Paralokamandhunna thandri parishuddhudavaina deva పరలోకమందున్న తండ్రీ పరిశుద్ధుడవైన దేవా


Song no:


పరలోకమందున్న తండ్రీ పరిశుద్ధుడవైన దేవా
శ్రీ యేసువా నీకే ఆరాధనా హల్లేలుయా . . (4)

1. సైన్యములకధిపతివైనా సర్వశక్తిమంతుడవు
సాతాను శక్తులపై జయమిచ్చినా నీకే మా ఆరాధనా

2. స్వస్థపరచు దేవుడవు నను నడిపించే కాపరి నీవు
బలహీన సమయాన క్రుంగిన నన్ను బలపరచిన దేవుడవు

3. విమోచించు దేవుడవు నిత్యుడైన తండ్రివి నీవు
నా పాప బంధాలు విడిపించినా పరిశుద్ధ దేవుడవు

أحدث أقدم