Song no: #43
- శ్రీ యేసు కర్తను సేవఁ జేయుటకు మేల్కొను శ్రీయేసు కర్తను శ్రేయముల నెఱింగి నీకు రేయిపవ లొసంగి యెడఁ బాయని యంతరంగి యపాయంబుఁ ద్రోయ సహాయంబుఁజేయ ||శ్రీ యేసు||
- నిదురయందు నేఁడు క్షేమ మొదవఁ గాచినాఁడు సూర్యుఁడుదయ మాయెఁజూడు నీ హృదయమున సదమల పదవులుదయింప ||శ్రీ యేసు||
- అంధకార మణఁగెన్ హృదయాంధకార మణఁగెన్ ప్రభు నందుఁ దెలివి గలుగన్ నిబంధనలు డేందమున కందముగఁ గూర్చి ||శ్రీ యేసు||
- కంటిపాప వలెను నిను గాయువాని దయను గనుఁ గొంటివి స్తోత్రమును జేయు మింటి కినిమంటికన్నింటికిని కర్తయని ||శ్రీ యేసు||
- కలకల ధ్వనిఁజేయు పక్కిగములు లయను గూయు సర్వములు ప్రభు స్తుతిఁజేయు నీ వలయక సొలయక వెలయఁగఁ బాడు ||శ్రీ యేసు||
- సేవయందు నీకు మంచి యీవు లిడుపరాకు గల భావముఁబడఁ బోకు నేడుఁ కానవే కావవే కావవే యంచు ||శ్రీ యేసు||
- పగటివార మంచు నిష్ఫ్లపు గ్రియలు ద్రుంచు యుగ యుగములు జీవించు పురికెగయ నీ దిగులు విడు తగు నమ్మకమున ||శ్రీ యేసు||
- మింటి నంటఁ బాడు నీ యొంటి బలిమి నేఁడు ప్రభు నంటి యుండ వాఁడు నిన్నొంటి నెన్నంటి కెన్నింటికిన్వీడఁడు ||శ్రీ యేసు||
إرسال تعليق