Viduvani devudu maruvani dhaivamu vedhaki vacchi pranamicchi విడువని దేవుడు మరువని దైవము వెదకి వచ్చి ప్రాణమిచ్చి


Song no:

విడువని దేవుడు మరువని దైవము
వెదకి వచ్చి ప్రాణమిచ్చి రక్షించెను
తన అర చేతులందు చెక్కుకున్నాడు
తన కనుపాపవలె కాపాడుచున్నాడు

గాఢాంధకారపు లోయలైనను
మరణాంధకారపు బాటలైనను
మనసున జొచ్చి ధైర్యము నిచ్చి
చెయ్యి పట్టి ధరికి చేర్చి
వెలుగులో నడిపే నా దేవుడు

వ్యాధి బాధలు ఎదురైనను
శోధన సమస్యలు వెంటాడినను
హస్తము చాపి బలముతో నింపి
లేవనెత్తి జయముతో నడిపే
సాక్షిగ నిలిపే నా దేవుడు
أحدث أقدم