Song no: #65
-
దేవుని గొప్ప ప్రేమను కలంబు తెల్పజాలదు అత్యున్నత నక్షత్రమున్ అధోగతిన్ అవరించున్ నశించు జాతిన్ రక్షింపన్ సుతుని బంపెను పాపంబు నుండి పాపికి విశ్రాంతి జూపెను
- ||దేవుని ప్రేమ సంపద అపారమైనది నిరంతరంబు నిల్చును ప్రేమ సంగీతము||
- యుగాంతకాల మందున భూరాజ్యముల్ నశించగా యేసున్ నిరాకరించువారు చావును కోరు వేళను దేవుని ప్రేమ గెల్చును అనంత జీవము నశించు వారి కాశ్రయంబు ప్రేమ సందేశము.
- సముద్రమును సిరాతో నిండి ఆకాశమె కాగితమై కొమ్మల్లె కలంబులె ప్రతి నరుండు కరణమై దేవుని ప్రేమన్ చిత్రింపన్ సంద్రంబు యింకును ఆకాశ వ్యాప్తి యంతయు చాలక పోవును.
إرسال تعليق