంబు ధరించెదరు ప్రభుండగు యేసు నిక్కంబు నమ్ముఁ డాయనె నిత్యంబు సాయము నిచ్చున్
  • 370 నా దేవ ప్ర 10/19/2017 20:16 370 నా దేవ ప్రభువా నీ చెంతను సదా వసింపను నా కిష్టము ఏవైన శ్రమలు తటస్థమైనను నీ చెంత నుందును నా ప్రభువా

  • ప్రయాణకుండను నడవిలో నా త్రోవఁ జీఁకటి కమ్మినను నిద్రించుచుండఁగా స్వప్నంబునందున నీ చెంతనుందును నా ప్రభువా.

  • యాకోబు రీతిగా ఆ మెట్లను స్వర్గంబుఁ జేరనుఁ జూడనిమ్ము. నీ దివ్య రూపము ప్రోత్సాహపర్చఁగా నీ చెంతనుందును నా ప్రభువా.

  • నేనిద్రలేవఁగా నా తండ్రి, నే నీకుం గృతజ్ఞతఁ జెల్లింతును. నే చావునొందఁగా ఇదే నా కోరిక నీ చెంతనుందును నా ప్రభువా.
  • 371 జీవితంబు ఘ 10/19/2017 20:16 371 జీవితంబు ఘోర కష్టనష్టంబుల్ ఆవరించి నిన్ను దుఃఖపర్చిన దేవుడిచ్చినట్టి ఈవులెంచుము నీ వాశ్చర్య మొందెదవు. వానికై. ||ఎంచుము లెక్కించు మీవులన్ ఎంచుచూడు మేసుదీవెనల్ ఎంచు మెంచు మెంచు మీవులన్ వింత నొందెదవు నీవు వానికై ||

  • చింతమానసంబు నీకు గల్గినన్ వంతచే భారంబు గల్గ నీయెదన్ సంతసంబుతోడ నెంచుమీవులన్ వింత నొందెదవు నీవు వానికై

  • నాశనంబు జెందు నాస్తి జూడగా వాసిగా శ్రీ యేసు నీ కొసంగిన భాసురంపు భాగ్యముం దలంపుమా యీ సౌభాగ్యమే గదా సదా యుండు

  • జీవితాదియందు ధైర్య మొందుము దేవుడుండు నెల్లవార్కి తోడుగ జీవయాత్ర యందు సాయమియ్యగన్ దేవదూతల్ నీకు తోడుగా నుండు.
  • 372 ఓ మా తండ్ర 10/19/2017 20:16 372 ఓ మా తండ్రి నీదు నామము నిత్య మెన్ను చుండు గాక సకల లోకము క్షేమముగను విమలముగను జెన్ను మిరగఁ బరలోక ధాముఁడవై వెలయునట్టి ధన్య సౌజన్యమాన్య ||ఓ మా తండ్రి||

  • నీ రాజ్యంబు రా నిమ్ము నీదు చిత్తము నేటుగఁ బరలోకమందున నే రీతిగను జేయఁబడునో యీ భూలోకమందు నట్టి దారి బొందఁ జేయవలెను ధర్మ మూర్తి సత్యవర్తి ||ఓ మా తండ్రి||

  • నేటి యాహారంబు మాకుఁ గరుణఁజేసి నేటి కిచ్చి సూటి పరచుమి మేటి మా విరోధి జనుల మే మెటుల క్షమింతు మటుల మాటికిని క్షమింప నీవె మాకు వేరె లేరు సుమ్ము ||ఓ మా తండ్రి||

  • మమ్ము శోధమునకు తేకుము కీడునుండి మరలఁ జేయు మమ్ము నేమనన్ ఇమ్మగు బల మహిమ రా జ్యమ్ములును సర్వకా లమ్ము నీవే మాదు ప్రార్థ న నమ్ముఁ జేకొమ్ము ఆమేన్ ||ఓ మా తండ్రి||
  • 373 దాసుల ప్రా 10/19/2017 20:16 373 దాసుల ప్రార్థన దప్పక యెసఁగెడు యేసు నాయకుఁడై మా వేల్పు దోసములు సేయు దుర్జనుఁడైనను దోసి లొగ్గఁ బర వాసి జేయునఁట ||దాసుల||

  • జన రహిత స్థల మున జని వేఁడెడి మనుజుల ప్రార్థన వినుచుండున్ తన పాదము న మ్మిన సాధూత్తమ జనులను జూచిన సంతస మిడునఁట ||దాసుల||

  • మది విశ్వాసము గూడిన ప్రార్థన సదయత వినుటకుఁ జెవు లొగ్గున్ హృదయము కనుఁగొని యుచిత సమయమున గుదురుగ భక్తుల కోర్కె లిచ్చునట ||దాసుల||

  • ముదమున నిద్దరు ముగ్గురు నొకచోఁ బదిలముగాఁ దనుఁ బ్రార్ధింపన్ వదలక దానట వచ్చి యుందు నని మృదువుగఁ బలికిన కృత రక్షణు(డట ||దాసుల||
  • 374 పరమ నందుండ 10/19/2017 20:16 374 పరమ నందుండెడు మా పరమ జనక నీదు పేరు పరిశుద్ధం బగును గాక త్వరగను నీ రాజ్యంబు ధరకు నరుగు దెంచుఁగాక పరమునందు నెట్టులనో ధరణియందు నట్లు నీ చి త్తంబు నెరవేరుఁగాక ||పరమ||

  • మా యనుదినాహారము మాకు నేఁడు దయచేయుము మా యెడలను దప్పిదములఁ జేయువారి నైఁచునట్లు మాయపరాధము క్షమించి మము శోధనలోకిఁ దేక మహిని గీడు నుండి నీ స హాయమున దప్పించుము రా జ్యమ్ము శక్తి మహిమము నె ల్లప్పుడును నీవె యామేన్ ||పరమ||
  • 375 ఆలించు దేవ 10/19/2017 20:16 375 376 దేవా సహాయమ 10/19/2017 20:16 376 దేవా సహాయము నిమ్మా జీవంపు టూటలు ద్రావుట కిమ్మా ||దేవా||

  • గడియ గడియకు నెగసెఁ నమ్ము లెంతో వడిగా నాపై వచ్చె నరక బాణములు ఎగతెగని శోధనములు నీవు పడఁగొట్టి వేగమె దృఢభక్తి నిమ్మా ||దేవా||

  • కోటాన కోటి కష్టములు నాకు మాటి మాటికి వచ్చె మరి నికృష్టములు సాతాను సాధనములు నేను దాఁటి నీ రెక్కల చాటున నుండ ||దేవా||

  • దారా పుత్రుల పైన భ్రమలు నన్ను సారె సారెకు నీడ్చు లోక భాగ్యములు ఘోరమగు నాత్మకములు న న్నీ రీతి భ్రమ పెట్టు ధారుణిలోన ||దేవా||

  • మా యావువుదినములు చెట్టు చాయవలెఁ దరుగుచు మంటి పాలౌను చాలు నీ లోకంబు మేలు మేము పరలోకరాజ్యము చేరుట మేలు ||దేవా||

  • మంచి మరణం బిమ్ము దేవ మమ్ము వచించు సాతాను వల నుండి కావ నెంచి దూతల నంపినావ మాకై పంచగాయములొంద ప్రభు వచ్చినావా ||దేవా||
  • 377 నన్ను ఁ గన 10/19/2017 20:16 377 నన్ను ఁ గన్నయ్య రావె నా యేసు నన్నుఁ గన్నయ్య రావె నా ప్రభువా ||నన్ను||

  • ముందు నీ పాదారవిందము లందు నిశ్చల భక్తి ప్రేమను పొంది కగాఁ జేయ రావే నా డెంద మానంద మనంతమై యుప్పొంగ ||నన్ను||

  • హద్దులేనట్టి దురాశల నవివేకినై కూడి యాడితి మొద్దులతో నింకఁ కూటమి వద్దయ్య వద్దయ్య వద్దయ్య తండ్రి ||నన్ను||

  • కాలము పెక్కు గతించెను గర్వాదు లెడఁదెగ వాయెను ఈ లోక మాయ సుఖేచ్ఛలు చాలును జాలును జాలు నోతండ్రి ||నన్ను||

  • దారుణ సంసార వారథి దరిఁ జూపి ప్రోవ నీ కన్నను కారణ గురువు లింకెవ్వరు లేరయ్య లేరయ్య లేరయ్య తండ్రి ||నన్ను||

  • నా వంటి దుష్కరమ్మజీవినిఁ కేవల మగు నీదు పేర్మిని దీవించి రక్షింప నిప్పుడే రావయ్య రావయ్య రావయ్య తండ్రి ||నన్ను||
  • 378 కఱుణాపీఠము 10/19/2017 20:16 378 కఱుణాపీఠము జేరరే దేవుని కృపా చరణ స్థలిని జేరరే పరలోక జనకుని వరములు లభియించు తరుణమౌ ప్రార్థనలో కరములు జోడించి ||కఱుణా||

  • హృదయ వేదననొందుచు యాకోబు తన మదిలో భయమున గుందుచు వదల కుండగ ప్రభుని పదములు సంధించి సదయుని దీవెన ముదమున నొందిన ||కఱుణా||

  • కన్న ప్రేమను యిమ్మని సోదరి హన్నా విన్నవించగా దేవుని అన్ని యెఱిగిన తండ్రి హన్నాను దీవింప వన్నె కెక్కిన కొడుకున్ చెన్నుగా నొందిన ||కఱుణా||

  • శాప భయమును నేడ్చుచు దావీదు తన పాప రూపము జూచుచు తాపముతో పశ్చా త్తాపముతో ప్రభుని ప్రాపు గోరగనే క్ష మాపణ నొందిన ||కఱుణా||

  • కాయమున వెత నోర్చును యోధుడు పౌలు సాయమీ ధర గోరుచు రోయుచు దన ముల్లు దీయుమని ప్రార్థించి వేయిరెట్లుగ కృపయు ప్యాయముగ నొందిన ||కఱుణా||

  • దినమంత పని జేయుచు నాధుడా యేసు జనుల బాధల మోయుచు ఇనుడు మరుగౌవేళ జనకుని కడకేగి మనసార విశ్రాంతి యనుభవించిన సథలము ||కఱుణా||

  • ఇల బ్రతుకంతయు ప్రార్థన ప్రభు యేసునకు సిలువే తన తుది ప్రార్థన చెలువుగ విజ్ఞాప నలు జేయుచును మనపై గలకాలమును దీవె నలు వర్షించెడి చోటు ||కఱుణా||
  • 379 యేసు పరలోక 10/19/2017 20:16 379 యేసు పరలోక నాయక సువి శేష సుఫల ప్రదాయక దోషరహిత ప్ర క్రాశ స్వయ ఛిద్వ లాస పరమ ని వాస బుధ దేవ ||యేసు||

  • మంచి మనసాక్ష్య మియ్యవే శ్రమల నెంచి కృపల నందియ్యవే వంచనల నెడ లించి మొఱ చిత్త గించి మిగుల రక్షించు మిఁక వేగ ||యేసు||

  • నీరసుఁడ నని పోనాడక యొద్దఁ జేరి నిర్దయఁ జూడక సారస త్కృప లూరననుఁ బ్రోచు వార లెవ్వ రున్నారు నీవుఁ గాక ||యేసు||

  • కన్నతండ్రి నీ పాదముల్ పొడ గన్న వారి హృద్భేదముల్ అన్ని దొల గునని యన్న శుభరవం బెన్ని విన్నాఁడ నన్నవగు క్రీస్తు ||యేసు||

  • శంకలను వెడలఁగొట్టవే లోకా టంకముల నెత్తి మొట్టవే యింక నా యఘ పంకమును గృప నింక గను నిష్క ళంకునిఁగఁ జేయు ||యేసు||

  • దిక్కు నీవని నమ్మితి నిన్నే మ్రొక్క పంతంబుఁ జేసితి చక్కగా నల పి శాచి దుర్మోహ దృక్కణం నీ చక్కిఁ జేర్చు మో ||యేసు||
  • 380 నా యేసు నా 10/19/2017 20:16 380 నా యేసు నాధా ననుఁ జూడవే నా జీవనాధా నా యేసునాధ మా నవ పాప మోచక నీ యనుగ్రహముచే నిరతంబు భువిలోన ||నా యేసు||

  • వింటిని నేను నా హృదయంబు వింతఁ బొందఁగను మింటనుండి నీవు మేదిని కరుదెంచి యెంటి నర్పించితి వొనరంగ నా కొరకు ||నా యేసు||

  • నీ యానతులను నిజముగ మీరి నే నుంటి మున్ను నా యెదను గుందుచు నా పాపముల కొరకు నీ యొద్దఁ జేరెద నిజరక్షకుఁడ వనుచు ||నా యేసు||

  • నేను నీ నెనరు రుచి జూచితి నిది యెంతో తనరు దీనుఃడ నగు నేను ధృడ కృతజ్ఞత ప్రేమల్ గానుపింపఁగ నీ కడకు వత్తును దేవ ||నా యేసు||

  • నే నశక్తుడను నిను సేవింప నిత్యంబు ధరను గానఁ బ్రార్థనఁ బూని ఘనుఃడ వని నమ్ముచు నానందమున వత్తు ననిశంబు నీ దరికి ||నా యేసు||

  • దయ చేయు మయ్యా సత్యాత్మను దాసుని కిపుడు దయచేసి శుద్ధాత్మఁ ద్వరగాఁ గల్గించుము ప్రియముగ నీ సేవ పెంపుసేయఁగ శక్తి ||నా యేసు||

  • నీవు నాతోడ నెప్పుడు నుండు నిజ మొనగూడ నీవు నాతో నుండ నిర్భయముగ నేను ద్రోవఁ బోవుదు నీకు స్తోత్రంబు చేయుచు ||నా యేసు||
  • 381 నిన్ను నేన 10/19/2017 20:16 381 నిన్ను నేను విడువను దేవ నీవు నను దీవించు వరకు నిన్ను నమ్మినవారల నెల్ల నీవు చక్కఁగ దీవించెదవు ||నిన్ను||

  • నేను శత్రువునై యుండంగ నీవు నాపై నెనరు జూపి దాన మిచ్చితివి నా కొరకు దారుఁడౌ నీ ప్రియ పుత్రుని ||నిన్ను||

  • త్రోవ దప్పి తిరుగుచుండ దుడుకునైన నన్ను ఁ గాంచి ప్రోవ(గోరి మదిని నీవు త్రోవను బెట్టితివి నన్ను ||నిన్ను||

  • నాఁటనుండి నేఁటి వరకు నాకుఁ గల్గిన శోధనములలో నేటుగా ననుఁ గాచిన వాఁడవు నీవు గావా, ఓ నా తండ్రి ||నిన్ను||

  • ఇంత కాలము నన్నుఁ గాచి యిఁకను నన్ను విడువ వనుచు సంత సించి మదిని నేను జక్కఁగ నీ దరి జేరితిని ||నిన్ను||

  • నీవు గాక యెవరున్నారు నేలపైని ననుఁ గాపాడఁ చేవ లేని నాకు నీవు చేవ గలుగఁ జేయఁ గలవు ||నిన్ను||

  • అడుగు వారి కిచ్చెద నంచు నాన తిచ్చినావు గాన నడిగెద నిను సాహాయ్యంబు నాత్మమై యున్నట్టి తండ్రి ||నిన్ను||

  • నాదు ప్రార్థన లన్నియి నీవు నీదు కృపచే నాలకించి నీదు సరణిని నిల్పి నన్ను నేర్పు దనరఁగ రక్షించితివి ||నిన్ను||
  • 382 విన రమ్ము 10/19/2017 20:16 382 విన రమ్ము యేసు నాధుఁడ నా మనవి నిప్పుడు ఘన మైన నీదు నెనరుచే ననుఁ గావు మెప్పుడు ||విన రమ్ము||

  • ఎక్కడిద్దఱు ముగ్గురు నీ యొక్క పేరటన్ జేరు టెక్కడో నే నక్కడ కే తెంతు నంటివి ||విన రమ్ము||

  • మఱి యెవరు దిక్కు ధరణిలోన వేఱు లేరుగా దుర్నరుల కెల్లఁ దెరవుఁ దెల్పి నావు నీవెగా ||విన రమ్ము||

  • మరణ మైతి వాహాహా నా కొరకు సిల్వపై నీ కరుణ కల్గె నెంత యీ దు రాత్ముని నాపై ||విన రమ్ము||

  • సకలంబు నీద టంచు మదిని సంతసించెద వే ఱొకని కించు కంతయైన నుర్వి లేదుగా ||విన రమ్ము||

  • కోరితి నినుదారిగ నను దూరపర్చకు నీ కూరిమి నా కొసఁగి నడుపు మరణావధికి ||విన రమ్ము||

  • వినయంబు సద్గుణంబు చిత్త ముననుఁ గూర్పవే ఘన మైన నీతి యనుభవంబుఁ గలుగఁ జేయవే ||విన రమ్ము||

  • దేవ దేవ రావె నిన్ను సేవఁ జేయుదు ననుఁ బావనునిగఁ జేయవె నేఁ పాప నరుఁడను ||విన రమ్ము||
  • 383 ప్రార్థన వ 10/19/2017 20:16 383 ప్రార్థన వినెడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా ||ప్రార్థన||

  • శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి పరముడ నిన్ను ప్రణుతించెదము పరలోక ప్రార్థన నేర్పుమయ్యా ||ప్రార్థన||

  • పరమ దేవుడవని తెలిసి కరము లెత్తి జంటగ మోడ్చి శిరమునువంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా ||ప్రార్థన||

  • దినదినంబు చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవ దీనుడవయ్యు దిటముగ కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా ||ప్రార్థన||

  • శత్రుమూక నిను చుట్టుకొని సిలువపైని నిను జంపగను శాంతముతో నీ శత్రుల బ్రోవగ సలిపిన ప్రార్థన నేర్పుమయా ||ప్రార్థన||
  • 384 ఓ ప్రార్థన 10/19/2017 20:16 384 ఓ ప్రార్థనా సుప్రార్థనా నీ ప్రాభవంబున్ మరతునా? నా ప్రభువున్ ముఖా ముఖిన్ నేఁ బ్రణుతింతు నీ ప్రభన్ నా ప్రాణమా సు ప్రార్థనా నీ ప్రేరణంబుచేఁ గదా నీ ప్రేమధారఁ గ్రోలుదు నో ప్రార్థనా సుప్రార్థనా.

  • పిశాచి నన్ను యుక్తితో వశంబు చేయఁ జూచుచో నీ శాంతమైన దీప్తియే నా శంక లెల్ల మానుపున్ నీ శక్తి నేను మరతునా నా శైలమన ప్రార్థనా నా శోక మెల్లఁ దీర్చెడు విశేషమైన ప్రార్థనా.

  • నీ దివ్యమైన రెక్కలే నా దుఃఖభార మెల్లను నా దేవుఁ డేసు చెంతకు మోదంబుఁ గొంచుఁబోవును సదా శుభంబు లొందను విధంబుఁ జూప నీవెగా నా ధైర్యమిచ్చు ప్రార్థనా సుధా సుధార ప్రార్థనా

  • అరణ్యమైన భూమిలో నా రమ్యమౌ పిస్గా నగం బు రంగుగాను నెక్కి నా చిరగృహంబుఁ జూతును శరీరమున్ విదల్చి నేఁ బరంబు బోవు వేళలో కరంబు నిన్ను మెచ్చెదన్ పరేశు ధ్యాన ప్రార్థనా.
  • 385 యేసు, నీ స 10/19/2017 20:16 385 యేసు, నీ సదాత్మ వృష్టి భక్తు లెల్లవారిపై నీవు కుమ్మరింపఁగాను నాపైఁ గుమ్మరించుమీ. || నన్నునున్, నన్ను నున్ నన్నాశీర్వదించుమీ ||

  • తండ్రి, నన్ను దాఁటవద్దు పాపి నంచు వేఁడెదన్ నీ మన్నింపు నీదు కృప నా కనుగ్రహించుమీ

  • రక్షకా, నన్ దాఁటి పోకు నేను నిన్ను నమ్మితిన్ నీదు దయ పూర్తిగాను నాపైఁ గుమ్మరించుమీ.

  • పావనాత్మ, దాఁటి పోకు నేను గుడ్డివాఁడను జ్ఞానదృష్టి నాకు నిమ్ము నాకు దైవ శక్తి నీ.

  • మాఱనట్టి దైవ ప్రేమ. క్రీస్తు రక్త పుణ్యము పావనాత్మ ప్రేరణంబు నిండుగాను బోయుమీ.

  • నన్ను దాఁటిపోక యేసు నీకు సేవచేయ నా హృదయంబును బంధించి నన్నాశీర్వదించుమీ
  • 386 ఆశీరవంబు ల 10/19/2017 20:16 386 ఆశీరవంబు ల్మామీఁద వర్షింపజేయు మీశ యాశతో నమ్మి యున్నాము నీసత్య వాగ్దత్తము. || ఇమ్మహి మీద క్రుమ్మరించుము దేవ క్రమ్మర ప్రేమ వర్షంబున్ గ్రుమ్మరించుము దేవా ||

  • ఓ దేవ పంపింప వయ్యా నీ దీవెన ధారలన్ మా దాహ మెల్లను బాపు మాధుర్యమౌ వర్షమున్

  • మామీఁద కురియించు మీశ ప్రేమ ప్రవాహంబులన్ సమస్త దేశంబు మీఁద క్షామంబు పోనట్లుగన్.

  • ఈనాఁడె వర్షింపు మీశ నీ నిండు దీవెనలన్ నీ నామమందున వేఁడి సన్నుతిఁ బ్రార్థింతుము.
  • 387 రక్షకా, నన 10/19/2017 20:16 387 రక్షకా, నన్ మర్వఁబోకు మొఱ్ఱ నాలించు అన్యులైనవారిఁ బిల్వన్ మర్వఁబోకు నన్ ||యేసు, యేసు మొఱ్ఱ నాలించు అన్యులైన వారిఁ బిల్వన్ మర్వఁబోకు నన్ ||

  • నీ కృపాసనంబు నొద్ద శాంత మియ్యుము పశ్చాత్తాప పడు నిన్ను నాదరించుము.

  • నీదు పుణ్య మేను నమ్మి యా శ యింతు నిన్ క్రుంగినట్టి నాదు నాత్మఁ బ్రోవు ప్రేమతో

  • నాకు సుఖదాత వీవె జీవదాతవే యిహపరలములయందు దిక్కు నీవెగా
  • 388 విశ్వాసముత 10/19/2017 20:16 388 విశ్వాసముతో వేఁడెడి వారికి విశ్వ మంతయును వీల్పడును శాశ్వత రాజ్య థీశ్వరుఁ డాఢ్యుఁడు శాశ్వత మగు నీ శాసన మె చ్చెను ||విశ్వా||

  • బిడ్డలు తండ్రుల వేడఁగ నన్నము బెడ్డ లిచ్చు వె ఱ్ఱులు గలరే దొడ్డ తండ్రి నిలఁ దోడ్పా టడిగిన నడ్డులేక విమ లాత్మ నొసంగును ||విశ్వా||

  • నమ్మకమునఁ జెడు నరులను గానము నమ్మక చెడుదురు నరులయ్యో ఇమ్మహి సకల శు భమ్ములు గలుగును సమ్మతి వెతకఁగ శాశ్వత రాజ్యము ||విశ్వా||

  • వెతకెడు వారికి వెసఁ గృపఁ జూపును గతిఁ గని వేడం గాఁ దెర చున్ సతతము యేసుని చక్కని పేరట హిత మతి వేఁడగ నెంత యు మేలగు ||విశ్వా||

  • బల మేమియుఁ గనఁ బడ దాహ నే సలిపెడు భక్తిని సతి మను చు నలయకు నేలను నావగింజ మరి నిలిపినఁ జెట్టయి నింగికి నెదుగదె ||విశ్వా||

  • అవిశ్వాసమున నతి భీతులచే నవిసి క్రుంగ నగు నే మనసా భువిఁ బాపాత్ములఁ బ్రోచెడు ప్రభు కృపఁ జవిఁ జూడుము నుతి సల్పుచు వేగమే ||విశ్వా||
  • 389 విశ్వాస ఫల 10/19/2017 20:16 389 విశ్వాస ఫలితములు విశదమ్ముగా నీకు వివరింతు విను క్రైస్తవా విశ్వాస వంతునికి విశ్వమ్ములోపల మ వశ్యమ్మొదవు క్రైస్తవా ||విశ్వా||

  • ఫలములన్నిటిలోన ప్రాముఖ్యమైనట్టి ఫలమది పాప క్షమమే విలువైన యీ ఫలము గలుగు నరునికి ముక్తి దొలగ దతనికి క్షేమమే ||విశ్వా||

  • దానములలోన ప్రధానమనబడు సమా ధానమును గల్గించును మాని తమ్ముగ సమా ధానమును భువిదివుల మహితుతో గల్గించును ||విశ్వా||

  • నరక పాత్రులమైన నావంటి నీవంటి దురిత జీవుల కెల్లను గొఱతలన్నియు దీర్చ నిరత జీవము నియ్య నిశ్చయమ్మిది చెల్లును ||విశ్వా||

  • ముత్తెమ్మునకు వలెనె మురికి గప్పఁగబడిన చిత్తమును చిత్రవిధిగా రత్నమువలె మిగుల రంజిల్లఁ జేసెడి ప విత్రాత్మ మనకొదవుగా ||విశ్వా||

  • మేరలేని దోష కారులమై ప్రభుకు దూరముగఁ దొలగియున్న వారమగు నను నిన్ను చేరంగ బిలిచి కు మారత్వమొసంగు నన్న ||విశ్వా||

  • సేగు క్రియలను జేసి పోగొట్టుకొన్నట్టి క్షేమ రాజ్యపు హక్కులన్ బాగుగ మనకిచ్చి బాంధవ్య మొనరించు భగవంతునికి మనకున్ ||విశ్వా||

  • విశ్వనాధుని గొప్ప విశ్రాంతిలోను ప్ర వేశము నాకు నొసంగుగా విశ్వాస ఫలము లివి నీ శాశ్వత రక్ష ణాశ్రయం బిదియె విడకు ||విశ్వా||
  • 390 సందియము వీ 10/19/2017 20:16 390 సందియము వీడవే నా మనసా యా నందమున గూడవే సందియము లింకేల నిను సుఖ మొందఁ జేసెడు క్రీస్తు రక్తపు బిందువులు శుభవార్తవాక్యము లందుఁ గని తెలి వొంది బ్రతుకుచు ||సందియము||

  • చింత లిఁక మానుము లోకులు దెల్పు భ్రాంతుల్ బడఁ బోకుము ఎంత వింత దురంత పాపము లంతటను దన రక్తమున గో రంత లేకయె దుడుచు నని సి ద్ధాంత మగు ప్రభు వాక్యమును విని ||సందియము||

  • పాపములు వీడుము నీ విఁకఁ బశ్చా త్తాపమున గూడుము ఏపు మీరిన యోర్పుతో నొక పాపి కైన లయంబుఁ గోరక పాపులందఱు దిరిగి వచ్చెడు కోపుఁ గోరెడు కర్త దరిఁ జని ||సందియము||

  • నేరముల నెంచుకో యేసుని కరుణా సారముఁ దలంచుకో భార ముల్ మోయుచు శ్రమన్ బడు వార లందఱు నమ్మి నా దరిఁ జేర విశ్రమ మిత్తునను ప్రభు సార వాక్కెలు చక్కఁగా విని ||సందియము||

  • నిమ్మళము నొందుము రక్షకుని పలుకు నమ్ముకొని యుండుము ఇమ్మహిని బాపులకు నై ప క్షమ్ము జేసి పరాత్పరుని సము ఖమ్మునందుఁ చిత్తమ్ముగాఁ కాయమ్ము బలియుడు నీప్రభునిఁ గని ||సందియము||

  • ప్రేమ దయా శాంతముల్ కర్తకు భూషా స్తోమము లవంతముల్ నీ మొఱ ల్విని యేసునాధ స్వామి తన రక్తమున బాపముఁ దోమి ని న్నకళంకుఁ జేయును నీ మదిన్ దగ నమ్ముకొన యిఁక ||సందియము||
  • 391 విశ్వాసమే 10/19/2017 20:16 391 విశ్వాసమే విజయము విను ప్రియుఁడా య విశ్వాస మపజయము విశ్వాసాయుతమైన విసుకని సుకార్యములే విశ్వాసవంతునికి విజయ మొసంగును నిజము ||విశ్వాసమే||

  • భక్తుఁ డందు వలననే బ్రతుకును మరియు శక్తినొంది నిల్చును యుక్తముగ వర్తించి యుర్విని జయించి ముక్తినొందున టంచు రక్తిగాఁ బాడుదును ||విశ్వాసమే||

  • మంచి పేరు నొందును సాతాను నెది రించి విజయ మొందును మించిన బాధ ల్స హించి జయించును నంచిత మరణము నానంద ముగఁగాంచు ||విశ్వాసమే||

  • ప్రవిమల మొందెదము పాపమునుండి పరిహరింపఁబడుదుము అవి రతమును మనము నాశ్చర్యముగ ఘనము భువియందున్ దివియందున్ బుధులతో నొందుదుము ||విశ్వాసమే||

  • నీతిమంతుల మౌదుము నిశ్చయము ప్ర ఖ్యాతి బోధను నేర్తుము ఆ తండ్రి దత్తముల నన్ని యార్జించుచు యాతని సుభద్రములో ననయ ముందుము నిజము ||విశ్వాసమే||

  • పరిపూర్ణ విశ్వాసమే క్రియలతో నున్న మరి మంచి విశ్వాసమే ధరయందున్ బరమందున్ ధన్యాత్మునిగఁ జేయున్ సరగు నద్దానినే సంపాదించుము ప్రియుఁడా ||విశ్వాసమే||
  • 392 ఓ దేవ రక్ష 10/19/2017 20:16 392 ఓ దేవ రక్షకా నే విశ్వాసంబుతో నిన్ జూతును నా మొఱ్ఱాలించుము నా పాప మార్పుము నన్నింక నీ దరిన్ సదా యుంచు.

  • మూర్ఛల్లు నాత్మకు బలం బొసంగుము భవత్కృఋపన్ నాకై చావొందిన నిన్నెల్లకాలము ఆసక్తి శుద్ధితోఁ బ్రేమింప నీ.

  • నే హాని నొందిన నన్ జింత క్రమ్మ్రినఁ గాపాడుము పోఁగొట్టు చీఁకటి కన్నీళ్లఁ దుడ్వుము దొలంగ నీకునన్ నీ సన్నిధి.

  • నా యాయు వంతమై మృత్యూగ్ర బాధలు నన్నొందుచో సంశయ భీతులు తొలగఁ బ్రేమతో నా దేవ, యాత్మకు మోక్షం బిమ్ము.
  • 393 నీ చరణములే 10/19/2017 20:16 393 నీ చరణములే నమ్మితి నీ పాదములే పట్టితిఁ బట్టితిఁ బట్టితి ||నీ చరణములే||

  • దిక్కిఁక నీవే చక్కఁగ రావే మిక్కిలి మ్రొక్కుదు మ్రొక్కుదు మ్రొక్కుదు ||నీ చరణములే||

  • ఐహిక సుఖము నరసితి నిత్యము ఆహాహా ద్రోహిని ద్రోహిని ద్రోహిని ||నీ చరణములే||

  • న్యాయము గాని నా క్రియ లన్ని రోయుచుఁ ద్రోయకు త్రోయకు త్రోయకు ||నీ చరణములే||

  • భావము మార్చి నావెతఁ దీర్చి దేవర ప్రోవవే ప్రోవవే ప్రోవవే ||నీ చరణములే||

  • చంచల బుద్ధి వంచన యెద్ది ఉంచక త్రుంచవే త్రుంచవే త్రుంచవే ||నీ చరణములే||

  • చుట్టుకొని యున్న శోధన లున్నఁ పట్టు విడఁ గొట్టవే కొట్టవే కొట్టవే ||నీ చరణములే||

  • నాచు పిశాచి నరుకుట గాచి కాచుకో దాఁచవే దాఁచవే దాఁచవే ||నీ చరణములే||

  • యేసుని తోడ నెన్వరు సాటి దోసముఁ బాపును బాపును బాపును ||నీ చరణములే||
  • 394 ఎందు కే చి 10/19/2017 20:16 394 ఎందు కే చింతించెదవు నా డెందమా నీ కందమా యిందాఁక రక్షించినవాఁ డిఁకను నిన్ను విడువఁబోడు ||ఎందుకే||

  • తొల్లి నీ వొనరించినట్టి దోషమెంతో యరిసి చూడు చెల్లచెదరై పఱచు తరిని చెయ్యి పట్టినాఁడు అల్లుకొనిన నీ దుర్గణము లణఁగఁ ద్రొక్కి వేసినాఁడు తల్లడిల్లజేయు నీ శత్రువులఁ దరిమి ప్రోచినాఁడు నల్లగా దన్నాడా నేఁడు వద్దు సందేహంబులు వీడు ||ఎందుకే||

  • తల యెత్తరాని చోటఁ గళ లిచ్చి నిలిపినాఁడు పలుమారు నీ యక్కఱలు తెలిసి యందిచ్చినాఁడు బలహీన మపుడు నీకు ని ర్భయ మియ్య వచ్చెడు వాఁడు పలు విధంబు లగు బాధలఁ బారఁ దోలివేసినాఁడు నెల విప్పుడు లేదన్నాఁడా నీతో నిఁక సరి యన్నాఁడా ||ఎందుకే||

  • ఒక్క నీ తల వెండ్రుక యైన నూడిపడ దని చెప్పెడు వాఁడు దిక్కు నీకిక నేనే యని తన దివ్య వాక్కులఁ దెలిపెడు వాఁడు చిక్కు లను బెట్టెడు పగవారి చేత నినుఁ జిక్కింపని వాఁడు ఇక్కట్టు మెట్టుల దాఁటించుట కిదిగో యని చెయి యిచ్చెడు వాఁడు హక్కు లేదన్నాఁడ నేడు అతఁడు నిను వెలి వేయబో డు ||ఎందుకే||

  • యేసు తన రక్తముతో నిన్ను నెంచి ముందే కొనుచున్నాఁడు దోసములు వెడలించు విమలా త్ముండు నీ సాక్షిగ నున్నాఁడు ఆశతో నీవు గొలిచెడు తండ్రి యంతటా గాపై యున్నాఁడు నీ సురక్షణ జేయు వారు నినుఁ జుట్టి యున్నా రెల్లప్పుడు శేషరహితానంద మల్లెదె. చేరువగుచున్నది చూడుము ||ఎందుకే||
  • 395 మనమీ మనుమీ 10/19/2017 20:16 395 మనమీ మనుమీ మనస నీ వనుదినము యేసుని సరస ఘన ధనముల నీవు రోసి దేవ తనయుని కృపఁ దల పోసి ||మనమీ||

  • మంకు తనములను విడిచి నీ భయంకర వేదనకు వెరచి యింక వడి యేసు కడ కేగి పాద పంకజముల యొద్ద దాఁగి ||మనమీ||

  • ప్రాకటముగ నొప్పు నట్టి దైవ వాక్యంబు మనమునఁ బెట్టి శ్రీ కర నాధుని నమ్మి ధాత్రి నీ కలుషమ్ములును జమ్మి ||మనుమీ||

  • సృష్టి ప్రభువు నీకు లేఁడ యతని యిష్ట గుణగణమ్ములు బాడ ఇష్టము తోడను వేఁడి నీదు దుష్ట గుణమ్ముల వీడి ||మనుమీ||

  • చెంతఁ జేర వల దన్నాఁడ కడు వింతెన జనకుఁడు గాఁడా చింతలు నీకిఁక నేల బహు సంతోషమున యేసు పాల ||మనుమీ||

  • బిరబిర వరగురు దరికి నీ వరుగుము దురితముఁ బెరికి సురిచిరమగు యేసు కరుణ నీకు మరణపు తరి నగు నాదరణ ||మనుమీ||

  • నిరతమ్ము నాతనిమీఁద నీదు దురితముల నునుపరాద త్వరితమ్ముగ నెమ్మిఁ జూపి దుష్ట చరితమ్మును వెళ్లబాపి ||మనుమీ||

  • అమలాప్తుఁడు నిను డాయు నీదు శ్రమ లన్నియు వెడలఁ జేయు విమలాత్మను దయచేయ నీతి కమలాప్తుని మది కీయ ||మనుమీ||

  • అంచితముగ నుతి సేయు నిన్ రక్షించిన కృపా సంస్త్యాయు నెంచుచు నాతని విభునిగఁ గీర్తించుచుఁ బరమ గురునిగ ||మనుమీ||
  • 396 దేవ దాసపాల 10/19/2017 20:16 396 దేవ దాసపాలక రాజా రావే జీవముల ప్రదాతవై ప్రకాశ మొందఁగా దేవా దేవా దీన పోషకా ||దేవ||

  • లోకబాధ యిరుకు శోధన నుండి స్వీకరించినావు త్ర్యేకదేవుఁడా స్తోత్రం స్తోత్రం స్తోత్ర మర్పణ ||దేవ||

  • దిక్కు లేని పాపికొరకు నీ దేహం మిక్కుటంపు బాధ కొప్పితివి యక్కటా జయం జయం జయము నొందఁగా ||దేవ||

  • కఠిను లంత కుటిలముజేసి నిన్నుఁ గట్టి కొట్టి నెట్టి నీకుఁ గొయ్య నెత్తిరా యిదే నా యెడఁ బ్రేమఁ జూపితి ||దేవ||

  • ఇంత యోర్పు యింత శాంతమా నాకై పంతముతోఁ బాపికొరకుఁ బ్రాణ మియ్యఁగా పాపిన్ నీదగు దాపుఁ జేర్చవే ||దేవ||

  • కలువరి గిరి వరంబున నాకై తులువను నా కొరకు నిలను సిల్వమోయఁగా హలెలూయా హలెలూయ హలెలూయ ఆమేన్ ||దేవ||
  • 397 ఎన్నడు నెడ 10/19/2017 20:16 397 ఎన్నడు నెడఁబాయ నే కొల(ది విడనాఁడ ననిన తండ్రి నిరత మన్ని బాధలయందు నన్ని దుఃఖములందు నన్ను ఁ బ్రోచు ||ఎన్నడు||

  • పాపుల రక్షింపఁ బ్రాణమిచ్చిన యేసు బ్రతికి యుండు తన ప్రాపు గోరినవారి భారము తా మోసి ప్రాపయి యుండు ||ఎన్నడు||

  • ఎల్ల కాలంబుల నేకరీతిగ నుండు యేసునాధుఁ డాతఁ డెల్ల విశ్వాసుల నెల్ల వేళలఁ దలఁచి యేలుచుండు ||ఎన్నడు||

  • తనవారి యక్కఱలు తానెఱిగి యున్నాఁడు తప్పకుండ నాతఁ డెనలేని దయఁబూని వినువారి మనవులు వేడ్కమీఱ ||ఎన్నడు||
  • 398 జీవమా చింత 10/19/2017 20:16 398 జీవమా చింతించకుండు నిన్నుఁ గావ వచ్చిన యేసు కరుణా మయుండు జీవమా చింతించి క్షితి మూరె డైన నీ జీవము కున్నతిఁ జేసెదవా కావున నీ చింతా క్రాంతము వెడలించు దేవుఁ డెహోవ నీ దిక్కని నమ్మి ||జీవమా||

  • గగన వీధిని బోవు ఖగములు దున్నునా తెగఁగోసి కొట్లలో దాఁ చునొకో యగణిత పక్షుల కాహార మియ్యంగ బెగడెద వెందుకు పెంచు ని న్నత డు ||జీవమా||

  • పక్షి వృక్షాదుల పై నింత ప్రేమతో భక్షణ లిచ్చుచుఁ బాలింపఁగా నక్షరములకంటె హెచ్చుగ నన్నెంచి యక్షయముగ నేలు నల్పవిశ్వాసి ||జీవమా||

  • మిశ్రాయీం బాధల మేరల దొలఁగించి యిశ్రాయేలుకు మన్నా నియ్యలేదా యాశ్రయమై నీదు హస్తము విడువక నీ శ్రమలను బాపి నిన్నేలునతడు ||జీవమా||
  • 399 భయము నొందక 10/19/2017 20:16 399 భయము నొందకుము క్రైస్తవ సహోదర యింక భయము నొంద కుము భయము నొందకుము హృదయ వాసుఁడగు క్రీస్తు దయ నీ తలఁపు లెల్ల రయముగ నెరవేర్చు ||భయము||

  • దీవింపఁబడెడు జగమున కిరుకౌ త్రోవ జను నపుడు భావ జ్ఞానము వీడ భయపుఁ జీఁకటి గూడుఁ గావున మది యేసు భావింప గతి జేర్చు ||భయము||

  • నీ యాత్మఁ జూచి కయ్యము జేయ డాయు పిశాచి యా యుద్ధమున బ్రత్య య మ్మనెడు డాల్బట్ట నా యెడఁ గ్రీస్తు స హాయుఁడై గెల్పించు ||భయము||

  • జగము నిన్బట్టి వెన్కకు నీడ్చి పగఁ దీరఁ గట్టి యెగతాళి గావించు టెఱింగి క్రీస్తుని పిల్వఁ డగఁబట్టు మపుడు నీ పగ మాన్పి విడిపించు ||భయము||

  • కలుష జాలంబు మాయా కీట కముల జాలంబు గల బావి నీ యాత్మ గలియకుండఁగ యేసుఁ దలఁచు మప్పుడు నిం జే తంబట్టి కాపాడు ||భయము||

  • శ్రమ దండనముల శిశు శిక్షించు జనకు విధముల సమకూర్చు నీ దేవుఁ డమిత ప్రేమను గాంచి యమలమౌ మతి నోర్చు మపుడు మేలిడు నీకు ||భయము||

  • కన నీదు చటుల దుఃఖాదు లె ట్లను వీడు నటులఁ గొన దినమున న్యాయ మును దీర్పఁగాఁ క్రీస్తు చను దెంచి నిత్య జీ వన కిరీటము నిచ్చు ||భయము||
  • 400 యేసునాధుని 10/19/2017 20:16 400 యేసునాధుని సేవ యిపుడు మాకబ్బెను వెఱవము వెఱవము యేసు దాసులతో బొత్తు భక్తి మా కమరెను జడియము జడియము ||యేసు||

  • లోక జ్ఞానములోని లోతుఁ దెలిసి మేము లొంగము లొంగము యేసు రాకడకొఱకు సంత సించి యెల్లప్పు డుండెద ముండెదము ||యేసు||

  • దైవజనుల మని ధైర్యముతో మేము పల్కెదము పల్కెదము పాప భారమంతయు యేసు ప్రభున కప్పగించి బ్రతుకుచు బ్రతుకుచు ||యేసు||

  • శుభవర్తమానము సొంపుగా నరులకుఁ జెప్పెదము జెప్పెదము లోక వైభవములను వాంఛించక యేసుని పలికెదము పలికెదము ||యేసు||

  • నీతికవచంబును నెనరుతో ధరియించి నిలిచెదము నిలిచెదము లోక ఘాతకుఁడైన పి శాచిని యెదిరించి కట్టెదము కట్టెదము ||యేసు||

  • శోక మొందక యేసు రాకడ కాశించి రంజిల్లు చుండెదము దూత మూఁకలతో గూడి మోద మొప్ప యేసుని పొగడెదము పొగడెదము ||యేసు||
  • 401 వెరువనేల మ 10/19/2017 20:16 401 వెరువనేల మనసా క్రీస్తుని వేఁడవే నా మనసా యిరుకునఁ బడి యెడు వేళలోఁ క్రీస్తుని చరణము చేరువ జేరిన సుఖ మది ||వెరువ||

  • శోధన కాలమునఁ క్రీస్తుని బోధకు చెవి నిమ్మా సాధించెడు సా తానుని వల మరి ఛేదించెడు నిఁకఁ బెదరకు ||వెరువ||

  • పాపపు స్త్రీ వచ్చి పరిమళ తైలము తాఁ దెచ్చి పాప మెడలు నని తనలో ననుకొని యేపున క్రీస్తుని నెలమి భుజించెను ||వెరువ||

  • గ్రుడ్డివాడు నిలిచి మార్గము బడ్డ యేసుని బిలచి చెడ్డవాడనని చేయివిడువకు మన దొడ్డ క్రీస్తు కందోయి నొసంగెను ||వెరువ||

  • గాసి బడుచు రోగి యగు చెలి యాశచేత వచ్చి వాసిగ యేసుని వస్త్రమంటి సుఖ వాసి యయ్యె ప్రభు యేసుని కృపచే ||వెరువ||

  • లాజరుండు మృతుడై పడువే ళ సమాధికి వచ్చి లాజరా యని బల్కరుణను బిలువఁగ రాజిల బ్రతికెను బ్రాణాన్వితుఁడై ||వెరువ||

  • పరిసయ్యునిలోని భావము ప్రభు తాఁ గనుఁగొనుచుఁ తిరిగి పొమ్ము నీ దురితము వెడలెను వెరువకు మని యాదరముగ బలికెను ||వెరువ||
  • 402 దినదినముకు 10/19/2017 20:16 402 దినదినముకు దిక్కు నీవే మా దేవుఁడా మమ్ము కనిపెట్టి కాపాడ నెపుడు కర్త వీవే కర్త వీవే ||దినదినమునకు||

  • పనికిమాలిన వారము పాపిష్ఠులము నీదు కనికరమును జూచి కృపతోఁ గావు మమ్ముఁ గావు మమ్ము ||దినదినమునకు||

  • పాప మైన లోక మైన పిశాచక మైన మమ్ముఁ భట్టి రక్షింప వచ్చినఁ బ్రాపు నీవే ప్రాపు నీవే ||దినదినమునకు||

  • కష్టములు కాని శోధనలు మమ్ముఁ జుట్టు కొనఁగ నీ కృపనెంతో చూపుదువే చూపుదువే ||దినదినమునకు||

  • నిందలైన దెబ్బ లైన నీదు నామమున మేము పొందఁబోవు కాలమందుఁ దండ్రి వీవే తండ్రి వీవే ||దినదినమునకు||

  • సత్యమైన వాక్య మిచ్చి సారమును దెల్పి నీదు నిత్యజీవ మార్గ మందు నిలిపితివే నిలిపితివే ||దినదినమునకు||

  • ఆసఁ గొల్పి యాత్మలో నా క్యానుభవ మొందించి నీకు దాసులపై బ్రతుకునట్లు ధైర్య మిమ్ము ధైర్య మిమ్ము ||దినదినమునకు||

  • విశ్వాస నిరీక్షణ ప్రేమ లింపుగా మాకు నీవు శాశ్వతముగఁ బంపించుమీ శ్రేష్టముగను శ్రేష్ఠముగను ||దినదినమునకు||
  • 403 పాడుదును క 10/19/2017 20:16 403 పాడుదును క్రీస్తు పేర పదము నెంతో వేడుదు నా దివ్యాగురు నివ్విధముఁ జూడఁజూడ మదిలో నెంతో వేడుకగా మీఱె వింత ఱేడుఁ బోలినవా డిహ లేఁడు లేఁడందు నహహా ||పాడుదును||

  • పెక్కు పాపములలోన మణఁగి నాదు తక్కువ బుద్ధిచే నందణఁగి దిక్కు గానక నుండు వేళ దిక్కయి చనుదెంచి మరల గ్రక్కున కరముఁ జూచి చక్కికిఁ జేర్చి ప్రోచె ||పాడుదును||

  • మోసపు లోక వాంఛలను వట్టి యాశలతోఁ గూడికొన్న కలలు రోసితిఁ గాన వాని యేసుతోఁ గూడుకొంటి వీసమైనను లేమి లేశము లేదనుస్వామి ||పాడుదును||

  • పాయ నెన్నటికిని వాసిగాఁ బాస త్రోయను త్రోయను యని చేసెగా రోయక న న్నావిభుఁడు సాయమై రక్షించు నెపుడు నా యనీతి భయములు మాని యాయనే జయంజయమని ||పాడుదును||

  • చాలు చాలు పాపమా నీ చెలిమి నిత్య కాలము గలిగించు మృత్యుకలిమి యేలికైన నాయిమ్మాను యేలు నాయందు దయను మేలిమి నగుపరచినట్టి జాలినేఁ గంటిఁ గాన ||పాడుదును||

  • ధరలో దేనికి భయపడను ఎట్టి తరుణమైనను చేయి విడను కరుణామయుండు నన్ను కరుణ నేర్పరచి మున్ను మరణమందును వాని శరణం నాశరణమని ||పాడుదును||
  • 404 జడియకుము న 10/19/2017 20:16 404 జడియకుము నే నే యున్నానని కడు నెనరు వాక్కిచ్చిన యేసుని యడుగుజాడలు వెంబడించి నడుచుకొనరాదా జీవా యిడుమ లధికము గలిగిన ప్రభుని కడకుఁ జేరరాదా ||జడియకుము||

  • ఇప్పుడు నిను బాధపరచెడి ముప్పులం దలపోసి తప్పక గొప్ప ప్రేమార్థంపు శిక్షకు నొప్పియుండరాదా నీ తప్పులన్ విడి ప్రభువు నందు మెప్పు బొందరాదా ||జడియకుము||

  • ఘనము ధనము సౌఖ్యంబు బోయి వ్యసనము శోధన మున్న యోబు మనసు దృఢము చేసి ప్రభుని మహిమ పరపలేదా నీ మనసు దృఢంబటుల జేసి మహిమ పరపరాదా ||జడియకుము||

  • బీద లాజరుండు భువిని బాధ నొందిన సాదృశ్యంపు బోధన నీ మానసమున పాదుకొనలేదా యతఁ డాదరింపఁబడిన విధము మోద మియ్యలేదా ||జడియకుము||

  • మున్ను సైఫనును రాళ్లతోఁ గొట్టు చున్న పగతుర కొరకు దేవుని మిన్ను వైపునఁ జూచి యోర్చి మన్న నడుగలేదా నీ కున్న శ్రమలటు లోర్చఁ బ్రభువు తెన్నుఁ జూపలేడా ||జడియకుము||

  • భక్త జనులను ఖైదుకు నీడ్చి బాధలు గావించినప్పుడు శక్తి హీనుల మంచు యేసుని శక్తి నమ్మలేదా యా యుక్తసహాయము దొరకువరకా సక్తి నుండలేదా ||జడియకుము||
  • 405 దేవుఁడే నా 10/19/2017 20:16 405 దేవుఁడే నా కాశ్రయంబు దివ్యమైన దుర్గము మ హా వినోదుఁ డాపదల స హాయుఁడై నన్ బ్రోచును అభయ మభయ మభయ మెప్పు డానంద మానంద మానంద మౌఁగ ||దేవుఁడే||

  • పర్వతముల కదిలిన నీ యుర్వి మారుపడినను సర్వమున్ ఘోషించుచు నీ సంద్ర ముప్పొంగినన్ అభయ మభయ మభయ ||దేవుఁడే||

  • దేవుఁ డెప్డు తోడుగాఁగ దేశము వర్ధిల్లును ఆ తావు నందు ప్రజలు మిగుల ధన్యులై వసింతురు అభయ మభయ మభయ ||దేవుఁడే||

  • రాజ్యముల్ కంపించిన భూ రాష్ట్రముల్ ఘోషించిన పూజ్యుండౌ యెహోవా వైరిఁ బూని సంహరించును అభయ మభయ మభయ ||దేవుఁడే||

  • విల్లు విఱచు నాయన తెగ బల్లెము నఱకు నాయన చెల్లచెదర జేసి రిపుల నెల్లఁద్రుంచు నాయనే అభయ మభయ మభయ ||దేవుఁడే||

  • పిశాచి పూర్ణబలము నాతోఁ బెనుఁగులాడ జడియును నశించి శత్రుగణము దేవు నాజ్ఞ వలన మడియును అభయ మభయ మభయ ||దేవుఁడే||

  • కోటయు నాశ్రయమునై యా కోబు దేవుఁ డుండఁగ ఏటి కింక వెరవ వలయు నెప్డు నాకుఁ బండుగ యభయ మభయ మభయ ||దేవుఁడే||
  • 406 మనసు నిచ్చ 10/19/2017 20:16 406 మనసు నిచ్చి వినుమా మది ననుసరించి చనుమా ||మనసు||

  • అరయ యేసు సిలువ యది అమరపురికి త్రోవ ఆ రమ్యమైన త్రోవ యది యనుసరించినావ అది యరసి చూచినావ? ||మనసు||

  • అది నడచి నడచి పోను ఆనందమిచ్చి చనును అది యేసు సిలువ మ్రాను అది యనుసరింపదగును అది యందరు చనదుగును ||మనసు||

  • రక్తమయపు బాట నీ ముక్తికదియె యూట భక్తులందరి యెదుట స ద్భక్తి మెరయు పాట లనురక్తి బాడెదరచట ||మనసు||

  • ఎంత పాపమైన మదికెంత భారమైన ఎంత దయయోగాని యది ఎంత కృపయొ గాని అతి శాంతి నిచ్చులోన ||మనసు||

  • సాటిలేనిదారి మన స్వామిచూపుదారి మేటికల్వరిదారి జనకోటి దుర్గుణహారి మనకోటకు రహదారి ||మనసు||

  • వలదులోకమేల నీ వలపు నా కికేల నిలువుమింక చాలు నని బిలుచు యేసుమ్రోల నే గొలుతు కాలమెల్ల ||మనసు||
  • 407 ప్రీతిగల మ 10/19/2017 20:16 407 ప్రీతిగల మన యేసుఁ డెంతో గొప్ప మిత్రుఁడు మితిలేని దయచేత హత్తుచుఁ బ్రేమించును క్రీస్తునొద్ద మన భార మంత నప్పగించినన్ శక్తిగల యేసుచేత మోఁత లెల్ల వీడును

  • నీతిగల మన యేసు ధృతిగల మిత్రుఁడు మృతిఁ బొంది కృపతో వి శ్రాంతి కలిగించెను భీతి నొందుఁ బాపు లైనఁ జింతాక్రాంతులైనను క్రీస్తు యొక్క దీప్తి చేత క్రొత్త గతిఁ జూతురు

  • దయగల మన యేసు ప్రియమైన మిత్రుఁడు మాయలోకమందు నిజా శ్రయుఁడై కాపాడును భయ దుఃఖ శ్రమ లాది మోయరాని బాధలన్ జయ మొప్ప నేర్పి యేసు స్థాయి వృద్ధిచేయును.

