Hrudhaya marpimchedhamu prabhunaku హృదయ మర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో

Song no: 120

    హృదయ మర్పించెదము ప్రభునకు
    స్తుతి ప్రశంసలతో పరిశుద్దులము చేరి } 2

  1. పాపభారము మోయన్ వచ్చె నేసు జగతిన్ } 2
    పాపుల పాపము తొలగించుటకు } 2
    నిత్యజీవము నిచ్చెన్ } 2 || హృదయ ||

  2. సంకట క్లేశము భరించెన్ నమ్రతతో దీనుడై } 2
    రక్షణ ద్వారము తెరచెను ప్రభువు } 2
    నిత్య నిరీక్షణ నిచ్చెన్ } 2 || హృదయ ||

  3. ఆశ్చర్య పరలోక ప్రేమ పాపులమగు మనకే } 2
    తిరిగి వెళ్ళకు పాపమునకు } 2
    నిలువకు పాపములో } 2 || హృదయ ||

  4. అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహం } 2
    కాపాడు మా జీవితముల } 2
    ఇదియే మా వినతి } 2 || హృదయ ||

أحدث أقدم