Jo jo lali Bala yesu lali nannu జో జో లాలి బాల యేసు లాలి నను గన్న నా తండ్రి లాలి

జో జో లాలి (2)
బాల యేసు లాలి నను గన్న నా తండ్రి లాలి
నా గారాల తనయా లాలి.. జో జో.. జో జో.. జోజో..
జగతిని ఏలే నీవు జననిగనను ఎంచితివి
పేదరాలిని నేను పొత్తిబట్టలు పరచితివి
తల దాచు చోటులేక తల్లడిల్లిపోతిని
వాడ వాడ వెదకినను పశులపాకె నెల వాయె
నింగినేల నీ సొంతమైన ఇసుమంతా చోటు
నీకు లేదాయే తారపు వెలుగులు యిచ్చిన
నీకే చిరుదీపమేనాడు కరువాయె
ఎవరి కొరకు నీవస్తావో వారెవరికి కానరా రాయె
అన్ని ఉన్న దేవుడవు లేనివానిగా జన్మించితివి
أحدث أقدم