Aakasambu bhumiyu anthata chekati yayenu ఆకాశంబు భూమియు అంతట చీకటి యాయెను

Song no: #52
    ఆకాశంబు భూమియు అంతట చీకటి యాయెను ప్రాకెడు చీకటి సమయమున ప్రార్థన చేతుము మా దేవా||

  1. చక్కని చుక్కలు మింటను చక్కగా మమ్మునుజూడగ ప్రక్కకు రావె వేగముగా ప్రభువా గావుము గావుము నీ నీడన్||

  2. చిన్న చిన్న పక్షులు చిన్న చిన్న పూవులు ఎన్నో ఎన్నో జీవులు నిన్నే గొలిచి నిద్రించున్||

  3. చిన్న చిన్న పాపలు చిన్న చిన్న పడకలలో చిన్న కన్నులు మూయంగా చెన్నుగ యేసూగావుమా||

  4. నేలను బోయెడి బండ్లలో నీటను బోయెడి ఓడలలో గాలి విమానంబులలోన కావుము దేవప్రయాణికులన్||

  5. రాత్రిలో నీదు దూతలు రమ్యంబైన రెక్కలతో చిత్రంబుగ మమ్మును గ్రమ్మన్ నిద్రించెదము మాదేవా||

  6. తెల్లవారుజామున తెలివొంది మే మందరము మెల్లగలేచి నుతియింపన్ మేల్కొల్పుము నా ప్రియతండ్రి||

  7. జనక తనయా శుద్ధాత్మా జయము మహిమ స్తోత్రములు అనిశము నీకే చెల్లునుగా అనిశము చెల్లును నీ కామెన్||

Post a Comment

أحدث أقدم