Nalone namdhi palakali nalone marpuni chudali నాలోనే నాంది పలకాలి నాలోనే మార్పుని చూడాలి


పాత రోత బ్రతుకుని విడిచినవాడనై - నూతన హృదయము పొందిన వాడనై
నే జీవించాలి - నే జీవించాలి - నీకై జీవించాలి

chorus – start
సత్యమేదో తెలియక మొదలైన ఆరాటం
నిజ దేవుడెవరో ఎరుగక లోలోన పోరాటం
క్రీస్తును జగమెరుగ మంచి తరుణం 
chorus – end

1. నీ వాక్యము నాలో ఫలియించాలి  - నా ప్రార్ధనతో నే బలపడాలి 
నీ ప్రేమను నే పంచాలి  -  నీ మార్గములో నే సాగిపోవాలి      (2)
యేసూ నీవే నిజదైవమని - మార్గము,సత్యంజీవమని
నే ప్రకటించాలి -  నే ప్రచురించాలి - నీ సువార్తను నే ప్రకటించాలి

chorus – start
ఎన్నో రాగ  ద్వేషాలు - కరువైన దయ దాక్షిణ్యాలు
ఎన్నో ఆక్రందనలు  - కడకు రాని కన్నీటి బాధలు
రక్షకుని ఎరుగక - నశించిపోతోంది లోకము
chorus – end

2 పిలిస్తే పలికే దైవము నీవే అని  - కాచి కాపాడే కనుపాపవని 
మహిమను వీడిన రారాజువని - మహికరుదెంచిన మెస్సయ్యవని  (2)
యేసు దేవా నీవే లోక రక్షకుడవని - యేసు దేవా నీవే లోక శాంతిదాతవని
నే ప్రకటించాలి -  నే ప్రచురించాలి - నీ సువార్తను నే ప్రకటించాలి

أحدث أقدم