Nadipinchumo yesayya naa jeevitha yathralo నడిపించుమో యేసయ్యా నా జీవిత యాత్రలో


Song no:

నడిపించుమో యేసయ్యా
నా జీవిత యాత్రలో          " 2 "
నన్నెంతగా నీవు నీకృపలో కాపాడినావు"2"
శ్రమలైన శోధన నను విడిపించావు " 2 "
                                 "  నడిపించుమో  "

ఆకాశమందు అత్యున్నతుడా
నీ రెక్కల నీడ నను దాచేను       " 2 "
నీ రక్షణ నా కుండగా
నీ ఆశ్రయం నా తోడుగా              " 2 "
నీ ఆశ్రయం నాతోడుగా
నన్నెంతగా నీవు నీకృపలో కాపాడినావు " 2 "
శ్రమలైన శోధన నను విడిపించావు " 2 "
                               "  నడిపించుమో  "

ఆకాశమందు ఆశీనుడా
నీతట్టు నా కనులెత్తుచున్నాను      " 2 "
నీ ఆదరణ నా కుండగా
నీ సహాయం నా అండగా                " 2 "
నీ సహాయం నా అండగా
నన్నెంతగా నీవు నీకృపలో కాపాడినావు " 2 "
శ్రమలైన శోధన నను విడిపించావు " 2 "
                               "  నడిపించుమో  "

ఆకాశమందు నీవుతప్ప
నాకెవరున్నారు ఈ లోకంలో     " 2 "
నీప్రేమ నాకుండగా నీకృప నాతోడుగా " 2 "
నీ కృప నా తోడుగా
నన్నెంతగా నీవు నీకృపలో కాపాడినావు " 2 "
శ్రమలైన శోధన నను విడిపించావు " 2 "
                               "  నడిపించుమో  "
أحدث أقدم