Paramandhu vunna a thandri manasu thelipadu neeku పరమందు వున్న ఆ తండ్రి మనసు తెలిపాడు నీకు యేసే


Song no:


పరమందు వున్న తండ్రి మనసు తెలిపాడు నీకు యేసే        
తండ్రి మదిలో జగతి కంటే ముందున్న మనిషి నీవే         
తనకు పిల్లలే కావాలనీ......         తన యెద్దకే రావాలనీ.....
నీవు బద్రమే చెప్పాలనీ......   నీవు యేసులా మారాలనీ..... 
( పరమందు)
1.యేసు చూపాడుగా తండ్రి లోపము    నీ బ్రతుకు చూపాలిగా యేసు రూపం    పరమందు నీ తండ్రి పవిత్రం    యేసు రక్తంతో నీవు పవిత్రం   మరియ గర్బన మనిషిగా పుట్టి యేసు మారాడు దైవంగా   వాక్యమును బట్టి మనము ఎదగాలి క్రీస్తు మార్గంలో దేవునిగా   వాక్యమెవ్వరికి వచ్చెనో వారు మాత్రమే దైవమని   వాక్యాన్ని ఎవరు నేర్పింతురో తండ్రి ప్రేముందనీ   తెలుసుకో........నేర్చుకో...........   (పరమందు)
2. నీ బాల్యదినములందే స్మరిఇంచు దేవుని    దురిదినము రాకముందే ముగిఇంచు తన పనిని    నీ పిల్లలకు నేర్పు వాక్యాన్ని   దేవునికివ్వు గర్బఫలాన్ని   ఇవ్వవలసింది ఆస్థికాదు అది వాక్యమని తెలుసుకోవాలి  
ఇదే క్రైస్తవుని పనిని తెలుసుకొని ఇలా బ్రతికి మరణించాలి   మనుషులంతా చెయ్యాలిది దేవుడిచ్చిన నిధి    తనకివ్వబడిన పని పూర్తిచేసి చేరాలి తన సన్నిధి    తెలుసుకో........నడుచుకో...........  (పరమందు)

أحدث أقدم