Yese na kapari yese na upiri yese na jeevana adhipathi యేసే నా కాపరి యేసే నా ఊపిరి యేసే నా జీవన అధిపతి


Song no:

యేసే నా కాపరి యేసే నా ఊపిరి
యేసే నా జీవన అధిపతి
యేసే నా కాపరి యేసే నా ఊపిరి
యేసే నా జీవన అధిపతి

పచ్చిక బయళ్ళలో పరుండ జేశాడు
శాంతి జలములకు నడిపించుచున్నాడు
నా ప్రాణమునకు సేదదీర్చాడు
తన నీతి మార్గములో నడిపించుచున్నాడు
నిత్య జీవమును నాకు ఇచ్చాడు

గాఢాంధ కారములో వెలుగైయున్నాడు
శత్రువుల యెదుట
విందును నాకిచ్చెను
నూనెతో నా తలనంటి యున్నాడు
బ్రతుకు దినములో
క్షేమము నాకిచ్చెను
అపాయమేదైనను
నా యొద్దకు రానేరాదు
أحدث أقدم