Chalunayya nee krupa naa jivithaniki చాలునయ్య నీ కృప నా జీవితానికి


చాలునయ్య నీ కృప నా జీవితానికి (2)
సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా చాలునయ్య॥
1.మేఘాలలోన మెరుపుంచినావు (2)
త్యాగాల యందె మా అనురాగాలుంచినావు (2)
సాగలేని జీవిత సమరములో (2)
వేగమే దూతనంపి బాగుగ నిలిపావు చాలునయ్య॥
2.పృథ్విలోన ముళ్ళ పొదలు మోలిపించినావు (2)
ప్రతి నరుని జీవితాన ముళ్లుంచినావు (2)
వెరుకగ ప్రభువుకే ముళ్ళ కిరీటమా (2)
లేదు మాకు నీ కృప ముళ్ళకు వేరుగా చాలునయ్య॥
3.చాలునయ్యా చాలునయ్యానీ కృప నాకు చాలునయ్యా (2)
ప్రేమామయుడివై ప్రేమించావుకరుణామయుడివై కరుణించావు (2)
తల్లిగ లాలించి తండ్రిగ ప్రేమించే (2)
ప్రేమా కరుణా నీ కృప చాలు (2)      చాలునయ్యా॥
4.జిగటగల ఊభిలో పడియుండగా
నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా (2)
హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్యాహిమము కంటెను తెల్లగ మార్చయ్యా
నీకేమి చెల్లింతు నా మంచి మేస్సీయానా జీవితమంతా అర్పింతు నీకయ్యా
ప్రేమా కరుణా నీ కృప చాలు (2)    చాలునయ్యా॥
5.బంధువులు స్నేహితులు త్రోసేసినా
తల్లిదండ్రులే నన్ను వెలివేసినా (2)
నన్ను నీవు విడువనే లేదయ్యామిన్నగ ప్రేమించి రక్షించినావయ్యా
నీకేమి చెల్లింతు నా మంచి మెస్సీయనీ సాక్షిగా నేను ఇలా జీవింతునయ్యా
ప్రేమా కరుణా నీ కృప చాలు (2)     చాలునయ్యా॥

أحدث أقدم