  • ధారుణిలో యేసుగాక వేరుగొప్ప మిత్రుఁడా? పరలోకమందు యేసే వీరుడౌ రక్షకుఁడు నారకుల! గావ వేగఁ గ్రూర హింసఁ బొందెను కరుణించి నిచ్చి ప్రతి ప్రార్థన నాలించును.
  • 408 యేసూ, యాత్ 10/19/2017 20:16 408 యేసూ, యాత్మ ప్రియుఁడా నిన్ను నాశ్రయించితి లేవఁగా దరంగముల్ గాలివాన కొట్టఁగా లోకబాధ లన్నిఁటన్ నన్ను దాఁచు రక్షకా రేపునకు నడ్పుము నాదు యాత్మన్ బ్రోవుము

  • దిక్కు లేని యాత్మకు వేఱె ప్రాపు లేదిఁక ఒంటిగాను విడ్వక నన్ను నాదరించుమీ నిన్నె నమ్మి యుంటిని నీవె నా సహాయము కాపులేని నా తలన్ కాయుమా నీ నీడను

  • క్రీస్తు నిన్నెఁ గోరుదున్ దొర్కు నన్ని నీ కడన్ పడ్డ హీను నెత్తుమీ స్వస్థపర్చు రోగులన్ న్యాయశుద్ధ నామము నీదె, నేను పాపిని నేను పాపపూర్ణుఁడన్ నీవు ప్రేమారూపివి

  • పాపమెల్ల మాన్పఁగా నీదు ప్రేమ చాలును మాన్పు నీళ్లు నాయెదన్ శుద్ధి చేయఁగా నిమ్ము నీవు బ్రత్కు టూటవు త్రాగనిమ్ము నీదరిన్ పుట్టి నాదు నాత్మలో నెల్ల ప్రొద్దు పారుమీ
  • 409 మా శ్రమ లన 10/19/2017 20:16 409 మా శ్రమ లన్ని తీర్చితివి మాకు విశ్రాంతి నిచ్చితివి మహిమ నీకుఁ గల్గెడును మిత్రుఁడవైన రక్షకుఁడా!

  • సందియ మంతఁ దీర్చితివి పూర్ణ విశ్వాస మిచ్చితివి మహిమ నీకుఁ గల్గెడును మిత్రుఁడవైన రక్షకుఁడా!

  • కన్నీళ్లు నీవు తుడ్చితివి మాకు సంతోష మిచ్చితివి మహిమ నీకుఁ గల్గెడును మిత్రుఁడవైన రక్షకుఁడా!

  • నీ చరణంబు నమ్మితిమి కరుణఁ జూపి ప్రోచితివి మహిమ నీకుఁ గల్గెడును మిత్రుఁడవైన రక్షకుఁడా!
  • 410 అలసటపడ్డ న 10/19/2017 20:16 410 411 ఓ దేవ నేను 10/19/2017 20:16 411 ఓ దేవ నేను నీ దాపున నుండెదన్ నీ దాపున నుండెదన్ నా దేవ నను లేపు నవి సిల్వ శ్రమలైనన్ నీ దాపున నుండు నీ సేవకుని పాట ||ఓ దేవ||

  • బాటసారి లాగు నేఁడు భానుఁడు గ్రుంకి మేటి చీఁకటి గ్రమ్మినన్ నేటి విశ్రాంతికిఁ జోటు బండయైనన్ మాటిమాటికిఁ గలలో సూటిగా నినుఁదలఁతు ||ఓ దేవ||

  • ఆకాశ మండల మార్గంబు నెప్పుడు నా కీవు చూపించుమా నీ కూర్మిచే నాకుఁ జేకూరు నంతయు లోకేశ్వర దూత లే కోరి ననుఁ బిలువ ||ఓ దేవ||

  • నీకు స్తోత్రము చేసి యపుడు నా మదిలోని ప్రాకటంబగు నెనరుతో భీకరము లైన శోకంబు లను రాళ్లన్ నీకు నాలయంబు నేఁగట్టె దను గర్తా ||ఓ దేవ||

  • సంతసంపు రెక్క లెత్తి నాకమునందు నెంత పైకి లేచినన్ వింతగ జ్యోతుల వితతి మించి నేన త్యంత మెగసినను నీ చెంత కేగును బాట ||ఓ దేవ||
  • 412 కొండల తట్ట 10/19/2017 20:16 412 కొండల తట్టు నేఁ గోర్కెతోడ నాదు కన్ను లెత్తెద నిప్పుడే దండియౌ సహాయ మెచటి నుండి నాకు వచ్చునో యండయౌ ప్రభునిచే స హాయంబు కలుగును ||గొండల||

  • ఆయన భూమ్యాకాశము లన్నిటను సృజించెఁగా యాయన యికఁ దొట్రిల్ల నీయఁడు నీ పాదముఁ ||గొండల||

  • నిన్నుఁ గాపాడు వాఁ డెన్నఁడును గున్కఁడు పన్ను గ నిశ్రాయేల్ గా పాడు వాఁడు కున్కఁడు ||కొండల||

  • నీకు యెహోవాయే నిజముగాఁ గాపగు నీ కుడిప్రక్కను బ్రభుం డు నీకు నీడగా నగుఁ ||కొండల||

  • ధాత్రిఁ బగు లెండ దెబ్బ రాత్రి వెన్నల దెబ్బయే మాత్ర మైనను నిన్ను మార్కొనంగఁ జాలవు ||కొండల||

  • ఏ యపాయమును రా నీయకుండ నా యెహోవ పాయక నినుఁ గాచును నీ ప్రాణముఁ గాపాడును ||కొండల||

  • మోదంబుతో నిది మొదలుకొని నిత్యమున్ నీదు రాక పోకలందు నిను యెహోవా కాచును ||కొండల||

  • జనక కుమారాత్మకును ఘనత మహిమ కల్గును మును పిపుడెల్లప్పుడు యుగ ముల కగుఁ గా కామేన్ ||కొండల||
  • 413 నీవు తోడై 10/19/2017 20:16 413 నీవు తోడై యున్నఁజాలు యేసు నిత్యము నాకది మేలు నీవు ధరణినుండు నీచపాపుల నెల్లఁగావఁ బ్రేమ వచ్చి ఘన ప్రాణ మిడినట్టి ||నీవు||

  • నినుఁ బోలు రక్షకుం డేడి క్రీస్తు ననుఁ బోలు పాతకుం డేడి నిను నమ్ము వారలకు నీ వొసఁగుచుందువు తనరఁ పాపక్షమ దయచేత నిలలోన ||నీవు||

  • నీ పాటి బలవంతుఁ డేడి ప్రభు నాపాటి దుర్బలుం డేడి కాపాడు చుందువు కలకాలమును నీవు నీ పాద సేవకుల నీనేర్పురంజిల్ల ||నీవు||

  • నీవంటి యుపకారి యేడి కర్త నావంటి కడు దీనుఁ డేడి జీవుల కును గల్గు జీవంబు లిచ్చుచు జీవాధారము లొసఁగి జీవులఁ బ్రోచెడి ||నీవు||

  • నీవంటి ధనవంతుఁడేడి యేసు నా వంటి ధనహీనుఁ డేడి ప్రోవులై యున్నవి యీవులు నీయందు నీవువాని నొసంగి నిరతంబు ననుఁ గావు ||నీవు||
  • 414 నీవే నా ప్ 10/19/2017 20:16 414 నీవే నా ప్రియుఁడవు యేసు ప్రభు నీవే నా యొడయుఁడవు నీవే యనాది దేవ పుత్రుండవు నీవే లోక మెల్ల నేర్పుగఁ జేసితివి ||నీవే||

  • పరమందు నీకుండు పరమభాగ్యంబులు నరకాయత్తుఁడ నైన నా కొరకు విడిచితివి ||నీవే||

  • నీవే ననుఁ బ్రోవ నెనరు నేతెంచి నీవొలుక బోసితివి నీ నల్ల సిలువపై ||నీవే||

  • నేనెవరిఁ బ్రేమింతు నీ కంటె లోకమున నే నెపుడు మరువను నీ ప్రేమ నాకర్త ||నీవే||

  • నీ సేవ నేఁ గోరి నిన్నే ప్రతిపరతు నీ సేవకుఁడ నైన నే నెట్లు నిను విడుతు ||నీవే||

  • సకలంబు నేలెడి చక్కని రాజవు సకలాధికారంబు చక్కఁగం చేయుదువు ||నీవే||

  • నీ సేవకుల నెల్ల నేర్పుగా నేలెదవు నీ సేవకులు పొంద నిత్య సహాయంబు ||నీవే||
  • 415 ఓ దేవా నన్ 10/19/2017 20:16 415 ఓ దేవా నన్నుఁ బ్రోవ నీదె భార మయ్య రావే ||యో దేవా||

  • స్వామి స్వామి యన నా భారం ప్రేమఁ జూపను నీ భారం పామరుఁ డ నన నా భారం పాపిం బ్రోవను నీ భారం ||బో దేవా||

  • నెనరు తండ్రి యన నా భారం ననుఁ గనులఁ జూడను నీ భారం నిన్నే నమ్మ నాదు భారం నన్నెపుడు కావ నీ భారం ||బో దేవా||

  • కరుణ సాగర యన నా భారం కరుణం జూపను నీ భారం శరణని వే డను నా భారం సంతరింప నీ భారం ||బో దేవా||

  • మనవి సేయ నాది భారం తనవిఁ దీర్పను నీ భారం నిను మది దలఁ ప గ నా భారం నన్ను గా వనీ భారం ||బో దేవా||
  • 416 నాధ యేసు న 10/19/2017 20:16 416 నాధ యేసు నాధ క్రీస్తు నాధ నేననాధ సాధు జనులఁ బ్రోచు సదయు నీ దయ కాదా ||నాధ||

  • గతిఁ దలఁపని మూర్ఖచిత్త గమనుఁడనే గానా సతతముననుఁ గరుణఁ బ్రోచెడు గతియ నీవు కావా ||నాధ||

  • పాపమందు జననమైన పామరుండ నేఁగానా కటకట ననుఁ గని కరించు కరుణ నీది గాదా ||నాధ||

  • కుటిల బుద్ధిగల వాఁడను క్రూరుఁడ నేఎఁగానా కటకట ననుఁ గని కరించు కరుణ నీది గాదా ||నాధ||

  • ఆది కర్త వీవు గావె యఖిల లోకమునకును బీదవారి నెల్లఁ బ్రోచు బిరిదు నీది గాదా ||నాధ||

  • సారమైన సత్యశాస్త్ర సార మీవు గావా ఘోరమైన పాపి జనులఁ గోరి పిలువ లేదా ||నాధ||

  • జీవ నాధారమైన త్రోవ నీవు గావా దేవదేవ యెహవా నా దిక్కు నీవు గావా ||నాధ||
  • 417 నాకై చీలిన 10/19/2017 20:16 417 నాకై చీలిన యుగ యుగముల శిల ముక్తి నా కిమ్ము శ్రీ యేసువా లోక రక్షక నన్ను నీ లోపల దాగి వీఁకతోడను నుండనిమ్ము సద్గుణ శీలా ||నాకై||

  • చీలఁబడిన నీదు ప్రక్క విడిచి పారు జాలు జలము రక్తము చాల నా పాపపు తీర్పు పాపబలమ్ము చాలు రూపును మాపి నన్నుఁ బావనుఁ జేయు ||నాకై||

  • నీదు న్యాయంబగు ప్రామన్య విధులను నాదు సత్కృతి తృప్తిగా నాదరింపవు పారమార్థకమైనట్టి నాదు నాసక్తి బాష్పమును బారిన నాకు ||నాకై||

  • నేను జేసిన పాపములఁ ద్రుంప నెవరిని గాన నేరను యేసువా దీనుఁ డనై వచ్చి నీ మేటి సిల్వను మానక నే హత్తుకొనియెద సచ్చరిత ||నాకై||

  • కట్టఁ బుట్టము లేక పుట్టముకై యాశ బుట్టి నీ యెడ వచ్చితి నెట్టి సహాయము లేక నీపై మదిఁ బుట్టి నీ సత్కృఋపఁ బొందఁజూచెద నయ్య ||నాకై||

  • పరమకల్మషుఁడనై నే నీటి ఋగ్గకుఁ బరుగు లెత్తెద నిప్పుడు పరమ పావన నన్ను( గడుగుము లేకున్న మరణ మొందుదు నేను ఘోర పాపవిదూర ||నాకై||
  • 418 ముక్తిఁ గన 10/19/2017 20:16 418 ముక్తిఁ గనరే మీ మనంబుల శక్తిగల రక్షకుని పలుకులు ముక్తిసాధన ములకు మూలము భక్తిగొని యానంద మొందరే ||ముక్తి||

  • పాపభారము క్రింద శ్రమపడు పాపులారా రండు నేనే ప్రాపు నెమ్మది మీకిడుదునని పరమరక్షకుఁ డాన తిచ్చెను ||ముక్తి||

  • ఇచ్ఛయించెడు వాఁడు యిచటికి వచ్చి జీవజలంబు రుచిగా పుచ్చు కొనుగా కనుచుఁ బల్కెను సచ్ఛరితుఁడు మనుష్య పుత్రుఁడు ||ముక్తి||

  • ఆకసమునందుండి యిటు దిగి లోకమునకుఁ జీవము నొసఁగునది ఈ కడనె యున్న దది నేనను యేసు ప్రభు వాక్కు మధురాన్నము ||ముక్తి||

  • నేనె మార్గము నేనె సత్యము నేనె జీవము నావలననే గాని యెపఁడును తండ్రి యొద్దికి రానలవిగాదని వచించెను ||ముక్తి||

  • జీవజలము నుద్రావుటకు మీ భావన లనెడి పాత్ర ముంచుచు చేవఁ గొని పానించుచు నిరత జీవమును వెలుఃగొంది బ్రతుకను ||ముక్తి||

  • ఎక్కడను యిటువంటి ప్రభువును మక్కువను వేసారి వెతకిన చిక్క(బో డిటువచ్చి జూడుడి గ్రక్కునను జేసట్టు డిప్పుడే ||ముక్తి||
  • 419 యేసూ నా యా 10/19/2017 20:16 419 యేసూ నా యాత్మ రక్షకుండ నన్ను వాసిగా నీ రొమున నుండఁ జేసియు జల రాసులను నీవు తీసివేయుము మోసములఁ ద్రోసి ||యేసూ||

  • జీవబాధ నే దాఁటుదాఁక నన్ను నీవె దాఁచము నా రక్షక రూపునకు నడ్పి ప్రోవు మో యేసు దేవ యాత్మను జీవమును జేర్చు ||యేసూ||

  • ప్రాపు లేని నా యాత్మన్ నీవు నీదు దాపునకుఁ జేర్చి ప్రోచి కావు మో పరమాత్ముఁడా యోపికతోఁ జూచి యాపదలఁ బాపి యాదరించుము ||యేసూ||

  • నా నమ్మకము నీ యందున్నది నీలో నేను గోరు సాయంబున్నది గాన నేఁ బ్రాపు లేని నా తలను బూని రెక్కల లోన గప్పుము ||యేసూ||

  • యేసు నీవే నాకు సర్వము నీదు దాస జనుల లేవనెత్తుము నీ సుబల మిమ్మో యేసు రోగులకు వాసిగాఁ జీకు వారలను నడ్పి ||యేసూ||

  • నా వంటి ఘోరపాపి యేడి యేసు నీవంటి పరిశుద్ధుఁ డేడి కేవలము సత్య భావముతో నిండి నీవు కృపగల దేవుఁడవు స్వామి ||యేసూ||

  • నీదు కృపా బాహుళ్యమందు యేసు నాదు పాపము గప్పుకొందు సాదరం బగు నీదు మాటల మోదమున శుద్ధి పాదుకొననిమ్ము ||యేసూ||

  • నీవు నిత్యజీవపు టూటవు నాకు జీవజలంబు నిచ్చి కావు మీపు నా యెదలోఁ గావఁగ లేచి జీవపదవికిఁ ద్రోవ దీయుమా ||యేసూ||
  • 420 యేసు కరుణ 10/19/2017 20:16 420 యేసు కరుణ యిదియే మా శరణు యేసు కరుణ ||

  • యేసుని కరుణ యిదే మాకు శర ణని యాసతో నమ్మిన యధముల కెల్ల ||యేసు||

  • ఎన్నిక సేయక యే పాపి నైనను మన్నించి బ్రోచెడు మా దేవుఁడైన ||యేసు||

  • పశ్చాత్తాపము నొందు పాపుల నెల్లను నిశ్చయముగఁ బ్రోవ నిపుణుఁ డై యున్న ||యేసు||

  • దిక్కు లేకున్నటి దీన జనాత్ములఁ జక్కఁగఁ బ్రోచెడు సదయుఁ డైయున్న ||యేసు||
  • 421 శరణుఁ జొచ్ 10/19/2017 20:16 421 శరణుఁ జొచ్చితి యేసునాధుఁడ శక్తిహీనతఁ గల్గె నా దరణ మిమ్మిల నెవ్వఁ బొందితి దవ్వుసేయక కావవే ||శరణు||

  • కరుణఁ జూడుము కన్న తండ్రివి కల్మషం బెడఁబాపవే మరణ మొందక మున్ను నన్నిల మార్పు నొందఁగఁ జేయవే ||శరణు||

  • మొరను జెచ్చెర నాలకించుచు మోము నా దెసఁ జూపవే యురు పదంబుల సేవఁ జేసెద నుద్ధరించుము కూర్మితో ||శరణు||

  • తామస క్రియలందు వాంఛలు తాకకుండగఁ జేయవే క్షేమమైన సువార్త బోధల సిద్ధపడి విననీయవే ||శరణు||

  • శ్రమలు చాల కల్గి యున్నను సైఁప నేర్పుము సత్కృపన్ గమిలి పోయెడి మాయ లోకపు గాంతి నీరస మంచు నీ ||శరణు||
  • 422 యెహోవ నా క 10/19/2017 20:16 422 యెహోవ నా కాపరి యిఁకఁ గొదు వేమి ||యెహోవా||

  • పచ్చిక చోట్లలోఁ బండఁ జేయును నన్ను స్వచ్ఛజలముల కడకుఁ జక్క గా నడిపించు ||యెహోవా||

  • ఆయన దయతో నా యా యాసములఁ దీర్చి న్యాయమార్గములందు ననుఁ బట్టి నడిపించు ||యెహోవా||

  • గాడాంధకార మా ర్గమున నేఁ దిరిగినను గాఢంపు గృపతోడఁ గరుణించు నన్నెపుడు ||యెహోవా||

  • నీవు తోడై యుండ నిర్భయం బగు నాకుఁ కావవచ్చును దుడ్డు కఱ్ఱయును దండంబు ||యెహోవా||

  • నా శత్రువుల నడుమ నాకు భోజన మొసఁగి యాశ తీరంగఁ ద లంటె నూనెను బోసి ||యెహోవా||

  • నా గిన్నె నిండెను నా బ్రతుకు దినములలో బాగుగా నీదు కృపా దయలు వెంటాడు ||యెహోవా||

  • పరమానందముతోడఁ బ్రభు సన్నిధానమునఁ పరిశుద్ధాలయమందే నిరతంబు నివసింతు ||యెహోవా||
  • 423 సర్వశక్తుఁ 10/19/2017 20:16 423 సర్వశక్తుఁడ నిర్మలాత్ముఁడ సర్వజనసంరక్షకా మా సర్వపాపముఁ బరిహరింప నీ సర్వమహిమను విడితివా ||సర్వ||

  • నిత్యనాశనమగ్నులగుమా నిత్యశాపముఁ బాపి మరి నీ నిత్య జీవము మాకునీయను మృత్యు బాధలు పడితివా ||సర్వ||

  • పాపమరణపు బంధకములనుఁ దెంపి మము విడిపించుటకు మా పాపమును భరించి మాకై యాపదల పాల్పడితివా ||సర్వ||

  • మెట్టుకీబలు దుష్టులనుచే పట్టి జీవము నిచ్చితివి కా బట్టి యిఁక నీ కట్టడలలో దిట్టముగ బలపరుచుమీ ||సర్వ||

  • సత్యవిధులలో నడువనే న శక్తుఁడనో రక్షకా నీ భృత్యునికి శక్తి నిత్యమిడి నడి పింపు నీ ఘనసేవలో ||సర్వ||

  • నీదు నామము మహిమపరుచను నాదు జీవితకాలమున బహు సాధు నిగ ననుఁ జేసి సాయము నాధుఁడా నాకీయుమా ||సర్వ||

  • ప్రస్తుతము పరదేశినై ప్రచురంబుఁజేతు నీ స్తోత్రముల్ పర వస్తు ఘనరాజ్యంబుకొరకై వాస్తవముగ నిరీక్షింతున్ ||సర్వ||

  • ముక్తినుంచి నీవు రాగా శక్తితోఁ ప్రభు యేసువా యా సక్తితో నినుఁ గూడుకొని బహు యుక్తస్తోత్రముల్ జేతుము ||సర్వ||
  • 424 శరణు శరణు 10/19/2017 20:16 424 శరణు శరణు యేసు దేవా నన్నుఁ గరుణింపవే నిత్య జీవా పరమ దేవుని తనూ భవుఁడవై ధరణిలో నర రూపమైతివి నరులను రక్షింప ||శరణు||

  • దైవోగ్రమునకుఁ బాత్రుఁడను విమల భావమునకే నసహ్యుఁడను గావరించిన పాప కర్ముఁడన్ కఠినుఁడన్ జానవలసిన యట్టి స్వామి ద్రోహు డ నయ్య ||శరణు||

  • మద మత్సరమ్ములు మెండై నాదు మది నాక్రమించెను నిండై సదయుండ నీ దివ్య సర్వాజ్ఞలన్ మీరి విదితముగఁ బాపముల్ వేడ్కను జేసితి ||శరణు||

  • మోసంబులోఁ జిక్కి చాల నేను దోసంబు చేసితినిల యేసు నాధుని సిలువ నేమాత్రమైన నే నాసతోఁ జూడని యన్యాయ పరుఁడను ||శరణు||

  • నెమ్మ దించుక యైన మదిలో లేక గ్రమ్ముకొని యఘము నా యెదలోఁ ద్రిమ్మరినై భువిన్ దిరిగి వేసారఁగ సమ్మతము దొరక దో సర్వేశ నీకంటె ||శరణు||

  • నా తండ్రి యో యేసునాధా నిన్ను ఘాతఁజేసిన దేనుగాదా నీతిమాలిన పాప నీచుఁడన్ దుష్టుఁడన్ నా తప్పు క్షమియించి నన్నేలి రక్షించు ||శరణు||

  • కడుదయా శాంతస్వభావా నన్ను దడవుజేయక యేలుకోవా యొడబడి కుజనులకై యోర్చియలసటను బడి జీవమిడిననా ప్రాణ రక్షక కావు ||శరణు||
  • 425 నాధా! సముయ 10/19/2017 20:16 425 నాధా! సముయేలు రీతి నీ యామోద శబ్దము సేవకుఁడ నైన నన్ను నాతో డాలకింపనీ నాతో నీవేమందువో నే నాలించువాఁడను.

  • నీ మాట గ్రహించునట్లు దానిఁ దేటపర్చుము నిన్ను వెంబడించునట్లు నిబ్బరింపఁ జేయుము నేను నీదు గొఱ్ఱెను 'బండ నీడలో మేపు'

  • నేను స్వల్పశిష్యుడను నన్ నిరాకరింపకు నిన్నాలింప నెంత యాశ నీ వెఱింగి యుందువు ఆత్మ యక్కరల్ తీర్చు ధన్యుఁడన్ నే నౌదును

  • నాధా, నీ శబ్ద మాలింప నన్ను సిద్ధపర్చుము నీదుమాట లక్ష్య పెట్టి నిత్యసేవఁ జేయనీ నాతో నీవేమందువో నే నాలించువాఁడనే.
  • 426 నా రక్షకున 10/19/2017 20:16 426 నా రక్షకుని వెంబడింతు నన్నిటన్ ఘోరమైన కొండలైన జంకొందను సురక్షితంబుగాను నేను వెళ్లుదున్ బరమ కిరీట మొందువరకు. ||యేసున్ నేను ఎన్నఁ డెన్నడును ఆసతో నన్నిటన్ వెంబడింతును భాసురంబౌ ప్రభు వెంట కన్నుల్ మూసికొని యొక్కఁడేని వెళ్లుదున్||

  • నా యేసు తోడ వెళ్లుచుందు నెల్లడన్ ప్రయాసమైన లోయలై భయ పడన్ దయఁ జూపు యేసు నన్ను వెం డించుచో భయ మేల భువనంబులోదగన్

  • నా కాలమెల్ల యేసుసందునమ్ము దున్ భీకరింపు వాధియైన నేదాటుదున్ నా కర్తతోడ నెందునైన నేగుదున్ నాక మెక్కితండ్రిఁ చువరకున్.
  • 427 యేసూ, నా ప 10/19/2017 20:16 427 యేసూ, నా ప్రభువా, నీ ప్రేమ లేకున్న నా యాత్మ కేదియు విశ్రాంతి నియ్యదు. ||ఒక్కొక్క గంట నేను నిన్నాశించుకొందు నీ యాశీర్వాద మిమ్ము నా రక్షకుఁడా||

  • యేసూ, రేబగుళ్లు నా యొద్ద నుండుము నాతో నీవుండిన నే భయ ముండదు.

  • సుఖంబుఁ బొందఁగా నిన్నే యాశింతును దుఃఖంబు నొదఁగా నీవే శరణ్యము.

  • నీ మార్గమందున నే నడ్వ నేర్పుము నీ మాట చొప్పున నన్నున్ దీవించుము.

  • నిన్నే యాశింతును యేసూ, నా ప్రభువా నీవంటివాఁడనై నన్నుండఁ జేయుము.
  • 428 ఓ దివ్యకాం 10/19/2017 20:16 428 ఓ దివ్యకాంతి, మబ్బు కమ్మఁగా నన్నడ్పుము నాయింటి త్రోవ దప్పిపోతిని నన్నడ్పుము నాకాళ్ల జారకుండఁ గాచుచు ఒక్కొక్క మెట్టు భద్ర పర్చుమా

  • ఇన్నాళ్లు నేను కోరకుంటిని నీ శరణు స్వబుద్ధి నమ్మి తప్పిపోతిని సదా. నన్నడ్పుము గర్వము యేలె నా హృదయము మన్నించు నా గత జీవితము

  • ఇన్నాళ్లుఁ గాచియుంట వింకను నన్నడ్పుము నా నష్ట కష్ట దుఃఖ బాధలు పోఁగొట్టుము నీవల్ల నేను జయ మొందుచు నిన్ను స్తుతించి పాడుదున్ సదా
  • 429 నడ్పుమీ, మ 10/19/2017 20:16 429 నడ్పుమీ, మహా యెహోవా లోక యాత్ర యందున నీదు శక్తి నాకు దిక్కు నన్ రక్షింపఁ జేఁపట్టు దివ్య మన్నా, దివ్య మన్నా నా కాహారమై యుండు.

  • ఊటగా స్వచ్ఛజలంబు బండనుండి పారనీ అగ్ని మేఘ స్తంభాలచే నడవిన్ నన్ దాఁటించుఁ గొప్ప ప్రాపూ, గొప్ప ప్రాపూ నాకు డాలవు సదా.

  • యొర్దాన్ నది దాఁటు వేళ భీతు లెల్లఁ బాపుము మృత్యు శ్రమ లన్ని నన్ను క్షేమ కానాన్ జేర్చును స్తుతి గీతి, స్తుతి గీతి నీ కర్పింతు నిత్యము
  • 430 జీవమార్గము 10/19/2017 20:16 430 జీవమార్గమున్ యేసూ, చూపవే నీవు మాకు ముందు వేగ వెంట వత్తు మేము వేగ తండ్రి యింటికే మమ్ము నడ్పవే

  • హింస కల్గెన మమ్ము గావుమా మమ్ము కష్టకాలమందు నాదరించు భూమియందు మింటిత్రోవలో మమ్ము నడ్పవే.

  • సొంత వేదనన్ చింత కల్గినన్ అన్య హింసఁ గూర్చి యేడ్వ మమ్ములన్ సహింపనిమ్ము మేము సత్యమున్ చూడ నేర్పవే.

  • మా ప్రవర్తన చక్కపర్చుమా మాకు నెట్టి హింసలైన నీ సహాయ మిచ్చి, నేటి యాత్రకాఁగానే తలుపు దీయవే.
  • 431 ఆహా నాకేమా 10/19/2017 20:16 431 432 యేసు, మమ్మ 10/19/2017 20:16 432 యేసు, మమ్ము నడిపించు నీదు కాపు కావలెన్ నీవు మమ్మును బోషించు మమ్ముఁ జేర్చు మందలోన్ యేసునాధా, ప్రియనాధా! మిమ్ము విమోచించుమా.

  • మమ్ము నాదరించు యేసూ మాకు పాలకుండవు పాప మార్గమందు నుండి ప్రేమతో! దప్పించుమీ యేసునాధా, ప్రియనాధా! మొఱ్ఱ నాలకించుమా.

  • బీద పాపు లైన మమ్ము నీ వంగీకరింతువు మమ్మును బవిత్రపర్చి మమ్ము విడిపించుమీ యేసునాధా, ప్రియనాధా! నిన్ను నాశ్రయింతుము

  • బాల్యమందు నిన్నుఁ జేరి నిన్ను హత్తుకొందుము ప్రియ రక్షకుండ, యేసూ నీ ప్రేమఁ జూపుమా యేసునాధా, ప్రియనాధా! మమ్మింకఁ బ్రేమించుమా.
  • 433 యేసు నామం 10/19/2017 20:16 433 యేసు నామం బెత్తి పాడుదమ క్రీస్తు దాసులతో ఁ బొత్తుఁ గూడు దమ ||యేసు||

  • ఇహసంబంధుల పొందుఁ జాలింతమ మహా మహుఁడౌ దేవుని యాజ్ఞఁ బాలింతమ ||యేసు||

  • శుభవార్తర్థము లన్ని శోధింతమ యేసువిభు సత్యమిలలోన నుభవింతమ ||యేసు||

  • దోషములను బైటఁ బెట్టుదము కపట వేషభాషలఁ గ్రుంగఁ బట్టు దమ ||యేసు||

  • మన రక్షకుని పాట్లు మది నెంతమ మనసు లోపలి గర్వము లణుపుదమ ||యేసు||

  • జనుల నిందల కెల్ల నోర్చెదమ బోధ కనిపెట్టి ప్రభు చెంత నేర్చ దమ ||యేసు||

  • మానావమానముల్ భరియింతమ యోర్వ లేని గుణముల వేరుఁ బెరుకుదమ ||యేసు||

  • పరిశుద్ధాత్మను బొంద నడుగుదమ బుద్ది పరమానందము జాడ నడుపు దమ ||యేసు||

  • సకల మానవు లాత్మ సరిచూతమ యింక మొక మిచ్చకపు మాట ల్విడిచెదమ ||యేసు||

  • దినము ప్రార్థనఁ జేయ గురి యుంతమ చెడ్డ మనసు బద్ధకముపై నెదిరింతమ ||యేసు||

  • గురు బోధ స్థలికి బిరబిరఁ బోదమ బుద్ధి తిర ముంచి వాక్యార్థ మెఱు గుదమ ||యేసు||
  • 434 యేసు భక్తవ 10/19/2017 20:16 434 యేసు భక్తవరులతో ని వాసముందమ యేసుదాసు లౌదమ ||యేసు||

  • దోసములను తీగలన్ని కోసివేతమ మిగుల మోసపుచ్చు నాసలెల్ల రోసివేతమ యేసుదాసు లౌదమ ||యేసు భక్త||

  • దోసిలొగ్గి ప్రభునివేడ గాసి పడుదమ వాసిగాను యేసుమీద నాసపడుదమ యేసు దాసు లౌదమ ||యేసు భక్త||

  • జారచోర దుష్కృతములు పారవేతమ సత్య సార మెరుగ బరమ గురుని జేరు కొందమ యి(క కోరు కొందమ ||యేసు భక్త||

  • ప్రాపు లేనివారికెల్ల దా పొసంగును యేసు శాపరాసులన్ని తానే యోపి మోసెను తండ్రి దాపొసంగును ||యేసు భక్త||

  • శరణుజొ చ్చు నందరకును దురిత మెంచక ఘోర మరణ బాధలెల్ల దీర్చి పరమొసంగును స్ధిర వరము లిచ్చును ||యేసు భక్త||

  • లోక భోగముల మదిన్ని రాకరింతమ ప్రభు రాక కెదురు జూడ మన మేక మౌదమ ఇపుడె యేక మౌదమ ||యేసు భక్త||
  • 435 యెహోవా మా 10/19/2017 20:16 435 యెహోవా మా తండ్రి గాఁడ యేసుఁడు మా యన్న గాఁడ మహిమ గల శుద్ధాత్మ యిట్టి వరుసఁ దెలిపెం గద మాతోడ ||యెహోవా||

  • మోక్ష నగరు మా పుట్టిల్లు ముఖ్య దూతల్ మా స్నేహితులు సాక్షాత్కారమై యున్నపుడు లక్ష్యపెట్ట మిహ బాధలకు ||యెహోవా||

  • అబ్రాహాము దావీదు మొదలై నట్టి వర భక్తాగ్రేసరులే శుభ్రముగ మా చుట్టా లైనన్ హర్షమిఁక మా కేమి కొదువ ||యెహోవా||

  • పేతు రాది సకలాపోస్తుల్ పేర్మిగల మా నిజ వర కూటస్థుల్ ఖ్యాతి సభలో మే మున్నప్పుడు ఘనతలిక మాకేమి వెలితి ||యెహోవా||

  • తనువు బలిపెట్టెను మా యన్న తప్పు ల్విడఁ గొట్టెను మా తండ్రి మనసులో సాక్ష్యమిట్లున్న మనుజు లెట్లన్నను మా కేమి ||యెహోవా||

  • పరమ విభు జీవగ్రంథములోఁ బ్రభుని రక్తాక్షరముద్రితమె చిరముగా నుండు మా పేరు చెఱుపు బెట్టెడువా రింకెవరు ||యెహోవా||

  • కరములతో నంట రాని కన్నులకు గోచరము గాని పరమ ఫలముల్ మా కున్నపుడు సరకు గొన మిక్కడి లేములకు ||యెహోవా||
  • 436 నీదు సన్ని 10/19/2017 20:16 436 నీదు సన్ని ధానమందు ఓ నా యేసురక్షకా నాదు నాత్మ చేరి యందు నెంత తృప్తి పొందును ఎంత శ్రేష్ఠమైన బోధ నేను నేర్చుకొందును నీతి మార్గమందు నడ్వ నెంత ధైర్య మొందుదున్!

  • లోక ధనాపేక్షయైన నన్ను మోసపుచ్చదు ఇహ దుఃఖబాధ లెన నన్ను భయపర్చవు నా విరోధియైన సాతాన్ నన్ను వెంబడించినన్ నీదు సన్నిధానమందు యేసు నన్ను దాఁగనీ.

  • యేసు శరణంబువల్ల కల్గు మధురంబును నీవు రుచిచూడ వాంఛ నీకుఁ గల్గి యున్నదా? యేసు శరణంబుఁ జొచ్చు మిది నీకు లాభము ఆయన స్వరూప మిట్లు నీకుఁ గూడఁ గల్గును.
  • 437 రమ్ము శ్రీ 10/19/2017 20:16 437 రమ్ము శ్రీ యేసూ సమ్మతి నాదు మనమున నిలువ నిమ్ము నా పెదవుల నీతి అగ్నిచే నంటఁ గ్రమ్మర నా నత్తి వదలి నీ కృపఁ బొంద ||రమ్ము||

  • నిన్ను స్తుతింతు నీ కృప నెపుడు నెన్ని కీర్తింతుఁ బన్ను గ నీ కృప ని న్నెన్నఁ డెరుఁగని నరుల కన్న యేసున్నా నీ ధన్య రుధిరమె చాలు ||రమ్ము||

  • తరమె యెన్నఁగను దత్కృపను భూ నభముల నైనన్ నిరతము నీ ప్రేమ నీతి పరిమితిచే ధరఁ దేజో వాసులకుఁ గలిగించుఁ గడు వింత ||రమ్ము||

  • భవదీయ కృపను బాగుగఁ జాటి భువి నీ చిత్తమును అవిధి నెం చక తీర్చి యమిత బలముతోడ నవగతి నీతి కి రీటంబు నేఁ బొంద ||రమ్ము||

  • నేను నీ కొరకే నిత్యము బ్రతికి నిన్ను గణుతించి మానుగ 'భళా' యను మంచి వాక్యము విని దీన ప్రభుని సమా ధానములో నేఁ జేర ||రమ్ము||
  • 438 విమల హృదయ 10/19/2017 20:16 438 విమల హృదయ మిమ్ము విదితంబు నినుఁ గొల్వ యేసునాధా నీదు విమల రక్తము చేత విశదమౌ యెద నిమ్ము విశ్వనాధా ||విమల||

  • అణఁకువ క్షమశాంత మధికముగ నాకిమ్ము ఆత్మనాధా నీకుఁ బ్రణుతమౌ నా యెద ప్రభునిపీఠము జేయు మాత్మనాధా ||విమల||

  • నీ చిత్తమే యంచు నీ పాదములఁ బట్టి నిల్చియుందు నిండు నికరమౌ ప్రకటమౌ సుకరహృదయ మిమ్ము మేసునాధా ||విమల||

  • భయభక్తు లలరెడు భావంబు నా కిమ్ము జీవనాధా నన్ను లయ జీవములయందు జయశాలినిగఁ జేయు మేసునాధా ||విమల||

  • పరిశుద్ధ హృదయంబు పరమేశ నా కిమ్ము ధరణిమీఁద నన్ని తరుణములను నాకా దరణ మీవే యంచుఁ దలఁప నాధా ||విమల||

  • నీ రూపము నిమ్ము నినుఁ బోలి నేనుండ నిత్యనాధా నీదు సారూప్య మెదమీద సంపూర్తిగా వ్రాయు సత్యనాధా ||విమల||

  • ప్రేమపూరిత హృదయ మేమరక నా కిమ్ము ప్రేమనాధా యెంతో ప్రేమమౌ సుమమౌ నేమమౌ బ్రతుకిమ్ము క్షేమనాధా ||విమల||
  • 439 సంపూర్ణ పర 10/19/2017 20:16 439 సంపూర్ణ పరిశుద్ధి నిమ్ము సత్య సంపూజ్య సర్వజ్ఞ పరిశుద్ద దేవా ||సంపూర్ణ||

  • నిర్మల మనసు రంజిల్ల నిత్య పరమానందంబు నా యాత్మలో నెరపు ధరణి శ్రమల నోర్పు నిమ్ము పాప పరితాప మనుదినం బభివృద్ధిపరచి ||సంపూర్ణ||

  • విశ్వాస సమృద్ధి నిమ్ము నాదు ఈశుండ శ్రీ యేసు ప్రేమ నెంచి సం తోషంబుగ సేవించుటకు నీదు నాశీస్సు దయచేయు దాస పోషకుఁడా ||సంపూర్ణ||

  • నాలోఁ గృతజ్ఞత నింపు నన్నుఁ బాలించు ప్రభునికై బ్రతుకంగ నిమ్ము చాల తనదు మహిమఁ బొగడి సర్వ కాలంబు దన వాక్కుఁ గని పెట్టునట్లు ||సంపూర్ణ||

  • నా పాపములె యేసునాధున్ ఘోర తాపా నిర్యాణంబు లందింపఁ జేసెన్ నా పాపములకు దుఃఖింతున్ దేవ కాపాడుమీ నన్నుఁ బాపంబునుండి ||సంపూర్ణ||

  • పెక్కంత శుద్ధిని బొంది నేను ఇక్కట్లు నోడింప శక్తి నందిమ్ము చిక్కులఁ బడి యుండునపుడు నీతి లోకమం దా సక్తి మిక్కుట పరచి ||సంపూర్ణ||

  • నీ రాజ్య ప్రవేశ మంది తండ్రి యా రాజ్య శుశ్రూష నిల నేర్చునట్లు పరిశుద్ధాత్మ సహాయ మిమ్ము యేసు ధరణి నీవలె నేను వర్తించునట్లు ||సంపూర్ణ||
  • 440 తనువు నా ద 10/19/2017 20:16 440 తనువు నా దిదిగో గై కొనుమీ యో ప్రభువా నీ పనికిఁ బ్రతిష్టించుమీ దినములు క్షణములు దీసికొని యవి నీదు వినతిన్ బ్రవహింపఁ జే యను శక్తి నీయుమీ ||తనువు||

  • ఘనమైన నీ ప్రేమ కారణంబున నీకై పనిచేయఁ జేతు లివిగో యనయంబు నీ విషయ మై సొగసుగాఁ జురుకు దనముతో ఁ బరుగెత్త వినయ పాదము లివిగో ||తనువు||

  • స్వర మిదిగో కొనుమీ వరరాజ నిను గూర్చి నిరతమ్ము పాడనిమ్ము మరియు పెదవు లివిగో మహనీయమైన నీ పరిశుద్ధ వార్తతో ఁ బరి పూర్ణముగ నింపు ||తనువు||

  • వెండి పసిఁడి యివిగో వీస మైనను నాకై యుండవలె నని కోరను నిండైన నీ యిష్ట నియమంబు చొప్పున మెండుగ వాడఁ బరి మితయౌ జ్ఞానం బిదిగో ||తనువు||

  • నా యిష్ట మిదిగో యిది నీ యిషముగఁ జేయ నా యిష్ట మిఁకఁ గాదది నా యిచ్ఛ యున్నట్టి నా హృదయ మిదిగో నీ కే యియ్యది రాజ కీయ సింహాసనమౌ ||తనువు||

  • ఉన్న నా ప్రేమ నీ సన్నిధానమున నే నెన్నఁడు ధార వోయన్ నన్ను నీ వానిగ నాధా గైకొను మపుడు చెన్నుగ నీ వశమై స్థిర ముగ నుండెదఁ ||తనువు||
  • 441 నావన్ని యం 10/19/2017 20:16 441 నావన్ని యంగీకరించుమీ దేవా నన్నెపుడు నీవు కరుణించుమీ నావన్ని కృపచేత నీ వలన నొందిన భావంబునను నేను బహు ధైర్య మొందెద ||నావన్ని||

  • నీకు నా ప్రాణము నిజముగా నర్పించి నీకు మీఁదుఁగట్టి నీ కొరకు నిల్పెద ||నావన్ని||

  • సత్యంబు నీ ప్రేమ చక్కఁగా మదిఁ బూని నిత్యంఉఁ గరముల నీ సేవఁ జేసెద ||నావన్ని||

  • నీ సేవ జరిగెడు నీయాలయమునకు నాసచే నడిపించు మరల నా పదములు ||నావన్ని||

  • పెదవులతో నేను బెంపుగ నీ వార్తఁ గదలక ప్రకటింపఁ గలి గించు దృఢ భక్తి ||నావన్ని||

  • నా వెండి కనకంబు నా తండ్రి గైకొనుమీ యావంతయైనను నాశింప మదిలోన ||నావన్ని||

  • నీవు నా కొసఁగిన నిర్మల బుద్ధిచే సేవఁ జేయఁగ నిమ్ము స్థిర భక్తితో నీకు ||నావన్ని||

  • చిత్తము నీ కృపా యత్తంబు గావించి మత్తిల్లకుండఁగ మార్గంబుఁ దెలుపుము ||నావన్ని||

  • హృదయంబు నీ కిత్తు సదనంబుగావించి పదిలంబుగా దానిఁ బట్టి కాపాడుము ||నావన్ని||
  • 442 జీవితాంతము 10/19/2017 20:16 442 జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని నీవు నాతో నుండి ధైర్యము నిచ్చి నడుపుము రక్షకా ||జీవితాం||

  • ఎన్ని యాటంకంబులున్నను ఎన్ని భయములు కల్గిన అన్ని పోవును నీవు నాకడ నున్న నిజమిది రక్షకా ||జీవితాం||

  • అన్ని వేళల నీవు చెంతనె యున్న యను భవమీయవె తిన్నగా నీ మార్గమందున పూనినడచెద రక్షకా ||జీవితాం||

  • నేత్రములు మిరుమిట్లు గొలిపెడి చిత్రదృశ్యములున్నను శత్రువగు సాతాను గెల్వను చాలు నీ కృప రక్షకా ||జీవితాం||

  • నాదు హృదయమునందు వెలుపట నావరించిన శత్రులన్ చెదర గొట్టుము రూపుమాపుము శ్రీఘ్రముగ నారక్షకా ||జీవితాం||

  • మహిమలో నీవుండు చోటికి మమ్ము జేర్చెదనంటివే ఇహము దాటినదాక నిన్ను వీడనంటిని రక్షకా ||జీవితాం||

  • పాప మార్గము దరికి బోవక పాత యాశల గోరక ఎపుడు నిన్నే వెంబడింపగ కృప నొసంగుము రక్షకా ||జీవితాం||
  • 443 శ్రీ యెహోవ 10/19/2017 20:16 443 శ్రీ యెహోవా నీ కొసంగెద శ్రేయ మొదవఁగ నాదు సంపదఁ బాయక నీ సమ్ముఖమ్మున నే యెడ నివసింతు భక్తితో ||శ్రీ||

  • అడఁకువతో నీ పాదములఁబడి యొడయుఁడా నావెల్ల నీకిడి తడవు చేయక కొల్తు నిన్నుఁ దండ్రి నన్నంగీకరించుమి ||శ్రీ||

  • నీవు నా రాజువు నిరతము నేను నీ బిడ్డను నిశ్చయము పావనాత్ముని యెదుట నాదు జీవ మిడుదు సజ్జీవనముకయి ||శ్రీ||

  • ప్రభువరా యర్పించుకొందు భక్తితోడ నన్ను నిందు శుభప్రదము లగు శక్తులతో నను సొంపుమీరఁగ నింపు స్వామీ ||శ్రీ||

  • మహిమస్తుతులు చెల్లు నీ నా మంబునకు నిత్యంబుగా న న్నిహ పరంబుఁ బ్రోచువాఁడ నీవె సుమ్మా లోక రక్షకా ||శ్రీ||
  • 444 జ్యోతిగ మమ 10/19/2017 20:16 444 జ్యోతిగ మము జేయుమో దేవా యీ లోకమున నీ ఖ్యాతి నిలుపగ జేయుమో దేవా జ్యోతిగ మము జేసి మాలో క్రీస్తు మార్గము బయలు పరచి నీతి ప్రేమలతోడ హృదయము నింపి మమునడిపింపు మయ్యా ||జ్యోతిగ||

  • మా కుటుంబము లోన నీ వెలుగు ప్రసరించు నట్లుగ నాదు బ్రదుకును శుద్ధి జేయుమయ్యా మా కుటుంబములోని వారలు మానకను నీ వెలుగు జూపగ మమ్ము నీ మార్గంబునందున మనుప పరిశుద్ధాత్మ నిడుమా ||జ్యోతిగ||

  • సంఘమున నీ కీర్తి కనపడగ పరిశుద్ధ సహవాసంబులో నను వృద్ధి జేయు మయా భంగపరచెడి కక్షలన్నిటి బాధపరచెడి శక్తులన్నిటి పార దోలగ శక్తినిడి నీ భక్తి కాంతిని జూపి నాలో ||జ్యోతిగ||

  • నిన్ను దెలియని యాత్మ లెన్నెన్నో మా చుట్టునున్నవి నీ కొరకు కనిపెట్టుచున్నవయా అన్నివేళల నీ సువార్తను అందరికి ప్రకటింప మనసున నాశనిడి నీ వార్త వెలుగును అన్ని దిశలకు జాటునట్లుగ ||జ్యోతిగ||

  • సమయమును వరముల నొసంగితివి మా రక్షకా ధన సంపదను నీవే యొసంగితివి విమల జీవితమందు వానిని విరివిగా నితరుల కొసంగి వీర త్యాగార్పణములతో నీ వెలుగు ప్రసరింపంగజేయను ||జ్యోతిగ||
  • 445 నేను నీ వా 10/19/2017 20:16 445 నేను నీ వాఁడను దేవా నిక్కంబుగ నేను నీ వాఁడను దేవా వీనుల నీ ప్రేమ వివర మాలించుచు మేను నాత్మయు నిత్తు మేలొసఁగు నీకిపుడు ||నేను||

