Song no: 628
- ఆనందమానంద మాయెను నాదు ప్రియకుమారుని యందు ||మహదానం||
- ప్రేమించుచున్నావు నీతిని దుర్నీతిని ద్వేషించినావు నీవు అందుచే నీ తోటి వారికంటె ఆనందతైలముతో తండ్రి నిన్ను అధికంబుగా నభిషేకించెను ||మహదానం||
- అంత్యదినముల యందున ఆ వింతకుమారునిద్వారా ఈ మానవులతోడ మాట్లాడెను సర్వమునకు తండ్రి తనయుని వారసునిగా నియమించెను ||మహదానం||
- తనయుండె ఆ తండ్రి మహమ ఆ తత్వంబు రూపంబు తానె ఆ మహాత్యమైనట్టి మాటలచేత సమస్తమును నిర్వహించు అందరిలో అతి శ్రేష్ఠుండాయే ||మహదానం||
- నీవు నాదు కుమారుడవు నిన్ను ప్రేమించి కన్నాను నేను నేడు దండిగ తనయుని ముద్దాడుడి నిండుగ వాని నాశ్రయించుడి రండి రండి ధన్యులు కండి ||మహదానం||
- విజ్ఞాన సంపద లెల్లను ఆ సుజ్జానిలో గుప్తమాయెను ఆ సంతోసహమును పరిశుద్ధత సమాధానము నీతి శక్తియు విమోచనమాయెను ||మహదానం||
- అందరికన్న నీవెంతనో అతి సుందరుడవై యున్నావు నీవు నీ పెదవుల మీద పోయబడి నిండి యున్నది దయారసము నిన్నాశీర్వదించును తండ్రి ||మహదానం||
- దివ్యరారాజై కుమారుడు ఒక వెయ్యివర్షాలు పాలించును మహా అంతములేని రాజ్యమేలును యెందరు జయంబు నొందుదురో అందరును పాలించెదరు ||మహదానం||
إرسال تعليق