Ie lokam mayara paralokam saswathamura ఈ లోకం మాయరా పరలోకం శాశ్వతమురా

Song no:
HD
    ఈ లోకం మాయరా
    పరలోకం శాశ్వతమురా } 2
    నరుడా ఓ నరుడా బైబిలు చేతి పట్టారా
    నరుడా ఓ నరుడా
    నిజ దేవుణ్ణి నమ్మరా } 2 || ఈ లోకం ||

  1. పాపపు ఊబిలో మునగక
    నరకానికి పోకురా
    లోకాశలతో తిరుగకా దేవుని వైపు సాగర
    దుష్టుని స్నేహం చెయ్యక పాడైపోవురా
    దేవుని స్నేహం పొందర
    చిరకాలం నిలుచురా
    దేవుని రాకడ దగ్గర అవుతుందిరా
    రాకడకై నీవు సిద్ధిమవ్వాలిరా } 2
    నరుడా ఓ నరుడా బైబిలు చేతి పట్టారా
    నరుడా ఓ నరుడా
    నిజ దేవుణ్ణి నమ్మరా } 2 || ఈ లోకం ||

  2. మనిషి ప్రేమను నమ్మక నిలువునా ముంచేనురా
    దేవుని ప్రేమ నిజమైందిరా
    కడవరకు నిలిచేనురా
    అందమున్నదని పొంగక అది కొంతకాలమేరా
    ధనాపేక్షతో ఉండక అది నీ వెంట రాదురా
    నీకై మరణించిన దేవుణ్ణి వెతకరా
    దొరికిన క్షణమే రక్షింపబడతావురా } 2
    నరుడా ఓ నరుడా బైబిలు చేతి పట్టారా
    నరుడా ఓ నరుడా
    నిజ దేవుణ్ణి నమ్మరా } 2 || ఈ లోకం ||
Image result for మనిషి ప్రేమ నిలువునా ముంచేనురా
أحدث أقدم