  • ఘనుఁడ వైన నీవు గలిగించితివి నన్ను మనుజ లోకమునందు నిను నేను సేవింప ||నేను||

  • నాకు నవసర మౌన నానా వస్తువు లిచ్చి నీ కటాక్షము నన్ను నిల్పుచున్నది గాన ||నేను||

  • నా దోషముల నుండి నన్ను రక్షింపను నీదు పుత్రుని ప్రేమ నిండార నొసగితివి ||నేను||

  • నే నఘముల చేత నిజముగఁ జావఁగ నీ నెనరుచే నన్ను నీవు బ్రతికించితివి ||నేను||

  • నా తనువు నాత్మయు నాకుఁ గల్గిన వన్ని నా తండ్రి యిచ్చితివి నాకు నీ కృప చేత ||నేను||
  • 446 యేసు! నా స 10/19/2017 20:16 446 యేసు! నా సిలువ నెత్తి యిప్పుడు నే నీ సుమార్గముఁ బట్టితి నా స్వజనము లనాదరంబునఁ త్రోసినను పగజేసిన నా సమస్తము నీవెగా యిక నే సరకుగొన నేమియున్ ||యేసు||

  • ఎన్ని శ్రమలు వచ్చిన లోకపు టాశ లన్ని భిన్నము నొందిన నన్ను ఖిన్నునిజేయ నేరవు సన్నుతుండును స్వర్గము నన్ని నావైయున్న విగ నిఁక నన్నుఁ గదుపున దెవ్వరు ||యేసు||

  • ఆపదల్ ననుఁ జుట్టినఁ జేరుదు నే నో పరాత్పర రొమ్మునఁ బ్రావ కుండవు పతితుఁడై నీ దాపు జేరిన వానికిన్ దాప మాపుచు సంతసంబిడి ధన్యుఁ జేయుదు వీవెగా ||యేసు||

  • నినుఁ బ్రేమించెడు తండ్రిని నా యాత్మా నిను రక్షించిన క్రీస్తును గనుమునిన్నుఁ జొ చ్చిన ప్రియాత్మను ఘన త్ర్యేకుని నిత్యమున్ గొనుము రక్షణ, పాపము చింతను విడిచి యిం కెన్నఁడున్ ||యేసు||

  • విశ్వాస కవచంబును మేను నిడి విజ్ఞాపనము చేయుము శాశ్వతంబగు రాజ్యమునకును సదయుఁడౌ ప్రభువు నడుపు విశ్వసితము లభించునట నీ విన్నపము స్తుతి యౌనుగా ||యేసు||
  • 447 సృష్టిపితా 10/19/2017 20:16 447 సృష్టిపితా సర్వోన్నతా సమర్పింతున్ సర్వస్వమున్

  • భూమి ఆకాశము నీవే భూధర శిఖరములు నీవే భూ ప్రజలు నీవారే బలశౌర్యములు నీవే ||సృష్టి||

  • మా వెండి బంగారములు నీవే మాకున్న వరములు నీవే మా దేహముల్ మా గేహముల్ మా జీవితము నీవే ||సృష్టి||

  • వెలలేని గాలి వెలుతురులు విలువైన పాడి పైరులు వివిధంబులైన దీవెనలు నీ కరుణా వర్షములు ||సృష్టి||

  • పరిశుద్ధ గ్రంథపు పలుకులు పాలోక తేనె చినుకులు ప్రభు యేసుని మాటలు మా వెల్గు బాటలు ||సృష్టి||

  • మాదంత నీదే మహా దేవా మా రాజువయ్యా యెహోవా మా తనువుల్ మా బ్రతుకుల్ మా యావదాస్తి నీవే ||సృష్టి||

  • మేమిచ్చు కాన్క యేపాటిది? యే ప్రేమ నీకు సాటిది? మోక్ష నాధా యేసుప్రభో అంగీకరించువిభో ||సృష్టి||

  • తండ్రి కుమార శుద్ధాత్ముడా త్రియేక దేవ స్తోత్రముల్ దాత వీవే నేతవీవే దేవాది దేవుండవే ||సృష్టి||
  • 448 కొనుము మా 10/19/2017 20:16 448 కొనుము మా హృదయంబు లను నీకర్పించెద మనయము నుతి యించుచు ఘనముగాఁ గృపచేత మముఁ గా చినను మే మెంతయు ననర్హుల మనుచు నీ పాదముల కెరగుచు ననిశమును నీ కృపఁ దలంతుము ||కొనుము||

  • బలహీనులము మేము బలవంతుఁడవు నీవు బల మిచ్చి మము నడుపుము ఇలను మే మిఁక బ్రతుకు దివనం బులను నీ పద భక్తిచే నెపుడలయ కుండగ మమ్ముఁ గడు ని ర్మలిన హృదయులఁ జేసి కరుణను ||కొనుము||

  • ఘోరారణ్యము భువి వి చార సంకలితము భూరి భయంకరము దారి లేదిఁక నీవు దప్ప వేరె సాధన మెచెటఁ గానము కోరి మము నందరిని నీదరి జేరుకొను మార్గమును జూపు ||కొనుము||

  • గత వత్సరమున నీ యతులమౌ కృపచేత పతితుల మముఁ గాచితి వతి వినమ్రుల మగుచు మామా మతులలో నీ ప్రేమఁ దలఁచుచు మతి విహీనతే వీడి యిఁక నిను సతతతము సేవింతు మయ్య ||కొనుము||

  • ఈ వత్సరంబున నెవ్వరు మాలోన పోవుదు రిలను విడిచి దేవ వారలు భువిని వదలి పోవు కాలమునందుఁ దిన్నని త్రోవలో వారలను సుఖముగఁ బ్రోవఁ దొడ్కొని పోవు మయ్య ||కొనుము||

  • మమ్మును విశ్వాస మార్గమందున దోడ నిమ్ముగఁ గొని పోవుచు నమ్ము నీ ప్రియ సేవకుల బృం దమ్మునకు సిద్ధంబులగు మకు టమ్ములను మే మొందుటకు వే గమ్ముగాఁ బాత్రులను జేసి ||కొనుము||

  • శోధనల యందున బాధల యందున నోదార్పు మా కొసఁగుము శోధనలచే మాకు మరియును శుద్ధమగు హృదయంబు లిచ్చుచు శోధనల్ ఫలియిపంఁ జేయుము బాధకమ్ములు గాక యుండఁ ||కొనుము||

  • ఈ లోక దుఃఖము లెల్ల నేగిన పిదప నీ లోకమును జేరఁగఁ పాలుమాలక మేము మామా పరుగు నెత్తఁగు సాయ మిమ్మో యేలికా నీ కరములను మ మ్మెపుడు గొని నడువంగ నేర్పు ||కొనుము||

  • దురితంబు లెల్లను గరుణచేఁ గడిగి నీ పరమందు మము జేర్పుము నిరతమును మే మచట నీ కృప విరివి నెంతయు బొగడుచును మా కరములను బంగారు వీణెల వెరవుగాఁ గొని మీటుచుందుము ||కొనుము||
  • 449 నీ చిత్తం 10/19/2017 20:16 449 నీ చిత్తం బేను నీ చిత్తంబే నేను మట్టిని ఓ కుమ్మరీ! నీ కోర్కెదీర నన్ దీర్చుమా నీకు లొంగెదన్ ఓ ప్రభువా ||

  • నీ మార్గంబేను నీ మార్గంబే నేడు నన్ను పరిశోధించు శుద్ధిజేయుమో యేసూ నన్ను నీ సన్నిధిలో మోకరింతున్ ||

  • నీ కోర్కె యేసు నీ కోర్కెయే నే గాయంబొంది అలసితిన్ బాగుచేయు నన్ ముట్టిప్రభో నీకే సమస్త శక్తి నొప్పున్ ||

  • నీ యిష్టంబేను నీ యిష్టంబే నీ యాత్మతోడ నన్ నింపుమా నాయందెల్లరు క్రీస్తుంజూడన్ నీ యాధీనంబు నన్నుంచుకో

  • అప్పుడు నేను నీ రీతిగాన్ తప్పకజేతు నో ప్రభువా ఇప్పుడే నీదు సేవ జేయున్ అప్పగింతు నా సమస్తంబు ||
  • 450 నాదు ప్రాణ 10/19/2017 20:16 450 నాదు ప్రాణ మోప్రభో, నేను నీకర్పింతును. నాదు చేతు లెప్పుడు నీదు సేవఁ జేయనీ నాదు కాళ్లు లెస్సగా నీదు త్రోవఁ బోవనీ నాదు స్వర మెన్నఁడు నీదు స్తుతిఁ బాడనీ

  • నాదు నోరు నిత్యము నీదు బోధఁ బల్క నీ నాదు సొమ్ము సొత్తులు నీకు నిత్తు నెప్పుడు నాదు కాల మంతయు నిన్నుఁ బ్రస్తుతింపనీ బుద్ధి పూర్వకంబు నిన్ను నేను కొల్వనీ.

  • సొంత మేలుఁ గోరక నీదు కీర్తిఁ గోరుదు నాదు నంతరంగము స్వీకరించి యేలుము నాదు నిండు ప్రేమను నీకర్పింతు నెప్పుడు నన్ను నీదు సొత్తుగా నీ వంగీకరించుము.
  • 451 సర్వచిత్తం 10/19/2017 20:16 451 - 452 సమృద్ధి జీ 10/19/2017 20:16 452 సమృద్ధి జీవము సంపత్తి నాకుఁగా సంతప్త మొందుచుఁ చావును బొందితి నాకై చావొందితి నీకై యేమి చేతున్?

  • నెమ్మయిన రాజ్యము నేనొందు లాగున నీ నెత్రు కార్చుచు నీ ప్రాణ మిచ్చితి నా యాత్మఁ బ్రోచితి నీకేమి యిత్తును?

  • నీ తండ్రి యింటిని నీ సింహాసనమున్ నీ గౌరవంబును నీ వన్ని మానితి యన్ని త్యజించితి నీ కేమి త్యజింతున్?

  • నాశంబునుండి నన్ రక్షించుటకును లెక్కింప శక్యము కాని విచారమై నీ శ్రమ లోర్చితి నీకై నేనోర్తునా?

  • నా పాప మన్నింపున్ రక్షణ్య మార్గము అక్షయ భాగ్యము నాశించి తెచ్చితి నా కన్ని తెచ్చితి నీకేమి తెచ్చెదన్?
  • 453 సంపూర్ణ జీ 10/19/2017 20:16 453 సంపూర్ణ జీవము సంపత్తి నాకు గాన్ సంతప్త మొందుచు చావును బొందితి నీకై చావును బొందితి నాకేమి చేతువు?

  • నెమ్మయిన రాజ్యము నీ నొందులాగున నా నెత్రు కార్చుచు నా ప్రాణమిచ్చితి నా ప్రాణమిచ్చి ప్రోచితి నాకే మిచ్చితివి?

  • నా తండ్రి యింటిని నా సింహాసనమున్ నా గౌరవంబును నా వెల్లమానితి నా వెల్లమానివచ్చితి నీవే మిచ్చెదవు?

  • చెప్పరాని బాధలన్ పొందుచు సిల్వపై చిందితి రక్తము చివ్వున బ్రోవను చింతల నీకై యోర్చితి చింతల నోర్తువా?

  • నీ క్షమాపణమున్ రక్షణ మార్గమున్ అక్షయభాగ్యమున్ ఆశించి తెచ్చితిన్ నీకై రక్షణ తెచ్చితిన్ నాకేమి యిత్తువు?
  • 454 నే నీవాఁడన 10/19/2017 20:16 454 నే నీవాఁడనై యుండఁ గోరెదన్ యేసు ప్రియ రక్షకా నీవు చూపు ప్రేమను గాంచితిన్ నన్నుఁ జేర్చు నీదరిన్ || నన్నుఁ జేర్చు చేర్చు చేర్చు రక్షకా నీవు పడ్డ సిల్వకున్ నన్నుఁ జేర్చు చేర్చు చేర్చు రక్షకా గాయపడ్డ ప్రక్కకున్ ||

  • నన్నుఁ బ్రతిష్ఠపర్చుమీ నాధా నీదు కృపవల్లనే నాదు నాత్మ నిన్ను నిరీక్షించు నీ చిత్తంబు నాదగున్

  • నీదు సన్నిధిలో నిఁక నుండ నెంత తుష్టి నాకగున్ స్నేహితుని మాటలాడెదన్ సర్వశక్త ప్రభుతో

  • నీదు దివ్య ప్రేమాతిశయము ఇహ బుద్ధి కందదు పరమందున దాని శ్రేష్ఠత నే ననుభవించెదన్
  • 455 యేసుసామి న 10/19/2017 20:16 455 456 సంతసంబున వ 10/19/2017 20:16 456 సంతసంబున వత్తు సర్వేశ్వరుని చిత్త మెంతయు నెరవేర్చను వంతలు విడి నాదు నంతరంగము కదుర నెంతో విశ్వాసమున వెంట వత్తును బ్రభువా ||సంత||

  • సురుచిరమగు మరియ సూనుని యాజ్ఞలు శిరమున నిడికొందును మరియ మనసుతో మర్తమ్మ కరములతోఁ బరమ సౌఖ్యముఁ బొంద భక్తితో సేవింతు ||సంత||

  • నారాజు సేవ దు ర్భరమై బాధగ నున్న భారంబుగను దోఁచదు సారెసారెకుఁ దనదు చక్కని చిఱునవ్వు వారించి భారమున్ ధీరత నొస గును ||సంత||

  • కారుణ్యమున నాదు కల్మషమయ హృదయ భారములను మోసితి ఆ రాజ్యమునఁగల యాస్తికై నా చిత్త మాలసింపఁగ నెత్తి యందే స్థిరముగ నుంచు ||సంత||

  • ఈ యుర్వి నేఁజేయు సేవకు ఫలములు నీ చోటఁ గనుఁగొందునే కాయం బీధర కర్మలం గరపిన నా యాస్తి నా హృదయ మాలో కమున మండు ||సంత||
  • 457 శ్రీ యేసున 10/19/2017 20:16 457 శ్రీ యేసుని వేఁడు మనసా సేవింపవే నేఁడు నీ యఘములను బాపియు నిను నెడ బాయక కడు సహాయము జేసెడి ||శ్రీ యేసు||

  • పాపంబులు వీడి పశ్చా త్తాపబంబును గూడి దాపున జేరుము దయగల ప్రభువు నీ పాపముఁ బాపియుఁ పాలించును ధర ||శ్రీ యేసు||

  • దేవుని మరువకుము దైవ సేవను మరువకుము జీవపుఁ త్రోవను స్థిరముగ నడువను పావన మనసును బ్రాపుగ నిచ్చెడి ||శ్రీ యేసు||

  • రక్తము చిందించెఁ ప్రభువు రక్తితో నీ కొరకు రక్తపు టూటల శక్తిని నమ్మిన ముక్తి కలుగును భక్తితో నీవు ||శ్రీ యేసు||

  • సిలువయే నీ ఘనము క్రీస్తు సిలువయే నీ ధనము సిలువయే భాగ్యము తులువల కెల్లను సిలువ వలననే కలుగును రక్షణ ||శ్రీ యేసు||
  • 458 ప్రభు సేవ 10/19/2017 20:16 458 ప్రభు సేవ కిదియే సమయంబు ప్రజల విమల ఫలముల నొంద నిదియే సమయంబు ||ప్రభు||

  • మరణంబు బడయక మున్నే ఘోర తరమైన పాపాత్ము లరసి గుణ పడఁగ నరక వేదనఁ బాపు కొరకు దేవుఁ డరిమురి తరి యెంతో కరుణతో నొసఁగెఁ ||బ్రభు||

  • కరుణ గల్గెడి దివసములలో నీవు పరమ భాగ్యంబులు బడయుంగ వచ్చు మరణం బెరిఁగిన జీవాత్మ యద్ది మఱచెదవి ది యెంతో అరుదై యున్నది ||ప్రభు||

  • పశ్చాత్తాపం బనెడి తలుపు మూయఁ బడుమ దేవుని కరుణా భాగ్య మను తలుపు నిశ్చయమంబుగ వేయఁబడు నెంతో యాశ్చర్యకరమౌ నవన మగుపడదు ||ప్రభు||

  • సారస్యమైన కార్యములం జేయ సమయ మనెడి తలుపు సరగ మూయబడున్ వారక మృతి బొందునపుడే గాక సార కార్యము లన్ని జక్కఁగాఁ జేయు ||ప్రభు||

  • గత దినంబులకై స్తుతింతున్ మిగుల కఠినంబులైనట్టి గండముల నుండి ప్రతి దినంబును దప్పించుచు నెంతో మితిలేని కృపచేత బ్రతికించు మనలఁ ||ప్రభు||

  • నీతియుతులగు భక్తులారా మన పాతకములకుఁ జచ్చి పరమేశ్వరుని ప్రీతి మ్రొక్కులు చెల్లించుదము నూత్న వత్సరము ప్రభు స్తుతికై బ్రతుకుదుము ||ప్రభు||
  • 459 ఎవరు క్రీస 10/19/2017 20:16 459 ఎవరు క్రీస్తు వైపు నున్నారు ఎవ రేసుని వారు రాజౌ దివ్య యేసు ప్రభుని కొరకై యెవరు సేవ చేయుచు నుందు ||రెవరు||

  • నాశనం బగు నాత్మల కెల్ల నాశ్రయ రక్షకుఁడౌ క్రీస్తు యేసును దెల్ప లోకమును విసర్జించి సేవఁజేయ ||నెవరు||

  • లయము గాని యేసు శక్తియే జయము పొందును ఆయన ప్రియమౌ సైన్యమందుఁ జేగి సయితాను నెదిరించి గెలువ ||నెవరు||

  • మరణమందు గూడ మాకుఁ గరుణఁ జూపిన యేసు నీ కొ మరులమై మేమందఱము నీ దరికిఁ జేరి యున్నాము ||ఎవరు||
  • 460 చాటుఁడి శు 10/19/2017 20:16 460 చాటుఁడి శుభవార్తను బోధకులారా చాటుఁడి శుభవార్తను జాటుఁ డి శుభవార్త సకల రాష్ట్రములలోఁ జాటించుఃడని చెప్పె ఢాటిగఁ ప్రభు యేసు ||జాటుఁడి||

  • లోకమును ప్రేమించి లోకరక్షణ కొఱకు ప్రాకటంబుగ సుతునిఁ బంపె దేవుఁడటంచుఁ ||జాటుఁడి||

  • శత్రువుల రక్షింప మిత్రుఁడుగా వచ్చి మైత్రి నసుపు నిచ్చి మరల లేచెన టంచుఁ ||జాటుఁడి||

  • ఎట్టి పాపు లైనఁ బట్టి యేసుని మాట దిట్టముగ నమ్మినఁ బట్టుగ క్షమియించుఁ ||జాటుఁడి||

  • హృదయ శుద్ధిని గోరి సదయుఁడగు రక్షకునిఁ పదిలముగఁ ప్రార్ధింపఁ పరిశుద్ధాత్మ నొసంగుఁ ||జాటుఁడి||

  • నమ్మి బాప్తిస్మంబు నెమ్మిఁ బొందిన మనుజు లిమ్ముగఁ బొందుదు రిలను ఘన రక్షణముఁ ||జాటుఁడి||

  • ఇందు నందు మికుఁ బొందుగ నొసఁగును సందియము లేకుండ సకల భాగ్యము లనుచుఁ ||జాటుడి||
  • 461 ఆత్మలను సం 10/19/2017 20:16 461 462 జయప్రభు యే 10/19/2017 20:16 462 జయప్రభు యేసునె వెంబడించుచు జయముగ నడచెదము యేసుతో జయముగ వెడలెదము ప్రియుడగు యేసుని ప్రేమను చవిగొని పయనము జేసెద మా ప్రభు వెంబడి ||జయప్రభు||

  • ఆదరణయు అధికబలమును ఆత్మఖడ్గమును అవనిలో అందరి రక్షయును ఆదర్శంబౌ ఆయన వాక్యమే అనిశము మనకిల మార్గము చూపగ ||జయప్రభు||

  • ధర విరోధులు మమ్ము జుట్టగ దరి జేరెద మేసున్ ప్రభుని దరిజేరెద మేము ధాత్రి దురాశల డంబములన్నిటి మైత్రిని వీడి నడచెద మేసుతో ||జయప్రభు||

  • మా ప్రభు జూముము నీదు మార్గపు మాదిరి జాడలను నీ దగు మాదిరి జాడలను మా పాదములను తొట్రిలకుండగ మా కిడు బలమును యీ కృపాదినమున ||జయ ప్రభు||

  • మా కొరకై నీవు నడచిన మార్గము జూడగను మేము మార్గము జూడగను మా రక్షక నీ అడుగుజాడలు మరువక విడువక నడువగ కృపనిడు ||జయప్రభు||

  • ఇహపరముల నినుగాక ప్రేమతో ఎవరిని గొలిచెదము? ఎవరిని ప్రేమింప వశమె? విహరించెదము యేసుని వెంబడి మహిమ రాజ్యమున యేసుని గొలువగ ||జయప్రభు||
  • 463 భారమైనది స 10/19/2017 20:16 463 భారమైనది సేవ మరణము కన్న భారమైనది సేవ ఘోరనరకపు దారి చేరి నడచెడివారిన్ జేరి వారితో సంప్రదించి ప్రభువును చూపి ఘోరనరకపు బాధలన్నియు కూర్మితో వినజెప్పి మోక్షపు దారికిని నడిపించి యేసుని దాపునకు నడిపించుదారి||


  • దురితదుర్గతి నశియించు వారినిజూచి పరితాప మొందవలయున్ మారమనసు నొంది చేరి ప్రభునితో కలిసి ఘోరపాపిని నేనని వేడి సిలువ ధ్యానించి దురితములను చేయనని తీర్మానములను చేసికొని రక్షింపబడినది గురుతుగ సాక్ష్యంబునిచ్చుటయే దారి||

  • ప్రథమ దశభాగంబుల ప్రభునకు నిచ్చి ప్రతిదినము ప్రార్థింప వలెన్ అధములగు బీదలకు నాధారముల నొసగి విధిగ భక్తుల నాదరించి సవరించి ప్రభువు వాక్యము చదువుకొనుచు ప్రభుని పాటలు పాడుకొనుచు ప్రభుని వేదము ప్రచురపరచి పదిలముగ జీవించకోరి||

  • దేశదేశముల తిరిగి దేవుని వాక్యము దేశప్రజలకు చాటవలెన్ ఆశాదురాశలను కోసివేసి యేసు దాసులను జేసి వెలిగించి తిలకించి యేసుభక్తుల పదిలపరచి యేసుతో పరిచయము చేసి యేసును ధరియింప జేసి యేసుతో నివసించుదారి ||
  • 464 యెహోవయే నా 10/19/2017 20:16 464 యెహోవయే నా మహాదేవుఁడని బహుగ నెఱిఁగి మన నావంతు సహదాసులతో మహి నొకఁడనని సహాయ మిడుటే నీవంతు ||యెహోవా||

  • మితిమిఱిన దు రిత సమూహముల క్షత మొనర్ప మన నావంతు పతితపావనుని క్షతజనములో నను నుతికి కడుగుటె నీవంతు ||యెహోవా||

  • ప్రతిదిన బ్రతుకును మతి నుంచుచు నిను స్తుతి యొనర్చుటే నావంతు క్షితినేఁబడుదు ర్వెతల నుండ శా శ్వతముఁ బ్రోచుటె నీవంతు ||యెహోవా||

  • చంచల మతిఁదొల గించుమంచుఁ బ్రా ర్థించుచుండుటే నావంతు అంచి తాత్మనిఁకఁ బంచి స్ధిరతను బెంచుచుండుటే నీవంతు ||యెహోవా||

  • యేసు సిలువలో నే సంధించి గాసి సహించుట నావంతు భాసురమోక్ష ని వాసమునకు నను దీసుకపోవుటే నీవంతు ||యెహోవా||

  • మేటి వార్త నా బోటి జనాళికి ఁ జాటించుటయే నావంతు చాటిన దానిని గాటముగ మది నాటించుటయే నీవంతు ||యెహోవా||

  • అనుదిన మబలుఁడ నని మదినిం గనుఁ గొని బ్రదుకుటయే నా వంతు ననుఁ బదాబ్జప జ్జనుఁ జేర్చియు బల మును గృప నిచ్చుటే నీవంతు ||యెహోవా||

  • ముదముతోడ నీ తుదిరాక కొఱకు నెదురు చూచుటే నావంతు సదమలాత్మచే హృదయమును సదా పదిలపఱచునటే నీవంతు ||యెహోవా||
  • 465 లెమ్ము తేజ 10/19/2017 20:16 465 లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది ఇమ్ముగ ప్రభుని మహిమ ఇదిగో నుందయించె నీపై ||లెమ్ము||

  • జనములు నీదు వెలుగునకు జనుదెంచెదరు గనుమ తనర నీ యుదయ కాంతికి తరలి రాజులు వత్తురు ||లెమ్ము||

  • సముద్ర వ్యాపారంబు సరిత్రప్పబడు వీవైపు అమరుగ జనుల యైశ్వ ర్యము వచ్చు నీ యొద్దకు ||లెమ్ము||

  • గొంజి దేవదారు సరళ వృక్షాలు నాలయమునకు ఎంచి తేబడు నాపాద క్షేత్రము గొప్పగజేతు ||లెమ్ము||

  • నిత్యమౌ కాంతితోడ నిన్ను వెలుంగజేతు నిత్య సంతోషమునకు నిన్ను కారణముగ జేతు ||లెమ్ము||

  • ఎంచంగ నొంటరిగాడె ఎసగు వేయిమందియై ఎంచంగ దగని నాడె ఎంతో బలమగు జనమగును ||లెమ్ము||
  • 466 కఱుణాయుతం 10/19/2017 20:16 466 కఱుణాయుతం బౌకార్యములు కనబడవలెగాదా మనలో అనవరతము మన బ్రతుకు ప్రభునికై అంకితమగునటు నలవరచుకొనగ ||కఱుణా||

  • పొరుగవాని ప్రేమింతము మనము కొరతలన్ని యిక దీరును మనకు తరుగుపడ్డదా గుణమది మనలో త్వరితగతిని సవరించుకొందమిక ||కఱుణా||

  • కుంటి గ్రుడ్డి కుష్ఠు రోగులెందరో కంఠమెత్తి ఘోషించుచు నుండ ఇంటగుడిచి సుఖియించుట న్యాయమ వంటబట్టదది స్వార్థ పర్వతము ||కఱుణా||

  • పండువంటి కాపురంబు మనది దండిప్రభుడు దయచేసెను మనకది బండు లోడలౌ ఓడలు బండ్లౌ ముండ్ల కిరీటము ముందు బెట్టుకొని ||కఱుణా||

  • మనుజులందు గలవు రెండు తెగలు వినుము పుచ్చుకొనెడువారి దొక తెగ మనసు దీర నిచ్చువారిదొక తెగ గనుమ మనస నీవెందుగలవొ యిక ||కఱుణా||

  • కఱుణ రసము మాకుప్రభువా కలుగను కృపా నిమ్మా యెపుడు అరమర లేకను అన్ని సమయముల నందర ప్రేమను జూడగ నడుపుమ ||కఱుణా||
  • 467 రేపు మాపు 10/19/2017 20:16 467 రేపు మాపు గూడరమ్య మైన గింజల్ ప్రీతితోను జల్లి వేచియుందము కాపుతోడ నుండి దాపు నుండు పంట ఏపు మీరఁ పంటఁకోసి కొందము ||పంట పండగన్ కోసికొందము కంట నీరు పోవఁ కోసికొదము||

  • సందియంబు లేల స్వామి సేవ యందు వందనంబు తోడ విత్తుచుందము కొందలంబు లేక కష్టవృత్తి చేసి యందరంబు చేరి యానందింతము

  • ప్రేమ విత్తనంబుల్ క్షేమయంకు రంబుల్ ప్రీతిన్ కాల మెల్ల ప్రాంతమం తటన్ సేమ మొప్ప నాటినాయకుండు రాఁగన్ నిండు పంటఁ కోసం గూర్చుకొం దము.
  • 468 పాపము వలనఁ 10/19/2017 20:16 468 పాపము వలనఁ చెడినవానిఁ ప్రేమతో వెతకి రక్షించుఁడు తప్పినవానిని ద్రోహిని మీరు యేసుని యొద్దకు రమ్మనుఁడు. ||పడినవారికిఁ జూపుఁడు త్రోవ యేసు పాపాత్ములన్ రక్షిం చును||

  • నీతిని కోరక యల్లాడువాని యేసు రక్షించుటకై కాచును ప్రేమతో వారినిఁ బిలుచుకొండి యేసును నమ్మిన రక్షించును.

  • పాపవిషంబు మనస్సున దాగి గుణము పూర్తిగఁ జెఱిపినన్ యేసుని ప్రేమ యనుకిరణంబు దాని గుదుర్చును పూర్ణముగా.

  • చెడినవారిని రక్షింపఁ బొండి యేసుఁడు శక్తిని మీ కీయఁగా మోక్ష మార్గంబునడిపించుండి వారిని రక్షింప యేసు వచ్చెన్
  • 469 జాగ్రత జాగ 10/19/2017 20:16 469 జాగ్రత జాగ్రత యేసుఁ డిట్లు పిల్చున్ నేఁడు పో పనిచేయి నాదు వనములో ఆయనే ముందు వె ళ్లి మా త్రోవ చూపున్ కాగ జాగ్రతతో పని చేయుదుము. ||పని చేయి, పని చేయి కోరుచు కాచుచు నూయేసు వచ్చు మట్టుకు||

  • జాగ్రత జాగ్రత నీతి నాశించెడు వారి నందరిని తృప్తిపర్చెదము యేసు సిలువ నె త్తి మాధ్వజముగ రక్షణ యుచితం బని చాటింతుము.

  • జాగ్రత జాగ్రత వచ్చి పోరాడుడీ దుష్ట సాతాను రా జ్యంబు పాడగును యేసు నామ ప్రఖ్యా తిని శ్లాఘింపుడీ ఆయన రక్షణ యుచితంబగును.

  • జాగ్రత జాగ్రత యేసు శక్తి నిచ్చున్ గెల్చువారికి జీ వ కిరీటం బగున్ మోక్షానందములో నివసించువారై రక్షణ యుచితం బని పాడెదము
  • 470 చాటించుఁడి 10/19/2017 20:16 470 చాటించుఁడి మనుష్యజాతి కేసు నామము చాటించుఁడి యవశ్య మేసు ప్రేమ సారము జనాదులు విశేష రక్షణసునాదము విను పర్యంతము. ||చాటుదము - చాటుదము చాటుదము - చాటుదము చాటుదము - చాటుదము శ్రీ యేసు నామము||

  • కన్నీళ్లతో విత్తెడువార లానందం బుతో నెన్నఁడు గోయుదు రనెడి వాగ్ద తంబుతో మన్నన గోరు భక్తులార నిండు మైత్రితో మానవ ప్రేమతో ||చాటుదము - చాటుదము చాటుదము - చాటుదము చాటుదము - చాటుదము చక్కని మార్గము||

  • సమీపమందు నుండు నేమో చావుకాలము సదా నశించిపోవువారి కీ సుభాగ్యము విధంబుఁ జూపఁగోరి యాశతోడ నిత్యము విన్పించుచుందము. ||చాటుదము - చాటుదము చాటుదము - చాటుదము చాటుదము - చాటుదము సత్య సువార్తను||
  • 471 ఓడ్డుచేరి 10/19/2017 20:16 471 ఓడ్డుచేరి నీ యెదుట నిల్పునపుడు రక్షకా ఒక్క యాత్మనైన తేక సిగ్గుపడిపోదునా. ||ఒక్క యాత్మనైన నేను రక్షింప యేసువా వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా||

  • ఆత్మలందు వాంఛలేక సోమరులై కాలమున్ వ్యర్థపరచు వారానాడు చింతతోడ నిల్తురు.

  • యేసువా! నా స్వరక్షణ నిశ్చయంబు యైనదే ఐనఫలితంబుజూడ కష్టపడనైతినే.

  • కాలమెల్ల గడ్చిపోయెన్ మోసపోతినేనయ్యో గడ్చినట్టి కాలమైతే ఏడ్చినను రాదది.

  • భక్తులారా! ధైర్యంతోడ లేచి ప్రకాశించుడీ ఆత్మలెల్ల యేసుయొద్ద చేరునట్లు చేయుడి.
  • 472 వారు భాగ్య 10/19/2017 20:16 472 వారు భాగ్యవంతు లౌదురు భూ లోకమందు వారు భాగ్యవంతులౌదురు చారు శుభవార్తా రవంబు గోరి యాకర్ణించి భక్తి మీరఁ దెలిసికొనిన యట్టి ధీరు లెవ్వ రెవ్వరో ||వారు||

  • వారు నడుచు మార్గమందున సుక్షేమ రాజి వారి ననుసరించు నెందును తేరి చూడ రాని దే దీప్యమాన దివ్యసత్య భూరి తేజ మాజనములఁ బొలుపు మీరఁ జుట్టుకొనును ||వారు||

  • విమోచకుని నామమందున దజ్జనంబుల విశ్రుతానందంబు ప్రాణముల అమందముగ హెచ్చరించు నతని నీతి రీతిఁ దజ్జ నముల కోర్కె వృద్ధి బొం దంగఁ జేయు సంతతంబు ||వారు||

  • నరులపై బిశాచమును నిందా స్థాప నంబు జేయంగలేదు పరగు ప్రకాశమును బ్రాపు నైన సర్వే శ్వరుఁడు బలము రక్షయు న వారితముగ మనకు నిచ్చు ||వారు||

  • వరగుణ ప్రశస్తులారా క్రైస్తవులారా వన్నె మీర మీ రాజు సురుచిరముగ శాశ్వతముగఁ పరిపాలించు మీ దేవుఁడు నిరతముగను జీవించు నీతి భరిత చిత్తుఁడగుచు ||వారు||
  • 473 వద్దు మనస 10/19/2017 20:16 473 వద్దు మనస బుద్ధి కురుచ పెద్దలకుఁ బెద్ద పరి శుద్ధుఁ డగు క్రీస్తు తా దిద్దు నినుఁ బ్రేమ సరి హద్దులను మీరఁబో ||వద్దు||

  • చెడ్డ తలఁపు లడ్డి నిలుపు మెడ్డెలకు నెద్దెయగు గడ్డు సాతాను నకు మెడ్డుకొని దొడ్డ ప్రభు బిడ్డవలె నడువు మిఁక ||వద్దు||

  • నింద పాలు బొంద మేలు పొందుగను అందముగ ముందు నీ యందు వెలుఁ గొందు ప్రభు సుందర ని బంధనలు మరిచ పో ||వద్దు||

  • ఆశ బెట్టు యేసు తట్టు దోసములు వాసి చనఁ జేసి నను మోసి కొను యేసు నిజ దాసులను బాసి యుండకు మిఁక ||వద్దు||

  • బెండు పడకు నిండు విడకు దండి గల తండ్రి యొడ యుండు యేసుండు నీ యండ నుండఁగ నీ గుండె దిగు లేల యిఁక ||వద్దు||

  • పట్టు విడకు దిటము సెడకు నెట్టుకొని ముట్టడిగఁ జుట్టుకొను కష్టముల బిట్టు విడఁగొట్టు ప్రభు తట్టు కనిపెట్టు మిఁక ||వద్దు||

  • మంచి గుణము లెంచికొనుము వంచనల మించి గ ర్వించి నీ దు ర్భావముఁ ద్రుంచు ప్రభు నొద్ద గురి యుంచి ప్రార్ధించు మిఁక ||వద్దు||
  • 474 యేసుని కొర 10/19/2017 20:16 474 యేసుని కొరకై యిల జీవించెద భాసురముగ నే ననుదినము దోసములన్నియు బాపెను మోక్ష ని వాసమున ప్రభు జేర్చునుగా ||యేసుని||

  • నాశనకరమగు గుంటలోనుండియు మోసకరంబగు యూబినుండి నాశచే నిలపై కెత్తెను నన్ను పి శాచి పథంబున దొలగించెన్ ||యేసుని||

  • పలువిధముల పాపంబును జేసితి వలదని ద్రోసితి వాక్యమును కలుషము బాపెను కరుణను బిలిచెను సిలువలో నన్నాకర్షించెను ||యేసుని||

  • అలయక సొలయక సాగిపోదును వెలయగ నా ప్రభు మార్గములన్ కలిగెను నెమ్మది కలువరిగిరిలో విలువగు రక్తము చిందించిన ప్రభు ||యేసుని||

  • శోధన బాధలు శ్రమలిల కల్గిన ఆదుకొనును నా ప్రభువనిశం వ్యాధులు లేములు మరణము వచ్చిన నాధుడే నా నిరీక్షణగున్ ||యేసుని||

  • బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు గుప్తమై యున్నవి ప్రభునందు అద్భుతముగ ప్రభు వన్నియునొసగి దిద్దును నా బ్రతుకంటిని ||యేసుని||

  • అర్పించెను దన ప్రాణమునాకై రక్షించెను నా ప్రియ ప్రభువు అర్పింతును నా యావజ్జీవము రక్షకు డేసుని సేవింప ||యేసుని||

  • ప్రభునందానందింతును నిరతము ప్రార్థన విజ్ఞాపనములతో విభుడే దీర్చునుయిలనా చింతలు అభయముతో స్తుతియింతు ప్రభున్ ||యేసుని||

  • యౌవన జనమా యిదియే సమయము యేసుని చాటను రారండి పావన నామము పరిశుద్ధ నామము జీవపు మార్గము ప్రచురింపన్ ||యేసుని||
  • 475 వారె మంచి 10/19/2017 20:16 475 వారె మంచి క్రైస్తవులు గదా యీ లోకమందు వారె మంచి క్రైస్తవులు గదా చేరునట్లు చేయుడి. పారమార్థమైన క్రీస్తు సారవాక్య మనుభవించు వారి దారి గోరి జేరి భూరిసుఖముఁ బడయునట్టి ||వారె మంచి||

  • కపట వేష భాష లెల్లను తొలంగఁ ద్రోచి విపుల భక్తి నిపుణు లగుచును లపితములు నసత్యములును శపధములును లేక దేవ కృప మనంబులోన వెలిగి యుపరిభాగ మరియునట్టి ||వారె మంచి||

  • నమ్మకంబు సుస్థిరంబుగా మనంబులోన సమ్మతంబు గలిగి మెండుగా క్రమ్ము కొనెడి శ్రమలయందు సొమ్మసిలక ప్రభుని పా దమ్ములందు బుద్ధి నిలిపి నెమ్మది గలవార లెవరో ||వారె మంచి||
  • 476 యేసుని సేవ 10/19/2017 20:16 476 యేసుని సేవింప దయచేసితివి ప్రేమస్వరూప యేసుని దాసులనందరిని దరి జేర్చుటకును వాసికెక్కి పరవాసము చేసెడి ||యేసుని||

  • ఆదియందు భూమ్యాకాశంబుల శక్తి ఆత్మ నింపార సృజించిన ||యేసుని||

  • శత్రువులగు జనసంఖ్యను బొడగని మిత్రుడగుచు దనమేను నొసంగిన ||యేసుని||

  • పాపులెల్ల దనప్రాపుగోరుకొని దాపుగరండని దయచేఁ బిల్చెడి ||యేసుని||

  • సకల శుభంబులు చక్కఁగ నిచ్చుచు సకలభక్తులను సమముగఁ జూచెడి ||యేసుని||

  • తన్ను నమ్ముకొని యున్న దీనులకు దన్నుగ నుండెడి సన్నుతుడగుమా ||యేసుని||

  • చక్కని గుణములు లెక్కలేక తన చక్కని యాత్మను చిక్కగఁబట్టిన ||యేసుని||

  • లోకమంతయును లోఁబడుచుండఁగ నేక ప్రభువై యేలుచుండుమా ||యేసుని||
  • 477 ఏది నా విశ 10/19/2017 20:16 477 ఏది నా విశ్రాంతి యీ లోకమందు నే దిక్కు గనుఁగొన్న లేదు సుఖ మెందు మేదురా మోద ని త్యోదగ్ర మోక్ష పుట భేదమున చొరకున్న లేదు సుఖ మెచట ||నేది||

  • కష్టములు తెరతెరలు గా వచ్చిన మదాత్మ దృష్టి దప్పక యోర్చి తీరమంద వలయున్ స్పష్టమగు నా త్రోవ పయనంబు తుద ముట్టు శ్రేష్ఠ మగు నా యిల్లు చేరు నందాక ||నేది||

  • కోరింద పొదచుట్టు కొనియుండ నిమ్ము నేఁ గోర నిచట గులాబి కుసుమ శయనంబు నేరీతినైన నా యేసు రొమ్మునఁ జేరి భూరిసుఖ మొందెద వి చార మిఁక నేల ||నేది||

  • యేసుప్రియ మించు కే నెఱిఁగి కన్గొను వేళ నా సంతసము నిండు పాసి చనె వెతలు భాసురంబుగ మంచు పగిదిఁ దళ తళలాడఁ జేసె నా కన్నీళ్లు చింత లెడఁబాపి ||యేది||

  • ఉండునే సందియము లుండునే దుఃఖములు గండములు ఢీయను చు బైకి రాఁ గలవే మెండుగా మధురమై యుండు మోక్షము నాకుఁ దండ్రితో గడియ సే పుండిననుఁ జాలు ||నేది||

  • నడుము పై నొక సంచి బడెకఱ్ఱ చేతిలో నిడికొనుచు శత్రువుల పుడమి వే గడుతున్ నడుదారి కరుకు నె న్నక వేగ రక్షింపఁ బదుదునని పాడి చని పరమసుఖి నౌదు ||నేది||
  • 478 విసుకదే ప్ 10/19/2017 20:16 478 విసుకదే ప్రాణంబు విజ్ఞాని కిలను పొసగు వైరాగ్యంబు పుట్టదే తలను అసదు గానట్టి కష్టానుభవమే గాని యసదృశానంద ఫల మొసగుఁ నది యేది ||విసుకదే||

  • మును పేది యుండెనో వెనుక నదియే యుండు మునుపు వెనుకకు మధ్య మున నున్న దదియే నొనరంగఁ గ్రొత్తయై యుత్పన్నమగు నట్టి ఘనకార్య మొక్కటియుఁ గానంగరాదు ||విసుకదే||

  • ధరణి మీఁదికి దిగం బరుఁబగుచు నేతించు మరణ మప్పుడు దిగం బరుఁడగుచుఁ బోవున్ నర్రుడు పుట్టినఁడు సరెకెద్దియును తేఁడు మరణమగు నాఁడొక్క సరకుగొనిపోఁడు ||విసుకదే||

  • ఒక తరము పోవు మరియొక తరము జనుదెంచు సకల వంశము లిట్లు సమసిపోవుచుండు నిఁక వారి పేర్పింపు లెచ్చోట నేమాయె నొకండైన చెప్పుటకు నుర్విలో లేఁడు ||విసుకదే||

  • ఏటివంకలు దీర్చ నెవ్వాని కలవి ము న్నీటి మూఁకుడు సేయ నేర్పరి యెవండు మోటైన మనసు వం పులు దీర్చు గురు వెవఁడు కోటి ధనమిచ్చినను కుంభినిని లేఁడు ||విసుకదే||

  • ధరణిలో నరరూపు దాల్చి పాపుల కొఱకు మరణమై లేచు స ద్గురు డైన యేసు చరణాబ్జముల సేవ సారమిది యొక్కటే పరమ ఫలమిడు సుఖ ప్రాప్తి యొనరించున్ ||విసుకదే||
  • 479 ఇందులేదు న 10/19/2017 20:16 479 ఇందులేదు నిలుచు పట్టణం క్రీస్తు యాత్రికులకు నిందు లేదు నిలుచు పట్టణం ||బిందు||

  • పాదుకొన్న లౌకికునకు బహుళదుఃఖ మిది మఱి సొం పై దగు మేల్ చోటు వెదకు భక్తుఁడ వెత నొంద కెప్పు ||డిందు||

  • మాకు నిల్లి దైన దుఃఖ మౌకదా వచ్చు పురము దాకొనంగ వెదకె దము ధైర్య మిచ్చు నిదియె మాకు ||ఇందు||

  • మనము యాత్ర వారి వలెనే ఘనత విశ్రమంబులేక కినుక నీలోక మునను గ్రింది వన్ని వదలు దాము ||ఇందు||

  • మిగుల యాత్ర పరులవిశ్ర మించు సౌఖ్య వాసమా ఖగము వలెనే టెక్కలున్న నెగిరి నిన్నుఁ జేరుకొందు ||ఇందు||

  • సద్దు నాయాత్మ నణంగ వద్దు తగిన వేళగామి యొద్ది కతని తలఁపు జేతుఁ నొసఁగు విశ్రమం బతండె ||ఇందు||
  • 480 లోకము వారె 10/19/2017 20:16 480 లోకము వారెల్ల లోకువఁ జూచిన లోపము నీకేమిటి ప్రాకట ముగఁ గ్రీస్తు పతిత పావన మూర్తి నీకోసమై ముక్తి నిలయము గట్టంగ ||లోకము||

  • దరిలేని దురిత దుస్తర పారావారము దాటించు వారెవ్వరు భీకరమైన నరకాగ్ని బెట్టు బిం ధుర దేవకోపాగ్ని మరలించు వారెవ్వరు చంచల బుద్ధి స్ధిరపరచి పరమార్ధ మెఱిఁగించి చిరముక్తి గురి దెల్పు వారెవ్వరు ఈ ధరలోన నరరూపుఁ దాల్చి నీ కొఱకై జీవన మిచ్చు కరుణాబ్ధి క్రీస్తుఁడు వరదుఁడై యుండంగ ||లోకము||

  • మాటి మాటికిఁ బాప మార్గమునఁ జనుచుండ మది ద్రిప్పు వారెవ్వరు సైతానుని తాటించి మరి వాని కేటించి యభయ హ స్తము నిచ్చు వారెవ్వరు మృత్యువు ముల్లు మీటించి సుఖమాత్మ నాటించి తన యోర్మి చాటించు వారెవ్వరు యెరుషలేము బైట కల్వరిమెట్టు పై మేను బలియిడిన మేటి క్రీస్తుని నామా మృతము నీకుండంగ ||లోకము||

  • హృదయ సంతాపదుః ఖ దురంతమగు చింత ల్వదిలించు వారెవ్వరు నెమ్మది నిచ్చి పదిలమ్ముతో మోక్ష పద మిదుగో యంచు పదమను వారెవ్వరు ఎన్నడు నిన్ను వదలి వెయ్య మంచు మృదువాక్యములు తెల్పి ముద మిచ్చు వారెవ్వరు నింకొక నాఁడు సదయుఁడై క్రీస్తుఁడు చనుదెంచి నిను ముక్తి సదనస్థునిగఁ జేయు శాస్త్రోక్త మిటులుండ ||లోకము||
  • 481 చాలును లోక 10/19/2017 20:16 481 చాలును లోక భోగములు చాలును చాలును మీనమును బట్టు గాలమైయున్న భోగములు ||చాలును||

  • ఎండమావులే నీరనుచు మెండుగఁ బరుగిడు జింక కుప మండనై బలహీను నైతిఁ ||చాలును||

  • బూరుగ పండారగింపఁ గోరి కాచికొని యున్నట్టి కీరసామ్య మైతి నయ్యో ||చాలును||

  • దీపపు దీప్తి నాశించి యూపిరి విడు పురుగు రీతిఁ బాపపు భ్రమచే నట్లయితిఁ ||చాలును||

  • పూలతో ఁటయందుఁ బెరుగు బూరుగ వృక్షంబునై నే మేలునకు మూలముగాన నైతిఁ ||చాలును||

  • చల్లిన వితనము ల్జంపు చౌట భూమి వలె నేఁ గాఁగ సత్యము నిష్ఫలమయ్యొ నకట ||చాలును||

  • మాయ సంత నైతి యేసు నాయక నన్విడక మార్పు జేయుమి నెన రుంచి నాపైఁ ||చాలును||

  • తొల్లి నన్ రప్పించినట్టి చల్లని సువార్త తేజ ముల్లమందు నుండఁ జేయ ||చాలును||

  • మంచు పోల్కె ననుఁ జేయుటకై ముంచుమీ నీ రక్తాంబుధిలోఁ బెంచుమి నీ వాక్సారము చేఁ ||చాలును||

  • చెడ్డ బిడ్డ నయ్య నేను దొడ్డ రక్షకుండ వీవు అడ్డులేక నన్నుఁ బ్రోవు ||చాలును||
  • 482 పదరే సోదరు 10/19/2017 20:16 482 పదరే సోదరులార పమ్మపురిఁజేర మధుర జీవాధార పదవిచేకూర తుది మొదలును ఆపద రేబగలు లేని సదనంబునకు జేర సదయు డేసునిఁ గూడి ||పదరే||

  • ఎన్ని దినములు బ్రతుకు నేమి సౌఖ్యంబు అన్ని విధముల జూడ నధిక కష్టంబు కన్ను మూసిన నాఁడు మన్ను పాలౌదుము మున్ను జాగ్రత్తనొంద కున్న నష్టము గల్గుఁ ||బదరే||

  • ధరణి బ్రతుకును గోర మరణ భయంబు దరీలేని చింతలఁ దగిలి నిత్యంబు పరి పరి విధముల పరుగు లెత్తుట లేల నిరతంబును సువార్త సరణిఁ గన్గొని వడిగఁ ||బదరే||

  • ధనము సంపాదించి ఘన మదిక మున్న తనువే సతము గాదు అను భవము సున్న ఇనుఁ డెంద మావు లను గోర నేపాటి తనివి దీరు నిచ్చో టను నా పాటే దీరుఁ ||బదరే||

  • పరలోక మార్గం బిరుకై గన్పడును జొరగా సంకటములు నెరిజుట్టుకొనును పరమ జనకుని కృపా వరము తోడుగ నున్న వెరపు నొంద మింక సరకు సేయుము పద ||బదరే||

  • ఇహ స్నేహముల మన కిఁకజాలుఁ జాలు బహు దినంబులు సేయంఁ బడె నేమి మేలు మహిమ దూతల స్నేహ మమరు నచ్చట మనకు అహహా యేసుని జూడ నధిక సంతోషంబు ||పదరే||

  • మనల తోడ్కొని పోవ ఘనుఁడు యెహోవా యనంబు తన శుద్ధా త్మను నిచ్చి కావ నెనలేని యడ్డంకు లను దాఁటింపను గృప గనుపర్చి తోడుగ నునిచె వేగము గూడి ||పదరే||

  • భక్తులై యున్నట్టి బంధు మిత్రాడుల రక్తి గుణముతో రంజిల్లఁ గనినన్ ముక్తి రాజ్యంబుల మురువుతోడ సర్వ శక్తుని మహిమ నా సక్తితోఁ జూతము ||పదరే||
  • 483 పరదేశుల మో 10/19/2017 20:16 483 పరదేశుల మో ప్రియులారా మన పుర మిదిగా దెపుడు నిజముగఁ ||బరదేశుల||

