రాకడ సమయంలో కడబూర శబ్ధంతో యేసుని చేరుకునే

Song no:

    రాకడ సమయంలో – కడబూర శబ్ధంతో
    యేసుని చేరుకునే – విశ్వాసం నీకుందా? (2)
    రావయ్య యేసయ్య – వేగరావయ్యా
    రావయ్య యేసునాథా – వేగమెరావయ్యా (2) ॥రాకడ॥

  1. యేసయ్య రాకడ సమయంలోఎదురేగె రక్షణ నీకుందా? (2)
    లోకాశలపై విజయం నీకుందా? (2) ॥రావయ్య॥

  2. ఇంపైన ధూపవేదికగాఏకాంత ప్రార్థన నీకుందా? (2)
    యేసు ఆశించే దీన మనస్సుందా? (2) ॥రావయ్య॥

  3. దినమంతా దేవుని సన్నధిలోవాక్యం కొరకు ఆకలి నీకుందా? (2)
    యేసునాథునితో సహవాసం నీకుందా? (2) ॥రావయ్య॥

  4. శ్రమలోన సహనం నీకుందా?స్తుతియించే నాలుక నీకుందా? (2)
    ఆత్మలకొరకైన భారం నీకుందా? (2) ॥రావయ్య॥

  5. నీ పాత రోత జీవితమునీ పాప హృదయం మారిందా? (2)
    నూతన హృదయంతో ఆరాధన నీకుందా? (2) ॥రావయ్య॥

  6. అన్నీటికన్నా మిన్నగనుకన్నీటి ప్రార్థన నీకుందా? (2)
    ఎల్లవేళలలో స్తుతియాగం నీకుందా? (2) ॥రావయ్య॥

إرسال تعليق

0 تعليقات