Neeve krupadharamu thriyeka deva నీవే కృపాధారము త్రియేక దేవా

Song no:
no audio HD
    నీవే కృపాధారము త్రియేక దేవా - నీ వేక్షేమాధారము నా యేసయ్యా
    నూతన బలమును నవనూతన కృపను - 2
    నేటివరకు దయచేయుచున్నావు

    నుపల్లవి :- నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా
    ఈ స్తోత్రగీతం నీకేనయ్యా

  1. ఆనందించితి అనురాగబంధాన - ఆశ్రయపురమైన నీలో నేను -2
    ఆకర్షించితివి ఆకాశముకంటే ఉన్నతమైన నీ ప్రమనుచూపి - 2
    ఆపదలెన్నో అలుముకున్ననూ అభయమునిచ్చితివి
    ఆవేదనల అగ్నిజ్వాలలో అండగ నిలిచితివి
    ఆలోచనవై ఆశ్రయమిచ్చి కాపాడుచున్నావు
    నీకే ఈ ప్రేమగీతం అంకితమయ్యా - ఈ స్తోత్రగీతం నీకేనయ్యా || నీవే ||

  2. ప్రార్థించితిని ప్రాకారములను - దాటించగలిగిన ప్రభువే నీవని -2
    పరిశుద్ధతకై నియమించితివి - నీరూపమునాలో కనపరచుటకు 2
    పావనమైన జీవనయాత్రలో విజమునిచ్చితివి
    పరమరాజ్యములో చేర్చుటకొరకు అభిషేకించితివి
    పావనుడా నా అడుగులు జారక స్థిరపరచినావు
    నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా - ఈ స్తోత్రగీతం నీకేనయ్యా || నీవే ||

  3. సంపూర్ణతకై సంతృప్తి కలిగి - సిలువను మోయుచు నీతో నడిచెద - 2
    సుడివడిననా బ్రతుకును మార్చితివి - సింహాసనముకై నను పిలచితివి - 2
    శిధిలముకాని సంపదలెన్నో నాకైదాచితివి
    సాహసమైనమైన గొప్ప కార్యములు నాకై చేసితివి
    సర్వశక్తిగల దేవుడవైనాముందు నడచిన
    నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా - ఈ స్తోత్రగీతం నీకేనయ్యా || నీవే ||



أحدث أقدم