  • చిత్రవస్తువులు చెల్లెడి యెకవి చిత్రమైన సరిత లోకము ||బరదేశుల||

  • సంత గొల్లు క్షమ సడలిన చందం బంతయు సద్దణఁగున్ నిజముగఁ ||బరదేశుల||

  • స్థిర మని నమ్మకు ధర యెవ్వరికిని బరలోకమె స్థిరము నిజముగఁ ||బరదేశుల||

  • మేడలు మిద్దెలు మేలగు సరకులు పాడైకనఁబడవే నిజముగఁ ||బరదేశుల||

  • ధర ధాన్యంబులు దరగక మానవు పనిపాటలు పోయె నిజముగఁ ||బరదేశుల||

  • ఎన్నినాళ్ళు మన మిలలో బ్రతికిన మన్నై పోవునుగా దేహము ||పరదేశుల||

  • వచ్చితి మిచటికి వట్టి హస్తములఁ దెచ్చిన దేదియు లే దు గదా ||పరదేశుల||

  • ఎట్లు వచ్చితిమి యీ లోకమునకు అట్లు వెళ్లవలయున్ మింటికిఁ ||బరదేశుల||

  • యేసు నందు వి శ్వాసం బుంచిన వాసిగ నినుఁ జేర్చున్ బరమున ||బరదేశుల||

  • యేసే మార్గము యేసే సత్యము యేసే జీవముగా నిజముగ ||బరదేశుల||
  • 484 పోపోవే యో 10/19/2017 20:16 484 పోపోవే యో లోకమా చాలిఁకఁజాలు నీ పొందు మే మొల్లము పాపేచ్ఛలున్నంత సేపు నొపఁగ రాని వేపాట్లు బెట్టితి వీపట్ల నను వీడి ||పోపోవే||

  • సకలేంద్రియ వ్యాప్తులు నీ సేవ బా యక చేయు దివసంబులు ఇఁ క దీరి పోయె భ్రా మికము జూపకు మిపుడు ప్రకటమ్ముగఁ గ్రీస్తు పద భక్తి మా కెబ్బఁ ||బోపోవే||

  • నీ రాజు బహుమానము గంటిమి ఘోర నరకాంబుధి తీరము దారి దొలఁగి నిన్నుఁ జేరి దుఁఖముల వే సారి తిప్పుడు క్రీస్తు సదయుఁడై ననుఁబిల్చెఁ ||బోపోవే||

  • ఎఱ జూపి బలు మీనము బట్టెడు వాని కరణి వస్తుల రూపము బొరి జూపి లోభము బుట్టించి ననుఁబట్టి పరిమార్చితివి యింక మరి యేమున్నది చాలుఁ ||బోపోవే||

  • ఎండమావుల తేటలు నీ విచ్చెడు దండైన యిహ సుఖములు కండ గర్వముచే నీ యండఁ జేరితిఁగాని నిండు నెమ్మది దయా నిధి క్రీస్తు డిపు డిచ్చుఁ ||బోపోవే||
  • 485 సకలేంద్రియ 10/19/2017 20:16 485 సకలేంద్రియములారా చాల మీ పని దీరె నిఁక నన్ను విడిచిపోవు టకు వేళయ్యెన్ చకిత మృగ శాబకము పోలిక నకట మీచేఁ జిక్కి తిని మీ రి క దొలంగుఁడు యేసు నా ర క్షకుఁడు వచ్చెను నన్ను గావను ||సకలేంద్రియములారా||

  • పంచేంద్రియములారా బల ముడిగె మీ కిపుడు వంచన సేయ మీ వశముగా దిఁకను మించి మీ రెదిరింపలేరు ద లఁచి చూడుఁడు దేవ కృపలో నుంచి ననుఁ గదలింప మీకది కొంచెమగు పని కాదు నుండి ||సకలేంద్రియములారా||

  • శ్రవణేంద్రియము నీదు శక్తి తగ్గుచు వచ్చె వివిధవార్తలు దవిలి విను చుంటి వెంతో చెవుడు నీకిపు డనుసరించెను చేవ తణిగెను జరిగి పొమ్మిఁక సవినయంబుగ యేసు క్రీస్తుని శబ్ద మాలించెదను సుఖ మది ||సకలేంద్రియములారా||

  • కనులారా మీ వెల్గు క్రమముగ క్షీణించె మును జూచు చూడ్కిలో ముసు కయ్యె నిఁకను ఘనముగల దేవుని కుమారుఁడు తన కృపాసన మిపుడు జూపను మనసులోపలి కన్ను విప్పెడి దినము లివె చనుదెంచెఁ జూడుఁడు ||సకలేంద్రియములారా||

  • రసనేంద్రియము నీ నీ రసకాల మిదె వచ్చె విసుకని మాటలనువెదజల్లి నావు పసఁ దరిగి ముది వైతి విపు డో రసనమా యిఁకఁ దీరె నీ పని వెసను నే నిపు డేసుకరుణా రసముఁ గ్రోలుచుఁ బ్రొద్దుఁ బుచ్చెద ||సకలేంద్రియములారా||

  • తను వాద్యంతము మూయఁ దగిన త్వగింద్రియమా నిను సోకునట్టి వ న్నియు గ్రహించితివి మునుపుగల నీ జిగిబిగియు నణం గెను గదా వ్రేలాడెఁ దిత్తులు చనుము నీ వెందైన నేనే సుని స్వరూపముఁ దాల్ప బోయెద ||సకలేంద్రియములారా||

  • ఘ్రాణేంద్రియమ నీవు కడు వాసనలఁ దగిలి ప్రాణానిలము చేతఁ బ్రబలితి విఁకను నాణెమైనవి విడును దుర్గం ధముల బాల్పడఁ బోదు విఁక నా త్రాణపతి యగు క్రీస్తుచేతను బ్రాణ మర్పింతును సుఖింతును ||సకలేంద్రియములారా||

  • కడు దవ్వు పయనంబు నడిచి వచ్చితి నింక నిడుపు లే దా త్రోవ నికటమై వచ్చెన్ నడుమ నడుమ నడ్డుపడియెడ నిడుమ లన్నియు గడిచిపోయెను జడుతు నా మృతి నదికి నా నా వికుఁడు వచ్చెను నన్నుఁ గావను ||సకలేంద్రియములారా||

  • వెనుకఁ దీరిన మార్గ మున కంటె ముందుండి కనుపించు నా త్రోవ కఠినమైన యుండు ఘన తరంగ ధ్వనుతో భీ కర మరణ నది పాఱు చున్నది క్షణము మాత్రమె దాని పని యా వెనుక నావలి యొడ్డు జేరెద ||సకలేంద్రియములారా||

  • ఈ సంపారంబునం దేమి సౌఖ్యము గలదు ఆశ మాత్రమె గాని యది చిరము గాదు యేసు క్రీస్తుఁడు తండ్రి దేవుఁడు భాసురం బగు నిర్మలాత్మయు దాసులకు దమ దివ్య మగు కృప జేసి నిత్య నివాస మిత్తురు ||సకలేంద్రియములారా||
  • 486 పైనమై యున్ 10/19/2017 20:16 486 పైనమై యున్నా నయ్యా నీ పాదాంబుజముల సన్నిధికిఁ ప్రభు యేసు నాతో నుండవే నీవు దీనుఁడు భవ దా ధీనుఁడ ననుఁ గృప తో నడిపించు మె దుట నదె సింహ ధ్వానముతో మృతి వచ్చు చున్నది దాని భయోత్పా తము దొలఁగింపవె ||పైనమై||

  • సరణిలో నేఁబోవునపుడు శ్రమ లెన్నెన్నో చనుదెంచి నా పరుగు కడ్డముగా నిలిచునేమో మరణపు ముళ్లను విరుచుటకును ద ద్దురవస్థలు వెసఁ దొలఁగించుటకును గరుణానిధి నా సరస నుండుమీ శరణాగతునకు మరి దిక్కెవ్వరు ||పైనమై||

  • దేవా నీ దక్షిణ హస్తముతో దీనులను బట్టెద వెరవకుఁ డను నీ వాగ్దాత్తమున కిది సమయంబు ఆ వచనము నా జీవాధారము దైవము తల్లియుఁ దండ్రియు దాతవు నీవే సర్వము నిను నమ్మితి నా త్రోవ ప్రయాణము తుదముట్టించుము ||పైనమై||

  • పొదుగా నీ భక్తియందు డెంద మానందించు నపుడు సందియము లెన్నెన్నో చనుదెంచి తొందర నిడు నా త్రోవను తద్గా ఢాంధత మిశ్రమ లణఁగించుటలై సుందరమగు రవి చందంబున నా ముందట నడువవె ముదమునఁ బ్రభువా ||పైనమై||

  • కాలం బయ్యెను రారమ్మనుచు నీల మేఘాకృతితో వచ్చి కాలదండము జిరజిర ద్రిప్పుచు చాల భయానక లీలన్ మృత్యువు మ్రోల న్నిలిచిన వేళను దాలిమి దూలి చనుం గా బోలు భవత్కరు ణాలింగన సుఖ మత్తఱి నొసఁగవె ||పైనమై||

  • నీ దివ్య రూపధ్యానంబు నిర్మలాత్మాంతర సౌఖ్యంబు నా దేవుని ప్రేమామృత సారంబు నీ దాసుని కవి నిరత మొసంగుచు నా దారిని గల సేదలు దీర్పును నాదియు మధ్యము నంతము లేని పు నాదులుగల నీ సౌధము జేర్పవె ||పైనమై||

  • ఎండమావుల కీడైనట్టి యిహ సౌఖ్యములు త్వరగాఁబోవు నీ నిండు దరుగని నిత్యానందంబు దండిగ నీయం దుండిన వారి క ఖండామృత సౌ ఖ్యము లిచ్చెదవట తండ్రీ భవ దు త్తమ దాసుల నీ వుండిన చోటనె యుంచుము చాలును ||పైనమై||
  • 487 పరదేశి, పు 10/19/2017 20:16 487 పరదేశి, పుణ్యక్షేత్ర యాత్రఁ బోవుచుందువా? యేసు నాజ్ఞ తల పోసి మోక్ష మొందఁ బోదును. కొండ లెక్కి యేళ్లు దాఁటి మోక్ష రాజ్యం చేరుదాఁక ముందు పోవుచుందును.

  • ఒంటిగాను బోవుదువే నీకు భయ ముండదా? లేదు నాకు భయమేల? స్వామి నన్ను ఁ గాచును; మోక్ష రాజ్యం చేరుదాఁక యేసు నాకుఁ దోవచూప ముందు పోవుచుందును.

  • పరదేశి, మోక్షమందు నీకు లాభ ముండునా? నిత్యానంద సువిశ్రాంతి యందు నుండు లాభము. జీవనది నీళ్లు త్రాగి యేసుతో సదా వసింప ముందు పోవుచుందును

  • పరదేశి, నీతో నేను యాత్ర చేయ వచ్చునా? రమ్ము నాతోఁ గూడ రమ్ము యేసు నిన్ను రమ్మనెన్ మార్గాయాసమైన నేమి మాకు మోక్షం చిక్కు వేళ సువిశ్రాంతి కల్గును.
  • 488 ఘనమైన క్రీ 10/19/2017 20:16 488 ఘనమైన క్రీస్తు కృపఁ గనుగొంటి నిపుడు ఘనుఁడు తన మహిమచేఁ గాఁచి పెంచెను నన్ను ||ఘనమైన||

  • ఆపదలలో మునిఁగి యడలుచుండఁగ నన్ను ఁ జేపట్టెను చింత చే జెడకు మనుచు వేపాకు కన్న నిది వెగటైన నా జిహ్వ తీపుగా నొనరించి స్ధిరపరచె నిపుడు ||ఘనమైన||

  • ఘనమైన యాపదల కడలిలో ఁ బడి యున్న ఘనుఁడు నా దెసఁ జూచి మనసు నొచ్చుకొనియె కనికరముచే నిన్నుఁ గరుణింతు నిప్పుడె వెనుకఁ జూడక తనదు వెంట రమ్మనెను ||ఘనమైన||

  • కుల గోత్రములు వీడి కుటిలంబు దిగనాడి వలబడ్డ చేఁపవలె వదల కని పలికెన్ సిలువపై నసు విచ్చి బలహీన మెడలించి వలవలను కన్నీరు వల పోసినాఁడు ||ఘనమైన||

  • పర్వతములపైఁ గట్టు పట్టణమువలె నిన్ను నుర్విలో నుంచితి నుచి తంబుగాను సర్వజనులకు వెలుఁగు సాక్షిగా నీవుండి గర్వింప వలదనుచు ||ఘనమైన||

  • సదమలం బగు జ్ఞాన సరణి యిదె నా మాట ముదముతో నమ్మినను మోక్ష మోసఁగెదను కదిసి సాతాను బలు కాడిక్రిందను బడిన విదలించి నరకమున వేతునని పలికెన్ ||ఘనమైన||
  • 489 మనసానందముఁ 10/19/2017 20:16 489 మనసానందముఁ బొందుట కన్నను మరి యే భాగ్యము గల దన్న అనుమానము లిఁక సఖిల సుఖంబులు దిన మొక గడికొక తీరై యుండును ||మన||

  • దిటముగఁ ప్రార్థన యను ఖడ్గముఁ గని తిరుగు పిశాచము వెఱ చన్న పటుదీప్తులు గల ప్రభు శాస్త్రోక్తులు బహు సంశయ పం కము నింకించును ||మన||

  • సాధు జనోత్తమ క్రైస్తవ సంగతి సమకూడిన మేలౌ నన్న శోధన లన్నిటి స్థిరముగ నోర్చెడి శుభమతి కన్నను సుఖమే మున్నది ||మన||

  • తనువున దానను వానికి దురితము దగిలెడు విధిఁ గనవలె నన్న యొనర గ క్రీస్తుని వధ్యాస్తంభముఁ గని విశ్వాసముఁ గట్టిగఁ బెంచిన ||మన||

  • క్షమయును స్నేహము ప్రభుకడ నేర్చిన శత్రువు లిఁక భువి లేరన్న సమదృష్టి జగ జ్జనుల గనుంగొను సత్క్రైస్తవులకు సాధన మనఁ దగు ||మన||

  • పరమదయానిధి క్రీస్తుని బలమునఁ బాప భరంబులు విడు నన్న పరిశుద్ధాత్ముని బంధుత్వంబున అరమర చీఁకటు లన్నియుఁ దొలఁ గును ||మన||
  • 490 మా యేసు క్ 10/19/2017 20:16 490 మా యేసు క్రీస్తుని మఱుఁగు గల్గెనురా నా యాత్మ ఘనరక్షా నగమ నెక్కెను రా ||మా యేసు||

  • ముందు నాలో పాప ములు జూడఁ బడెరా డెందము తా నన్ని టిని నొప్పుకొనెరా యందుకై బలు దుఃఖ మాత్మఁ జెందెనురా సందేహములు వీడు జాడఁ గన్గొనెరా ||మా యేసు||

  • సువిశేష బోధనా చెవు లాలించెనురా అవివేక శాస్త్రోక్తు లంటు వీడెనురా నవసత్క్రైస్తవ గోష్ఠి భువి నా కబ్బెనురా వివిధము లగు వేల్పు ల్విష మైరిగదా ||మా యేసు||

  • బాధగురువుల మోము ల్బహు లజ్జఁబడెరా గాధ మంత్రము లన్ని కడగండ్లయి చెడెరా శోధించి నాయాత్మ శుద్ధిగోరెనురా సాధించి ప్రభుక్రీస్తు శరణుఁ జొచ్చెనురా ||మా యేసు||

  • మతిలోని లోఁతు మ ర్మము గానఁబడెరా మితలేని ఘనపాప మే నిండు కొనెరా హితముగా తన జీవ మిచ్చె క్రీస్తుఁడురా మృతిచేత మన పాప వితతి గొట్టెనురా ||మా యేసు||

  • కులగోత్రముల బుద్ధి కుటిలంబుఁ దెగెరా బలవత్పిశాచ శృం ఖలము విఱిగెనురా సిలువ మోసినవాని చిర సౌఖ్యోన్నతిరా నెలవుగ నాలోన నిలచి యున్నదిరా ||మా యేసు||

  • తనపోల్కె నొరులఁ గ న్గొనఁ బ్రేమయ్యెనురా మనసు దేవునికి న ర్పణ సేయఁ బడెరా ఘన కృపశాంతులు గొనెను నెమ్మదిరా మనసు మార్పడి మోక్ష మహిమ గన్గొనెరా ||మా యేసు||
  • 491 యేసును చూచ 10/19/2017 20:16 491 యేసును చూచుట యెన్నటికో పర వాసుఁడ నగుట యెన్నటికో భాసురముగ నా పరమ జనకు సిం హాసనమున దూ తాదుల మధ్యను ||యేసును||

  • బలితంబగు పైశాచక బంధన పాశము వదులుట యెన్నటికో సలలి తముగ నా సద్గురు పాద స్థలమున కరఁగుట యెన్నటికో ||యేసును||

  • ధాత్రిఁ గష్ట దుఃఖాబ్ధిని మన మిఁక ధాటిగ దాఁటుట యెన్నటికో మైత్రితోడఁ బర మాత్ముని చెంతను మనసు తీర మను టెన్నటికో ||యేసును||

  • కాంచనమకుటము కనకపు వీణెయు ఘనముగఁ దాల్చుట యెన్న టికో యంచితముగ హలె లూయా పాటల నానందించుట యెన్నటికో ||యేసును||

  • శోధన బాధల నీ ధరఁ బొందక శోకము గెల్చుట యెన్నటికో సాధూత్తమ జన సాంగత్యమ్మున సంతస మొందుట యెన్నటికో ||యేసును||

  • నీతి రహిత పైశాచిక భటగణ నిందలు బాయుట యెన్నటికో ఖ్యాతిగ శ్రీ పర మాత్ముని కొలువున గట్టిగఁ గుదురుట యెన్నటికో ||యేసును||

  • జరయు వ్యాధి సంశోక మరణములు జొరని చోటుండుట యెన్న టికో పరిశుద్ధతయును బరమానందము ప్రబలు పదము జేరు టెన్నటికో ||యేసును||
  • 492 వేచియుంటిన 10/19/2017 20:16 492 వేచియుంటిని నీ తట్టు యేసువమేము వేచి యుంటిమి నీ తట్టు భాసురఁబుగ మహిమన్ భాసిల్లురాకకై నాశతో కరములు చాచుచు నీవైపు ||వేచి||

  • కూడుచుంటిమి యిచ్చట వేడుకగల కూటంబులలొ కూర్మితో గోడులేనిపరమ కూటంబులలో భక్త కోటులతో గూడి పాడుచునిన్ స్తుతియింప ||వేచి||

  • నమ్మియుంటిమి నీ యొక్క నమ్మకమైన నెయ్యంపు వాగ్దానములన్ ఇమ్ముగ దివికేగి నెమ్మి నెలవులు గట్టి మమ్ముట దోడ్కొని పోవన్ నమ్మబల్కిన మీకై ||వేచి||

  • వెఱచుచుంటిమి యిచ్చట తరుచుగగల్గె కరుకైన స్థితిగతులలోన్ కరువువేదన భీతి మరణ దుఃఖములేని పరమపురమున జేరి మురియు టెప్పుడొ యంచు ||వేచి||

  • నిత్యంబు విలసిల్లెడి నిశ్చలమైన శృంగార స్వర్గంబున ముత్యాల ద్వారమున నిశ్చింతపోవుచు బంగారువీధుల సంచరించుట యెపుడో ||వేచి||

  • రంగుగు క్షయధనముల సంగడిజేరి భంగంబు పడుచుంటిమి దొంగలుదోయని చిమ్మటకొట్టని తుప్పయిన పట్టని యక్షయ ధనమునకై ||వేచి||
  • 493 జీవము పోవగ 10/19/2017 20:16 493 జీవము పోవగన్ దేవుని సన్నిధి జీవుడు చేరున్ ||జీవము పోవగన్||

  • పుష్పము రాలగన్ బాష్పము లేలన్ ఋష్పమువాడిన ఋష్కల ఫలమగున్ ||జీవము పోవగన్||

  • నిధన మొందగ నిద్దుర పోవుటే రోదనముండదు బాధముగించెన్ ||జీవము పోవగన్||

  • నష్టము భావమై కష్టము దీరున్ ఇష్టముతో ప్రభు యింటను జేర్చును ||జీవము పోవగన్||

  • పరమున జొరగన్ హర్షమునొందన్ మరణము గెల్చిన సర్వదా ||జీవము పోవగన్||

  • యేసుఁడు లేచెన్ దాసుఁడు లేచున్ భాసుర గృహమున వాసము చేయున్ ||జీవము పోవగన్||
  • 494 నిదురఁ బోయ 10/19/2017 20:16 494 నిదురఁ బోయినట్టి నీ పాద సేవకుని సదయుఁడగు తండ్రి చక్కగా దాచు సదమలంబగు లోకమున నీ సదనమందునఁ జేర్చి శుద్ధుల వదల కెప్పుడు వారితో నీ పదయుగంబుల సేవఁగోరుచు ||నిదురఁ||

  • ఇతఁడీలోకమందు నీవొసంగిన పని హితమతి నొనరించె యేసుని కృపను సతతమును బాపంబుతోడను జాల యుద్ధ మొనర్చి బ్రదుకును నతిముదంబున నీకు నిరతము నుతు లొనర్చెడు నాశఁబూనుచు ||నిదురఁ||

  • సన్నిధిఁ జేరిన సకల వరభక్తుల కన్నీరు దుడుతువు కరుణ మీరంగ నిన్ను నమ్మినవారి నడువడి నీవు తేటగ నెఱింగా వారికి జెన్ను గను దీర్చె దవు న్యాయము సన్నుతింపగ సజ్జనావన ||నిదురఁ||

  • మరణ కాలంబున ధరలోఁ క్రీస్తుని సిలువ దిరముగఁ జూచిన నరులందఱు వరదుఁడగు రక్షకుని దయచే జిరపురము నిక్కముగఁ జేరుచు గరము నేర్తురు ప్రేమ నచ్చటఁ దరతరంబులు గడుచుచుండగ ||నిదురఁ||

  • పరిశుద్ధుఁడగు దేవ పాదసన్నిధిలోనఁ బరిపూర్ణానందము పాదు కొని యుండు నరక బలములు చెరుపనేరవు పరమ జనకుని సుతుల నెమ్మదిఁ జిరదయాళుఁడు గాచు వారల నిరతమును దన యాత్మ బలమున ||నిదురఁ||

  • యేసుబాధుని నమ్మి యిలను విడిచినవారు భాసిల్ల లేతురు ప్రభుశక్తి నిలను భాసురంబగు దేహములు తన దాసు లందఱి కిచ్చి మోక్షని వాసులముగాఁ జేసి వారల యాస దీర్చును మాటఁ దప్పక ||నిదురఁ||
  • 495 మరణమునకు వ 10/19/2017 20:16 495 మరణమునకు విజయ మేది మరణ మోడిపోయెరా మరణ మొంది యేసు ప్రభువు మఱల బ్రతికి లేచెరా ||మరణ||

  • క్షయమందు విత్తఁబడి య క్షయమునందు లేచురా ప్రియుడు క్రీస్తునందు మృతులు పెం పొసంగు ధన్యులు ||మరణ||

  • లౌకిక దేహము విడి పర లోక దేహి యగునురా భీకర యోర్దాను యేసు ప్రేమతో దాఁటించురా ||మరణ||

  • ధరణి దుఃఖ బాధ లన్ని ధరణియందె విడుతుము పరమ దేవుని డుండునట్టి పరదైసునకుఁ బోదుము ||మరణ||

  • గగన వీధినండి యేసుఁ గ్రక్కున వేం చేయురా జగతి సర్వ మృతుల నొక్క క్షణములో బ్రతికించురా ||మరణ||

  • బూర రావ మాలకించి భూమి యెల్ల వణఁకురా వారధిలో మృతులు జీవ ధారులై లేచెదరురా ||మర||

  • భక్తులు విశ్వాసమునకు ఫలము నొందఁ బోదురు ముర్తి కిరీటము ధరించి రక్తితో జీవింతురు ||మరణ||

  • కరుణలేని మరణమునకు వెరవకుండ నుండుఁడి మరణవిజయుఁడైన ప్రభుని చరణములు నుతించుఁడీ ||మర||
  • 496 లేచు దినము 10/19/2017 20:16 496 లేచు దినము వచ్చును మృతు లెల్ల నికఁ లేచు దినము వచ్చును వేచి యిల నున్నట్టి విమలు లెల్ల నడుపు లేచి ప్రభుని నెదురు కొందు రానందముతో ||లేచు||

  • యేసు మేఘారూఢూండై యిలకు దిగ వాసిగ దూత లపుడు భాసురంబుగ బాకా పై నినాదము సేయ గ సమాధుల నిద్రగాంచు జనులెల్లరు ||లేచు||

  • కడబూర ధ్వని సేయఁగ మడిసిన వారు తడవు సేయక లేతురు ఎడతెగక ప్రభు నొద్దఁ గడు సంతసంబుతో విడువక యుందు రా విమల లోకమునందు ||లేచు||

  • ఘన మహిమన్ బ్రభువు రాఁగన్ గడలి యపుడు తన యందుండెడి శవములన్ ఘనముగఁ గాననము దనయందుండెడు మృతులన్ వినయంబుతో దెచ్చి విభుని కప్పగింప ||లేచు||

  • అరయంగ నీతపరు లా నందమున న క్షర దేహులై వెలయుచున్ జిరత రానందంబు బరలోకమున నెపుడు స్ఫురిత జీవను లగుచుఁ బరమ సుఖ మొందుదురు ||లేచు||

  • కరుణ లేని సమాధీ నిరతము నన్నుఁ జెరపట్టి యుంచగలవే వరదుండు క్రీస్తుండు వర దూత సేనలతోఁ బరివేష్టితుఁడై యదిగో నరుదెంచుచున్నాఁ డు ||లేచు||

  • మరణమా నీ ముల్లేది నరులను నింక వెఱపించు చుండగలవే మరణ సంహారుండు మహిమతో నరుదేరన్ మరణం బడుగుబడి య మర త్వంబిఁక నుండున్ ||లేచు||

  • మరణంబు నొందలేదా ప్రభు యేసు నీ చెఱయందు నుండలేదా పరమేశు తనయుండు మరణ సమాధులన్ పరిపూర్ణముగ గెల్చి చెఱను జెరగపట్టెను ||లేచు||

  • మంగళములు పాడరే క్రీస్తుకు జయ మంగళములు పాడరే మంగళములు పాడి మంగళ ప్రదుఁడైన శృంగార రాజునకు సంగీతంబులతోడ మంగళములు పాడరే ||లేచు||
  • 497 అంత్య దినమ 10/19/2017 20:16 497 498 యేసుని చేత 10/19/2017 20:16 498 యేసుని చేతులందు యేసుని రొమ్మునన్ నాకు నభయమందు అందె పరుండెదన్ కీర్తన వింటివా? నా మన మందునుండి పొందు సుఖం బహా! ||యేసుని చేతులందు యేసుని రొమ్మునన్ నాకు నభయమందు యందె పరుండెదన్||

  • యేసుని చేతులందు మిక్కిలి క్షేమము జేరెడ నింక నాక ఏ దుఃఖ బాధలైన నచ్చోటఁ జేరవు పాపపు భీతిబాధ లంటవు నన్నటన్ కన్నీరు సందియంబుల్ కొన్ని దినా లిటన్

  • యేసె నా యాశ్రయంబు నాకై చావొందెఁగా గొల్గోతయందు నుండు నా గురి సర్వదా చీఁకటి దాఁటుదాఁక నోర్పుతో నుండెదన్ జేరెద నుండెదన్ మంచును నమ్మెదన్
  • 499 రవికాంతిని 10/19/2017 20:16 499 రవికాంతిని మించినదౌ ఒక దేశము దూరమున వరభక్తులు చూచెదరు తండ్రి యాశ్రయ మిచ్చునటన్ ||అహహా త్వరలో మేము చేరుదు మా స్థలమున్ అహహా త్వరలో మేము చేరుదు మా స్థలమున్||

  • దుఃఖబాధలు లేక సదా పూర్ణశాంతినిఁ బొందుచును పరిశుద్ధుల కీర్తనలు అందు నెప్పుడు బాడుదుము.

  • ప్రేమ సాగరుఃడౌ జనకున్ మాకు నిచ్చిన మేలులకై మా కృతజ్ఞత జూపుచును నిత్యమున్ స్తుతి యించెదము
  • 500 సద్భక్తితో 10/19/2017 20:16 500 సద్భక్తితోడ సాక్షులై నిత్య విశ్రాంతి నొందు వారిఁ జూడఁగా శ్రీ యేసు నామమున్ స్తుతింతుము హల్లెలూయా! జేయు

  • పోరాటమందు వారి దుర్గమౌ శ్రీ యేసు సంరక్షించు శైలము అంధత్వ మందు జీవకాంతియు హల్లెలూయా!

  • ఓ యోధులారా! ధైర్యశాలురై పూర్వులఁ బోలి యుద్ధ మాడుఁడీ జీవ కిరీటంబు మీ కబ్బును హల్లెలూయా!

  • ఓ దివ్యసభ! స్నేహభావులు! అన్యోన్య సహవాసమున్ నమ్మిక గల క్రీస్తువారలు! హల్లెలూయా!

  • మోక్షంబుఁ జేరి భక్తు లెల్లరు పితృ పుత్ర శుద్ధాత్మలన్ సదా విజయ గీతితో ఁ గీర్తింతురు హల్లెలూయా!
  • 501 శృంగార ద్వ 10/19/2017 20:16 501 శృంగార ద్వారంబు మా యేసు మోక్ష మార్గంబున కెంతో శృంగార ద్వారము ||శృంగార||

  • పాలును దేనెయుఁ బారెడి కానాను ప్రదేశ భూములకుఁ బ్రవేశ పెట్టు ||శృంగార||

  • యెరూషలేమాలయ పరిశుద్ధ స్థలమందు పరిశుద్ధ జనులుగ బ్రవేశ పెట్టు ||శృంగార||

  • అత్యంత పరిశుద్ధ స్థలమందు మమ్ము నిత్యంబు యాజ కులగాను జేర్చు ||శృంగార||

  • ఇరుకైన నేమది సరియైన ద్వారంబు సంకటంబైనను సౌఖ్యన జేర్చు ||శృంగార||
  • 502 ఎంతో శృంగా 10/19/2017 20:16 502 ఎంతో శృంగార మైనది యేసుని చరిత మిది యెంతో వేడ్కై యున్నది మోక్ష ప్రవేశ మంతటఁ దేజో వంతుఁడు క్రీస్తుఁడు చెంతను దూతా శ్రితజన వజ్ఞ్క్తులు వింతగ నుడువఁగ సంతత నవ్య వ సంతము గల్గియ నంతజీవ రస వంతఫలోప వనాంతర ములు ద త్ప్రాంత ఋనగల పరమపురమునకు సంతసమున జనె జయశబ్దముతో ||ఎంతో||

  • తెరచి మూయంగ రానట్టి ద్వారములారా మీ శిరము లెత్తుకొని యుండు డి యనాదిగ నుండు వర క వాటములారా మీరే యెత్తంగఁ బడుఁడీ సురచిన మహిమ స్ఫురణలుగల మీ దొరతన పరిశుద్ధుల కరు లగు భీ కర దురితాత్ముల దురమునఁ జిదిపి య పరిమిత బల జయ బిరుదాంకితు డై చిరముగ నూతన యెరుసలేమ పుర పరి పాలనఁ ద త్పరుఁడై యిదిగో నెరవుగ వచ్చెను నిజ భక్తులతో ||ఎంతో||

  • సుందర మందానిలమందు జీవ సంజీవా నందసౌఖ్య ప్రదమై యుండ రేబగ లంటని మందిర వాసులప్పుడు జయజయశబ్దములఁ బొందుగఁ గ్రీస్తుని పొగడుచుఁ బాడుచు నందఱు పరమా నందంబునఁ జె న్నొంది తనందరి కిందగు రాజుగ వందనములు తగ వరుస నొనర్చుచు నందముగా ప్రభుఁ జెందిన భక్తుల బృందములకుఁ దగు విందు లొనర్చిరి పొందిక కలిగెను భూమికి ముక్తికి ||ఎంతో||

  • ములపైఁ బెట్టి కళ లీను ధవళ వస్త్రములు గట్టంగ నిచ్చి చెలువుగ మరి వా రల చేతుల లో పల విజయార్థపు బర్ణము లొసఁగి సకల దూతలు భ క్తులతో గూడి వి మల పీఠము ముం గల నిలువబడి పొలువగఁ దమ దే వునకును గ్రీస్తున కెలమిని స్తోత్రము బలఘన మనిశము కలుగును గాకని పలికి నుతించిరి ||ఎంతో||

  • పరిశుద్ధవంతు లప్పుడు శాశ్వతానంద భరితులై వీణెలు ధరియించి పాటులు బాడుచును గురురాయఁడైన తమ ప్రభుని గుణములు వర్ణించి కరుణను నీ ర క్తముచే మము నం దఱి ధరణింగల నరవంశస్థుల తరములలో నుం డరుదుగ దేవుని కొఱకుఁగదా మముఁ గొనియుంటిని యని మురువుగ నిఁక దే వుని కొఱకుఁగదా మముఁ గొని యుంటిని యని మురువుగ నిఁక దే వుని సముఖంబున దొరలను నర్చక వరులఁ జేసితివి ధర నేలుదు మిఁక సరియని మ్రొక్కిరి ||ఎంతో||
  • 503 పరములోన బర 10/19/2017 20:16 503 పరములోన బరములోనఁ పాప మేమి లేదుగా నరయ దానిఁ గోరు వారి కాశ యిందు లేదుగా ||పరములోన||

  • వృద్ధ సర్చ మనెడు వాని సుద్ధు లందు లేవుగా సద్దులేని చోట నెపుడు స్వామి సేవ గల్గుగా ||పరములోన||

  • ఎల్ల రోగ శ్రమలు మనకు నీ స్థలంబులోనెగా కల్లగాదు క్రీస్తు మనకుఁ గంటి నీళ్లు దుడుచుఁగా ||పరములోన||

  • అంధకారమైన కార్యము లా స్థలమున లేవుగా సందె వెలుఁగు వెలుగు నట్లు స్వామి సన్నిధి యుండుఁగా ||పరములోన||

  • దొంగవాని వలన మనకు దోపు లేమి లేవుగా యంగలార్పుఁ దీర్చి క్రీస్తుఁ ఆశ్రయముగ నిల్చుఁగా ||పరములోన||

  • అన్నపానములందు మనకు నాశ యేమి లేదుగా కన్న తండ్రి కన్న మిగుల ఘనుని ప్రేమ గల్గుగా ||పరములోన||
  • 504 పరిశుద్ధి 10/19/2017 20:16 504 పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధి యని వినఁ బడు పుర మదిగో పద పదరే ప్రియులారా పరమేశ్వరుని చేతఁ బరిపాలనముఁ గల్గి చిరమై భాసురమై సు స్థిరమై సుందరమైన ||పరిశుద్ధి||

  • రవితోను కుముదబాం ధవుతోను మఱి దీప చ్ఛవితోను దాని కవ సర మింతలేదు అవిరతమునఁ గ్రీస్తుఁ డందుండుఁ ప్రభతో సం స్తవమై వైభవమై యు త్సవమై వెల్గుచు నుండుఁ ||పరిశుద్ధి||

  • గొదయైన మఱియే యా పదయైన దగయైన మొదలే లేకుండు న ప్పుర వాసు లందు మృదు జీవోదకము ల ర్మిలి నిరంతర మిచ్చు గుదురుగ నెదురుగఁ గూర్చుండి యువరాజు ||పరిశుద్ధి||

  • ప్రభు కృపాసనములో పలినుండి ప్రవహించి శుభమైన నది యుండి సుఖమిచ్చు నచట నుభయ తీరములందు నుండు వృక్షములు సౌ రభదీప్త శుభములై రక్షా ఫలము లిచ్చు ||పరిశుద్ధి||

  • జననంబు మరణంబు సంసార సుఖబాధ లనుభవించుట గల్గ దా పురమునందు మును నీతి కొఱ కాప దను బొందు తనవారి కనునీ ళ్లన్నియు దుడుచు మన దేవుఁ డందుండి ||పరిశుద్ధి||

  • వెలకంద రాని ని శ్చలమైన ఘన జీవ విలపత్కిరీటము ల్గల వప్పుర మునఁ బిలిచి నప్పుడె విభుని పెండ్లి విందున కేగు కుల బంధువులకు ని చ్ఛల నిచ్చు దేవుఁడు ||పరిశుద్ధి||
  • 505 పరిశుద్ధం 10/19/2017 20:16 505 పరిశుద్ధం పరిశుద్ధం పరిశుద్ధం బయిన యా పరమ కానానున కరుగున దెపుడో ||పరిశుద్ధం||

  • పరిశుద్ధమయిన యా యెరుషలేము పురము వర పద్మరాగంపు స్ధిర పునాదులతోడ పరిఢవిల్లు సువర్ణ ప్రహరియు గోడలు నురురత్న ద్వారంబు లదిరిగ గల వహహ ||పరిశుద్ధం||

  • ఆ నీతిపురమున నాకాశమున వెల్గు భానుండు శశి కానఁ బడఁ బోవు దేదీప్య మానంబై విలసిల్లు మానిత గొఱ్ఱియ దానికి జ్యోతియై తనరుచుండు నహహ ||పరిశుద్ధం||

  • శృంగారమైనట్టి బంగారు వీధులలో చెంగు చెంగున దాఁటు శ్రేష్ట సమయంబున మంగళ ప్రదమైన మహిమ రాజ్యమునందు రంగైన ప్రభుయేసు రాజున్ దర్శింతును ||పరిశుద్ధం||

  • తళతళ మెఱసెడు ధవళంపు టంగీలు కళ లీనుచుండంగ గాళ్లార ధరియించి భళిర భళిర యంచు భక్తాళితో నెపుడు నెళవుగా నుందుము నిజ రక్షకుని చెంత ||పరిశుద్ధం||

  • భూరి వీణెలు చేతఁ బొల్పుగ ధరియించి సారెకు మీటుచు సంగీత ములు బాడి శ్రీ రాజా నీకు జో హారంచు ప్రభు యేసు పేరఁ గీర్తింతురు ప్రియ భక్తులందఱు ||పరిశుద్ధం||

  • కరములు జోడించి శిరముల్ క్రిందికి వంచి వరపీటమును జుట్టి తిరుగు దూతలఁగూడి పరిశుద్ధం పరిశుద్ధమని నేను పరమ సంగీతంబు బాడుచుండెద నాహా ||పరిశుద్ధం||
  • 506 మహిమ మహిమ 10/19/2017 20:16 506 మహిమ మహిమ మహిమ యనుచు శిశువులు నిర్మల వినోద ధ్వనులు నిలుతురు అహమ మా యఘంబు లెల్ల నణ(చె వీని నామమనుచు బహు విధంబులైన పాట ల్బాడుచు నాడుచు వేఁడుచు గూడుచు ||మహిమ||

  • శత సహస్ర సంఖ్య మించి బాల సం చయము ప్రభుని గద్దె చుట్టున నతులితంబు లైన కాంతి గతుల నమర మింటఁ బాడ నీతీరు నెవరు దెచ్చి రచటి కేగతిఁ దాఁగూడి మ్రోగఁగ సాగిరి ||మహిమ||

  • వింతయైన మతులు జేయఁగా నెవఁడు తనదు విలువలేని నల్లఁ జల్లగ సమసెనో యఘంబు లట్టి జనకుఁడైన ప్రభువు నెదుట నమల కోమలంబులైన యాటలఁ బాటల మీటుచుఁ జాటుచు ||మహిమ||

  • తాము ప్రభుని కృపను మిగులను జూచి యతని దయను లోక మందు వేడ్కను బ్రేమఁజెంది యిపుడు గొఱ్ఱె పిల్లయైన ప్రభువు నెదుట దాము మోద మలర నిలిచి వేమరు దామెల్ల నా మోముఁ బ్రేమించి ||మహిమ||
  • 507 పరమేదేశ మి 10/19/2017 20:16 507 పరమేదేశ మిదిగో నూతన యెరూస లేమదిగో సోదర తిర మగు పురమది దివ్య సుందరము తరముగాదు త ద్దయు వర్ణింపగ ||బరమ||

  • ద్వాదశ రత్నములా ప్రోలుపు నాదులుగా నుండు సోదర యాదట దీరక నాణి ముత్తియ వి నోదద్వారముల నమరి వెలయు ||బరమ||

  • శుద్ధ సువర్ణమున నెంతో శుద్ధి మార్గముండు సోదర శుద్ధు లెల్ల బరి శుద్ధ గానముల శుద్ధుని నెప్పుడు స్తుతి యొనరింతురు ||బరమ||

  • పరమ జనకు సముఖం బచ్చట నరులతోడ నుండన్ సోదర నరులు దేవుని నరులై యుందురు పరమాత్ముడు దన వారలతో నుండును ||బరమ||

  • కన్నీరుండదుగా దేవుఁడు గన్నుల దుడుచునుగా సోదర యెన్నఁగ మరణం బిక నుండదు మరి చెన్నుగ భేదము శీఘ్రము దొలఁగును ||బరమ||

  • పరమపురమునందు దేవుని కిరవొకటుండదుగా సోదర పరమ జనకుడును గొఱ్ఱె పిల్లయును మురువుగ నొక మందిరమై యుందురు ||పరమ||

  • రవి చంద్రులతోడన్ నిజముగ నవసరముండదుగా సోదర యవిరతముగ యే సువె ఘనతరవై భవమై ప్రభతో బరగుచు నుండును ||పరమ||

  • సంతతంబిచ్చోట సాధులు స్తుతి సేతురు దేవున్ సోదర యతులితంబుగా హర్షమకుటమును సతతము దాల్తురు స్వామి సన్నిధిని ||పరమ||

  • ఆఁకలియుండదుగా నిజముగా నాకుల ముండదుగా సోదర ప్రాకటముగ జీ వ జలంబచ్చట నీకు నొసంగును నిరతము వరదుఁడు ||పరమ||

  • ప్రభు సన్నిధినుండి పారును శుభనది సుఖ మియ్యన్ సోదర యుభయ తీరముల నుండు తరులు సౌ రభ దీప్తిని శుభ రక్షణ ఫలమిడు ||పరమ||
  • 508 విందు పరమం 10/19/2017 20:16 508 విందు పరమందుఁబెండ్లి విందు పరమందుఁ బొందు జనుల డెందములా నందము నొందు ||విందు||

  • సత్య సంధుఁ డైన యేసు సామికి సభకు నిత్య ప్రధానము యెహోవా నిర్ణయించెను రండు ||విందు||

  • నీతి కనికరములతోడ నినుఁ బ్రధానము ప్రీతిగా నొనరించితినని పిలచె సత్యము రండు ||విందు||

  • ఎన్నఁడు విడనాఁడను నే నెంత మాత్రము నిన్నెడఁబాయ నను మాట నిజము దత్తము రండు ||విందు||

  • పరమ నగరు ద్వారములు తెరువఁబడినవి గురుతరమణి తోరణమును గూర్పఁబడినవి రండు ||విందు||

  • నిత్యజీవ పదార్ధములు నిండి యున్నవి సత్యమచట మనము చేర సర్వము మనవి రండు ||విందు||

  • దూత లంత యేసు ప్రభుని బ్రీతిఁ జేయను నూతన సంగీతములను జేతురు వినను రండు ||విందు||
  • 509 చక్కని పరల 10/19/2017 20:16 509 చక్కని పరలోక సంబంధులతో గూడి సంతోషించుట యెన్నడో మిక్కిలి ప్రియమైన తండ్రి దేవుని యెదుట మ్రొక్కి పాడుట యెన్నడో ||చక్కని||

  • నిత్యమ్ము విలసిల్లు నిజరత్నపునాదు ల త్యుత్తమ పురమున ముత్యాల ద్వారముల ముదముతో బోవుచు నృత్యమెప్పుడు చేతుమో ||చక్కని||

  • పన్నెండు ద్వారముల పరమపురమును నా కన్నుజూచుట యెన్నడో చెన్ను మీరఁగ భక్తశ్రేష్ఠులతోఁగూడి సన్నుతించుట యెన్నడో ||చక్కని||

  • పరిశుద్ధదూతలతోఁ ప్రభుయేసు మరల యీ ధరకేతెంచుట యెన్నడో పరిపూర్ణులతోఁ గూడి బహుమానమును బొంది మురియు చుండుట యెన్నడో ||చక్కని||

  • మహిమకిరీటము ధరియించియున్న యా మహితు నిగను టెన్నడో అహహా యా ప్రభునితో మహిమపరచబడి మహికేతెంచుట యెన్నడో ||చక్కని||

  • పాపశరీరముఁ బాసి ప్రభుని యొక్క రూపునొందుటయెన్నడో పాప మరణ దుఁఖ మీ యాపదల కెడ బాపు నొందుట యెన్నడో ||చక్కని||

  • రమ్మురమ్ము యేసు మమ్ము నీ పురముకొని పొమ్ము వేవేగమునే ఇమ్మహికష్టములనుండి నెమ్మది ని త్యమ్ము నిమ్ము వేగమే ||చక్కని||
  • 510 దేవదేవుని 10/19/2017 20:16 510 దేవదేవుని గొప్ప పురము పరలోకానందముక్రైస్తవ జీవితము యా పురము ||దేవ||

  • దేవుని పురము దేదీప్య కరము జీవ మందిరము జేగీయ గృహము ||దేవ||

  • పరిశుద్ధ పురము పరమార్థ కరము పరమ మందిరము పరదైసు పురము ||దేవ||

  • ఆనంద పురము ఆది నిరంతరము కాన దుస్తరము ఘన మనోహరము ||దేవ||

  • శృంగార పురము సుర చిర కరము బంగారు మెరము ప్రభల భాసురము ||దేవ||

  • వైభవ పురము వంద్య మప్పురము సౌభాగ్య కరము స్ఫటిక మందిరము ||దేవ||

  • కెంపు పాండురము కీర్తి బంధురము ఇంపౌ నగరము ఇదియే సుస్థిరము ||దేవ||

  • క్షుదలేని పురము సుక్షేమ కరము ముదము విస్తరము రొదలు దుస్తరము ||దేవ||

  • ఆశ్చర్య పురము ఆశ్రయ కరము నిశ్చయపరము నిజదేవ పురము ||దేవ||

  • మాణిక్య పురము మణుల గోపురము వీణెలు స్వరము విన మనోహరము ||దేవ||

  • సూర్యభాసురము చొరనట్టి పురము కార్య మబ్బురముఁ గావించు గరము ||దేవ||

  • సీయోను పురము శ్రేయస్సాగరము మాయ విధురము మరి సంపత్కరము ||దేవ||

  • ఇచ్చు నిబ్బరము యెరుషలేం పురము మెచ్చౌ నబ్బురము మెరయు మా పురము ||దేవ||
  • 511 ఏదియది యేద 10/19/2017 20:16 511 ఏదియది యేదియది యేదిరా మన దేశము పాదుకొన్న లౌకికునకు బహుళ దుఃఖ పాశము ||ఏదియది||

  • సిలోమను కొలను గల జీవన ప్రదేశము పాలు తేనె లొల్కు నట్టి పరమ కానాన్ దేశము ||ఏదియది||

  • ఆయతమై యున్నదది యమర జనుల కోసము సీయోనను పేరుగల శ్రీకరుని నివాసము ||ఏదియది||

  • జీవ ప్రవాహములు గల జీవుల స్వదేశము కేవల పరిశుద్ధమైన కెరు బుల స్వదేశము ||ఏదియది||

  • యేసు జన స్వాస్థ్య మిదే యిశ్రాయేలు దేశము మేసయ్య యను రాజుసదా మృతములిడు దేశము ||ఏదియది||

  • కోరికలు దీరునట్లు గొబ్బుననేఁ బోదురా చేరి సౌఖ్యమొంద మదిని స్ధిరతఁ బూని యుంటిరా ||ఏదియది||

  • మరణమును యోర్దాన్ నది మధ్యమందు గంటిరా తరుణమునేఁ గాచి దాని దాటిపోవ నుంటిరా ||ఏదియది||

  • కాలు ధరను నిల్వదది కండ్లుఁబడు దాకరా మేలుకొని యుంటిరా మేర దాట లేకరా ||ఏదియది||
  • 512 స్వంతత్ర ర 10/19/2017 20:16 512 స్వంతత్ర రాజ్యం ప్రభురాజ్యం స్వామి యేసు ఘన సామ్రాజ్యం స్వకీయ రాజ్యంమన రాజ్యం సమాధానముగల రాజ్యం ||స్వతంత్ర||

  • ఆద్యంతము లేనిది యీ రాజ్యం అక్షయ విమల సదా సుఖరాజ్యం చోద్యము వచింప సుందర రాజ్యం సురుచిర నీతియు గల రాజ్యం ||స్వతంత్ర||

  • మన దేవుని సహవాసము కలుగున్ మరణ దుఃఖ బాధలు మరి తొలుగున్ యేసులేని కాంతియై ప్రభు వెలుగున్ కనలేమిక చీకటి తొలుగున్ ||స్వతంత్ర||

  • సూర్చు నెండవడ గాలియు నైనన్ సోకదు తన ప్రజలకు నింతైనన్ ఆర్యసహాయం బాకలియైనన్ అటనుండవు దాహములైనన్ ||స్వతంత్ర||

  • నీతిమంతులట నూతన గీతం ప్రీతిగ పాడుచు ప్రభుని సమేతం దూతల బోలి వసింతురు నిరతం జ్యోతులవలె వెలుగుదురు సతం ||స్వతంత్ర||

  • జీవ వృక్ష ఫలముల దినిపించున్ జీవ జలంబుల మరి ద్రావించున్ దేవుడె మన కన్నీటిని దుడుచున్ దేవతలందరి పయినుంచున్ ||స్వతంత్ర||
  • 513 శృంగార దేశ 10/19/2017 20:16 513 శృంగార దేశము చేరఁగానే నా దుఃఖ బాధలన్నియుఁ బోవున్ యేసుని యొద్దను నిత్యమునే నుండుట మిక్కిలి యాశ్చర్యము ||ఇదే నాకు ఆనందము ఆనందము, ఆనందము నేను ఆయనను జూచుటయే ఇదే నాకుఁ బరమానందము||

  • అమితమైన కృపవలన నన్ను స్వర్గంబునఁ జేర్చుదురు అచ్చోటనుండి యేసుని గాంచి స్తుతి కీర్తనలు పాడుదును.

  • నేను ప్రేమించు స్నేహితులును అక్కడఁ జూచి సంతోషింతును నాయేసు ముఖము చూచుటయే నిత్యము నాకది యానందము.

