Gunde baruvekki pothunnadhi pranamu గుండె బరువెక్కిపోతున్నది ప్రాణము సొమ్మసిల్లుచున్నది

Song no:

    గుండె బరువెక్కిపోతున్నది
    ప్రాణము సొమ్మసిల్లుచున్నది (2)
    నా మనసేమో కలవరపడుచున్నది (2)
    యేసయ్యా.. ఆదరించ రావా
    యేసయ్యా.. బలపరచ రావా ||గుండె||

  1. ఆదరణ లేక దిగులుతో నేనుంటిని (2)
    నెమ్మది లేదాయెనే – శాంతి కరువాయెనే (2)
    యేసయ్యా.. ఆధారం నీవే కదా
    యేసయ్యా.. నా కాపరి నీవే కదా ||గుండె||

  2. అంధకారంలో నా దీపము ఆరిపోయెనే
    అరణ్య రోదనలో ప్రాణము సొమ్మసిల్లెనే (2)
    దినదినము నేను కృంగుచున్నాను (2)
    యేసయ్యా.. వెలిగించగ రావా
    యేసయ్యా.. లేవనెత్త రావా ||గుండె||

  3. ఎక్కడ చూసిననూ నెమ్మది లేదాయెనే
    ఎవరిలో చూసిననూ ప్రేమ కరువాయెనే (2)
    ఆత్మల భారముతో మూల్గుచున్నానయ్యా (2)
    యేసయ్యా.. దర్శించ రావా
    యేసయ్యా.. ప్రేమతో నింపుమయా ||గుండె||
أحدث أقدم