O naavika o naavika sramalalo sramika ఓ నావికా.... ఓ నావికా.... శ్రమలలో శ్రామికా...


నావికా....   నావికా.... శ్రమలలో శ్రామికా....

ఊసు వింటివా ... వింత గంటివా ...
యేసు సామి ఊసు నీవు వింటివా

హైలెస్సో ... హైలెస్సా
హైలెస్సో ... హైలెస్సా

1. వలేసావు రాతిరంతా  ... ధార పోసావు కష్టమంతా ... (2)
చిక్కలేదు చేప ఒక్కటైనా ... దక్కలేదు ఫలము కొంతైనా (2)

అడుగడుగో యేసు వచ్చెనయ్యా
వరాలెన్నో నీకై తెచ్చెనయ్యా

నింపాడు నీ నావ ... అద్భుత రీతితో ...
తృప్తిపరిచె నీ బ్రతుకు... గొప్ప మేళ్ళతో... 
వెంబడించు యేసును... పూర్ణ శక్తితో ...

యేసే   జగతికి.... సర్వాధికారి...
యేసే నీ నావకి....  చూపించు దారి..
చేస్తాడు నిన్ను.... అసలైన జాలరి   
మనుష్యుల పట్టే జాలరి
 
2. విరిగి నలిగిన మనస్సుతో ... చేసావు నీ సమరం
శయనించక, ఎడతెగక ... ఈదావు   భవసాగరం (2)

అడుగడుగో యేసు వచ్చెనయ్యా
వరాలెన్నో నీకై తెచ్చెనయ్యా

కరుణించాడు నిన్ను ... చల్లని చూపుతో
నిర్మలయ్యే నీ బ్రతుకు ... యేసుని ప్రేమతో
వెంబడించు యేసును... పూర్ణ శక్తితో ...

యేసే   జగతికి... సర్వాధికారి...
యేసే నీ నావకి...  చూపించు దారి
చేస్తాడు నిన్ను... అసలైన జాలరి 
మనుష్యుల పట్టే జాలరి

أحدث أقدم