  • ఆ స్వర్గ సౌఖ్య మొందువరకు కండ్లతోఁ జూడక పోయినను యేసుని మాటలు గైకొనుచు నాత్మతోఁ జూచి సంతోషింతును
  • 514 దేవర బ్రోవ 10/19/2017 20:16 514 దేవర బ్రోవుమా దీన కుటుంబమున్ దీవెన లొసగుచు ధాత్రిని నడుపుమా ||దేవర||

  • పావనమగు స్వ భావము నిమ్మా పాలించర మా పాలిటిదైవమ ||దేవర||

  • యేసు ప్రభువ మా యింటికి శిరసుపై వాసముజేయు మా యందున నిలువుమ ||దేవర||

  • అనుదిన భోజనం బనుగ్రహించి మా పనిపాటులలో ప్రక్కను నిలువుమ ||దేవర||

  • పిల్లల పెద్దలన్ బెంచుమ ప్రేమతో నెల్ల సమయముల యందున గావుమ ||దేవర||

  • అణకువ త్యాగము నతిధి సత్యార్యముల్ గణుతించుచు నిను గొలుతుము దేవ ||దేవర||

  • నీ పరిశుద్ధత నేర్పుము యేసువ కాపరి వీవై కాయుము మమ్ము ||దేవర||

  • క్రైస్తవ జీవము క్రమముగ నొందుచు ప్రస్తుతింతుమో ప్రభువా బ్రోవుమ ||దేవర||
  • 515 ప్రభువుగన్ 10/19/2017 20:16 515 ప్రభువుగన్ ప్రతిష్టింపరే గృహమున క్రీస్తున్ ప్రభువుగా ప్రతిష్టింపరె విభవమొందగ నతని శుభమౌ నామము ధర సౌ రభమును వెదజల్లగ ప్రబలమౌ ప్రేమన్ ప్రభుని యెడ గనపర్చరె ||ప్రభువు||

  • పూర్ణ ప్రేమను జూపరే గృహమున క్రీస్తును పూర్ణ ప్రేమను జూపరే పూర్ణ హృదయముతోను పూర్ణయాత్మతో మరి ప్ర పూర్ణ శక్తితో జూపరే క్రీస్తునిలో సం పూర్ణులగుటకు సాగరె ||ప్రభువు||

  • భక్తితోడను గొల్వరే గృహమున క్రీస్తున్ భక్తితోడను గొల్వరే ముక్తినాధుడు తన స్వ రక్తమీయను మనకై రిక్తుడాయెను జూడరే ముక్తిదాతను నా సక్తితో గొనియాడరే ||ప్రభువు||

  • నమ్మకస్థులై యుండరే గృహమున క్రీస్తుకు నమ్మకస్థులై యుండరే అమ్మహాత్ముని నామ మిమ్మహిన్ దగజాటన్ నమ్మె మిమ్మును జూడరె సమ్మతిన్ గ్రీస్తున్ నమ్మకంబుగ జాటరె ||ప్రభువు||
  • 516 యేసుక్రీస్ 10/19/2017 20:16 516 యేసుక్రీస్తుని దాసులారా మీ సుతులకును నేర్పరె ఆశతో యెహోవ యాజ్ఞల నభ్యసింపగ జేయరే ||యేసు||

  • పిల్లలెప్పుడు ననుసరింతురు తల్లిదండ్రుల నడతలన్ ఎల్ల విషయము లందు మాదిరి పిల్లలకు గనుపర్చరే ||యేసు||

  • మోదమిచ్చు కుటుంబ ప్రార్థన నేదినంబును మానక ఆదివారపు బడికి బిడ్డల నాదరముతో బంపరే ||యేసు||

  • యేసునాధుని బోలు నాయకు డే జగంబున లేడని యేసు కే నిజ శిష్యులగుటకు నేర్పరే యౌవనులకు ||యేసు||

  • యేసు శౌశీల్యమును వారికి బోధింపరే పసితనమునె వారి హృదయము యేసురూపము దాల్చును ||యేసు||

  • యేసుక్రీస్తులొ నిలిచి వారలు యేపుమీర ఫలింపగా యేసు వాక్యము వారి యెదలలో నాశతోడను నాటరే ||యేసు||
  • 517 యెహోవ యందు 10/19/2017 20:16 517 యెహోవ యందు భక్తి బహుగ గలిగియుండి మహిమాఢ్యుని మార్గంబులయందు గృహముల నడుపు నరులే ధన్యులు||


  • దేవుని యందలి భయము దీనుల దీవించున్ నీవు నీ జేతుల కష్టార్జితమును నిత్యము ననుభవంతువు నిజముగ ||

  • ఉల్లమలర భార్య ద్రాక్షా వల్లివలె ఫలించు పిల్లలొలీవ మొక్కల చందము పెంపొందుదు రెంతయు సొంపుగను ||

  • దేవుని భక్తియే నీ కిల దీర్ఘాయువు నిచ్చు( గావున నీ పిల్లల పిల్లలను గాంతువు ప్రభు కృపతోఁ వెలగుదువు ||
  • 518 నేనును నా 10/19/2017 20:16 518 నేనును నా యింటివారును నీతి సూర్యుని గొలుతుము దీనమనసును గలిగి దేవుని దివ్యసేవను జేతుము||


  • అనుదినంబును ప్రభుని దలచుచు అలయకను ప్రార్థింతుము అనవరత మా ప్రభుని చిత్తము ననుకరింతుము పనులలో ||

  • వేదవాక్య పఠనమందు విసుగు జెందక నుందుము ఆదరంబున దైవ చిత్తము ననుసరించుచు నడుతుము||

  • ఆశతోడను ప్రభుని దినమును నాచరింతుము మరువక విసుకు జెందక నాలయమునకు పిన్న పెద్దల దెత్తుము ||

  • సంఘ కార్యక్రమములందు సహకరింతుము ప్రతీతో భంగ పరచెడి పనులన్నిటి కృంగదీసెదమనిశము ||

  • ప్రేమతోడను పొరుగువారిని ప్రియులుగను భావింతుము క్షమయు స్నేహము నేర్చి ప్రభుకడ శాంతితో జీవింతుము ||

  • శక్తిగొలది శరీరబలమును శ్రమను క్రీస్తుకు నిత్తుము భక్తితో హృదయమును పూర్తిగ ప్రభునికే యర్పింతుము ||

  • చిన్నవారలు దైవరాజ్యపు చిఱుత వారసులంచును అన్నివేళల వారి వృద్ధికి మిన్నగ దోడ్పడెదము ||

  • పెద్దవారలు దైవజనులని పేర్మితో భావింతుము శుద్ధుడగు ప్రభు క్రీస్తు మనసును శ్రద్ధతోడను జూపుచు ||

  • జీవితంబున ప్రభుని ప్రేమా శ్శీసులను ప్రసరింతుము దివ్యజ్యోతుల రీతి వెలుగుచు దివ్యసన్నిధి నుందుము ||
  • 519 రమ్ము రమ్మ 10/19/2017 20:16 519 రమ్ము రమ్ము మా యింటికి తండ్రీ రమ్ము రమ్ము ||

  • జగములగన్న ప్రేమ గర్భుడవు జగములకావల నుందువె నీవు సరగ రమ్ము నీ బిడ్డలగృహమును సందీపనంబు జేయ ||రమ్ము రమ్ము||

  • సంతస ప్రేమాశాంతంబుల నిశా(తంబై యీ గృహ మెల్లప్పుడు సంతత స్వర్గవాసరూపమై సమృద్ధి పొందునటుల ||రమ్ము రమ్ము||

  • అనలజ్వాల సపర్యలు వదలి యనిలపక్ష సంచరణమువదలి అనయము నీ గృహవాసివి నీవై యాశీర్వదించుటుల ||రమ్ము రమ్ము||

  • నీ ఘననామోచ్చరణము చేత నీ గృహమెల్లను పావనమై నీ యాగప్రేమ మర్మంబులు జగతి బాగుగ దెలియునటుల ||రమ్ము రమ్ము||
  • 520 ఎంతో రమ్యం 10/19/2017 20:16 520 ఎంతో రమ్యంబైనది భూతలమందు ఎంతో మాన్యంబైనది చెంత జేరి యేసు వింత పాదాబ్జముల సంతసంబున పూజసల్పు క్రైస్తవ గృహము ||ఎంతో||

  • పిల్ల లొలీవ మొక్కలై బల్లల చుట్టు ఎల్లప్పుడు ఆడుచున్ నుల్లమందున యేసు చల్లని వాక్యంబున్ నెల్ల వేళల దలచి నుండుచుండెడి గృహము ||ఎంతో||

  • తల్లిదండ్రు లైక్యత దనరుచునుండి దాక్షిణ్య నిధుల జిల్కి ఎల్లప్రేమామృత మెల్ల వారల కొసగి కల్లోలములు వీడి నుల్లసిల్లెడి గృహము ||ఎంతో||

  • పొరుగువారల మైత్రిని పొందుగ గోరి పొలుపారు నీతిన్ దనరు నురుతరనాత్మ వరముల పైని గురిపించు వరదాత యేసున్ ప్రార్థించు క్రైస్తవ గృహము ||ఎంతో||

  • శోధనల నన్నింటిని సర్వదా పైచి శోభిల్లు విశ్వాసమున్ మోద మొందగ యేసునాధు నందున నిల్పి సాదరంబుగ సాక్ష్యమిడెడు క్రైస్తవ గృహము ||ఎంతో||

  • వ్యర్థ ఖర్చుల మానుచు వర్ధిల్లు కొలది సర్దుకొని జీవించుచున్ వృద్ధి నొందెడు వేళ శ్రద్ధాభక్తులతో డా ఇద్ధరిత్రిని దశమభాగ మొసగెడు గృహము ||ఎంతో||
  • 521 యేసుతో ఠీవ 10/19/2017 20:16 521 యేసుతో ఠీవిగాను పోదమా! అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో బోదము ||యేసుతో||

  • రారాజు సైన్యమందు చేరను ఆ రాజు దివ్య సేవచేయను యేసు రాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా యేసుతో ఠీవిగాను వెడలను ||యేసుతో||

  • విశ్వాస కవచమును ధరించుచు ఆ రాజు నాజ్ఞ మదిని నిల్పుచు అనుదినంబు శక్తిని బొందుచున్నవారమై యేసుతో ఠీవిగాను వెడలను ||యేసుతో||

  • శోధనలు మనల చుట్టివచ్చినా సాతాను అంబులెన్ని తగిలినా భయములేదు మనకిక ప్రభువు చెంత నుందుము యేసుతో ఠీవిగాను వెడలను ||యేసుతో||

  • ఓ యువతి యువకులారా చేరుడి శ్రీ యేసురాజు వార్త చాటుడి లోకమంత యేకమై యేసునాధు గొల్వను సాధనంబెవరు నీవు నేనెగా ||యేసుతో||
  • 522 మేలుకొని య 10/19/2017 20:16 522 మేలుకొని యిక లేచి యేసుని మేలులన్ వేనోళ్ల బాడరే బాలబాలికలారా చాలా పాడరే వేలపాడరే ||మేలు||

  • పక్షి గణములు కూడి దేవుని ప్రేమ నెల్లను పొగడుచున్నవి బాపహరుడగు క్రీస్తు చెంతకు పారుమా రక్షణ కోరుమా ||మేలు||

  • అరుణరాగము వెల్లి విరిసెను ఆకసంబున జుక్కలణగెను తరుణ ముననే లేచి దేవుని కెఱగుమా దీవెన కరుగుమా ||మేలు||

  • తెల్లవారెను లోకమెల్లను తెలివిగొని మున్ముందు దేవుని తల్లి దండ్రియు గురుడవీవని దలచుచూ తగధ్యానించుమా ||మేలు||

  • జగములెల్లను జంతుజాలము ల గణితంబగు జీవులెల్లను సొగసున న్వేనోళ్ల బొగడుట జూడుమా నీవును పాడుమా ||మేలు||

  • నీతి భాస్కరుడుదయమాయెను నూతనోజ్జీవన మొసంగను సతత మాతని దాపున న్వసియించుమా తగ జీవించుమా ||మేలు||
  • 523 దేవాది దేవ 10/19/2017 20:16 523 దేవాది దేవాత్మజా మమ్ము దీవించు ప్రభురాజా దేవాదిదైవ మానుషాభవ్య దేదీప్యగుణతేజా ||దేవాది||

  • చెదరిన నీ గొఱ్ఱెల కదుపు వెదుకవచ్చితివియ్యల సదయా హృదయాభ్యుదయా సాధు జన నిత్య పరిపాలా ||దేవాది||

  • దురితాలవాలమునం బుట్టు నరకీటముల మన్నా కరుణారసమనిశము మాపై విరఁజల్లవే చల్లగా ||దేవాది||

  • నరకంబు నిధియొడ్డున మేము దిరుగుచు పడబోయిన తఱి నీ వెఱిఁగి త్వరగా మమ్ము మరలించి నావన్నా ||దేవాది||

  • యేసు నీ దాసులము నీకు దోసిలి యొగ్గినాము దోషా రోషా భ్యాసములను దూరముఁ దొలఁగించుము ||దేవాది||

  • ప్రాణేశ నీ సిలువఁ జిందు శోణితంపు విలువ త్రాణకరము స్ధిరము దాని దర్శించుటే జీవము ||దేవాది||

  • బాలుర మజ్ఞులము మమ్ము బాలింపవే నిత్యము నీ లోపలి జాలి మాకు నిజముగాఁ జూపించుము ||దేవాది||

  • ఆనందమగు నీ కృప మేము ధ్యానించుటకు నేర్పుమా జ్ఞానోజ్వలము బలము శిశువుల మైన మా కవి యిమ్ము ||దేవాది||
  • 524 భార్త క్రై 10/19/2017 20:16 524 భార్త క్రైస్తవ యువజనులారా ప్రభుకై నిలువండీ భారతరక్షక భటవరులారా ప్రభువును జూపుటకై లెండి ఫలితము గనరండీ ||భారత||

  • బాలప్రాయమున్ మీరలెల్ల భక్తి జీవితాసక్తిపరులై అలయోసేపును బోలినవారై బలతర సామర్ధ్యము జూపి ఫలితముగనరండీ ||భారత||

  • శోధనాధికము చుట్టునున్న సకల యాశలును నెట్టుచున్న బాధించుచు మరి సాధించెడి యా సైతానుని గెలువగ లెండి ఫలితము గనరండీ ||భారత||

  • నమ్మకంబు మదియందు బూని నేర్పుతోడ ప్రభు సేవజేయ రమ్మిదె యేసుని రక్షణ సేవకు రాజితమగు జీవమునొందున్ ఫలితము గనరండీ ||భారత||

  • విజయ కాంక్షగలవారలెల్ల వినయ భూషణాసక్తిపరులై నిజమగు క్రైస్తవ నీతిని జూపి నిరతముగ వెలుగుదు రండీ నిజమిది గనుగొనుడీ ||భారత||
  • 525 దానియేల్వల 10/19/2017 20:16 525 దానియేల్వలె సాహసించుడి యొంటరిగా నిల్వ దానియేల్వలె సాహసించుడి దానియేల్వలె సాహసించుచు జ్ఞానులై దృఢ కార్యముఁ గలిగి దీనులై యా దృఢ కార్యం బిఁకఁ బూని తెల్పను సాహసించుడి ||దానియేల్||

  • నిక్కమగు కార్యమునందు నిలిచి దైవాజ్ఞ లెలఁ గ్రక్కున గైకొను జనములగాంచి చక్కఁగ వారిని ఘనపర్చుచు సంతతము నెనరుఁ పించుచు మిక్కిలి దానియేల్సంఘమును మెచ్చుచు నంగీకరించుఁడీ ||దానియేల్||

  • ధారుణిపైని నగరములలో మరణించిరిగా కడు శూరులనఁబడువా రనేకులు వారు దానియేల్సంఘమును గని కోరి యేకీభవించినమది వారలే ప్రభుదేవుని భట పరి వారమునఁబడి యుందురు నిజ మిఁక ||దానియేల్||

  • కాన నీ సువిశేషమును జెండ పైకెత్తుఁడీ సై తానుని నెదిరించను రండి దీనిని దీని శ్రేణులను యు ద్ధానికి రారమ్మని పిలిచి దానియేల్సంఘము పక్షమునఁ బూని జయధ్వనులనుఁ జేయుటకై ||దానియేల్||
  • 526 యేసువలె ఇల 10/19/2017 20:16 526 యేసువలె ఇల నేనుండెదను యేసువలెను ||

  • శుద్ధుడనై బ్రతుకు బద్ధుడనంచును శుద్ధుడనై యుండ శ్రద్ధ జూపుదు నేను ||యేసువలెను||

  • భరియింపవలసిన భారంబుల్గల వెన్నొ భరియింప మిక్కిలి బలశాలినై నేను ||యేసువలెను||

  • సాధింపవలెనెన్నొ సాహసకార్యంబుల్ సాధింపధైర్యాన సాగి పోవుదు నేను ||యేసువలెను||

  • ధాత్రి నెల్లతోడ మైత్రినేనెరపుచు శత్రులకునుగూడ మిత్రు డనై నేను ||యేసువలెను||

  • ఒరుల చింతలదీర్తు నుల్లాసమున గూర్తు పరమ ప్రేమతో నెపుడు పైకి జూతును నేను ||యేసువలెను||

  • నా దివ్యజనకుడు నాకు ననుదినమును బోధింప వాక్యంబు బుద్ధితో నేర్తును ||యేసువలెను||

  • వినిసంతసంబున ఘనుని యాజ్ఞలనెల్ల వెనువెంట జేసెద వినయంబున నేను ||యేసువలెను||
  • 527 ఓ క్రైస్తవ 10/19/2017 20:16 527 ఓ క్రైస్తవ యువకా నిజమంతయు గనుమా నీ బ్రతుకంత మారుటె మేలు కోరుము జీవమునే ||ఓ||

  • పాపపు చీకటి బ్రతుకేలా శాపపు భారము నీకేలా పావన ప్రభుని పాదము జేరిన జీవము నీకగుగా ||ఓ||

  • భయపడి వెనుకకు పరుగిడక బలమగు వైరిని గెలిచెదవా బలుడగు ప్రభుని వాక్యము నమ్మిన గెలుపే నీదగుగా ||ఓ||

  • మారిన జీవిత తీరులలో మానుగ నీ ప్రభుసేవకురా మహిమ కిరీటం మన ప్రభు సేవలో ఘనముగ నీకగుగా ||ఓ||
  • 528 బాలకా నీ వ 10/19/2017 20:16 528 బాలకా నీ వర్తనము గా పాడుకొని జీవింపరా మేలులుకుఁ బలు కీడు లకునదె మూలమనిగమనింపరా ||బాలకా||

  • తప్పినడువకు మెన్నడేని తల్లిదండ్రులు యానతి తప్పిపోయిన సుతుఁడు పడిన తిప్పలు నీ వెఱుఁగవా? ||బాలకా||

  • గోలచేయుచుఁ బెద్దలనుగని మేలమాడుట తగదురా బాలురా యెలిషాను నవ్వి ప్రాణగొడ్డమునొందరే ||బాలకా||

  • పరులకెగ్గొనరింపఁబోకుము దొరలునదినీ మీఁదనే పరునికై హామాను నిల్పిన కొఱఁత నతఁడే వ్రేలఁడే ||బాలకా||

  • కట్టఁడి కార్యంబుతుదకుఁ బట్టి కుడుపకపోదురా మిట్టిపడిన రాణి యెజెబె లెట్టులీల్గెనొ తెలియదా? ||బాలకా||

  • వగవకుము పరధనముఁగనియది తెగులులేని బాధరా సుగతిగనెనె యాహబుతా శునకముల కాహారమై? ||బాలకా||

  • ఆనృతంబులాడకుము దే హాంతమైన నేమిరా? ఆనృతము చేనని యాతన యాలితో సహకూలఁడే ||బాలకా||

  • కోపమునకాన్పదమునీయఁ గోరకుము మదినెన్నడు కోప జ్వాలలు పెంచికయ్యిను గోడు చెందడె హంతయై ||బాలకా||

  • తులువల జత గూడిమాడి చెలిమిచేయుట తగదురా పలువల సాంగత్యమున రెహ బాము భంగము నొందఁడే ||బాలకా||

  • బాలుడా నీ తరుణ హృదయము ప్రభున కప్పగింపరా శీల సౌష్ఠవ మొదవునీ కా శీస్సులను జేకూరురా ||బాలకా||
  • 529 శ్రీ యేసుర 10/19/2017 20:16 529 శ్రీ యేసురీతిగాను ప్రేమింపఁ గోరుదున్ నే నుండఁ గోరుదున్ కోపంబులేనివాఁడు శాంతుండు నాయనే నా స్వామి యొంటిగాను ప్రార్ధించునప్పుడు ఆయన తండ్రితోను మాట్లాడుచుండెను.

  • శ్రీ యేసురీతిగాను నే నుండఁ గోరుదున్ దూషింబఁబడఁగాను దీవించుచుండెను శ్రీ యేసురీతిగాను ప్రేమింపఁ గోరుదున్ నా చెలికాండ్ల మేలు నేఁ గోరు చుందును

  • శ్రీ యేసురీతి గాను నేనుండఁ గోరుదున్ నావంటి చిన్నవారిన్ ప్రేమించి పిల్చును. శ్రీ యేసురీతిగాను నేనిప్పు డిచ్చటన్ నీ రీతిగాను యేసూ న న్నుండఁ జేయుమీ
  • 530 ఓ క్రీస్తు 10/19/2017 20:16 530 ఓ క్రీస్తు భక్తులారా నీతి నిమిత్తము పోరాడ కవచంబు ను ధరించుడి శక్తుండు సైన్య ప్రభు వు, శాంతిరాజుకు అపారసేవ జేయ అర్పణ యైతిమి. ||జోహారు, రక్షకుండ! నీ మార్గమందున విజయగృహ దైవ పురంబు బోదుము ||

  • పదండి ముందుకంచు నాదంబు చేయుడు స్వార్థంబు గెల్వవలె సాగిపోదము హర్షంబులేని యాత్మ లెన్నెన్నొ చూడుడు ఈ ఘోరయుద్ధమున కందరి గూర్చుడు.

  • క్రీస్తే మా నాయకుండు అటంచు దెల్పగ మా హృదయంబునందు సంతోష శాంతిసేద లు కల్గునప్పుడు సిల్వధ్వజము! ఈ లోకమేలులన్ని దీవెన నొందును.
  • 531 రేగత్వరపడక 10/19/2017 20:16 531 రేగత్వరపడకు ఓర్చుకో కోపి గోడుజెందును ఓర్చుకో నీ కన్యాయమయినను కన్ను లెర్రజేయకు శాంత మొందు మెప్పుడు ఓర్చుకో.

  • ఎవ్వఁడేని తిట్టిన ఓర్చుకో మేలుఁజేయు కీడుకు ఓర్చుకో లోకమందు సుఖము కొంతసేపు నుండును కోపమేలఁ జేతువు? ఓర్చుకో.

  • నీవు కీడునొందఁగా ఓర్చుకో ప్రతి కీడుఁ జేయకు ఓర్చుకొనియుండుము అంత సరియగును నీకు జయముండును ఓర్చుకో.
  • 532 చేతులెత్తి 10/19/2017 20:16 532 చేతులెత్తి వందనములు చేతు మిపుడే యేసు నీకు రాతిరి పగ లందు మముఁ బ్రీతితోఁ గాపాడు యేసు ||చేతు||

  • సుఖమైనట్టి నిద్ర మమ్ము నొందఁజేసి రాత్రియందు సకల మేలు లంద జేయు స్వామి యేసుక్రీస్తూ నీకుఁ ||చేతు||

  • అన్నవస్త్రములను మాకు నన్ని వేళలందు నిచ్చి కన్న తండ్రివలెను బెంచు చున్న యేసుస్వామీ నీకే ||చేతు||

  • విద్యా బుద్ధులన్ని యిచ్చి వింత వింత వరము లిచ్చి పెద్దల దయలోనుమమ్ముఁ బెంపారఁ జేయు మేసయ్యా ||చేతు||

  • చిన్నవారి స్నేహితుడుగ నున్న యేసుస్వామీ నీకు ఎన్నో వేల స్తోత్రంబులు నిలలో నెపుడు కలుగుగాక ||చేతు||
  • 533 చిన్నబిడ్డ 10/19/2017 20:16 533 చిన్నబిడ్డల విన్నపముల నెన్నడైన త్రోయక పన్నుగ విను కన్న తండ్రిని సన్నుతింప జేరరే ||చిన్న||

  • భూమి మీద మానవునిగా స్వామి ఉండినప్పుడు ప్రేమతో అనేక మంది పిల్లల దరి జేర్చెను ||చిన్న||

  • చెంత జేర్చి చిన్న పిల్లల చేతులుంచి వారిపై ఎంతో దయతో నాశీర్వ దించె యేసు వారిని ||చిన్న||

  • చిన్న పిల్లల పోలికలను ఎన్నోమార్లు బోధలో ఎన్నుకొనుటలో మనయం దున్న ప్రేమ దెలిపెను ||చిన్న||

  • పాట పాడి ప్రభుని పేర కోటి స్తుతుల నియ్యరే చాటుగను బాహాటముగను మేటి ప్రభుని వేడరే ||చిన్న||
  • 534 జయం జయం హల 10/19/2017 20:16 534 జయం జయం హల్లెలూయ జయం జయ మిప్పుడే ప్రభు యేసు నామమునకు జయం జయ మిప్పుడే ||జయం||

  • ఓహో మిత్రులారా మీరు జ్ఞానమును పొందుడీ స్నేహమార్గం ముక్తిమార్గం జీవమార్గం ఆయనే ||జయం||

  • ఆలస్యమేలనో పాపి రమ్ము యేసు నొద్దకు ఆత్మమూర్తి రక్షణ మూర్తి యేసు ప్రభు వాయనే ||జయం||

  • రేపు అను చింతలను బాపి యేసు నమ్ముఁడీ రూపు మాపు అనక యేసు దాపు జేరుఁ డిప్పుడే ||జయం||
  • 535 బాలకుల విన 10/19/2017 20:16 535 బాలకుల విన్నపము లాలించు రక్షకా పాలనంబు సేయుమా పరమ పోషకా||


  • బాలలారా రండియంచు బిలిచిన యేసూ చాలనమ్మి జేరితిమి సరగ బ్రోవుమా||

  • మందబుద్ధి చేత నిన్ను మరచి యుంటిమి సుందరాప్త నీదయ మా యందు జూపుమా||

  • చదువు వేదవాక్య సరణి నడువ నేర్పుమీ మదిని బోధకుల సుబోధ మరువనీకుమీ||

  • ప్రకటితమగు నీదు ప్రేమ యనుభవించుచు ఇకను నిన్ను సేవ జేతు మఖిలకాలము||

  • పుడమి నీదు సిలువ కృపను పుణ్యలగుచును కడను నీదు మహిమ జేర గరుణజూపుము ||
  • 536 రాజా నా దే 10/19/2017 20:16 536 రాజా నా దేవా నన్ను గావ రావే ప్రభు ||రాజా||

  • తల్లి గర్భంబు బయలు వెళ్లిన దినమునుండి కొల్లగా సేవింపఁ జల్లనైన మోక్ష మియ్య ||రాజా||

  • బాలప్రాయమునుండి బ్రతికిన కాలమంత నీలాగు జీవించి నిత్యమైన మోక్ష మొంద ||రాజా||

  • మాకొఱకై వచ్చి మా పాపములకు మాయ లోకములోన మృతికి లోనై లేచితి వయ్య ||రాజా||

  • దండి ప్రభుండు యే సండఁ జేరఁగ మాకు నిండు వేడుకతోను నిత్య మోక్షంబు నియ్య ||రాజా||
  • 537 యేసునాధా ర 10/19/2017 20:16 537 యేసునాధా రారారా మా జీవనాధా రారారా||


  • దోసములు బాప నీవు వాసిగ జన్మించినావు ||యేసు||

  • నీచులను బ్రేమించి నీ కరుణఁ జూపినావు ||యేసు||

  • నీతిలేని వారి కెల్ల నిత్యజీవ మిచ్చినావు ||యేసు||

  • పొందరాని కష్టములను బొంది యుంటివి తండ్రి ||యేసు||

  • లోకపాపమును జయించి లోకుల రక్షించితివి ||యేసు||

  • వేడుకతోడ మేము వేఁడుకొందుమో తండ్రి ||యేసు||
  • 538 పిల్ల నైన 10/19/2017 20:16 538 పిల్ల నైన నన్నుఁ జూడుమీ ప్రియ మైన యేసు పిల్ల నైన నన్నుఁ జూడుమీ చల్లని రక్షకుఁడ వనుచు సత్య వార్తఁ దెలుపుచుండ నుల్ల మందు నిన్ను నమ్మి కల్ల లేక వేఁడుకొందుఁ ||బిల్ల నైన||

  • నిన్ను నమ్మి యున్నవాఁడను ఘన దేవ తనయ నన్ను దాఁచు నీ నీడను తిన్నని హృదయంబు నాకుఁ జెన్నుగా నొసంగి యిపుడు సన్నుతింప నిమ్ము నన్ను సాధు వైన నిన్నుఁ దలఁచి ||పిల్ల నైన||

  • ప్రేమచేత నొప్పుచుంటివి ప్రేమా స్వరూప ప్రేమలోన నడచు చుంటివి ప్రేమ లేని నన్నుఁ బ్రోవఁ బ్రేమచేత బ్రాణ మిచ్చి ప్రేమఁ జూపు మనుచు నన్నుఁ బ్రీతి చేత బోధింపఁ ||బిల్ల నైన||

  • పరమ జనకు చిత్త మెప్పుడు పరమేశ పుత్ర బిరబిరగను జేయఁగా నిమ్ము కరుణ మీర నాత్మచేత వరవరంబు లొసఁగి నాకు నరిలలోన నిన్నుఁ గొలువ ధరణిమీఁద నన్ను నిలుపఁ ||బిల్లనైన||

  • బలము మీర నన్ను నిలుపుము తుల లేనివాఁడ బలము గల్గు నీదు చేతుల నిలను నీకు ఫలము లిచ్చి యెలమి నిన్ను గొప్పఁ జేయ సలలిత ముగ నడువ నిమ్ము చక్కని నీ మార్గమందుఁ ||బిల్లనైన||
  • 539 దేవ కావవే 10/19/2017 20:16 539 దేవ కావవే నేడు మమ్ములన్ నీవెరాత్రి కాచినావు నీకు స్తోత్రము ||దేవ||

  • ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య నేడు నీదు కఱుణ తోడను ||దేవ||

  • నేటి కార్యముల్ నేడె చేయగా సూటియైన త్రోవ మాకు చూపుమోప్రభో ||దేవ||

  • చెడ్డ కార్యముల్ చేయకుండను దొడ్డబుద్ధి నిచ్చి మమ్ము నుద్ధరించుము దేవ ||దేవ||
  • 540 దేవకావవే ర 10/19/2017 20:16 540 దేవకావవే రాత్రి మమ్ములన్ నీవె నేడు కాచినావు నీకు స్తోత్రము ||దేవ||

  • ఆపదలు మమున్ అంటకుండను కాపుగాచి మంచి నిద్ర కలుగ జేయుమీ ||దేవ||

  • పండియుండగా పాము తేలులున్ గండములను తొలగజేసి కాయుమో ప్రభో ||దేవ||

  • దుష్ట స్వప్నముల్ దొగ భయమును కష్టములను తొలగజేసి కాయుమో ప్రభో ||దేవ||
  • 541 ఒక్క మనుజు 10/19/2017 20:16 541 ఒక్క మనుజు డెరుషలేమునుండి యెరికొ పట్టణమునకు మక్కు వతో వెడలుచుండె కొంత ధనముతో ||ఒక్క||

  • మార్గమందు దొంగలతని పట్టికొట్టి దోచుకొనిరి మూర్ఛపోవు నట్లు గొట్టి విడిచి వెళ్లిరి ||ఒక్క||

  • అపుడు నొక్క యాజకుండు వచ్చి జూచి ప్రక్కగాను కపటముతో వెళ్లె వాని నాదరింపక ||ఒక్క||

  • వెనుక నొక్క యాజకుండు వచ్చి జూచి యోర్వలేక గన్నులారా జూచి పోయె గరుణలేకను ||ఒక్క||

  • పిదప సమరయుండు వచ్చి జూచి యోర్వలేక గన్నులారా జూచి గరుణతోడ భేదమొంచక ||ఒక్క||

  • నూనె ద్రాక్షరసము పోసి గాయములను గట్టి వాని ఘనమగు వాహనముమీద నూరు చేర్చెను ||ఒక్క||

  • అటువలెను మనము కూడ కష్టములలో నుండువారి కష్టములను జూచి యాదరింపవలయును ||ఒక్క||
  • 542 వారు ధన్యు 10/19/2017 20:16 542 వారు ధన్యు లైన పిల్లలు భూలోకమందు వారు ధన్యులైన పిల్లలు కోరి విచారమును ప్రభుని సార వాక్య మెదను బెట్టి వారి వారి కితరులైన వారికిని విధేయులైన ||వారు||

  • అన్నదములందు నెటులను తనతోడ నాడు చున్న యితరులందు నటులను భిన్న మెంచ కొక్కరీతిఁ దన్నుఁబోలె ప్రియ మొనర్చి తిన్నని బడియందు నేర్చు చున్నవార లెవ్వరో ||వారు||

  • ఒక్కఁడె తండ్రి యతఁడు దేవుఁడు మన కందరకును సకల సుఖములిచ్చు నెప్పుడు అకట మన మిఁకను జగడము లాడఁదగదు ప్రభుని రీతి నొకని నొకఁడు ప్రియము చేసి యుండుద మని తలఁచుచుండు ||వారు||

  • మంచి మేలు లనుభవింపఁగఁ గరుణించి దేవుఁ డెంచి మనల నిచటఁ గూర్చెఁగ వంచనలఁ ద్యజించి కనిక రించి యొకనినొకఁడు మది స హించి మంచి క్రియలతో వ ర్తింప నిశ్చయింతు రెవరో ||వారు||

  • ఆకసమున నున్న దేవుఁడు మన మనసు రాక పోక లన్ని చూచు నెప్పుడు ఏకముగా హృదయములు వి వేకమున వెలుంగఁ జేసి ప్రాకాటముగఁ బ్రభుని యాజ్ఞ గైకొనియెడి వార లెవరో ||వారు||
  • 543 అనుకరించెద 10/19/2017 20:16 543 544 తండ్రి వంట 10/19/2017 20:16 544 తండ్రి వంటివాఁడు మనకు ధరణిని బోషించువాఁడు దండ్రి ప్రియుఁ డు నందరికిఁ దగినవాని నొసగువాఁడు ||దేవుఁడు||

  • అన్నవస్త్రములనే గాక యన్నిఁటిని నిచ్చువాడు మన్ననతోఁ బ్రోచు వాడు మనతో నెప్పుడు మెలఁగువాఁడు ||దేవుఁడు||

  • కష్టబాధలందు మనలఁ గనికరముతోఁ గాచువాఁడు దుష్టమనసు తీసివేసి యిష్టముతో నుండువాఁడు ||దేవుఁడు||
  • 545 హల్లెలూయ న 10/19/2017 20:16 545 హల్లెలూయ నీ కల్లెలూయ చల్లఁగా రమ్మిప్పు డేసు ||హల్లెలూయ||

  • ఒప్పుకొందుము మాదు తప్పిదంబులన్ ముప్పులో నుండి మమ్ముఁ దప్పించు మయ్యా ||హల్లెలూయ||

  • పిల్లల మయ్యా బీద పిల్లల మయ్యా చల్లని నీ నామమును సన్నుతింతుము ||హల్లెలూయ||

  • వందనమయ్యా నీకు వందన మయ్యా యందముగ మమ్మును నీ యందు నిల్పుమా ||హల్లెలూయ||

  • ఆడుచుందుము మేము పాడుచుందుము వేడుకతోఁ గూడి నిను వే డుకొందుము ||హల్లెలూయ||
  • 546 ఆ చిన్న వా 10/19/2017 20:16 546 547 యేసుబోలి మ 10/19/2017 20:16 547 యేసుబోలి మంచిబుద్ధి యెంతో ప్రేమగలిగినే నేను గోరినట్టి పనుల నెపుడు చేయగోరుదున్ దయయు శాంతమమరినట్టి తనదు నడత దలచుకొనుచు ||యేసు||

  • యేసు చిన్నబాలుడై యీ ధరను దిరిగినప్పుడు ఎల్లరతని మంచి గుణము లెంచి ప్రేమ జూపిరి దయయు, శాంతమమరినట్టి తనదు నడత దలచుకొనుచు ||యేసు||

  • పిట్టలందు పూవులందు ప్రీతిజూపె నేసుడు అల్పజీవులైన, తండ్రి యన్నిజేసెనంచును దయయు, శాంతమమరినట్టి తనదు నడత దలచుకొనుచు ||యేసు||
  • 548 దేవపుత్రుల 10/19/2017 20:16 548 దేవపుత్రులందఱు ఎంతో భాగ్యవంతులు పాప మరణాదులు పరిహారమాయెను. ||నేను నట్టివారితో పాలు పొందవలెను||

  • వారు క్రీస్తువల్లనే ఐరి నీతిమంతులు స్ధిరమైన నెమ్మది భక్తులందరొందరి.

  • తండ్రి యొద్ద పిల్లలు నిర్భయాళులౌదురు వారు కూడ దేవునిన్ చేర భయపడరు.

  • వారి కెట్టి కష్టముల్ హానిచేయ నేరవు వారికిన్ నిజంబుగా శ్రమ యుపయోగము

  • ఇహమందు కరుణ చావువేళ నెమ్మదిది పరమందు భాగ్యము వారికిన్ సంపూర్ణము.
  • 549 ఏ దేశస్థుల 10/19/2017 20:16 549 ఏ దేశస్థులమైన ఏ జాతి మనదైన యేసులో మన మొక్కటే ఏకమై బాలల మెల్లరమును తండ్రి నెంతో స్తుతించుచు నెప్పుడు బాడుదము ||ఏ||

  • పలు దేశములలోన పన్నుగ దేవుని ప్రార్ధించెడి బాలలం పరమ తండ్రీ మాలో ప్రతివారి దీవించు బహుగా నీ దినమనుచు బ్రతిమాలి వేడుదము ||ఏ||

  • బహు దేశములలోన పలువిధుములగు పనులు పరగజేసెడి బాలలం ప్రభుడే యేసుని కొఱకే ప్రపంచమంతటిని బాగుచేయను మిగుల ప్రయాసపడుదము ||ఏ||
  • 550 కల్వరియున్ 10/19/2017 20:16 550 కల్వరియున్నంత దూరం వెళ్లెను నా కొరకు నా కొరకు కల్వరి యున్నంత దూరం వెళ్లెను నా ప్రియ రక్షకుడు ||

  • తన రక్తమెంతో ధారపోసెను పోసెను పోసెను తన రక్తమెంతో ధారపోసెను నా ప్రియ రక్షకుడు ||

  • నా పాప శాపమంత క్రీస్తు బాపెను బాపెను బాపెను నా పాప శాపమంత క్రీస్తు బాపెను నా ప్రియ రక్షకుడు ||

  • చావును జయించి మరల లేచెను లేచెను లేచెను చావును జయించి మరల లేచెను నా ప్రియ రక్షకుడు ||

  • తన యాత్మతోడు సమకూర్చెను కూర్చెను కూర్చెను తన యాత్మతోడు సమకూర్చెను నా ప్రియ రక్షకుడు ||

  • నీతి త్రోవయందు నన్ను నడ్పును నడ్పును నడ్పును నీత్రి త్రోవ యందు నన్ను నడ్పును నా ప్రియ రక్షకుడు ||

  • మరల వచ్చి తన యొద్ద చేర్చును చేర్చును చేర్చును మరల వచ్చి తన యొద్ద చేర్చును నా ప్రియ రక్షకుడు ||

  • శృంగారమైన మోక్షం నాకు చూపెను చూపెను చూపెను శృంగార మైన మోక్షం నాకు చూపెను నా ప్రియ రక్షకుడు ||
  • 551 కన్యా గర్భ 10/19/2017 20:16 551 కన్యా గర్భమున బుట్టి కరుణగల్గు బాలుఁడవైన కన్యా సుతుండ నిన్నే నమ్మితి నో యేసునాధ కన్ను లెత్తి మమ్ముఁ జూడుము ||కన్యా||

  • బాల ప్రాయమున నేను బాగుగా నీ పాద సేవఁ జాలజేసి యున్న వా డనుగా యో యేసు నాధ చాల దయతో మేలు చేయుమి ||కన్యా||

  • ఇంపైనట్టి మరియ తనయ యిహము పరము నేలు బాల సొంపుగా నీ ప్రాపే గోరితి నో యేసునాధ చెంపఁ గొట్టి బుద్ధి చెప్పుము ||కన్యా||

  • తుంటతనము చేత జగము తంటాచేసి తిరుగుచుంటి నంటిన మాయల బాధల నో యేసు నాధ యంటుఁ బాపి జంటజేయుము ||కన్యా||

  • మింట నుండి నీవు వచ్చి మంటి పైని బాలుఁడ వగుచుఁ గంటి కింపు గాను నడిచితి వో యేసు నాధ కానుపర్చి తోవు త్రోవను ||గన్యా||
  • 552 బాల యేసుని 10/19/2017 20:16 552 బాల యేసుని జూడరే కరు ణాల వాలని బాడరే కాల పూర్ణత జూచి దేవుడు కొమరుడై జన్మించెనే ||బాల||

  • దూతలారా రండి రండి బేతలేమున బుట్టిన నూతనాద్భుత శిశువు జూచి స్తోత్రగీతముల్ పాడరే ||బాల||

  • గొల్లలారా రండి రండి గొప్ప యుత్సవ మొందరే ఎల్ల జనులకు రక్షణంబని యంతటను చాటించరే ||బాల||

  • జ్ఞానులారా రండి రండి కానుకల నర్పించరె దీనులను రక్షించ దేవుడు మానవుండై బుట్టెను ||బాల||

  • భక్తులారా రండి రండి భజన పాటలు పాడరే ముక్తిరాజగు యేసు ప్రభు మన మధ్యనే జన్మించెను ||బాల||

  • లోకుందరు రండి రండి ఏకమై కీర్తించరే శ్రీకరుండౌ యేసు క్రీస్తుడు శ్రీ లొసంగగ వచ్చెను ||బాల||
  • 553 చిన్న పరలో 10/19/2017 20:16 553 చిన్న పరలోకమన్న మన హృదయం అన్న యేసన్న అందున్న సమయం ||చిన్న||

  • చిన్న పరలోకమన్న మన గృహము అన్న యేసన్న అందున్న దినము ||చిన్న||

  • చిన్న పరలోకమన్న మన స్నేహం అన్న యేసన్న అందున్న నాటన్ ||చిన్న||

  • చిన్న పరలోకమన్న మన సంఘం అన్న యేసన్న అందున్న కాలం ||చిన్న||
  • 554 చిన్నవారి 10/19/2017 20:16 554 చిన్నవారి ప్రియ యేసు రక్షకా మాదు విన్నపంబు నాలకింపుమా

  • మా ప్రవర్తనందు జక్కపర్చుము నీతి మార్గమందు నడువజేయుము.

  • ఇంక పెక్కుమంది చిన్న బిడ్డలు నిన్ను నమ్మునట్లు దయజేయుము

  • నిన్ను వెంబడించి యెల్లకాలము నీదు సముఖమందు సంతసింతుము.
  • 555 ఆశీర్వాదము 10/19/2017 20:16 555 556 నే బీద చిన 10/19/2017 20:16 556 నే బీద చిన్న పిల్లను నా బుద్ధి స్వల్ప మయినది నా దివ్య యేసు కొఱకు నే నేమి చేయగలను?

  • నిత్యంబుఁ చిన్న పనులు నే చాలఁ జేయవచ్చును నా చిన్న తప్పు లన్నియు నే చక్క పెట్టవచ్చును.

  • మనస్సునందు కోపము వేమాఱు పుట్టునప్పుడు నా కన్ను లెఱ్ఱఁ జేయక నే నోర్చు కొనవచ్చును.

  • నే తిన్నగాను నడ్చుచు ఇల్లంత వెలిఁగించుచు నా యేసుకై యుల్లాసముఁ బుట్టింపవచ్చు నెప్పుడు

  • నే నెంత చిన్న పిల్లను నా కుండు చిన్న బాధకు నే తాలి ప్రేమ స్తోత్రము లర్పించుచుండఁగలను.
  • 557 "ప్రకాశించ 10/19/2017 20:16 557 "ప్రకాశించుడి" యను నాజ్ఞను ప్రభువైన యేసు మన కిచ్చెను ప్రేమ యను దివ్వె వెలిఁగింతుము నీవు నీ యింటన్ నేను నా యింటన్

  • "ప్రకాశించుడి" యను నాజ్ఞను ప్రభువైన యేసు మన కిచ్చెను దురితాంధకారమున్ హరింతము నీవు నీ యింటన్ నేను నా యింటన్

  • "ప్రకాశించుడి" యనునాజ్ఞను ప్రభువైన యేసు మన కిచ్చెను భక్తి యను దివ్వె వెలిఁగింతము నీవు నీ యింటన్ నేను నా యింటన్.
  • 558 యేసు నన్ను 10/19/2017 20:16 558 యేసు నన్నుఁ బ్రేమించి దాసు నన్నుఁ బిల్చెను ఈ సత్యంబు బైబిలు తేటగాను దెల్పెను. ||యేసు ప్రేమించును దాసుల నందఱిన్ ఆ స్వామి వేదమే ఈ సత్య మిచ్చెను ||

  • బాలురమౌ మమ్మును బాగుగాఁ ప్రేమించును శక్తిలేనివారము బలవంతుఁ డేసుఁడు.

  • బుద్ధిలేని వారికిఁ తాను బోధపర్చును శుద్ధిలేని వారిని శుద్ధిఁ జేసి ప్రోచును.
  • 559 మంగళము క్ర 10/19/2017 20:16 559 మంగళము క్రీస్తునకు మహిత శుభవార్తునకు మంగళము త్రిత్వస మాన్వితునకు మంగళము దూత జన మకుట మగు ప్రభువునకు మంగళము వేదాంత మాన్యునకును జయ మంగళము సదా శుభ మంగళము ||జయ||

  • కానాకుఁ జనుదెంచి కల్యాణమును మహిమ గా నొనరప్పను నీరు గాంచి ద్రాక్షా పానముగ మార్చి నీ ప్రథమాద్భుత ప్రతిష్ఠ భూనుతుఁడ తెల్పితివి మానితముగా ||జయ||

  • నీకు సంఘమునకు నిత్యమైన వివా హైకత్వమునకుఁ దగు నెచ్చరికగాఁ గైకొనెడి నీ సేవక వరుల పరిణయము నీ కరుణచే ధరను నిముడుగాక ||జయ||

  • ప్రేమానుబంధమునఁ బెనగి యీ దంపతులు వేమారు నీ మహిమ వెదకి భువిని కామాదులను గెల్చి కైవల్య పురమునకు క్షేమ మగు కృపనిచ్చి చేరనిమ్ము ||జయ||

  • ఆదికాలము నాబ్ర హాము శారా లెంతో నీ దయలో బ్రతికి యిల నెగడినట్టు ఈ దీన దంపతులు గాదిలిచే బ్రతుకుటకు నీ దయారసమొస గు మక్షయుండా ||జయ||

  • సంతానము గాంచి సద్భక్తిలో బుద్ధి మంతులై క్రైస్తవ మతము నందు అంత్యపర్యంతంబు నణుఁకువగఁ బెంచ నా ద్యంత రహితుండ స హాయ మిమ్ము ||జయ||

  • కర్తయైన క్రీస్తు కరుణయు దేవుని పరమపూర్ణ ప్రేమ ప్రబలము గను సురుచిరం బగు పరి శుద్ధాత్ము నైక్యత కలుగుఁగాక దంప తుల కనిశము ||జయ||
  • 560 ప్రభు మార్ 10/19/2017 20:16 560 ప్రభు మార్గములయందె భయభక్తి నిందు శుభరీతి నడిచే పురుషుండే ధన్యుండు ||ప్రభు||

  • అపుడు నీచే కష్టం బారగించుదువు ఎపుడు ధన్చుడవు నీ కిలమేలౌ గాక ||ప్రభు||

  • నెలవు ప్రక్కలనున్న సఫలమౌ ద్రాక్షతీ గెల పోలి నీ భార్య ఫలమిచ్చును గాక ||ప్రభు||

  • పిల్లలిప్ప మొక్క పెంపువలె నీదు బల్లజుట్టుకొని శో భిల్లుదురు గాక ||ప్రభు||

  • ప్రభున కిదిగో భీతి పడువాడీరీతి విభవంపు దయనొంది వికసించునుగాక ||ప్రభు||

  • ప్రభు సీయోనునుండి ప్రశస్త కృపను ప్రబలంబుగా నిచ్చి బ్రతికించునుగాక ||ప్రభు||

  • అరయ బ్రతికెడు రోజు లన్నిట నీవు యెరుషలేము క్షేమంబు నెపుడు జూచెదవు ||ప్రభు||

  • నీదు పిల్లల పిల్లలు నిజామిశ్రాయేలు మీది క్షేమముజూచి మోదమొందెదరు ||ప్రభు||

  • తండ్రి కుమార శుద్ధాత్మునకు మహిమ మెండై యుగయుగములం దుండుగా కామేన్ ||ప్రభు||
  • 561 కోరుకొని య 10/19/2017 20:16 561 కోరుకొని యున్నాము యేసు ప్రభూ కోరుకొని యున్నాము సార కల్యాణ గుణమణి సన్నిధి ||కోరుకొని||

  • చారు వివాహో త్సవము ఘనముగఁ జేయఁ గోరి దర్శన మి చ్చితివి గనుకఁ గూరిమితో నిది గో యీ పెండ్లికి మాకుఁ గారపు చుట్టము గా నిన్ను యేసూ ||కోరుకొని||

  • కరములు జోడించి పరస్సర ప్రమాణ భరము మోసిషిన యీ దం పతుల మీఁద వర కరుణైక్యతకు భ వదను గ్రహ కిరీట ము రచించి తద్భంధ మును నీవే దీవింపఁ ||కోరుకొని||

  • చనువొప్ప వారు క్రై స్తవ జాగరూకత లను దమ తమ వంతు లుభవించి మొనసి సంసార భర మును జులకన పర్చు కొను తదాత్మల మే ళన నీవు దయచేయఁ ||కోరుకొని||

  • ఘన విశ్వాస ప్రా ర్థన కోరికలయందుఁ దనర నొకరి కొకరు దయఁ జూపుచు నొనర కుటుంబంబు నురువు నొదింపంగ మనసారఁ దత్సంత తిని గాన డయచేయఁ ||కోరుకొని||
  • 562 కానాపురంబు 10/19/2017 20:16 562 కానాపురంబులోఁ గడు వింతగా నీరు జానుగా ద్రాక్షరసమును జేసి పానముగఁ బెండ్లిలో బాగుగా నిచ్చిన దీన రక్షక బెండ్లి దీవించుమీ ||కానా||

  • రావయ్య పెండ్లికి రయముగా నో యేసు ఈవు లియ్యఁగ వచ్చు హితుని బోలి కావు మీద్వంద్వమును ఘనమైన కృపచేత భావమాలిన్యంబుఁ బాపి యిపుడు ||కానా||

  • దయ నుంచు మయ్య యీ దంపతులమీఁద దయుఁడవై కాపాడు తండ్రి వలెను నియమంబుగా వీరు నీ చిత్తమును జరిపి భయము లేకుండ గ బ్రతుక నిమ్ము ||కానా||

  • ఒప్పు మీరఁగఁ జేయు నొప్పందము వీర లెప్పుడును మదిలోన నిడికొనుచును దప్పకుండఁగ దాని నిప్పుడమిలో నెపుడు గొప్పగా నెరవేర్పు గూడ నుండు ||కానా||

  • చక్కఁగా నెగడింప సంసార భారంబు నెక్కు వగు నీ యాత్మ నిపు డొసంగి నిక్క మగు సరణిలో నెక్కువగ నడిపించి క్రక్కు నను దీవించు కరుణానిధీ ||కానా||

  • పిల్లలను నీవొసఁగఁ బ్రియముతో నో దేవ పెల్లుగా బోధింప వెరవు జూపు మెల్ల వేళలలోన నిరుకు మార్గము నందు జల్లఁగా నడిపింప శక్తి నిమ్ము ||కానా||
  • 563 మానవుల మేల 10/19/2017 20:16 563 మానవుల మేలు కొరకు జ్ఞానియైన దేవుఁడు మానుగఁ కల్యాణ పద్ధతి మహిని నిర్ణయించెగా ||మానవుల||

  • కానాయను నూరిలో మన కర్త చూచెఁ బెండ్లిని పానముగను ద్రాక్షరసము దాన మొసఁగెఁ బ్రీతిని ||మానవుల||

  • యేసూ వీరిద్దరిని ఏకముగాఁ జేయుమీ దాసులుగను జేసి వీరి దోసము లెడబాపుమీ ||మానవుల||

  • కర్త వీరలకు భార్య భర్తల ప్రేమంబును బూర్తిగ నీ విచ్చి వీరిఁ బొందుగాను నడుపుమీ ||మానవుల||

  • భక్తియు విశ్వాస ప్రేమలు భావమందు వ్రాయుమీ ముక్తి సరణి వెదక వీరి భక్తి మిగులఁ జేయుఁమీ ||మానవుల||
  • 564 దేవర నీ దే 10/19/2017 20:16 564 దేవర నీ దేవెనలు ధారళముగను వీరలపై బాగుగ వేగమె దిగనిమ్ము పావన యేసుని ద్వారగను ||దేవర||

  • దంపతులు దండిగ నీ ధాత్రిలో వెలయుచు సంపదలన్ సొంపుగ నింపుగ పెంపగుచు స హింపున వీరు సుఖించుటకై ||దేవర||

  • ఈ కవను నీ కరుణన్ ఆకరువరకును లోకములో శోకము లేకయె యేకముగాఁ బ్రాకటముగను జేకొనుము ||దేవర||

  • ఇప్పగిది నెప్పుడును గొప్పగు ప్రేమతో నొప్పుచు దా మొప్పిన చొప్పునఁ దప్పకను మెప్పుగ బ్రతుకగఁ బంపు కృపన్ ||దేవర||

  • తాపములు పాపములు మోపుగ వీరిపై రాకుండగాఁ గాపుగఁ బ్రాపుగ దాపునుండి యాపద లన్నియుఁ బాపుచును ||దేవర||

  • సాధులుగన్ జేయుటకై శోధనలచే నీవు శోధింపగాఁ కదలక వదలక ముదమున నీ పాదము దాపునఁ బాదుకొనన్ ||దేవర||

  • మెండుగ భూమండలపు గండములలో వీరుండగను తండ్రిగ దండిగ నండనుండి వెండియు వానిని ఖండించవే ||దేవర||

  • ఇద్దర వీరిద్దరును శుద్ధులై నిన్ను సేవించుటకై శ్రద్ధతో బుద్ధిగ సిద్ధ పడన్ దిద్దుము నీ ప్రియ బిడ్డలుగాన్ ||దేవర||

  • వాసిగ నీ దాసులము చేసిన యీ మొఱల్ దీసికొని మా సకలేశ్వర నీ సుతుఁడౌ యేసుని పేరిటఁ బ్రోవు మామేన్ ||దేవర||
  • 565 మానవ జ్ఞాన 10/19/2017 20:16 565 మానవ జ్ఞానంబును మించినట్టి మాధుర్య మౌ సంపూర్ణ ప్రేమ మా, మక్కువ దంపతులఁ బ్రేమ ముట్టి చక్కని యైక్యమందుఁ జేర్చుమా

  • మాధుర్య మౌ సంపూర్ణ ప్రేమ మా, నీ మోద మొసంగి సర్వ శీలము భక్తి విశ్వాస నీతి న్యాయములఁ బరంగఁ జేయ వీరిన్ జేర్చుము

  • దుఃఖంబు గెల్చు నానందంబుతో డఁ కష్టంబు లోర్చు సమాధానము రాఁబోవు నిత్యజీవమును పొంద ప్రాభవ మిమ్ము వీరి కేసువా.
  • 566 ఏదేన్ వనంబ 10/19/2017 20:16 566 ఏదేన్ వనంబునందు ఆది వివాహమున్ విధించినట్టి వాక్కు వర్థిల్లు నిప్పుడున్.

