Papulamaina mammunu brova paramu numdi పాపులమైన మమ్మును బ్రోవ పరమునుండి

పాపులమైన మమ్మును బ్రోవ పరమునుండి దిగివచ్చిన యేసూ
పరిమళించె నీ రాకతో ఈ భువి - పరమపితా వందనమిదిగో
సర్వసృష్టిని తిలకించగను - సూర్యచంద్రులను పరికించగను
నరుడనైన నా యెడల నీవు కృప చూపుటకు ఎంతటి వాడను
బీదాలను ఆదరించగను - గ్రుడ్డివారికి చూపునివ్వగను
మానవ రూపము దాల్చినదేవా - మహికి రక్షణ తెచ్చితివయ్యా
ధరణిలోని ప్రేమలన్నియును -స్వార్థముతోనే నిండియుండును
ఏ మంచిలేని నాకొరకై ఇలకు దీనుడవై దిగిన నీ ప్రేమ శాశ్వతం
أحدث أقدم