Sariyaina nee throvalo nadipinchuma yesayya సరియైన నీ త్రోవలో నడిపించుమా యేసయ్యా


Song no:

సరియైన నీ త్రోవలో
నడిపించుమా యేసయ్యా
నాప్రాణము నీవే నాసర్వము నీవే
నా జీవము నీవే  నా యేసయ్యా

గురిలేని పయనంబులో
గమ్యముగా నీవు నిలిచినావు
అడుగులు తడబడక
నీ అడుగు జాడలో
నను నడుపుము నా యేసయ్యా

సాతాను శోధనలు ఎన్నివచ్చినా
మెలుకువగా ప్రార్ధించే కృపనీయుమా
నా పాదము జారక తొట్రిల్ల నియ్యక
నను నిలుపుమా నా యేసయ్యా

أحدث أقدم