నింగి నేలనే సేసినోడు నీ కడుపున కొడుకై పుట్టినాడు
ఆకాశాలు పట్టజాలనోడు నీ గర్భాన్న సర్దుకొన్నాడు
ఎంత ధన్యమో ఎంత ధన్యమో
అందరి అక్కర తీర్సెటోడు యోసేపు నీ సాయం కోరినాడు
మాటతోనే సృష్టి సేసినాడు నీ సేతి కింద పని సేసినాడు
ఎంత భాగ్యమో ఎంత భాగ్యమో
ఎంత భాగ్యమో మరియమ్మ
ఎంత భాగ్యమో మరియమ్మ
ఎంత భాగ్యమయ్య యోసేపు
ఎంత భాగ్యమో యోసేపు
లెక్కలకందని శ్రీమంతుడు గుక్కెడు నీళ్ళకై సోలినాడు
కోటిసూర్యులను మించినోడు మండుటెండలోన ఎండినాడు
ఎంత భారమో ఎంత భారమో
మాయదారి శాపలోకాన మచ్చలేని బతుకు బతికినాడు
శావంటూ లేని ఆద్యంతుడు శావనీకే తల ఒగ్గినాడు
ఎంత కష్టమో ఎంత కష్టమో
కష్టమైన గాని నా కోసం ఇష్టపడి మరి సేసాడే
సచ్చిపోయే నన్ను బతికింప చావునే చిత్తు చేసాడే
దేవదేవుని స్వారూప్యమే మట్టిరూపమే ఎత్తినాడే
సేవలందుకొను సౌభాగ్యుడే సేవ సేయనీకి వచ్చినాడే
ఎంత సిత్రమో ఎంత సిత్రమో
పాపము అంటని పరిశుద్ధుడు పాపుల కోసమై వచ్చినాడు
పాపినైన నిన్ను నన్ను కడిగి ప్రాయశ్చితమే చేసినాడు
ఎంత భాగ్యమో ఎంత భాగ్యమో
ఎంత భాగ్యమో ఓరన్న ఒదులుకోకురా ఏమైనా ఇంత రక్షణ భాగ్యాన్ని ఇచ్చేదెవరు ఈ లోకాన
నిన్ను పిలిచే దేవుణ్ని దాటిపోకు ఏమాత్రాన
క్రీస్తు యేసుని ఒప్పుకొని చేర్చుకో నీ హ్రుదయాన
కామెంట్‌ను పోస్ట్ చేయండి