yentha goppa devude yenni sithralu ఎంత గొప్ప దేవుడే ఎన్ని సిత్రాలు

Song no: 52

    ఎంత గొప్ప దేవుడే ఎన్ని సిత్రాలు సేసినాడే } 2

    ఇంత ఇంతని ఆయన వింతలు సాటలేను } 2 || ఎంత గొప్ప ||

  1. నీళ్లను ద్రాక్షారసముగ మార్చినాడే
    వేలమందికాహారం కూర్చినాడే } 2
    నీటి పైన తాను నడచినాడే } 2
    గాలి సముద్రమును అణచినాడే } 2 || ఎంత గొప్ప ||

  2. గుడ్డోళ్ళు కళ్ళను తెరచినాడే
    పక్షవాయువును బాగుపరచినాడే } 2
    కుంటోళ్ళను సక్కగ నడిపించినాడే } 2
    దయ్యాలనుండి విడిపించినాడే } 2 || ఎంత గొప్ప ||

  3. చనిపోయిన లాజరును లేపినాడే
    సమరయ స్త్రీ పాపమును బాపినాడే } 2
    సిలువపై ప్రాణమును విడిచినాడే } 2
    సమాధిని గెలిచి మరల లేచినాడే } 2 || ఎంత గొప్ప ||
أحدث أقدم