الصفحة الرئيسيةAKK📖 Krotthyedu modhalu bettenu క్రొత్తయేడు మొదలు బెట్టెను byOnline Lyrics List —ديسمبر 29, 2019 0 122 క్రీస్తుని మహిమ రాగం - మధ్యమావతి తాళం - ఆట క్రొత్త యేడు మొదలు బెట్టెను మన బ్రతుకునందుఁ క్రొత్త మనసు తోడ మీరు క్రొత్త యేటఁ బ్రభుని నేవఁ దత్తర పడకుండఁ జేయు టుత్తమోత్తమంబుఁ జూడఁ ||క్రొత్త|| పొంది యున్న మేలు లన్నియుఁ బొంకబు మీఱ డెందమందు స్మరణ జేయుఁడీ యిందు మీరు మొదలు బెట్టు పందెమందుఁ గెల్వ వలయు నందముగను రవినిఁబోలి నలయకుండ మెలయకుండఁ ||క్రొత్త|| మేలు సేయఁ దడ వొనర్పఁగా మీరెఱుఁగునట్లు కాలమంత నిరుడు గడ చెఁగా ప్రాలుమాలి యుండకుండ జాల మేలు సేయవలయుఁ జాల జనముల కిమ్మాను యేలు నామ ఘనతకొఱకుఁ ||క్రొత్త|| బలము లేని వార మయ్యును బల మొంద వచ్చుఁ గలిమి మీఱఁ గర్త వాక్కున నలయకుండ నలగకుండ మోద మొంది బల మొసంగు సర్వవిధుల నెలమి మీ రొనర్చుచుండఁ ||క్రొత్త|| ఇద్ధరిత్రి నుండు నప్పుడే యీశ్వరుని జనులు వృద్ధిబొందఁ జూడ వలయును బుద్ధి నీతి శుద్ధులందు వృద్ధినొంద శ్రద్ధఁ జేయ శుద్ధు లైన వారిలోఁ ప్ర సిద్ధు లగుచు వెలుఁగ వచ్చుఁ ||క్రొత్త|| పాపపంక మంటినప్పుడు ప్రభు క్రీస్తు యేసు ప్రాపుఁ జూరి మీరు వేఁ డ గా నేపుమీఱఁ దనదు కరుణఁ బాప మంతఁ గడిగివేసి పాపరోగ చిహ్న లన్ని బాపివేసి శుద్ధిఁ జేయుఁ ||క్రొత్త|| Krottha Yedu Modalu Bettenu Mana Brathuku Nandu Kroththa Yedu Modalu Bettenu Kroththa Manasu Thoda Meeru Kroththa Yeta Prabhuni Seva Thaththara Padakunda Jeyu Tuthamothamambu Jooda || Krottha || Pondhiyunna Melulanniyu Bonkambu Meera Dendamandu Smaran Jeyudi Indu Meeru Modalupettu Pandemandu Gelva Valayu Andamuganu Ravini Boli Alayakunda Melayakunda || Krottha || Balamu Leni Vaaramayyunu Balamondavachchu Kalimi Meera Gartha Vaakkuna Alayakunda Aduguchunda Nalagakunda Modamondi Balamosangu Sarva Vidhula Nelami Meera Nochchuchunda || Krottha || Paapa Pankamantinappudu Prabhu Kreesthu Yesu Praapu Jeri Meeru Vedagaa Sepu Meera Thanadu Karuna Paapamantha Kadigivesi Paapa Roga Chihnalanni Baapi Vesi Shudhdhi Cheyu || Krottha || క్రొత్తయేడు మొదలు బెట్టెను