Bhu nivasulaku ee loka nivasulaku భూనివాసులకు - ఈ లోక నివాసులకు


భూనివాసులకు - ఈ లోక నివాసులకు
    యేసే జీవం - యేసే సత్యం - యేసే మార్గమనీ సూటిగ ప్రకటించు
1. పరిసరములలోని - పండిన పైరంతా
    రాలిపోవు చుండ - సంతాపమే లేదా
    కన్నెత్తిచూడు - కన్నీరు కార్చు
    ఓ దైవ సేవకుడా - ఇకనైనా మేల్కొనవా   భూనివా

2. పరమాత్మ ఆజ్ఞగని - ఆ యాత్మ స్వరమువిని
    పౌలువంటి భక్తులు - ప్రాణాలు తెగియించిరి
    దేవుని వాక్యము - దేదీప్యమానము
    దీనుడవై యెపుడు - దీక్షతో చాటించు     భూనివా

3. సువార్త భారమును - సంపూర్ణ భాద్యతతో
    మోయాలి భోధకులు - చేరాలి గ మ్యాలు
    దేవుని మార్గము - పూజనీయము
    దివ్వెగ జీవించు - ధర్మము నెరవేర్చు     భూనివా

4. సంఘమ మేల్కొనుమా - సాతానునెదిరించుమా
    సర్వాంగ కవచమును - ధరియించి పోరాడుము
    చీకటి త్రోవలో - సువార్త జ్యోతివై
    జ్వాలను రగిలించు - రక్షణ ప్రకటించు   భూనివా

أحدث أقدم