  • పవిత్ర కల్యాణంబున్ పదిలపర్చుచు దైవ త్రిత్వంబు నేఁడున్ దీవింప వత్తురు.

  • సంతాన వరమును సంతోష ప్రేమయు వింతైన యైక్యత్వంబు నెంతయు నిత్తురు.

  • ఆదామునకుఁ దండ్రీ, హవ్వ నొ సంగితి వాదరముగ నీమె నీ ధన్యున కిమ్ము

  • నీ ఱెక్క క్రింద వీరిఁ బరిగ్రహించుచు వైరి తంత్రంబునుండి దూరంబుఁ జేయుము.

  • ఈ రీతిన్ బ్రత్కి యంత క్రీస్తేసు పెండ్లికి వీరిద్దరును జేరి బరంగఁ జేయుమి.
  • 567 దేవా, మా గ 10/19/2017 20:16 567 దేవా, మా గృహంబును సదయుండవై దీవించుటకు రారమ్ము నీవె యిద్దానిని నెఱదాతవగుచు స ద్భావముతో నిచ్చితివి బహుమానముగ మాకు ||దేవా||

  • మా యింటి యజమానుండ వీవెసుమ్మి మా యింటి ప్రభుఁడ వీవె పాయక మా యింట భవదీయాభీష్టంబె శ్రేయోదాయకమగుచు సిద్ధిం చెడును గాక ||దేవా||

  • మా యాస్తిపాస్తులన్ని మా కబ్బె భవ దీయానుగ్రహ బలముచే నీయాననవ్వాని నీ యలఘ సేవకై న్యాయముగ నర్పింప నీయవె ఘన బుద్ధి ||దేవా||

  • నీవిచ్చు ధననిధులైన మా బిడ్డలు కేవలము నీ దాసులై భావివానిరి మణుల ఠేవనుద్భాసిల్ల నీవెవారిని భృశము ప్రోవుమాయువొసంగి ||దేవా||

  • రేపుమాపీ గృహునఁ బ్రోక్తములగుచు దీవించు ప్రార్థనముల లోపరహితంబులుగా ధూపధూమములట్లు నీ పాదయుగళి స మీపింప నిమ్మెపుడు ||దేవా||

  • ఏ రోగమును నెపుడేని మా మందిరపు ద్వారంబు చొరనీయక ఆరోగ్యభాగధే యంబిచ్చి మమ్ములను భూరికృపబ్దివై పోసింపుమను దినము ||దేవా||

  • ఇరుగుపొరుగు వారలతో సమాధాన పరతవసింపను నేర్పి కొఱగాని కలహములు త్వరపెట్ట నవ్వాని భరియింపఁదగు సహాన భావంబు మా కిమ్ము ||దేవా||

  • బీదసాదల కెల్లరకు మా గృహమెప్పు డాదరణాస్పదమై యుండ నీ దానాసారంబు నెఱవర్షించిన కొలఁది నౌదార్యగుణము మా యందుఁ బెంచుము సొరిది ||దేవా||

  • నక్కలకు బొరియలుండు దివి పక్షులకుఁ జక్కని గూళ్లునమరు నొక్కింత యిక్కనా కెక్కడలేదనిన చక్కని నరసుతమా సదనంబు నకు రమ్ము ||దేవా||
  • 568 దీవించు దే 10/19/2017 20:16 568 దీవించు దేవా నీ బిడ్డలను దీవించు దేవా దీవించుమీ గృహము దేవపుత్రుల మంచి స్థావరంబుగ వెలసి సత్యకాంతుల బరుప ||దీవించు||

  • నీవే యీ గృహమునకు నిత్యతలపతివంచు నేవేళ నీ మనసు నెరిగి జీవింపగ ||దీవించు||

  • సంభాషణలవేళ సన్నిహితుడా నీకు సంబరంబును గూర్చు సద్వా క్కులను బలుక ||దీవించు||

  • భోజన సమయమున భూరి ప్రేమతో నిన్ను పూజ్యుండౌ యతిధిగ పూజసల్పుచు బిలువ ||దీవించు||

  • ఇరుగుపొరుగులనెల్ల పరవారివలెగాక పరమాత్మనీసుతుల వలె జూచి ప్రేమింప ||దీవించు||

  • అనుదిన ప్రార్థన లందు శ్రద్దాభక్తు లను జూపి క్రైస్తవ యనుభవంబుల నొంద ||దీవించు||

  • క్రైస్తవగృహ విధులే గృహమున నెరవేర విస్తారమగు కృపను వీర లందరి కొసగి ||దీవించు||

  • ఆయురారోగ్యంబు లాత్మైశ్వర్యములిచ్చి ఈ యూర వీరు నీకింపగు సాక్ష్యము నియ్య ||దీవించు||
  • 569 ఇలఁ పుచ్చు 10/19/2017 20:16 569 ఇలఁ పుచ్చుకొనుట కన్న నెంతో యిచ్చుటయే ధన్య మన్న తులలేని భక్తి మీర చెలువైన రక్తి దీర నలలారు కూరిమితో మరి పేరి మితో మెలంగినచో నెలమిని బ్రభుఁ డిడుఁ బలు దీవెనల ||నిల||

  • పొడగాంచి చుక్క జ్ఞానులు కరము నడిచి నడచి కానుకలు నిడి బాలనృపునిమ్రోల పడి మ్రొక్కి మోడ్చి కేలఁ గడు నిత్యభాగ్యమును సౌభాగ్యమును గడించికదా వెడలి రమందానందముతోడ ||నిల||

  • మును పేద విధవ చాల భక్తి నొనరంగ గుడి చందాలఁ దన జీవనం బై యుండు నెనరాని కాసుల రెండు మనసార నర్పించె సమర్పించె మనశ్శాంతిన్ గని యెను క్రీస్తుని వరముల బడసె ||నిల||

  • తనయ నీదు హృదయంబు నాకి మ్మనె దేవుఁడె యనయంబు మన సొప్పి మన కానుకల మారాడక మన సకల మును నీయఁ గావలయున్ బ్రభుడాయవలెన్ మనం బలరన్ సణుగక గొణుగక వర్ధిల్లు కొలఁది ||నిల||
  • 570 ఇయ్యుడి మీ 10/19/2017 20:16 570 ఇయ్యుడి మీకియ్యబడునని ఇయ్యగల శ్రీ యేసు ప్రభువు నెయ్యముతో తన శిష్యవితతికి నయముమీర జెప్పినట్లు ||ఇయ్యుడి||

  • మొదట పరముని నంతునియ్యరే సదమల హృదయంబుతోడ సదయు డగు మన పరమతండ్రి ముదమతోడ నంతయు నిచ్చున్ ||ఇయ్యుడి||

  • శక్తికొలది నియ్యవలెనని భక్తులందరితోడా జెప్పె భక్తితోడ ప్రభుని సేవకు శక్తికొలది నియవలెను ||ఇయ్యుడి||

  • కొంచెముగ విత్తెడివారు కొంచెము సమకూర్చెదరు హెచ్చువిత్తెడి వారికిలను హెచ్చు ఫలములు నిండుగ దొరుకున్ ||ఇయ్యుడి||

  • సంతసంబుతో నిచ్చెడివారి నెంతో దేవుడు కృపతో బ్రోచున్ వింతగా దీవెనలతోడ అంతయు దయచేసి బ్రోచున్ ||ఇయ్యుడి||

  • యేసు కృపను ఎరిగిమనుడి యేసు మార్గమునందు నడువుడి దాసుడై ధనమంత విడిచె నీచులకొరకిలను మున్నె ||ఇయ్యుడి||

  • పరమనిధులను నింపుకొనుడి పరమ దేవుని ప్రేమను గనుడి పరమ నిధులలో చిమ్మెటుండదు దొంగలసలే లేరుసుమండి ||ఇయ్యుడి||
  • 571 దశము భాగము 10/19/2017 20:16 571 దశము భాగము లెల్ల దేవునివి ధారాళముగ నియ్య సమకూడుఁడి పశువులు పైరులు దేవునివి పసిఁడి లోహపుగనులు దేవునివి భాగ్యభోగ్యము లెల్ల దేవునివి భావించి కానుకలను నియ్యుఁడి ||దశమ||

  • దేవునివి దొంగలించెదరా దేవదేవుని మోసపుచ్చెదరా భావించి మది నెంచి భయము నెంచి ప్రార్ధింపఁ దలవంచి ప్రభు భాగమున్ దేవాలయంబును పూర్ణంబుగా దేదీప్యముగా నుండ సమకూర్చుఁడీ ||దశమ||

  • పరిశుద్ధ దేవుని మందిరముఁ పరిపూర్ణముగాను యోచించుఁడీ పరిశుద్ధ భాగము విడఁదీయుఁడీ పాడిపంటలు నాస్తి దేవునిని పదియవ భాగంబు దేవునివి పరమాత్మ దీవెనలను బొందుఁడీ ||దశమ||

  • ప్రథమ ఫలంబులు దేవునివి విదితంబుగా నీయ మది నెంచుఁడీ సదమల హృదయములను బొందియుఁ ప్రథమ భాగము నెల్ల విడఁదీసియు ముదమున దేవునికర్పించుఁడీ సదయు దీవెనలొంద సమకూర్చుఁడీ ||దశమ||

  • ఆకసపు వాకిండ్ల విప్పుదును అధిక కృపలను గుమ్మరించుదును మీ కష్టఫలములను దీవింతును భీకర నాశంబుఁ దొలఁగింతును మీ కానంద దేశ మిత్తు నని శ్రీకరుం డెహోవా సెల విచ్చెను ||దశమ||

  • దినభోజనం బిచ్చు దేవునిని ఘన సౌఖ్యముల నిచ్చు దేవునిని వినయంబుతో మదిని ధ్యానించుచు దినభోజనంబులను భాగించుచు మానక దేవుని కర్పించు డీ ఘనసేవ జయమొందు పని బూనడీ ||దశమ||
  • 572 స్తుతియు మ 10/19/2017 20:16 572 స్తుతియు మహిమయు నీకె క్షితికిన్ దివికిన్ నీటి వితతికిన్ కర్తవై వెలయు మా దేవా ప్రతి వస్తువును మాకు బహుమతిగా నిచ్చు హితుఁడా మా ప్రేమ నీ కెట్లు చూపుదుము ||స్తుతియు||

  • పసిఁడి వర్ణపు టెండ భాగ్య ధారల వాన విసరు మంచి గాలి విరియు పుష్పములు రస మొల్కు పండ్లు నీ రమ్య ప్రేమన్ జాటున్ బ్రసరించు కో తలో పల నుందు వీవు ||స్తుతియు||

  • నెమ్మదిగల యిండ్లు నిజసౌఖ్య కాలములు ఇమ్మహి ఫలియించు నైశ్వర్యాధికముల్ ఇమ్ముగ గలిగిన హృదయులమై వంద నమ్ములు ఋణపడి యు న్నాము నీకు ||స్తుతియు||

  • దురితంబు లొనరించి దౌర్భాగ్య స్థితి నున్న ధరణికి నీ పుత్రున్ ధర్మంబు జేసి నరుల కీ ధర్మమున కొరఁత దీర్చెడు సర్వ వరము లమర్చిన పరమోపకారి ||స్తుతియు||

  • జీవంబు ప్రేమను జేవఁ గల్గించెడు పావనాత్మను మాకై పంపితివి దీవెన లేడు రె ట్లావరింపను మమ్ము నీ విమలాత్మ వా నిని గుమ్మ రించు ||స్తుతియు||

  • నరులకు విమోచ నము గల్గె పాపంబుల్ పరిహార మాయెఁ గృ పాసాధనముల్ దొరికె మోక్షాంశంబు స్ధిరమాయె మేము నీ కొరకేమి తేగలము పరిపూర్ణ జనకా ||స్తుతియు||

  • మాకై వాడుకొనెడి రూకల్ వ్యర్థం బగును నీకై యప్పుగ నిచ్చు నిఖిల వస్తువులు శ్రీకరంబగు నిత్య శ్రేష్ఠ ధననిధియై పై లోకంబు నందుండు లోపంబు లేక ||స్తుతియు||

  • జీవంబు వస్తువులు శ్రేయస్సు దాన స్వ భావంబు శక్తియు భాగ్యంబులు నీవలననే లభ్యమై వెలయుచున్నవి నీ వాసమే మాకు నిత్యానందంబు ||స్తుతియు||
  • 573 దాతృత్వమున 10/19/2017 20:16 573 దాతృత్వమును గలిగి పెరుగుదమ ధనము ధాత్రి దేవుని దంచు నెఱు గుదమ ||దాతృ||

  • శక్తికొలఁది కాన్కలర్పింతమ మన భుక్తినుండి కొంతఁ దీయుదమ ||దాతృ||

  • సంతోషముగ నియ్య సాగుదమ మన స్సంతటితోఁ జేయ నేగు దమ ||దాతృ||

  • గర్వఘనములు వీడి యర్పింతమ యుర్వి సర్వ మాయనందు నేర్పింతమ ||దాతృ||

  • సంఘ సేవకు సొమ్ము సమకూర్తమ క్రీస్తు సంఘ యక్కఱ లన్ని తీర్చుదమ ||దాతృ||

  • ప్రతియాదివార మిది మది నుంతమ దీని ప్రతి సంఘస్థుఁడు చేయ బోధింతమ ||దాతృ||

  • విధిఁ దలఁచి దుర్బలుల రక్షింతమ సంఘ విధవాళి దానముతో దర్శింతము ||దాతృ||

  • దిక్కులేని జనుల దీవింతమ వారి యక్కఱలలో మేలుఁ గావింతమ ||దాతృ||

  • పుచ్చుకొనుటకంటె నిచ్చుదమ మఱల నిచ్చు తండ్రికి స్తుతుల నిచ్చెదమ ||దాతృ||

  • వెదజల్లి యభివృద్ది పొందుదమ మోక్ష పదవు లను భవింపఁ బరుగిడుదమ ||దాతృ||

  • వర్ధిల్లిన కొలది చెల్లింతము లోక వ్యర్థ ఖర్చులనెల్ల మళ్లింతమ ||దాతృ||
  • 574 ఇచ్చునట్టి 10/19/2017 20:16 574 ఇచ్చునట్టి విధము తెలియండి ప్రియులారా మీరు హెచ్చు పొందు విధము ఇది నుండి పుచ్చుకొనుట కన్న నెప్పు డిచ్చుటయే కడు ధన్యత యని హెచ్చరించి చెప్పలేదా యేసు ప్రభు వపొస్తలులకు ||నిచ్చు||

  • శక్తికొలఁది దాన మీయుండి సోదరులార భక్తికొలఁది పరుల కీయుఁ డి శక్తి లేదని సాకు చెప్పక సణగ కేమియు సరగ శ్రద్ధా సక్తితో పేదలకు నిచ్చుట యుక్త మని భావించి మదిలో ||నిచ్చు||

  • నీతిబోధలు చేయువారికి బోధకులైన నిఖల పాలకులైన వారికి ఆతురముతో నీయవలెనని యనుభవముగల మీరలెల్లరు చేతులార నీయు డయ్య ప్రీతి తోడును వారవార ||నిచ్చు||

  • ఆలయ కృత్యములు జరిగించు యాజకుఁ డెపుడు నాలయంబువలన జీవించు ప్రాలుమాలక పనిని జేయఁ బరఃగ మీ యర్పణలఁ గాన్కల బలవంతము లేక మీరు పలువిధంబు నియ్య వెదకుడి ||నిచ్చు||
  • 575 సంతోషముతో 10/19/2017 20:16 575 సంతోషముతో నిచ్చెడు వారిని నెంతో దేవుఁడు ప్రేమించున్ వింతగ వలసిన దంతయు నొసంగును వినయ మనసుగల విశ్వాసులకును ||సంతోషముతో||

  • అత్యాసక్తితో నధికప్రేమతో నంధకార జను లందఱకు సత్య సువార్తను జాటించుటకై సతతము దిరిగెడు సద్భుక్తులకు ||సంతోషముతో||

  • వేదవాక్యమును వేరు వేరు గ్రా మాదుల నుండెడు బాలురకు సాధులు ప్రభుని సు బోధలు నేర్పెడి సజ్జన క్రైస్తవోపాధ్యాయులకు ||సంతోషముతో||

  • దిక్కెవ్వరు లేకుండెడి దీనుల తక్కువ లన్నిటిఁ దీర్చుటకై నిక్కపు రక్షణ నిద్ధరలో నలు ప్రక్కలలోఁ బ్రక టించుట కొఱకై ||సంతోషముతో||

  • ఇయ్యండీ మీ కీయం బడు నని యియ్యంగల ప్రభు యే సనెను ఇయ్యది మరువక మదిని నుంచుకొని యియ్యవలెను మన యీవుల నిఁకను ||సంతోషముతో||

  • భక్తిగలిగి ప్రభు పని కిచ్చుట బహు యుక్త మటంచు ను దారతతో శక్తికొలఁది మన భుక్తి నుండి యా సక్తితో నిరతము నియ్య వలెను ||సంతోషముతో||
  • 576 మేమిచ్చు క 10/19/2017 20:16 576 మేమిచ్చు కానుకల్ నీవే మాకిచ్చితి మా యాస్తియంత ప్రభువా నీ దానమే గదా.

  • నీ వుచితంబుగా మా కిచ్చువాడవు అన్యుల కుచితంబుగా మేమిచ్చుచుందుము.

  • సర్వత్ర బీదలు అన్నంబునొందరు కన్నీళ్లు రాల్చు ప్రజలు అనేకులుందురు.

  • ఈలాటివారికి సహాయమిచ్చుట దూతలు చేయు సేవకు సమానమగును.

  • పోషించి బీదలన్ రక్షించి పాపులన్ అందరిన్ సంరంక్షించుట శ్రీ యేసు కార్యమే.

  • నా బీదవారికి నీవిచ్చు దానము నా కిత్తువను వాక్యము శ్రీ యేసు చెప్పెను.
  • 577 పరమ తండ్రి 10/19/2017 20:16 577 పరమ తండ్రి నిన్ను మే మీ పరస కాలము స్వరము లెత్తి యింపు గాను స్మరణఁ జేతుము ||పరమ||

  • నిరుపమాన దేవ నిన్ను నిరత ప్రేమతో హరువుగా నుతింతు మేము హర్స రవముతోఁ ||పరమ||

  • అవని సంభ్రమములలోన నవఘళించము అవసరముగ నీదు పలుకు నవధరింతుము ||పరమ||

  • వేయి నాళ్లు లోకమునను వెలయుకంటెను శ్రేయ మొక్కనాఁడు నిన్ను సేవ జేయుట ||పరమ||

  • ఉచితమైన నీ గృహమున నచల భక్తితో రుచిరమైన నీదు ప్రేమ రుచినిజూతుము ||పరమ||

  • మనసునందు సత్యబోధ మనస్కరించుచు మనెడు తరిని విడము నీదు ఉనికిపట్టును ||పరమ||

  • గొరియ పిల్ల యొక్క ప్రేమ గూర్చి భక్తితోఁ గొరత లేక చేతు మెపుడు గొనబు గానము ||పరమ||

  • శాంతజలము నొద్ద మమ్ము శాంతి పరచుము సంతతమును నీవు మమ్ము సంతరించుము ||పరమ||

  • దినము లన్ని మేము నిన్ను దీన మనసుతో వనరు మాని సంతసమున వినతి చేతుము ||పరమ||
  • 578 నీ ధనము నీ 10/19/2017 20:16 578 నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమ భాగము నీయ వెనుదీతువా||


  • ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోక నాధుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా||

  • పాడిపంటలు ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా వేడంగా ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయ మో క్రైస్తవా ||

  • వెలుగు నీడలు గాలి వర్షంబులు కలిగించె ప్రభు నీకు ఉచితంబుగా! వెలిగించ ధరపైని ప్రభు కలిమికొలది ప్రభున కర్పింపవా ||

  • కలిగించె సకలంబు సమృద్ధిగా తొలగించె పలుబాధ భరితంబులు బలియాయె నీ పాపముల కేసువే చెలువంగ ప్రభుకీయ చింతింతువా ||
  • 579 ఏది సఖుడ య 10/19/2017 20:16 579 ఏది సఖుడ యేది నీ మదిని జేసికొనిన ప్రతిన యేది నీవొసంగు కాను కిదియె తరుణమీయరమ్ము ||

  • అన్న వస్త్రంబు లిచ్చి యాలు బిడ్డల ననుగ్రహించి యన్ని వస్తువుల నిచ్చి యున్న నా కెదురుకాను ||కేది||

  • వ్యాధి బాధలొదినపుడు శోధనంబు లడరినపుడు ఏది యెప్పుడవసరం బది యొసంగి యాదిరించితి ||ఏది||

  • మనసు శాంతిలేక నీవు మదిని బొగలుచుండ జూచి కనని వినని ప్రేమ జూపి కనికరించినట్టి ప్రభుని ||కేది||

  • పాపమందు పడినాడు దాపుజేరి నిలుపలేద? కాపరివలె నిన్ను గాచి యోపికతో నడుపలేద ||ఏది||

  • ఏమి దాచినావో సఖుడ! ఏమి తెచ్చినావు నేడు? నీ మనసు నిండ ప్రేమయున్న నదియే నాకు వేనవేలు ||ఏది||
  • 580 సార్వజగతిక 10/19/2017 20:16 580 సార్వజగతికి సంరక్షకుడు స్వామి యెహోవాయే గాద ధారుణీ స్థలిని ధనధాన్యములనుఁ దొలి దానము తనకీయగరాదా ||సార్వజగతికి||

  • ఆదామును ప్రభు ప్రథమ ఫలంబుగ ఆదర్శముగాఁ మనకిడెగా ఆది సంభవుని కతి మోదంబున సేద్య ఫలంబులు తేవలదా ||సార్వజగతికి||

  • కానుకలీయరె మానితులారా కన్యకుమారుని భజియింపన్ మానవ పున్రుత్థాన మహిమలో మన ప్రథమ ఫలంబతడౌర ||సార్వజగతికి||

  • ఉభయజగాల సర్వోన్నతు డాయనే శుభకరు డన నొప్పును గాదె ప్రభుని పేర పరమోత్తమమౌ ప్రథమ ఫలాదులు యిటతేరె ||సార్వజగతికి||
  • 581 కోఁత యజమాన 10/19/2017 20:16 581 కోఁత యజమానుండ స్తోత్రముఁ గూర్మితో నొనరింతుము ప్రీతి మీర గ మాదు పొలములు పెరిగి పండెను గావునఁ ||కోఁత||

  • నీదు సేవకులైన వారలు నిండు మోదముఁ నొందుచు నీ దయ నొక యేటి గ్రాసము నీ దినంబున గాంతురు ||కోఁత||

  • విత్తుకాలము కోఁతకాలము విమలమైన తలంపులు చిత్తమునఁ బుట్టించి మాకతి క్షేమ మొసఁగితి రక్షకా ||కోఁత||

  • వేసవిని భువి మేము నాటిన విత్తనం బతిరమ్యమై భాసురంబగు పచ్చ మొక్కయి బయలువడె నిది చిత్రము ||కోఁత||

  • జల సమాధిని వెడలి చక్కఁగ బలముతో నీ గింజలు బలుఁడు దేవుని శక్తి చేతను బాగుగను ఫలియించెను ||గోఁత||

  • ఆ ప్రకారమె నీదు నామము నందు కాలము చేసి యా ప్రజలు దేహములు మహిమను నందఁ జేయుము రక్షకా ||కోఁత||

  • కోఁత కార్యమువల్ల గూడను కూర్మిచే నీ బిడ్డలు నీతులను నేర్వంగఁ జేయుము ప్రీతిగల మా రక్షకా ||కోఁత||

  • దూత లంత్య దినంబునందున కోఁత గోయుదు రంతట నా తరుణ మున గురుగు లన్నియు నగ్నిలోఁ బడవైతురు ||కోఁత||

  • లోకమందలి గాలి వానల లోను మే మిఁక నుండక నాకమందున దండ్రి మింటను నేకముగ జీవింతుము ||కోఁత||

  • నీవు నేర్పిన యట్లే మే మిల నిన్నుఁ బ్రతిదినమందును జీవనోపాయంపు భుక్తిని దేవ, వేఁడఁగఁ జేయుమీ ||కోఁత||

  • మేఇన నేఁ బోషించు నన్న పానములనే వేఁడక జానుగా నాత్మలకునౌ భో జనము వేఁడఁ నీయుమీ ||కోఁత||

  • వసుధ నినుఁ బ్రార్థించు జన జీ వంపు రొట్టెవు నీవెగా అనువు నాదరణంబు భుక్తిని యగుము మా కిల నెప్పుడున్ ||గోఁత||
  • 582 నుతి సేయను 10/19/2017 20:16 582 నుతి సేయను లేవే యో మనసా నుతిఁజేయను లేవే క్షితిని దివిని హితమతిఁ బ్రోచెడి సుతుని జనకుని శుద్ధాత్మునిఁ ద్ర్యేకుని ||నుతి||

  • సూర్యుని కాంతి సొంపగు పంటలు సుకాలక్షేమముల్ శోభిలు గేహమున్ ఆర్య సాంగత్యము నైశ్వర్యముల నిల ననుభవింపవె నీవా యాఢ్యుని పేర్మిని ||నుతి||

  • దురితము లందె దుర్గతి నున్న నీ కురుతర ప్రేమను బరమార్థ మీయను వరపుత్రు నొసఁగఁడె వందనీయుఁడు ప్రభు మరిమరి మ్రొక్కు మా పరమోపకారిని ||నుతి||

  • జీవము జ్ఞానము జీవము నొసంగెడు పావనాత్మను నీకై పంపిన దేవుడు కేవల దోష స్వ భావము మార్చఁడె సేవ జేయుమ నీవా పావనమూర్తికి ||నుతి||

  • కరములు పదముల్ కనకాదు లన్నియు స్వరమును చిత్తము స్థిరమగు ప్రేమయు మరి నీదు హృదయము పరమాత్ము సేవకై పరిపూర్ణముగ నిచ్చి ప్రణుతించు మాయనన్ ||నుతి||
  • 583 యెహోవ సన్న 10/19/2017 20:16 583 యెహోవ సన్నిధిని నీ స్తోత్రగానముతో మహోపకారునకు మానుగ నర్పణ సమర్పించుఁడి ||యెహోవ||

  • ప్రభు వడుగు నర్పణలు ప్రేమ కృతజ్ఞతలు అభయ ప్రధానములు విభునకు నియ్యుఁడు విరివిగను ||యెహోవ||

  • రిక్తహస్తములతో రావలదు సన్నిధికి భక్తవత్సలునకు శక్తికొలఁది మీ రర్పించుఁడి ||యెహోవ||

  • శృంగారాలయ మీలలోఁ పొంగారఁ గట్టుటకు బంగారు వెండి యును బాగుగ నియ్యుఁడి ప్రభుపేర ||యెహోవ||

  • వరుమానములచేత వాంఛింప వలదండి గురు నాజ్ఞ చొప్పునను విరివిగ హృదయము లర్పించుఁడి ||యెహోవ||

  • యెహోవ జనులారా యియ్యుండి మనసార యెహోవ యిచ్చి నది యేసున కర్పణ చెల్లింతము ||యెహోవ||
  • 584 స్తుతియింత 10/19/2017 20:16 584 స్తుతియింతుమో ప్రభువా శుభమౌ నీ దినమున పరిశుద్ధమగు నీ నామము గతకాలమున నీవు పతితుల మగు మాకు అతిదయతోఁ జేసిన యన్ని మేలులు దలఁచి ||స్తుతి||

  • ఎన్న శక్యముగాక యున్న మహిమతో వెలుఁగు చున్న నీ పద సన్నిధిన్ సన్నుతాత్మా మేము ఆత్మతో సత్యముతో నిన్నారాధించుతము యీ చెన్నౌ నీ గృహమందు ||స్తుతి||

  • ఇచట నీ వాక్యము నుచితరీతిని చాట నీ సేవకుల నందఱిన్ శుచియౌ నీ యాత్మతో పరిపూర్ణముగ నింపి ప్రచురింపను శక్తి నధిక ముగ నిమ్ము ||స్తుతి||

  • భక్తితో నీ జనులు యుక్తముగ నిను వేఁడ శక్తి వారి కిమ్మెపుడు ముక్తి కోసము నిన్నా సక్తితో ప్రార్థింప రక్తితో విని వారి కానందమును గూర్చు ||స్తుతి||

  • జనక కుమారాత్మ లను దేవ నీ కెప్పు డెనలేని స్తుతి కల్గును ఆనయము మేమిలలో కొనియాడుటకు నిన్ను ఘనుఁడా దీవెన మాపై కుమ్మరింపుము వేగ ||స్తుతి||
  • 585 ఈ గుడియందు 10/19/2017 20:16 585 ఈ గుడియందు ప్రవేశింపన్ యేసుని బిలువగ రారండి ఆయన రానిదె దీవెనలు ఆశీర్వాదము లరుదగును ||ఈ గుడి||

  • ఆకా శము మన దేవునికి అత్యున్నత సింహాసనము పాదములకు యీ భూమియును పీఠముగా నొప్పును సుమ్ము ||ఈ గుడి||

  • ఆయన సన్నిధి కాంతియె యీ ఆలయమంతట నిండుకొనన్ ఆయన యాత్మ సహాయమున ఆరాధనలను జరుపుటకై ||ఈ గుడి||

  • నిర్మలమైన సువార్తను బో ధింపగ సాయము జేయుటకు బోధకు లైన సువార్తికుల బోధను నాటగ జేయుటకు ||ఈ గుడి||

  • ప్రార్థన విశ్వాసాయుతమౌ భక్తిని నేర్పెడి నిలయముగ భక్తులు దేవుని సన్నిధిలో బాగుగ స్థిరపడ జేయుటకు ||ఈ గుడి||

  • ఈ పట్టణమున వెలుగుటకు ఈ ప్రజలందరి రక్షణకు ఈ గుడి యీ సభ బలపడుచు సాగుచు వృద్ధిని జెందుటకు ||ఈ గుడి||

  • బాప్తిస్మము నిర్ధారణలు ప్రభు భోజన సంస్కారములు బాగుగ జరుగుచుండుటకు భక్తిని పెంపొదించుటకు ||ఈ గుడి||

  • తండ్రి కుమార శుద్ధాత్మకు తావుగ నీ గుడియుండుటకు త్రేకుని దీవెన వర్షములు దీనిపై నిరతము కురియుగాక ||ఈ గుడి||
  • 586 యెహోవా నీ 10/19/2017 20:16 586 యెహోవా నీ మహిమ స్తవము యేసుని సుందర మందిరము ఇది యెంతో నిత్య శుభకరము సాహసమున క్రై స్తవాళి తోడను స్నేహ మమర నీ శిష్యులు నిపు డీ గేహమునకు భ క్తిని జేరిరి నీ బాహు బలముఁ గ న్పపడ దీవించుము ||యెహోవా||

  • ఆకాశము నీ సింహాసన మగు నవని నీ యడుగుల పీఠముగ నమరు దేవ నీ కెవ్వరు సాటి నీ కొర కొర మం దిర మొనరించుట కీ కుంభినిలో నేరికి శక్యము ప్రాకటమైనను నీ సద్భక్తా నీకంబులె నీ నికేతనంబులు ||యెహోవా||

  • పరమండలంములం దుండి నీ కరుణఁ జల్లి యీ యాలయము పైని సుప్రకాశ మంపవె తరతరముల క్రై స్తవ సముదయములు విరివిగ నీ మందిర భరితములై చిరకాలము నీ సేవ యొనర్పను వరముల నిమ్మని నెరి బ్రార్థింతుము ||యెహోవా||

  • అందముగాను నిందులో ని న్నారాధించు ప్రియభక్తుల డెందములే నీ మందిరములు గా ముందొనరించుచుఁ బొందుగ నలు దెస లందు నుండు నర బృందంబులు దమ సందియములు విడి సద్గతిఁ బొందుట కిందురాను నీ వింక నొనర్పుము ||యెహోవా||

  • పతితాత్ములైనట్టి నరుల పాప రోగాదులకు మందు వెదకువారి గృహమున నుండున్ హితవుగ క్రీస్తుం డీ గృహపతియై ప్రతి పాపున కును సతతంబును వా గ్వితతిని బిలుచును వినయముతోఁ దన క్షత రక్త మహౌ షధ మిడి ప్రోవను ||యెహోవా||

  • ధారుణిలో దుర్మార్గుల పేరైన గుడారంబులలోఁ జేరియుండు దాని కంటెను పేరిమిగల యీ నీ సద నాంగణ ద్వారపాలక త్వము మా కబ్బిన భూరి భాగ్య పరి పూర్ణులమై వి స్తార శాంతి మది సౌఖ్యమొందుదము ||యెహోవా||
  • 587 ఆలించు మా 10/19/2017 20:16 587 588 సుఖులారా స 10/19/2017 20:16 588 సుఖులారా సంఘంపు బడి సంభంబునకు నారుమడి సుఖజీవమిట గన్గొనుడి చోద్యంపు కధలను వినుడి ||సఖులారా||

  • విద్యార్థులకు బోధంబు వినుడొజ్జలకు మోదంబు పద్యాలు కీర్తనంబు ల్బడయంగ నిదితరుణంబు ||సఖులారా||

  • మేలౌ గుటుంబములకు మితిలేని సంఘములకు జాల ప్రదేశంబులకు సన్మార్గమొదపు నెలవు ||సఖులారా||

  • పసిబిడ్డలను రావించి పరిష్వంగమును గావించి వెసఁబ్రేమతో దీవించి విభుడంపె నిది భావించి ||సఖులారా||

  • ఆబాలగోపాలముగ నా చంద్ర తారకముగ బైబిలును యుక్తముగఁ బఠియింప దగుఁచిత్రముగ ||సఖులారా||

  • మన జిహ్వలకు మధురంబు మన యంఘ్రలకు దీపంబు మన చేతులకు ఖడ్గంబు ఘనపావన వేదంబు ||సఖులారా||

  • శుభవర్తమానంబు విని సొంపొంద రక్షణ గని ప్రభు సంఘమున జేరుకొని పరులన్ రక్షించుడి చని ||సఖులారా||

  • ధరణిలో బడులూరూర స్థాపింపబడి పెంపార బరమాత్ముని మన సారఁ బ్రార్థింతము హితులారా ||సఖులారా||
  • 589 మన దేశంబున 10/19/2017 20:16 589 మన దేశంబున క్రీస్తు సువార్త వ్యాపించుటకు మార్గంబు స్త్రీలంచు మరువకమ్మ పనిబూని ప్రభుకొరకు పరదేశంబులయందు ఘనురాండ్రు చేయుపనుల్ వినలేదమ్మా?||


  • సాటియైనటువంటి సాయంబవై పతికి లోటులేకుండ నెపుడు లోబడు మమ్మ పాటుపడి నీ సుతుల భయభక్తితో పెంచి నాటుము మదిలోన బోధ నమ్ములమ్మ||

  • అన్నపానములందు నలవాటులందు నీ పన్యులకు మాదిది వగుదు వమ్మ నిన్ను నీ పనుల గమ నించి పరీక్షించు చున్నవారింట బైట నున్నారమ్మ||

  • ఘనుఁడౌ దేవుని వాక్య మును జదివియో వినియో దిన మేకాంతముగ ప్రార్థించు మమ్మ నినువలెను నీ పొరుగు నెలఁతుల ప్రేమింపవలె వినుమ దూషింపక దీ వించు మమ్మ||

  • పనులెన్నో నీ కున్న ప్రభు యేసు శుభవార్త దినమున కొక్కరికైన దెల్పుమమ్మ ఒనరంగా నేఁడాది కొక యాత్మనైన నిక నెనరుతో రక్షింప నేర్చుకొమ్మ||

  • ఎల్లసేవకుల కొర కెల్లప్పుడు ప్రార్థింప తల్లుల సమాజమునకు చెల్లు నమ్మ పల్లెలో శుభవార్త ప్రభవింపవలెనన్న తల్లులే మంచి సా ధనములమ్మ ||
  • 590 పరలోక భూలో 10/19/2017 20:16 590 పరలోక భూలోకంబులకును బ్రభువును సృష్టికర్తయునౌ పరమ శక్తుఁ డౌ తండ్రి దేవుని భక్తితో నమ్ముచు నున్నాను ||పరలోక||

  • ఆయన యద్వితీయ సుతుండౌ నా యేసుని నమ్ముచు నుందు నాయన పరిశుద్ధాత్మ వలనఁ గ న్యా మరియమ్మకు జన్మించెఁ ||పరలోక||

  • పొంతి పిలాతు అధికారంబునఁ బొంది సిలువ బాధను మృతుఁడై యంతట భూస్థాపనముఁ జేయఁబడి యదృశ్య లోకమునకు దిగెను ||పరలోక||

  • మరి మూఁడవ దినమునఁ జనిపోయిన మనుజులలో నుండియు లేచి పరలోకంబున కెక్కి తండ్రి కుడి పార్శ్వంబునఁ గూర్చున్నాఁడు ||పరలోక||

  • అక్కడ నుండి బ్రతికియున్న జను లందరిఁ జనిపోయినవారిఁ జక్కంగను విమర్శించుటకును జను నని నమ్ముచునున్నాను ||పరలోక||

  • పరిశుద్ధాత్మను నమ్ముచు నుందును బావన సార్వత్రిక సభను ధర నైక్యతఁ బాపక్షమఁ బునరు త్థాన సుజీవము నమ్ముదు నామేన్ ||పరలోక||
  • 591 త్ర్యేక దే 10/19/2017 20:16 591 త్ర్యేక దేవుఁడ యెహోవ దేవు నే నమ్మి సేయుదు సేవ దేవ పరలోక భూలోక ముల నెల్లఁ బుట్టించి పాలించు తండ్రి దే వుని నమ్మెదను నేను ||త్ర్యేక||

  • శ్రీ దేవసుతుఁ డేసు క్రీస్తే యేక చిరజీవ నాధుండు నాకే దేవ కన్య మరియమ్మ గ ర్భమున జన్మించిన కరుణగల దేవునిఁ గూర్మితో నమ్మెదఁ ||ద్ర్యేక||

  • పొంతి పిలాతు కాలమున యేసు పొంది శ్రమలను సిలువమీద దేవ కొట్టఁబడి చనిపోయి పెట్టఁబడి భూమిలో మూఁడవ దినమందు మృతి గెలిచి లేచెను ||త్ర్యేక||

  • పరలోకమున కెక్కె యేసు క్రీస్తు పరమతండ్రికిఁ గుడివైపు దేవ సింహాసనముమీఁద స్థిరముగాఁ గూర్చుండి యున్నాఁడు చిరన్యాయ కర్తయై యున్నాఁడు ||త్ర్యేక||

  • అక్కడనుండి ప్రభు యేసు వచ్చు నిక్కముగఁ దీర్పుఁ దీర్చుటకు దేవ మరణ మొందినవారికి బ్రతికి యున్నవారికి న్యాయంబుఁ దీర్చును న్యాయవంతుఁడు యేసు ||త్ర్యేక||

  • శుద్ధాత్మ దేవుని నేను మన శుద్ధితో నమ్మి కొల్చెదను దేవ శుద్ధ సంఘంబు పరి శుద్ధుల సహవాస మును నమ్మెదను నిత్య మును నేను నిజ మిది ||త్ర్యేక||

  • పాపక్షమాపణను నేను ఎంతో బలముగా నమ్మెద నిలను దేవ ఈ శరీరముపోయి యంత్యదినమున మరల లేచునని తిరముగా వాసిగా నమ్మెదఁ ||త్ర్యేక||

  • నిత్యజీవము నమ్మెదను నేను నిజముగా శ్రీ యేసు పేర దేవ నిత్యుండు తండ్రి దే వుఁడు కుమారుండును ఆత్ముండు సత్యుండు త్ర్యేకుఁడౌ దేవుండు ||త్ర్యేక||
  • 592 విశ్వాకాశమ 10/19/2017 20:16 592 విశ్వాకాశము లాదులను సృష్టించిన విభుఁ డగు పరమ ఈశుఁడు సర్వశక్తుఁ డగు || భాసుర తండ్రిన నమ్ముదును || నమ్ముదును నే నమ్ముదును ||

  • పరిశుద్ధాత్ముని మూలమున మరియ కన్యకా గర్భమున ధరియింప బడి పుట్టిన శ్రీ గురు ప్రభుయేసును నమ్ముదును నమ్ముదును నే నమ్ముదును ||

  • పొంతి పిలాతుని కాలమున నెంతో శ్రమపడి సిల్వఁబడి వింతగ యధోతుల మందెనని || నమ్ముదును నే నమ్ముదును ||

  • మూఁడవనాఁడు మృతి నుండి వడిగాఁ బునరుత్థానుండై చూడఁగ బరమున కేతెంచె నాధుని కుడియెఁడ గూర్చుండెన్ || నమ్ముదును నే నమ్ముదును ||

  • అక్కడ నుండి యిహమునకుఁ గ్రక్కున వచ్చి సజీవులకు నిక్కము న్యాయముమృతులకును జక్కగఁ దీర్చెడు నని మదిని || నమ్ముదును నే నమ్ముదును || నమ్ముదును నే నమ్ముదును ||

  • పరిశుద్ధాత్ముని నమ్ముదును నమ్ముదును నే నమ్ముదును పరిశుద్ధాత్ముని నమ్ముదును నమ్ముదును నే నమ్ముదును ||

  • పరిశుద్ధ పరచంబడిన సర్వసాధారణ సంఘం పరిశుద్ధుల యన్యోన్య మగు పరిశుద్ధ స్నేహము కల వంచు || నమ్ముదును నే నమ్ముదును ||

  • మహికర్మ పరిహారమును దేహ పునరుత్థానము బహుళము నిత్య జీవమును మహిమ యనంతమై వెలయు నని || నమ్ముదును నే నమ్ముదును ఆమేన్||
  • 593 యేసువ జయము 10/19/2017 20:16 593 యేసువ జయముతో యెరుషలేమున బ్ర వేశము జేసిన యో ప్రభువా వాసిగ బొగడగ వసుధను జనులు విజయము జేసిన యో ప్రభువా ||యేసువ||

  • మట్టలు బట్టియు బట్టలు బరచియు గట్టిగఁ బాడగ యో ప్రభువా అట్టహాసముతో అశ్వము నెక్కడ అణఁకువఁ గార్దభ మెక్కిన ప్రభువా ||యేసువ||

  • పిల్లలు పెద్దలు పలుకేకలతోఁ బలికి నుతించగ యో ప్రభువా చల్లగ వానిని సరియని యొప్పి సంతోషించిన యో ప్రభువా ||యేసువ||

  • కొందరు వారిని తొందరఁ జేయగ కూర్మిని దిద్దిన యో ప్రభువా అందరు మానిన అరచును రాళ్లని ఆనతి నిచ్చిన యో ప్రభువా ||యేసువ||

  • యెరుషలేం కొరకై యోరిమి జూపియు నేడ్చిన దయగల యో ప్రభువా యెరుషలేమందున యాలయ మంతను శుభ్రపరచిన యో ప్రభువా ||యేసువ||

  • మా కొఱకై తన ప్రాణము బెట్టిన మాన్యుడవీవె యో ప్రభువా మా కొరకై ధర మరణము గెల్చిన మహిమ స్వరూపుడ యో ప్రభువా ||యేసువ||

  • మాదు మనస్సును హృదయము నాత్మను నీదిగ గైకొను మో ప్రభువా సాదర వాక్కులు చక్కఁగఁ బలికియు నాదరించుమము నో ప్రభువా ||యేసువ||
  • 594 యేసుప్రభువ 10/19/2017 20:16 594 యేసుప్రభువు యెరూషలేము ప్రవేశించిన విధము భాసురముగ తన మహిమ చూడగా జేసెను ఆ దినము ||యేసు||

  • భారవాహక గార్ధభమెక్కి బాహాటముగాను బయలుదేరెను జేజేలనగా ప్రియమొప్పగతాను ||యేసు||

  • గట్గి పాడుచు గంతులు వేయుచు అట్టహాసముతో కొట్టుచు కరతాళములను పెద్దగా కూరిమి చూపిరిగా ||యేసు||

  • పిల్లలు పెద్దలు మెల్లగ బోవుచు ఉల్లాసముతోను చల్లని ప్రభువని జయములు గొట్టిరి సంతోషముతోను ||యేసు||

  • కొందరు మూర్ఖులు తొందర చేయుచు ముందుకు వచ్చిరిగా అందరు మానిన అరచును రాళ్లని అపుడా ప్రభువనగా ||యేసు||

  • చిగురుటాకు చెట్ల కొమ్మలను సొగసుగ మార్గములో బాగుగ పరిరచిరి భక్తిని చూపిరి సాగుచు జనులంతా ||యేసు||

  • యెరూషలేము గతిగని ప్రభువు ఏడ్చెను ఎలుగెత్తి మరియు యెరుషలేం దేవాలయమును పరిశుభ్రత చేసె ||యేసు||

  • మనలోనున్న పాపము లెల్ల మనుపును ఆ ప్రభువే ఘనకృపశాంతులు గల్గించియు మరి ననయము బ్రోచునిలన్ ||యేసు||
  • 595 మనోవిలసితం 10/19/2017 20:16 595 మనోవిలసితంబౌ దినంబు మహిమాన్వితంబు అనంతజగతీమనోహ రంబు ఘనాదిప్రభుయశః ప్రకాశంబు ||మనో||

  • మందమారుతములందము నొసగగ డెందములకు నానందము నిడగా సుందర పక్షుల సుమధురగానము సుఖావహంబై శోభించెనుగా ||మనో||

  • అరుణభాస్కరుని కిరణాకరము ధరదిక్తటముల దరిజేరెనుగా ధరా వలయమాఖర భానునిచే ధగద్ధగీయంబై వెల్గెనుగా ||మనో||

  • పులుగిల కిలకిల కలరవములతో పొందుగ గలసిన భూరి రవంబు లలితమనోహరశ్రావ్యమ వినుమా తలపన్ దానికి కారణమేమో ||మనో||

  • రయమున నొలీవ నగంబుగనుమా రభసయుక్తమగు జనమును గనుమా జయంజయంబను జయ ధ్యానంబులు వియదంతము జనమ్రోగుట వినుమా ||మనో||

  • ప్రసన్నవదనుడు భానుతేజుడు అసంఖ్యజనగణ పరివృతబలుడు ప్రసితరాసభాసీనుడు యేసుడు అసమ శాంతితో నరుదెంచెనహో ||మనో||

  • జయములు బాడెడు బాల చయముతో సాత్వికుడై రాసభంబు నెక్కి జయోత్సవంబుతో సర్వేశ్వరుడు చనిహృదయము సమర్పించె దము ||మనో||
  • 596 సిలువేకదా 10/19/2017 20:16 596 సిలువేకదా చింతసదామహా సిలువేకదా మనకమోఘము వెలలేని యాత్మ సంభోగము విలసత్పరమ ద్రవ్యభాగ్యము గుణత్యాగము ననురాగము మహా ||సిలువే||

  • సిలువ బోధకు చెవినొగ్గుమా చెలువముగొన నాత్మ నొగ్గుము వల్ల నొప్పు నీకు సౌభాగ్యము ఆత్మారోగ్యము నంతో శ్లాఘ్యము ||సిలువే||

  • చంపెనిందు ప్రభుని కర్తను సంపాదించె నర విముక్తుని బెంపారు నానందముసూక్తిని ననురక్తిని నిత్యముక్తిని మహా ||సిలువే||

