Naa vedhanalo na badhalo ne krungina velalo నా వేదనలో నా బాధలోనే కృంగిన వేళలో

Song no:
    నా వేదనలో నా బాధలో- నే కృంగిన వేళలో నా తోడై యున్నావు"2"
    నన్ను నడిపించు నా యేసయ్య - నాకు తోడైయుండు నా ప్రభువా
    నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా.... || నా వేదనలో ||

  1. నా అన్నవారే నను మరిచారయ్యా - అయినవారే నన్ను అపహసించినారయ్యా
    నా కన్నవారిని నే కోల్పోయినా - నా స్వంతజనులే నన్ను నిందించినా....
    కన్నీటిని తుడిచి కౌగలించినావూ - కృపచూపి నన్ను రక్షించినావు
    నన్ను నడిపించు నా యేసయ్య - నాకు తోడైయుండు నా ప్రభువా
    నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా.... || నా వేదనలో ||
     
  2. ఇహలోక శ్రమలన్ని ఎన్నదగినవికావని - ప్రభునందు నా ప్రయాస వ్యర్థమే కాదని
    నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తేనని - చావైతే నాకది ఎంతో మేలని //2//
    నా కన్నులెత్తి నేవైపుకే నీరీక్షనతో చూచుచున్నాను //2//
    నీ యందే నే బ్రతుకుచున్నాను..... || నా వేదనలో ||
أحدث أقدم