Song no: #34
- సర్వేశా! రమ్ము నీ సన్నిధి కాంతి నొసంగు మాకు సత్య సనాతన సర్వాధికారుఁడా సదా మమ్మేలుము సర్వోన్నతా!
- నిత్యంపు వాక్యమా! నీదగు ఖడ్గము నిమ్ము మాకు నీ నిజ భక్తులన్ నీ వాక్య ప్రియులన్ నింపు నీ యాత్మతో నింపు మీర
- రమ్ము మహాత్మ! మా కిమ్ము నీ యాత్మను రమ్ము వేగ రక్తితో నిప్పుడు రమ్ము మా మధ్యకు రక్షించు మమ్మును రంజిల్లఁగన్
- స్తోత్రం పవిత్రుఁడా! స్తోత్రంబు త్ర్యేకుండా! స్తోత్రం సదా ధాత్రి నీమహిమ నేత్రంబులు గను మీ, "త్రాహిమాం" యని వేఁడు వారి
إرسال تعليق