Maha vaidhyudu vacchenu prajali మహా వైద్యుండు వచ్చెను ప్రజాళిఁ

Song no:312

మహా వైద్యుండు వచ్చెను ప్రజాళిఁ బ్రోచు యేసు సహాయ మియ్య వచ్చెను సంధింపరండి యేసున్ || మాధుర్యంపు నామము మోద మిచ్చు గానము వేద వాక్యసారము యేసు దివ్య యేసు ||

మీ పాప మెల్లఁ బోయెను మేలొందుఁ డేసు పేరన్ గృపా సంపూర్ణ మొందుఁడి యపార శాంతుఁ డేసు.

వినుండి గొఱ్ఱె పిల్లను విశ్వాస ముంచి యేసున్ ఘనంబుగన్ స్తుతించుఁడి మనం బుప్పొంగ యేసున్

ఆ రమ్యమైన నామము అణంచు నెల్ల భీతిన్ శరణ్యు లైన వారి నా దరించు నెంతో ప్రీతిన్

ఓ యన్నలారా పాడుఁడీ యౌదార్యతన్ సర్వేశున్ ఓ యమ్మలారా మ్రొక్కుఁడీ ప్రియాతి ప్రియుఁడేసు

ఓ పిల్లలారా కొల్వుఁడీ యౌన్నత్య రాజు నేనున్ తపించువారి దాతయౌ దయామయున్ శ్రీ యేసున్

శ్రీ యేసుకై యర్పించుఁడీ మీ యావజ్జీవనమును ప్రియంపు దాసులౌచును రయంబు గొల్వుఁడేసున్





أحدث أقدم