  • పాపదావాగ్ని సంతుప్తులు స్వపుణ్యదుర్మద వ్యాప్తులు నీ పేరు నమ్మిన దీప్తులు సుఖ ప్రాప్తులు సర్వ తృప్తులు మహా ||సిలువే||

  • రంగొప్ప దీని ప్రసంగము మంగళగీతసారంగము అంగీకార హృత్పద్మ భృంగము రక్షశృంగము పాపభంగము మహా ||సిలువే||

  • భయములేదని చాటుచున్నది ప్రియయేసు వేడుకొమ్మన్నది దయ జూపు నీ కనుచున్నది నిక్కమైనది చక్కనైనది మహా ||సిలువే||

  • చేరవచ్చిన వారి భారము ఘోరమైనను తద్విచారము ఆరూఢిపరమార్థ సారము సువిచారము సదాచారము మహా ||సిలువే||

  • ఘనమైన రక్షక ధ్యానము మనల ముక్తికి జేర్చువైనము జనకృపాసుధా పానము దూతగానము తేజోమానము మహా ||సిలువే||

  • ఇన్ని దినము లూరకుంటిమి యిపుడే రక్షణ కనుగొంటిమి కన్న తండ్రిని గొల్వకుంటిమి కానకుంటిమి యెరగకుంటిమి మహా ||సిలువే||
  • 597 ఎంతో ఘనమగు 10/19/2017 20:16 597 ఎంతో ఘనమగువారలు పరిశుద్ధులు ఎంతో వినదగువారలు సంతసంబుగ వార త్యంత ప్రేరణతోడ సొంతవారిని సహా సొంతంబుగ విడచి చెంతజేరిరి యేసు ప్రభుని చింతలేకను వెంబడించి వింత పనులను జేసి బ్రతికిరి అంతమువరకును నడచిరి ||ఎంతో||

  • పేతు రపోస్తలుండు అతని సోదరు డతి ప్రియు డంద్రెయయు నీతి నియమములందు ప్రీతితో బ్రదుకుచు చేతి పనులయందు శ్రద్ధతో నుండుచు ఖ్యాతి నొందిన యోహాను అతని యన్న యాకోబుతోను ప్రతి దినంబును కలిసి యుండుచు భక్తి ప్రభువును వెంబడించిరి ||ఎంతో||

  • ఆస్తి నిచ్చిన బర్నబా ఆస్తిపరుడ పోసలులతో జేరెన్ స్వస్థబుద్ధి తోడ ఆస్తివాడుట యెట్లో క్రీస్తు సేవకొరకు ఖర్చుపెట్టుట యెట్లో వాస్తవముగ నేర్పినాడు ఆస్తిగలవారలకు నెల్ల ప్రస్తుతంపు ఆస్తిపాస్తులు ప్రభువు పనికియ్యవలెనని ||ఎంతో||

  • సంఘమును హింసించిన సంఘాభిమాని సంఘ నాయకుడు పౌలు సంఘముల నెన్నటినో చక్కగను స్థాపించి సంఘముల కుత్తరముల్ సమయానుకులముగ సంఘ కాపరులకును సహా సరియగు సలహాల నిచ్చి సంఘములను ప్రభువు కొరకై స్థాపించి నిలుపలేదా ||ఎంతో||

  • కన్యయైన మరియమ్మ ధన్యురాలు కన్యలకు తల్లులకున్ను అన్యులకు అందరికి ఆదర్శముగ నుండ సన్యాసిను లెందరో స్వామిని సేవించ కన్యకలుగ నిలుచువారలు కఠినవ్రతములతోడ నుండి ధన్యులగు పరిశుద్ధులతో దైవసన్నిధి నుండ జూపెను ||ఎంతో||

  • మగదాలయూరి మరియ మహినినున్న మగువలలో కెల్లను భగవంతుడై నట్టి ప్రభువు యేసునుజేరి నగము నెక్కెను తన సొగసైన మార్పుచే సాగి మొదట సమాధికడకు స్వామిదర్శనమొంది మొదట వేగవెళ్లి శిష్యులకును వెదకి సాక్ష్యమియ్యలేదా ||ఎంతో||

  • మత్తయి మార్కులను వారు మతమునందు అతినిష్టగలవారలు మత్తయి యూదులకై తన పుస్తకమును వ్రాసె మార్కు గూడను తన సు వార్తనందరి కిచ్చె వాస్తవంపు జీవితమును వరుసగాను గలిగియుండ క్రీస్తు ప్రభువును వెంబడించగ క్రొత్తలోకము జూపగలిగిరి ||ఎంతో||

  • చూచననేగాని నమ్మనని పేచిపెట్టి నతోమయు చాచి చేయి చూచి చక్కగ నమ్మెను చూడకుండనె లూక వైద్యుండు నమ్మెను యీ చొప్పున వీరలిద్దరు నీచజనులకెల్లరకు తము బ్రోచు ప్రభువును జూపుచుందురు బ్రోదిగా ప్రతిదినమునందును ||ఎంతో||

  • ప్రభువా నీ పరిశుద్ధుల బ్రతుకునందు మా భాగ్యమునున్నదిహా ప్రభువా వారి బ్రదుకు ప్రబలమైన సేవ విభవంగాగని విజయంబు గాంచుచు వారితో నేలునట్లు యభయమియ్యు మాకు దేవా ||ఎంతో||
  • 598 మద్యపాన ప్ 10/19/2017 20:16 598 మద్యపాన ప్రియులు గాకుండి ప్రియులార మీరా మత్తులోనే మునిఁగి పోకుండి మద్యపానము చేయువారికిఁ దథ్యముగఁ బ్రాప్తించుఁ గీడులు కొద్దియైనన్ రుచిని జూడఁగఁ గోరఁ దగ దని తలఁచుకొనుఁడి ||మద్య||

  • రక్త మంతయుఁ జెడును సుమ్మండి ప్రియులారా మీరు శక్తిహీనులగుదు రిల నుండి శక్యిహీనులె గాక మఱి మీ భక్తి దొలఁగి పోవునండి ముక్తిమార్గము దెలియదండి ముందు గతికి హీనమండి ||మద్య||

  • బుద్ధిబలములు కొద్ది వౌనండి ప్రియులారా మీరు మొద్దు లగుదురనియు నమ్ముండి హద్దు మిరుచుఁ ద్రాగువారికిఁ గొద్దికాలమె జీవమండి శ్రద్ధగల్గి మద్యపానము రద్దు చేయుట తగినదండి ||మద్య||

  • మచ్చునకును త్రాగఁబోకుండి ప్రియులార మీరీ తుచ్ఛమైన పనులు వీడుండీ హెచ్చుగాఁ దిని త్రాగువారికి వచ్చు రోగము కుదురదండి చచ్చుటకు నిది హేతువని మదిఁ గచ్చితముగను దెలిసికొనుఁడి ||మద్య||

  • ఆలుబిడ్డల మేలుఁగోరుండి ప్రియులారా వారి మేలుఁ గోరినఁ ద్రాగంఁ బోకుండి మేలు లెఱింగి పిలుచు క్రీస్తుని జాలిచూపులు దెలిసికొనుఁడి కాలయాపనఁ జేయకుండి కర్త యేసని నమ్ముకొనఁడి ||మద్య||

  • ఘన ధనములు నిలువఁబోవండి ప్రియులార నీచ తనము మీకు మూల మౌనండి తనవిఁదీర్చుదు మద్యమండి ఘనుల కొంపలు గూల్చు నండి ఘనముగాఁ బ్రభువాక్యసారము వినయమతితో ఁ గ్రోలరండి ||మద్య||
  • 599 పరమ వైద్యు 10/19/2017 20:16 599 పరమ వైద్యుఁడ భారతీయుల వ్యాధి బాధలఁ బాపుమా పరుల కుపచారం బొనర్చుట పరమ విధియని చూపుమా ||పరమ||

  • ప్రేమతో వైద్యులును దాదులు పెంపుఁ బొందఁగజేయుమా గ్రామ రోగులఁ గాంచి వారికి క్షేమమును దయ చేయుమా ||పరమ||

  • భరత ఖండము నందు వైద్యపు బడులను నెలకొల్పుమా పరఁగ నీవే వైద్య శాలలఁ బాలనంబు సల్పుమా ||పరమ||

  • కుఁటి గ్రుడ్డి మూఁగ సాలలఁ గూర్మితో దర్శించుమా యంటు రోగుల యాశ్రయముల నంటి పరామర్శించుమా ||పరమ||

  • లెక్కలేని గర్భవతుల యక్కఱలను దీర్చుమా దిక్కు లేని బిడ్డలకు నీ దీవెనల సమకూర్చుమా ||పరమ||

  • యంత్రశాలల గనులయందు నలయు వారలం బ్రోవుమా మంత్ర తంత్రము లందుఁ జిక్కు న మాయకులను గావుమా ||పరమ||

  • గ్రామ వైద్య సేవఁ జేసెడి ఘనులఁ బరిపాలించుమా గ్రామవాసులఁ గూల్చు వ్యాధులఁ గాంచి నిర్మూలించుమా ||పరమ||

  • దురభిమాన మూఢ భక్తిని ద్వరగ దూర పరచుమా మరియు శుచిచే రోగములు మటు మాయ మగు నని కరపుమా ||పరమ||

  • దేహశుద్ధిని జిత్తశుద్ధిని దేశ జనులకుఁ గూర్చుమా దేహములఁ బర శుద్ధ మగు నీ దేవళములుగ మార్చుమా ||పరమ||
  • 600 ధ్యానింప న 10/19/2017 20:16 600 ధ్యానింప నే చిత్తమా వర్షాంతమున ధ్యానింపనే చిత్తమా ధ్యానించ వాసక్తి జ్ఞానంబుఁ గలిగించు జ్ఞాన స్వరూపుఁడు జ్ఞానాత్మచే నీకు ||ధ్యానింపవే||

  • అరయ నీ తలఁపుల నఘము లగుపడు నీకుఁ పరిశుద్ధుఁ డీక్షింప బహుగా గనుపడుచుండు ||ధ్యానింపవే||

  • పరికింపఁ బలుకులఁ పాప మగుపడు నీకు పరిశుద్ధుఁ డరయుఁ గ న్పడకుండు నే యది ||ధ్యానింపవే||

  • క్రియలను జింతింప మయిల గనపడు గాన భయ మొంది నమ్మికను బదవే క్రీస్తుని దరికి ||ధ్యానింపవే||

  • దేవుని ఘన ప్రేమ దినదినముఁ దలపోయ నీవు పొందఁగ వచ్చు నిక్కమైన శుద్ధి ||ధ్యానింపవే||

  • స్మరియింప నీలోన వర రక్షకుని పాట్లు భరియింప నోపుదువె పాప మొక నిమిషంబు ||ధ్యానింపవే||

  • హృదయంబు విమలాత్మ సదనంబుఁ గావింపఁ పదవే శ్రీఘ్రంబుగఁ పరమ జనకుని కడకు ||ధ్యానింపవే||

  • దేవుని సేవింపఁ దిరముగ నాశించి దేవాత్మ కొర కీవు దినము దేవుని వేఁడ ||ధ్యానింపవే||
  • 601 వందనం బొనర 10/19/2017 20:16 601 602 ఘనదేవ ప్రి 10/19/2017 20:16 602 ఘనదేవ ప్రియ తనయుండా జగద్రక్షా వినుతి జేతుము నీ మహిమన్ ఘనతరంబుగ గత సంవత్సర దినము లన్నిట మాకు నీభువి ఘనసుఖము లొనరించి మరి నూతనపు వత్సర మొసగినందుకు ||ఘనదేవ||

  • అధిక ప్రేమలొసఁగుము యేసు ప్రభు కుదురుగ నీ వత్సరము ప్రధమ దినమున మమ్ము నందరి ముదముతో నిచ్చటకుఁ జేర్చితి ప్రబలమగు సంగీతస్తుతులను మిగులబొందుము యేసు రక్షక ||ఘనదేవ||

  • అంచితముగ నిచ్చటన్ గూడిన సభలో స్త్రీలన్ బురుషుల బిడ్డలన్ మంచి మార్గమునుంచి నీ యత్యంత ప్రేమతోఁ గావు మిలను చంచలులు గాకుండ నీ కృప లుంచి మము రక్షించుమో ప్రభు ||ఘనదేవ||

  • దీవించు ప్రభుయేసువా సువార్తికులన్ సావధానముగా భువిలో భావమందున నీపదంబుల సేవ బాగుగఁ జేయుచున్ నీ జీవజల వాక్యంబులన్ ధర ధీరతనుఁ బ్రకటింపఁ జేయుము ||ఘనదేవ||

  • పరముండ ధర నీ సభలన్ నూతనముగ స్థిరపర్చి బలపర్చుము సరసముగ నాశీర్వచనము ల్విరివిగా నొసంగుచున్ నూ తన సహోదర ప్రియుల సమితిని మరియుఁ జేర్చుము నీ సభలలో ||ఘనదేవ||

  • కరుణాళ యీవత్సరము క్రైస్తవ బడుల ధరణిబ్రబలఁ జేయుమా సరిగ నుపాధ్యాయులందరి మరి మరీ దీవించు ప్రభువా స్థిరముగా పరమార్ధములు బా లురకు గరవుచునుండఁ జేయుము ||ఘనదేవ||

  • భాసురంబుగ పరలోక ప్రకాశుఁడా దాసబృందములన్ గావు వాసిగా నరలోకము నని వాసులగు మీ దాసులందరి దోషరాసిని ద్రోసి నీ కృప జూపుచును రక్షించు మనిశము ||ఘనదేవ||
  • 603 క్రొత్త యే 10/19/2017 20:16 603 క్రొత్త యేడు మొదలు బెట్టెను మన బ్రతుకునందుఁ క్రొత్త మనసు తోడ మీరు క్రొత్త యేటఁ బ్రభుని నేవఁ దత్తర పడకుండఁ జేయు టుత్తమోత్తమంబుఁ జూడఁ ||క్రొత్త||

  • పొంది యున్న మేలు లన్నియుఁ బొంకబు మీఱ డెందమందు స్మరణ జేయుఁడీ యిందు మీరు మొదలు బెట్టు పందెమందుఁ గెల్వ వలయు నందముగను రవినిఁబోలి నలయకుండ మెలయకుండఁ ||క్రొత్త||

  • మేలు సేయఁ దడ వొనర్పఁగా మీరెఱుఁగునట్లు కాలమంత నిరుడు గడ చెఁగా ప్రాలుమాలి యుండకుండ జాల మేలు సేయవలయుఁ జాల జనముల కిమ్మాను యేలు నామ ఘనతకొఱకుఁ ||క్రొత్త||

  • బలము లేని వార మయ్యును బల మొంద వచ్చుఁ గలిమి మీఱఁ గర్త వాక్కున నలయకుండ నలగకుండ మోద మొంది బల మొసంగు సర్వవిధుల నెలమి మీ రొనర్చుచుండఁ ||క్రొత్త||

  • ఇద్ధరిత్రి నుండు నప్పుడే యీశ్వరుని జనులు వృద్ధిబొందఁ జూడ వలయును బుద్ధి నీతి శుద్ధులందు వృద్ధినొంద శ్రద్ధఁ జేయ శుద్ధు లైన వారిలోఁ ప్ర సిద్ధు లగుచు వెలుఁగ వచ్చుఁ ||క్రొత్త||

  • పాపపంక మంటినప్పుడు ప్రభు క్రీస్తు యేసు ప్రాపుఁ జూరి మీరు వేఁ డ గా నేపుమీఱఁ దనదు కరుణఁ బాప మంతఁ గడిగివేసి పాపరోగ చిహ్న లన్ని బాపివేసి శుద్ధిఁ జేయుఁ ||క్రొత్త||
  • 604 దైవప్రేమ మ 10/19/2017 20:16 604 దైవప్రేమ మనలనెపుడు బంధించుగా దివిని భువిని దీన జనులను దిరముగా కాపాడుగా||


  • పరమతండ్రి గద్దెముందట ప్రార్థనల్ మరిజేతుము పలు విధముల మార్గములలో ప్రభువే తోడైయుండుగా ||దైవ||

  • నిత్యప్రభువు సత్యసేవను నిరతమును మదినుంతుము నిలిచియుందుము క్రీస్తుకొరకై నిత్యసేవక జనముగా ||దైవ||

  • మనము విడిచి వెళ్లునపుడు మదిని కల్గును వేదన మనసు హృదయము కలిసియుండగ మరల గలియుదు మెచ్చటో ||దైవ||

  • జనక తనయ పరిశుద్ధాత్మకు జయము మహిమయు ఘనతయు ఆదినుండి యిపుడు యెపుడు అవని పరమున జెల్లుగా ||దైవ||
  • 605 స్తోత్రము 10/19/2017 20:16 605 606 స్నేహంపు బ 10/19/2017 20:16 606 స్నేహంపు బంధమా శుభంబు నొందుమా సత్క్రైస్తవ సావాసము స్వర్గంబుఁ బోలును

  • పంశు పాదముల్ ప్రార్ధించి కొల్తుము భయ, నిరీక్షణాశలు ప్రార్థన లొక్కటే

  • ఒండొర్ల బాధలన్ ఓదార్చు కొందుము ఒలికెడి కన్నీటితో ఒప్పు మా స్నేహము

  • వియోగ కాలము విచారమైనను వీలౌ మరలకూడుట విజయ మైత్రితోన్
  • 607 ముందు కందర 10/19/2017 20:16 607 ముందు కందరును జేరను ఎందు బోయినన్ గాపాడి తొందరల్మ ఱేమ్మిరాక బంధుఁడేసు నిన్ను గావుతన్ ||యేసుని సన్నిధి నేకమైగూడుదాఁక దాసుని ధీరతన్ దైవపిత నిన్ను గావుతన్ ||

  • ఱెక్క నీడ నిన్నుఁ జేర్చుచు మిక్కుటంపు ప్రేమఁజూపిఁ చిక్కులాప తిల్లకుండ మక్కువన్ ప్రభుండుగావుతన్

  • నాఁడు నాడాహారమిచ్చుచు వేడుకన్ గౌగిటఁ జేర్చి కీడులందు నిన్ను గాంచి ఱేడునిన్నుఁ బ్రోచికావుతన్

  • చావు యొక్క భీతిలేకను జీవమార్గమందుఁ దోడై రేవుఁజేరుఁదాక బ్రోచి పావనుండు నిన్ను గావునన్
  • 608 దేశసేవఁజేస 10/19/2017 20:16 608 దేశసేవఁజేసి దేవ దాసులై వర్ధిల్లుఁ డిలలో మోసమార్గములను వీడి యేసుని నిజదాసు లగుఁడి దోసములను వీడి దేవ దాసులై వర్ధిల్లుఁ డిలలో ||దేశ||

  • దేశ బంధువు యేసువే మన దేశ రక్షకుఁ డాయనే దేశ మంత యేసు మనసుతో నాశతో సేవించుడి ||దేశ||

  • నీతి న్యాయంబులు గలిగియు నిష్ఠలందు మెలఁగియు నిత్య ప్రేమ చూపి యేసు నిష్ఠ లేక మేలు లేదు ||దేశ||

  • వినయశక్తి నెంతగా వివ రించిన బోధించిన విశ్వ విభుండౌ యేసు వినయ విధము లేక మేలు లేదు ||దేశ||

  • ప్రేమఁ గలగి పరమ సత్య ప్రేమ సేవఁ జేయుఁడి ప్రేమమూర్తి యేసుకీస్తు ప్రేమలలో వర్ధిల్లుఁ డిలలో ||దేశ||

  • ఆసేతు హిమాచల ప ర్యంతమున్ దిగంతము లేకముగను దివిని భువిని సేలు రాజు యేసుఁడే ||దేశ||
  • 609 జనగణ మన అధ 10/19/2017 20:16 609 జనగణ మన అధినాయక జయహే భారత భాగ్యవిధాత

  • పంజాబ సింధు గుజరాత మరాట ద్రావిడ ఉత్కళ వంగ

  • వింధ్య హిమాచల యమునా గంగ ఉచ్ఛల జలధి తరంగ

  • తవశుభనామే జాగే తవశుభ ఆశిషమాగే గాహే తవ జయ గాథ

  • జనగణ మంగళ దాయక జయహే భారత భాగ్య విధాత జయహే జయహే జయహే జయ జయ జయ జయహే
  • 610 ప్రభువా మమ 10/19/2017 20:16 610 ప్రభువా మమ్మునుదీవించి పంపుము నీ కృపనందించి అభినందన ములఁ జేకొనుమా విభవము మహిమోన్నతి కీర్తి యుగయుగములకు నీకగుతన్ ||ప్రభువా||

  • పగతురఁ బ్రేమించెడు శక్తిన్ తగఁబొరుగును జూచెడి రక్తిన్ మిగులందయ చేయుము దైవ జగదేక కుమారా కీర్తి యుగయుగములకు నీ కగుతన్ ||ప్రభువా||

  • గుడిలో వినిన నీవాక్యము మా గుండెలఁ బదిలము జేయఁగను గుడిబయటను నా చారములో నడువగఁ దోడ్పడుమో కీర్తి యుగయుగము లకు నీ కగుతన్ ||ప్రభువా||

  • క్రైస్తవ మైత్రిని సంఘములో విస్తరణము జేయఁగనిమ్ము నేస్తవ భావము లోకములో నెరపఁగ దయఁగనుమో కీర్తి యుగయుగములకు నీ కగుతన్ ||ప్రభువా||
  • 611 మహిమ నొప్ప 10/19/2017 20:16 611 మహిమ నొప్పు జనక నీకు మహిత సుతునకు మహిమ గలుగు శుద్ధాత్మకును మహా యుగములు ||మహిమ||

  • లోక సృష్టి మునుపు నిన్ను నాకసేనలు ప్రాకటంబుగా నుతించెఁ బ్రజ్ఞ మీరంగ ||మహిమ||

  • సకల సృష్టివలన దేవ సకల యుగముల సకల గలుగు నీకు సకల కాలము ||మహిమ||
  • 612 కలుగుఁగాక 10/19/2017 20:16 612 కలుగుఁగాక దేవా కలుగుఁగాక కలుగుఁగాక మా కిలలో నిప్పుడు విలువ లేని దయ గల నీ దీవెన ||కలుగు||

  • తనయుని కరుణయుఁ దండ్రి దేవు దయ తనరు నాత్మ కృప తప్పక మాకుఁ ||గలుగు||

  • మనమున భక్తులు మరువక యైక్యము ఘనముగఁ బెంపఁగ ఘన సహాయము ||కలుగు||

  • ఇట్టి యైక్యమును యేసునితో మరి గట్టిగఁ బెంచిన ఘన సౌఖ్యంబు ||కలుగు||
  • 613 దీవెనతో సె 10/19/2017 20:16 613 దీవెనతో సెలవిమ్ము కర్తా మాకు నీ దీవెనతో సెలవిమ్ము కర్తా దీవించి క్షేమంపు టీవులను దయచేసి జీవ పోషణవార్త భావమున సమకూర్చి ||దీవెనతో||

  • లోకమున నిన్ను వేఁడుకొని మేము నీ లోకమున కొనియాడుకొని శ్రీకరం బగు దివ్య లోకంబులోఁ జేరి యేకముగ స్తోత్రములు నీకుఁ జెల్లింపఁగ ||దీవెనతో||

  • స్తుతి పితృ పుత్ర శుద్ధాత్మ శుభ మిచ్చు స్తుతి పితృ పుత్ర శుద్ధాత్మ స్తుతియించును సర్వ క్షితి దివ్య సైన్యంబు లతులితంబగు దేవుఁడని నిన్ను స్తుతియించు ||దీవెనతో||
  • 614 పంపుము దేవ 10/19/2017 20:16 614 పంపుము దేవా దీవెనలతోఁ పంపుము దేవా పంపుము దయ చేతఁ పతిత పావన నామ పెంపుగ నీ సేవఁ ప్రియమొప్ప నొనరింపఁ ||బంపుము||

  • మా సేవ నుండిన మా వెల్తు లన్నియు యేసుని కొఱకు నీ వెసఁగ క్షమియించుచుఁ ||బంపుము||

  • వినిన సత్యంబును విమలాత్మ మది నిల్పి దినదినము ఫలములు దివ్య ముగ ఫలియింపఁ ||బంపుము||

  • ఆసక్తితో ని న్ననిశము సేవింప భాసురంబగు నాత్మ వాసి కెక్కఁగ నిచ్చి ||బంపుము||
  • 615 మా దేవునకు 10/19/2017 20:16 615 మా దేవునకును స్తోతములు మహిమయు జ్ఞానము నామీదన్ మాదు కృతజ్ఞతగల స్తుతియు న్మఱి ఘనతా శక్తియు బలమున్ యుగయుగములకును గల్గునుగాక ||ఆ...మెన్|| 616 కర్తా మమ్మ 10/19/2017 20:16 616 కర్తా మమ్మును దీవించి క్షేమమిచ్చి పంపుము జీవాహార వార్త నిచ్చి మమ్మును పోషించుము.

  • ఇహ నిన్ను వేడుకొని బహుగా స్తుతింతుము పరమందు చేరి యింక స్తోత్రము చెల్లింతుము.
  • 617 మేళ్లన్ని 10/19/2017 20:16 617 మేళ్లన్ని యిచ్చు దేవునిన్ స్తుతించు సర్వ సృష్టియున్ స్తుతించు మోక్ష సైన్యముల్ పితృ పుత్ర శుద్ధాత్మలన్ 618 పితృ పుత్ర 10/19/2017 20:16 618 పితృ పుత్ర శుద్ధాత్మలై మేళ్లన్ని యిచ్చు దేవుని స్తుతించు సర్వ లోకమా స్తుతించు దివ్య సైన్యమా 619 పితా, సుతా 10/19/2017 20:16 619 పితా, సుతా, వరాత్మక! త్రియేక దేవ నామక! నిరంతరంబు స్తోత్రము ఘనంబు నీకే స్తోత్రము 620 స్తోత్రించ 10/19/2017 20:16 620 స్తోత్రించుడి సృష్టికర్తన్ తండ్రి గొప్ప ప్రేమను మన యాగమైన గొఱ్ఱెన్ పైని రాజు యాజకున్ ముక్తియూట యైనవాని జీవకర్తయౌ దేవున్ ఏక దేవుడౌ యెహోవన్ పాడు డేకమౌ హృదిన్ 621 యెహోవ నిన్ 10/19/2017 20:16 621 యెహోవ నిన్ను ఆశీర్వదించి కా పా డుగా క యెహోవ తన సన్నిధి ప్రకాశింప జేసి నిన్ను కరుణించుగాక యెహోవ నీ మీద తన సన్నిధి కాంతి నుదయింపజేసి నీకు సమాధానము కలుగ జయుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 622 ప్రియమైనట్ 10/19/2017 20:16 622 ప్రియమైనట్టి నా యాత్మ స్తోత్రంబు చెల్లింపు మహిమ శక్తులుగల నా ఱేని మన్నింపు కూడుడిట వీణెల గానమున సన్నుతు లొసంగ రండి.

  • సర్వము వింతగ పాలనచేయుచు నిన్ను గరుడ విహగ పక్షము లందిడి మిన్ను నొరయగా నడిపి సుఖముగా నిత్యంబు గాచిన ప్రభు నుతింపు.

  • ఎంతో చమత్కతిగా నా యాత్మ! నిన్ సృజించి క్షేమ మారోగ్యము నెసగగా నడిపించి కష్టములలో బొదివి ఱెక్కలతో బ్రోచిన ప్రభునుతింపు

  • అందరు గాంచెడులాగు నీ స్థితి దీవించి యాకసమందున నుండి కృపన్ గురిపించి ప్రేమతో జూచు నాతండెవ్వడో శక్తు నా ప్రభు నుతింపు

  • సకలాంతః కరణంబులతోడ నుతింపు ఆయన నామ ప్రసిద్ధి గీర్తింపు వెలుంగులో నా బ్రహాం సంతతితో ప్రభునుతింపుమి ఆమేన్
  • 623 క్రీస్తు స 10/19/2017 20:16 623 క్రీస్తు సిల్వ నాకు గొప్ప యౌను, నేనుతింపుదు సచ్చరిత్రు కాంతి యొప్ప గాని జుట్టి యుండును

  • నాకు నే విచారమైన భీతి యైన కల్గినన్ సిల్వ రూప మెందునైన సంతసింప జేయునన్

  • మోక్ష సూర్య దైన కాంతి నాదు త్రోవ బుట్టుగా సిల్వనుండి కల్గు శాంతి దాని నింపు చేయుగా

  • లాభ, లోభ, మోగు, బాగు శుద్ధి యౌను సిల్వచే సంతసంబు శాంతి జాగు లేక కల్గునప్పుడే, ఆమేన్.
  • 624 దేవుండవైన 10/19/2017 20:16 624 దేవుండవైన యాత్మ! రా నీ వారి నీవు ప్రీతిగా నీ సత్కృపావరంబు నీ నీ ప్రేమ గుమ్మరింపుమీ.

  • సమస్త భూ జనంబులు సద్దేవు విశ్వసింపను నీ దివ్య వాక్య కాంతితో నిత్యంబు వారి బిల్తువు.

  • దేవా! విశుద్ధ తేజమా! జీవంపు వాక్య మిమ్మయా మా తండ్రియంచు బిల్వను మా దేవుదెల్పి నేర్పుము.

  • దుర్భోధ చేయువారిని దూరంబునందు నుంచుమీ మా యేసు క్రీస్తు డొక్కడే ఓదార్చు బోధ కుండిలన్.

  • ఓ దివ్య ప్రేమ! యూరటా మోదంబుతోడ మమ్ముల నీదైవ సేవ చేయనీ నాధుండ!! హింస లోర్వనీ

  • జీవించి యున్న జచ్చినన్ జీవాత్మముక్తి పొందగన్ మా కిమ్ము నీ బలంబును నమ్మిక గట్టి బర్చుము, ఆమేన్
  • 625 ఆత్మ! శృంగ 10/19/2017 20:16 625 626 దేవుండు ప్ 10/19/2017 20:16 626 దేవుండు ప్రేమ రక్షించె నన్ను దేవుండు ప్రేమ ప్రేమించెనన్ ||రెట్టించి పాడుదున్ దేవుండు ప్రేమ ప్రేమించెనన్ను నటంచును||

  • నన్నొందె జావు సైతాను భీతి నన్నెందె జావు నా జీతము.

  • నాకై సుయేసు నాయప్పు దీర్ప నాకై సుయేసు చావొందెను.

  • న్బిల్చినాడు వాక్యంబుచేత న్బిల్చినాడు శుద్ధాత్మచే.

  • ఈ ప్రీతి వాక్కు నాయాత్మ భుక్తి ఈ ప్రీతి వాక్కు నా పానమున్

  • ఓ దివ్య ప్రేమ! నా ముక్తిధార! ఓ దివ్య ప్రేమ! ఓదార్పునన్.

  • నిన్నే స్తుతింతు నో నిత్యప్రేమ! నిన్నే స్తుతింతు నెల్లప్పుడున్.
  • 627 అంధుడా రావ 10/19/2017 20:16 627 628 ఆనందమానంద 10/19/2017 20:16 628 629 దేవుని వార 10/19/2017 20:16 629 దేవుని వారసులం ప్రేమ నివాసులము జీవన యాత్రికులం యేసుని దాసులము నవయుగ సైనికులం పరలోకపౌరులము హల్లెలూయ నవయుగ

  • దారుణ హింసలలో దేవుని దూతలుగా ఆరని జ్వాలలో ఆగని జయములతో మారని ప్రేమ సమర్పణతో సర్వత్ర యేసును కీర్తింతము ||దే||

  • పరిశుద్ధాత్మునికై ప్రార్థన సలుపుదము పరమాత్ముని రాక బలము ప్రసాదింప ధరణిలో ప్రభువును జూపుటకై సర్వాంగహోమము జేయుదము ||దే||

  • అనుదిన కూటములు అందరి గృహములలో ఆనందముతోను ఆరాధనలాయో వీనులవిందగు పాటలతో ధ్యానము చేయుచు మరియుదుము ||దే||

  • సజీవ సిలువ ప్రభు సమాధి గెలుచుటచే విజేత ప్రేమికులం విధేయ బోధకులం నిజముగ రక్షణ ప్రబలుటకై ధ్వజముగ సిలువను నిలుపుదము ||దే||

  • గోధుమ గింజవలె క్రీస్తుడు చావగను నాధుని మరణములో శాశ్వత జీవమును నిధులుగ పండించి లేవగను మాధుర్య రక్షణ లభియించెను ||దే||

  • హతసాక్షుల కాలం అవనిలో చెలరేగ గతకాలపు సేవ గొల్గొత గిరి భీతులలో బహురీతులలో నూతన లోకము కాంక్షింతుము ||దే||

  • ప్రభువును చూచుటకై ప్రజలందరు రాగ విభు మహిమను గాంచ విశ్వమే మముగోర శుభములు గూర్చుచు మాలోన శోభిల్లుయేసును జూపుదము ||దే||
  • 630 ఆనంద యాత్ర 10/19/2017 20:16 630 ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యెరుషలేము యాత్ర ||

  • యేసుని రక్తము పాపముల నుండి విడిపించును వేయినోళ్ళతో స్తుతించినను తీర్చలేము ఆ రుణము ||ఆనంద||

  • రాత్రియు పగలును పాదములకు రాయి తగలకుండ మనకు పరిచర్య చేయుట కొరకు దేవదూతలు మనకుండగ ||ఆనంద||

  • కృతజ్ఞత లేనివారు వేలకొలదిగ కూలినను కృపా వాక్యమునకు సాక్షులమై కృప వెంబడి కృప పొందెదము ||ఆనంద||

  • ఆనందం ఆనందం యేసుని చూచె క్షణం ఆసన్నం ఆత్మానంద భరితులమై ఆగమనాకాంక్షతో సాగెదన్ ||ఆనంద||
  • 631 ఆనందం ఆనంద 10/19/2017 20:16 631 632 ఇదిగో నీ ర 10/19/2017 20:16 632 ఇదిగో నీ రాజు వచ్చుచుండె సీయోను కుమారి సంతోషించు యెరుషలేం కుమారి ఉల్లసించు ||ఇదిగో||

  • నీదురాజు నీతితో దోషమేమియు లేకయే పాపరహితుడు ప్రభు వచ్చు చుండె ||ఇదిగో||

  • రక్షణగలవాడుగ అక్షయుండగు యేసుడు ఇచ్చతోడ యెరుషలేం వచ్చు చుండె ||ఇదిగో||

  • స్వాతికుండు యీభువిన్ అత్యంతమగు ప్రేమతో నిత్యరాజు నరులకై వచ్చుచుండె ||ఇదిగో||

  • దీనవరుడు నీ ప్రభు ఘనత కలిగిన దేవుడు ప్రాణమీయ పాపులకై వచ్చుచుండె ||ఇదిగో||

  • ఇలను గాడిదనెక్కియే బాలుర స్తోత్రములతో బలుడగు నీ ప్రభు వచ్చుచుండె ||ఇదిగో||

  • దావీదు కుమారుడు దేవుడు పాపులకు జయగీతములతో వచ్చుచుండె ||ఇదిగో||

  • యేసుని ప్రేమించుచు హోసన్న పాడెదము యేసుడిల వచ్చుచుండె హల్లెలూయ వచ్చుచుండె ||ఇదిగో||
  • 633 ఇదియే సమయం 10/19/2017 20:16 633 ఇదియే సమయంబు రండి యేసుని జేరండి ఇక సమయము లేదండి రండి రక్షణ నొందండి

  • పాపులనందరిని తన దాపున చేర్చుటకై ప్రాణము దానముగా తన ప్రాణము నిచ్చెనుగా మరణపు ముల్లును విరిచి విజయము నిచ్చెనుగా ||ఇక||

  • రాజుల రాజైన యేసు రానై యుండేనుగా గురుతులు జరిగెనుగా మీరు సరిగా చూడండి తరుణముండగానే మీరు తయ్యారవ్వండి ||ఇక||

  • బుద్ధి లేని కన్యకలవలె మొద్దులుగానుంటె సిద్దెలలో నూనెపోసి సిద్ధపడకపోతే తలుపులు తట్టినను మీకు తెరువడు సుమ్మండి ||ఇక||

  • వెలుపటనుంటేను మీరు వేదన నొందెదరు తలుపులు తట్టినను మీకు తెరువడు సుమ్మండీ మిమ్మును ఎరుగను మీరెవరో పొమ్మనును ||ఇక||

  • సందియ పడకండి మీరు సాకులు చెప్పకను గురుతులు జరిగెనుగా మీరు సరిగా చూడండి మరణ దినమూ మన మెరుగము సుమ్మండీ ||ఇక||

  • సందియ పడకండి మీరు సాకులు చెప్పకను గురుతులు జరిగెనుగా మీరు సరిగా చూడండి మరణ దినమూ మన మెరుగము సుమ్మండీ ||ఇక||

  • జాలము చేయకను మెరు హేళన చేయకను కులము స్థలమనుచూ మీరు కాలము గడువకనూ తరుణముండగానే మీరు త్వరపడి రారండి ||ఇక||
  • 634 ఈ జీవిత ఈత 10/19/2017 20:16 634 ఈ జీవిత ఈత ఈదలేకున్నాను నా చేయి పట్టుకో నా యేసునాధా

  • సారహీనమగు సంసారాబ్దిలోన సాగలేకున్నాను సాయంబురావా సారాకరుణారసధారలే నా కొసగుము సాగిపోవను ముందుకు శక్తి నాకిమ్ము

  • సంఘసంబంధముగ శాంతి లేకపోయె సమానతత్వంబు సమసిపోయె సోదరులే నాకు శత్రువు లయ్యిరి సమాధానము నొసగ సరగున రావా ||ఈ||

  • బయట పోరాటములు భయపెట్టుచుండెను బంధువులందరు బహుదూరులైరి భార్యపుత్రాదులచే బాధలెన్నో గలిగె బాధలన్నియు బావ బహుత్వరగ రావా ||ఈ||

  • రాజ్యముపై రాజ్యంబు రంకె వేయుచుండె రాష్ట్రముపై రాష్ట్రంబు రగులుచుండె రాజులకు రాజువై రయమున రావయ్య రాజ్యమేలను ధరణిలో రమ్ము రమ్ము ||ఈ||

  • సైతాను చెలరేగి సమయం బిక లేదని సింహపురీతిగా గద్దిచుచుండె సంకెళ్ళతో వచ్చి సైతానుని బంధించి సమాధానరాజ్యం స్థాపించరావా ||ఈ||

  • మొదటి జామయ్యెను మీరింక రారయ్యె రెండవజామున జాడలేదె మూడవ జామయ్యె మీరింకా రారయ్యొ నాలుగవ జామున నడచివస్తున్నారా ||ఈ||

  • పెండ్లికుమారుండ ప్రభువైన క్రీస్తుండ పెండ్లిసంఘము నాత్మయు బిలుచుండె పెండ్లివిందులో నేను పెండ్లి వస్త్రముతోను హల్లెలూయ యని ఆనందింతున్ ||ఈ||
  • 635 ఎల్ల వేళలం 10/19/2017 20:16 635 ఎల్ల వేళలందు కష్టలమందు వల్లభుండా యేసున్ స్తుతింతున్ ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదె వివరింప||


  • విమోచకుడా విమోచన నీవే రక్షకుడవు నా రక్షణ నీవే ||ఎల్ల||

  • సృష్టికర్తవు సహాయము నీవే ఇష్టుడ నీవు త్రిత్వము నీవే ||ఎల్ల||

  • జ్ఞానము నీవే నా పానము నీవే దానము నీవే నా గానము నీవే ||ఎల్ల||

  • జ్యోతియు నీవే నా నీతియు నీవే ఆదియు నీవే నా అంతము నీవే ||ఎల్ల||

  • నిత్యుడ నీవే నా సత్యుండ నీవే స్తోత్రము నీవే నా నేత్రము నీవే ||ఎల్ల||

  • జీవము నీవే నా దేవుడు నీవే పావన మీవే నా కావలి నీవే ||ఎల్ల||

  • కాంతియు నీవే నా శాంతియు నీవే సంతస మీవే నా కంతయు నీవే ||ఎల్ల||
  • 636 ఎవని అతిక్ 10/19/2017 20:16 636 ఎవని అతిక్రమములు మన్నింపబడెనో పాపపరిహార మెవడొందెనో వాడే ధన్యుండు

  • యెహో వాచే నిర్దోషిగా తీర్చబడియు ఆత్మలో కపటము లేనివాడే ధన్యుండు ||ఎవని||

  • మౌనియై యుండి దినమెల్ల నే జేసినట్టి ఆర్తధ్వనిచే నా యెముకలు క్షీణించెను ||ఎవని||

  • దివారాత్రులు నీ చేయి నాపై బరువైయుండ నా సారము వేసవిలో ఎండినట్లాయె ||ఎవని||

  • నేను నా దోషమును కప్పుకొనక నీ యెదుట నా పాపమును ఒప్పుకొంటిని ||ఎవని||

  • నీ సన్నిధి నా పాపముల నొప్పుకొనగా నీవు నా దోషమును మన్నించితివిగా ||ఎవని||

  • కావున నీ దర్శనకాలమందు భక్తిగలవారు నిన్ను ప్రార్థించెదరు ||ఎవని||

  • విస్తార జలప్రవాహము పొర్లినను నిశ్చయముగ అవి వారి మీదికి రావు ||ఎవని||

  • నాకు దాగుచోటు నీవే శ్రమలోనుండి నీవు నన్ను రక్షించెదవు నాదు దుర్గమా ||ఎవని||

  • విమోచన గానములతో నీవు నన్ను ఆదరించి నాకుపదేశము చేసెదవు ||ఎవని||
  • 637 ఎంతజాలి యే 10/19/2017 20:16 637 ఎంతజాలి యేసువా యింతయని యూహించలేను ||ఎంత||

  • హానికరుడ హింసకుడను దేవ దూషకుడను నేను అవిశ్వాసినైన నన్ను ఆదరించినావుగా ||ఎంత||

  • రక్షకుండా నాకు బదులు శిక్ష ననుభవించినావు సిలువయందు సొమ్మసిల్లి చావొందితి నాకై ||ఎంత||

  • ఏమి నీ కర్పింపగలను ఏమిలేని వాడనయ్య రక్షణంపు పాత్రనెత్తి స్తోత్రమంచు పాడెదా ||ఎంత||

  • నీదు నామమునకు యిలలో భయపడెడి వారి కొరకై నాధుడా నీవిచ్చు మేలు ఎంతగొప్ప దేసువా ||ఎంత||

  • నేను బ్రతుకు దినములన్ని క్షేమ మెల్లవేళలందు నిశ్చయముగ నీవు నాకు ఇచ్చువాడా ప్రభూ ||ఎంత||

  • నాదు ప్రాణమునకు ప్రభువా సేదదీర్చువాడ నీవు నాదు కాపరివి నీవు నాకు లేమి లేదుగా ||ఎంత||

  • అందరిలో అతి శ్రేష్ఠుండా అద్వితీయుడగు యేసయ్యా హల్లెలూయా స్తోత్రములను హర్షముతో పాడెదా ||ఎంత||
  • 638 ఎంతదూరము మ 10/19/2017 20:16 638 ఎంతదూరము మోయించెదరు స్వామి కింత సిలువనెత్తి నుంతైన దయలేక ||ఎంత||

  • ఒంటిగా ప్రార్థించి యుపవాసములు జేసి కంటి నిదురలేక కలతజెందిన ప్రభుని ||ఎంత||

  • సొమ్మునాశించి గురున్ అమ్ముకొన్న యూద నమ్మించి మీకిచ్చె నిమ్మానుయేలును ||ఎంత||

  • కరములు జోడించి కడకు గేత్సెమనిలో పరమ తండ్రిని వేడు నిరపరాదిని పట్టి ||ఎంత||

  • పిరికి పిలాతుని బెదరించి యదలించి యెరుషాలేం వీధుల నేసుని ద్రిప్పుచు ||ఎంత||

  • ఒడలలసి నా ప్రభువు తడబడుచుండగా ఘడియ ఘడియకు తిట్టి గట్టిగ కొట్టుచు ||ఎంత||

  • కలువరి గిరివరకు సిలువ మోయలేక అలసిన ప్రభుజంప నాలస్యమును చేసి ||ఎంత||

  • యేసు నీకొరకై నే నేడ్చుటకంటెను దోషినని గ్రహించి దోసిలొగ్గుటె మేలు ||ఎంత||
  • 639 ఎందుకో నన్ 10/19/2017 20:16 639 ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా

  • నా పాపము బాప నరరూపివైనావు నా శాపము మాప నలిగి వ్రేలాడితివి నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే ||హల్లె||

  • నీ రూపము నాలో నిర్మించియున్నావు నీ పోలికలోనే నివసించుచున్నావు నీవు నన్ను ఎన్నుకొంటివి నీ కొరకై నీ కృపలో ||హల్లె||

  • నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు నా వ్యధలు భరించి నన్నాదుకొన్నాము నన్ను నీలో చూచుకున్నావు నను దాచియున్నావు ||హల్లె||

  • నీ సన్నిధి నాలో నా సర్వము నీలో నీసంపద నాలో నా సర్వస్వము నీలో నీవు నేను ఏకమగువరకు నన్ను విడువనంటివే ||హల్లె||

  • నా మనువులు ముందే నీ మనస్సులో నెరవేరే నా మనుగడ ముందే నీ గ్రంధంబులో నుండె ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లింతున్ ||హల్లె||
  • 640 ఆహా..ఆ...అ 10/19/2017 20:16 640 ఆహా..ఆ...అంత్యతీర్పు నందున ...యేసూ నీ రక్షకుడే మహాభయంకరమో ...సింహంబుగా నుండు

  • ఓ మానవుండ నీ గతి యేమౌనో తెలియునా యేమేమి చేయుచుంటివో తప్పించుకొందువా?.... ||ఆహా||

  • లోకాలు పుట్టినప్పటినుండి మృతులైన ఏ కులజుడైన నాటికి తెర్పులో నిలచును ||ఆహా||

  • మృతులైన ఘనులు హీనులు యేసయ్య యెదుటను ప్రతివారు నిలిచియుందురు బ్రతికిన రీతిగనే ||ఆహా||

  • గ్రంధాలు విప్పబడగ గ్రంధాలలో వారి గ్రంథంబు బట్టబయలై పొందుదురు తీర్పును ||ఆహా||

  • నరులెల్ల క్రియలచొప్పున మరి తీర్పు పొందుదురు మరణము మృతుల లోకము గురియౌను యగ్నికి ||ఆహా||

  • ఈనాడు నీవు కూడను యేసుని విడిచినచో ఆనాడు నీవు కూడాను అందుండి ఏడ్చెదవు ||ఆహా||

  • దేవుని జీవగ్రంథము దేవుడు తెరచును ఎవ్యాని పేరందుండదో వాడగ్నిలో బడును ||ఆహా||
  • 641 ఓ యేసు నీ 10/19/2017 20:16 641 ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము ఆకాశతార పర్వత సముద్రముల కన్న గొప్పది

  • ఆగమ్య ఆనందమే హృదయము నిండెను ప్రభుని కార్యములు గంభీరమైనవి ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు ||ఓ యేసు||

  • సంకట సమయములో సాగలేకున్నాను దయచూపు నామీద అని నేను మొరపెట్టగా వింటినంటివి నా మొర్రకుముందె తోడనుందునంటివీ (2) ||ఓ యేసు||

  • మరణాంధకారపు లోయనే సంచరించన నిరంతరమేసు నాదు కాపరియై కరములిచ్చి నన్ను గాయుచు నడుపు కరుణగల ప్రభువు (2) ||ఓ యేసు||

  • కొదువలెన్ని యున్న భయపడ నే నిపుడు పచ్చిక బయలులో పరుండజేయును భోజన జలములతో తృప్తిపరచును నాతో నుండు నేను (2) ||ఓ యేసు||

  • దేవుని గృహములో సదా స్తుతించెదను సంపూర్ణ హృదయముతో సదా భజించెదను స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు హల్లెలూ ఆమేన్ (2) ||ఓ యేసు||
  • 642 ఓ సంఘమా సర 10/19/2017 20:16 642 ఓ సంఘమా సర్వాంగమా పరలోకరాజ్యపు ప్రతిబింబమా మెస్సయ్యను ఎదుర్కొనగ నీతినలంకరించి సిద్ధపడుమా ఓ సంఘమా వినుమా

  • రాణి ఓ ఫేర అపరంజితో స్వర్ణ వివర్ణ వస్త్రధారణతో వెణావాద్యతరంగాలలో ప్రాణేస్వరుని ప్రసన్నతతో ఆనంద తైలాసుగంధాభిషేకము నొందితివే సువాసనుండా ||ఓ||

  • స్వస్థపరచే నిర్దోషముగా ముడత కళంకము లేనిదిగా మహిమ యుక్తంబుగా నిలువగోరె యేసువా సహించుతావా తీర్పునాడూ ||ఓ||

  • చీకటిలోనుండి వెలుగునకు లోకములో నుండి వెలుపలకు శ్రీకర్త గుణాతిశయములను ప్రకటించుటకే పిలచెనని గుర్తించుచుంటివా క్రియలను గంటివా సజీవముగా నున్నావా ||ఓ||

  • వ్యభిచారులు నరహంతకులు పోకిరి చేష్ఠల డాంబికులు అబద్ధజనకుని యాసనము యెజిబెలు నీ మధ్య నివసించెనా కృపావరములు ఆత్మల భారములు ఉజ్జీవదాహము కలదా ||ఓ||

  • చల్లగనైనా వెచ్చగనూ ఉండిన నీ కది మేలగును నులివెచ్చని స్థితి నీకుంటే బయటకు ఉమ్మబడెదవేమో నీ మనస్సు మార్చుకో తొల్లిప్రేమ కూర్చుకో ఆసక్తితోడ రక్షణ నొందు ||ఓ||

  • కడపటి బూర మ్రోగగానే కనురెప్ప పాటున మారుదువా వడిగా మేఘసీనుడవై నడియాకాశము పోగలవా గొఱ్ఱెపిల్ల సంఘమా క్రీస్తు రాజు సంఘమా రారాజు నెదుర్కొనగలవా ||ఓ||
  • 643 కఠిన హృదయమ 10/19/2017 20:16 643 కఠిన హృదయమా కరుగవ దేవుని గడువులు గని వినవా దెబ్బలు గలిగిన లోబడవా

  • ఎన్నో గడువులు ఎన్నోమారులు ఎన్నో గడువులు దొరికినను కన్నుమూసికొని కదలుచునుందువు కనికర కరమునుగని మానవా ||కఠిన||

  • సృష్టికర్తకు మ్రొక్కెదవా! తన సృష్టిని గొని పూజించెదవా సృష్టికర్త విరోధి దయ్యముల చేష్టలెల్ల మంద్రించెదవా ||కఠిన||

  • నీరము రక్తముగా మారినను భారముగా క ప్పలు పేలు జోరీగలు గొప్ప తెగులు వచ్చిన గుణపడెనా ఫరోరాజు!

