Ee Jeevithamannadhi Kshanakalamainadhi ఈ జీవితమన్నది క్షణకాలమైనది

ఈ జీవితమన్నది క్షణకాలమైనది
పరలోకంలోనిది శాశ్వతమైనది || 2 ||
ఆ‌‌‌స్తులు ఎన్ని ఉన్నా
అంతస్తులు ఎన్ని ఉన్నా
క్రీస్తు లేని ఈ జీవితం ఈ లోకంలో సున్న || 2 ||
ఈ జీవితమన్నది ||

గొప్ప ప్రణాళికా నాకై సిద్ధము చేసి
తల్లీ గర్భంలో రూపించావు || 2 ||
సృష్ఠంతటిని నీ నోటిమాట ద్వారా చేశావు
పరిశుద్ధ‌మైన చేతులతో నన్ను చెక్కావు || 2 ||
ఈ సృష్ఠిపైయున్న ప్రేమకంటే నాపై ఉన్న ప్రేమ || 2 ||
కలువరి శిలువలు ప్రాణం పెట్టి కనుపరిచావయ్య || 2 ||
ఈ జీవితమన్నది ||

ఉన్నతమైన స్థితిని నాకై నీవు సిద్ధము చేసి
నీ వాక్యమును ప్రకటించుటకు నన్ను ఏర్పరిచావు || 2 ||
తప్పిపోయిన నన్ను నీవు రక్షించుటకై దీనునిగా ఈ భూమిపై నీవు జన్మించావు || 2 ||
ఈ సృష్ఠిపైయున్న ప్రేమకంటే నాపై ఉన్న ప్రేమ || 2 ||
కలువరి శాలువలు ప్రాణం పెట్టి కనుపరిచావయ్య || 2 ||
ఈ జీవితమన్నది ||

Post a Comment

أحدث أقدم