శృంగార నగరమా - మహరాజు పట్టణమ
పరిపూర్ణ సౌందర్య - యేరుషలేము నగరమా ''2''
నీ రాజు నిన్ను కోరుకొనెను సకల దేశముల ఆభరణమా"2"
ఎటుల వర్ణింతును నీ సౌందర్యము..? ఎటుల వివరింతును నీ ఔన్నత్యము..? "2"
1. మేలిమి బంగారుతో పోల్చదగినవారు సీయోను నీ ప్రియ కుమారులు "2"
హిమము కంటే శుద్దమైన వారు..పాలుకంటే తెల్లని వారు నీ జనులు
వారి దేహ కాంతి నీలము..పగడముల కంటే తెల్లని వారు "శృంగార "
2. యేరుషలేమ నీచుట్టు కట్టని గోడ వలే పర్వతములు నిలిచియున్నట్టే
నీ ప్రజల చుట్టు నీ రాజు..బలమైన ప్రాకారముగా నిలిచియున్నాడు
నీ క్షేమము కోరి ప్రార్ధించు వారిని..వర్దిల్లనిచ్చుచున్నాడ యేసు "శృంగార "
إرسال تعليق