Thurupu dhikkuna chukka butte dhutalu pataalu pada vacche తూరుపు దిక్కున చుక్క బుట్టేదూతలు పాటలు

Song no:
HD
    తూరుపు దిక్కున చుక్క బుట్టే
    దూతలు పాటలు పాడ వచ్చే } 2
    చలిమంట లేకుండా వెలుగే బుట్టే } 2
    చల్లని రాతిరి కబురే దెచ్చే } 2
    పుట్టినాడంట యేసు నాధుడు
    మన పాపములు దీసే పరమాత్ముడు } 2

  1. గొల్లలు జ్ఞానులు వేగిర వచ్చి
    కొలిచినారు తనకు కానుకలిచ్చి
    పశువుల పాక మనము చేరుదాము
    కాపరిని కలిసి వేడుదాము } 2
    పుట్టినాడంట యేసు నాధుడు
    మన పాపములు దీసే పరమాత్ముడు/2/

  2. చిన్నా పెద్దా తనకు తేడా లేదు
    పేదా ధనికా ఎపుడు చూడబోడు
    తానొక్కడే అందరికి రక్షకుడు
    మొదలు నుండి ఎపుడు వున్నవాడు } 2
    పుట్టినాడంట యేసు నాధుడు
    మన పాపములు దీసే పరమాత్ముడు } 2

  3. మంచి చెడ్డ ఎన్నడూ ఎంచబోడు-
    చెడ్డవాళ్లకు కూడా బహు మంచోడు
    నమ్మి నీవు యేసును ఆడిగిచూడు-
    తన ప్రేమను నీకు అందిస్తాడు } 2
    పుట్టినాడంట యేసు నాధుడు
    మన పాపములు దీసే పరమాత్ముడు } 2 || తూరుపు దిక్కున ||
أحدث أقدم