పర్వతములు తొలగిన మెట్టలు దద్దరిల్లిన
నా కృప నిన్ను విడిచిపోదంటివే
నా యేసయ్యా విడిచి పొందంటివే (2)
యేసయ్యా నా యెస్సయ్యా
నీవే నా మంచి కాపరివయ్యా " (2)
సుడిగాలి వీచినా సంద్రమే పొంగిన
అలలే అలజడిరేపిన నను కదలనియ్యక (2)
సత్యమునందు నన్ను ప్రతిష్టించి (2)
సీయోను కొండ వలే నన్నుమార్చితివి (2)
|| యేసయ్యా ||
ధరణి దద్దరిల్లిన గగనం గతి తప్పిన
తారాలన్ని రాలిపోయినా నేను చలించనులే (2)
స్థిరమైన పునాది నీవై నిలకడగా నిలిపితివి (2)
కుడిపక్కన నీవుండగ నేనెన్నడు కదలనులే (2) ||యేసయ్యా ||
మరణమైన జీవమైన ఉన్నవైన రాబోవునవైన
సృష్టింపబడినదేదైనను నీ ప్రేమను ఆర్పలేవు (2)
నీ చిత్తము నెరవేర్చుటకు నన్ను బలపరచితివి (2)
నిరంతరం నీతో కలసి సీయోనులో నిలచెదను (2) ||యేసయ్యా ||
إرسال تعليق