Asannuda krupasampannuda paramandhu simhasanaseenuda అసన్నుడా కృపసంపన్నుడా పరమందు సింహాసనాశీనుడా

అసన్నుడాకృపసంపన్నుడా
పరమందు సింహాసనాశీనుడా  " 2 "
స్తుతి అర్పణలతో నిత్యానందముతో " 2 "
ఆరాధింతుము ప్రాణాత్మతో " 2 "

నా స్తుతి కాధారుడా నా యేసు రాజా
నా క్షేమాధారమా నా మహిమ ప్రభావమా
పరిమళమై నేను ప్రణుతించనా " 2 "
పరవశమొంది నీలోనే నాట్యమాడనా
హల్లెలూయ హోసన్నా హల్లెలూయ హోసన్నా
హల్లెలూయ హోసన్నా స్తుతించెదము “ 2 “

నా వాత్సల్య పూర్ణుడా నా యేసురాజా
నా అక్షయ దీపమా నా ఆశ్రయదుర్గమా
స్తుతి గానమై నేను నిను పొగడనా " 2 "
పరిశుద్దులతో సమకూడి కొనియాడనా
హల్లెలూయ హోసన్నా హల్లెలూయ హోసన్నా
హల్లెలూయ హోసన్నా స్తుతించెదము “ 2 “

నా కనికరం పూర్ణుడా నా ఏసురాజా
నా ఆత్మాభిషేకమా నా అభిషేక తైలమా
నీ సాక్షినై ఇలలో ప్రకటించనా " 2 "
ఆరాధించుచు నీ సన్నిధిలో వర్ణించనా
హల్లెలూయ హోసన్నా హల్లెలూయ హోసన్నా
హల్లెలూయ హోసన్నా స్తుతించెదము “ 2 “

أحدث أقدم