Chesinavu yenno melulu chupinavu yentho premanu చేసినావు ఎన్నో మేలులు చూపినావు ఎంతో ప్రేమను


Song no:

చేసినావు ఎన్నో మేలులు చూపినావు ఎంతో ప్రేమను
ఎలా మరువగలను నీ ప్రేమను
నీవేనయ్యా నా ప్రాణము నీవేనయ్యా నా సర్వము

శోధనలు వెంటాడగా
సోమ్మసిల్లి పడియుండగా
చెంత చేరినావు సేద దీర్చినావు

పాపములో నేనుండగా
పాడై పోవు చుండగా
లేవనెత్తినావు శుద్ధి చేసినావు

ఆపదలో నేనుండగా
నన్నాదుకున్నావయ్యా
ఆదరించినావు దైర్యమిచ్చినావు
أحدث أقدم