Yendhukintha naa paina intha prema yesayya ఎందుకింత నాపైన ఇంత ప్రేమ యేసయ్యా


Song no:

ఎందుకింత నాపైన
ఇంత ప్రేమ యేసయ్యా
ఇల ఎవ్వరు చూపలేదు
ఇలాంటి ప్రేమను
ఇంతగ ప్రేమించలేదు
ఇలఎవ్వరు నాపైన

ప్రాణానికి ప్రాణమని
అన్నారు ఎందరో
పరిస్థితులు మారిపోగా
కానరారే ఎవరైన
ఉన్నావు తోడుగా ఇమ్మానుయేలుగా

అయినవారె దూరమై
అనాధగా నే మిగిలాను
అప్తులంత హేళన చేసి
అవమాన పరిచిన
ఉన్నావు తోడుగా ఇమ్మానుయేలుగా

నా ప్రాణ క్రయధనముగాను
నీ ప్రాణమిచ్చావు
కనుపాప వలేనే నన్ను
కాపాడు చున్నావు
ఏమిచ్చి నీ ఋణము
తీర్చుకుందు యేసయ్యా
أحدث أقدم