Stuthi sthothrahruda yesuraja andhuko స్తుతి స్తోత్రార్హుడా యేసురాజా ఆందుకో


Song no:

స్తుతి స్తోత్రార్హుడా యేసురాజా
ఆందుకో నా పూజ ఘనతేజా హల్లెలూయా (8)
1. సర్వాధిపతి సర్వోన్నతుడా సకలముచేసిన సృష్టికర్తవు
సర్వశక్తిగల సర్వేశ్వరుడా సతతము నీవే స్తొత్రార్హుడవు
2. సృష్టికి కారణభూతుడవీవే రక్షణ కర్తా నిరీక్షణ నీవే
ఆదరించుమా ఆత్మ స్వరూపా అనవరతము నీవే స్తొత్రార్హుడవు

3. పరిశుద్దుడవు ప్రభుడవు నీవే నిర్దోషుడవు నిష్కల్మషుడా
పాపిని నన్ను కాపాడితివి నిరతము నీవే స్తొత్రార్హుడవు
أحدث أقدم