  • దద్దురులై బొబ్బలు పొక్కినను హద్దులేక పిడుగులు పడిన గ్రుద్దినట్లు వడగండ్లు కురిసినను గుణపడెనా ఫరోరాజు ||కఠిన||

  • మిడుతల దండులు చెలరేగి యామిగిలిన వాటిని మ్రింగినను వడివడితడబడు నంధకారమే వచ్చిన గుణపడె నా రాజు ||కఠిన||

  • ఘోషపెట్టి దేశమెల్లనేడ్వగ గుంపులుగా జ్యేష్టులు చావ రోషముతో వెంటబడి నశించి దోషముకై దుఃఖముపడిరే ||కఠిన||

  • నష్టము కష్టము కలిగినను మరి నరులును దేవుడె చెప్పినను ఇష్టపడవు రక్షింపబడుటకై ఇరుకుపడిన నిరుకున జెడిన ||కఠిన||

  • పాపప్రతాపము నెరుగుదువ దాని శాపము తాపము నెరుగు దువా పాపము నొకపరి బట్టితివా అది పట్టుబడి కఠినపరచు ||కఠిన||

  • లోలోపలన న్యాయమబద్దములోపము కలిగిన మోసములో కాలయాపనచేయ నుపాయములేల? వేషధారణయేల ||కఠిన||
  • 644 కల్వరిలోని 10/19/2017 20:16 644 కల్వరిలోని శ్రేష్టుడా కరుణభరిత సింహమా కన్ను భ్రమించు ప్రభువా సిలువలోని మిత్రుడా ||కల్వరి||

  • స్తుతికి పాత్రుండగువాడా దూతలతో వేంచేయువాడా సుదతి మరియ పుత్రుడా సిలువలోని మిత్రుడా ||కల్వరి||

  • పాపులకై వచ్చినవాడా ప్రేమగల్గిన రక్షకుడా పాదములపై బడితిమి సిలువలోనిమిత్రుడా ||కల్వరి||

  • దీవెనలు నిచ్చువాడా వసుధ కేతెంచినవాడా నీవే సుంకరలాప్తుడవు సిలువలోని మిత్రుడా ||కల్వరి||

  • ఐదు రొట్టెలు మరి రెండు చేపలతో నైదువేల జనుల పోషించిన తండ్రి సిలువలోని మిత్రుడా ||కల్వరి||

  • నీళ్ళను రసముగ మార్చితివి నీళ్ళమీద నడచితివి మేళ్ళనొసగు మాదాతా సిలువలోని మిత్రుడా ||కల్వరి||

  • రోగులను బాగుచేయువాడా గ్రుడ్డికి నేత్రములిచ్చితివి అనాధుల నాయకుడా సిలువలోని మిత్రుడా ||కల్వరి||

  • హల్లెలూయ కర్హుడా యెల్లరు కొనియాడువాడా బలముతో వచ్చు రాజా సిలువలోని మిత్రుడా ||కల్వరి||
  • 645 కుమ్మరీ ఓ 10/19/2017 20:16 645 కుమ్మరీ ఓ కుమ్మరీ జగదుత్పత్తిదారీ జిగటమన్నై నా వంక చల్లగ చూడుమయ్యా......

  • పనికిరాని పాత్రనని పారవేయకుమా పొంగిపొరలు పాత్రగా జేసి నన్ను నింపుమా సువార్తలోని పాత్రలన్నీ శ్రీ యేసున్ పొగడుచుండ సాక్షిగ నుండు పాత్రగజేసి సత్యముతో నింపుము తండ్రి ||కుమ్మరీ||

  • విలువలేని పాత్రన్ నేను కొనువారు లెరెవ్వరూ వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగజేసి ఆటంకములనుండి తప్పించి నన్ను ఎల్లప్పుడు కావుమయ్యా ||కుమ్మరీ||

  • లోకాశతో నింజి ఉప్పొంగుచు మార్గంబునే తప్పితిన్ మనుష్యేచ్చలన్నియున్ స్థిరమనుచు నే మనశ్శాంతి కోల్పోతిని పోగొట్టుకొన్న పాత్రయనుచు పరుగెత్తి నను పట్టితీ ప్రాణంబు నాలో ఉన్నప్పుడే నీ పాదంబుల్ నే పట్టితిన్ ||కుమ్మరీ||
  • 646 క్రైస్తవకర 10/19/2017 20:16 646 క్రైస్తవకర్షక కదిలిరావయ్యా కన్నులు తెరచి కానవేమయ్యా

  • మనుష్యకుమారుడైన క్రీస్తుయేసు మంచివిత్తనమును విత్తెమున్న భూలోకంబనెడు పొలంబునందున వాక్యంబనె విత్తనంబు విత్తెను ||క్రైస్తవ||

  • ఆదిమ క్రైస్తవ బోధకుల వేదనతోను వాక్యంబు విత్తె రోదనతోను రక్తంబును గార్చి ప్రాణంబులను దానంబుజేసిరి ||క్రైస్తవ||

  • చల్లిన వాక్యము ఫలియింపను తొలకరి వర్షము గురిపించెను విలువైన ఫలములు ఫలియించువరకు కడవరి వర్షము కొరకు వేడుదం ||క్రైస్తవ||

  • పొలములు తెల్లబారె తేరిచూడు కాలము చాల గతించిపోయె కోతయజమా నుడైన క్రీస్తుని కోతవారిని పంప కోరివేడుదం ||క్రైస్తవ||

  • శత్రువగు సాతానుకూడా చెడ్డవిత్తనాలు చల్లిపోయె గోధుమల మధ్య గురుగులు కూడ ఘోరంబుగాను పెరుగుచుండెను ||క్రైస్తవ||

  • కన్నీళ్ళతో విత్తు క్రైస్తవుడా కలవర మొందెద వెందులకు సంతోషముతో సంగీతాలతోను సాగిపోవుదుము ఆగిపోకను ||క్రైస్తవ||
  • 647 క్రైస్తవుం 10/19/2017 20:16 647 క్రైస్తవుండా కదిలిరావయ్యా కలుషాత్ములకు యీ సిలువశక్తి జాటవేమయ్యా యెండవానలనియు జడిసి ఎంతకాలము మూలనుందువు కండలను ప్రేమింతువేమన్నా ఈ మంటికండలు ఎంత బెంచిన మంటికేనన్నా ||క్రైస్తవ||

  • వసుధలో ప్రజలెల్లరు యేసు వాక్యంబు వివక్షుద్భాధకొని వాంఛించుచుండగను మిషనులెల్లను మిషలచేత మిట్టిపడుచు వాదములతో యేసు బోధను విడచినారన్నా నీవెంతకాలము వారిచెంత నుందువోరన్న ||క్రైస్తవ||

  • సత్యవాక్యము సంతలోదులిపి బోధకులు దొరల బత్యములపై భ్రాంతులు నిలిపి చిత్రమగు అనుకూల బోధలు చేసి బ్రజలను మోసగించు సూత్రధారుల జేర రాదయ్యా సుఖభోగమిడిచి సత్యవాక్యము చాట రావయ్యా ||క్రైస్తవ||

  • శక్తిహీనుడనందు వేమయ్యా సౌజన్యమగు శుద్ధాత్మశక్తిని పొందుకొనుమయ్యా భక్తిహీనత పారద్రోలు భ్రష్ట మనస్సు బయలుపరచు శక్తికలుగు సువార్త చాటుదువు సువార్త చేయ జయమొంది ఆత్మలను రక్షించెదవు ||క్రైస్తవ||

  • నీతికై భక్తాదిపరులెల్ల నిజవిశ్వాసము నిలుపుకొన పోరాడిరే చాలకత్తిపోటులు రాళ్ళదెబ్బలు కరకు గల రంపములు కోతలు బెత్తములు కొరడాల దెబ్బలు పైబడి చీలి దేహము వాలలాడెను రక్తము భువిపై ||క్రైస్తవ||

  • ఆది సంఘము నార్పుటకు నెంచి ఆ దుష్ట నీరో అధిపతి చెలరేగి గర్వించి ఆదిక్రైస్తవ భక్తుల స్థంభముల గట్టి తారుపూసి అగ్నిని ముట్టించి కాల్వంగ ఆ సంఘ మెచ్చె అధిపతి అప్పుడె నశియించె ||క్రైస్తవ||

  • దూతలకు లేనట్టి పరిచర్య ఓ ప్రియ సఖుండా ఖ్యాతిగా నీ కిచ్చె గ్రంథంబు భీతియేల తినుము గ్రంథము తేనెవలె మధురముగ నుండున జ్ఞానము నీకబ్బునో హితుడ జ్ఞానంబునొంది స్వామిని సేవించుమో సఖుండా ||క్రైస్తవా||
  • 648 కృపామయుడా 10/19/2017 20:16 648 కృపామయుడా నీలోన(2) నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో

  • ఏ అపాయము నా గుడారము సమీపించనీయక నా మార్గములన్నింటిలో నీవే ఆశ్రయమైనందున ||కృపా||

  • చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయా రాజ వంశములో యాజకత్వము చేసెదను ||కృపా||

  • నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలియించుట కొరకు నా పైన నిండుగా ఆత్మ వర్షము కుమ్మరించు ||కృపా||

  • ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీట మిచ్చుటకు నీ కృప నను వీడక శాశ్వత కృపగా మార్చెను ||కృపా||
  • 649 గగనము చీల్ 10/19/2017 20:16 649 గగనము చీల్చుకొని యేసు ఘనులను తీసికొని వేలాది దూతలతో భువికి వేగమె రానుండె

  • పరలోక పెద్దలతో పరివారముతో కదలి ధరసంఘ వధువునకై తరలెను వరుడదిగో ||గగనము||

  • మొదటగను గొఱ్ఱెగను ముదమారగ వచ్చెను కొదమసింహపురీతి కదలెను గర్జనతో ||గగనము||

  • కనిపెట్టు భక్తాళీ కనురెప్పలో మారెదరు ప్రథమమున లేచెదరు పరిశుద్ధులు మృతులు ||గగనము||
  • 650 గీతం గీతం 10/19/2017 20:16 650 గీతం గీతం జయ జయగీతం చేయితట్టి పాడెదము

  • చూడు సమాధిని మూసినరాయి దొరలింపబడెను అందు వేసిన ముద్ర కావలినిల్చెను నా దైవ సుతుని ముందు ||గీతం||

  • వలదు వలదు యేడువవలదు వెళ్ళుడి గలిలయకు తాను చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి ||గీతం||

  • అన్న కయపవారల సభయు అదరుచు పరుగిడిరి ఇంక భూతగణముల ధ్వనిని వినుచు వణకుచు భయపడిరి ||గీతం||

  • గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి జయవీరుడు రాగా మీ వేళతాళ వాద్యముల్ బూరలెత్తి ధ్వనించుడి ||గీతం||
  • 651 చూడుము గెత 10/19/2017 20:16 651 చూడుము గెత్సెమనే తోటలో నా ప్రభువు పాపి నాకై వి జ్ఞాపన చేసెడి ధ్వని వినబడుచున్నది పాపి నీకై విజ్ఞాపన చేసెడి ధ్వని వినబడుచున్నది

  • దేహమంతయు నలగి శోకము చెందినవాడై దేవాది దేవుని ఏకైక సుతుడు పడు వేదనలు నా కొరకే||

  • తండ్రి ఈ పాత్ర తొలగున్ నీ చిత్తమైన యెడల ఎట్లయినను నీ చిత్తము చేయుటకు నన్నప్పగించితివనెను||

  • రక్తపు చెమట వలన మిక్కిలి బాధనొంది రక్షకుడేసు హృదయము పగులుగ విజ్ఞాపనము చేసెనే||

  • ముమ్మారు భూమిమీదపడి మిక్కిలి వేదనచే మన యేసు ప్రభువు తానే వేడుకొనెను పాపుల విమోచన కొరకే||

  • ప్రేమామృత వాక్కులచే ఆదరించెడి ప్రభువు వేదన సమయమున బాధపరచెడి వారి కొరకు ప్రార్థన చేసెను||

  • నన్ను తనవలె మార్చెడి ఈ మహా ప్రేమను తలచి తలచి హృదయము కరుగగ సదా కీర్తించెదను ||చూడు||
  • 652 జయ జయ యేసు 10/19/2017 20:16 652 653 జయ విజయమని 10/19/2017 20:16 653 జయ విజయమని పాడుదమా జయ విజయుడగు యేసునకు అపజయమెరుగని దేవునకు జయస్తోత్రం స్తుతిచేయుదమా||


  • ఇహమందు పలు ఆపదలు ఎన్నో కలిగినను నా హస్తములు పట్టుకొని వడివడిగా నన్ను నడిపించును||

  • మహా దయాళుడు యెహోవా నన్నిల కరుణించి నా పాపముల అన్నింటి మన్నించి మలినము తొలగించును||
  • 654 జీవితమంత న 10/19/2017 20:16 654 జీవితమంత నీ ప్రేమగానం ప్రణుతింతుము యేసుదేవా ప్రచురింతు మేము నీ కీర్తిన్ ఆనందగానంబుతో ||జీవిత||

  • సర్వసమయములలో నీ స్తుతిగానం ఎల్లవేళలయందు నీ నామధ్యానం మాకదియే మేలు ఈ జీవితమున స్తుతియింతు నా రక్షకా ||జీవిత||

  • సృష్టినంతటిని నీ మాటచేత సృజియించితివిగా మా దేవ దేవా నీ ఘనమగు మహిమన్ వర్ణింపతరమా స్తుతియింతు నా రక్షకా ||జీవిత||

  • కలుషాత్ములైన మా కొరకు నీ విలువైన ప్రాణంబు నర్పించితివిగా కల్వరిగిరిపై చూపిన ప్రేమన్ స్తుతియింతు నా రక్షకా ||జీవిత||

  • పరిశుద్ధమైన నీ సన్నిధిలో శాశ్వతమైన నీరాజ్యంబులో ప్రేమతో నన్ను చేర్చుకొంటివిగా స్తుతియింతు నా రక్షకా ||
  • 655 తరతరాలలో, 10/19/2017 20:16 655 తరతరాలలో, యుగయుగాలలో, జగజగాలలో దేవుడు.... దేవుడు యేసే దేవుడు ఆ....ఆ...ఆ...ఆ.. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా

  • భూమిని పుట్టించకమునుపు లోకము పునాది లేనపుడు ||దే||

  • సృష్టికి శిల్పకారుడు జగతికి ఆదిసంభూతుడు ||దే||

  • తండ్రి కుమార ఆత్మయు ఓకడై యున్నా రూపము ||దే||
  • 656 దయచేయుము ప 10/19/2017 20:16 656 దయచేయుము పాపక్షమా దయచేయుము పాప క్షమా యేసుని రక్తము రక్తము వల్లనే||


  • తుడుపుము పాపపుడాగులు తుడువుము పాపపుడాగులు ||యేసు||

  • అనుగ్రహించు జయంసదా అనుగ్రహించు జయంసదా ||యేసు||

  • ఇమ్ము నిజసమాధానము ఇమ్ము నిజసమాధానము ||యేసు||

  • పరమపురిని జేరనిమ్ము పరమపురిని జేరనిమ్ము ||యేసు||
  • 657 దేవుడు మనక 10/19/2017 20:16 657 దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు(3)

  • ఏదేనులో ఆదాముతో నుండెన్ హానోకుతోడ నేగెను దీర్ఘ దర్శకులతో నుండెన్ ధన్యులు దేవుని గలవారు ||తోడుగ||

  • దైవజ్ఞాను శిరసావహించి దివ్యముగ నబ్రాహాము కన్న కొమరుని ఖండించుటకు ఖడ్గము నెత్తినయపుడు ||తోడుగ||

  • యోసేపు ద్వేషించబడినపుడు గోతిలో త్రోయబడినపుడు శోధనలో చెరసాల యందు సింహాసన మెక్కినయపుడు ||తోడుగ||

  • ఫరోరాజు తరిమిన యపుడు ఎర్రసంద్రపు తీరమున యోర్దానునది దాటినపుడు ఎరికో కూలినయపుడు ||తోడుగ||

  • దావీదు సింహాము నెదరించి ధైర్యాన చీల్చిన యపుడు గొల్యాతును హతమార్చినపుడు సౌలుచే తరుమబడి నపుడు ||తోడుగ||

  • సింహపుబోనులో దానియేలు షద్రకు మేషాకబెద్నెగో అగ్ని గుండములో వేయబడున్ నల్గురుగా కనబడినపుడు ||తోడుగ||

  • పౌలు బంధించబడినపుడు పేతురు చెరలోనున్నప్పుడు అపోస్తలుల విశ్వాసులు హింసింపబడిన యపుడు ||తోడుగ||
  • 658 దేవునికి స 10/19/2017 20:16 658 దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది

  • యెరుషలేము యెహోవాయే కట్టుచున్నవాడని(2) ఇశ్రాయేలీయులను పోగుచేయువాడని ||దేవుని||

  • గుండె చెదరిన వారిని బాగుచేయువాడని వారి గాయములన్నియు కట్టుచున్నవాడని ||దేవుని||

  • నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును వాటి కన్నియు పేరులు పెట్టిచున్నవాడని ||దేవుని||

  • ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు జ్ఞానమునకు ఆయనే మితియు లేనివాడని ||దేవుని||

  • దీనులకు అండాయనే భక్తిహీనుల కూల్చును సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి ||దేవుని||

  • ఆయన ఆకాశమున్ మేఘములతో కప్పును భూమి కొరకు వర్షము సిద్ధపర్చువాడని ||దేవుని||

  • పర్వతములలో గడ్డిని పశువులకు మొలపించెను అరచు పిల్లకాకులకును ఆహారము తానీయును ||దేవుని||

  • గుర్రముల నరులదలి బలము నానందించుడు కృప వేడు వారిలో సంతసించువాడని ||దేవుని||

  • యెరుషలేము యెహోవాను సీయోను నీ దేవుని కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని ||దేవుని||

  • పిల్లల నాశీర్వదించియు బలపరచు నీగుమ్మముల్ మంచి గోధుమపంటతో నిన్ను తృప్తిగనుంచును ||దేవుని||

  • భూమికి తన యాజ్ఞన ఇచ్చువాడు ఆయనే వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును ||దేవుని||

  • వాక్యమును యాకోబుకు తెలియచేసినవాడని ఏ జనయు కీలాగున చేసి యుండ లేదని ||దేవుని||
  • 659 దేవుని స్త 10/19/2017 20:16 659 దేవుని స్తుతియించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ||దే||

  • ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో ఆ ఆ ||దే||

  • ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశవిశాలమందు ఆ ఆ ||దే||

  • ఆయన పరాక్రమ కార్యమున్ బట్టి ఆయనప్రభావమును ||దే||

  • బూరధ్వనితో ఆయనన్ స్తుతించుడి స్వరమండలముతో ఆ ఆ ||దే||

  • సన్నతంతుల సితారతోను చక్కని స్వరములతో ||దే||

  • తంబురతోను నాట్యముతోను తంతి వాద్యముతోను ఆ ఆ ||దే||

  • పిల్లనగ్రోవులు చల్లగనూది ఎల్లప్రజలు జేరి ||దే||

  • మ్రోగుతాళములతో ఆయనన్ స్తుతించుడి గంభీర తాళముతో ఆ ఆ ||దే||

  • సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి హల్లెలూయా ఆమెన్ ఆ ఆ హల్లెలూయా ఆమెన్ ఎల్లప్పుడు ||దే||
  • 660 దొరకుతావుర 10/19/2017 20:16 660 దొరకుతావురా సహోదరా! దొరుకుతావురా, నీవు తరిమి తరిమి కీడుచేయ పరుగులెత్తినగాని తుదకు ||దొ||

  • చిన్న చూపు చూచి తమ్ముని కన్నెఱుంగక చంపినగాని అన్న కయీను దేవుని హస్తమునకు దొరికిన రీతిగా ||దొ||

  • వరములొందిన తమ్ముని జంప వలయునని పంతముగబట్టి నరకవచ్చిలోబడి యేడ్చిన దురిత చరితుని యేశావువలె ||దొ||

  • భక్త దావీదును బట్టి ప్రాణము దీయగ దలచిన తన శక్తితో తరిమిన రాజగు సౌలు దొరికినరీతిగాను ||దొ||

  • విగ్రహమునకు మ్రొక్కని దైవ పిల్లల నగ్నిలోపడవైచి ఆగ్రహించిన నెబుకద్నెజరు గడ్డిమోసి దొరికిన విధముగ ||దొ||

  • క్రైస్తవులను బట్టి కొట్టి ఖైదులో వేయదలచినను వాస్తవమగు వెలుగును జూచి ప్రభుని చాటిని పౌలుబోలి ||దొ||

  • కీడుచేయబోకు మెపుడు కీడు నీకే కీడు కీడు కీడు చేసినమేలుచేసి కీడును జయింపకపోతే ||దొ||

  • మాటలు కుదిరితే మాటలు కోటలు కుదురును నీకు మాటలలో లోటుంటే నోటిమాట తప్పకుండ ||దొ||

  • దొంగతనము వ్యభిచారమునకు లొంగి శాపగ్రస్తులునై దొంగిలించిన దశమభాగమే లొంగుట కారణమని తుదకు ||దొ||

  • కొంతయిచ్చిన దశభాగ మంత యిదియని తప్పుకున్న కొంతయిచ్చిన కయీనువలె కొంతయిచ్చిన అననియవలె ||దొ||

  • చెడుగుచేసి బదులు దానిని చేసినారని చెప్పమన్న వడిగ దేవుని న్యాయమనెడి పరమత్రాసులో నిలువండి ||దొ||
  • 661 నడిపించు న 10/19/2017 20:16 661 నడిపించు నానావ నడిసంద్రమున దేవా నవజీవన మార్గమున నాజన్మ తరియింప ||నడిపించు||

  • నా జీవిత తీరమున నా యపజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించు లోతునకు నా యాత్మ విరబూయ నా దీక్ష ఫలియింప నా నావలో కాలిడుము నా సేవ జేకొనుము ||నడిపించు||

  • రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయము రహదారులు వెదకినను రాదాయెను ప్రతిఫలము రక్షించు నీ సిలువ రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవ ||నడిపించు||

  • ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి అహమును ప్రేమించుచునే అరసితి ప్రభు నీ కలిమి ఆశ నిరాశయే ఆవేద నెదురాయే ఆథ్యాత్మిక లేమిగని అల్లాడె నావలలు ||నడిపించు||

  • ప్రభు మార్గమి విడచితిని ప్రార్థించుట మానితిని ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని ప్రపంచ నటనలో ప్రావీణ్యమును బొంది ఫలహీనుడనై యిపుడు పాటింతు నీమాట ||నడిపించు||

  • లోతైన జలములలో లోతున వినబడు స్వరమా లోబడుటను నేర్పించి లోపంబును సవరించి లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు లోపించని యర్పణగా లోకేశజేయుమయ ||నడిపించు||

  • ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని! ప్రేమకథ పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు ప్రానార్పణము చేతు ||నడిపించు||
  • 662 నమ్మవద్దు 10/19/2017 20:16 662 నమ్మవద్దు నమ్మవద్దు ఈ మాయలోకం నమ్మవద్దు ఇది ఆశజూపి మోసం జేయు ఈ మాయలోకం గనుక ||నమ్మ||

  • మిమునుగన్న తల్లి యేది మిమ్మునుగన్న తండ్రియేడి నాతోడబుట్టిన తోడులు యేరి వార్ని కాటికి మోసిన కోటప్ప లేరి గనుక ||నమ్మ||

  • మీరు కట్టిన యిండ్లు ఏవి మీరు కట్టిన కోటలు ఏవి కొట్టి తిన్న పొట్టలు ఉన్నవా? మెట్టలు పల్లాలవ్వక మానునా గనుక ||నమ్మ||

  • మీరు త్రవ్విన బావులు ఏవి మీరు త్రాగిన నదులు ఏవి ఏరులు ఎండకుండునా? కారులు మరచెడకుండునా గనుక ||నమ్మ||

  • మీరు కట్టిన బట్టలు ఏవి చుట్టి త్రాగిన చుట్టలు ఏవి కట్టినబట్ట మట్టికెకదా? చుట్టిన చుట్ట అగ్గికి కదా గనుక ||నమ్మ||

  • మనం మట్టినుండి తీయబడితిమి మట్టితో పుట్టబడితిమి ఎట్టి బ్రతుకు బ్రతికినగాని కట్టెకాటికి పదపదరన్నా గనుక ||నమ్మ||

  • యేసు ప్రభుని నమ్మండిప్పుడే మోసపోకుడి ఈ ధరణిలో ప్రయాసపడి భారమును మోసెడి ఓ ప్రజలారా గనుక ||నమ్మ||
  • 663 నరకమనునది 10/19/2017 20:16 663 నరకమనునది నిరంతముండునయో ఆ ఘోరనరకము నందు పాపులు బాథపడుదురయో మరియు నగ్ని పురుగులందున కొరుకు చుండును తరుగులేకను ధరణికాదిది దరియుకాదు మరణమెదకిన దొరకదందున ||న||

  • గప్పు గప్పున రగులుచుండునయ్యో ఆ ఘోరనరకము నిప్పులెగయుచు పొంగుచుండునయ్యో మబ్బువలె పొగ పైకిలేచును అబ్బా! అబ్బాని యేడ్చుచుందురు బొబ్బలిడు దురు అడ్డమొచ్చెడి అబ్బలెవరు కానరందున ||న||

  • నోరులెత్తి కొట్టుకొందురయ్యో ప్రభు యేసు క్రీస్తును నమ్మనందుకు నొచ్చుకొందురయ్యో పురుగు చావదు అగ్ని ఆరదు కొరుకుచుందురు పండ్లు పట పట తిరిగితిరిగి చూచుచుందురు పరుగులెత్తక యేడ్చు చుందురు ||న||
  • 664 నాదు జీవమా 10/19/2017 20:16 664 నాదు జీవమాయనే నా సమస్తము నా సర్వస్వము యేసుకే నాదు జీవము నాదు దైవము దివి దివ్య తేజము

  • కృంగినవేళ భంగపడినవేళ అద్దరికి చేర్చెను చుక్కానిలేని నావవలె నేనుండ అద్దరికి చేర్చెను ఆత్మతో నింపెను ఆలోచన చేసెను ||నాదు||

  • సాతాను ఖైదీనై కుములుచున్న వేళ విడిపించే శ్రీ యేసుడే రక్తమంత కార్చి ప్రాణాన్ని బలిచేసి విమోచన దయచేసెను సాతానుని అణగద్రొక్క అధికార బలమిచ్చెను ||నాదు||

  • కారుమేఘాలే క్రమ్మినవేళ నీతిసూర్చుడు నడుపును తుఫానులెన్నో చెలరేగి లేచిన నడుపును నా జీవితనావ త్వరలో దిగివచ్చును తరలిపోదుము ప్రభునితో ||నాదు||
  • 665 నా నిమిత్త 10/19/2017 20:16 665 నా నిమిత్తమాయన మహిని శ్రమలు పొందెను ఘనధనముల రోసెను అనుమతించె చావుకు

  • నా నిమిత్తమె (3) మరణ మాయెను తన జీవమును నాకు బలిగా ధారపోసెను ||నా నిమి||

  • గొఱ్ఱెపిల్ల రీతిగా గొప్ప శాంతి జూపెను ఉర్వినంత మోపినన్ యోర్చె మౌనవృత్తిని ||నా నిమి||

  • అతడు దోషమెరుగడు అతడు కపటమెరుగడు అయినను దేవుడు అతని నలుగగొట్టెను ||నా నిమి||

  • అతడు యిలను పొందిన అధిక దెబ్బలవలన్ క్షితిని నాకు కలిగెను స్వస్థత మది రూఢీగా ||నా నిమి||

  • రోగముల్ భరించెను వ్యసనములు వహించెను బాగుగా నొత్తిడిన్ బాధలన్ సహించెను ||నా నిమి||

  • గాయములను పొందెను కాయమంత నొచ్చెను హేయమైన నిందలన్ ఎలమిలో సహించెను ||నా నిమి||

  • ఎదిగె నాయన మన యెడల దీన వృత్తిని సదనులమగు ప్రీతితో సరకు చేయమైతిమి ||నా నిమి||

  • తన యనుభవమున్ మనల దోషరహితులన్ చేయ నుద్దేశించెన్ ప్రాణమర్పించెను ||నా నిమి||
  • 666 నా ప్రాణప్ 10/19/2017 20:16 666 నా ప్రాణప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా

  • అద్భుతకరుడా ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా బలవంతుడా బ..హు ప్రియుడా మనోహరుడా మహిమరాజా స్తుతించెదన్ ||నా ప్రాణ||

  • విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధింతున్ హర్షింతును నే పాడెదను నా ప్రభువా ||నా ప్రాణ||

  • గర్భమున పుట్టిన బిడ్డలన్ కరుణింపక తల్లి మరచునా మరచినగాని నీవెన్నడు మరువవు విడువవు ఎడబాయవు కరుణ రాజా ||నా ప్రాణ||

  • రక్షణాలంకారములను అక్షయమగు నీ యాహారమున్ రక్షకుడా నా కొసగితివి దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును ||నా ప్రాణ||

  • నీ నీతిని నీ రక్షణను నా పెదవులు ప్రకటించును కృతజ్ఞతాస్తు... తుల తోడ నీ ప్రేమను నే వివరింతును విమోచకా ||నా ప్రాణ||

  • వాగ్దానముల్ నాలో నెరవేరెన్ విమోచించి నా కిచ్చితివే పాడెదను ప్రహర్షింతును హల్లెలూయ హల్లెలూయ ||నా ప్రాణ||
  • 667 నా ప్రియ య 10/19/2017 20:16 667 నా ప్రియ యేసునిపై ఆనుకొని అరణ్య మార్గమున నడుచుటయే ఆనంద జీవితము ||నా||

  • లిల్లిపుష్పం షారోనురోజ పరిశుద్ధమైన మాదు తండ్రి పూర్ణరూప సౌందర్యుడే కీర్తింపతగిన దేవ ||నా||

  • కన్యకలు ప్రేమించుదేవ నా ప్రభునామము పరిమళమే యేసుని వెనుక వచ్చితిమి నన్ను ఆకర్షించెను ||నా||

  • ప్రేమధ్వజ మెగురుచుండగ ప్రియునిసముఖము కలుగుటచే జల్దరు వృక్షము క్రింద కలిగెను ప్రియుని ఆదరణ ||నా||

  • నిద్రించు రాత్రిసమయమునందు నిత్యం నా ఆత్మ మేలుకొని నా తలుపు నొద్ద నిలచిన యేసుని ప్రేమించెదన్ ||నా||

  • అగ్నిజ్వాల యేసుని ప్రేమ మరణమువలె బలవంతమైనది నీటి ప్రవాహమువలన ఆప్రేమ చల్లారదు ||నా||

  • దీనస్థంభము వలె దిగివచ్చును దేవకుమారుడు మహిమతో ఘనులైన వారి రథమువలె పై కెగిరిపోదును ||నా||
  • 668 నా సంకటంబు 10/19/2017 20:16 668 నా సంకటంబులన్నియు తీరిపోయె సంహారరదూత నన్ను దాటిపోయె

  • గొఱ్ఱెపిల్ల విలువైన రక్తములో కడుగబడి నేను రక్షణ బొందితిన్ ||నా సంక||

  • ఫరోకు నేనింక దాసుడను కాను పరమకానానుకు హక్కుదారుడను ||నా సంక||

  • మారాను మధురముగ మార్చినాకు బండను పగులగొట్టి దాహం దీర్చెను ||నా సంక||

  • మనోహరముగ నున్న కానాన్ రాజ్యమే అదే నాకు స్థిరమైన అవకాశము ||నా సంక||

  • ఆనందమే పరమానందమే కానాన్ జీవితము నాకు ఆనందమే ||నా సంక||

  • అరణ్యజీవితమున యేసు నాయకుడు ప్రతిదినం నూతనమన్నా ఆయన యిస్తాడు ||నా సంక||

  • నా బలము నా ఆశ్రయము నా రక్షణ యేసయ్య హల్లెలూయా ||నా సంక||
  • 669 నీ చేతితో 10/19/2017 20:16 669 నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పిచేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము

  • అంధకార లోయలోన సంచరించిన భయము లేదు నీ వాక్యమ శక్తిగలది నాత్రోవకు నిత్యవెలుగు ||నీ||

  • ఘోరపాపిని నేను తండ్రి పాప యూబిలో పడియుంటిని లేవనెత్తుము శుద్ధిచేయుము పొందనిమ్ము నీదు ప్రేమను ||నీ||

  • ఈ భువిలో రాజు నీవే నా హృదిలో శాంతినీవే కుమ్మరించుము నీదు ఆత్మను జీవితాంతము సేవచేసెదన్ ||నీ||
  • 670 నే యేసుని 10/19/2017 20:16 670 నే యేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించితిని నే వెను దిరుగన్ వెనుకాడన్ నేడేసుడు పిల్చిన సుదినం ||నే యే||

  • నా ముందు శిలువ నావెనుక లోకాశల్ నాదే దారి నా మనస్సులో ప్రభు నా చుట్టు విరోధుల్ నావారెవరు నా యేసుని మించిన మిత్రుల్ నాకిలలో గానిపించరని ||నే యే||

  • కరువులైనను కలతలైనను కలసిరాని కలిమిలేములు కలవరంబులు కలిగిననూ కదలనింకా కష్టములైనా వదలను నాదు నిశ్చయము ||నే యే||

  • శ్రమయనను బాధలైనను హింసయైన వస్త్రహీనత ఉపద్రవములు ఖడ్గములైన నా యేసుని ప్రేమనుండినను యెడబాపెటివారెవరు ||నే యేసు||
  • 671 యేసు చాలున 10/19/2017 20:16 671 యేసు చాలును యేసు చాలును యే సమయమైన యే స్థితికైన నా జీవితములో యేసు చాలును

  • పరమజీవము నాకు నివ్వ తిరిగి లేచెను నాతో నుండ నిరంతరము నన్ను నడిపించును మరల వచ్చి యేసు కొని పోవును ||యేసు||

  • సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను ||యేసు||

  • పచ్చిక బయలులో పరుండజేయున్ శాంతి జలము చెంత నడిపించును అనిశము ప్రాణము తృప్తిపరచున్ మరణ లోయలో నన్ను కాపాడును ||యేసు||

  • నరులెల్లరు నన్ను విడిచినను శరీరము కుళ్లి కృశించినను హరించినన్ నా ఐశ్వర్యము విరోధివలె నన్ను విడచినను ||యేసు||
  • 672 పాడెద దేవ 10/19/2017 20:16 672 పాడెద దేవ నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్(2) ఆ..ఆ..ఆ...(2)

  • భూమి పునాదులు వేయకముందే యేసులో చేసితివి ప్రేమ పునాదులు వేసితివి బ్రోచితివి ఈ దీనుని బ్రోచితివి ||పా||

  • ప్రవిమల రక్తము కలువరి సిలువలో కలునకు నిచ్చితివి ప్రేమకృప మహదైశ్వర్యములతో పాపము తుడిచితివి నా పాపము తుడిచితివి ||పా||

  • పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివి అపరాధములచే చచ్చిన నన్ను థర బ్రతికించితివి నన్ను బ్రతికించితివి ||పా||

  • దేవుని రాజ్యపు వారసుడనుగా క్రీస్తులో చేసితివి చీకటి రాజ్యపు శక్తుల నుండి నను విడిపించితివి చెరవిడిపించితివి ||పా||

  • ముద్రించితివి శుద్ధాత్మతో నను భద్రము చేసితివి సత్యస్వరూపి నిత్యనివాసి సొత్తుగా చేసితివి నీ సొత్తుగా చేసితివి ||పా||

  • అన్యుడనై నిన్ను ఎరుగక యున్నను ధన్యుని చేసితివి ప్రియ పట్టణ పౌరుల సేవింపను వరముల నొసగితివి కృప వరముల నొసగితివి ||పా||
  • 673 ప్రజలమే వే 10/19/2017 20:16 673 ప్రజలమే వేగమె రారె నిజదైవమును కనుగొనరె||


  • పాపాత్ములనబడు వారి భారంబు దీయనుగోరి ప్రభుయేసు జూపినదారి పరమందు సుఖమిడుదారి ||ప్రజ||

  • ఏ జాతివారలనైనన్ యే దేశవాసులనైనన్ యేమైన బేధము లేక యేసయ్య బ్రోచునువేగ ||ప్రజ||

  • పాపాత్ములే తన సుతులు ప్రభు యేసునికి స్నేహితులు నీ పాపమెల్లను బోయెన్ నీకింక మోక్షము కలుగున్ ||ప్రజ||

  • ప్రయాసపడి భారమును మోసెడు ఓ ప్రజలారా ప్రభుయేసుక్రీస్తే మీకు విశ్రాంతి నిచ్చునురండి ||ప్రజ||

  • యేసయ్యగాకను వేరే యెవరైన లేరిక రారే దోషంబులలెల్నను బాపి ఆశీర్వదించునుగాచి ||ప్రజ||
  • 674 ప్రభు ప్రే 10/19/2017 20:16 674 ప్రభు ప్రేమ తొలికేక హృదయంలో ప్రతిధ్వనియించే పాపక్షమా యేసునిలో శరణు నొసంగుచు కనిపించే

  • పాపవికారము పొడసూప జీవితవిలువలు మరుగాయె ఫలితముగా లోకములో బ్రతుకుటయే నాగతియాయె పలువురిలో కనబడలేకా దాహముతో నేనొంటరిగా బావికని పయనింప నాదుని దర్శనమెదురాయే పావనుడు దాహముతో జలమును ఇమ్మని ననుగోరె ||ప్ర||

  • జాతిని చూడని నేత్రముతో పాపము శోకని హృదయముతో జాలిని చాటించుచునే తాకెను నామది వేదనతో జాప్యము చేయక తెమ్మనియే దాచుకొనిన నాపాపమును జడియచునే తెలిపితిని ప్రభు వెరిగిన నా నిజస్థితిని జయమొందె నాతనువూ సరిగ నుడితవని ప్రభు తెలుపా

  • దేహమునే నాసర్వముగా భావించుచు మది పూజింపా దినదినము జీవితమూ చావుగ మారిన కాలములో దేవునిగా నా బంధువుగా మరణప్రవాహము చేధించి దరిజేర్చి దీవించి నూతన జన్మ ప్రసాదించే దయ్యాల కుహరమును స్తుతి మందిరముగ రూపించే ||ప్ర||

  • పాపము దాగును నాబావి లోతును చూచినదెవరు పోరాటవాటికయౌ నా బ్రతుకును ఎరిగినవారెవరు పాపికిని పాపమునకునూ భేదము చూపిన వారెవరూ పాపిని కాపాడుటకు సిలువను మోసిన వారెవరూ ప్రకటించె దైవకృప తెరచెను జీవన జలనిధులు ||ప్ర||

  • ఘటముతో వెడలితి నొంటరిగా పితరుల త్రానజనములకై కనబడెను బావికడ రక్షణయూటల ప్రభుయేసు కుండను వీడి పరుగిడితి బావిని చేకొని హృదయములో ఘనమైన శుభవార్త ఆతృతతో ప్రజలకు తెలుసా గ్రామప్రజా కనుగొనిరి విశ్వవిమోచకుడగు యేసున్ ||ప్ర||
  • 675 ప్రభు యేసు 10/19/2017 20:16 675 ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో పరికించిన శుభదినము గమనించిన యాక్షణము పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం

  • దిశలన్నియు తిరిగితిని నాపాపపు దాహముతో దౌష్ట్యములో మసలుచును దౌర్జన్యము చేయుచును ధన పీడనతో మృగ వాంఛలతో దిగజారితి చావునకు

  • యేసు నీరాజ్యములో భువి కేతెంచెడి రోజు ఈ పాపిని క్షమియించి జ్ఞాపకముతో బ్రోవుమని ఇల వేడితిని విలపించుచును ఈడేరును నా వినతి ||ప్రభు||

  • పరదైనున ఈ దినమే నా ఆనందముతోను పాల్గొందువు నీవనుచు వాగ్ధానము చేయగానే(2) పరలోకమె నా తుది వూపిరిగా పయనించితి ప్రభుకడకు ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించె ||ప్రభు||
  • 676 ప్రభువా! న 10/19/2017 20:16 676 ప్రభువా! నే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను నరులేమి జేయగలరు భయమేమిలేదు నాకు

  • గర్విష్టులైనవారు నాతో పోరాడుచుండ ప్రతిమాట కెల్లవారు పరభావ మెంచుచుండ ప్రభువా నా ప్రక్కనుండి నన్ను తప్పించినావు ||ప్రభు||

  • నేనెందుపోదుమన్నా గమనించుచుండువారు నా వెంట పొంచియుండి నన్ను కృంగదీయ నెంచ ప్రభువా! నా ప్రక్కనుండి నన్ను తప్పించినావు ||ప్రభు||

  • పగబూని వారు నన్ను హతమార్చ జూచియున్న మరణంబునుండి నన్ను కడువింత రీతిగాను ప్రభువా! నా ప్రక్కనుండి నన్ను తప్పించినావు ||ప్రభు||

  • జీవంపు వెల్గునైన నీ సన్నిధానమందు నే సంచరించునట్లు నే జారిపోకుండ ప్రభువా! నా ప్రక్కనుండి నన్ను తప్పించినావు ||ప్రభు||

  • నన్నాదుకొంటి నీవు నన్నాదరించినావు కొన్నావు నీవు నన్ను మన్నించినావు నీవు ఎన్నాళ్ళు బ్రతికి యున్న నిన్నే సేవింతు దేవా!
  • 677 ప్రేమామృత్ 10/19/2017 20:16 677 ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు? ఆ-ఆ-ఆ ప్రేమయెతానై నిలచి ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి ప్రేమనగరికి చనియె ||ప్రేమా||

  • నిశ్చలమైన ప్రేమజీవికి యిలలో తావేది ప్రేమ ద్రోహులేగాని ప్రియమున చేరరు వాని చేరిన చెలికాడగురా సమయమిదే పరుగిడరా ||ప్రేమా||

  • ఎంత ఘోరపాపాత్ములనైన ప్రేమించునురారా పాపభారముతో రారా పాదములపై బడరా పాపుల రక్షకుడేసు తప్పక నిను రక్షించున్ ||ప్రేమా||

  • ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసెదవేల? రక్షణ దిన మిదియేరా తక్షణమే కనుగొనరా ఇదియే దేవుని వరము ముదమారగ జేకొనుము ||ప్రేమా||
  • 678 ప్రియయేసు 10/19/2017 20:16 678 ప్రియయేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం ముదమార వసించునా హృదయాంతరంగమున

  • నీ రక్త ప్రభావమున నా రోత హృదయంబును పవిత్రపరచుము తండ్రీ ప్రతిపాపమును కడిగి ||ప్రియ||

  • అజాగరూకుడనైతి నిజాశ్రయమువిడిచి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి ||ప్రియ||

  • వికసించె విశ్వాసంబు వాక్యంబును చదువగనె చేరితి నీదుదారి కోరి నడిపించుము ||ప్రియ||
  • 679 మణులు మాణి 10/19/2017 20:16 679 మణులు మాణిక్యములున్నా మేడమిద్దెలు ఎన్నున్నా మదిలో యేసులేకున్నా ఏది ఉన్నా అది సున్నా ||మణు||

  • చదువులెన్నో చదివివున్నా పదవులెన్నో చేస్తున్నా విద్యవున్నా బుద్ధివున్నా జ్ఞానమున్నా అది సున్నా ||మణు||

  • అందచందా లెన్నున్నా అండములపై కూర్చున్నా సుందరుడు ప్రభులేక యున్నా అందమున్నా అది సున్నా ||మణు||

  • రాజ్యములు రమణులు ఉన్నా శౌర్యములు వీర్యము లున్నా బలము ఉన్నా బలగమున్నా ఎన్నివున్నా అవి సున్నా ||మణు||

  • పూజ్యుడా పుణ్యాత్ముండా పుణ్యకార్య సిద్ధుడా దానధర్మము జపము తపము యేసులేనిది అదిసున్నా ||మణు||
  • 680 మధురం మధుర 10/19/2017 20:16 680 మధురం మధురం మధురం యేసునాధ కథ మధురం ||మన||

  • మధురమే మన ప్రభు యేసుని నామం మానవాళికదే మాధుర్యమనామం పాపిని బ్రోచెడి పావన నామం పరమున జేర్చే పరిశుద్ధనామం ||మన||

  • మారని దేవుని మాటయే మధురం మదిలోదలచిన కలతను దీర్చున్ ఎదలో బాధను బాపున్ నిరతం నమ్మిననరులకు నెమ్మది నిచ్చున్ ||మ||

  • పగలురేయి ప్రార్థించుటే మధురం పరిశుద్ధుల సహవాసమే మధురం అపోస్తలుల సద్భోదయే మదురం మధురాతి మధురం పరిశుద్ధ రుధిరం ||మ||

  • జుంటితేనెయ ధారలకంటే కమ్మనిది ప్రభు క్రీస్తుని వార్యం ఆదియందు ఆ వాక్యమే ఉండెన్ వాక్యమే ప్రియప్రభు యేసుగ మారెన్ ||మ||

  • అందరిలో అతిసుందరుడతడు ఆది దేవుని ఏకైక సుతుడు ఆశ్చర్యకరుడా ఆలోచన కర్త అవతరించె భువిన్ అందరి కొరకే ||మ||

  • యేసే క్రీస్తుగ నెరిగిన మేము పరుగిడితిమి పాపము నుండి దూరం పొందితిమి ఆత్మానందభాగ్యం ప్రకటించుటే మా ప్రధానధ్యేయం ||మ||
  • 681 మార్గము చూ 10/19/2017 20:16 681 మార్గము చూపుము ఇంటికి నా తండ్రి యింటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి(2)

  • పాప మమతలచేత పారిపోయిన నాకు ప్రాప్తించెక్షామము పశ్చాత్తాపము నొంది తండ్రి క్షమగోరుచు పంపుము క్షేమము ప్రభు నీదు సిలువముఖము చెల్లనినాకు పుట్టించే ధైర్యము

  • ధనమే సర్వంబనుచు సుఖమే స్వర్గంబనుచు తండ్రిని వీడితి ధరణీభోగములెల్ల బ్రతుకు ధ్వంసముజేయ దేహి నినుచేరితి దేహి అని నీవైపు చేతులెత్తిననాకు దారినిజూపుము ||మా||

  • దూరదేశములోన బాగుండుననుకొనుచు తప్పితి మార్గము తరలిపోయిరి నేను నమ్మినహితులెల్ల తరిమే దారిద్ర్యము దాక్షిణ్యమూర్తి నీదయ నాపై కురిపించి ధన్యుని జేయుము ||మా||

  • అమ్ముకొంటిని నేను అధముడొకనికి నాడు ఆకలిబాధలో అన్యాయమయిపోయె పందులు సహవెలివేయ అలవడెను వేదన అడుగంటె అవినీతి మేల్కొనియె మానవత ఆశ్రయము గూర్చుము ||మా||

  • కొడుకునే కాదనుచు గృహమే చెరసాలను కోపించి వెళ్ళితి కూలివీనిగనైన నీ యింట పనిచేసి కనికరమే కోరుదు కాదనకు నా తండ్రి దిక్కెవ్వరును లేరు క్షమియించు బ్రోవుము ||మా||

  • నా తండ్రి ననుజూచి పరుగిడుచు ఏ తెంచి నాపై బడి ఏడ్చెను నవజీవమును కూర్చి యింటికి తోడ్కొనివెళ్ళి నన్ను దీవించెను నా జీవిత కథయంత యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమై యుండును ||మా||
  • 682 యెహోవా నా 10/19/2017 20:16 682 యెహోవా నా బలమా యధార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం ||యెహోవా||

  • నా శత్రువులు నను చుట్టినను నరకపు పాశములరికట్టినను వరదవలె భక్తిహీనులు పొర్లిన వదలక నను ఎడబాయని దేవా ||యెహోవా||

  • మరణపు టురువులు మరువక మొరలిడ ఉన్నతదుర్గమై రక్షణ శృంగమై తన ఆలయములో నా మొరవినెను అదిరెను ధరణి భయకంపముచే ||యెహోవా||

  • నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగ జేయున్ జలరాసులనుండి బలమైన చేతితో వెలుపల జేర్చిన బలమైన దేవుడు ||యెహోవా||

  • పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతముల పునాదులు వణకెను తన నోటి నుండి వచ్చిన అగ్ని దహించివేసెను వైరుల నెల్లను ||యెహోవా||

  • మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటుగ జేయును ఉరుముల మెరుపుల మెండుగ జేసి అపజయమిచ్చును అపవాదికిని ||యెహోవా||

  • దయగలవారిపై దయచూపించును కఠినుల యెడల వికటము జూపును గర్విష్ఠుల యొక్క గర్వము నణచును సర్వము నెరిగిన సర్వాధికారి ||యెహోవా||

  • నా కళ్ళను లేడికాళ్ళగ జేయును యెత్తైన స్థలములో శక్తితో నిలిపి రక్షణ కేడెము నాకందించి అక్షయముగ తన పక్షము జేర్చిన ||యెహోవా||

  • యెహోవా జీవము గల దేవా బహుగ స్తుతులకు అర్హుడ నీవు అన్యజనులలో ధన్యతజూపుచు హల్లెలూయా స్తుతిగానము జేసెద ||యెహోవా||
  • 683 రమ్మనుచున్ 10/19/2017 20:16 683 రమ్మనుచున్నా డేసురాజు రండి సర్వ జనులారా

  • ఇల్లువాకిలి లేనివారలు ఇహాన నమ్మదగనివారలు తన రాజ్యము మీకిచ్చును యేసు

  • కరవుచే కృశించుచున్న మరణించుచున్న ప్రజలారా ఆకలిదప్పులు తీర్చును మీకు రండి సర్వజనులారా ||రమ్మను||

  • ముండ్ల మకుటము ప్రక్కన గాయము పాదహస్తములలో గాయములు పొందిన ప్రభువే పిల్చెను మిమ్ము రండి సర్వజనులారా ||రమ్మను||

  • రయమున ప్రియులారా కూడి రండి పరీక్ష చేయండి భరించును మీ భారములన్నియు రండి సర్వజనులారా ||రమ్మను||
  • 684 రమ్ము! నీ 10/19/2017 20:16 684 రమ్ము! నీ తరుణమిదే పిలచుచున్నాడు నీ ప్రభువైన యేసు నొద్దకు

  • జీవితమంతయు వ్యర్థముగను దుఃఖముతోను గడుపుటయేల వచ్చి ఆయన శరణు జొచ్చినచో వాంఛతో నిన్ను స్వీకరించున్ ||రమ్ము||

  • కట్టిన యిల్లు ధనధాన్యములు కనబడు బంధుమిత్రులును గూడు విడిచి నీవు పోయినచో వెంటనీతో రారెవరు ||రమ్ము||

  • అందము మాయ అస్థిరమే దాని నమ్మకుము మోసగించును మరణము ఒకనాడు వచ్చును మరువకు నీ ప్రభువును ||రమ్ము||

  • మిన్ను క్రిందన్ భూమి మీదన్ మిత్రుడేసు నామముగాక రక్షణ పొందు దారిలేదు రక్షకుడేసే మార్గము ||రమ్ము||

  • తీరని పాపవ్యాధులను మారని నీదు బలహీనతల్ ఘోర సిలువలో మోసితీర్చెన్ గాయములచే బాగుపడన్ ||రమ్ము||

  • సత్యవాక్కును నమ్మి రమ్ము నిత్యజీవమును నీకిచ్చున్ నీ పేరు జీవపుస్తకమునందు నిజముగ ఈనాడే వ్రాయున్ ||రమ్ము||
  • Post a Comment

    أحدث أقدم