Cheppukunte siggu chetani nesthama cheppakunte చెప్పుకుంటే సిగ్గు చేటని నేస్తమా చెప్పకుంటే

Song no:
HD
    చెప్పుకుంటే సిగ్గు చేటని
    నేస్తమా చెప్పకుంటే గుండె కోతని } 2
    నీలో నీవే క్రుంగిపోతున్నావా ?
    అందరిలో ఒంటరివైపోయావా ? } 2

    చేయి విడువని యేసు దేవుడు ఆదరించి ఓదార్చును
    నీ చేయి విడువని యేసు దేవుడు - నిన్నాదరించి ఓదార్చును || చెప్పుకుంటే ||

  1. కసాయి గుండెలు దాడి చేసెనా?
    విషపు చూపులే నీవైపువుంచెనా ? (2)
    కన్నీటితో గడిపిన ఎన్నో రాత్రులు
    చూడలేదా పొద్దు పొడుపులు.} 2 || చేయి విడువని ||

  2. పాపపు లోకము నిను వేధించెనా ?
    నిందలు వేసి వెక్కిరించెనా ? (2)
    కన్నీటితో గడిపిన ఎన్నో రాత్రులు
    చూడలేదా పొద్దు పొడుపులు || చేయి విడువని ||

  3. నా అన్నవారే నిన్నవమానించెనా ?
    అనాథను చేసి విడిచివెళ్లెనా ?(2)
    కన్నీటితో గడిపిన ఎన్నో రాత్రులు
    చూడలేదా పొద్దు పొడుపులు || చేయి విడువని ||

أحدث أقدم